Showing posts with label శ్రీ దత్తాత్రేయ స్తోత్రం. Show all posts
Showing posts with label శ్రీ దత్తాత్రేయ స్తోత్రం. Show all posts

Friday, December 5, 2014

శ్రీ దత్త స్తవమ్




















నేడే శ్రీ దత్త జయంతి.

శ్రీ గణేషాయ నమః శ్రీ సరస్వత్తై నమః 
శ్రీ పాదవల్లభ నారసింహ సరస్వతి 
శ్రీగురు దత్తాత్రేయాయ నమః

1::దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం 
ప్రపన్నార్తి హరం వందే స్మతృగామి సనోవతు  

2::దీనబంధుం కృపాసింధుం సర్వకారణ కారణం 
సర్వ రక్షాకరం వందే స్మతృగామి సనోవతు 

3::శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణం 
నారాయణం విభుం వందే స్మతృగామి సనోవతు 

4::సర్వానర్థ హరం దేవం సర్వమంగళ మంగళం 
సర్వ క్లేశ హరం వందే స్మతృగామి సనోవతు 

5::బ్రహ్మణ్యం ధర్మతత్త్వజ్ఞం భక్త కీర్తి వివర్ధనం 
భక్తాభీష్ట ప్రదం వందే స్మతృగామి సనోవతు  

6::శొషణం పాప పంకస్య దీపనం జ్ఞానతేజసః 
తాప ప్రశమనం వందే స్మతృగామి సనోవతు 

7::సర్వరోగ ప్రశమనం సర్వపీడా నివారణం 
విపదుద్ధరణం వందే స్మతృగామి సనోవతు  

8::జన్మ సంసార బంధఘ్నం స్వరూపానంద దాయకం 
నిశ్శ్రేయస పదం వందే స్మతృగామి సనోవతు 

9::జయలాభ యశః కామ దాతు ర్దత్తస్య యస్తవం 
భోగమోక్ష ప్రదస్యేమం ప్రపఠేత్ సుకృతీ భవేత్ `





















SREE DATTA STAVAM

Sri Ganesaya Namah Sri Sarasvatyai Namah
Sri Padavallabha Narasimha Sarasvathi
Sriguru  Dattatreyaya Namah

1::Dattatreyam mahatmanam varadam bhakta vatsalam
 Prapannarthi haram vande smartrgami Sanovatu

I pray to Lord Dattatreya, great divine spirit, who confers boons and protects
the devotees, who removes afflictions immediately of those who remember Him with
faith.


2::Dinabandum Krpasindhum sarvakarana karanam
 Sarva raksakaram vande smartrgami sanovatu

I pray to Lord Dattatreya, who is a friend of the poor, a sea of compassion,
cause of all causes and the protector of all those who remember Him sincerely.

3::Saranagata dinarta paritrana parayanam
 Narayanam vibhum vande smartrgami sanovatu

I pray to Lord Dattatreya, who is a shelter for the poor and afflicted and
grants deliverance immediately to those having firm devotion in him and remember
him sincerely.

4::Sarvanartha haram devam sarva mangala mangalam
 Sarvaklesa haram vande smartrgami sanovatu

I pray to Lord Dattatreya, who is the destroyer of all useless and harmful
things and giver of all auspicious objects, the remover of all afflictions of
those who remember Him sincerely.
  

5::Brahmanyam dharma tattvajnam bhakta kirti vivardhanam
 Bhaktabhista pradam vande smartrgami sanovatu

I pray to Lord Dattatreya, well versed in the vedas, knower of the essence of
religion, who causes to increase the fame of His devotees who is giver of
whatever is needed by the devotees who remember Him sincerely.

6::Sosanam papapankasya dipanam jnanatejasah
 Tapa prasamanam vande smartrgami sanovatu

I pray to Lord Dattatreya who removes the quagmire of sins, lights up the flame
of wisdom, calms down distress and torment of those who remember Him sincerely.
  

7::Sarvaroga prasamanam sarvapida nivaranam
 Vipaduddharanam vande smartrgami sanovatu

I pray to Lord Dattatreya who cures all diseases, heals all pain and removes all
calamities of those who remember Him sincerely.

8::Janmasamsara bandhajnam svarupananda dayakam
 Nissreyasa padam vande smartrgami sanovatu

I pray to Lord Dattatreya who is most excellent and liberates from the cycle of
birth and death in this world and who is the giver of bliss to those who
remember Him sincerely.

9::Jaya labha yasah kama datu rdattasya yastavam
Bhogamoksha prada syemam prapathet sakriti bhavet

 Those who recite this eulogy of Lord Dattatreya regularly and with faith, become
wise and attain victory, fame, fulfillment of all worldly desires and
achievements and finally get liberation from the bondage of life.


JAI GURU DEVA DATTA!`

Sunday, December 8, 2013

దత్త నవరాత్రులు

























దత్తప్రభువుల జన్మవృత్తాంతం :
------------------------------------
ఆధిభౌతికం,ఆధిదైవికం,ఆధ్యా త్మికం అనే తాపాలను తొలగించుకున్న అత్రి మహర్షుల వారికి,కామక్రోధాది దుర్గుణాలన్నింటికీ మూలమైన అసూయను జయించిన అనసూయ మాతకు, కృతయుగంలో ఇప్పుటి నేపాల్‌ ప్రాంతంలోని చిత్రకూట పర్వతం వద్దనున్న అనసూయా పహాడ్ అనేచోట ఒకానొక వైశాఖ బహుళ దశమీ గురువారంనాడు రేవతీ నక్షత్రయుక్త మీన లగ్నంలో మీనాంశయందు 'బ్రహ్మ అంశమున చంద్రుడు,విష్ణు అంశమున దత్తుడు, శివ అంశమున దుర్వాసులుగా' దత్తాత్రేయులవారు జన్మించారు. తర్వాత చంద్రుడు,దుర్వాసుడు తమ తమ అంశములను దత్తునిలో నిక్షిప్తం చేసి తపస్సు చేయడానికి వెళ్లిపోయారు.

(బ్రహ్మ నా తండ్రి, మాయ(ప్రకృతి) నా తల్లి వారి ఐక్యం వల్లనే నాకీ దేహం వచ్చింది. నేనే దైవం,శిరిడీలోనూ సర్వత్రా నేనే వున్నాను, సర్వ జగత్తూ నాలోనే వుంది.నీవు చూస్తున్నదంతా కలిపి నేను..నేను శిరిడీలో మాత్రమే ఉన్నాననుకొనేవాడు నన్నసలు చూడనట్లే - అన్న సాయి వాక్కుని సదా స్మరించినట్లయితే ఆయనెవరో క్రమంగా అర్ధం అవుతుంది.)


బాల్య లీలలు :
--------------
ఈ బాలుడు సామాన్యుడు కాదని అఙ్ఞానులను ఙ్ఞానమార్గాన నడిపి కైవల్యము చేర్చే మార్గదర్శకుడని ఙ్ఞానులు ఆయన్ను ప్రసంశించేవారు. దత్తులవారు మాత్రం గురుశుశ్రూష చేయక బాలునిగా, ఉన్మత్తునిగా, పిశాచపీడితునిలా విహరిస్తుండేవారు, అది చూచి సంశయించేవారు ఆయన కృపకి దూరమయ్యేవారు. ఒకసారి ఆశ్రమవాసులు, వయోవృద్ధులు దత్తస్వామిని చేరి గురువై తమను అనుగ్రహించవలసిందని ఆయన్ను కోరారు. దత్తులవారు వారితో ఏమీ మాట్లాడకుండా ఏకాంత నిష్టలో ఉండటానికి బయలుదేరారు, ఆశ్రమవాసులు ఆయన్ను వెంబడించారు. అది గమనించిన దత్తప్రభువు దగ్గరలో వున్న సరోవరంలో దిగి అదృశ్యులయ్యారు.

ఆయన్ను వెంబడిస్తూ వచ్చినవారు ఆయన దర్శనంకోసం అక్కడే వేచివున్నారు. ఇలా 100 సంవత్సరాలు గడిచేవరకు వారి సహనాన్ని, వారి దృఢ సంకల్పాన్ని పరిక్షించిన పిదప దత్తస్వామి వారి నమ్మకాన్ని పరిక్షించదలచి, ఒక స్త్రీని ఎడమతొడపై కూర్చోబెట్టుకుని సరోవరంలోంచి బయటకు వచ్చారు. దత్తులవారు ఈ విధంగా దర్శనమిచ్చినప్పటికీ ఆశ్రమవాసులు దృఢచిత్తులై అక్కడనుండి కదలలేదు. అప్పుడు దత్తులవారు మద్యాన్ని సేవిస్తూ. వెంటతెచ్చిన స్త్రీతో సరసాలాడటం మొదలుపెట్టారు. ఈ ఘటన కొందరిలో చిత్తచాంచల్యాన్ని కలిగించింది, ఇలా చిత్తం చెదిరినవారు - ఇటువంటి దురాచారుడు, స్త్రీలోలుడు ఆశ్రితులనెలా ఉద్ధరిస్తాడు? అంటూ ఆయన్ని విడిచివెళ్లారు(ఇటువంటివారినే శ్రీసాయి బాబా రాలిపోయే పూతతో పోల్చారు). అక్కడే మిగిలిన అతి కొద్దిమంది మాత్రం అక్కడ జరుగుతున్న చర్యల్ని పట్టించుకోకుండా చిత్తాన్ని కేవలం దత్తప్రభువుపైనే నిలిపివుంచి ఆయన్ని ఇలా స్తుతించారు - ఓ మహానుభావా నీవు యోగీశ్వరుడివి, పూర్ణ పరబ్రహ్మ స్వరూపూడివి, నిర్గుణుడవైనప్పటికీ భక్తులనుద్ధరించడానికి ఇలా సగుణరూపంలో సంచరిస్తున్నావు. ఇకనైనా ఈ దీనులని పరిక్షించటంమాని, నీ ఆశ్రయం కోరివచ్చిన మమ్ము ఉద్ధరించు ప్రభూ అంటూ స్తుతించగా, వారి ప్రార్ధనను మన్నించిన దత్తప్రభువు ఆ మునులకు తన నిజరూపాన్ని చూపి అనుగ్రహించారు.

ఈ విధంగా ఆశ్రమవాసుల్ని అనుగ్రహించిన తర్వాత దత్తప్రభువు తన తల్లిదండ్రుల చెంతకు వచ్చి, భక్తులను అనుగ్రహించడానికి, ప్రజలను సన్మార్గవర్తనులను చేయడానికి నేను సహ్యాద్రికి వెళ్లాలి నన్ను ఆశీర్వదించమనగా, సర్వఙ్ఞురాలైన ఆ మాత కూడా పుత్రవ్యామోహముతో అంగీకరించక - నా వద్దనే ఉండు,నన్ను విడిచి వెళ్లకని బ్రతిమాలింది. దత్తుల వారు పట్టు విడవకపోవడంతో - నా వల్ల కలిగిన దేహాన్ని నాకు ఇచ్చి నీ ఇచ్ఛ ప్రకారం నడుచుకోమని నిష్టూరమాడింది. దత్తాత్రేయుల వారు నవ్వుతూ తన చర్మాన్ని గోళ్లతో చీల్చి తన దేహాన్ని తల్లికి ప్రసాదించారు. ఆ దృశ్యాన్ని చూచిన అనసూయమాతకు దేహం నాశనమయినప్పటికీ, ఆత్మ శాశ్వతమనే సత్యం స్ఫురించినదై - కుమారా తల్లికి సహజమైన మాతృవ్యామోహంతో నిన్ను అర్ధం చేసుకోలేకపోయాను, అఙ్ఞానంతో అలమటించే మానవాళికి ఙ్ఞానాన్ని ప్రసాదించే మోక్షమార్గాన్ని అనుగ్రహించు అన్నది.

**వ్యామోహం సత్యాన్ని మరుగుపరుస్తుందనే విషయం తెలియజేయడానికే ఈ లీల జరిగిందని మనం గ్రహించాలి.

దత్తప్రభువు దినచర్య :
---------------------
దిగంబరుడూ,శరీమంతా భస్మం పులుముకొన్నవాడు,ఆత్మ ఙ్ఞానం కలిగించ గలవాడు, సర్వమతాల్లోనూ తన ప్రస్తావన ఏదో ఒక రూపంలో కలవాడు, ఏ అవతారంలోనూ లేని గురుదేవ అన్న విశేషణం కలవాడూ, సదా బ్రహ్మనిష్టకలవాడూ,ప్రసన్నుడు,నిర్మానసుడు ఐన దత్త ప్రభువుల వారు -

ప్రతిరోజూ కాశీలో గంగాస్నానము, మాహురపురములో ధ్యానము, కొల్హాపురిలో (కరవీరపురం) భిక్ష, నిర్మలమైన,స్వచ్ఛమైన తుంగభద్రా నీటితో దాహం తీర్చుకుని, సహ్యాద్రి పర్వతములో నిద్ర చేస్తారు. సహ్యాద్రి కల్పవృక్షము కింద మణిపీఠం ఉంది, దానిపై దత్త ప్రభువు ఆసీనుడై ఉంటాడు. మెడలో మణిహారం, మొలలో బంగారు మొలత్రాడు, వామాంకమున యోగలక్ష్మి మధుమతీదేవి, వెనుక కామధేనువు, నలుదిక్కులా నాల్గువేదాలూ నాలుగు కుక్కలుగా ఆయన పరివేష్టితుడై ఉండగా - ఆయన ముందు సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులూ, నవనాధుల ఆదిగాగల మహ్మాతులు ఆయన్ను స్తుతిస్తూ వుంటారు.కేవలం భిక్షాన్నం మాత్రమే గ్రహించే ఈ ప్రభువుకి అష్టసిద్ధులు,నవనిధులు దాస్యం చేస్తూ ఉంటాయి. ఎడమ చేతిలో త్రిశూలం, శంఖం, కమండలం ధరించి కుడి చేతిలో ఢమరుకం, చక్రం, జపమాల ధరించి ఉండగా గంధర్వుల గానం చేస్తూంటే. అప్సరసలు నృత్యం చేస్తూండగా దత్తప్రభువులు ప్రతిదినమూ దర్బార్ నిర్వహిస్తూవుంటారు. అట్టి ప్రభువు తనను దర్శించి, స్మరించినంత మాత్రానే ఇహ, పర సౌఖ్యాలు కలుగజేస్తుంటాడు.

**శ్రీ దత్తుల వారికి అవధూత అనే బిరుదువున్నది - అవదూతోపనిషత్తు ప్రకారం ఆ పదానికి అర్ధం.

శ్లో ఈఈ అక్షరద్వాద్వరేణ్యత్వాద్ధూత సంసార బంధనాత్
తత్వమస్యాది లక్ష్యత్వదవదూత ఇతీర్యతే ఈఈ

తా ఈఈ నాశరాహిత్యమూ,శ్రేష్టత్వమూ. విదిలించి వేయబడిన సంసారబంధము తత్త్వమసి అనే మహావాక్యానికి లక్షమవ్వడం వలన,అట్టి వారిని అవధూత అని చెబుతారు.


కార్త వీరార్జుని వృత్తాంతం :
-------------------------
త్రేతాయుగంలో ’హైహయ’ వంశానికి చెందిన కృతవీరుడనే చక్రవర్తి ’మహిష్మతి’ పట్టణాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తుండేవాడు. అతని భార్య శీలధారా దేవి. వీరికి ఎంతో మంది సంతానం కలిగినప్పటికీ, చ్యవన మహర్షి శాపం వల్ల ఒక్కరూ బ్రతకడంలేదు. సంతానం నిలబడటానికి ఎన్నో యాగాలు, పూజలు చేసినా ఫలితం లేకపోవడంతో శీలధారా దేవి ఎంతో మనో వేదనకు గురైంది. ఒకరోజు వారికి యఙ్ఞవల్క్య మహర్షుల వారిని దర్శించే భాగ్యం కలిగింది. మహర్షుల వారి సతీమణి మైత్రేయి మాత వారి వ్యధ విని వారికి అనంత వ్రతం చేయమని చెప్పి, వ్రత విధానం తెలియజేసింది. ఆ వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తున్నప్పుడు, దేవగురువు బృహస్పతి వారి ఇంటికి విచ్చేసి వారిని సూర్యభగవానుణ్ని కూడా ఆరాధించమని చెప్పి ఆలా చేస్తే పాపాలు నశించి పుత్ర సంతానం కలుగుతుందని తెలియజేస్తాడు. వారు చెప్పినట్లే ఆచరించిన కొన్ని రోజుల తర్వాత శీలధారా దేవి గర్భం ధరించి మగబిడ్డకి జన్మనిచ్చింది. ఐతే ఆ బాలుడు చూడ ముచ్చటగా వున్నప్పటికీ, అతని చేతులు వంకర తిరిగి సన్నగా బలహీనంగా వుండి వేలాడుతున్నాయి. అంగ వైకల్యం గల పిల్లవాడు పుట్టేసరికి వారు ఎంతో దుఃఖించారు. అయినప్పటికీ ఆ బాలుణ్ని వారు ఎంతో ముద్దుగా పెంచసాగారు. ఆ బాలుడికి అర్జునడనే పేరు పెట్టారు. కృతవీర్యుని కొడుకు కావడం వల్ల కార్తవీరార్జునుడయ్యాడు. కొంతకాలానికి కృతవీర్యుడు మరణించాడు. రాజ్యభారం వహించడానికి కార్తవీరునికి అంగవైకల్యం దృష్ట్యా అర్హత లేకపోవడం వల్ల మంత్రులకు రాజ్యాన్ని అప్పగించి తాను తపస్సు ద్వారా శక్తులను పొంది రాజ్యానికి తిరిగి వస్తానని చెప్పి వెళ్లిపోతాడు. గర్గ మహాముని కార్తవీరునికి శ్రీ దత్తాత్రేయుల వారే ఈ వైకల్యాన్ని నివారించగలరని చెప్పి వారిని దర్శించుకోడానికి సహ్యాద్రికి వెళ్లమని రాజుకి చెప్తాడు. దత్తాత్రేయుల వారిని దర్శించినప్పుడు వారు తమ భక్తుల భక్తి శ్రద్ధలను కఠినంగా పరిక్షించి, ఆ తర్వాతే అనుగ్రహిస్తారని చెప్పి దేవేంద్రుడు దత్తుల వారి అనుగ్రహం వల్ల జంభాసురుని ఏ విధంగా వధించాడో తెలియజేస్తారు.

జంభాసురుడు దేవతలని జయించినప్పుడు ఇంద్రుడు దేవ గురువు బృహస్పతిని మార్గం తెలియజేయమని అడుగుతాడు. అప్పుడు బృహస్పతి సహ్యాద్రి పై కొలువై ఉన్న దత్త ప్రభువులే ఈ సమస్యని పరిష్కరించగలరని చెప్పి, ఆయన అనుగ్రహం పొందడంలో ఎదురయ్యే ఆటంకాలు జయించిన వారికే ఆయన తన నిజరూప దర్శనమిస్తాడని, దానికి ఎంతో భక్తి, శ్రద్ధలు అవసరమని చెప్తాడు. ఇంద్రుడు సహ్యాద్రికి చేరుకుని దత్తుల వారి దర్శనం కోసం వెళ్లినప్పుడు ఆయన మగువతో కలిసి మద్యాన్ని పానం చేస్తూ కనిపించారు. ఇలా ఎన్ని పరీక్షలు ఎదురయినా దేవేంద్రుడు ఆయన్ని విడువక సేవిస్తూనే వున్నాడు. కొన్ని రోజులకి ఇంద్రుని భక్తికి ప్రసన్నుడైన దత్త ప్రభువు తన నిజ రూపంలో దర్శనమిచ్చి జంభాసురుని సహ్యాద్రికి వచ్చేలా చెయ్యమని చెప్తాడు. ఇంద్రుడు జంభాసురుని కవ్వించి అతన్ని సహ్యాద్రికి వచ్చేలా చేస్తాడు. జంభాసురుడు తన సైన్యంతో సహా సహ్యాద్రికి రాగానే వాళ్లకి మహాసౌందర్యవతియైన అనఘా దేవి కనిపిస్తుంది. ఆమె సౌందర్యానికి మోహితులై యుద్ధాన్ని చేయడం మాని ఆమెను పల్లకీలో కూర్చోబెట్టారు. ఆమెను ముందుగా ఎవరు పొందాలని వారిలో వారు కలహించుకుంటున్నప్పుడు దత్తప్రభువు ఇంద్రున్ని పిలిచి రాక్షసులను ఓడించడానికి ఇదే సరైన సమయం అని తెలియజేస్తాడు. అప్పుడు ఇంద్రుడు వారిని సునాయాసంగా ఓడిస్తాడు. అలా ఇంద్రుడు దత్త ప్రభువుల కృపకు పాత్రుడై తన రాజ్యాన్ని తిరిగి పొందాడు అని పై వృత్తాంతాన్ని గర్గముని, కార్తవీరునికి తెలియజేస్తారు.

కార్తవీరార్జునుడు సహ్యాద్రి చేరి దత్తప్రభువుని దర్శించి, భక్తి శ్రద్ధలతో వారిని సేవించిన తర్వాత కొంతకాలానికి ఆయన ప్రసన్నులై అతని వైకల్యాన్ని నివారించారు. అంతేగాక అతనికి వేయి బాహువులను, ఇతరుల మనసులను గ్రహించే శక్తిని అనుగ్రహించి, తనంత వాడి చేతిలో మరణం పొందే వరాన్ని ఇచ్చారు. దత్త ప్రభువు అనుగ్రహ బలం చేత కార్తవీరార్జునుడు రావణాసురుడ్ని యుద్ధంలో ఓడించాడు. అలా చాలా కాలం రాజ్య పాలన చేసిన తర్వాత రాజ్యభోగాల పట్ల విసుగు చెంది సత్యాన్ని తెలుసుకోవాలనే కోరిక తీవ్రంగా కలిగి దత్త ప్రభువుని ఆశ్రయించాడు. లౌకిక శాస్త్రాలు విషయాల పట్ల ఆసక్తిని పెంచుతున్నాయి, తత్త్వ శాస్త్రానికి పండితులు తెలియజేసే అర్ధాలు పరస్పర విరుద్ధంగా వుండి సాధకులను గందరగోళానికి గురిచేస్తున్నాయి అని దత్త ప్రభువుతో చెప్పగా. దత్త ప్రభువు "కార్త వీర్యా ! కొన్ని అర్ధాల్లో బాహ్యంగా బేధాలు కనిపించినా, అవి ఒకే తత్త్వాన్ని భిన్నమైన కోణాల్లోంచి ప్రతిపాదించిన సూత్ర పరిశీలనలు మాత్రమే. ఉత్తమమైనది తత్త్వ శాస్త్రమే. అలా అని ఇతర శాస్త్రాలు లౌకికములు అని వాటిని నిరసించరాదు. శాస్త్రాలన్నీ మంచి మార్గానికి దారి చూపేవే. వాటి ద్వారా కూడా ముక్తి సాధించవచ్చు." అని చెప్పారు. ఆ తర్వాత అతనికి నిర్వికల్ప సమాధి స్థితి కలుగజేసి, ఆత్మ తత్త్వం విచారణ చేసే పద్ధతులను తెలియజేసి అతన్ని ఆశీర్వదించారు. చివరికి కార్త వీరార్జునుడు తాను పొందిన వరం వల్ల పరశురామ అవతారంగా వచ్చిన భగవంతుని చేతిలో మరణాన్ని పొందాడు.


ఙ్ఞానబోధ :
----------

**దత్తాత్రేయుల వారు అలర్కునికి, ప్రహ్లాదునికి, పరశురామునికి ఙ్ఞానబోధ చేసారు.

షోడశ అవతారాలు :
-------------------
1.యోగిరాజు 2.అత్రివరదుడు 3.శ్రీ దత్తాత్రేయుడు 4.కాలాగ్ని శమనుడు 5.యోగిజన వల్లభుడు 6.శ్రీ లీలా విశ్వంభరుడు 7.సిద్ధరాజు 8.ఙ్ఞాన సాగరుడు 9.విశ్వంభరావధూత 10.శ్రీ అవధూత 11.మాయాముక్తావధూత 12.ఆది గురువు 13.శివరూపుడు 14.శ్రీ దేవదేవ 15.దిగంబరుడు 16.శ్రీకృష్ణ శ్యామకమలనయనుడు.

**శ్రీ దత్తాత్రేయ సంప్రదాయంలో కలియుగానికి ముందు స్వామికి పదహారు అవతారాలని చెప్పబడింది.ఆయన పరతత్త్వంతో నిత్యం భూలోక నివాసం చేస్తాడు గనుక మహర్షులకు ఆయన ప్రసాదించిన సగుణ సాక్షాత్కారాలనే ఆయన అవతారాలని కీర్తించారని మనం గమనించాలి.

ఈ దత్తప్రభువు మానవజాతి నిలిచివున్నంతవరకూ గురురూపంలో మానవాళిని ఉద్ధరించడమే తన కార్యంగా చేసుకుని, వివిధ గురుసంప్రదాయాల ద్వారా అన్నిమతాల్లో, ప్రతియుగంలో 1,25,000 మంది అవధూతలు, మహాత్ముల రూపంలో ఈ భూమిపై తన కార్యం నిర్వహిస్తూవుంటారు. అట్టి గురుపరంపరలో భాగంగా, కలియుగంలో ఆంధ్రదేశంలోని తూర్పుగోదావరి జిల్లాలో అన్నవరానికి దగ్గరగా ఉన్న శ్రీ పీఠికాపురం (పిఠాపురం) అనే గ్రామంలో శ్రీపాద శ్రీవల్లభులుగా దత్తప్రభువు తన ప్రపధమ అవతారాన్ని ప్రకటించారు.

శ్లో ఈఈ కృతే జనార్ధనో దేవః
త్రేతాయాం రఘునందనః
ద్వాపరే రామకృష్ణాచ
కలౌ శ్రీపాద వల్లభః

తా ఈఈ కృత యుగములో జనార్ధనుడు,త్రేతా యుగములో రాముడు,ద్వాపర యుగములోకృష్ణుడు,కలి యుగములో శ్రీపాద శ్రీవల్లభుడు అవతార పురుషులని ఆది గురువు వేదవ్యాస మహర్షి తమ భవిష్యపురాణంలో తెలియజేసారు 

విజయ్ మహావాది నుంది సేకరణ 

Saturday, December 10, 2011

శ్రీ దత్త నామావళి



















పరమబ్రహ్మన్ - దత్తనమోగురు - గురూత్తమాయ - గురూత్తమాయ

1) వేదప్రమాణిత - దత్తనమోగురు
2) సృష్టి, స్థితి, లయ
3) ఏకాద్వితీయ
4) ఓంకారవాచ్య
5) అకార విధిముఖ
6) ఉకార హరిముఖ
7) మకార శివముఖ
8) అనఘా వల్లభ
9) హే యోగీశ్వర
10) హే యోగిరాజ
11) యోగోపదేశిక
12) యోగాధిదేవ
13) అనసూయత్మజ
14) అత్రి కుమార
15) ఆనంద రూప
16) ఆద్యంత రహిత
17) శృతి శునకాంఘ్రే
18) గోధర్మ సంగత
19) మధ్యే విధిముఖ
69) ఈశిత్వ సిద్ధికర
20) మధ్యే హరిముఖ
21) మధ్యే శివముఖ
22) శంఖ చక్రధర
23) ఢమరు త్రిశూల
24) కుండ్యక్షమాల
25) త్రిమూర్తి వదన
26) షట్కర శోభిత
27) కుంకుమ తిలక
28) ఊర్ధ్వ త్రిపుండ్ర
29) విభూతిపాల
30) స్ఫటికాక్షమాల
31) తులసీ మాల
32) రుద్రాక్షమాల
33) శ్రీపాద వల్లభ
34) నృసింహ సరస్వతి
35) మాణిక్య ప్రభువర
36) స్వామి సమర్ధ
37) శిరిడీ శాయిన్
38) శ్రీ పర్తి శాయిన్
39) హే ప్రేమ శాయిన్
40) శ్రీ శేష శాయిన్
41) క్షీరాబ్ధి శయన
42) హిమాలయశ్రయ
43) హే పద్మ పీఠ
44) రాజీవలోచన
45) లలాట నేత్ర
46) తేజస్వి నయన
47) బ్రహ్మ వర్చస
48) మహర్షి నాయక
49) కాశీస్నాత
50) కరవీరసాంధ్య
51) మాహురిభిక్షుక
52) సహ్యాద్రిశయన
53) ధరణి సంచార
54) భార్గవ సేవిత
55) అలర్క వందిత
56) పింగళ పూజిత
57) మాయావధూత
58) విశ్వంభరాఖ్య
59) శ్యామకామలాక్ష
60) త్రివదన షడ్భుజ
61) అత్రివరద
62) అణిమ సిద్ధికర
63) మహిమ సిద్ధికర
64) లఘిమ సిద్ధికర
65) గరిమ సిద్ధికర
66) ప్రాప్తి సిద్ధికర
67) కామ్య సిద్ధికర
68) వశిత్వ సిద్ధికర
69) ఈశిత్వ సిద్ధికర
70) అష్టసిద్ధి సుత
71) త్రేతాయుగేక్షిత
72) మార్గశీర్షగత
73) పూర్ణిమాకలిత
74) ఉషనిషదుక్త
75) విశ్వరూపాంతర
76) గీతాబోధక
77) యోగీశ్వరోక్త
78) బ్రహ్మ సూత్రార్ధ
79) జ్ఞాన సముద్ర
80) గురుకుల తిలక

శ్రీ దత్త నవరత్నాలు






















1::
నమస్తే త్రిమూర్తి స్వరూపోజ్వలాయ
నమస్తే త్రిధా సర్గ రక్షాలయాయ
నమస్తే త్రిశక్త్యఙ్గనా వల్లభాయ
పరబ్రహ్మ దత్తాయ భూయో నమస్తే

2::
నమస్తే త్రిలోకాది మధ్యాత్యయాయ
నమస్తే త్రికాలార్ధ సన్దర్శనాయ
నమస్తే త్రిపుట్యర్ధ సద్బోధకాయ
పరబ్రహ్మ దత్తాయ భూయో నమస్తే

3::
నమస్తే త్రివేద స్వరోచ్చారణాయ
నమస్తే త్రిపుణ్ర్డోర్ధ్వ రేఖాముఖాయ
నమస్తే త్రిణేత్రాన్తరాలోకనాయ
పరబ్రహ్మ దత్తాయ భూయో నమస్తే

4::
నమస్తే త్రిధాచార్య రూపాగతాయ
నమస్తే త్రివేదాన్త సంస్థాపకాయ
నమస్తే త్రిభాష్య ప్రయాగాన్వయాయ
పరబ్రహ్మ దత్తాయ భూయో నమస్తే

5::
నమస్తే త్రిబన్ధేషణా ఖణ్డనాయ
నమస్తే త్రికర్మేధ్మ దాహానలాయ
నమస్తే త్రిదేహైక మోక్ష ప్రదాయ
పరబ్రహ్మ దత్తాయ భూయో నమస్తే

6::
నమస్తే త్రిపాదార్ధ మన్త్రాధిపాయ
నమస్తే త్రిమన్త్రైక మోక్షప్రదాయ
నమస్తే త్రివర్ణైక వర్ణేరితాయ
పరబ్రహ్మ దత్తాయ భూయో నమస్తే

7::
నమస్తే ధరామణ్డలే సఞ్చరాయ
నమస్తే చతుస్సారమేయావృతాయ
నమస్తే సకృద్భిన్న రూపేక్షితాయ
పరబ్రహ్మ దత్తాయ భూయో నమస్తే

8::నమస్తే శివబ్రహ్మ విష్ణ్వాననాయ
నమస్తే షడబ్జాంశు పాణి వ్రజాయ
నమస్తే உనసూయాత్రి పుత్రాయితాయ
పరబ్రహ్మ దత్తాయ భూయో నమస్తే

9::నమస్తే మహా ఙ్ఞాన సత్పణ్డితాయ
నమస్తే గురుశ్రేణి రాజోత్తమాయ
నమస్తే మహాయోగ పీఠేశ్వరాయ
పరబ్రహ్మ దత్తాయ భూయో నమస్తే

ఫలశ్రుతి::
దత్తాయ నవరత్నానాం...శ్లోకమాలాం సమర్పితాం
కృష్ణేన పఠతాం సిద్ధః....శ్రీ దత్త సదనుగ్రహః

శ్రీ దత్తాష్టకము





















శ్లో బ్రహ్మవిష్ణు శివాఖ్యానం మూర్తీనాం మూలహేతవే
త్రిమూర్తి ముఖ పద్మాయ దత్తాత్రేయాయతే నమః

శ్లో అరుణ శ్యామధావళ్య వర్ణ మిశ్రమ వర్ణినే
అనసూయైక భాగ్యాయ దత్తాత్రేయాయతే నమః

శ్లో శంఖం చక్రం త్రిశూలం చ ఢక్కా మపికమండలమ్
బిభ్రతేஉక్ష స్రజంహస్తైః దత్తాత్రేయాయతే నమః

శ్లో కుర్వతే భావమాత్రేణ సృష్టి స్థితి లయానపి
సర్వదేవ స్వరూపాయ దత్తాత్రేయాయతే నమః

శ్లో గురూణాం గురురాజాయ శ్రుతీనాం శ్రుతయేஉపిచ
శాస్త్రాణా మపి శాస్త్రాయ దత్తాత్రేయాయతే నమః

శ్లో బాలోన్మత్త దీక్షాయ సర్వ లీలా విహారిణే
అవధుతైక లక్షాయ దత్తాత్రేయాయతే నమః

శ్లో కరుణావాహినీమూల - వాత్సల్యార్ణవ చక్షుషే
ఆహ్వానాదేవదృష్టాయ దత్తాత్రేయాయతే నమః

శ్లో శ్రితానుద్దర్తు కామాయ కలౌ సర్వగతాయ చ
సాధ్యా సాధ్యాని దదతే దత్తాత్రేయాయతే నమః
ఫలశ్రుతి
శ్రీ దత్తాత్రేయాయ దేవస్య పుణ్యం కృష్ణ కృతాష్టకమ్
పఠతాం స్యాదిహాముత్ర ఫలమీప్సిత మక్ష్యయమ్.

ఓం శాంతిః శాంతిః శాంతిః

శ్రీ బ్రహ్మాస్త్ర స్తోత్రము


























1:-నమో నమో బ్రహ్మాస్త్రాయ - సర్వశోక వినాశకాయ
సాంధ్య ధీధితి భామయాయ - వేద మంత్ర ప్రజ్వలనాయ

2:-ఇచ్ఛ యైవ వ్యక్త జగతే - సర్వసాధ్య విభూతి మహతే
అప్రతీప మేవ విశతే - బ్రహ్మతేజో రాశి లసతే

3:-జప కమండలు తోయజాయ - బ్రహ్మ వాక్య విజృంభితాయ
సర్వ దేవత వందితాయ - సేవకాయిత సర్వాస్త్రాయ

4:-అనఘా శక్తి ప్రచోదకాయ - దత్తాత్రేయ స్వరూపకాయ
ఆగమ విద్యుదుజ్జ్వలాయ - జ్ఞానమహాగ్నిజ్వాలికాయ

శ్రీదత్త మంత్రం

దిగంబర, దిగంబరా, శ్రీ పాద వల్లభ దిగంబరా
దిగంబర, దిగంబరా,అవధూత చింతన దిగంబరా

శ్రీ దత్తమాలా మహామంత్రము



దత్తమాలా మహామంత్రము

శ్రీ గ ణేశాయ నమ:

అధ:: దత్తమాలా మహామంత్రము
అస్యశ్రీ దత్తాత్రేయ మాలా మంత్రస్య: సదాశివ రుషి ;అనుశ్టుప్ చంద;, శ్రీ దత్తాత్త్త్రేయో దేవతా ;ద్రాం బీజం, నమ;ఇతి శక్తి దత్తాత్త్త్రేయాయేతి కీలకం మమ అఙ్నాన నివ్రుత్తి ద్వారా ఙ్నాన వైరాగ్య చతుర్విధ పురుషార్ధ సహిత అభీష్ట కామనా సిధ్యర్ధే జపే వినియొగ; -

పార్వత్యువాచ::

మాలా మంత్రం మమ బ్రూహి ప్రియా యస్మాదహంతవ
శ్రీ ఈశ్వర ఉవా
శ్రుణు దేవి ప్రవక్షామి మాలా మంత్ర మనుత్తమం
ఓం నమో భగవతే దత్తాత్త్రేయాయ
స్మరణ మాత్ర సంతుష్తాయ
మహా భయ నివారణాయ
మహా ఙ్నాన ప్రదాయ
చిదానందాత్మనే
బాలోన్మత్త పిశాచ వేశాయ
మహాయొగినే
అవధూతాయ
అనసూయానంద వర్ధనాయ
అనఘాయ
ఆనంద వర్ధనాయ
అత్రిపుత్రాయ
సర్వకామ ప్రదాయ

ఓం - భవబంధ మోచనాయ
ఆం - అసాధ్య బంధనాయ
హ్రీం - సర్వ భూతిదాయ
క్రోం - అసాధ్యాకర్షణాయ
ఐం - వాక్ప్రదాయ
క్లీం - జగత్రయ వశీకరణాయ
సౌ -;సర్వమన:క్షోభణాయ
శ్రీం - మహా సంపత్ప్రదాయ
గ్లీం - భూమందలాధిపత్యాయ
ద్రాం - చిరంజీవినే
వషట్ వశీకురు వశీకురు
వౌషడాకర్షయా కర్షయ
హుం విద్వేషయ విద్వేషయ
ఫట్ ఉచ్చాటయొచ్చటయ

ఠ:ఠ: - స్తంభయ స్తంభయ
ఖేం ఖేం -మారయ మారయ
నమస్సంపన్న్నాయ యసంపన్న్నాయ
స్వాహా పోషయ పోషయ
పరయంత్ర ప్రమంత్రపర తంత్రాణి ఛింది ఛింది
గ్రహన్న్నివారయ నివారయ
వ్యాధీన్ వినాశయ వినాశయ
దుఖం హరహర
దారిద్ర్యం విద్రావయ విద్రావయ
దేహం పోషయ పోషయ
చిత్తం తోషయ తోషయ
సర్వ మంత్ర స్వరూపాయ
సర్వ యంత్ర స్వరూపాయ
సర్వ తంత్ర స్వరూపాయ
సర్వ పల్లవ స్వరూపాయ
ఒం నమో మహా సిద్ధాయ స్వాహా
ఓం నమో భగవతే దత్తత్రేయాయ


మాలా మంత్రము
ఈ మాలా మంత్రం మహ మహిమొపేతమైనది. నాలుగువందల పర్యాములు నిష్ట తో జపించినట్లైతే సిద్ధి కలుగునని ఉవాచ ; సాధన చేయ దలచిన వారు ప్రతి దినము పదకొండు పర్యాయముల చొప్పున నలభై దినములు పారాయణ చేయవలెను ఇది భక్తుల స్వానుభవములొ తెలిసినది.

దిగంబరా దిగంబరా శ్రీ పాద వల్లభ దిగంబరా
జై గురు దత్తా సద్గురు దత్తా

దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభా దిగంబర

శ్రీదత్త జయంతి సంద్రభంగా..

శ్రీపాద వల్లభగురో: వదనారవిందం
వైరాగ్యదీప్తి పరమోజ్వల మద్వితీయం
మందస్మితం సుమధురం కరుణార్ద్ర నేత్రం
సంసార తాపహరణం సతతం స్మరామి

శ్రీపాద వల్లభగురో: కరకల్పవృక్షం
భక్తేష్ట దాననిరతం రిపుసంక్షయంవై
సంస్మరణ మాత్రచితి జాగరణం సుభద్రం
సంసార భీతి శమనం సతతం భజామి

శ్రీపాద వల్లభగురో: పరమేశ్వరస్య
యోగీశ్వరస్య శివశక్తి సమన్వితస్య
శ్రీపర్వతస్య శిఖరంఖలుసన్నివిష్టం
త్రైలోక్య పావన పదాబ్జ మహం నమామి .

"దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా "

Tuesday, July 7, 2009

జయ గురు దత్తాయనమః



ఓమ్ జయ గురు దత్తాయనమః !!

1)దిగంబరం భస్మవిలేపితాంగం
బోధాత్మకం ముక్తితరం ప్రసన్నం
నిర్మానసం శ్యామల తనుంభజేహమ్
దత్తాత్రేయం బ్రహ్మ సమాధియుక్తం


2)అనసూయాత్రి సంభూతా దత్తాత్రేయో దిగంబరః
స్మర్తృగామి స్వభక్తాన ముద్ధార్థ భవసంకటాత్


శ్రీమహా గణాధిపతయే నమః

దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్త వత్సలమ్
ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామీ సనోవతు
.

శ్రీ దత్తా రక్షామంత్ర

ఓమ్ ఐం హ్రీం శ్రీం శ్రీవరహ అనఘ దత్తాయ నమః

Om Aim Hreem Srim Shivarama Anaghaa Dattaaya Namaha

ఓమ్ దిగంబరాయ విద్మహే అత్రిపుత్రాయ ధిమహి తన్నో దత్త ప్రచోదయాత్

Om digambaraaya vidmahE atriputraaya dhimahitannO datta prachOdayaat



!! Om jaya guru dattaayanama@h !!

1)digaMbaraM bhasmavilEpitaaMgaM
bOdhaatmakaM muktitaraM prasannaM
nirmaanasaM Syaamala tanuMbhajEham
dattaatrEyaM brahma samaadhiyuktaM


2)anasooyaatri saMbhootaa dattaatrEyO digaMbara@h
smartRgaami swabhaktaana muddhaartha bhavasankaTaat

Sreemahaa gaNaadhipatayE nama@h

dattaatrEyaM mahaatmaanaM varadaM bhakta vatsalam
prapannaartiharaM vandE smartRgaamee sanOvatu.

!! Sree dattaa rakshaamantra !!

Om aiM hreeM SreeM Sreevaraha anagha dattaaya nama@h

Om digaMbaraaya vidmahE atriputraaya dhiimahi tannO datta prachOdayaat
!