Sunday, October 30, 2011

నాగులచవితి--30:10:2011












పాముని చూడగా బెదిరి పాకిన చోటన మంత్ర అక్షతల్
భూమిని చల్లగా విషము పోవును లొంగును భక్తికిన్‌ మరిం
పాములు దుష్ట జంతువని భావము మాత్రమే కాని తప్పదే
కామిత సంతతిచ్చరయగా అవిదేముడే ! కొల్వుడీప్రజల్‌.


దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చవితిని "నాగులచవితి " పండుగ అంటారు. ఇంతకీ, ఈ విషనాగులను మనం పూజించటమేమిటి ? అన్నప్రశ్న వెంటనే తలెత్తుతుంది చాలామందిలో. ఈ పండుగలోని ఆంతర్యమేమిటో ఒక్కసారి పరిశీలిద్దాము.

ప్రకృతికి-జీవికి మధ్య మనకు ఎంతో అవినావ భావ సంబంధము కనిపిస్తూ ఉంటుంది. మనం నిశితంగా పరిశీలించ గలిగితే ప్రకృతినుండి మానవుడు తనకు కావలసింది పొందుతూ తిరిగి ఆ ప్రకృతిని సంరక్షించుకునే బాధ్యతను కూడా నాటి ఆటవిక స్ధాయినుండి, నేటి నాగరిక సమాజం వరకూ ఆ ప్రకృతిని దైవ స్వరూపంగా మానవులు భావించి సంరక్షించుకుంటూ ఉన్నంతకాలం సమస్త మానవకోటికి మరియు జీవకోటి మనుగడకు ముప్పుమాత్రం వాటిల్లదు. ఆ ప్రకృతిని మానవుడు చేజేతులారా కనుక నాశనం చేసుకుంటే ఇటు మానవకోటికి అటు జీవకోటికి తప్పక వినాశానికి దారితీస్తుందను భావముతో నేడు "ప్రకృతి పర్యావరణ రక్షణ" అంటూ పలుకార్యక్రమాలు చేబడుతోంది నేటి సమాజం.

అలా 'ప్రకృతి' మానవ మనుగడకు జీవనాధారమైనది కనుక దానిని దైవస్వరూపంగా భావించి ఆనాటి నుండి నేటివరకూ చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని - ఇలా సమస్త ప్రాణికోటిని దైవస్వరూపంగా చూసుకుంటూ! పూజిస్తూ వస్తున్నారు. అదే మనభారతీయ సంస్కృతిలోని విశిష్టత. నిశితంగా మనం పరిశీలిస్తే... అందులో భాగంగానే 'పాము'ను కూడా నాగరాజుగా, నాగదేవతగా, పూజిస్తూ వస్తున్నారు.

ఈ పాములు భూమి అంతర్భాభాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా, సమస్త జీవకోటికి "నీటిని" ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనంచేసే క్రిమికీటకాదులను తింటూ, పరోక్షంగా 'రైతులకు' పంటనష్టం కలుగకుండా చేస్తాయిట! అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి.

పైన చెప్పిన విధంగా సర్పం పేరు చెపితేనే బెదిరిపోతూ ఉంటాము. కాని అంతకంటే భయంకరమైన మానవులు మనలోనే ఉన్నారు.

తలనుండు విషము ఫణికిని, వెలయంగా తోకనుండు వృశ్చికమునకున్‌

తలతోకయనక యుండు ఖలునకు నిలువెల్ల విషము గదరాసుమతీ! అని చెప్పినట్లు...!

అలా! మనచుట్టూ మానవరూపంలో ఉండే మానవులు; సర్పజాతి మనసుకంటే; నికృష్టమైన (అంటే! అవి మనంవాటి జోలికి వెళితేనే ప్రమాదకరమవుతాయి.), వాటికంటే భయంకరమైన మానవ సర్పాలు మనచుట్టూ తిరుగుతున్నా గమనించలేక పోతున్నాం! అని గ్రహించుకోవలసి ఉంది.

అలా మనకంటికి కనబడే విషనాగుపాముకంటే మానవ శరీరమనేపుట్టలో నిదురిస్తున్న నాగుపాము మరింత ప్రమాదకరమని చెప్తారు. ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే (నవరంధ్రాలు) అంటూ ఉంటారు. మానవశరీరంలో నాడులతో నిండివున్న "వెన్నుబాము" అంటారు. అందు కుండలినీశక్తి మూలాధారచక్రంలో 'పాము' ఆకారమువలెనే వుంటుందని 'యోగశాస్త్రం' చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ! కామ, క్రోధ, లోభ, మోహ, మధ, మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ, మానవునిలో 'సత్వగుణ' సంపత్తిని హరించి వేస్తూ ఉంటుంది. అలా 'నాగులచవితి రోజున ప్రత్యక్షంగా విషసర్పపుట్టను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే, మానవునిలో ఉన్న "విషసర్పం" కూడా శ్వేతత్వం పొంది, మన అందరి హృదయాలలో నివశించే "శ్రీమహావిష్ణువు"నకు తెల్లని ఆదిశేషువుగా మారి "శేషపాన్పుగా" మారాలనే కోరిక తో చేసేదే ! ఈ నాగుపాముపుట్టలో పాలుపోయుటలోగల ఆంతర్యమని చెప్తారు.

దీనినే జ్యోతిష్య పరంగా చూస్తే! కుజ, రాహు దోషాలున్నవారు, సాంసారిక బాధలున్నవారు, ఈ కార్తీకమాసంలో వచ్చే షష్టీ, చతుర్దశిలలో మంగళవారము నాడుగాని, చతుర్దశి బుధవారం కలసివచ్చే రోజుకాని దినమంతా ఉపవాసము ఉండి ఈ దిగువ మంత్రాన్ని స్మరిస్తూ!


పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయ
సత్సంతాన సంపత్తిం దేహిమే శంకర ప్రియ!
అనంతాది మహానాగ రూపాయ వరదాయచ
తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహిమే సదా !


అలా! ఆవు పాలు పుట్టలో పోసి నాగపూజచేసి చలిమిడి, చిమ్మిలి, అరటిపళ్ళు మున్నగునవి నివేదన చేస్తారు. ఆ సందర్భంగా పుట్టవద్ద 'దీపావళి నాటి మిగిలిన మతాబులు, కాకరపువ్వొత్తులు టపాసులు చిన్నారులు ఎంతో సంతోషంగా కూడా కాలుస్తారు. ఇలా స్త్రీలు ఆరాధిస్తే శుభప్రదమైన సుఖసంతానము; అదే కన్నె పిల్లలు ఆరాధిస్తే! మంచి భర్త లభించునని పలువురి విశ్వాసము.

ఈ విధమైన నాగుల ఆరాధన ఈనాటిదికాదు. యుగాలనాటిది. సౌభాగ్యానికి, సంతానప్రాప్తికి సర్పపూజ చేయుట అనేది లక్షల శరత్తులనాడే ఉన్నట్లు మన పురాణాలలో ఎన్నో గాధలు కానవస్తున్నాయి. దేశమంతట పలు దేవాలయాల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ "నాగులచవితి" నాడు నాగేంద్రుని శివభావముతో అర్చిస్తే సర్వరోగాలు పటాపంచలై సౌభాగ్యవంతులవుతారని ఋషివచనం.

నాగేంద్రా! మేము మా వంశములోవారము నిన్ను ఆరాధిస్తున్నాము. పొరపాటున"తోకతొక్కితే తొలగిపో. నడుంతొక్కితే నా వాడనుకో! పడగ త్రొక్కితే కస్సుబుస్సుమని మమ్ములను భయపెట్టకు తండ్రీ! అంటూ పుట్టకు ప్రదక్షిణ నమస్కరాలు చేయాలని పెద్దలు చెప్తూ ఉంటారు.

ఈ నాగులచవితిరోజున ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తే కలిదోష నివారణ అవుతుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.


"కర్కోటకస్య నాగస్య దయయంత్యా నలస్య చ |
ఋతుపర్ణస్య రాజర్షే : కీర్తనం కలినాశనమ్‌ ||


ఈ సర్పారాధనకు తామరపూలు, కర్పూరంపూలు, లడ్డు మున్నగునవి ప్రీతికరమని చెప్తారు. సర్పారాధనచేసే వారి వంశం 'తామరతంపరంగా' వర్ధిల్లు తుందని భవిష్య పురాణం చెప్తోంది. మన భారతీయుల ఇళ్లల్లో ఇలవేల్పు సుబ్రహ్మణేశ్వరుడే! ఆయన అందరికీ ఆరాధ్య దైవంకాబట్టి వారి పేరును చాలామంది నాగరాజు, ఫణి, సుబ్బారావు వగైరా పేర్లు పెట్టుకుంటూ ఉంటారు.

నాగర్కోయిల అనే ఊరిలో నాగుపాము విగ్రహం ఉందిట! దాని సమీపంలో 6నెలలు తెల్లని ఇసుక, 6నెలలు నల్లని ఇసుక భూమిలో నుండి ఉబికి ప్తెకివస్తుందని భక్తులు చెప్తూ ఉంటారు. నాగుపాము కుబుసానికి కూడా మంచి ఆయుర్వేద గుణాలు ఉన్నాయని, గరళాన్ని ఆయుర్వేద మందులలో తగుమోతాదులలో ఉపయోగిస్తారని ఆయుర్వేదశాస్త్రం చెబుతుంది. ఇలా ప్రకృతిలో "నాగు పాములకు, మానవ మనుగడలకు అవినాభావ సంబంధం కలదని విదితమవుతుంది.

ఇట్టి ఈ "నాగులచవితి" పండుగను విశేషంగా జరుపుకుని పునీతులమవుదాము.


Thursday, October 13, 2011

ధన దేవతా స్తోత్రం
















ధన దేవతా స్తోత్రం

నమః సర్వ స్వరూపేచ నమః కళ్యాణదాయని
మహా సంపత్ ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే 
మహా భోగప్రదే దేవి ధనదాయై నమోస్తుతే 
సుఖ మోక్ష ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే 
బ్రహ్మ రూపే సదానందే సదానంద స్వరూపిణి
దృత సిద్ధి ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే
ఉద్యత్ సూర్య ప్రకాశా భేఉద్య దాదిత్య మండలే 
శివతత్త్వం ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే
విష్ణు రూపే విశ్వమతే విశ్వపాలన కారిణి
మహాసత్వ గుణే సంతే ధనదాయై నమోస్తుతే 
శివరూపే శోవానందే కారణానంద విగ్రహే 
విశ్వ సంహార రూపేచ ధనదాయై నమోస్తుతే 
పంచతత్త్వ స్వరూపేచ పంచాశద్వర్ణదర్శితే 
సాధకాభీష్టదే దేవి ధనదాయై నమోస్తుతే 

::: ధనసంపదనిచ్చే మంత్రం :::

కుబేరత్వం ధనాదీశ గృహతే కమలా స్థితా తాందేవం 
తేషయా సునమృద్ధి త్వం మద్ గృహే తే నమో నమః

--- ఈ మంత్రాన్ని నిష్టగా రోజుకు 108 పర్యాయాల చొప్పున 21 రోజులు జపించాలి ---

Tuesday, October 11, 2011

శ్రీ హనుమాన్ వాల (తోక )ధ్యానం


వామే కారే వైరిభిదం వహంతం శూలం పారే శ్రుమ్ఖలం హార టంకం
దాదాన మచ్చాచ్య సువర్ణ వర్ణం భజే జ్వలత్కుమ్దల మామ్జనేయం
పద్మ రాగ మణి కుండల త్విషా పాటలీ కృత కపోల మండలం
దివ్య హేమ కదళీ వనామ్తరే భావ యామి పవ మాన నందనం
మండలీ కృత వాలాగ్రం స్వర్ణ వర్ణం మహా హనుం
కుమ్దలాలంక్రుతం శూరం భజే వాయు సుతం హృది .
---------------------------------------------------------------------------------------------------------------------

శ్రీ హనుమత్ అంగారక స్తుతి
——————————-
మహేశ్వర స్యానస స్యూత బిందుం –భూమౌజతం రక్త మాల్యామ్బరాధ్యం
సువర్చాసం లోహితాంగం కుమారం –కుజం సదాహం శరణం ప్రపద్యే .
---------------------------------------------------------------------------------------------------------------------

సాస్టాంగా నమస్కార స్త్రోత్రం
——————————
రామ దూత నమస్తుభ్యం సీతా శోక వినాశక
లక్ష్మణస్య ప్రాణ దాతా కూరు మద్వామ్చితం ఫలం –
వాయు నందన సుగ్రీవ సచివ ఆర్ణవ లంఘన
దుస్త రాక్షస దర్పఘ్న కూరు మద్వామ్చితం ఫలం
అంజనా గర్భ సంభూత లంకా ప్రాణ అపహారక
రావనోద్యాన విధ్వంశిన్ కూరు మద్వామ్చితం ఫలం
ప్రసన్నో భవ మే స్వామిన్ ప్రపన్నార్తి ప్రభంజన
త్వత్పాద సన్నిధిం ప్రాప్తం పాహిమాం కరుణాకర .

పైన వున్న నాలుగు శ్లోకాలు చదువుతూ అయిదు సార్లు సాస్టాంగా నమస్కారం చేస్తే
గొప్ప ఫలితం లభిస్తుందని మహర్షుల అభిప్రాయం .

శ్రీ త్రికాల శ్రీ ఆంజనేయ స్మరణ


త్రికాల శ్రీ ఆంజనేయ స్మరణ

—————————
ప్రాతః స్మరామి హనుమంత మనంత వీర్యం
శ్రీ రామ చంద్ర చరణాంబుజ చంచరీకం
లంకా పురీ దహన వందిత దేవ బృందం
సర్వార్ధ సిద్ధి సదనం ప్రదిత ప్రభావం
మాద్యం నమామి సృజినా ర్నవ తారనైకా
దారం శరణ్య ముదితానుపమా ప్రభావం
సీతార్తి సింధు పరిశోషణ కర్మ దక్షం
వందారు కల్ప తరు మవ్యయ మామ్జనేయం
సాయం భజామి శరనోప శ్రుతాఖి లార్తి
పుంజ ప్రనాషణ విధౌ ప్రదిత ప్రభావం
అక్షామ్తకం సకల రాక్షస కేతు ధూమం
ధీరం ప్రమోదిత విదేహ సుతం దయాళుం .

శ్రీహనుమద్ గాయత్రీ
———————–
ఓం ఆంజనేయాయ విద్మహే వాయు పుత్రాయ ధీమహి –తన్నో హనుమాన్ ప్రచోదయాత్
____________________________________________________
సకల క్లేశ నివారక శ్లోకం
——————————
మర్కటేశ మహోత్చాహ సర్వ శోక వినాశక
శత్రు సంహార మాం రక్ష శ్రియం దాపయమే ప్రభు .
------------------------------------------------------------------------------------------------------
ఆయురారోగ్య ఐశ్వర్య ప్రద స్తోత్రం
——————————-
తతో రావణ నీతాయ సీతాయా శ్శత్రు కర్మణః
ఇయేష పద మన్వేస్తుం చారానా చరితే పధిహ్
----------------------------------------------------------------------------------------------------------
జయ శ్లోకాలు
————–
జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహా బలహ
రాజా జయతి సుగ్రీవో రాఘవేనాభి పాలితః
దాసోహం కోసలెంద్రస్య రామస్య అక్లిష్ట కర్మణః
హనుమాన్ శత్రు శైన్యానాం నిహంతా మారు తాత్మజః
న రావణ సహస్రమ్ మే యుద్ధే ప్రతి బలం భవేత్
శిలాభిస్తూ ప్రహరతః పాదపైశ్చ సహస్రః
అర్దయిత్వా పురీం లంకం అభివాద్య చ మైధిలీ
సంరుద్దార్దో గమిష్యామి మిషతాం సర్వ రక్ష సం
----------------------------------------------------------------------------------------------------------------
హనుమాన్ ద్వాదశ నామ స్తోత్రం
———————————-
హనుమా నంజనా సూను ర్వాయు పుత్రో మహాబలః
రామేస్తః ఫాల్గుణ సఖః పింగాక్షో అమిత విక్రమః
ఉదధి క్రమనస్చైవ సీతా శోక వినాశానః
లక్ష్మణ ప్రాణ దాతా చ సుగ్రీవస్య దర్పహా
ద్వాద శై తాని నామాని కపీంద్రస్య మహాత్మనః
స్వాప కాలే పతేన్నిత్యం యాత్రా కాలే విశేష తః
తస్య మృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్ .

Monday, October 10, 2011

శ్రీ అన్నపూర్ణాస్తుతిః



అన్నపూర్ణాస్తుతిః

1::నిత్యానందకరీ వరాభయకరీ సౌన్దర్యరత్నాకరీ
నిర్ధూతాఖిలఘొరపాపనికరీ ప్రత్యక్షమాహేశ్వరీ
ప్రాలేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

నిత్యమైన ఆనందము నిచ్చుదానవు, వరములను-అభయమును ప్రసాదించు దానవు,సౌందర్య సముద్రమైన దానవు, ఘొరమైన పాపముల నన్నిటినీ కడిగి వేయుదానవు, హిమవంతుని వంశమును పవిత్రము చేయుదానవు, కాశి పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు బిక్షపేట్టుము.

2::నానారత్నవిచిత్రభూషణకరీ హేమామ్బరాడమ్బరీ
ముక్తాహారవిడమ్బమానవిలసద్వక్షొజకుమ్భాన్తరీ
కాశ్మీరాగరువాసితాఙ్గరుచిరా కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

వివిధ రత్నముల విచిత్రాభరణములను ధరించినదానవు, బంగారు వస్త్రములను కట్టుకున్న దానవు, వక్షస్థలముపై ప్రకాశించు ముత్యాల హారములు ధరించిన దానవు, కుంకుమ- అగురులు పూసుకొనుటచే సువాసనలు వేదజల్లు శరీరము కలదానవు, కాశి పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు బిక్షపేట్టుము.

3::యొగానన్దకరీ రిపుక్షయకరీ ధర్మైకనిష్ఠాకరీ
చన్ద్రార్కానలభాసమానలహరీ త్రైలొక్యరక్షాకరీ
సర్వైశ్వర్యకరీ తపఃఫలకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

యొగముచే పొందు ఆనందమును కలిగించుదానవు, శత్రువులను నాశనం చేయు దానవు, ధర్మనిష్టను ఏర్పరచుదానవు, చంద్రుడు- సూర్యుడు- అగ్నులతొ సమానమైన కాంతి ప్రవాహమైనదానవు, మూడులొకములను రక్షించుదానవు, సమస్త్యైశ్వర్యములను ప్రసాదించుదానవు, తపస్సులకు ఫలమునిచ్చుదానవు, కాశి పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు బిక్షపేట్టుము.

4::కైలాసాచలకన్దరాలయకరీ గౌరీ హ్యుమా శాఙ్కరీ
కౌ మారీ నిగమార్థగొచకరీ హ్యొంకారబీజాక్షరీ
మొక్షద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

కైలాస పర్వత గుహయందుడు దానవు, తేల్లని దానవు, ఉమాదేవివి, శంకరుని భార్యవు, కుమారివి, వేదార్థమును భొధించు దానవు, ఒంకార బీజాక్షరస్వరూపము కలదానవు, మొక్షద్వారపు తలుపులను తేరచేడి దానవు, కాశి పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు బిక్షపేట్టుము.

5::దృశ్యాదృశ్యవిభూతివాహనకరీ బ్రహ్మాణ్డభాణ్డొదరీ
లీలానాటకసూత్రఖేలనకరీ విజ్ఞానదీపాఙ్కురీ
శ్రీవిశ్వేశమనఃప్రసాదనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

కనబడీ కనబడని మహిమలు కలదానవు, గర్బమునందు బ్రహ్మాండములను మొయుచున్న దానవు, లీలానాటకమునకు సూత్రధారివి, విజ్ఞానదీపమును వేలిగించుదానవు, పరమేశ్వరుని ఆనందింపచేయుదానవు, కాశి పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు భిక్షపేట్టుము.

6::ఆదిక్షాన్తసమస్తవర్ణనికరీ శంభుప్రియా శాంకరీ
కాశ్మీరత్రిపురేశ్వరీ త్రినయనీ విశ్వేశ్వరీ శర్వరీ
స్వర్గద్వారకవాటపాటనకరీ కాశీపురాదీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

’అ’ కారము మొదలు ’క్ష’ కారము వరకు ఉన్న అక్షరముల సముదాయమైన దానవు, పరమేశ్వరునకు ప్రియురాలవు, శంకరుని భార్యవు, కాశ్మీర త్రిపురేశ్వరివి, మూడుకన్నులు కలదానవు, కాశీ పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు భిక్షపేట్టుము.

7::ఉర్వీసర్వజనేశ్వరీ జయకరీ మాతాకృపాసాగరీ
నారీనీలసమానకున్తలధరీ నిత్యాన్నదానేశ్వరీ
సాక్షాన్మొక్షకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

భూమియందలి సమస్తజనులకు నాయకురాలవు, విజయమునిచ్చుదానవు, తల్లివి, దయాసముద్రమైనదానవు, స్త్రీమూర్తివి, నల్లని కురులు కలదానవు, నిత్యము అన్నదానము చేయుదానవు, సాక్షాత్తుగా మొక్షమునిచ్చుదానవు, ఏల్లప్పుడు శుభము కలిగించు దానవు, కాశి పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు భిక్షపేట్టుము.

8::దేవీ సర్వవిచిత్రరత్నరుచిరా దాక్షాయణీ సుందరీ
వామా స్వాదుపయొధరా ప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ
భక్తాభీష్టకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

దేవివి, విచిత్రములైన సర్వరత్నములతొ అలంకరింపబడినదానవు, దక్షుని కుమార్తేవు, సుందరివి, యువతివి, మధురమైన పాలిండ్లు కల దానవు, ప్రియమునిచ్చుదానవు, కాశి పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు బిక్షపేట్టుము.

9::చన్ద్రార్కానలకొటికొటిసదృశీ చన్ద్రాంశుబిమ్బాధరీ
చన్ద్రార్కాగ్నిసమానకుణ్డలధరీ చన్ద్రార్కవర్ణేశ్వరీ
మాలాపుస్తకపాశసాఙ్కుశకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

కొట్లాది చంద్రులు, సూర్యులు, అగ్నులతొ సమానముగా ప్రకాశించుదానవు, సూర్యబింబము వలే ఏర్రనైన క్రింది పేదవి కలదానవు, చంద్రుడు, సూర్యుడు, అగ్నుల వలే ప్రకాశించు కుండలములు ధరించిన దానవు, చంద్రుడు, సూర్యుడు వంటి వర్ణము కలదానవు, కాశీ పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు భిక్షపేట్టుము.

10::క్షత్రత్రాణకరీ మహాభయహరీ మాతా కృపాసాగరీ
సర్వానన్దకరీ సదా శివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ
దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

వీరులను రక్షించుదానవు, మహాభయంకరివి, తల్లివి, దయా సముద్రమైన దానవు, అందరికీ ఆనందము కల్గించు దానవు, ఏల్లప్పుడు శుభము కల్గించు దానవు, విశ్వమునకు రాణివి, శొభిల్లు దానవు, దక్షప్రజాపతికి(యాగనాశనము ద్వారా) దుఃఖమును కల్గించుదానవు, సుఖము నిచ్చుదానవు, కాశీ పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు భిక్షపేట్టుము.

11::అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే
జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి

ఒ అన్నపూర్ణా| ఏల్లప్పుడు పూర్ణముగా ఉండు తల్లి| శంకరుని ప్రాణవల్లభురాలా| పార్వతీ| జ్ఞానము వైరాగ్యము సిద్ధించుటకు భిక్షపేట్టుము.

12::మాతా చ పార్వతీ దేవి పితా దేవొ మహేశ్వరః
బాన్ధవాః శివభక్తాశ్చ స్వదేశొ భువనత్రయమ్

తల్లి పర్వతీ దేవి, తండ్రి పరమేశ్వరుడు, బంధువులు శివభక్తులు, మూడులోకములు స్వదేశము.

శ్రీ సరస్వతి దేవి కవచం--Sri saraswati Devi Kavacham







1)ఓం శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహా శిరోమేపాతుసరస్వతః

2)ఓం శ్రీం హ్రీం వాగ్దేవతాయై స్వాహా ఫాలం మేసర్వదా వతు

3)ఓం శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహేతిశ్రోత్రేపాతు నిరస్తరం

4)ఓం శ్రీం హ్రీం భగవత్యై సరస్వత్యై స్వాహా నేత్రయుగ్మం సదావతు

5)ఓం శ్రీం హ్రీం వాగ్వాదిన్యై స్వాహా నాసాంమే సర్వదా వతు

6)ఓం శ్రీం హ్రీం విద్యాధిష్ఠాతృదేవ్యై స్వాహా ఓష్ఠం సదా వతు

7)ఓం శ్రీం హ్రీం ఐం ఇత్యేకాక్షరో మంత్రోమమ కంఠం సదావతు

8)ఓం శ్రీం హ్రీం పాతుమే గ్రీవాం స్కదౌమే శీం సధా వతు

9)ఓం శ్రీం హ్రీం విద్యాధిషాంతృదేవ్యై స్వాహా వక్షః సదా వతు

10)ఓం శ్రీం హ్రీం హేతి మమహస్తౌ సదావతు

11)ఓం శ్రీం హ్రీం వాగధిష్ఠాతృదేవ్యై స్వాహా సర్వం సదావతు

12)ఓం శ్రీం హ్రీం స్వాహా ప్రాచ్యాం సదా వతు

13)ఓం శ్రీం హ్రీం సర్వజిహ్వాగ్రవాసివ్యై స్వాహాగ్ని రుదిశిరక్షతు

14)ఓం ఐం హ్రీం శ్రీం త్ర్యక్షరో మంత్రోనైరృత్యాం సర్వదావతు

15)ఓం ఐం హ్రీం శ్రీం జిహ్వాగ్రవాసిన్యై స్వాహా మాంవారుణే వతు

16)ఓం ఐం హ్రీం శ్రీం సర్వాంబికాయై స్వాహా వాయవ్యే మాం సాదావతు

17)ఓం ఐం శ్రీం క్లీం గద్యవాసిన్యై స్వాహా మాముత్తరేవతు

18)ఓం ఐం హ్రీం శ్రీం సర్వశాస్త్ర వాసిన్యై స్వాహేశాన్యాం సదావతు

19)ఓం ఐం హ్రీం శ్రీం హ్రీం సర్వపూజితాయై స్వాహా చోర్ధ్యం సదావతు

20)ఓం ఐం హ్రీం శ్రీం పుస్తకవాసిన్యై స్వాహాధోమాం సదావతు

21)ఓం ఐం హ్రీం శ్రీం గ్రంధబీజస్వరూపాయై స్వాహా ఆమం సర్వదావతు

శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం




శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణే
భోగింద్రభోగమణిరంజిత పుణ్యమూర్తే
యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

బ్రహ్మేంద్రరుద్రమరుదర్కకిరీటకోటి
సంఘట్టితాంఘ్రికమలామలకాంతికాంత
లక్ష్మీలసత్ కుచసరోరుహ రాజహంస
లక్ష్మీనృసింహ మమదేహి కరావలంబమ్

సంసారసాగర విశాల కరాళకామ
నక్రగ్రహ గ్రసన నిగ్రహ విగ్రహస్య
మగ్నస్య రాగలసదూర్మినిపీడితస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

సంసారఘోరగహనే చరతో మురారే
మారోగ్రభీకర మృగ ప్రవరార్దితస్య
ఆర్తస్య మత్సర నిదాఘ నిపీడితస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

సంసారకూప మతిఘోర మగాధమూలం
సంప్రాప్య దుఃఖ శతసర్పసమాకులస్య
దీనస్య దేవ కృపయా శరణాగతస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

సంసారభీకర కరీంద్ర కరాభి ఘాత
నిష్పీడ్యమానవపుష స్సకాలార్దితస్య
ప్రాణప్రయాణ భవభీతి సమాకులస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

సంసార సర్పవిషదుష్ట భయోగ్రతీవ్ర
దంష్ట్రాకరాళ విషదగ్ధ వినష్టమూర్తేః
నాగారివాహన సుధాబ్ధినివాస శౌరే
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

సంసారజాలపతితస్య జగన్నివాస
సర్వేందియార్ధబడిశస్థ ఝుషాత్మనశ్చ
ప్రోత్తంభిత ప్రచురతాలుక మస్తకస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

సంసారవృక్ష మఘబీజ మనంతకర్మ
శాఖాయుతం కరణపత్ర మనంగ పుష్పమ్
ఆరుహ్య దు:ఖ జలధౌ పతతో దయాళో
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

సంసారదావ దహనాకుల భీకరోగ్ర
జ్వాలావళీభి రభిదగ్ధ తనూరుహస్య
త్వత్పాదయుగ్మ సరసీరుహ మస్తకస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

సంసారసాగర నిమజ్జన మహ్యమానం
దీనంవిలోకయ విభో కరుణానిధే మామ్
ప్రహ్లాదఖేద పరిహార పరావతార
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

సంసార యూథ గజసంహతి సింహదంష్ట్రా
భీతస్య దుష్టమతిదైత్య భయంకరేణ
ప్రాణప్రయాణభవభీతినివారణేన
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

సంసారయోగి సకలేప్సిత నిత్యకర్మ
సంప్రాప్యదు:ఖ సకలేంద్రియ మృత్యునాశ
సంకల్ప సింధుతనయాకుచకుంకుమాంక
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

బద్ధ్వా కశై ర్యమభటా బహు భర్త్సయంతి
కర్షంతి యత్ర పథి పాశశయై ర్యదా మామ్
ఏకాకినం పరవశం చకితం దయాళో
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

అంధస్యమే హృతవెవేకమహాధనస్య
చోరై ర్మహాబలభి రింద్రియనామధేయైః
మోహాంధకారకుహరే వినిపాతితస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

లక్ష్మీపతే కమలనాభ సురేశ విష్ణో
యఙ్ఞేశ యఙ్ఞ మధుసూదన విశ్వరూప
బ్రహ్మణ్య కేశవ జనార్దన వాసుదేవ
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

ప్రహ్లాద నారద పరాశర పుండరీక
వ్యాసాంబరీష శుక శౌనక హృన్నివాస
భక్తానురక్త పరపాలన పారిజాత
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

ఏకేన చక్ర మపరేణ కరేణ శంఖ
మన్యేన సింధుతనయా మవలంబ్య తిష్ఠన్
వామేతరేణ వరదాభయహస్తముద్రాం
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

ఆద్యంతశూన్య మజ మవ్యయ మప్రమేయ
మాదిత్యరుద్ర నిగమాది నుత ప్రభావమ్
త్వాంభోధిజాస్య మధులోలుప మత్తభృంగం
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

వారాహ రామ నరసింహ రమాదికాంతా
క్రీడా విలోల విధిశూలి సుర ప్రవంద్య
హంసాత్మకం పరమహంస విహారలీలం
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

మతా నృసింహశ్చ పితా నృసింహ:
భ్రాతా నృసింహశ్చ సఖానృసింహ:
విద్యా నృసింహో ద్రవిణం నృసింహ:
స్వామీ నృసింహ: సకలం నృసింహ:

ప్రహ్లాద మానససరోజ విహారభృంగ
గంగాతరంగధవళాంగ రమాస్థితాంగ
శృంగార సంగర కిరీటలసద్వరాంగ
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

శ్రీశంకరాచార్యరచితం సతతం మనుష్య:
స్తోత్రం పఠేదిహ తు సర్వగుణప్రపన్నమ్
సద్యో విముక్త కలుషో మునివర్యగణ్యో
లక్ష్మీపతే: పద ముపైతి స నిర్మలాత్మా

యన్మాయ యార్జితవపు:ప్రచుర ప్రవాహ
మగ్నార్త మర్త్యనివహేషు కరావలంబమ్
లక్ష్మీనృసింహ చరణాభ మధువ్ర తేన
స్తోత్రం కృతం శుభకరం భువి శంకరేణ

శ్రీమన్నృసింహ విభవే గరుడధ్వజాయ
తాపత్రయోపశమనాయ భవౌషధాయ
తృష్ణాది వృశ్చిక జలాగ్ని భుజంగరోగ
క్లేశవ్యయాయ హరయే గురవే నమస్తే

||ఇతి శ్రీ లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రమ్||

Sunday, October 9, 2011

శ్రీ లక్ష్మీ అశోత్తర శత నామ స్తోత్రము






:::దేవ్యువాచ:::

దేవదేవ! మహాదేవ! త్రికాలఙ్ఞ! మహేశ్వర!
కరుణాకర దేవేశ! భక్తానుగ్రహకారక!
అష్టోత్తర శతం లక్ష్మ్యాః శ్రోతుమిచ్ఛామి తత్త్వతః!

:::ఈశ్వర ఉవాచ:::

దేవి! సాధు మహాభాగే మహాభాగ్య ప్రదాయకమ్
సర్వైశ్వర్యకరం పుణ్యం సర్వపాప ప్రణాశనమ్

సర్వదారిద్ర్య శమనం శ్రవణాద్భుక్తి ముక్తిదమ్
రాజవశ్యకరం దివ్యం గుహ్యాద్-గుహ్యతరం పరమ్

దుర్లభం సర్వదేవానాం చతుష్షష్టి కళాస్పదమ్
పద్మాదీనాం వరాంతానాం నిధీనాం నిత్యదాయకమ్

సమస్త దేవ సంసేవ్యమ్ అణిమాద్యష్ట సిద్ధిదమ్
కిమత్ర బహునోక్తేన దేవీ ప్రత్యక్షదాయకమ్

తవ ప్రీత్యాద్య వక్ష్యామి సమాహితమనాశ్శృణు
అష్టోత్తర శతస్యాస్య మహాలక్ష్మిస్తు దేవతా

క్లీం బీజ పదమిత్యుక్తం శక్తిస్తు భువనేశ్వరీ
అంగన్యాసః కరన్యాసః స ఇత్యాది ప్రకీర్తితః

:::ధ్యానమ్:::

వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం
హస్తాభ్యామభయప్రదాం మణిగణైః నానావిధైః భూషితామ్

భక్తాభీష్ట ఫలప్రదాం హరిహర బ్రహ్మాధిభిస్సేవితాం
పార్శ్వే పంకజ శంఖపద్మ నిధిభిః యుక్తాం సదా శక్తిభిః

సరసిజ నయనే సరోజహస్తే ధవళ తరాంశుక గంధమాల్య శోభే
భగవతి హరివల్లభే మనోఙ్ఞే త్రిభువన భూతికరి ప్రసీదమహ్యమ్

1::ఓం ప్రకృతిం, వికృతిం, విద్యాం, సర్వభూత హితప్రదామ్
శ్రద్ధాం, విభూతిం, సురభిం, నమామి పరమాత్మికామ్

2::వాచం, పద్మాలయాం, పద్మాం, శుచిం, స్వాహాం, స్వధాం, సుధామ్
ధన్యాం, హిరణ్యయీం, లక్ష్మీం, నిత్యపుష్టాం, విభావరీమ్

3::అదితిం చ, దితిం, దీప్తాం, వసుధాం, వసుధారిణీమ్
నమామి కమలాం, కాంతాం, క్షమాం, క్షీరోద సంభవామ్

4::అనుగ్రహపరాం, బుద్ధిం, అనఘాం, హరివల్లభామ్
అశోకా,మమృతాం దీప్తాం, లోకశోక వినాశినీమ్

5::నమామి ధర్మనిలయాం, కరుణాం, లోకమాతరమ్
పద్మప్రియాం, పద్మహస్తాం, పద్మాక్షీం, పద్మసుందరీమ్

6::పద్మోద్భవాం, పద్మముఖీం, పద్మనాభప్రియాం, రమామ్
పద్మమాలాధరాం, దేవీం, పద్మినీం, పద్మగంధినీమ్

7::పుణ్యగంధాం, సుప్రసన్నాం, ప్రసాదాభిముఖీం, ప్రభామ్
నమామి చంద్రవదనాం, చంద్రాం, చంద్రసహోదరీమ్

8::చతుర్భుజాం, చంద్రరూపాం, ఇందిరా,మిందుశీతలామ్
ఆహ్లాద జననీం, పుష్టిం, శివాం, శివకరీం, సతీమ్

9::విమలాం, విశ్వజననీం, తుష్టిం, దారిద్ర్య నాశినీమ్
ప్రీతి పుష్కరిణీం, శాంతాం, శుక్లమాల్యాంబరాం, శ్రియమ్

10::భాస్కరీం, బిల్వనిలయాం, వరారోహాం, యశస్వినీమ్
వసుంధరా, ముదారాంగాం, హరిణీం, హేమమాలినీమ్

11::ధనధాన్యకరీం, సిద్ధిం, స్రైణసౌమ్యాం, శుభప్రదామ్
నృపవేశ్మ గతానందాం, వరలక్ష్మీం, వసుప్రదామ్

12::శుభాం, హిరణ్యప్రాకారాం, సముద్రతనయాం, జయామ్
నమామి మంగళాం దేవీం, విష్ణు వక్షఃస్థల స్థితామ్

13::విష్ణుపత్నీం, ప్రసన్నాక్షీం, నారాయణ సమాశ్రితామ్
దారిద్ర్య ధ్వంసినీం, దేవీం, సర్వోపద్రవ వారిణీమ్

14::నవదుర్గాం, మహాకాళీం, బ్రహ్మ విష్ణు శివాత్మికామ్
త్రికాలఙ్ఞాన సంపన్నాం, నమామి భువనేశ్వరీమ్

15::లక్ష్మీం క్షీరసముద్రరాజ తనయాం శ్రీరంగధామేశ్వరీమ్
దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురామ్
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్-బ్రహ్మేంద్ర గంగాధరామ్
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్

16::మాతర్నమామి! కమలే! కమలాయతాక్షి!
శ్రీ విష్ణు హృత్-కమలవాసిని! విశ్వమాతః!
క్షీరోదజే కమల కోమల గర్భగౌరి!
లక్ష్మీ! ప్రసీద సతతం సమతాం శరణ్యే !

17::త్రికాలం యో జపేత్ విద్వాన్ షణ్మాసం విజితేంద్రియః
దారిద్ర్య ధ్వంసనం కృత్వా సర్వమాప్నోత్-యయత్నతః
దేవీనామ సహస్రేషు పుణ్యమష్టోత్తరం శతమ్
యేన శ్రియ మవాప్నోతి కోటిజన్మ దరిద్రతః

18::భృగువారే శతం ధీమాన్ పఠేత్ వత్సరమాత్రకమ్
అష్టైశ్వర్య మవాప్నోతి కుబేర ఇవ భూతలే
దారిద్ర్య మోచనం నామ స్తోత్రమంబాపరం శతమ్
యేన శ్రియ మవాప్నోతి కోటిజన్మ దరిద్రతః

19::భుక్త్వాతు విపులాన్ భోగాన్ అంతే సాయుజ్యమాప్నుయాత్
ప్రాతఃకాలే పఠేన్నిత్యం సర్వ దుఃఖోప శాంతయే
పఠంతు చింతయేద్దేవీం సర్వాభరణ భూషితామ్

:::ఇతి శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం సంపూర్ణమ్:::

శ్రీ నవగ్రహ పీడాహర స్తోత్రం




గ్రహాణామాది రాదిత్యోలోక రక్షణ కారకః
విషయ స్థాన సంభూతాం పీడాం హరతుమే రవి:
రోహిణీ శస్సుధామూర్తి స్సుధాగాత్రస్సురాళనః

భూమిపుత్రో మహాతేజా జగతాం భయకృత్నదా
వృష్టికృదృష్టి హర్తాచ పీడాం హరతు మేకుజః

ఉత్పాత్రూపోజగతాం చంద్రపుత్రో మహాద్యుతిః
సూర్యప్రియకరో విద్వాన్ పీడాం హరతుమే బుధః

దేవమంత్రీ విశాలాక్షః సదాలోకహితేరహః
అనేక శిష్య సంపూర్ణః పీడాం హరతుమే గురుః

దైత్యమంత్రీ గురుస్తేషాం ప్రాణదశ్చమహామతిః
ప్రభుస్తారాగ్రహాణాంచ పీడాం హరతుమే భ్రుగుః

సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్ష శివప్రియః
మందచారః ప్రసన్నాత్మా పీడాం హరతుమే శనిః

మహాశ్రీరామ మహావక్త్రో దీర్ఘదంస్త్రో మహాబలః
అతనుశ్చోర్ధ్వకేశశ్చ పీడాం హరతుమే శిఖీ

అనేక రూప్వర్వైశ్చ శతశో ధసహస్రశః
ఉత్పాతరుజోజగతాం పీడాం హరతుమే తమః

(ప్రతిరోజూ ఈ నవగ్రహ పీడా పరిహార స్తోత్రాన్ని ఉదయాన్నే తొమ్మిదిసార్లు పఠిస్తే గ్రహపీడ తొలగి, కార్యసిద్ధి కలుగుతుంది.)

Wednesday, October 5, 2011

గోవుకు గడ్డి పెట్టేటప్పుడు ఆహారాన్ని ఇచ్చేటప్పుడు శ్లోక౦

















గోవుకు గడ్డి పెట్టేటప్పుడు ఆహారాన్ని ఇచ్చేటప్పుడు శ్లోక౦

గోవుకు గడ్డి పెట్టేటప్పుడు, తగిన ఆహారాన్ని ఇచ్చేటప్పుడు ఈ శ్లోకాన్ని పఠి౦చడ౦ శుభకర౦.

ప౦చభూతశివే! పుణ్యే! పవిత్రే! సూర్య స౦భవే!
ప్రతీచ్ఛేమ౦ మయాదత్త౦ సౌరభేయి! నమోస్తుతే!!

ప౦చ భూతాలకు శుభాన్ని కలిగి౦చే పుణ్యస్వరూపిణీ! పవిత్రురాలా!
సూర్యుని ను౦డి కలిగినదానా! (సౌరశక్తిలోని దివ్యత్వ౦ గోవులో ఉన్నదని భావ౦). 
నేనిస్తున్న ఈ ద్రవ్యాన్ని స్వీకరి౦చు. సురభీ వ౦శ౦లో కలిగిన తల్లీ! నీకు నమస్కారము.

దేవీ భాగవతా౦ర్గత ఇ౦ద్ర కృత లక్ష్మీస్తవం






















దేవీ భాగవతా౦ర్గత ఇ౦ద్ర కృత లక్ష్మీస్తవం

1::నమః కమల వాసిన్యై నారాయణ్యై నమోనమః
కృష్ణ ప్రియాయై సతత౦ మహాలక్ష్మ్యై నమోనమః!

2::పద్మ పత్రేక్షణాయై చ పద్మాస్యాయై నమోనమః
పద్మాసనాయై పద్మిన్యై వైష్ణవ్యై చ నమోనమః!

3::సర్వస౦పత్స్వరూపిణ్యై సర్వారాధ్యాయై నమోనమః
హరిభక్తి ప్రదాత్ర్యై చ హర్షదాత్ర్యై చ నమోనమః!

4::కృష్ణ వక్షఃస్థితాయై చ కృష్ణేశాయై నమోనమః
చ౦ద్రశోభా స్వరూపాయై రత్నపద్మే చ శోభనే!

5::స౦పత్త్యధిష్ఠాతృ దేవ్యై మహాదేవ్యై నమోనమః
నమో బుద్ధిస్వరూపాయై బుద్ధిదాయ్యై నమోనమః!

6::యథామాతా స్తనా౦ధానా౦ శిశూనా౦ శైశవే సదా
తథా త్వ౦ సర్వదా మాతా సర్వేషా౦ సర్వరూపతః!

అగస్త్య కృత లక్ష్మీ స్తోత్రం





















అగస్త్య కృత లక్ష్మీ స్తోత్రం

1::మాతర్నమామి కమలే కమలాయతాక్షి
శ్రీ విష్ణు హృత్కమల వాసిని విశ్వమాతః
క్షీరోదజే కమల కోమల గర్భగౌరీ 
లక్ష్మీ ప్రసీద సతతం నమతా శరణ్యే!

2::త్వం శ్రీ రుపేంద్ర సదనే మదనైకమాతః
జ్యోత్స్నాసి చంద్రమసి చంద్ర మనోహరాస్యే
సూర్యే ప్రభాసి చ జగత్త్రితయే ప్రభాసి
 లక్ష్మీ ప్రసీద సతతం నమతా శరణ్యే!

3::త్వం జాతవేదసి సదా దహనాత్మ శక్తిః
వేధా స్త్వయా జగదిదం వివిధం విదధ్యాత్
విశ్వంభరోపి భిభ్రుభయాదఖిలం భవత్యా
లక్ష్మీ ప్రసీద సతతం నమతా శరణ్యే!

4::త్వత్త్యక్తమేతదమలే హరతే హరోపి
త్వంపాసి హంసి విదధాసి పరావరాసి
ఈడ్యో బభూవ హరిరప్యమలే త్వదాప్త్యా
లక్ష్మీ ప్రసీద సతతం నమతా శరణ్యే!!

5::శూరః శ ఏవ శ గుణీ శ బుధః శ ధన్యో
మాన్యః శ ఏవ కులశీల కళాకలాపైః
ఏకః శుచిః స హి పుమాన్ సకలేపి లోకే
యత్రాపతేత్తవ శుభే కరుణా కటాక్షః!

6::యస్మిన్ వసేః క్షణమహో పురుషే గజేశ్వే
స్త్రైణే తృణే సరసి దేవకులే గృహేన్నే
రత్నే పతత్త్రిణి పశౌ శయనే ధరాయాం
శ శ్రీకమేవ సకలే తదిహాస్తి నాన్యత్!

7::త్వ త్స్ప్రుష్టమేవ శకలం శుచితాం లభేత
త్వత్త్యక్త మేవ శకలం త్వశుచీహ లక్ష్మి
త్వ న్నామ యత్ర చ సుమంగళమేవ తత్ర
శ్రీ విష్ణు పత్ని కమలే కమలాలయేపి!

8::లక్ష్మీ శ్రియంచ కమలం కమలాలయాంచ
పద్మాం రమాం నళినయుగ్మకరాం చ మాం చ
క్షీరోదజామమృత కుంభ కరామిరాంచ
విష్ణుప్రియా మితి సదా జపతాం క్వ దుఃఖం!

ఈ స్తోత్రమును భక్తితో పఠించు వారికి సంతాపము, దారిద్ర్యము, ప్రియ వియోగము, 
సంపత్తి క్షయము ఉండవు. సర్వత్ర విజయము కల్గును. వంశ విచ్చేదము ఉండదు.

Tuesday, October 4, 2011

శ్రీ దేవి నవరాత్రి..తేది వారము నక్షత్రము తిధి అలంకారములు




********************************************************************************************************************************************************************
********************************************************************************************

శ్రీ దేవి నవరాత్రి..తేది..వారము..నక్షత్రము..తిధి..అలంకారములు..
చీర రంగు..మరియు..ఒకొక్క అమ్మవారికి..ఒక్కొక్క నైవేద్యం
-----------------------------------------------------------------------------
28-09- 2011..భుదవారము..ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి..శ్రీ బాలత్రిపుర సుందరి దేవి..( నీలం రంగు )
నైవేద్యం..(ఉప్పు పొంగల్ )
-----------------------------------------------------------------------------
29-09-2011..గురువారం..ఆశ్వయుజ శుద్ధ విదియ..శ్రీ గాయత్రి దేవి..( పసుపు రంగు )
నైవేద్యం..( పులిహోర )
------------------------------------------------------------------------------
30-09-2011..శ్రుక్రవారము..ఆశ్వయుజ శుద్ధ తదియ..శ్రీ మహా లక్ష్మి దేవి..( తెలుపు రంగు )
నైవేద్యం..( రవకేసరి )
-------------------------------------------------------------------------------
01-10- 2011..శనివారము..ఆశ్వయుజ శుద్ధ చవితి..శ్రీ అన్నపూర్ణ దేవి..(లేత ఎరుపు)
నైవేద్యం..(కొబ్బెర అన్నం )
-------------------------------------------------------------------------------
02-10-2011..ఆదివారము..ఆశ్వయుజ శుద్ధ పంచమి..శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి.(ఆకాషం రంగు)
నైవేద్యం..( అల్లం గారెలు )
-------------------------------------------------------------------------------
03-10-2011..సోమవారము..ఆశ్వయుజ శుద్ధ సప్తమి..(మూలా నక్షత్రము) శ్రీ సరస్వతి దేవి.(కనకాంబరం రంగు ) నైవేద్యం..( పెరుగన్నం )
-------------------------------------------------------------------------------
04-10- 2011..మంగళవారము..ఆశ్వయుజ శుద్ధ అష్టమి..శ్రీ దుర్గా దేవి..( మెరుణ్ కలర్ )
కదంబం..అంటే ..(వెజిటబుల్..రైస్ కలిపి వండే ఐటం )
-------------------------------------------------------------------------------
05-10- 2011..భుదవారము..ఆశ్వయుజ శుద్ధ నవమి..శ్రీ మహిషాసుర మర్ధిని దేవి..( ఎఱ్ఱటి ఎరుపు రంగు)
నైవేద్యం...( బెల్లమన్నం )
-------------------------------------------------------------------------------
06-10-2011..గురువారం..ఆశ్వయుజ శుద్ధ దశమి..(విజయదశమి) శ్రీ రాజరాజేశ్వరీ దేవి..( ఆకుపచ్చ రంగు )
నైవేద్యం..( పరమాన్నం )
-------------------------------------------------------------------------------

Monday, October 3, 2011

Sri Dvadasa jyothirlinga stotram





sauraashTradaeSae viSadaeztiramyae jyOtirmayaM chaMdrakaLaavataMsam^
bhaktapradaanaaya kRpaavateerNaM taM sOmanaathaM SaraNaM prapadyae

SreeSailaSRMgae vividhaprasaMgae SaeshaadriSRMgaezpi sadaa vasaMtam^
tamarjunaM mallikapoorvamaenaM namaami saMsaarasamudrasaetum^

avaMtikaayaaM vihitaavataaraM muktipradaanaaya cha sajjanaanaam^
akaalamRtyO@h parirakshaNaarthaM vaMdae mahaakaalamahaasuraeSam^

kaavaerikaanarmadayO@h pavitrae samaagamae sajjanataaraNaaya
sadaiva maaMdhaatRpurae vasaMtaM OMkaarameeSaM SivamaekameeDae

poorvOttarae prajvalikaanidhaanae sadaa vasaM taM girijaasamaetam^
suraasuraaraadhitapaadapadmaM SreevaidyanaathaM tamahaM namaami

yaamyae sadaMgae nagaraeztiramyae vibhooshitaaMgaM vividhaiScha bhOgai@h
sadbhaktimuktipradameeSamaekaM SreenaaganaathaM SaraNaM prapadyae

mahaadripaarSvae cha taTae ramaMtaM saMpoojyamaanaM satataM muneeMdrai@h
suraasurairyaksha mahOragaaDhyai@h kaedaarameeSaM SivamaekameeDae

sahyaadriSeershae vimalae vasaMtaM gOdaavariteerapavitradaeSae
yaddarSanaat^ paatakaM paaSu naaSaM prayaati taM tryaMbakameeSameeDae

SreetaamraparNeejalaraaSiyOgae nibadhya saetuM viSikhairasaMkhyai@h
SreeraamachaMdraeNa samarpitaM taM raamaeSvaraakhyaM niyataM namaami

yaM DaakiniSaakinikaasamaajae nishaevyamaaNaM piSitaaSanaiScha
sadaiva bheemaadipadaprasiddhaM taM SaMkaraM bhaktahitaM namaami

saanaMdamaanaMdavanae vasaMtaM aanaMdakaMdaM hatapaapabRMdam^
vaaraaNaseenaathamanaathanaathaM SreeviSvanaathaM SaraNaM prapadyae

ilaapurae ramyaviSaalakaezsmin^ samullasaMtaM cha jagadvaraeNyam^
vaMdae mahOdaaratarasvabhaavaM ghRshNaeSvaraakhyaM SaraNaM prapadyae

jyOtirmayadvaadaSaliMgakaanaaM SivaatmanaaM prOktamidaM kramaeNa
stOtraM paThitvaa manujOztibhaktyaa phalaM tadaalOkya nijaM bhajaechcha

వాల్మీకి రచించిన " శ్రీ సరస్వతీ స్తోత్రము"--sri saraswati stotram









" ఈ " వాణీ ప్రశంస "బ్రహ్మాండ పురాణము " లో ఉపలబ్ధము.



1. శరచ్చంద్ర వక్త్రాం లసత్పద్మ హస్తాం - సరోజ నేత్రాం స్ఫురద్రత్న మౌళీం|

ఘనాకార వేణీ నిరాకార వృత్తిం భజే శారదాం వాసరా పీఠ వాసాం||



2. ధరా భార పోషాం సురానీక వంద్యాంమృణాళీ లసద్బాహు కేయూర యుక్తాం|

త్రిలోకైక సాక్షీ ముదార స్తనాధ్యాం భజే శారదాం వాసరా పీఠ వాసాం||



3. దురాసార సంసార తీర్ధాంఘ్రి పోతాం క్వణత్ స్వర్ణ మాణిక్య హారాభి రామాం|

శరచ్చంద్రికా ధౌత వాసోలసంతీం భజే శారదాం వాసరా పీఠ వాసాం ||



4. విరించీ విష్ణ్వింద్ర యోగీంద్ర పూజ్యాం ప్రసన్నాం విపన్నార్తినాశాం శరణ్యాం|

త్రిలోకాధి నాథాధి నాథాం త్రిశూన్యాం భజే శారదాం వాసరా పీఠ వాసాం ||



5. అనంతా మగమ్యా మనాద్యా మభావ్యా మభేద్యా మదాహ్యా మలేప్యా మరూపాం|

అశోష్యా మసంగా మదేహా మవాచ్యాం భజే శారదాం వాసరా పీఠ వాసాం ||



6. మనో వాగతీతా మనామ్నీ మఖండా మభిన్నాత్మికా మద్వయాం స్వ ప్రకాశాం|

చిదానంద కందాం పరంజ్యోతి రూపాం భజే శారదాం వాసరా పీఠ వాసాం ||



7. సదానంద రూపాం శుభాయోగ రూపా~మశేషాత్మికాం నిర్గుణాం నిర్వికారాం |

మహా వాక్య వేద్యాం విచార ప్రసంగాం భజే శారదాం వాసరా పీఠ వాసాం ||



8. ఇమం స్తవం పఠేద్వస్తు త్రికాలం భక్తి సంయుతః|

శారదా సౌమ్య మాప్నోతి గృహేస్థిత్వాజ్ఞ సంభవం ||



||ఇతి శ్రీ బ్రహ్మాండ పురాణాంతర్గత వాల్మీకి కృత శ్రీ వాసర సరస్వతీ స్తోత్రం సంపూర్ణం||