Tuesday, December 31, 2013

Happy New Year 2014Dear Friends Wish You All  A Very Happy New Year 2014

బ్లాగు స్నేహితులు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు Sunday, December 22, 2013

సర్ప బాధా నివృత్తి శ్లోకం


అనంతో, వాసుకి, శేష, పద్మనాభశ్చ, కంబల,
ధ్రుతరాష్ట్ర , శంఖ పాల , తక్షక, కాలియ స్థధ!

యేతాని నవ నామాని నాగానాం చ మహత్మానాం,
సాయం కలె పఠేన్ నిత్య, ప్రాత: కాలె విశేషత!

నర్మదాయై నమ, ప్రాత నర్మదాతై నమొ నిష,
నమోస్తు నర్మదే తుభ్యం త్రాహిమాం విష సర్పత!

అసితం చార్తిమందం చ సునీధిం చాపి య స్మరేథ్,
దివ వా యాఅధి వా రాత్రౌ నాస్య సర్ప భయం భవేథ్!

యో జరత్ కారుణొ జాతో జరత్ కారౌ మహ యశ,
ఆష్టీక సర్ప సాత్రే వా పన్నగం యో అభ్యరక్షత!

తం స్మరంతం మహా భాగా నామం హింసితు మర్హత

సర్వసర్ప భద్రం తే దూరం గచ మహ యశ,
జనమేజయశ్య యజ్ఞంతే ఆష్టీక వచనం స్మరాన్
ఓం శ్రీ నాగరాజాయతే నమ: 

Saturday, December 21, 2013

ధృవుడు 'ధృవ తారగా' ఎలా మారాడు?

ధృవుడు 'ధృవ తారగా' ఎలా మారాడు?
..............................
పూర్వం ఉత్తానపాదుడనే రాజు ఉండేవాడు. అతనికి ఇద్దరు భార్యలు. వారిద్దరికీ చెరొక కొడుకూ ఉండేవారు. 
పెద్ద భార్య సునీతి శాంత స్వభావం కలది. ఆమె కొడుకు ధృవుడు. 

రెండోభార్య సురుచికి అందగత్తెననే అహంకారం. నోటి దురుసు తనం వల్ల రాజు ఆమెను ఎదిరించలేక పోయేవాడు. ఆమె కొడుకు ఉత్తముడు.

అప్పుడు ధృవుడు ఐదేళ్ల పసివాడు. అయినా తన చుట్టూ జరుగుతున్న అన్యాయాన్ని పసిగట్టే నేర్పు ఆ పసివాడికి పుట్టుకతో వచ్చింది. 

పట్టపు రాణిగా తన తల్లికి లభించవలసిన గౌరవం తండ్రి గాని, పినతల్లి గాని ఇవ్వక పోగా, ఆమెను దాసి కన్నా చులకనగా చూడటం గమనించాడు. 

శాంత గుణం, ఓరిమి గల తల్లి పినతల్లి అధికారాన్ని, తండ్రి నిర్లక్ష్యాన్ని సహించి, లోలోపలే బాధపడటం కూడా గమనించాడు. 

ఒకనాడు రాజు అంతఃపురంలో సింహాసనంపై కూర్చుని, ఒడిలో ఉత్తముని పెట్టుకుని ముద్దాడుతున్నాడు. 
అటువైపు వచ్చిన ధృవుడు, తండ్రి దగ్గరకు వెళ్లి తాను కూడా ఒడిలో కూర్చుంటానని అడిగాడు. 
అయితే చిన్న భార్య అక్కడే ఉండటంతో, రాజు ధృవుణ్ని దగ్గరకు తీయలేదు. 

కానీ ధృవుడు తాను కూడా తండ్రి ఒడిలో కూర్చోవాలన్న పట్టుదలతో తమ్ముడిని లాగ బోయాడు. 
పినతల్లి అతణ్ని చూసి హేళనగా ‘‘నా కడుపున పుట్టినవారికే ఆ స్థానం దక్కుతుంది. 

నీకంత కోరికగా ఉంటే, తపస్సు చేసి దేవుడిని ఆ స్థానం కావాలని ప్రార్థించు’’ అని బయటకు ఈడ్చింది.
తండ్రి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉండటం చూసి ధృవుడికి కోపం, రోషం, ఏడుపు అన్నీ ఒక్కసారిగా వచ్చాయి. 

చిన్నబోయిన ముఖంతో తల్లి వద్దకు వెళ్లాడు. 
కొడుకు బాధను చూసి ఆ తల్లి ఏడ్చింది. 
‘‘నీ పినతల్లి చెప్పింది నిజమే. 
నీవు నా కడుపున పుట్టకుండా ఆమె కడుపున పుట్టి ఉంటే, 
నీకు ఇంత అవమానం జరిగేది కాదు. 
ఆమె చెప్పినట్లే భగవంతుని ప్రార్థించు నాయనా’’ అని బాధపడింది.

తల్లి బాధను చూసిన ధృవుడు..ఎంత కష్టమైనా తపస్సు చేసి, తన తల్లికి ఉన్నత స్థానం దక్కేలా చేయాలని నిశ్చయించుకున్నాడు. 
తనకు, తన తల్లికి జరిగిన అవమానానికి తగిన ప్రతీకారం తీర్చుకోనిదే రాజభవనంలో తిరిగి అడుగుపెట్టనని శపథం చేశాడు.

తల్లి కోసం ఏదైనా చెయ్యాలన్న లక్ష్యంతో బయలుదేరిన ధృవుడి వద్దకు నారదముని వచ్చాడు. 

జరిగింది మర్చి పొమ్మని, కొంతకాలానికి పరిస్థితులు చక్క బడతాయని ఊరడించాడు. 
కానీ ధృవుడు తన పట్టుదలను వదల్లేదు. 

ధృవుని మనోధైర్యాన్ని మెచ్చుకున్న నారదుడు నారాయణ మంత్రాన్ని ఉపదేశించాడు.

అడవిలోకి వెళ్లిన ధృవుడు తన లక్ష్యం నెరవేరడానికి పటిష్టమైన ప్రణాళిక వేసుకున్నాడు. 
తన శరీరాన్ని, మనస్సును మెల్లమెల్లగా తపస్సుకు సిద్ధం చేసుకున్నాడు. 

మొదటి నెలలో మూడురోజులకొకసారి పళ్లు మాత్రం తింటూ ధ్యానం మొదలుపెట్టాడు. 
రెండోనెలలో ఆరు రోజులకొకసారి ఆకులు మాత్రం తిన్నాడు. 

మూడోనెలలో తొమ్మిది రోజులకొకసారి మంచినీరు తాగుతూ తపస్సు కొనసాగించాడు. 

నాల్గవ నెలలో 12 రోజుల కొకసారి మాత్రం గాలి పీల్చుతూ ధ్యాన యోగంలో గడిపాడు. 

ఐదవ నెలలో శ్వాసను బంధించి, ఒంటి కాలిపై నిలబడి తదేక ధ్యానంలో మునిగిపోయాడు. 

ఆరో నెలలో కాలి బొటనవేలిపై నిలబడి, తన మనస్సులో శ్రీహరిని ధ్యానించాడు.

దేవతలకు, యోగులకు కూడా సాధ్యం కాని ఆ కఠినమైన తపస్సుకు శ్రీ మహా విష్ణువు మురిసిపోయి, ధృవుని వద్దకు వచ్చి, వరం కోరుకోమన్నాడు. తనకు, తన తల్లికి ఉన్నత స్థానం కావాలన్నాడు ధృవుడు. 

అతని మాతృభక్తికి సంతోషించి, ‘‘చాలా కాలం భూమిని పాలించి, 
తరువాత విష్ణు లోకం చుట్టూ తిరిగే నక్షత్ర మండలంలో శాశ్వత స్థానం పొందుతా’’వని వరమిచ్చి, అదృశ్యమయ్యాడు.

జనరంజకంగా చిరకాలం పాలించిన ధృవుడిని నక్షత్ర మండలానికి తీసుకు వెళ్లడానికి విమానం తీసుకువచ్చిన 
విష్ణు కింకరులతో తల్లిని విడిచి రాలేనన్నాడు. 

వారు సంతోషించి, అంతకన్నా ముందే విమానంలో ఉన్న అతని తల్లిని చూపారు. 
అది చూసిన తరువాతనే ధృవుడు విమానం ఎక్కాడు. 

నక్షత్ర మండలాన్ని చేరుకుని, ధృవతారగా శాశ్వతంగా వెలుగుతూ, 
ప్రతి రోజూ సూర్యుని కంటే ముందుగా తన కాంతిని లోకానికి ప్రసాదిస్తూ, 
తల్లిని పూజించిన వారికి లభించే ఉన్నత పదవికి సాక్షిగా ప్రకాశిస్తున్నాడు.

ప్రత్యూష కిరణాలు::రచన వెంకట మధు 

Saturday, December 14, 2013

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం మోపిదేవి
దక్షిణభారత దేశంలోని షణ్ముఖ దేవాలయాల సరసన ప్రముఖ సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రంగా విరాజిల్లుతోంది కృష్ణాజిల్లా మోపిదేవి కుమారక్షేత్రం. 
కుమారక్షేత్రమే సుబ్రహ్మణ్య క్షేత్రం. 
స్కాందపురాణంలోని సహ్యాద్రిఖండంలో కృష్ణానదీ మహాత్మ్యము, 
ప్రముఖ క్షేత్రమైన మోపిదేవి క్షేత్ర విశేషాలు అగస్త్యమహర్షి వింధ్య పర్వత గర్వాన్ని అణచడానికి తప్పని పరిస్థితుల్లో కాశీని విడిచిపెట్ట వలసి వచ్చింది. 
వింధ్య పర్వతం అహంకారంతో విజృంభించి, ఆకాశంలో కి చొచ్చుకొని పోయి, సూర్య గమనాన్ని సైతం నిరోధించసా గింది. 
ప్రకృతి స్థంభించింది. గ్రహ సంచారాలు నిలిచిపో యాయి. 
ఈ మహోపద్రవాన్ని నివారించగలిగేది అగస్త్యమ హర్షి మాత్రమేనని భావించిన బ్రహ్మాది దేవతలు 
అగస్త్యమ హర్షికి, విషయాన్ని వివరించారు. యోగదృష్టితో సర్వము నెరింగిన మహర్షి 
తాను ఇప్పుడు కాశీని వీడితే కల్పాంత మైనా తిరిగి కాశీకి రావడానికి వీలు పడదని తెలిసి కూడా 
లోక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని అమర కార్యానికి అంగీకరించాడు. 
లోపాముద్రా సహితుడై దక్షిణాపథానికి బయలుదేరాడు అగస్త్యమహర్షి. 
దారిలో నున్న వింధ్య పర్వ తం మహర్షి రాకను గమనించి సాష్టాంగపడి నమస్కరిం చింది. 
తాను మరలి వచ్చేవరకు అలాగే ఉండమని శాసించి, కాశీ విశాలాక్షీ, విశ్వనాథులను మనసులో నిలుపుకొని, దక్షిణాపథం వైపు బయలుదేరాడు అగస్త్యుడు.

పవిత్ర గోదావరీ ప్రాంతాన్ని పావనం చేసి కృష్ణాతీరం లోకి అడుగుపెట్టారు ఆ పుణ్యదంపతులు. 
కనకదుర్గామాతను, శ్రీకాకుళాంద్ర మహావిష్ణువుని దర్శించుకొని వ్యాఘ్రపురం (పులిగడ్డ) చేరుకున్నారు.

‘వ్యాఘ్రస్య పూర్వదిగ్భాగే కుమార క్షేత్ర ముత్తమమ్‌ సుబ్రహ్మణ్యేన సత్యత్ర భుక్తి ముక్తి ఫలప్రదమ్‌’ 

అనేమాట అప్రయత్నంగా మహర్షి గళం నుండి వెలువడింది. ఆ ప్రదేశమంతా పుట్టలతో నిండివుంది. 
లోపాముద్రా దేవి, శిష్యబృందము ఆయన ననుసరించారు. 
ఒకపుట్ట నుండి దివ్యతేజస్సుని గమనించి ఇదే సుబ్రమణ్య క్షేత్రమని, ఇది భుక్తి ముక్తి ఫలప్రదమని శిష్యులకు వివరించాడు అగస్త్యుడు. 
కుమారమూర్తికే సుబ్రమణ్యమనెడి పేరని మాండమ్యడనే శిష్యుని సందేహాన్ని నివృత్తి చేశాడు.
కుమారస్వామి ఉరగ (పాము) రూపంలో తపస్సు చేయడానికి గల కారణాన్ని ఈ విధంగా శిష్యులకు వివరిం చారు అగస్య్త మహర్షి. 
సనక, సనకస, సనత్కుమా ర సన త్సు జాతులనెడి దేవ ర్షులు ఎప్పుడూ ఐదేళ్ల వయసు వారు గానే ఉంటారు, పైగా దిగంబరులు. 
వారు ఎల్లప్పుడూ భగ వదారాధనలోనే కాలం గడుపుతుంటారు. వారు ఒక పర్యా యం పరమేశ్వర దర్శ నానికి కైలాసం చేరుకున్నారు. 
ఆ సమయంలో పరమేశ్వ రుడు కైలాసంలో లేడు. 
లోకమాత పార్వతి,కుమారస్వామి కొలువు తీరి ఉన్నారు. 
అదేసమ యంలో శచీ, స్వాహా మొదలైన దేవతాస్ర్తీలు, లక్ష్మీ సరస్వ తులు, పార్వతీ దేవి దర్శనానికి విచ్చేశారు. 
ఇటు జడధారు లు, అటు రంగు రంగుల వస్త్రాలు ఆభరణాలతో సుంద రీమణులను చూచి శివకుమారుడు నవ్వు ఆపుకోలేకపో యాడు. 
‘‘కుమారా! ఏల నవ్వుచున్నావు? వారు నేనులా కన్పించలేదా? ఆ తాపసులు మీ తండ్రి వలే లేరా? భేదమేమైననూ కన్పించినదా?’’ 
అని జగదంబ కుమారుని ప్రశ్నించినది. ఆ ప్రశ్న విన్న కుమారస్వామి లోలోన పశ్చా త్తాప పడినాడు. 
తల్లి పాదాలపైబడి క్షమాపణ కోరుకున్నాడు. 
తల్లి కాదన్న వినకుండా పాపపరిహారం కోసం తపస్సు చేసుకోవడానికి బయలుదేరాడు. 
ఈ ప్రాంతానికి చేరుకొని తన రూపం ఇతరులకు కనిపించకుండా ఒక పుట్టను ఏర్పరచుకొని ఉరగ రూపంతో తపస్సు ప్రారంభించాడు.  

ఈ విషయాన్నంతటిని దివ్యదృష్టితో చూచి శిష్యుల కెరింగించిన అగస్త్యుడు 
మహాతేజస్సు వచ్చే పుట్టను సమీపించి సాష్టాంగ నమస్కారం చేశాడు. 
పడగ వలే ఉండే శివలింగాన్ని దివ్యతేజస్సు వచ్చే పుట్టమీద ప్రతిష్టించాడు.
 
‘అత్ర స్నానంతు కుర్యాచ్చేత్కోటి జన్మాఘ నాశనమ్‌’ 

అని కృష్ణానది లో స్నానం చేసి లోపాముద్రతో కలసి శిష్యసమేతంగా శివలింగానికి పూజలు నిర్వహించారు అగస్త్యమహర్షి.
కాలాంతరంలో ఆ ప్రదేశమంతా పుట్టలతో నిండిపోయింది. 
ఆ పుట్టలున్న ప్రాంతానికి సమీపంలోనే కుమ్మరి కులస్తులు కులవృత్తి తో జీవిస్తుండేవారు. 
వారిలో వీరారపు పర్వతాలు ఒకడు. ఇతను మహాభక్తుడు. 
అతనికి స్వామి కలలో కన్పించి, తాను ఎక్కడున్నది చెప్పి, లింగాన్ని వెలికి తీసి ఆలయాన్ని నిర్మించి, ప్రతిష్ఠించమని ఆజ్ఞాపించాడు. 
పర్వతాలు తన స్వప్న వృత్తాంతాన్ని తనవారందరికి చెప్పి, దేవాలయాన్ని నిర్మించి లింగాన్ని ప్రతిష్టించాడు. 

తనవృత్తిని స్వామికి అంకితం చేశాడు. 
మట్టి తో స్వామికి ఇష్టమైన వాటిని తయారు చేసి, 
వాటిని కాల్చి అవి చెడిపోకుండా స్వామివారికి సమర్పించి ఆలయంలో భద్రపరచేవాడు.
అలా సమర్పించిన వాటిలో కొన్ని దేవాలయ మరమ్మత్తుల సమయంలో శిథిలమైపోగా 
మిగిలిన నంది, గుర్రము ఈ నాటికీ స్వామి వారి కళ్యాణమండపంలో భద్రంగా ఉండి, 
భక్తులకు కనువిందు చేస్తున్నాయి. ఈ పుణ్యక్షేత్రాన్ని తొలిరోజుల్లో మోహినీపురం అని పిలిచేవాళ్లని, 
కాలక్రమే ణా అది మోపిదేవి స్ధిరపడిందని చెపుతారు.

క్షేత్ర విశిష్టత...
స్వామివారి ఆలయం తూర్పుదిశగా ఉంటుంది. గర్భగుడిలో పాము చుట్టల మీద లింగం ఉంటుంది. 
ఇదే పానమట్టం. స్వామికి వేరే పానమట్టం ఉండదు. 
పానమట్టం క్రింద అందరికీ కనబడే విధంగా లోపలికి ఒక రంధ్రం ఉంటుంది. 
అర్చన, అభిషేక సమయాల్లో ఆ రంధ్రంలో పాలుపోయడం జరుగుతుంది. 
ఆలయ ప్రదక్షిణ మార్గంలో ఉన్న పుట్టనుండి గర్భగుడిలోకి దారి ఉన్నట్లు, 
ఆ దారి నుండే దేవతాసర్పం పయనిస్తుందని భక్తుల విశ్వాసం. 
ఇక్కడ స్వామి వారి ఆలయంలో పుట్టలో పాలుపోయడం విశేషసేవగా భక్తులు భావిస్తారు. 
సంతానం లేనివారికి సంతానం కలిగించడం, చూపు మంద గించినవారికి దృష్టిని ప్రసాదించడం, 
శ్రవణ దోషాలు, శారీరక దౌర్బల్యం, మనోవ్యాధి, చర్మసంబంధవ్యాధులను నశింపజేయడం, 
విద్యాభివృద్ధి సకలసంపదలను సమకూర్చడం మొదలైన ఎన్నో మహిమలను స్వామి అందిస్తాడని భక్తుల ప్రగాఢ నమ్ముతున్నారు. 
స్వామి వారి ఆలయంలో చెవులు కుట్టించడం, తలనీలాలు సమర్పించడం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, చీర్రమొక్కుబడి, 
ఉయ్యాల ఊపు మొదలైన మొక్కులు తీర్చుకుంటారు. 
నాగదోషం ఉన్నవారు, వివాహం ఆలస్యమవుతున్న యువతులు ప్రత్యేకపూజలు జరిపించు కుంటారు. 
పుట్టలో పాలు పోయడం, పొంగలి నివేదన ఇక్కడి ప్రత్యేకతలు.

విశేష పూజలు...
నాగులచవితి, సుబ్రహ్మణ్య షష్టి వంటి పర్వదినాల తోపా టు ఆదివారం, 
గురువారం స్వామిని భక్తులు విశేషంగా సందర్శించి, మొక్కులు తీర్చుకుంటారు. 
స్వామి వారికి పర్వదినాల్లో మహన్యాసపూర్వక రుదభ్రిషేకంతో పాటు ప్ర త్యేకఅర్చనలు జరుగుతాయి.

ఇలా వెళ్ళాలి...
కృష్ణాజిల్లాలో విజయవాడకు 70 కిలోమీటర్ల దూరం లోనూ, మచిలీపట్టణానికి 35 కి.మీ.ల దూరం లోనూ, 
గుంటూరు జిల్లా రేపల్లెకు 8 కి.మీ.ల దూరం లోనూ మోపి దేవి క్షేత్రం ఉంది. అతి సమీపంలోని రైల్వేష్టేషన్‌ రేపల్లె.

శనివారం హనుమంతుని పూజ సర్వ కామ్యార్ధ సిద్ధి


శనివారం హనుమంతుని పూజ సర్వ కామ్యార్ధ సిద్ధి , సకల శ్రేయస్సును ఇస్తుంది. ఎందుచేత?
.................................

శనివారము నాడు హనుమంతుడిని పూజించడం చాల శ్రేయస్కరము. 
అని పురాణాలు చెబుతున్నాయి. 
ఎందుకంటే, హనుమంతుడు శనివారము పుట్టడం వలన అంత ప్రాధాన్యత కూడా లభించింది.

"సతతం మంద వారేషు భారతః క్షత్రియో త్తమః
హనూమంతం భజం స్థాస్తౌ నిరంకుశ పరాక్రమః''

(అంటే ప్రతి శనివారం భరతుడు హనుమను సేవించి పరాక్రమవంతుడు అయ్యాడు అని అర్ధం)
హనుమంతుని శనివారం వ్రతానికి ఒక కారణం కూడా ఉంది. 
శని గ్రహం ఎంత క్రూర స్వభావం కలవాడో, అంత సౌమ్యం కూడా కలవాడు.
ఒకానొక రోజు శనీశ్వరుడు హనుమంతుడిని సమీపించి, మారుతీ! నేను శనీస్వరుడిని. 
నేను అందరినీ పట్టి బాధించాను. కానీ, ఇప్పటి వరకు నిన్ను పట్టుకోలేకపోయాను. 
ఇప్పుడు నా చేతికి చిక్కావు. అని అంటాడు. 
అప్పుడు, హనుమంతుడు శనీస్వరుడా! నువ్వు నన్ను పట్టుకుంటావా? 
లేకా నాలో ఉంటావా? నువ్వు నాలో ఎక్కడ ఉండదలుచుకున్నావు? అని అడుగుతాడు. 
అప్పుడు శనీశ్వరుడు, నేను నీ నెత్తి మీద కుర్చుంటాను అని అంటాడు.
హనుమంతుడు, శనీశ్వరుడు కోరిక మేరకు నెత్తి మీద కూర్చుండ పెట్టుకొని, 
శనీస్వరుడిని బాధించాలని మారుతీ కి మనస్సులోని కోరిక కలిగింది. 
ఒక మహా పర్వతాన్ని పెకలించి నెత్తిమీదకు ఎత్తు కొన్నాడు హనుమంతుడు.
కుయ్యో మొర్రో అని ఆ భారం భరించలేక శని గిలగిల తన్నుకొన్నాడు బరువు దించమని ప్రాధేయ పడ్డాడు. 
జాలి కలిగి పర్వతాన్ని విసిరేసి శనిని తోకకు చుట్టి సేతువుకు ప్రదక్షిణం చేయటం మొదలు పెట్టాడు. 
ఊపిరాడక శని వలవల ఏడ్చేశాడు. 
తోకలో బంధింపబడి ఉన్నందున నేల మీద పడి దొర్లుతూ, ఏడుస్తూ ప్రార్ధించాడు. 
శని స్తోత్రాలకు పవన కుమారుడు సంతోషించి "మందా! నన్ను పట్టుకొని పీడిస్తానని ప్రగల్భాలు పోయావు .
అప్పుడే గిజ గిజలాడి పోతున్నావే?'' అని ప్రశ్నించాడు.
"ప్రజలను బాధించటమే నీ ధర్మంగా ప్రవర్తిస్తున్నావు. 
అందుకని నిన్ను ఒక రకంగా శాశించి వదిలి పెడతాను'' అన్నాడు. గత్యంతరం లేక శని సరేనన్నాడు.
హనుమ "శనీశ్వరా! నా భక్తులను బాధించ రాదు, నన్ను పూజించే వారిని, నా మంత్రాన్ని జపించేవారిని, 
నా నామస్మరణ చేసే వారిని, నాకు ప్రదక్షిణం చేసేవారిని, నా దేవాలయాన్ని సందర్శించేవారిని, నాకు అభిషేకం చేసే వారిని ఏ కాలంలోనైనా ముట్టుకోకూడదు, బాధించ రాదు. మాట తప్పితే కఠినాతి కఠినంగా నిన్ను దండిస్తాను'' అని చెప్పి, శనితో వాగ్దానం చేయించుకొని వదిలి పెట్టాడు. 

అందుకే శనివారానికి ఇంత ప్రాధాన్యత సంతరించుకుంది. 
శనిని తోకతో నేల మీద పడేసి లాగటం వల్ల శనీశ్వరుడి శరీరమంతా గాయాలై బాధించాయి. 
ఆ బాధా నివృత్తికే శనీశ్వరుడికి తైలాభిషేకం చేస్తారు. ఈ విధంగా తైలాభిషేకం చేసిన వారిని శనిదేవుడు బాధించడు.

"మంద వారేషు సంప్రాప్తే హనూమంతం ప్రపూజయేత్ –సర్వేశ్వాపిచ వారేషు మంద వారః ప్రశాస్యతే|
హనూమజ్జన్మనో హేతు స్తస్య ప్రాశస్త్య ముచ్చ్యతే –తస్మాత్తస్మిన్ కృతా పూజా సర్వ కామ ఫలప్రదా||''

శని వారం రాగానే హనుమంతుని పూజించాలి. 
ఆయన శనివారం జన్మించటం వల్ల దానికి అంత ప్రాముఖ్యత లభించింది. 
అందుకే శనివారం చేసే హనుమంతుని పూజ సర్వ కామ్యార్ధ సిద్ధి కల్గిస్తుంది సకల శ్రేయస్సును ఇస్తుంది.
rachana::Venkata madhu

Monday, December 9, 2013

శివుడు పంచావతారమూర్తి
పరమ శివుడు పంచావతారమూర్తి. 
విష్ణుమూర్తి లోక కళ్యాణార్ధం దశావతారాలుగా అవతరించినట్లు, అందరికి విదితమే ! 
కాని పరమశివుడు బ్రహ్మ కోరికపై ఐదు అవతారాలు దాల్చిన విషియం కొందరికి మాత్రమే విదితం.
ఈశ్వరుడు త్రిలోచనుడు , త్రిశూలి, ధవళ శరీరుడని మాత్రమే అందరూ ఎరిగిన విషియము. 
అమృత మధనం సమయంలో గరళ్ళాన్ని త్రాగి కంఠమున నిలుపుకున్నందున గరళకంఠుడూ, 
నీలకంఠుడు అని కంఠము మాత్రమే నీలినలుపు రంగుల్లో ఉంటుందని మన విశ్వాసం.
కాని బ్రహ్మ కోరిక పై ఐదు సందర్భాలలో అయిదే వతారమౌలను ధరించినందున ఆయ్న శరీర ఛాయలు ,
నామములు కూడా పంచావతారమూర్తి పేరును సార్ధకం చేశాయి.

బ్రహ్మదేవుడు శ్వేతవరాహకల్పంలో పరమేశ్వరుని ధ్యానించి,
తన విధులను నిర్వర్తించడానికి తగిన ఙ్ఞానాని ప్రసాదించమని ప్రార్ధించాడు. 
నిస్చల భక్తితో కొలచిన వారిని అనుగ్రహించడం కోసం వెంటనే ప్రత్యక్షమయ్యేవాడే పరమేఅశ్వరుడు.
ఆయన గౌరిదేవితో కూడి సద్యోజాత శివరూపం తో ప్రత్యక్షం కాగా,తనకు పుత్ర ప్రాప్తి కలగాలన్నారు. 
వెంటన్నే నలుగురు కుమారులు కలిగారు, వారే సునందుడు, నందనుడు, విశ్వనందనుడు, ఉపనందుడు. 
మరలా రక్తకల్పంలో బ్రహ్మదేవుడు పరమశివుణ్ణి ధ్యానించగా, ఆయన ఎర్రటి కళ్ళతోనూ,కెంపు రంగు శరీరంతోనూ, 
రక్త వర్ణ వస్త్రభూషణాలను ధరించడమే కాకుండా, అగ్నిగోళాల వంటి ఎర్రని కన్నులతో ప్రసాంత వదనంతో ప్రత్యక్షమై, 
ఙ్ఞానభిక్షతో బాటు, ఎర్రనివస్త్రాలను ధరించిన నలుగురు కుమారులను అనుగ్రహించారు. 
వారే విరజుడు,వివాహుడు, విశోకుడు, విశ్వభావనుడు. దీనితో శివుని రెండవ అవతారమైన వామదేవ అవతారం.   


అటు తరువాత పీతవాసకల్పంలో బ్రహ్మ, శివుని ధ్యానించడం,ఆయన పసుపు వర్ణపు వస్త్రాలను ధరించి,
బంగారు వర్ణంలో,మిలమిల మెరిసే పసిడి తెజస్సుతో,భుజబలశక్తిగల ఆజానుబాహునిలా ప్రత్యక్షమయ్యారు.
అదే మూడవ అవతరామైన తత్పురుషవతారం.

తరువాత వచ్చిన కల్పం శివకల్పం. ఈ కల్పంలో సర్వం జల మయమైపోయింది. 
ఏ దిశ చుచిన జలమయమే .ఇలా సహస్ర వర్షాలు గడిచిపోయాయి. 
సృష్టి కార్యం ఎలా నిర్వర్తించాలన్నది బ్రహ్మకు సమస్యై పోయింది. 
మరలా గడ్డు పరిస్థితి ఏర్పడిందని ,శివుని గూర్చి తపస్సు చేసారు. అప్పుడు పరమేశ్వరుడు నల్లటి శరీరధారియై,నళ్ళటి కిరీటాన్ని ధరించడమే కాకుంద, శరీరంపై లేపనాన్ని పూసుకుని, 
ఓ దివ్యమైన,నలుపు లోను కూడా తెజస్సు గల "అఘోరమూర్తి"గా పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. 
సృష్టికార్యానికి సహకారులుగా కొందరిని అనుగ్రహించమని మరీమరీ వేడుకోగా,
నల్లని దేహం, నల్లని ముఖం,నల్లని శిఖ కలిగిన నలుగుర్ని బ్రహ్మ సృష్టికి ఆ నలుగురూ ఎంతగానో తోడ్పద్దారు, 
బ్రహ్మ అంతర్గత మధనాన్ని గ్రహించాడు. ఆ ఙ్ఞానన శక్తి వెనుకగల స్తిథిని గ్రహించాడు. బ్రహ్మ అడిగిన ఙ్ఞానప్రసాదమేమిటో గ్రహించారు.
మరలా విశ్వకల్పం వచ్చింది. 
ల్పకల్పానికి జరిగినట్టుగానే ఇక్కడ బ్రహ్మకు మళ్ళి సమస్యలే! 

ఈ సారి బ్రహ్మ శరీరం నుంచే మహానాదం,సరస్వతి రూపావిర్భావం జరిగింది. 
పరమశివుడేఅ అలా అవతరించగా, బ్రహ్మ అది "ఈసానవతారంగా" భావించారు.
ఈ ఐదవ అవతారమే ఈశ్వరుని అన్ని అవతారలకంటే విశిష్టమైనది. 
ఇక్కడ ఆయనకు నలుగురు సహాయకులను కూడా ప్రదానం చేసారు. 
వారే జటి,ముండి, శిఖండి, అర్ధముండీలు.

ఇలాగ ఐదు సందర్భాల్లోని ఐదు అవతారాల్లోనూ బ్రహ్మ సృష్టి నిర్మాణ సౌలభ్యానికి,
ముల్లోకముల హితానికే ముక్కంటి అనుగ్రహించినట్టు శతరుద్రసమ్హిత చెబుతోంది.
హర హర మహా దేవ శంభో శంకర !

శివపురాణాంతర్గగ అంధకకృత శివాష్టోత్తర శతనామస్తోత్రమ్శివపురాణాంతర్గగ అంధకకృత శివాష్టోత్తర శతనామస్తోత్రమ్

1::మహాదేవం విరూపాక్షం చంద్రార్థకృత శేఖరమ్
అమృతం శాశ్వతం స్థాణుం నీలకంఠం పినాకినమ్

2::వృషభాక్షం మాహాజ్ఞేయం పురుషం సర్వకామదమ్!
కామారిం కామదహనం కామరూపం కపర్దినమ్

3::విరూపం గిరీశం భీమం స్రగ్విణం రక్త వాసనం
యోగినం కాలదహనం త్రిపురఘ్నం కపాలినమ్

4::గూఢవ్రతం గుప్తమంత్రం గంభీరం భావగోచరమ్
అణిమాదిగుణాధారం త్రిలోక్యైశ్వర్యదాయకమ్

5::వీరం వీరహణం ఘోరం విరూపం మాంసలంపటుమ్
మహామాంసాదమున్మత్తం భైరవం వై మహేశ్వరమ్

6::త్రైలోక్య ద్రావణం లుబ్ధం లుబ్ధకం యజ్ఞసూదనమ్
కృత్తికానాం సుతైర్యుక్తమున్మత్తం కృత్తివాసనమ్

7::గజకృత్తి పరీధానం క్షుబ్ధం భుజగభూషణమ్
దద్యాలంబం చ వేతాలం ఘోరం శాకిని పూజితమ్

8::అఘోరం ఘోరదైత్యఘ్నం ఘోరఘోషం వనస్పతిమ్
భస్మాంగం జటిలం శుద్ధం భేరుండ శతసేవితమ్

9::భూతేశ్వరం భూతనాథం పంచభూతాశ్రితం ఖగమ్
క్రోధితం నిష్ఠురం చండం చండీశం చండికాప్రియమ్

10:చండం తుంగం గరుత్మంతం నిత్య మాసవ భోజనమ్
లేనిహానం మహారౌద్రం మృత్యుం మృత్యోరగోచరమ్

11:మృత్యోర్మృత్యుం మహాసేనం శ్మశానారణ్య వాసినమ్
రాగం విరాగం రాగాంధం వీతరాగ శతార్చితమ్

12:సత్త్వం రజస్తమోధర్మమధర్మం వాసవానుజమ్
సత్యం త్వసత్యం సద్రూపమసద్రూపమహేతుకమ్

13:అర్థనారీశ్వరం భానుం భాను కోటీశతప్రభమ్
యజ్ఞం యజ్ఞ పతిం రుద్రమీశానం వరదం శివమ్

14:అష్టోత్తరశతం హ్యేతన్మూర్తీనాం పరమాత్మనః
శివస్య దానవో ధ్యాయన్ ముక్తస్తస్త్మాన్మహాభయాత్

శ్వేత శంఖాలుశ్వేత శంఖాల మహిమ  

ఎవరి ఇంట్లో అయితే దక్షిణావర్తమైన శ్వేత శంఖాలు రెండు నిత్యపూజలు అందుకుంటూ ఉంటాయో 
ఆఇంటి యజమాని సదా ఉచ్ఛస్థితిలో ఉంటాడు. 
ఏకార్యం చేట్టినా అందులో విజయం సాధిస్తాడు. అపజయాలు, దుర్దశలు ఆవ్యక్తి దరిదాపుల్లోకి కూడా రావని ప్రజల నమ్మిక. 
శాస్త్ర ప్రకారం శంఖం లక్ష్మీ స్వరూపం.

"మహాభషేకం సర్వత్ర శంఖేనైవ ప్రకల్పయేత్!
సర్వత్రైవ ప్రశస్తోబ్జః శివ సూర్యార్చనం వినా!!"(తిథి తత్త్వే బ్రాహ్మే)

సర్వదేవతా పూజల్లోనూ శంఖంతో మహభిషేకం చేయాలి. 
శంఖంతో శివ సూర్యులను మాత్రం అభిషేకించరాదు.

శంఖ ద్వారా ఇచ్చే తీర్థాన్ని ఎలా స్వీకరించాలంటే

చతుర్గుణీ కృత వస్త్రే పాణిం నిధాయ తేనాదౌ శంఖతీర్థం శిరసి ధారయేత్!

శంఖ మధ్య స్థితం తోయం భ్రామితం కేశవోపరి! అంగ లగ్నం 
మనుష్యాణాం బ్రహ్మహత్యా యుతం దహేత్!! (నిత్య కర్మాష్టకే)

నాలుగు మడతలు పెట్టిన వస్త్రం మీద కుడి చేతిని ఉంచాలి. 
ముందుగా అందులోకి శంఖ తీర్థాన్ని తీసుకొని, శిరస్సున జల్లుకోవాలి. 
శంఖమధ్యమున ఉండేదీ, విష్ణు ప్రదక్షిణం చేసినదీ అయిన ఈశంఖం తీర్థం 
మానవుల శరీరాన్ని స్పృశించి, బ్రహ్మ హత్యల వల్ల కలిగే పాపాన్ని సైతం పోగొడుతుంది. 
శంఖాన్ని చెవిదగ్గర ఉంచుకొన్నప్పుడు మంద్రమైన శబ్దాలు వినిపిస్తే అది ఉత్తమమైన శంఖం.
ఎవరైతే తమ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా నివాసం ఉండాలనుకుంటారో, ఋణబాధలు, 
దరిద్రం లేకుండా సిరిసంపదలతో తులతూగాలనుకుంటారో అలాంటి వాళ్ళు 
దక్షిణావర్త శ్వేత శంఖాన్ని(కుడివైపు తెరుచుకొని ఉండే తెల్లటి శంఖాన్ని) పూజగదిలో పెట్టుకోవాలి. 
ఈవిషయాన్ని పులస్త్య సంహితలో మహర్షి పులస్త్యుడు, లక్ష్మీ సంహితలో బ్రహ్మర్షి విశ్వామిత్రుడు చెప్పారు. 
దక్షిణావర్తమైన తెల్లటి శంఖం ఉన్నప్పటికీ దాన్ని ఉపయోగించుకోనట్లయితే అంతకన్నా దురదృష్టం మరొకటి ఉండదని 
శంకరాచార్యులు పేర్కొన్నారు. ఆశంఖం మంచి పనులు చేయడానికి ప్రోత్సహిస్తుందని తెలిపారు.

రాగి పాత్రలో నైవేద్యం మహిమరాగి పాత్రలో నైవేద్యం విశిష్టిత 

సాధారణంగా ఆలయ దర్శనానికి వెళ్ళినప్పుడు,అక్కడ అర్చకులు స్వామికి ఓ పాత్రలో నైవేద్యాన్ని పెడుతూ ఉండటాన్ని చుస్తు ఉంటాము.
ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుకు రాగిపాత్రలో నైవేద్యమంటే అమిత ఇష్టం. 
ఇందువెనుక ఒక కధ ఉంది. ఆ కధ సాక్షాత్ శ్రీ మహా విష్ణువే చెప్పాడు. 
పూర్వం గుడాకేశుడనే రాక్షసుడు ఉండేవాడు . 
అతడు పుట్టుకతో రాక్షసుడైనప్పటికీ, ఎలాంటి రాక్షస లక్షణాలు లేకుండా దైవచింతనలో కాలాన్ని వెళ్ళబుచ్చుతూండేవాడు. 
గుడాకేశుడు విష్ణువు భక్తుడు. 
నిరంతరం విష్ణువు నామాన్నే జపిస్తూ ధర్మకార్యాలను నిర్వర్తిస్తూండేవాడు. 
ఇది ఇలాగ ఉండగా, ఆ రాక్షసునికి విష్ణువును గురించి తపస్సు చేయాలని అనిపించింది. 
ఫలితంగా, ఆ రాక్షసుడు పదహారువేల సంవత్సరాల పాటు విష్ణువు గురించి తపస్సు చెయ్యగా . 
అతని తపస్సుని మెచ్చిన విష్ణుమూర్తి,ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకోమన్నాడు. 
అందుకు గుడాకేశుడు, తనకు ఏమి అక్కర్లేదు అని, 
కొన్ని వేల జన్మలపాటు తాను విష్ణుభక్తిలో మునిగిపోయే విధంగా వరాన్ని అనుగ్రహించమని కోరుకున్నాడు. 
అలాగే తన మరణం విష్ణుచక్రం వల్ల మాత్రం ఏర్పడి,తదనంతరం తన శరీరం రాగిలోహంగా మారిపోవాలని కోరుకున్నాడు. 
విష్ణువు ఆ రాక్షసుడు కోరుకున్న వరాలను అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు. 
గుడాకేశుడు సంతోషించాడు. 
విష్ణుమూర్తి అనుగ్రహించిన అనంతరం గుడాకేశుడు తపస్సు చేస్తూనే ఉన్నాడు. 
వైశాఖ శుద్ధ ద్వాదశినాడు ఆ రాక్షసుని కోరికను తీర్చాలని విష్ణుమూర్తి నిర్ణయించుకుని, 
మిట్టమధ్యాహ్నపువేళ తన చక్రాయుధాన్ని ప్రయోగించాడు. 
తన కోరిక ఎప్పుడు నెరవేరుతుందా అని ఎదురు చూస్తున్న గుడాకేశుడు మిక్కిలి సంతోషించాడు. 
విష్ణుచక్రం ఆ రాక్షసుని తలను ఖండించింది. 
వెంతనే అతడి మాంసమంతా రాగిగా మారి పోయింది. 
ఆ రాక్షసుని ఎముకలు వెండిగా మారాయి. మలినాలు కంచులోహంగా మారాయి. 
గుడాకేశుని శరీరం నుండి ఏర్పడిన రాగితో ఒక పాత్ర తయారు అయ్యింది. 
ఆ పాత్ర లో విష్ణువుకు నైవేద్యం సమర్పించబడింది. 
ఆ పాత్రలో నైవేద్యాన్ని స్వీకరించడమంటే విష్ణుమూర్తికి ఎంతో ఇష్త్టం. 
అనంతరం తన భక్తులు కూడా రాగి పాత్రలో నైవేద్యాన్ని సమర్పించాలని సూచించాడు విష్ణుమూర్తి. 
రాగిపాత్రలోని నైవేద్యంలో ఎన్ని మెతుకులు ఉంటాయో, అన్ని వేల సంవత్సరాల పాటు, 
ఆ నైవేద్యాన్ని పెట్టిన భక్తుడు వైకుంఠంలో ఉండగలడని విష్ణుమూర్తి సెలవిచ్చారు. 
అందుకే విష్ణుమూర్తికి రాగిపాత్ర లో నైవేద్యం సమర్పించటం వెనుక ఇంత కథ ఉంది. 
సత్యనారాయణస్వామికి ఎర్రగోధుమ నూక ప్రసాదం ఎంతో ఇష్టం. 
పరమశివునికి చిమ్మిలి, గణపతికి కుడుములు ,మహాలక్ష్మికి పానకం,వడపప్పు,లలితా దేవికి గోక్షీరాన్నం,పులిహోర ! 
కృష్ణుడికి అటుకులు బెల్లం..ఇలా ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క ప్రసాదం అంటే ప్రీతి
ఆ ప్రసాదం ఇష్టం వెనుక కూడా మనకి తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి
వారికి అవి ప్రీతి అంటే...ఇంకో విధంగా ఆలోచిస్తే..అవి వారికి నివేదన చేసి మనం స్వీకరిస్తే...
మన ఆరోగ్యానికి మంచి శక్తిని ఇవ్వడమే..ఆ నిర్గుణ పరబ్రహ్మం ఎప్పుడూ లోక క్షేమమే కదా చేస్తాడు..లోకాస్సమస్తాస్సుఖినో భవంతు!

శివునికి పురాణాలలో ఉన్న పేర్లు

శివునికి పురాణాలలో ఉన్న పేర్లు 

వేదాలు, పురాణాలు మరియు ఉపనిషత్తులలో శివునికి అనేక పేర్లతో స్మరిస్తుంటారు. 
వాటిలో కొన్ని పేర్లు మీకోసం...

హర-హర మహదేవ, రుద్రుడు, శివుడు, అంగీరాగురు, అంతకుడు, అండధరుడు, అంబరీషుడు, 

అకంప, అక్షతవీర్యుడు, అక్షమాలి, అఘోర, అచలేశ్వరుడు, అజాతారి, అజ్ఞేయ, అతీంద్రియుడు, 

అత్రి, అనఘ, అనిరుద్ధ్, అనేకాలోచనడు, అపానిధి, అభిరాముడు, అభీరు, అభదన్, అమృతేశ్వర్, 

అమోఘ, అరిదమ్, అరిష్టనేమి, అర్ధేశ్వర్, అర్థనారీశ్వరుడు, అర్హత్, అష్టమూర్తి, అస్థమాలి, ఆత్రేయ, 

ఆశుతోష్,ఇంద్రభూషణుడు, ఇందుశేఖరుడు, ఇకంగ, ఈశాన్, ఈశ్వరుడు, ఉన్నమత్తవేషుడు, ఉమాకాంతుడు, 

ఉమానాథ్, ఉమేష్, ఉమాపతి, ఉరగభూషణ్, ఊర్ధ్వరేతా, ఋతుధ్వజ, ఏకనయన్, ఎకపాద్, ఎకలింగ, ఎకాక్ష, 

కపాలపాణి,కమండలధర, కళాధర్, కల్పవృక్ష, కామరిపు, కామారి, కామేశ్వర్, కాలకంఠ, కాలభైరవ, కాశీనాథ్, 

కృత్తివాసా, కేదారనాథ్, కైలాశనాథ్, క్రతుధ్వసీ, క్షమాచార్, గంగాధర, గణనాథ, గణేశ్వర, గరళధర, గిరిజాపతి, 

గిరీష్, గోనర్ద్, చంద్రేశ్వర్, చంద్రమౌళి, చీరవాసా, జగదీశ్, జటాధర, జటాశంకర్, జమదగ్ని, జ్యోతిర్మయ్,

తరస్వీ, తారకేశ్వర్, తీవ్రానంద్, త్రిచక్షు, త్రిధామా, త్రిపురారి, త్రియంబక్, త్రిలోకేశ్, త్రయంబక్, దక్షారి, 

నందికేశ్వర్, నందీశ్వర్, నటరాజ్, నటేశ్వర్, నాగభూషణ్, నిరంజన్, నీలకంఠ, నీరజ,

పరమేశ్వర్, పూర్ణేశ్వర్, పినాకపాణి, పింగలాక్ష్, పురందర్, పశుపతినాథ్, ప్రథమేశ్వర్, 

ప్రభాకర్, ప్రళయంకర్, భోలేనాథ్, బైజనాథ్, భగాలీ, భద్ర, భస్మశాయీ, భాలచంద్ర్, భువనేశ్, 

భూతనాథ్, భూతమహేశ్వర్,మంగలేశ్, మహాకాంత్, మహాకాల్, మహాదేవ్, మహారుద్ర్, మహార్ణవ్

మహాలింగ్, మహేశ్, మహేశ్వర్, మృత్యుంజయ, యజంత్, యోగేశ్వర్, లోహితాశ్వ్, విధేశ్, విశ్వనాథ్, 

విశ్వేశ్వర్, విషకంఠ్, విషపాయీ, వృషకేతు, వైద్యనాథ్,

శశాంక్, శేఖర్, శశిధర్, శారంగపాణి, శివశంభు, సతీష్, 

సర్వలోకేశ్వర్, సర్వేశ్వర్, సహస్రభుజ్, సాంబ, సారంగ, సిద్ధనాథ్, సిద్ధీశ్వర్, 

సుదర్శన్, సురర్షభ్, సురేశ్, హరిశర్, హిరణ్య, హుత్ సోమ్, స్రుత్వా మొదలైనవి 

అందరికీ సుబ్రహ్మణ్య షష్టి శుభాకాంక్షలుమా తండ్రి శివయ్యకు ముద్దుల తనయుడు
మమ్ము లాలనతో పాలించు దేవ సేనాని, 
సద్బుద్ధిని ఇచ్చు గణపతి అనుంగు సోదరుడు
సర్వ శక్తిమంతుడు, మహా బుద్ధిమంతుడు
బుద్ధిబలం, దేహబలం అనుగ్రహించు తల్లులు
వల్లీ దేవసేనల అనురాగాల కల్పవల్లి  
వివాహ ప్రదాత.. సత్సంతాన దాత 
యశోవైభవ ఐశ్వర్య వైరాగ్య విధాత
శివానందుడైన ఆ షణ్ముఖుడు 
మనలను సదా ఆరు ముఖాలతో 
చల్లగా కాచి కాపాడాలి. 

Sunday, December 8, 2013

దత్త నవరాత్రులు

దత్తప్రభువుల జన్మవృత్తాంతం :
------------------------------------
ఆధిభౌతికం,ఆధిదైవికం,ఆధ్యా త్మికం అనే తాపాలను తొలగించుకున్న అత్రి మహర్షుల వారికి,కామక్రోధాది దుర్గుణాలన్నింటికీ మూలమైన అసూయను జయించిన అనసూయ మాతకు, కృతయుగంలో ఇప్పుటి నేపాల్‌ ప్రాంతంలోని చిత్రకూట పర్వతం వద్దనున్న అనసూయా పహాడ్ అనేచోట ఒకానొక వైశాఖ బహుళ దశమీ గురువారంనాడు రేవతీ నక్షత్రయుక్త మీన లగ్నంలో మీనాంశయందు 'బ్రహ్మ అంశమున చంద్రుడు,విష్ణు అంశమున దత్తుడు, శివ అంశమున దుర్వాసులుగా' దత్తాత్రేయులవారు జన్మించారు. తర్వాత చంద్రుడు,దుర్వాసుడు తమ తమ అంశములను దత్తునిలో నిక్షిప్తం చేసి తపస్సు చేయడానికి వెళ్లిపోయారు.

(బ్రహ్మ నా తండ్రి, మాయ(ప్రకృతి) నా తల్లి వారి ఐక్యం వల్లనే నాకీ దేహం వచ్చింది. నేనే దైవం,శిరిడీలోనూ సర్వత్రా నేనే వున్నాను, సర్వ జగత్తూ నాలోనే వుంది.నీవు చూస్తున్నదంతా కలిపి నేను..నేను శిరిడీలో మాత్రమే ఉన్నాననుకొనేవాడు నన్నసలు చూడనట్లే - అన్న సాయి వాక్కుని సదా స్మరించినట్లయితే ఆయనెవరో క్రమంగా అర్ధం అవుతుంది.)


బాల్య లీలలు :
--------------
ఈ బాలుడు సామాన్యుడు కాదని అఙ్ఞానులను ఙ్ఞానమార్గాన నడిపి కైవల్యము చేర్చే మార్గదర్శకుడని ఙ్ఞానులు ఆయన్ను ప్రసంశించేవారు. దత్తులవారు మాత్రం గురుశుశ్రూష చేయక బాలునిగా, ఉన్మత్తునిగా, పిశాచపీడితునిలా విహరిస్తుండేవారు, అది చూచి సంశయించేవారు ఆయన కృపకి దూరమయ్యేవారు. ఒకసారి ఆశ్రమవాసులు, వయోవృద్ధులు దత్తస్వామిని చేరి గురువై తమను అనుగ్రహించవలసిందని ఆయన్ను కోరారు. దత్తులవారు వారితో ఏమీ మాట్లాడకుండా ఏకాంత నిష్టలో ఉండటానికి బయలుదేరారు, ఆశ్రమవాసులు ఆయన్ను వెంబడించారు. అది గమనించిన దత్తప్రభువు దగ్గరలో వున్న సరోవరంలో దిగి అదృశ్యులయ్యారు.

ఆయన్ను వెంబడిస్తూ వచ్చినవారు ఆయన దర్శనంకోసం అక్కడే వేచివున్నారు. ఇలా 100 సంవత్సరాలు గడిచేవరకు వారి సహనాన్ని, వారి దృఢ సంకల్పాన్ని పరిక్షించిన పిదప దత్తస్వామి వారి నమ్మకాన్ని పరిక్షించదలచి, ఒక స్త్రీని ఎడమతొడపై కూర్చోబెట్టుకుని సరోవరంలోంచి బయటకు వచ్చారు. దత్తులవారు ఈ విధంగా దర్శనమిచ్చినప్పటికీ ఆశ్రమవాసులు దృఢచిత్తులై అక్కడనుండి కదలలేదు. అప్పుడు దత్తులవారు మద్యాన్ని సేవిస్తూ. వెంటతెచ్చిన స్త్రీతో సరసాలాడటం మొదలుపెట్టారు. ఈ ఘటన కొందరిలో చిత్తచాంచల్యాన్ని కలిగించింది, ఇలా చిత్తం చెదిరినవారు - ఇటువంటి దురాచారుడు, స్త్రీలోలుడు ఆశ్రితులనెలా ఉద్ధరిస్తాడు? అంటూ ఆయన్ని విడిచివెళ్లారు(ఇటువంటివారినే శ్రీసాయి బాబా రాలిపోయే పూతతో పోల్చారు). అక్కడే మిగిలిన అతి కొద్దిమంది మాత్రం అక్కడ జరుగుతున్న చర్యల్ని పట్టించుకోకుండా చిత్తాన్ని కేవలం దత్తప్రభువుపైనే నిలిపివుంచి ఆయన్ని ఇలా స్తుతించారు - ఓ మహానుభావా నీవు యోగీశ్వరుడివి, పూర్ణ పరబ్రహ్మ స్వరూపూడివి, నిర్గుణుడవైనప్పటికీ భక్తులనుద్ధరించడానికి ఇలా సగుణరూపంలో సంచరిస్తున్నావు. ఇకనైనా ఈ దీనులని పరిక్షించటంమాని, నీ ఆశ్రయం కోరివచ్చిన మమ్ము ఉద్ధరించు ప్రభూ అంటూ స్తుతించగా, వారి ప్రార్ధనను మన్నించిన దత్తప్రభువు ఆ మునులకు తన నిజరూపాన్ని చూపి అనుగ్రహించారు.

ఈ విధంగా ఆశ్రమవాసుల్ని అనుగ్రహించిన తర్వాత దత్తప్రభువు తన తల్లిదండ్రుల చెంతకు వచ్చి, భక్తులను అనుగ్రహించడానికి, ప్రజలను సన్మార్గవర్తనులను చేయడానికి నేను సహ్యాద్రికి వెళ్లాలి నన్ను ఆశీర్వదించమనగా, సర్వఙ్ఞురాలైన ఆ మాత కూడా పుత్రవ్యామోహముతో అంగీకరించక - నా వద్దనే ఉండు,నన్ను విడిచి వెళ్లకని బ్రతిమాలింది. దత్తుల వారు పట్టు విడవకపోవడంతో - నా వల్ల కలిగిన దేహాన్ని నాకు ఇచ్చి నీ ఇచ్ఛ ప్రకారం నడుచుకోమని నిష్టూరమాడింది. దత్తాత్రేయుల వారు నవ్వుతూ తన చర్మాన్ని గోళ్లతో చీల్చి తన దేహాన్ని తల్లికి ప్రసాదించారు. ఆ దృశ్యాన్ని చూచిన అనసూయమాతకు దేహం నాశనమయినప్పటికీ, ఆత్మ శాశ్వతమనే సత్యం స్ఫురించినదై - కుమారా తల్లికి సహజమైన మాతృవ్యామోహంతో నిన్ను అర్ధం చేసుకోలేకపోయాను, అఙ్ఞానంతో అలమటించే మానవాళికి ఙ్ఞానాన్ని ప్రసాదించే మోక్షమార్గాన్ని అనుగ్రహించు అన్నది.

**వ్యామోహం సత్యాన్ని మరుగుపరుస్తుందనే విషయం తెలియజేయడానికే ఈ లీల జరిగిందని మనం గ్రహించాలి.

దత్తప్రభువు దినచర్య :
---------------------
దిగంబరుడూ,శరీమంతా భస్మం పులుముకొన్నవాడు,ఆత్మ ఙ్ఞానం కలిగించ గలవాడు, సర్వమతాల్లోనూ తన ప్రస్తావన ఏదో ఒక రూపంలో కలవాడు, ఏ అవతారంలోనూ లేని గురుదేవ అన్న విశేషణం కలవాడూ, సదా బ్రహ్మనిష్టకలవాడూ,ప్రసన్నుడు,నిర్మానసుడు ఐన దత్త ప్రభువుల వారు -

ప్రతిరోజూ కాశీలో గంగాస్నానము, మాహురపురములో ధ్యానము, కొల్హాపురిలో (కరవీరపురం) భిక్ష, నిర్మలమైన,స్వచ్ఛమైన తుంగభద్రా నీటితో దాహం తీర్చుకుని, సహ్యాద్రి పర్వతములో నిద్ర చేస్తారు. సహ్యాద్రి కల్పవృక్షము కింద మణిపీఠం ఉంది, దానిపై దత్త ప్రభువు ఆసీనుడై ఉంటాడు. మెడలో మణిహారం, మొలలో బంగారు మొలత్రాడు, వామాంకమున యోగలక్ష్మి మధుమతీదేవి, వెనుక కామధేనువు, నలుదిక్కులా నాల్గువేదాలూ నాలుగు కుక్కలుగా ఆయన పరివేష్టితుడై ఉండగా - ఆయన ముందు సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులూ, నవనాధుల ఆదిగాగల మహ్మాతులు ఆయన్ను స్తుతిస్తూ వుంటారు.కేవలం భిక్షాన్నం మాత్రమే గ్రహించే ఈ ప్రభువుకి అష్టసిద్ధులు,నవనిధులు దాస్యం చేస్తూ ఉంటాయి. ఎడమ చేతిలో త్రిశూలం, శంఖం, కమండలం ధరించి కుడి చేతిలో ఢమరుకం, చక్రం, జపమాల ధరించి ఉండగా గంధర్వుల గానం చేస్తూంటే. అప్సరసలు నృత్యం చేస్తూండగా దత్తప్రభువులు ప్రతిదినమూ దర్బార్ నిర్వహిస్తూవుంటారు. అట్టి ప్రభువు తనను దర్శించి, స్మరించినంత మాత్రానే ఇహ, పర సౌఖ్యాలు కలుగజేస్తుంటాడు.

**శ్రీ దత్తుల వారికి అవధూత అనే బిరుదువున్నది - అవదూతోపనిషత్తు ప్రకారం ఆ పదానికి అర్ధం.

శ్లో ఈఈ అక్షరద్వాద్వరేణ్యత్వాద్ధూత సంసార బంధనాత్
తత్వమస్యాది లక్ష్యత్వదవదూత ఇతీర్యతే ఈఈ

తా ఈఈ నాశరాహిత్యమూ,శ్రేష్టత్వమూ. విదిలించి వేయబడిన సంసారబంధము తత్త్వమసి అనే మహావాక్యానికి లక్షమవ్వడం వలన,అట్టి వారిని అవధూత అని చెబుతారు.


కార్త వీరార్జుని వృత్తాంతం :
-------------------------
త్రేతాయుగంలో ’హైహయ’ వంశానికి చెందిన కృతవీరుడనే చక్రవర్తి ’మహిష్మతి’ పట్టణాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తుండేవాడు. అతని భార్య శీలధారా దేవి. వీరికి ఎంతో మంది సంతానం కలిగినప్పటికీ, చ్యవన మహర్షి శాపం వల్ల ఒక్కరూ బ్రతకడంలేదు. సంతానం నిలబడటానికి ఎన్నో యాగాలు, పూజలు చేసినా ఫలితం లేకపోవడంతో శీలధారా దేవి ఎంతో మనో వేదనకు గురైంది. ఒకరోజు వారికి యఙ్ఞవల్క్య మహర్షుల వారిని దర్శించే భాగ్యం కలిగింది. మహర్షుల వారి సతీమణి మైత్రేయి మాత వారి వ్యధ విని వారికి అనంత వ్రతం చేయమని చెప్పి, వ్రత విధానం తెలియజేసింది. ఆ వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తున్నప్పుడు, దేవగురువు బృహస్పతి వారి ఇంటికి విచ్చేసి వారిని సూర్యభగవానుణ్ని కూడా ఆరాధించమని చెప్పి ఆలా చేస్తే పాపాలు నశించి పుత్ర సంతానం కలుగుతుందని తెలియజేస్తాడు. వారు చెప్పినట్లే ఆచరించిన కొన్ని రోజుల తర్వాత శీలధారా దేవి గర్భం ధరించి మగబిడ్డకి జన్మనిచ్చింది. ఐతే ఆ బాలుడు చూడ ముచ్చటగా వున్నప్పటికీ, అతని చేతులు వంకర తిరిగి సన్నగా బలహీనంగా వుండి వేలాడుతున్నాయి. అంగ వైకల్యం గల పిల్లవాడు పుట్టేసరికి వారు ఎంతో దుఃఖించారు. అయినప్పటికీ ఆ బాలుణ్ని వారు ఎంతో ముద్దుగా పెంచసాగారు. ఆ బాలుడికి అర్జునడనే పేరు పెట్టారు. కృతవీర్యుని కొడుకు కావడం వల్ల కార్తవీరార్జునుడయ్యాడు. కొంతకాలానికి కృతవీర్యుడు మరణించాడు. రాజ్యభారం వహించడానికి కార్తవీరునికి అంగవైకల్యం దృష్ట్యా అర్హత లేకపోవడం వల్ల మంత్రులకు రాజ్యాన్ని అప్పగించి తాను తపస్సు ద్వారా శక్తులను పొంది రాజ్యానికి తిరిగి వస్తానని చెప్పి వెళ్లిపోతాడు. గర్గ మహాముని కార్తవీరునికి శ్రీ దత్తాత్రేయుల వారే ఈ వైకల్యాన్ని నివారించగలరని చెప్పి వారిని దర్శించుకోడానికి సహ్యాద్రికి వెళ్లమని రాజుకి చెప్తాడు. దత్తాత్రేయుల వారిని దర్శించినప్పుడు వారు తమ భక్తుల భక్తి శ్రద్ధలను కఠినంగా పరిక్షించి, ఆ తర్వాతే అనుగ్రహిస్తారని చెప్పి దేవేంద్రుడు దత్తుల వారి అనుగ్రహం వల్ల జంభాసురుని ఏ విధంగా వధించాడో తెలియజేస్తారు.

జంభాసురుడు దేవతలని జయించినప్పుడు ఇంద్రుడు దేవ గురువు బృహస్పతిని మార్గం తెలియజేయమని అడుగుతాడు. అప్పుడు బృహస్పతి సహ్యాద్రి పై కొలువై ఉన్న దత్త ప్రభువులే ఈ సమస్యని పరిష్కరించగలరని చెప్పి, ఆయన అనుగ్రహం పొందడంలో ఎదురయ్యే ఆటంకాలు జయించిన వారికే ఆయన తన నిజరూప దర్శనమిస్తాడని, దానికి ఎంతో భక్తి, శ్రద్ధలు అవసరమని చెప్తాడు. ఇంద్రుడు సహ్యాద్రికి చేరుకుని దత్తుల వారి దర్శనం కోసం వెళ్లినప్పుడు ఆయన మగువతో కలిసి మద్యాన్ని పానం చేస్తూ కనిపించారు. ఇలా ఎన్ని పరీక్షలు ఎదురయినా దేవేంద్రుడు ఆయన్ని విడువక సేవిస్తూనే వున్నాడు. కొన్ని రోజులకి ఇంద్రుని భక్తికి ప్రసన్నుడైన దత్త ప్రభువు తన నిజ రూపంలో దర్శనమిచ్చి జంభాసురుని సహ్యాద్రికి వచ్చేలా చెయ్యమని చెప్తాడు. ఇంద్రుడు జంభాసురుని కవ్వించి అతన్ని సహ్యాద్రికి వచ్చేలా చేస్తాడు. జంభాసురుడు తన సైన్యంతో సహా సహ్యాద్రికి రాగానే వాళ్లకి మహాసౌందర్యవతియైన అనఘా దేవి కనిపిస్తుంది. ఆమె సౌందర్యానికి మోహితులై యుద్ధాన్ని చేయడం మాని ఆమెను పల్లకీలో కూర్చోబెట్టారు. ఆమెను ముందుగా ఎవరు పొందాలని వారిలో వారు కలహించుకుంటున్నప్పుడు దత్తప్రభువు ఇంద్రున్ని పిలిచి రాక్షసులను ఓడించడానికి ఇదే సరైన సమయం అని తెలియజేస్తాడు. అప్పుడు ఇంద్రుడు వారిని సునాయాసంగా ఓడిస్తాడు. అలా ఇంద్రుడు దత్త ప్రభువుల కృపకు పాత్రుడై తన రాజ్యాన్ని తిరిగి పొందాడు అని పై వృత్తాంతాన్ని గర్గముని, కార్తవీరునికి తెలియజేస్తారు.

కార్తవీరార్జునుడు సహ్యాద్రి చేరి దత్తప్రభువుని దర్శించి, భక్తి శ్రద్ధలతో వారిని సేవించిన తర్వాత కొంతకాలానికి ఆయన ప్రసన్నులై అతని వైకల్యాన్ని నివారించారు. అంతేగాక అతనికి వేయి బాహువులను, ఇతరుల మనసులను గ్రహించే శక్తిని అనుగ్రహించి, తనంత వాడి చేతిలో మరణం పొందే వరాన్ని ఇచ్చారు. దత్త ప్రభువు అనుగ్రహ బలం చేత కార్తవీరార్జునుడు రావణాసురుడ్ని యుద్ధంలో ఓడించాడు. అలా చాలా కాలం రాజ్య పాలన చేసిన తర్వాత రాజ్యభోగాల పట్ల విసుగు చెంది సత్యాన్ని తెలుసుకోవాలనే కోరిక తీవ్రంగా కలిగి దత్త ప్రభువుని ఆశ్రయించాడు. లౌకిక శాస్త్రాలు విషయాల పట్ల ఆసక్తిని పెంచుతున్నాయి, తత్త్వ శాస్త్రానికి పండితులు తెలియజేసే అర్ధాలు పరస్పర విరుద్ధంగా వుండి సాధకులను గందరగోళానికి గురిచేస్తున్నాయి అని దత్త ప్రభువుతో చెప్పగా. దత్త ప్రభువు "కార్త వీర్యా ! కొన్ని అర్ధాల్లో బాహ్యంగా బేధాలు కనిపించినా, అవి ఒకే తత్త్వాన్ని భిన్నమైన కోణాల్లోంచి ప్రతిపాదించిన సూత్ర పరిశీలనలు మాత్రమే. ఉత్తమమైనది తత్త్వ శాస్త్రమే. అలా అని ఇతర శాస్త్రాలు లౌకికములు అని వాటిని నిరసించరాదు. శాస్త్రాలన్నీ మంచి మార్గానికి దారి చూపేవే. వాటి ద్వారా కూడా ముక్తి సాధించవచ్చు." అని చెప్పారు. ఆ తర్వాత అతనికి నిర్వికల్ప సమాధి స్థితి కలుగజేసి, ఆత్మ తత్త్వం విచారణ చేసే పద్ధతులను తెలియజేసి అతన్ని ఆశీర్వదించారు. చివరికి కార్త వీరార్జునుడు తాను పొందిన వరం వల్ల పరశురామ అవతారంగా వచ్చిన భగవంతుని చేతిలో మరణాన్ని పొందాడు.


ఙ్ఞానబోధ :
----------

**దత్తాత్రేయుల వారు అలర్కునికి, ప్రహ్లాదునికి, పరశురామునికి ఙ్ఞానబోధ చేసారు.

షోడశ అవతారాలు :
-------------------
1.యోగిరాజు 2.అత్రివరదుడు 3.శ్రీ దత్తాత్రేయుడు 4.కాలాగ్ని శమనుడు 5.యోగిజన వల్లభుడు 6.శ్రీ లీలా విశ్వంభరుడు 7.సిద్ధరాజు 8.ఙ్ఞాన సాగరుడు 9.విశ్వంభరావధూత 10.శ్రీ అవధూత 11.మాయాముక్తావధూత 12.ఆది గురువు 13.శివరూపుడు 14.శ్రీ దేవదేవ 15.దిగంబరుడు 16.శ్రీకృష్ణ శ్యామకమలనయనుడు.

**శ్రీ దత్తాత్రేయ సంప్రదాయంలో కలియుగానికి ముందు స్వామికి పదహారు అవతారాలని చెప్పబడింది.ఆయన పరతత్త్వంతో నిత్యం భూలోక నివాసం చేస్తాడు గనుక మహర్షులకు ఆయన ప్రసాదించిన సగుణ సాక్షాత్కారాలనే ఆయన అవతారాలని కీర్తించారని మనం గమనించాలి.

ఈ దత్తప్రభువు మానవజాతి నిలిచివున్నంతవరకూ గురురూపంలో మానవాళిని ఉద్ధరించడమే తన కార్యంగా చేసుకుని, వివిధ గురుసంప్రదాయాల ద్వారా అన్నిమతాల్లో, ప్రతియుగంలో 1,25,000 మంది అవధూతలు, మహాత్ముల రూపంలో ఈ భూమిపై తన కార్యం నిర్వహిస్తూవుంటారు. అట్టి గురుపరంపరలో భాగంగా, కలియుగంలో ఆంధ్రదేశంలోని తూర్పుగోదావరి జిల్లాలో అన్నవరానికి దగ్గరగా ఉన్న శ్రీ పీఠికాపురం (పిఠాపురం) అనే గ్రామంలో శ్రీపాద శ్రీవల్లభులుగా దత్తప్రభువు తన ప్రపధమ అవతారాన్ని ప్రకటించారు.

శ్లో ఈఈ కృతే జనార్ధనో దేవః
త్రేతాయాం రఘునందనః
ద్వాపరే రామకృష్ణాచ
కలౌ శ్రీపాద వల్లభః

తా ఈఈ కృత యుగములో జనార్ధనుడు,త్రేతా యుగములో రాముడు,ద్వాపర యుగములోకృష్ణుడు,కలి యుగములో శ్రీపాద శ్రీవల్లభుడు అవతార పురుషులని ఆది గురువు వేదవ్యాస మహర్షి తమ భవిష్యపురాణంలో తెలియజేసారు 

విజయ్ మహావాది నుంది సేకరణ 

Tuesday, December 3, 2013

సంపదలు, సుఖసంతోషాలు ప్రసాదించే శ్వేతార్క గణపతి పూజా విధానంసంపదలు, సుఖసంతోషాలు ప్రసాదించే శ్వేతార్క గణపతి


 (Swetarka Ganapati)

శ్వేతార్క మూలం (తెల్ల జిల్లేడు వేరు)లో వినాయకుడు నివశిస్తాడని ప్రతీతి. 
దీన్ని మనం పొందగలిగి, ఇంట్లో ప్రతిష్టించుకోగలిగితే సుఖసంతోషాలు పొందగలం. 
కొన్ని తెల్ల జిల్లేడు వేళ్ళు అచ్చం గణేశుని ఆకారంలో కనిపిస్తాయి. 
నేపాల్ లో ముఖ్యంగా హిమాలయ ప్రాంతంలో మనకు కనిపించే వివిధ రకాల వనమూలికలలో ఈ శ్వేతార్కం ఒకటి. 
ఇది రాజస్థాన్ లోని కొన్ని ప్రాంతాలలోనూ మనకు దొరుకుతుంది. 
ఈ చెట్టు ఆకులు ఆకుపచ్చగా,పూలు చిన్నవిగా, నీలం రంగుతో ఉంటాయి, అయితే ఇవి చాలా అరుదుగా మాత్రమే దొరుకుతాయి. 
ఈ శ్వేతార్క మూలాన్ని వెలికి తీసి, మట్టిని కడిగివేసి, నీళ్లలో నానబెట్టి జాగ్రత్తగా పరిశీలించినట్టయితే 
ఆ వేళ్ల మీద గణపతి ఆకృతి కనిపిస్తుందని చెబుతారు. 
ఈ గణపతిని తంత్రశాస్త్రంలో శ్వేతార్క గణపతి అని అంటారు. 
శ్వేతార్క గణపతి గురించి ప్రస్తావనలు, వివరణలు మనకు అనేక గ్రంథాలలో కానవస్తాయి. 
శ్వేతార్క గణపతిని ఇంట్లో ప్రతిష్టించుకునేందుకు సరైన ముహూర్తాన్ని నిర్ణయించుకోవాలి. 
కుటుంబ పురోహితుల్ని సంప్రదించి, వారి సలహా మేరకు ముహూర్తం పెట్టించుకోవాలి. 
వినాయక చవితి పండుగ రోజున ఈ శ్వేతార్క గణపతిని ప్రతిష్టించి పూజ చేసుకోవాలి. 
పుష్యమీ నక్షత్రం ఉన్న ఆదివారం శ్వేతార్క గణపతిని ప్రతిష్టించుకునేందుకు సర్వశ్రేయస్కరం, 
ఈ రోజును ‘రవి పుష్యయోగ’ దినంగా పేర్కొంటారు.

  పూజా విధానం

శ్వేతార్క మూలగణపతిని శుద్ధమైన నీతితో కడిగి, తర్వాత దానిపై ఎర్రని వస్త్రం మీద పెట్టి పూజ చేయాలి. 
పూజలో ఎర్ర చందనం, అక్షతలు, ఎర్రపూలు సింధూరం ఎరుపు రంగు ఉండే వస్తువులే ఎక్కువగా వాడాలి. 
ధూపదీప నైవేద్యాలు సమర్పించాలు. 
వీటితో ఒక నాణాన్ని దక్షిణగా సమర్పించి తర్వాత ఈ దిగువ ఇచ్చిన మంత్రాలలో ఏదో ఒక మంత్రంతో గణేశుని పూజ చేయాలి. 

ఓం గం గణపతయే నమః

ఓం గ్లౌం గణపతయే నమః

ఓం శ్రీ గణేశాయ నమః

ఓం శ్రీ ఫాలచంద్రాయ నమః

ఓం ఏకదంతాయ నమః

ఓం లంబోదరాయ నమః

మంత్ర జప ఆరంభానికి ముందే ఎన్ని సార్లు మంత్ర పఠనం చేసేది సంకల్పం చెప్పుకోవాలి. 
మంత్ర జపం చేసే సమయంలో ఎర్రని జపమాల, రుద్రాక్షమాల వాడడం మంచిది. 
ప్రతి జపమాలలోనూ 108 గింజలు ఉంటాయి. 
ఒకసారి అన్ని గింజలు లెక్కిస్తూ పూజ చేస్తే 108 సార్లు జపం చేసినట్టవుతుంది. 
అలా పది సార్లు జపమాల చెయ్యడమంటే వెయ్యి సార్లు నామ జపం అవుతుంది. 
ఈ విధంగా ఎన్ని జపమాలలు పూజ చేయాలనుకుంటారో ఆ ప్రకారం చేయాలి. 
శ్వేతార్క గణపతిని సాక్షాత్తూ గణపతిగా భావించి పూజలు చేస్తారో వారికి జ్ఞాన సంపద సురక్ష సుఖశాంతులు లభిస్తాయి.
శ్వేతార్క మూలానికి వశీకరణశక్తి ఉంటుందిట, 
ఏదైనా శుభముహూర్తాన శుచియైన తర్వాత ఆవునెయ్యి, గోరోజనం సిద్ధంగా ఉంచుకుని, 
ఈ ఆవునెయ్యి గోరోజనంలో శ్వేతార్క మూలాన్ని గంథంలాగా అరగదీసి 
ఇష్టదైవాన్ని మనసులో ప్రార్ధిస్తూ నుదుటి మీద తిలకం వలె ధరిస్తే ఆ తిలకానికి ఉన్న వశీకరణ శక్తి స్వయంగా అనుభవంలోకి వస్తుంది. 
ఇక శరీర రక్ష కోసం శ్వేతార్క మూలాన్ని చిన్నదిగా తీసుకుని భుజం మీద లేదా కంఠంలో ధరించడం వల్ల ఆరోగ్య రక్ష కలుగుతుంది. 
భూత ప్రేత పిశాచాల భయం, నరుల దిష్టి వంటి హాని కలగకుండా ఇది కాపాడుతుంది.
శ్వేతార్క గణపతిని పూజా గృహంలో పెట్టుకుని దాని ముందు ప్రతిరోజూ ఓం గం గణపతియే నమః 
అని ఒక జపమాల జపించడం వల్ల జీవితంలో ఉన్నతి లభిస్తుంది. ధన ధాన్య సుఖ సౌభాగ్య వృద్ది కలుగుతుంది. 
దారిద్ర్య నివారణకు తరుణోపాయం శ్వేతార్క గణపతి జీవితంలో సర్వతోముఖాభివృద్ధి కోసం 
దిగివ చెప్పిన మంత్రాన్ని ప్రతిరోజూ కనీసం ఒక జపమాల చేయాలి.

  మంత్రం

  ‘ఓం సమో విఘ్నహరాయ గం గణపతియే నమః’


 ఈ మంత్రాన్ని 5 జపమాలలు పఠించిన తర్వాత 
పూజ సామగ్రిని శ్వేతార్క గణపతి సహితంగా ఒక ఎర్రని వస్త్రంలో చుట్టి, 
గణేశ చతుర్ధి రోజున మీ సమీపంలో గణేశాలయంలో దానిని గణేశుని చరణాల వద్ద సమర్పించండి. 
భక్తి పూర్వకంగా నమస్కరించి, శ్వేతార్క మూలాన్ని భస్మం చేసి 
దానిని తిలకంగా నుదుటి మీద ధారణ చేయడం వల్ల లక్ష్మీ ప్రసన్నం కూడా కలుగుతుంది.
sundarpriya 
తెలుగువన్ మూలంగా సెకరించినది 

Monday, December 2, 2013

శ్రీ కాల భైరవాష్టకం


శ్రీ కాల భైరవాష్టకం

దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం
వ్యాళయజ్ఞ సూత్ర మిందు శేఖరం కృపాకరం
నారదాది యోగిబృంద వందితం దిగంబరం
కాశికాపురాధినాధ కాలభైరవం భజే

భానుకోటి భాస్వరం భవాబ్ధితారకం పరం
నీలకంఠ మీప్సితార్ధదాయకం త్రిలోచనం
కాలకాల మంబుజాక్ష మక్షశూల మక్షరం
కాశికాపురాధినాధ కాలభైరవం భజే

శూలటంక పాశ దండమాది కారణం
శ్యామకాయ మాదిదేవ మక్షరం నిరామయం
భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవ ప్రియం
కాశికాపురాధినాధ కాలభైరవంభజే

భుక్తి ముక్తి దాయకం ప్రశస్త చారు విగ్రహం 
భక్తవత్సలం స్థితం సమస్త లోక నిగ్రహం
నిక్వనణ్మనోజ్ఞ హేమ కింకిణీలసత్కటిం 
కాశికాపురాధినాధ కాల భైరవం భజే

ధర్మసేతు పాలకం త్వధర్మ మార్గ నాశకం
కర్మ పాశమోచకం సుశర్మ దాయకం విభుం
స్వర్ణవర్ణ కేశపాశ శోభితాంగ మండలం
కాశికాపురాధినాధ కాలభైరవం భజే

రత్న పాదుకా ప్రభాభిరామ పాదయుగ్మకం
నిత్య మద్వితీయ మిష్టదైవతం నిరంజనం
మృత్యుదర్శనాశనం కరాళదం ష్ట్ర భీషణం
కాశికాపురాధినాధ కాల భైరవం భజే

అట్టహాస భిన్న పద్మ జాండకోశ సంతతిం
దృష్టి పాతనష్ట పాపతజాల ముగ్రనాశనం
అష్టసిద్ధి దాయకం కపాలమాలికా ధరం 
కాశికాపురాధినాధ కాల భైరవం భజే

భూత సంఘనాయకం విశాల కీర్తి దాయకం
కాశివాసి లోక పుణ్యపాప శోధకం విభుం
నీతిమార్గ కోవిదం పురాతనం జగత్ప్రభుం
కాశికాపురాధినాధ కాల భైరవం భజే

కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం
జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్ధనం
శోక మోహ దైన్యలోభ కోపతాప నాశనం
తే ప్రయాంతి కాలభైరవాంఘ్రి సన్నిధిం ధ్రువం

ఫలం: మనశ్శాంతి, ఆధ్యాత్మిక జ్ఞానం

Sunday, December 1, 2013

గోపూజతో నవగ్రహశాంతి
గోపూజతో నవగ్రహశాంతి 
................................

జాతకరీత్యాగానీ, గోచారరీత్యాగానీ గ్రహ దోషాలు గల వారు 
నవధాన్యాలు గోవులకు పెట్టడం వలన ఆ దోషాలన్నీ పటాపంచలవుతాయి. 

ధాన్యాన్ని నానపెట్టి ఆయా వారాల్లో పెట్టిన ఆ గ్రహదోషాలు తొలుగుతాయి.

సూర్యునికి గోధుమలు, చంద్రునికి బియ్యం, కుజునికి కందులు, బుధునికి పెసలు , 
గురువుకి సెనగలు, శుక్రునికి బొబ్బర్లు, శనికి నువ్వులు, 
రాహువుకు మినుములు, కేతువుకు ఉలవలు ప్రీతికరమైన ధాన్యాలుగా గుర్తెరగాలి

నానపెట్టబడిన ధాన్యాలు గోవుకు సమర్పించినందున 
ఆయా గ్రహాల అనుకూలత,అనుగ్రహం మనకు నిస్సందేహంగా కలిగి తీరుతాయి.

పూర్వాకాలంలో మనకు గోవులే ధనం. మన జీవితాలన్నీ గోవుతోనే ముడిపడి ఉండేవి. 

దక్షిణలు, అరణాలు, కానుకలు, గోవురూపంలోనే నాడు ఇవ్వబడేవి. 

గోవు ప్రత్యక్ష దైవం. గోసేవా వ్రతాన్ని చేసి అభీష్ట సిద్ధిని పొందేవారు. 

ప్రాచీనాచార్యులు గోసంరక్షణలో చూపిన శ్రద్ధా భక్తులు అపారం. 

ఆవు నెయ్యి పవిత్రమైన హోమద్రవ్యం. 
యాగాలు చెయ్యటానికి ఆవు నెయ్యి, ఆవు పెరుగు, ఆవు పాలు, ఎంతో అవసరం. 

దానికి వారు ఆవులను ఎంతో శ్రద్ధగా పెంచేవారు. 

గోమూత్రం, పేడ, గోఘృతం, పెరుగు, పాలు "పంచగవ్యాలు"గా ప్రసిద్ధం.

"యత్త్వగస్ధి గతం పాపం దేహే తిష్టతి మామకే!
ప్రాశనం పంచగవ్యస్య దంహాత్యగ్నిరివేంధనమ్!!

అంటే, మన శరీరాన్ని ఎముకలను, అంటి పెట్టుకొని ఉన్న ఏ దోషమైనా , 
పంచగవ్యాలను ఆస్వాదించుట వల్ల అగ్నిచే కట్టెలు దహింపబడినట్లు నశించి పోతుందని అర్థం. 
పంచగవ్య ప్రాశస్త్యం , గోపవిత్రత దీని ద్వారా మనకు తెలుస్తుంది. 
సర్వ దేవతలు గోవు శరీరంలో కలవు. అందుకే మనకు గోవు ఆరాధ్య దేవత.
SunderPriya


దీపం లక్ష్మీదేవి రూపం


దీపం లక్ష్మీదేవి రూపం

దీపం జ్యోతి పరబ్రహ్మమ్ దీపం జ్యోతి పరాయణమ్ 
దీపేన హారతే పాపమ్ దీప దేవి నమోనమః

దీపం పరబ్రహ్మ స్వరూపం. వెలుగుతున్న వత్తి ప్రకాశాన్ని ఇస్తుంది. ఆ కాంతి వలయం అందరిదీ. 
దీపం పాప ప్రక్షాళన చేస్తుంది. దీపానికి ఒక అద్భుతమైన శక్తి ఉంది. అదే..అంధకారాన్ని పటాపంచలు చేయడం. 
అంధకారమంటే కేవలం చీకటిగా ఉండడమే కాదు..మనసులోని అజ్ఞానం కూడా అంధకారమే! 
ఈ అంధకారాన్ని పటాపంచలు చేసి జ్ఞానాన్ని ప్రసాదించే మాత లక్ష్మీదేవి. ఈ అద్భుతశక్తి కలిగి ఉన్న దీపానికి ప్రతీకే లక్ష్మీదేవి. 
కాబట్టే దీపానికి మనం నమస్కరిస్తున్నాము. దీపానికి నమస్కరించడమే కాదు. 
నమస్కరించి ప్రదక్షిణలు చేసి, పండుగలు చేసుకుంటున్నాం. దీపావళి ఇటువంటి పండుగేకదా!

ఈ దృష్టితో చూస్తే దీపానికి ఎంతో ప్రాధాన్యత ఉంది కాబట్టే..ఏ పని ప్రారంభించాలన్నా దీపం వెలిగించి ప్రారంభిస్తాం. 
దైవారాధననూ దీపం వెలిగించే ప్రారంభిస్తాం. దీపారాధన చేయకుండా అసలు ఏ పుణ్యకార్యం చేయరు. 
దీపానిది ఎప్పుడూ ఊర్ధ్వదృష్టే. అధో దృష్టి దానికిలేదు. అంటే కిందకి చూడదు. ఎప్పుడూ పైకే చూస్తూ వెలుగుతుంది. 
మన మనసు ఊర్ధ్వ జగత్తుపైనే లగ్నం కావాలని చెబుతుంటుంది దీపం. 
ఇక్కడ ఊర్ధ్వ జగత్తు అంటే కేవలం స్వర్గ లోకం మాత్రమే కాదు. జీవితంలో ఎదుగుదల అని. 
ఎన్ని కష్టాలు వచ్చినా, ఆశావాదంతో జీవిస్తూ, 
శక్తివంతమైన దీపాన్ని దైవారాధన చేసే సమయంలో కొన్ని సూత్రాలు పాటిస్తూ దేవుని వద్ద ఉంచాలి. 
అమ్మవారి పూజలో నూనె దీపాన్ని ఎడంవైపు, ఆవు నెయ్యి దీపాన్ని కుడివైపు వెలిగించాలి. 
జపం చేసేటప్పుడు జపమాలపై వస్త్రం కప్పి ఉంచాలి. మాల బయటకు కనిపించకూడదు. 
దీపం శివునికి ఎడంవైపు, విష్ణువుకు కుడివైపు ఉండాలి. ఏ దైవానికైనా దీపం ఎదురుగా మాత్రం ఉంచరాదు.
teluguone nundi sekarinchinadi
SunderPriya

Thursday, November 28, 2013

శ్రీ శైలేశ భ్రమరాంబా స్తుతిః

1::నమ శ్శివాభ్యాం నమయౌవ నాభ్యాం 
పరస్పరాశ్లి ష్టవ పుర్ద రాభ్యామ్ 
నాగేంద్ర కన్యావృషకేత నాభ్యాం 
నమోనమ శ్శంకర పార్వతీ భ్యామ్  

2::నమశ్శి వాభ్యాం వృష వాహనాభ్యాం 
విరించివిష్ణ్వింద సుపూజితాభ్యామ్ 
విభూతిపాటీ రవిలేప నాభ్యాం
నమో నమశ్శంకర పార్వతీ భ్యామ్ 

3::అనఘం జనకం జగతాం ప్రధమం 
వరదం కర శూలధరం సులభమ్ 
కరుణాంబునిధం కలుషా పహరం 
ప్రణమామి మహేశ్వర మేక మహామ్ 

4::అమలం కమలో ద్భవగీత గుణం 
శమదం సమదాసుర నాశకరమ్ 
రమణీయ రుచం కమనీయతనుం 
నమ సాంబ శివం నత పాపహరమ్ 

5::శివం శంకరం బంధురం సుందరేశం 
నటేశం గణేశం గిరీశం మహేశమ్ 
దినేశేందునేత్రం సుగాత్రం మృడానీ 
పతిం శ్రీగిరీశం హృదాభావయామి  

6::భ్రంగీచ్చా నటనోత్కటః కరిమద గ్రాహీస్ఫురన్మాధవా
హ్లాదో నాదయుతో మహాసితవపుః పంచేషుణాచాదృతః 
సత్పక్ష స్సుమనో వనేషుస పున స్సాక్షాన్మదీయే మనో 
రాజీవే భ్రమరాధ పోవిహరతాం శ్రీ శైలవాసీ విభుః   

7::సోమోత్తం సస్సుర పరి షదా మేష జీవాతు రీశః 
పాశచ్చేత్తా పద యుగ జుషాం పుల్ల మల్లీ నీకాశః 
ధ్యేయో దేవః ప్రకటి తవధూ రూపనామాత్మభాగః 
శ్రీ శైలాగ్రే కలితవ సతి ర్విశ్వరక్షాధురీణః  

8::ఏణం పాణౌ శిరసిత రుణో ల్లాసమేణాంక ఖండం 
పార్శ్వే మామేవ పుషి తరుణీం దృక్షు కారుణ్యలీ లాం 
భూతిం ఫాలే స్మిత మపి ముఖే గాంగ మంభః కపర్దే 
బిభ్రత్ప్రేమ్ణా భువన మఖిలం శ్రీ గిరీశస్స పాయూత్    

9::శ్రీశైలే స్వర్ణ శృంగేమణి గణరచితే కల్ప వృక్షాళిళీతే 
స్ఫీతే సౌవర్ణ రత్నస్ఫురిత నవగృహే దివ్య పీటే శుభార్షే 
ఆసీన స్సోమచూడ స్సకరుణన యన స్సాంగన స్స్మేర వక్త్రః 
శంభుః శ్రీభ్రా మరీశః ప్రకటిత విభవో దేవతాసార్వ భౌమః    

10:యాయోగి బృంద హృద యాంబుజరాజ హంసీ 
మంద స్మిత స్తుత ముఖీ మధు కైటభఘ్నీ 
విఘ్నాంధ కారతట భేద పటీయసీసా 
మూర్తిః కరోతు కుతుకం భ్రమరాంబి కాయాః 

11:కస్తూరీ తిలకాంచితేందువిలస త్ప్రోద్భా సిఫాల స్థలీం 
కర్పూర ద్రవమిశ్ర చూర్ణ ఖపురా మోదోల్ల సద్వీటికాం 
లోలాపాంగ దరంగి తైరధ కృపా సారైర్నతానంది నీం 
శ్రీశైలస్థల వాసినీం భగవతీం శ్రీమాతరం భావయే  

12:రాజన్మత్త మరాళ మంద గమనాం రాజీవ పత్రేక్షణాం 
రాజీవ ప్రభ వాది దేవమకుటై రాజత్పదాంభోరుహామ్ 
రాజీవవాయ పుత్ర మండి తకుచాం రాజాధ రాజేశ్వరీం 
శ్రీశైలస్థల వాసినీం భగవతీం శ్రీమాతరం భావయే    

13:శ్రీ నాధాదృత పాలిత త్రిభువనాం శ్రీ చక్ర సంచారిణీం 
గానా సక్త మనోజ్ఞ యౌవనలస ద్గంధర్వక న్యాదృతామ్ 
దీనానా మతివేల భాగ్య జననీం  దివ్యాంబరాలంకృతాం 
శ్రీశైలస్థల వాసినీం భగవతీం శ్రీమాతరం భావయే 

14:ఉభౌదర్వీకుంభౌ మణి కనక సంభావిత గుణౌ 
దధానా పాణిభ్యా మమృతర సమృతర సమృష్టాన్నకలితౌ 
కలాడ్యా కల్యాణీ కలిత సదనా శ్రీగిరిశిర 
స్యసౌ భ్రామర్యంబా రచయతు మదిష్టార్ద విభవమ్ 

ఇతి శ్రీ శైలేశ భ్ర మరాంబాస్తుతిః

శ్రీ విఘ్నేశ్వరాష్టోత్తర శతనామస్తోత్రం1::వినాయకో విఘ్నరాజో గౌరీపుత్రో గణేశ్వరః 
   స్కందాగ్రజోవ్యయః పూతో దక్షోక్షో ద్విజప్రియః 

2::అగ్నిగర్వచ్ఛిదింద్రశ్రీప్రదో వాణీప్రదోవ్యయః
   సర్వసిద్ధిప్రదశ్శర్వతనయః శర్వరీప్రియః 

3::సర్వాత్మకః సృష్టికర్తా దేవోనేకార్చితశ్శివః 
   శుద్ధో బుద్ధిప్రియశ్శాంతో బ్రహ్మచారీ గజాననః 

4::ద్వైమాత్రేయో మునిస్తుత్యో భక్తవిఘ్నవినాశనః 
   ఏకదంతశ్చతుర్బాహుశ్చతురశ్శక్తిసంయుతః 

5::లంబోదరశ్శూర్పకర్ణో హరర్బ్రహ్మ విదుత్తమః 
   కాలో గ్రహపతిః కామీ సోమసూర్యాగ్నిలోచనః 

6::పాశాంకుశధరశ్చండో గుణాతీతో నిరంజనః 
   అకల్మషస్స్వయంసిద్ధస్సిద్ధార్చితపదాంబుజః 

7::బీజపూరఫలాసక్తో వరదశ్శాశ్వతః కృతీ 
   ద్విజప్రియో వీతభయో గదీ చక్రీక్షుచాపధృత్ 8::శ్రీదోజ ఉత్పలకరః శ్రీపతిః స్తుతిహర్షితః 
   కులాద్రిభేత్తా జటిలః కలికల్మషనాశనః 

9::చంద్రచూడామణిః కాంతః పాపహారీ సమాహితః 
   అశ్రితశ్రీకరస్సౌమ్యో భక్తవాంఛితదాయకః 

10:శాంతః కైవల్యసుఖదస్సచ్చిదానందవిగ్రహః 
   జ్ఞానీ దయాయుతో దాంతో బ్రహ్మద్వేషవివర్జితః 

11:ప్రమత్తదైత్యభయదః శ్రీకంఠో విబుధేశ్వరః 
   రమార్చితోవిధిర్నాగరాజయజ్ఞోపవీతవాన్ 

12:స్థూలకంఠః స్వయంకర్తా సామఘోషప్రియః పరః 
   స్థూలతుండోగ్రణీర్ధీరో వాగీశస్సిద్ధిదాయకః 

13:దూర్వాబిల్వప్రియోవ్యక్తమూర్తిరద్భుతమూర్తిమాన్ 
   శైలేంద్రతనుజోత్సంగఖేలనోత్సుకమానసః 

14:స్వలావణ్యసుధాసారో జితమన్మథవిగ్రహః 
   సమస్తజగదాధారో మాయీ మూషకవాహనః 

15:హృష్టస్తుష్టః ప్రసన్నాత్మా సర్వసిద్ధిప్రదాయకః 
   అష్టోత్తరశతేనైవం నామ్నాం విఘ్నేశ్వరం విభుం 

16:తుష్టావ శంకరః పుత్రం త్రిపురం హంతుముత్యతః 
   యః పూజయేదనేనైవ భక్త్యా సిద్ధివినాయకమ్ 

17:దూర్వాదళైర్బిల్వపత్రైః పుష్పైర్వా చందనాక్షతైః 
   సర్వాన్కామానవాప్నోతి సర్వవిఘ్నైః ప్రముచ్యతే 

Wednesday, November 27, 2013

పంచ దేవతలు ఎవరు?


"మన హిందూ దేవాలయాలు,మరియు వాటి విశిష్టతలు''
పంచ దేవతలు ఎవరు? "పంచాయతనము" గురించి క్లుప్తంగా తెలుసుకుందాము:-
...........................................

ఆదిత్య మంబికా విష్ణుం గణనాథ మహేశ్వరమ్ 
సర్వేష్టం సారభూతం చ పంచదేవాయ సేవనమ్!! 
తాత్పర్యం:- 
................

సూర్యుడు, అంబిక , విష్ణు, గణపతి, ఈశ్వరుడు వీరినే పంచ దేవతలు అంటారు. వీరు కలియుగ పాపకర్మలు భరించలేక కొన్ని ప్రత్యేక శిలల్లో ఉన్నట్లు 'సిద్ధాంత శేఖరంలో' చెప్పబడినది. ఆ శిలలో మాత్రమే ఆ దేవతా విగ్రహాలను మలచి పూజలు సల్పిన సత్ఫలితము లొసంగును. దేవతా పూజా నిరాటంకముగా (ఆటంకం లేకుండా) సాగగలదు. పంచదేవతా పూజ చాలా ప్రశస్తమని 'దేవీ భాగవతము' నందు కలదు. కలియుగ ధర్మాన్ని అనుసరించి ఈ అయిదుగురు దేవతలు ఆయా సాల గ్రామ శిలలోనే ఉంటారట. 
1) సాల గ్రామ లింగం (విష్ణువు):-
............................................ 

ఈ శిలలు నేపాలులో ముక్తినాథ దగ్గర గండకీ నది యందు లభించును. ఈ శిలలు చిన్న చిన్న రంధ్రములు కలిగి ఉంటాయి. నీటిలో రాయి వేసి తులసీ దళం వేసిన ఆ రంధ్రానికి దగ్గరగా తులసి చేరునట. విష్ణువుని మధ్యలో పెట్టి మిగతా దేవతా విగ్రహాలు శాస్త్ర ప్రకారము పెట్టిన, అది విష్ణు పంచాయతన మందురు. అట్లు పూజించిన వారికి విష్ణు సాయుజ్యము కలుగునని పద్మ పురాణంలో గలదు. 
2)బాణ లింగం(శివుడు):- 
.................................

మధ్యప్రదేశ్ లో ఓంకారేశ్వర్ దగ్గర నర్మదానదిలో లభించును. బాణలింగ సహిత రుద్రుని పూజించుట వల్ల ఆత్మజ్ఞానం లభించును. బాణలింగ సహిత రుద్రుణ్ణి మధ్యలో పెట్టి పూజించిన శివాపంచాయతనమందురు.
3)స్ఫటిక లింగం (సూర్యుడు):- 
.......................................

ఈ స్ఫటికలింగాలు తంజావూరు దగ్గర కావేరీ నదిలో లభించును. ఆదిత్యం ఆరోగ్యం అన్నట్లు సూర్య పూజ వల్ల ఆరోగ్యం లభించును. సూర్యుని మధ్యలో పెట్టి పూజించిన సూర్య పంచాయతనమందురు. 
4)అంబికా లింగం (అంబిక):- 
....................................

ఈ లింగములు ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ కాళహస్తి దగ్గర గల సువర్ల ముఖీనదిలో దొరుకును. అంబికాలింగ సహిత పూజసల్పిన భోగం లభించునని సిద్ధాంత శేఖరంలో గలదు. దేవీస్తానమందు దుర్గనుగాని, లక్ష్మినిగాని, సరస్వతిని గాని, శక్తి శ్రయాన్ని అర్చించవచ్చు. 
5)శోణలింగం (గణపతి):-
................................

ఉత్తరప్రదేశ్ లోని శోణభద్ర జిల్లాలో యున్న నదిలో కల శిలలు మైనాక పర్వతం నుండి ఉత్తరంగా వచ్చి గంగలో కలియుచున్నది.(పాట్నా వద్ద) ఈ శోణలింగ సహిత గణపతి పూజ వల్ల కార్యములు నిర్విఘ్నముగా నెరవేరును. గణపతిని మధ్యలో పెట్టి ఉంచిన గణపతిపంచాయతన మందురు.