Thursday, April 26, 2012

శంకర జయంతి శుభాకాంక్షలతో



































Adi Shankaracharya- An Introduction
by Sesha Sai Sharma garu

సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం
అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం||

పరమశివుని మొదలు, ఆది శంకరుల మధ్యగా, నా గురువులు ఋషి ప్రభాకర్ గారి వరకు ఉన్న గురు పరంపరకు వందనములు.
కైలాస వాసుని అవతారంగా భావించబడే శంకరుల కృప వలన మనకు ఈ రోజు హిందూ మతములో స్పష్టత, పారదర్శకత, లోతు, ఐక్యత ఉన్నవని అనుటలో అతిశయోక్తి ఏ మాత్రం లేదు.

ఎందరో మహర్షుల, ఋషుల నోట అంతర్యామి వాక్కులుగా పలుకబడిన శక్తి వేదములుగా ప్రకాశిస్తున్నాయి. ఎవరో రచించి, మరెవరో పరిశీలనము, విమర్శ చేసేందుకు అవి పురాణాలు, నవలలు కావు. విశ్వవ్యాప్తుని మనోకమలము నుండి స్వయంగా మహాపురుషుల నోట వెలువడిన సచ్చిదానందములు వేదములు. అంతటి వేదములకు కూడా వక్ర భాష్యము చెప్పి, భారతీయ సమాజంలో విభజన కలిగించి, మూఢ చాందస భావాలను ప్రేరేపించి అన్యమతముల వైపు ప్రజలను మళ్లించిన సమయంలో ఆ పరిస్థితిని చక్క దిద్దటానికి శంకరులు కాలడిలో శివ గురు శక్తితో ఆర్యాంబ గర్బములో ఉత్తరాయణ పుణ్య కాలమున వైశాఖ శుద్ధ పంచమి నాడు అవతరించారు. చిన్ముద్రతో, మౌనంతో జ్ఞానాన్ని వ్యాపింప జేసే దక్షిణామూర్తి రూపమైన పరమ శివుడు ఈ దంపతులను ఆశీర్వదించగా శంకరులు ఉదయించారు. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు ఆయన దైవిక శక్తి, మార్గము కాలడిలో ప్రస్ఫుటించాయి.

మూడవ యేటనే తండ్రిని కోల్పోయిన శంకరులకు ఐదవ యేట ఉపనయన సంస్కారము జరిగింది. బ్రహ్మచర్య దీక్షలో భాగంగా మాధుకరం కోసం భిక్షాటనకు వెళ్లిన శంకరులకు ఒక పేద బ్రాహ్మణుని యింటి యిల్లాలు వద్ద ఉసిరికాయ తప్ప ఏమీ దొరకలేదు. ఆమె దుస్థితికి కరిగిన శంకరులు లక్ష్మీదేవిని కనకధారా స్తోత్ర రూపంలో ప్రార్థించగా ఆ తల్లి కరుణించి ఆ ఇంట బంగారు ఉసిరికలు కురిపించి వారి దారిద్ర్యాన్ని పోగొట్టిందిట.

దిన దిన ప్రవర్థమాన మవుతున్న శంకరులకు మహర్షులు వచ్చిన దేశాన్ని ఉద్ధరించాలన్న కర్తవ్యాన్ని గుర్తు చేస్తారు. తల్లి అనుమతితో సన్యాసం స్వీకరించి శంకరులు భారత దేశ యాత్ర మొదలు పెడుతారు.
ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నర్మదానదిని తన కమండలములో బంధించిన శంకరుని చూసి ముగ్ధులైన గురు గోవింద భగవత్పాదులు శంకరులను తన శిష్యునిగా స్వీకరిస్తారు. గోవింద భగవత్పాదులు శంకరులకు వేదవేదాంగాలు ఉపదేశిస్తారు. ఆత్మ, పరమాత్మ ఒక్కటే అన్న అద్వైత సిద్ధాంతాన్ని కూడా శంకరులకు బోధిస్తారు. ఆ సందేశాన్ని ప్రపంచానికి చాటమని శంకరులను ఆశీర్వదించి పంపిస్తారు.

శంకరులు కాశీకి పయనమవుతారు. అక్కడికి చేరే సమయానికి ఆయనకు చాలా మంది శిష్యులు ఏర్పడుతారు. ఒకసారి ఒక శిష్యుడు నది ఈవలి ఒడ్డున గురువుల వస్త్రములు ఆరవేస్తుండగా శంకరులు అతనిని ఆవలి ఒడ్డు నుండి పిలుస్తారు. గురువుగారి పూర్తి ధ్యాసతో ఆ శిష్యుడు అడుగులు వేస్తూ నదిని దాటుకుంటూ వెళుతాడు. ఆ శిష్యుడు అడుగు వేసిన ప్రతిచోట ఒక పద్మము వెలసి ఆయనను నీట మునగ కుండా కాపాడుతుంది. అంతటి మహిమాన్వితమైన గురుకృపను పొందిన ఆ శిష్యుడు పద్మపాదునిగా పేరు పొందాడు.

ఒక రోజు శంకరులు గంగానదిలో స్నానం ముగించుకుని శిష్యులతో కలిసి విశ్వనాథుని మందిరానికి వెళుతున్నప్పుడు ఒక నిమ్న జాతికి చెందిన వాడు ఎదురు పడతాడు. అప్పటి ఆచారాల ప్రకారం శంకరులు వాడిని తప్పుకో, దారి విడువుము అని అంటాడు. అప్పుడా చండాలుడు నీవు తప్పుకోమంటున్నది ఈ దేహమునా? నా ఆత్మనా? అని ప్రశ్నిస్తాడు. అప్పుడు శంకరులు తన అహంకారానికి పశ్చాత్తాపపడి ఆ చండాలుని పరమశివునిగా గ్రహించి ప్రణమిల్లుతాడు. ఆ సందర్భంలో చండాలుని రూపములో ఉన్న శివుడు శంకరుని ఉద్దేశించి వేసిన ప్రశ్నలు మొదటి రెండు శ్లోకములు, అటు తర్వాత శంకరుల నోట వెలువడిన శ్లోకాలు మనీషా పంచకంగా పేరొందాయి. అద్వైతామృత సారమైన ఈ మనీషా పంచకం పరబ్రహ్మమొక్కటే అన్న సందేశాన్ని శంకర భగవత్పాదుల నోట మనకు అందించబడినది. తనలో ఉన్న ఆఖరి దుర్గుణమును ఈ సందర్భముగా శంకరులు దగ్ధము చేసుకునే అవకాశమును ఆ పరమ శివుడు చండాలుని రూపములో కలిగించాడు.

బ్రహ్మసూత్రాల కర్త అయిన వ్యాసుల వారి అనుగ్రహంతో వాటి భాష్యాలను అద్వైత సిద్ధాంతంతో పాటు దేశవ్యాప్తంగా ప్రచారం చేయటానికి పయనమవుతారు శంకరులు. దేశాటన చేస్తూ కాంచీపురంలో కామకోటి పీఠం, శృంగేరి శారదా పీఠం వంటి ఎన్నో క్షేత్రాలను స్థాపించారు. ఎన్నో వేల దేవాలయాలను పునరిద్ధరించారు. తిరువైమరుదూరు, తిరుచ్చి, శ్రీశైలము మొదలైన ప్రదేశాలలో ఎన్నో అద్బుతమైన స్తోత్రాల ద్వారా అక్కడి పుణ్యక్షేత్రాలను పునరుత్థానం చేసారు.
హఠకేశ్వరం అడవులు శ్రీశైల ప్రాంతంలో ఉన్నాయి. ఇవి కీకారణ్యములు. ఇక్కడ కాపాలికులు నివసించే వారు. కాపాలికులు శ్మశానాలలో ఉంటూ ఆటవిక జంతు మానవ బలుల ద్వారా దేవతలకు ప్రీతి కలిగించే వారు. ఆది శంకరులు ఒకసారి ఇక్కడ తపస్సు చేస్తుండగా ఒక కాపాలికుడు వచ్చి శంకరులను ఆ పరమేశ్వరునికి బలిగా రమ్మని అడిగాడుట. అందుకు శంకరులు సమ్మతించి బలికి సిద్ధమయ్యారు. కాపాలికుడు శంకరుల తల నరుకబోగా విష్ణుమూర్తి నృసింహ రూపంలో ప్రత్యక్షమై కాపాలికుని సంహరించాడు. ఆ సందర్భముగా ఆది శంకరులు ఆ నరహరిని స్తుతిస్తూ కరుణారస పూరితమైన, శరణాగతితో నిండిన లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని రచించారు.

తల్లి ఆర్యాంబ మరణించినప్పుడు సన్యాసియైన తాను ఆమెకు ఉత్తరక్రియలు చేయకూడదని తన కంటి నుండి అగ్నిని సృష్టించి ఆమె చితికి నిప్పు రాజిల్ల జేస్తారు. తన అనుపమానమైన శక్తితో మూకాంబిక, కోటచాద్రి, తిరుమల, పురీ, ద్వారక మొదలైన క్షేత్రాలను అత్యంత మహిమాన్విత క్షేత్రాలుగా తీర్చిదిద్దుతారు శంకరులు.భక్తి, జ్ఞాన, వైరాగ్యములతో మానసికోత్థానం కోసం, హిందూ మత శాఖల, పీఠాల ఐక్యత కోసం, ఉనికి కోసం అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. ఎందరో పండితులు, విమర్శకులను ఒప్పించి దేశ వ్యాప్తంగా పంచాయతన పద్ధతిలో పీఠాలు, మఠాలు, క్షేత్రాలు స్థాపించారు. పామరులనుండి పండితుల వరకు వారి వారి చేతనావస్థను బట్టి స్తోత్రాలు, ప్రకరణలు, లోతైన ఆధ్యాత్మిక గ్రంథాలు రాసి, ఈనాటి వరకు ఆ జ్ఞాననిధి, ఆధ్యాత్మిక వారసత్వ సంపద నిలిచేలా చేశారు.
తన యాత్రల చివరలో శంకరులు బదరీ క్షేత్రానికి వెళ్లినప్పుడు శ్రీ మహావిష్ణువు ఆయనను అలకనంద నదిలో ఉన్న తన విగ్రహాన్ని ప్రతిష్ఠించి అక్కడ ఒక క్షేత్రాన్ని ఏర్పాటు చేయమని నిర్దేశిస్తాడు. శంకరులు అక్కడ బదరీనారాయణ క్షేత్రాన్ని, జ్యోతిర్మఠాన్ని స్థాపించి ఆ పరమాత్మలో ఐక్యమవుతారు.

ఆ శంకరుల కృప వలననే మనకు నేడు అష్టాదశ శక్తి పీఠములు, చార్ ధామ్ మొదలైన పుణ్య క్షేత్రాలు, వాటి వలన మనకు అత్యున్నతమైన హైందవ అద్వైత సిద్ధాంత సారమైన జీవనశైలి, సమాజము భాసిల్లుతున్నాయి.
శంకరుల రచనలు:
ఆయన చేసిన స్తోత్రాల్లో మనీషా పంచకము, సాధన పంచకము, భజగోవిందము, గోవిందాష్టకము, పాండురంగాష్టకము, శివ సువర్ణమాలా స్తోత్రము, అర్థనారీశ్వర స్తోత్రము, కాలభైరవాష్టకము, దక్షిణామూర్తి స్తోత్రము, నిర్వాణ షట్కము, అన్నపూర్ణాష్టకము, అచ్యుతాష్టకము, మహిషాసుర మర్దిని స్తోత్రము, త్రిపురసుందరీ స్తోత్రము, భుజంగాష్టకాలు, భవాన్యష్టకము, దేవీనవరత్నమాలికా, విశ్వనాథాష్టకము, ఉమామహేశ్వర స్తోత్రము ఇలా ఎన్నో సామాన్య జనులకు జీవన దిశానిర్దేశము చేసే స్తుతులను రచించారు. ఆధ్యాత్మికంగా ఇంకొక పై మెట్టులో సౌందర్యలహరి, శివానందలహరి, వివేకచూడామణి మొదలైనవి, ఇంకొక పై మెట్టుపై భాష్యాలు.

ఆదిశంకరుల రచనలు మూడు రకాలుగా విభజించవచ్చు. మొదటిది ఆధ్యాత్మికంగా బాగా ముందడుగు వేసిన వారికి - ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత మీద రాసిన భాష్యాలు. రెండవది వీటి సారాన్ని ప్రకరణలుగా రాసినవి. మూడవది దేవతా స్తోత్రాలు. కొన్ని స్తోత్రాల వివరాలు.

విష్ణు షట్పది:
మనస్సుపై స్వాధీనము కొరకు విష్ణుని ప్రార్థిస్తూ రచించిన ఈ స్తోత్రము మానసిక ప్రశాంతతకు చాలా తోడ్పడుతుందని నమ్మకం. భయము, అహంకారముతో కప్పబడిన ఈ జీవితం భవ సాగరమై మరిన్ని జన్మలకు కారణము అవుతుంది. కావున, వాటిని అధిగమించి, మనసును లగ్నము చేసి, ధ్యేయము వైపు ధ్యానించి సత్య జ్ఞాన ప్రాప్తికి కృషి చేయవలెను అని ఈ స్తోత్రము ద్వారా మనకు ఆది శంకరులు చక్కని సందేశాన్ని అందించారు. భయమే మృత్యువు, భయమే శత్రువు. అహంకారమే పతనము. అహంకారమే అత్యంత ప్రమాదకరమైన శత్రువు. వాటిని అధిగమించటం ఆధ్యాత్మిక పరమార్థము. అదే పరమాత్ముని దర్శనము. అదే మోక్ష కారకము.

సాధనా పంచకము:
శంకరులు అద్వైత సిద్ధాంతమును కాలి నడకలో భారత దేశమంతా తిరుగుతూ ప్రచారం చేసి, దానికోసం కావలసిన పీఠాలను, ధార్మిక క్షేత్రాలను స్థాపించారు. సద్గురు సాంగత్యము, శిష్యరికము, దైవారాధన, నిత్య నైమిత్తిక చర్యలు, ధ్యానము, యోగము, సత్సంగము, భక్తి మొదలైన సాధనాలతో పరబ్రహ్మ తత్త్వమును గ్రహించి, అనుభూతి పొందవచ్చు అని శంకరులు మనకు దివ్యామృతమును అందజేశారు.

దీనికోసం ఏమి చేయాలో ఒక ఉన్నతమైన స్థాయిలో ఐదు సూత్రాలను ఆదిశంకరులు మనకు సాధనా పంచకం రూపంలో ఇచ్చారు. ఇందులో విషయము చాలా సులభముగా అనిపించినా, అది ఆచరణలో పెట్టటానికి ఎంతో నియమము, నిగ్రహము, పట్టుదల అవసరం. ఉదాహరణకు - వేదములను అధ్యయనం చేద్దాము - అనేది ఒక ధ్యేయము. మరి దానికి సరైన గురువు, పాఠశాల, క్రమశిక్షణతో కూడిన దైనందినచర్య, అభ్యాసము, ఏకాగ్రత, సాధన - ఇవన్నీ కావాలి. అలాగే, అహంకారము వదలుట అనేది ఒక ధ్యేయము - మరి దీనికి మన అలవాట్లు, మానసిక స్థితి ఏవిధంగా ఉండాలో ఊహించండి. నియమిత సాత్త్విక ఆహారము తీసుకోవటం, సుఖములకు, దుఖములకు అతీతంగా, రాగద్వేషాలు లేకుండా - ఒక రకమైన ఉదాసీన వైఖరిని అలవరచుకోవాలి. దీనికి మళ్లీ పైన చెప్పిన గురువు, అభ్యాసము, సాధన, క్రమశిక్షణ అన్నీ అవసరం.సాధనా పంచకాన్ని ఒక శిఖర మార్గముగా తీసుకుని, దానిలో ఉన్న ప్రతి పరమాణు ధ్యేయములకు సద్గురువును ఆశ్రయించి, శ్రుతులను అనుగమిస్తూ, జీవన శైలిలో వాటిలో పయనిస్తూ, అవరోధాలను అధిగమిస్తూ అవరోహణ చెయ్యాలి. దీనికి భక్తి, జ్ఞానము, వైరాగ్యము, పరిశ్రమ, సహనము, శ్రద్ధ అన్ని తోడు చేసుకోవాలి. అప్పుడే ఆ సచ్చిదానంద స్థితిని పొందగలరు. ఈ పంచకము లోని భావమును, నిగూఢమైన ఆశయములను, సందేశమును తెలుసుకోవలసినదిగా సాధకులకు శంకరుల ఉద్దేశము.

శివ సువర్ణమాలా స్తుతి:
యాభై శ్లోకాలలో లయ బద్ధమైన పదాలు, భక్తి, సర్వస్య శరణాగతి, ఆత్మానుభూతి, లోతైన వివేచనము తో సాగే సువర్ణమాల స్తోత్రమును ఆ అపర శంకరుడు ఆది శంకరులు రచించారు. సాంబ = స+ అంబ - నిరంతరం ఆ జగదంబ అయిన పార్వతితో కూడి అర్థనారీశ్వరుడై ఉన్నాడు కాబట్టే ఆ పరమ శివుడు సాంబుడు అయినాడు. పార్వతీ సమేతుడవైన శివా! శంభో! నీ పాదములకు నమస్కారములు. నాకు శరణునిమ్ము అనే అంతరార్థంతో సాగే ఈ స్తోత్రములో శివుని అశేష కీర్తి, అగణిత గుణ గణములను ఆది శంకరులు నుతించారు. స్తోత్రము ముందుకు సాగుతున్న కొద్దీ ఆ పరమశివుని వర్ణన, కైలాసము ఎదుట ఉందా అన్న భావన ఆదిశంకరులు కలిగిస్తారు. యాభై శ్లోకాలు అనర్గళంగా ఒకే దేవతపై రాయాలంటే ఆత్మ జ్ఞాన పరిపూర్ణుడై, దైవ సాక్షాత్కారము కలిగి, ఎల్లప్పుడూ ఆ దైవము కన్నుల ఎదుట నిలిచి ఇటువంటి అనుభూతిని కలిగిస్తే, ఆ ఆవేశం స్తోత్ర రూపంలో వెలువడి ఇన్ని వేల ఏళ్ళు నిలబడ గలుగుతుంది.

ఆయన మహిమను తెలిపే ఒక స్తుతి - తోటకాష్టకము:
ఆ శంకరుని శిష్యులలో ఒకడైన ఆనందగిరి తన గురువులను స్తుతిస్తూ రచించిన తోటకాష్టకం ఆ శంకరుల లక్షణాలను, వైభవాన్ని, ఆధ్యాత్మిక శక్తిని ప్రతిబింబిస్తుంది.ఆనందగిరి ఈ స్తోత్రాన్ని తోటక ఛందములో రాయటం వలన దీనికి తోటకాష్టకం అని పేరు వచ్చింది. దీని వెనక ఒక చిన్న కథ ఉంది.

శంకరుల శిష్యులలో ఆనందగిరి కొంత మంద బుద్ధి. కానీ, అమితమైన గురు భక్తి కలవాడు. నిరంతర గురు సుశ్రూషలో ఉండేవాడు గిరి. ఒక రోజు, శంకరులు తన ప్రాతః కాల దినచర్యలో భాగంగా ఉపనిషత్ ప్రవచనం ఆరంభించారు. ఆ సమయంలో శిష్యులంతా శాంతి పాఠం మొదలు పెట్టారు. కానీ, గిరి మాత్రం అక్కడ లేదు. గురువు గారి వస్త్రములు ఉతకటానికి నది దగ్గరకు వెళ్ళాడు. శంకరులు ఇది గమనించి మిగిలిన శిష్యులను గిరి వచ్చేదాకా వేచి ఉండమని పలుకుతారు. అప్పుడు పద్మపాదుడనే శిష్యుడు గర్వముతో 'వాడు మూర్ఖుడు, వానికి శాస్త్రములు నేర్వవలసిన అర్హత లేదు. వానికోరకు ఎందుకు వేచి ఉండటం' అని అంటాడు. శంకరులు పద్మపాదుని గర్వము అణచుటకు, తన దైవ శక్తితో ఆనందగిరికి సకల శాస్త్ర పరిజ్ఞానమును క్షణకాలములో కలిగేలా చేస్తారు. నది వద్దనుండి తిరిగి వచ్చిన ఆనందగిరి గురువుగారిని నుతిస్తూ తోటకాష్టకాన్ని ఆశువుగా పఠించాడు.

మిగిలిన శిష్యులకు సిగ్గు, విస్మయం కలిగించేలా అతి కష్టమైనా తోటక ఛందములో ఎనిమిది శ్లోకాలతో అద్భుతంగా సాగుతుంది తోటకాష్టకం. అటు తర్వాత, ఆనందగిరి శృతి సార సముద్ధరణ అనే ఇంకొక రచన కూడ తోటక ఛందములో చేస్తాడు. శంకరుల నలుగురు ముఖ్య శిష్యులలో ఒకడై , తోటకాచార్యులుగా పిలవబడి, గురువులచేత బదరీలోని జ్యోతిర్మఠం నడపటానికి నియమించబడతాడు.

ముగింపు:
ఎంతో మంది స్వాములు, యతులు తర్వాత భారత దేశంలో జన్మించి, ఆధ్యాత్మిక సందేశాన్ని ప్రచారం చేశారు, కానీ శంకరులు సుస్థిర పరచిన అద్వైత సారము, ధార్మిక సిద్ధాంతాలు, పద్ధతులు ఇప్పటికీ చెక్కు చెదరకుండా, ప్రామాణికాలై కాలపు ఒడిదుడుకులను తట్టుకొని హిమాలయముల వలె ఉన్నతముగా నిలిచినది. ఇట్టి ఆధ్యాత్మిక సంపదను ఇచ్చిన ఆ పరమ శివ రూపమైన జగద్గారువులకు శత సహస్ర పాదాభివందనములు.

శ్రీలక్ష్మీ నృసింహ స్తోత్రము





















శ్రీ శంకర భగవత్పాదులు శిష్యులతో దేశ సంచారము చేయుచూ శ్రీశైలమునకు వచ్చినపుడు శ్రీ సంకరులను ఒక కాపాలికుడు చంప నిశ్చయించెను. ఒక గొప్ప రాజును గాని, యోగిని గాని బలి యిచ్చినచో కపాలి (ఈశ్వరుడు) తనకు కోరిన వరములిచ్చునని కాపాలికుని విశ్వాసము. శ్రీ శంకరులు దీనికి అంగీకరించి, నాశిష్యులవలన నీకు అపాయము కలుగకుండా చూచుకొనుము అని చెప్పిరి. కాపాలికుడు కత్తి నెత్తిన పెట్టు సమయమున శ్రీ శంకరులు అంగరక్షకులైన పద్మపాదు అను శిష్యునకు తమ గురువు ఆపదలో ఉన్నట్లు స్పురించి, అతడు నృసింహ మంత్రమును జపించుచూ గురుసన్నిధికి రాసాగెను. ఇంతలో భగవంతుడు నృసింహరూపమున వచ్చి ఆ కాపలికుని చీల్చి చంపి, శంకరులను కాపాడెను. ప్రత్యక్షమైన శంకరుని చూచి పరవశులై శ్రీ శంకరులవారు స్తుతించుచూ ఈ స్తోత్రమును చెప్పిరి. ఈ స్తోత్రమును పటించువారికి ఎట్టి ఆపదలు కలుగవని భక్తుల విశ్వాసము.

శ్రీ లక్ష్మీ నృసింహ స్తోత్రమ్

1||శ్లో|| శ్రీమత్ప యోనిధి నికేతన చక్రపాణే! భోగీంద్ర భోగమణి రాజిత పుణ్యమూర్తే !
యోగీ శ శాశ్వత శరణ్య! భవాబ్ది పోత! లక్ష్మీ నృసింహ ! మమదేహి కరావలమ్బమ్ ||

తా: పాలసముద్రము నివాసముగాగల ఓ దేవా! హస్తమున చక్రమును ధరించినవాడా ! ఆది శేషుని పడగలయందలి రత్నములచే ప్రకాశించు దివ్య దేహము కలవాడా! యోగులకు ప్రభువైన వాడా! శాశ్వతుడా! సంసార సాగరమునకు నావ యగువాడా! లక్ష్మీదేవి తో కూడిన నృసింహమూర్తీ! నాకు చేయూత నిమ్ము.

2||శ్లో || బ్రహ్మేంద్ర రుద్రా మరుదర్క కిరీటకోటి - సంఘటి తాఘ్రి కమలామల కాంతికాంత
లక్ష్మీ ల సత్కుచ న రో రు హరాజహంస - లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలమ్బమ్ ||

తా: బ్రహ్మ, దేవేంద్రుడు, శివుడు, వాయుదేవుడు, సూర్యుడు అను దేవతల కిరీటముల అంచులచే తాకబడిన పాదపద్మముల కాంతిచే ప్రకాశించు వాడా! లక్ష్మీ దేవి యొక్క అందమైన స్తనములనెడి తామర మొగ్గలకు రాజహంస యైన వాడా! ఓ లక్ష్మీ నృసింహాదేవా! నాకు చీయూత నొసగుము.

3||శ్లో || సంసార సాగర విశాలాక రాళ కాల - నక్ర గ్ర హగ్ర సన నిగ్ర హ విగ్ర హాస్య |
వ్యగ్ర స్య రాగర సనో ర్మి నిపీడిత స్య - లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలమ్బమ్ ||

తా: ఓ దేవా నేను సంసారమనెడి సముద్రములో మునిగి, భయంకరములై, పెద్ద వైన కోరికలనెడి మొసళ్ళు మున్నగు క్రూర జల చరములచే మ్రింగ బడుచున్నాను. రాగ మనెడి ధ్వనించు అలలచే బాదింపబడుచున్నాను. ఓ నృసింహ దేవా! అట్టి నాకు చేయూత నిచ్చి నన్నుద్ధరింపుము.

4||శ్లో || సంసార ఘోర గహనే చరతో మురారే ! మారో గ్రభీ కర మృగ ప్రచురార్ధి తస్య |
ఆర్తస్య మత్సర నిదాఘుణి పీడితస్య - లక్ష్మీ నృసింహ! మమ దేహి కరావలమ్బమ్ ||

తా: ఓ మురారీ! నేను సంసార మనెడి ఘోరమైన అరణ్యములో సంచరించుచున్నాను. అందు మన్మథుడనెడి భయంకరమైన క్రూర మృగము నన్ను పట్టి మిక్కిలి పీడించుచున్నది. మత్సరమను మండువేసవి బాధింపగా మిక్కిలి దుఃఖించుచున్నాను. ఓ నృసింహ దేవా! ఆర్తుడైన నాకు రావలంబన మిచ్చి కాపాడుము.

5||శ్లో|| సంసార కూప మటి ఘోర మగాధ మూలం - సంప్రాప్య దుఃఖశత సర్ప సమాకులస్య ,
దీన స్య దేవ కృపాయా పద మాగాతస్య - లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలమ్బమ్ ||

తా: ఓ నరసింహస్వామీ! సంసారమనునది భయంకరమును, మిక్కిలి లోతైనదియును అగు పాడునుయ్యి . నేను ఆ కూపములో పడిపోయితిని. వందల కొలదిగా ఉన్న దుఃఖములనెడి సర్పములు నన్ను చుట్టుముట్టినవి. గొప్ప ఆపదలో ఉన్నాను. ఓ నృసింహదేవా! దీనుడనైన నాకు చేయూతనిచ్చి యుద్ధరింపుము.

6||శ్లో|| సంసార భీకర కరీన్ద్ర కరాభి ఘూత - నిష్పిష్ట మర్మవ వపుషః సకలార్తి నాశః
ప్రాణ ప్రయాణ భవ భీతి సమాకులస్య - లక్ష్మీ నృసింహ! మమ దేహి కరావలమ్బమ్ ||

తా: దుఃఖములన్నింటిని నశింపజేయునట్టి దేవా! నేను సంసారమనెడి భయంకరమగు ఏనుగునకు చిక్కితిని. అది తొండముతో కొట్టి నా శరీరమును మిక్కిలి పీడించుచున్నది. ప్రాణములు పోవునేమో యను భయముతో మిక్కిలి తల్లడిల్లుచున్నాను. ఓ లక్ష్మీ నరసింహస్వామీ కరావలంబన మొసగి, ఈ సంసార గజబాద నుండి తప్పించుము.

7||శ్లో || సంసార సర్ప ఘనవక్త్ర భాయోగ్ర తీవ్ర - దంష్ట్రా కరాళ విష దగ్ధ వినష్ట మూర్తే :
నాగారి వాహన! సుదాబ్ది నివాస! శౌరే ! లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలమ్బమ్ ||

తా: గరుడవాహనుడవు, పాలకడలి నివాసముగా కలవాడవు, అగు ఓ శౌరీ, సంసారము క్రూరమై, కోరలయందు విషము నిండి యున్న సర్పమువంటిది. దాని కాటువలన విషము శరీరము వ్యాపించి ప్రాణము పోవుచున్నది. నీవు నా ప్రాణములు కాపాడి నన్నుద్దరింపుము.

8||శ్లో|| సంసార జాలపతిత స్య జగన్నివాస - సర్వేంద్రి యార్ధ బడి శాగ్ర ఝుషోపమస్య |
ప్రోత్ఖండిత ప్రాచుర తాలిక మస్తకస్య - లక్ష్మీనృసింహ! మమ దేహి కరావలమ్బమ్ ||

తా: సర్వలోకములు నివాసముగా కల ఓ ప్రభూ! నేను సంసారమనెడు వలలో పడితిని. ఇంద్రియార్ధములనెడు గాలమునకు చిక్కిన చేపవంటివాడును. గాలమున చిక్కిన చేప దవడలు విచ్చి తలపై కెగసి యుండునట్లు - నేనునూ బయటకు రాలేక తపించుచున్నాను. నన్నీ సంసార బాధ నుండి తొలగించి యుద్ధరింపుము.

9||శ్లో|| సంసార వృక్ష మఘబీజ మనంత కర్మ- శాఖాయుతం కరణ పత్ర మనజ్గ పుష్పమ్ ||
ఆరుహ్య దుఃఖ ఫలినం పతితో దయాళో - లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలమ్బమ్ ||

తా: సంసార వృక్షమునకు పాపమే బీజము. సమస్త కర్మలును శాఖలు, ఇంద్రియము లే ఆకులు. మన్మథుడే పూవులు. దుఃఖములే ఫలములు. అట్టి వృక్షము నెక్కి క్రింద పడిపోయితిని. దయాళువగు ఓ నృసింహదేవా! చేయూత నిచ్చి నన్నుద్ధరింపుము.

10||శ్లో || సంసార దావద హనాతురభి కరోరు - జ్వాలావలీ భి రాతి దగ్ధ తనూరు హాస్య,
త్వత్పాద పద్మ సరసీం శరణాగతస్య - లక్ష్మీ నృసింహ! మమ దేహి కరావలమ్బమ్ ||

తా: సంసారమనెడి కారుచిచ్చు భయంకరములగు గొప్ప జ్వాలలతో నిండి పోయినది. నేను దాని నడుమ చిక్కుకొంటిని. ఆ మంటలు నా శరీర మందలి రోమములను కాల్చి వేయుచున్నవి. ఇక నా శరీరము కూడా దహింపబడును. కాన నిన్ను శరణు జొచ్చితిని. నీ పాద పద్మములనెడి సరస్సు తప్ప తాపము నేదియు చల్లార్చజాలదు. ఓ నృసింహ దేవా! కరుణించి చేయూత నొసగి, ఆ దావాగ్ని నుండి రక్షింపుము.

11||శ్లో|| సంసార సాగర నిమజ్జన ముహ్య మానం దీనం విలోకయ విభో! కరుణానిదే! మామ్|
ప్రహ్లాద భేద పరిహార పరావతారః లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలమ్బమ్ ||

తా: దయానిధి వైన ఓ ప్రభూ! ప్రహ్లాదుని దుఃఖము పోగొట్టుటకు నరహరి రూపమును ధరించిన దేవా! నేను సంసార సముద్రమున పడి, మునిగి పోయి, ఉక్కిరి బిక్కిరి యగుచున్నాను. దీనావస్థలో నున్న నన్నుద్ధరింపుము.

12||శ్లో|| సంసార యూద గజ సంహతి సింహదంష్ట్రా - భీత స్య దుష్ట మతి దైత్య భయంకరేణ |
ప్రాణ ప్రయాణ భవభీ తినివారణే న లక్ష్మీ నృసింహ! మమ దేహి కరావలమ్బమ్ ||

తా: ఓ నృసింహ మూర్తీ! నీ స్వరూపము దుష్ట బుద్ధులగు రాక్షసులకు మిగుల భయము కల్గించుచున్నది. సంసార సమూహములనెడి భయమును పోగొట్టునది. అట్టి రూపము ధరించి నాప్రాణములు కాపాడుమ

13||శ్లో|| సంసార యోగి సకలే ప్సిత నిత్యకర్మ సంప్రాప్య దుఃఖ సకలన్ద్రియ మృత్యునాశ -
సజ్కల్ప సిందు తనయాకు చ కు జ్క మాజ్క ! లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలమ్బమ్ ||

తా: ఓ దేవా! లేనిపోని కోరికలకు సంసారమే కారణము. ఆ కోరికలు నేరవేరుటకై నిత్యమూ ఏవో చేయవలసి వచ్చుచున్నది. అందువలన నీవు సంకల్పించినచొ అవి అన్నియు నశించును. లక్ష్మీ దేవి యొక్క కుచ కుంకుమచే చిహ్నితమగు వక్ష స్స్థలముకల నృసింహదేవా! నా సంసార బాధలను పోగొట్టి నన్ను రక్షింపుము.

14||శ్లో|| బద్ద్వాగళే యమ భటా హుతర్జయన్తః కర్షంతి యత్ర భవపాశశ తైర్యుతం మామ్ |
ఏకాకినం పరవశం చకితం దయాళో | లక్ష్మీ నృసింహ! మమ దేహి కరావలమ్బమ్ ||

తా: దయాళువైన ఓ పభూ! యమ భటులు పెక్కు పాశములతో నా మెడను బంధించి, బెదరించుచూ, ఏదారిలోనో నన్నీడ్చుకొని పోవుదురు. అపుడు పరులకు లొంగి, ఒంటరినై, దిగులుపడుచుండు నాకు దిక్కెవ్వరు? నీవే నాకు చేయూత నిచ్చి రక్షింపవలయును.

15||శ్లో|| అన్దస్యమే హృత వివేక మహాధన స్య చొ రైర్మ హ బలిభి రిన్ద్రియ నామ దే యై:
మోహన్ద కారకుహరే వినిపాతిత స్య లక్ష్మీ నృసింహ! మమ దేహి కరావలమ్బమ్ ||

తా: ఓ నరసింహ ప్రభూ! మహాబలవంతులగు ఇంద్రియములనెడి దొంగలు నా వివేక ధనమును దొంగిలించుకొని, అజ్ఞానమును అంధకారపు గుహలో త్రోసివేసిరి. కన్నులు కాన రాకున్నవి. నాకు చేయూత నిచ్చి, ఆ గుహ నుండి బయటకు తీసి నన్నుద్ధరింపుము.

16||శ్లో|| లక్ష్మీ పతే! కమలనాభ! సురేశ! విష్ణో ! యజ్ఞేశ ! యజ్ఞ! మధు సూదన! విశ్వరూప
బ్రహ్మణ్య ! కేశవ! జనార్ధన! వాసుదేవ! లక్ష్మీ నృసింహ! మమ దేహి కరవలమ్బమ్ ||

తా: ఓ లక్ష్మీ పతీ ! నీవు పద్మమును నాభి యందు కలవాడవు. దేవతలకు నాయకుడవు. సర్వవ్యాపకుడవు. యజ్ఞములకు అధిపతివి. యజ్ఞ రూపుడవు. మధువను రాక్షసుని శిక్షించినవాడవు. విశ్వరూపుడవు. బ్రాహ్మణ ప్రియుడవు. బ్రహ్మ, రుద్రుల అంశలు కలవాడవు. జన్మము లేకుండ చేయువాడవు. వసుదేవునకు పుత్రుడవై అవతరించినవాడవు. ఓ నృసింహదేవా! నాకు చేయూత నిమ్ము.

17||శ్లో || ప్రహ్లాద నారద పరాశర పుణ్డరీక వ్యాసాది భాగవత పుంగవ వృన్నివాస|
భక్తా సురక్త పరిపాలన పారిజాత లక్ష్మీ నృసింహ! మమ దేహి కరవలమ్బమ్ ||

తా: ఓ దేవా ! నీవు ప్రహ్లాదుడు, నారదుడు, పరాశరుడు, పుండరీకుడు, వ్యాసుడు, అంబరీషుడు, శుకుడు, శౌనకుడు, అనువారి హృదయములందు నివసించుచుందువు. భక్తులను, నీపై ప్రేమ కలవారిని కాపాడుటలో కల్పవృక్షము వంటివాడవు. ఓ నరసింహస్వామీ, నాకు చేయూత నొసగి కాపాడుము.

18||శ్లో|| ఏకేన చక్ర మపరేణ కరేణ శంఖ - మన్యేన సిన్దు తనయా మవ లంబ్య తిష్ఠన్
వామేతరేణ వరదాభయ పద్మచిహ్నం - లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలమ్బమ్ ||

తా: ఓ దేవా! చతుర్భుజుడవగు నీవు ఒక చేత శంఖమును, ఒకచేత చక్రమును, ఒక చేత లక్ష్మీ దేవిని ధరించి, ఒక కుడు చేతితో అభయము నిచ్చు హస్తముద్రను దాల్చి యుందువు. అట్టి మహానీయుడవగు నృసింహ దేవా! చేయూతనోసగి నన్ను కాపాడుము.

19||శ్లో|| ఆద్యన్త శూన్య మజమవ్యయ మప్రమేయ - షూదిత్య రుద్రా నిగమాది నుత ప్రభావమ్|
త్వామ్భోది జాన్య మధులోలుప మత్త భ్రుజ్గం - లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలమ్బమ్ ||

తా: ఓ దేవా! నీవు మొదలు, తుది లేనివాడవు, పుటకయు, నాశనమును లేనివాడవు ఇంతవాడని ఊహింప సాధ్యము సనివాడవు. వేదములు, సూర్యుడు, రుద్రుడు, మున్నగువారు నీ ప్రభావమును కీరించుచుందురు. నీవు లక్ష్మీ దేవి ముఖ పద్మము నందలి మధువు నందు ఆసక్తి గల కొదమ తుమ్మెదవు. నరసింహ స్వరూపుడవగు నీవు నాకు చేయూత నొసగి రక్షింపుము.

20||శ్లో|| వారాహరామ నరసింహమాది కాన్తా - క్రీడా విలోల శూలి ప్రవన్ద్య
హంసాత్మకం పత్పరమ హంస విహార లీలం - లక్ష్మి నృసింహ! మమ దేహి కరావలమ్బమ్ ||

తా: ఓ దేవా! నీవు వరాహ, వామన, నృసింహావ తారముల నెత్తినవాడవు. లక్ష్మీదేవి మున్నగు కాంతలతో క్రీడించుట యందు ఆసక్తి కలవాడవు. బ్రహ్మ, రుద్రాది దేవతలు నీ కేప్పుడునూ నమస్క రించుచుందురు. నీవు పరమహంస రూపుడవు. ఉత్తములగు యోగుల హృదయములందు విహరించుచుందువు. ఓ లక్ష్మీ నృసింహస్వామీ! నాకు చేయూత నిమ్ము.

21||శ్లో|| ప్రహ్లాద మానస సరో జవిహార భ్రుజ్గ - గాజ్గ తర జ్గ ధవళాజ్గ రామా స్థితాజ్గ |
శ్రుజ్గర సజ్గర సకిరీట ల సద్వరాజ్గ - లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరవలమ్బమ్ ||

తా: ఓ నరసింహదేవా! నీవు ప్రహ్లాదుని మనస్సనెడు కమలమున విహరించు తుమ్మెదయైన వాడవు. గంగాతరంగములవలె తెల్లని దేహము కలవాడవు. లక్ష్మీదేవికి నివాసమగు వక్షః స్థలము కలవాడవు. శ్రుంగారము కలవాడవు. మేలైన కిరీటముతో ప్రకాశించు శిరస్శు కలవాడవు. నీవు నాకు చేయూత నిమ్ము.

22||శ్లో|| మాతా నృశింహశ్చ పితా నృసింహః - భ్రాతా నృసింహశ్చ సఖా నృసింహః |
విద్యా నృసింహొ ద్రవిణం నృసింహః - లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరవలమ్బమ్ ||

తా: నాకు నృసింహుడే తల్లి, నృసింహుడే తండ్రి, నృసింహుడే సోదరుడు, నృసింహుడే మిత్రుడు, నృసింహుడే విద్య, నృసింహుడే ధనము, నృసింహుడే ప్రభువు నాకు సమస్తమును ఆ నృసింహుడే !

23||శ్లో|| శ్రీ శజ్కరార్యర చితం సతతం మనుష్యః - స్సోత్రం పటేది హతు సర్వగుణ ప్రసన్నమ్ |
సద్యో విముక్త కలుషో మునివర్య గన్యో - లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరవలమ్బమ్ ||

తా: సమస్త గుణములతో కూడి, శంకర భాగవత్పాదులచే రచింపబడిన యీ స్తోత్రమును ఎ మనుష్యుడు ఎల్లప్పుడునూ పటించుచుండునో అతడు వెంటనే పాపములు నశించి పరిశుద్ధుడై, మునులచే పొగడబడు విష్ణులోకమగు వైకుంటమును పొందును.

24||శ్లో|| యన్మాయార్జిత భవ ప్రచుర ప్రవాహా - మగ్నార్త మర్త్యనివ హేషు కరావలమ్బమ్,
లక్ష్మీ నృసింహ చరనాబ్జ మధువ్రతేనా - లక్ష్మీ నృసింహ! మమదేహి కరావలమ్బమ్ ||

తా: మాయా ప్రభావమున అజ్ఞానమునందు పడి, పెక్కు జన్మములను పొందుచూ, బాధల ననుభవించుచూ మనుష్యులకు ఈ స్తోత్రము తరించుటకు చేయూత అయినది. దీనిని లక్ష్మీ నరసింహస్వామి పాదపద్మములకు తుమ్మెద వంటి వారగు శ్రీ శంకరాచార్యులు రచించిరి.

25||శ్లో|| శ్రీమాన్న్రుసింహ విభవే గరుడ ధ్వజాయ - తాపత్ర యో పశామనాయ భావౌషదాయ |
త్రుష్ణారి వృశ్చిక జలాగ్నిభుజ జ్గరోగ - లక్ష్మీ నృసింహ ! మమదేహి కరావలమ్బమ్ ||

తా: ఓ లక్ష్మీ నరసింహస్వామీ ! నీవు సమస్త లోకములకు ప్రభువువు. గరుడధ్వజుడవు. తాపత్రయమును నశింపజేయువాడవు. సంసారములనెడి రోగములకు ఓషదము వంటివాడవు. ఆకలి దప్పులు, తేళ్ళు, అగ్ని, జలము, పాములు, రోగములు మున్నగు వానివలన కలుగు బాధలను నశింపజేయువాడవు. పాపములు హరించు వాడవు. గురువైన వాడవు. అట్టి నీకివే మా నమస్కారములు.

ఇతి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం సంపూర్ణమ్

Lord Lakshmi Narasimha Swamy at Sri Hari Vaikunta Kshetra, Bangalore.......

.••.¸•.••.¸•...••.¸•..••.¸•..••.¸•..••.¸•.••.¸•...••.¸•..••.¸•..••.¸•..••.¸•.••.¸•...••.¸•..••.¸•..••.¸•.

Sri Lakshmi Narasimha Karavalamba Stotram


Sri Lakshmi Narasimha Karavalamba Stotra by Adi Sankara Bhagawat Pada. Lakshmi Nrsimha Karavalamba Stotram, also known as Lakshmi Narasimha Karunarasa Stotram is a 17-verse Stotram in praise of Lakshmi Narasimha. The Stotram is so called because each of these verses ends with the same refrain “Lakshmi Narasimha, Mama Dehi Karavalambam” which means "Oh Lord Narasimha, please lend me your helping hand".

We have added the English Translation and Meaning of Lakshmi Narsimha Karavalamba stotram. The English Meaning is added after each stanza in italics. We are indebted to Mr P.R.Ramachander Sir, who have provided the English translation of the stotra.

Lakshmi Narasimha Karavalamba Stotram dedicated to the feet of Lord Lakshmi Nrsimha.

Sri Lakshmi Narasimha Karavalamba Stotram Lyrics - Lakshmi Nrsimha Prayer

Srimat Payonidhi Nikethana Chakra Pane,
Bhogeendra Bhoga Mani Rajitha Punya Moorthe,
Yogeesa Saswatha Saranya Bhabdhi Potha,
Lakshmi Nrsimha Mama Dehi Karavalambam 1

Oh Great God Lakshmi Nrsimha,
Who lives in the ocean of milk,
Who holds the holy wheel as weapon,
Who wears the gems of the head,
Of Adhisesha as ornaments,
Who has the form of good and holy deeds,
Who is the permanent protection of sages,
And who is the boat which helps us cross,
This ocean of misery called life,
Please give me the protection of your hands.

Brahmendra, Rudra Arka Kireeta Koti,
Sangattithangri Kamala Mala Kanthi Kantha,
Lakshmi Lasath Kucha Saroruha Raja Hamsa,
Lakshmi Nrsimha Mama Dehi Karavalambam 2

Oh Great God Lakshmi Nrsimha,
Whose feet is touched by the crowns,
Of Brahma, Indra, Shiva and Sun,
Whose shining feet adds to his effulgence,
And who is the royal swan playing,
Near the breasts of Goddess Lakshmi,
Please give me the protection of your hands.

Samsara Gora Gahane Charathe Murare,
Marogra Bheekara Mruga Pravardhithasya,
Aarthasya Mathsara Nidha Chain Peedithasya,
Lakshmi Nrsimha Mama Dehi Karavalambam 3

Oh Great God Lakshmi Narsimha,
Oh Lord who killed the Asura called Mura,
I have been traveling in the dark forests of day to day life,
Where I have been terrified by the lion called desire,
And scorched by the heat called competition, and so,
Please give me the protection of your hands.

Samsara Koopam Adhi Ghora Magadha Moolam,
Samprapya Dukha Satha Sarpa Samakulasya,
Dheenasya Deva Krupana Padamagadasya,
Lakshmi Nrsimha Mama Dehi Karavalambam 4

Oh Great God Lakshmi Narasimha,
I have reached the very dangerous and deep,
Bottom of the well of day to day life,
And also being troubled by hundreds,
Of miseries which are like serpents,
And am really miserable and have,
Reached the state of wretchedness and so,
Please give me the protection of your hands.

Samsara Sagara Vishala Karala Kala,
Nakra Graham Grasana Nigraha Vigrahasya,
Vyagrasya Raga Rasanormini Peedithasya,
Lakshmi Nrsimha Mama Dehi Karavalambam 5

Oh Great God Lakshmi Nrsimha,
I have reached this wide unfathomable ocean of day to day life,
And I have been caught by black deadly,
Crocodiles called time which are killing me
And I am also afflicted by waves of passion,
And attachments to pleasures like taste and so,
Please give me the protection of your hands.

Samasra Vrukshamagha Bheeja Manantha Karma,
Sakha Satham Karana Pathramananga Pushpam,
Aroohasya Dukha Phalitham Pathatho Dayalo,
Lakshmi Nrsimha Mama Dehi Karavalambam 6

Oh Great God Lakshmi Nrsimha,
I have climbed the tree of worldly life,
Which grew from the seed of great sin,
Which has hundreds of branches of past karmas,
Which has leaves which are parts of my body,
Which has flowers which are the result of Venus,
And which has fruits called sorrow,
But I am falling down from it fast and so,
Please give me the protection of your hands.

Samsara Sarpa Ghana Vakthra Bhyogra Theevra,
Damshtra Karala Visha Daghdha Vinashta Murthe,
Naagari Vahana Sudhabhdhi Nivasa Soure,
Lakshmi Nrsimha Mama Dehi Karavalambam 7

Oh Great God Lakshmi Nrsimha,
Oh, Lord who rides on the enemy of snakes,
Oh, Lord who lives in the ocean of nectar,
The serpent of family life has opened,
Its fearful mouth with very dangerous,
Fangs filled with terrible venom,
Which has destroyed me and so,
Please give me the protection of your hands.

Samsara Dava Dahanathura Bheekaroru,
Jwala Valee Birathi Dhighdha Nooruhasya,
Thwat Pada Padma Sarasi Saranagathasya,
Lakshmi Nrsimha Mama Dehi Karavalambam 8

Oh Great God Lakshmi Nrsimha,
I have been scarred badly by the fire of daily life,
And even every single hair of my body,
Has been singed by its fearful flames,
And I have taken refuge in the lake of your lotus feet, and so,
Please give me the protection of your hands.

Samsara Jala Pathithasya Jagan Nivasa,
Sarvendriyartha Badisartha Jashopamasya,
Proth Ganditha Prachoora Thaluka Masthakasya,
Lakshmi Nrsimha Mama Dehi Karavalambam 9

Oh Great God Lakshmi Nrsimha,
I have been caught in this net of daily life,
And all my organs are caught in that web,
And the five senses which is the hook,
Tears apart my head from me, and so,
Please give me the protection of your hands.

Samsara Bheekara Kareeendra Karabhigatha,
Nishpishta Marmma Vapusha Sakalarthi Nasa,
Prana Prayana Bhava Bhhethi Samakulasya,
Lakshmi Nrsimha Mama Dehi Karavalambam 10

Oh Great God Lakshmi Nrsimha,
I have been struck by the fearful king of elephants,
Which is the worldly illusion, and my vital parts,
Have been completely crushed, and I suffer,
From thoughts of life and death, and so,
Please give me the protection of your hands.

Andhasya Me Viveka Maha Danasya,
Chorai Prabho Bhalibhi Rindriya Nama Deyai,
Mohanda Koopa Kuhare Vinipathathasya,
Lakshmi Nrsimha Mama Dehi Karavalambam 11

Oh Great God Lakshmi Nrsimha,
I have become blind because, the sense of discrimination,
Has been stolen from me by the thieves of ‘senses’,
And I who am blind, have fallen in to the deep well of passion, and so,
Please give me the protection of your hands.

Baddhvaa Gale Yamabhataa Bahutarjayantah,
Karshhanti Yatra Bhavapaashashatairyutam Maam.
Ekaakinam Paravasham Chakitam Dayaalo
Lakshmi Nrsimha Mama Dehi Karavalambam 12

Oh Great God Lakshmi Nrsimha,
I have been tied by the soldiers of the God of death,
By numerous ropes of worldly attachments,
And they are dragging me along by the noose around the neck,
And I am alone, tired and afraid, and so Oh merciful one,
Please give me the protection of your hands.

Lakshmi Pathe Kamala Nabha Suresa Vishno,
Vaikunta Krishna Madhu Soodhana Vishwaroopa,
Brahmanya Kesava Janardhana Chakrapane,
Devesa Dehi Krupanasya Karavalambam 13

Oh King of Devas,
Who is the Lord of Lakshmi, who has a lotus on his belly,
Who is Vishnu, the lord of all heavenly beings, who is Vaikunta,
Who is Krishna , who is the slayer of Madhu,
Who is one with lotus eyes, Who is the knower of Brahman,
Who is Kesava, Janardhana, Vasudeva,
Please give me the protection of your hands.

Ekena Chakramaparena Karena Shamkha-
Manyena Sindhutanyaaamavalambya Tishhthan,
Vaame Karena Varadaabhayapadmachihnam,
Lakshmi Nrsimha Mama Dehi Karavalambam 14

Oh Great God Lakshmi Nrsimha,
Who holds Sudarshana, the holy wheel in one hand,
Who holds the conch in the other hand,
Who embraces the daughter of ocean by one hand,
And the fourth hand signifies protection and boons, and so,
Please give me the protection of your hands.

Samsaara Saagara Nimajjana Muhyamaanam
Diinam Vilokaya Vibho Karunaanidhe Maam,
Prahlaada Kheda Parihaara Paraavataara
Lakshmi Nrsimha Mama Dehi Karavalambam 15

Oh Great God Lakshmi Nrsimha,
I am drowned in the ocean of day to day life,
Please protect this poor one, oh, Lord, Oh treasure of compassion,
Just as you took a form to remove the sorrows of Prahlada, and so,
Please give me the protection of your hands.

Prahlaada Naarada Paraashara Pundariika-
Vyaasaadi Bhaagavata Pungavah Rinnivaasa ,
Bhaktaanurakta Paripaalana Paarijaata,
Lakshmi Nrsimha Mama Dehi Karavalambam 16

Oh Great God Lakshmi Nrsimha,
Who dwells in the hearts of great sages like Prahlada,
Narada, Parashara, Pundarika and Vyasa,
Who loves his devotees and is the wish giving tree,
That protects them, and so,
Please give me the protection of your hands.

Lakshminrisimha Charana Abja Madhuvratena
Stotram Kritam Shubhakaram Bhuvi Shankarena
Ye Tatpathanti Manujaa Haribhakti Yuktaa-
Ste Yaanti Tatpada Saroja Makhandaruupam 17

This prayer which blesses earth with good things,
Is composed by Sankara who is a bee,
Drinking deeply the honey from the lotus feet of Lakshmi Nrsimha,
And those humans who are blessed with devotion to Hari,
Will attain the lotus feet of the Brahman.

Sri Lakshmi Nrsimha Padarpanamasthu

Dedicated to the feet of Lord Lakshmi Nrsimha.

ఆది శంకరాచార్యుల జయంతి శుభాకాంక్షలు






ఆది శంకరాచర్య

బౌద్ధమతం ప్రభావం వల్ల క్షీణించిన హిందూ ధర్మాన్ని పున రుద్ధరించడం. దేశదేశాలలో పండితులతో వాదనలు సాగిం చి, వారిని ఒప్పించి, నెగ్గి, తన సిద్ధాంతాన్ని మెప్పించాడు.
ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలకు, విష్ణు సహ స్ర నామాలకు భాష్యాలు రచించారు. తరువాత శంకరుని అనుస రించిన వారికీ, విభేదించిన వారికీ ఇవి మౌలికమయ్యాయి.
శృంగేరి, ద్వారక, పూరి, జ్యోతిర్మఠం - అనే నాలుగు మఠా లను స్థాపించాడు. అవి శంకరుని సిద్ధాంతానికి, హిందూ ధర్మానికి నాలుగు దిక్కులా దీపస్తంభాలలా పనిచేశాయి.
గణేశ పంచరత్న స్తోత్రం, భజ గోవిందం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, కనకధారా స్తోత్రం, శివా నందలహరి, సౌందర్యలహరి వంటి అనేక రచనలు హిందువులకు నిత్య ప్రార్ధనా స్తోత్రాలుగా ఈనాటికీ ఉపయుక్త మవుతు న్నాయి.

వెయ్యి సంవత్సరాల పాటు బౌద్ధమతం ప్రచారంలోకి వచ్చాక, సనాతన ధర్మా నికి ముప్పు ఏర్పడింది. ఈ సనాతన ధర్మాన్ని పున రుద్ధరించడా నికి ఆది శంకరులు జన్మించారు. బౌద్ధ మతం ధర్మం గురించీ, సంఘం గురించీ చెప్పింది కాని దేవుడిని గుర్తించలేదు. బౌద్ధమత ధర్మాల వ్యాప్తిలో వైదిక కర్మలు సంకటంలో పడ్డాయి. ఆ సమయంలో శంక రాచార్యులు ఆధ్యాత్మిక ధర్మాన్ని బలీయ శక్తిగా మలచ గలిగారు.

బాల్యం
కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన నంబూద్రి బ్రాహ్మణ దంపతు లైన ఆర్యమాంబ, శివగురువులకు కేరళలోని పూర్ణా నది ఒడ్డున ఉన్న కాలడి (త్రిచూర్‌ సమీపంలో)లో శంకరులు జన్మించారు.

శంకరుని బాల్యంలోనే తండ్రి మరణించారు. శంకరులు ఏ సం థాగ్రాహి. బాల్యంలోనే వేదవిద్యలు అభ్యసించారు. బాలబ్రహ్మచారి గా శంకరుడు ఒకరోజు భిక్షాటనం చేస్తూ ఒక పేదరాలి ఇంటికి వెళ్ళి భిక్ష అడుగగా, భిక్ష వేసేందుకు ఏమీ లేక, తన ఉపవాసాన్ని విరమిం చడం కోసం ఉంచుకొన్న ఉసిరి కాయను దానం చేసింది. దానికి చలించిన శంకరులు, ఆశువుగా కనకధారా స్తోత్రాన్ని చెప్పారు. కనకధారా స్తోత్రంతో పులకించిన లక్ష్మీ దేవి బంగారు ఉసిరికా యలు వర్షింప జేస్తుంది.ఒకరోజు శంకరుని తల్లి ఆర్యమాంబ పూర్ణా నది నుండి నీళ్ళు తెచ్చుకుంటుండగా స్పృహ తప్పి పడిపోయింది. అప్పుడు శంక రులు పూర్ణానదిని ప్రార్థించి, నదిని ఇంటివద్దకు తెప్పించారు. తల్లిని ఒప్పించి సన్యాసం స్వీకరంచారు.

గౌడపాదుల శిష్యుడైన గోవింద భగవత్పాదులను ఆశ్రయించారు. ఒక ఛండాలుడి మాటలలో అంతరార్థం గ్రహించి సాక్షాత్తు పరమశివుడే నాలుగు వేదాలతో వచ్చాడని గ్రహించి మహాదేవుడిని మనీషా పంచకం అనే ఐదు శ్లోకాలతో స్తోత్రం చేశాడు. శంకరునికి పరమశివుడు కర్తవ్యవబోధ చేశారు. అలా భారతదేశంలో శంకరాచార్య చేపట్టిన హిందూ ధర్మ పునరుద్ధరణ ఆరంభమైంది. మండన మిశ్రునితో తర్క గోష్ఠిలో పాల్గొని ఆయనను ఓడించారు. అలా ఎందరో ఉద్ధండ పండితులను ఓడించి అదె్వైత ప్రచారం చేశారు. నాలుగు పదుల వయస్సు రాకముందే పరమాత్మను చేరుకున్నారు. నేడు హిందూ సమాజం ఈ విధంగా ఉన్నదంటే అందుకు కారణం ఆదిశంకరాచార్యులనే చెప్పవచ్చు.

శ్రీ ఆదిశంకరకృత హనుమత్ స్తోత్రం



















శ్రీరామ
జయ హనుమాన్

జగద్గురు శ్రీ ఆదిశంకరకృత హనుమత్ స్తోత్రం
[ఈ శంకరాచార్య కృతమగు స్తోత్రము నిత్యము పఠించిన చిరకాలము ఐహిక సుఖములనుభవించి పరమున ముక్తినందగలరు.]

వీతాఖిల విషయేచ్ఛం – జాతానం దాశ్రుపులక మత్యచ్ఛమ్
సీతాపతి దూతాద్యం – వాతాత్మజ మధ్య భావయే హృద్యమ్ ||

తరుణారుణ ముఖకమలం – కరుణారసపూర పరితాపాంగం
సంజీవన మాశాసే – మంజుల మహిమాన మంజనా భాగ్యమ్ ||

శంబరవైరి శరాతిగ – మంబుజదల విపుల లోచనోదారం
కంబుగళ మనిలదిష్టం – బింబజ్వలితోష్ట మేక మవలంబే ||

దూరీకృత సీతార్తిః – ప్రకటీకృత రామవైభవ స్పూర్తిః
దారిత దశముఖకీర్తిః – పురతో మమ భాతు హనుమతో మూర్తి ||

వానర నికరాధ్యక్షం – దానవకుల కుముద రవికర సదృక్షం
దీనజనావన దీక్షం – పవన తపఃపాక పుంజ మద్రాక్షం ||

ఏత త్పవనసుతస్య – స్తోత్రం యః పఠతి పంచరత్నాఖ్యం
చిర మిహ నిఖిలాన్ భోగాన్ – భుక్త్వా శ్రీరామభక్తి భాగవతః ||

శుభం భూయాత్

శ్రీ నృసింహాష్టకం


౧::శ్రీమదకలంక పరిపూర్ణ శశికోటి
శ్రీధర మనోహర సటాపటల కాంత
పాలయ కృపాలయ భవాంబుధి-నిమగ్నం
దైత్యవరకాల నరసింహ నరసింహ 

౨::పాదకమలావనత పాతకి-జనానాం
పాతకదవానల పతత్రివర-కేతో
భావన పరాయణ భవార్తిహరయా మాం
పాహి కృపయైవ నరసింహ నరసింహ  

౩::తుంగనఖ-పంక్తి-దలితాసుర-వరాసృక్
పంక-నవకుంకుమ-విపంకిల-మహోరః 
పండితనిధాన-కమలాలయ నమస్తే
పంకజనిషణ్ణ నరసింహ నరసింహ 

౪::మౌలిషు విభూషణమివామర వరాణాం
యోగిహృదయేషు చ శిరస్సునిగమానామ్ 
రాజదరవింద-రుచిరం పదయుగం తే
దేహి మమ మూర్ధ్ని నరసింహ నరసింహ 

౫::వారిజవిలోచన మదంతిమ-దశాయాం
క్లేశ-వివశీకృత-సమస్త-కరణాయామ్ 
ఏహి రమయా సహ శరణ్య విహగానాం
నాథమధిరుహ్య నరసింహ నరసింహ 

౬::హాటక-కిరీట-వరహార-వనమాలా
ధారరశనా-మకరకుండల-మణీంద్రైః 
భూషితమశేష-నిలయం తవ వపుర్మే
చేతసి చకాస్తు నరసింహ నరసింహ 

౭::ఇందు రవి పావక విలోచన రమాయాః
మందిర మహాభుజ-లసద్వర-రథాంగ
సుందర చిరాయ రమతాం త్వయి మనో మే
నందిత సురేశ నరసింహ నరసింహ 

౮::మాధవ ముకుంద మధుసూదన మురారే
వామన నృసింహ శరణం భవ నతానామ్ 
కామద ఘృణిన్ నిఖిలకారణ నయేయం
కాలమమరేశ నరసింహ నరసింహ 

౯::అష్టకమిదం సకల-పాతక-భయఘ్నం
కామదం అశేష-దురితామయ-రిపుఘ్నమ్ 
యః పఠతి సంతతమశేష-నిలయం తే
గచ్ఛతి పదం స నరసింహ నరసింహ 

శ్రీమచ్చంకరాచార్య కృత శివమానస పూజ:

శ్రీమచ్చంకరాచార్య కృత శివమానస పూజ:

౧.రత్నైః కల్పితమాసనం హిమజలైః స్నానం చ దివ్యాంబరం
నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనం
జాతీచంపకబిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తథా
దీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం!

౨.సౌవర్ణే మణిరత్నఖండరచితే పాత్రే ఘృతం పాయసం
భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభా ఫలం పానకం
శాకానామయుతం జలం రుచికరం కర్పూరఖండోజ్వలం
తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు!

౩.ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం
వీణాభేరి మృదంగకాహళకలా గీతం చ నృత్యం తథా
సాష్టాంగం ప్రణతిః స్తుతిర్బహువిధాః ఏతత్సమస్తం మయా
సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో!

౪.ఆత్మా త్వం గిరిజా మతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం
పూజా తే విషయోపభోగ రచనా నిద్రాసమాధి స్థితిః
సంచారః పదయోః ప్రదక్షిణ విధిః స్తోత్రాణి సర్వా గిరో
యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో! తవారాధనమ్!

౫.కరచరణ కృతం వాక్కాయజం కర్మజం వా
శ్రవణ నయనజం వా మానసం వాపరాధం
విహితమవిహితం వా సర్వమేతత్క్షమస్వ
జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో!

Shiva Thandava Strotam




Jatatavigalajjala pravahapavitasthale
Galeavalambya lambitam bhujangatungamalikam
Damad damad damaddama ninadavadamarvayam
Chakara chandtandavam tanotu nah shivah shivam. 1.

Jata kata hasambhrama bhramanilimpanirjhari
Vilolavichivalarai virajamanamurdhani
Dhagadhagadhagajjva lalalata pattapavake
Kishora chandrashekhare ratih pratikshanam mama .2.

Dharadharendrana ndinivilasabandhubandhura
Sphuradigantasantati pramodamanamanase
Krupakatakshadhorani nirudhadurdharapadi
Kvachidigambare manovinodametuvastuni. 3.

Jata bhujan gapingala sphuratphanamaniprabha
Kadambakunkuma dravapralipta digvadhumukhe
Madandha sindhu rasphuratvagutariyamedure
Mano vinodamadbhutam bibhartu bhutabhartari .4.

Sahasra lochana prabhritya sheshalekhashekhara
Prasuna dhulidhorani vidhusaranghripithabhuh
Bhujangaraja malaya nibaddhajatajutaka
Shriyai chiraya jayatam chakora bandhushekharah.5.

Lalata chatvarajvaladhanajnjayasphulingabha
Nipitapajnchasayakam namannilimpanayakam
Sudha mayukha lekhaya virajamanashekharam
Maha kapali sampade shirojatalamastu nah. 6.

Karala bhala pattikadhagaddhagaddhagajjvala
Ddhanajnjaya hutikruta prachandapajnchasayake
Dharadharendra nandini kuchagrachitrapatraka
Prakalpanaikashilpini trilochane ratirmama .7.

Navina megha mandali niruddhadurdharasphurat
Kuhu nishithinitamah prabandhabaddhakandharah
Nilimpanirjhari dharastanotu krutti sindhurah
Kalanidhanabandhurah shriyam jagaddhurandharah.8.

Praphulla nila pankaja prapajnchakalimchatha
Vdambi kanthakandali raruchi prabaddhakandharam
Smarachchidam purachchhidam bhavachchidammakhachchidam
Gajachchidandhakachidam tamamtakachchidam bhaje.9.

Akharvagarvasarvamangala kalakadambamajnjari
Rasapravaha madhuri vijrumbhana madhuvratam
Smarantakam purantakam bhavantakam makhantakam
Gajantakandhakantakam tamantakantakam bhaje.10.

Jayatvadabhravibhrama bhramadbhujangamasafur
Dhigdhigdhi nirgamatkarala bhaal havyavat
Dhimiddhimiddhimidhva anmrudangatungamangala
Dhvanikramapravartita prachanda tandavah shivah.11.

Drushadvichitratalpayor bhujanga mauktikasrajor
Garishtharatnaloshthayoh suhrudvipakshapakshayoh
Trushnaravindachakshushoh prajamahimahendrayoh
Sama pravartayanmanah kada sadashivam bhaje. 12.

Kada nilimpanirjhari nikujnjakotare vasanh
Vimuktadurmatih sada shirah sthamajnjalim vahanh
Vimuktalolalochano lalamabhalalagnakah
Shiveti mantramuchcharan sada sukhi bhavamyaham.13.

Imam hi nityameva muktamuttamottamam stavam
Pathansmaran bruvannaro vishuddhimeti santatam
Hare gurau subhaktimashu yati nanyatha gatim
Vimohanam hi dehinam sushankarasya chintanam.14.

Puja vasanasamaye dashavaktragitam
Yah shambhupujanaparam pathati pradoshhe
Tasya sthiram rathagajendraturangayuktam
Lakshmim sadaiva sumukhim pradadati shambhuh.15.


From His forest-like matted hair flows stream.
In His consecrated neck is hanging lofty garland of serpent.
Damad damad damad damad - to this sound of drum
He did fierce Tandava - may that Shiva shower auspiciousness.

In the pan of His matted hair celestial river flows unsteadily.
Rows of waves roam unsteadily on His head.
In the fire blazing dhagat dhagat dhagat dhagat in forehead,
In the head having crescent moon as jewel - may I find my constant joy.

Who is mountain king's beautiful daughter's charming sportive-friend,
Whose mind contains glorious universe and its countless beings,
Whose compassionate glance prevents flow of immense miseries,
Who has directions as His clothes - may my heart find bliss in Him.

Radiance spreads from lustre of the gem in the reddish brown hood of creeping serpent.
Kadamb-juice like read kumkum is smeared all sides in His beautiful face.
His glittering upper garment is the skin of an intoxicated elephant.
May my heart seek wonderful joy in that Lord of ghosts.

Indra and all other gods offer flowers,
Pollen dust from which has colored His foot-bed.
His matted hair is tied by the garland of serpent king.
May that holder of Moon in his head give me long-time prosperity.

Shining sparks of blazing fire from His forehead area
Devoured god of love and leaders of all beings bow to Him.
His crest-jewel gleams with cool moon-rays.
May we get siddhis from His hair-locks.

In the fire of His flat forehead flaming dhagat dhagat dhagat
He offered the five powerful arrows of the god of love.
He is the sole artist drawing decorative lines on the breasts of mountain king's daughter.
My deep thoughts are in Him who has three eyes.

His snake-tied neck is dark as if layers of thick new clouds
Have obstructed shining Moon in the midnight.
He holds the celestial river, His cloth is skin read,
He holds crescent Moon.
May that bearer of the universe's give us prosperity.

He has the dark glow of fully blossomed blue lotus
Around the girdle of His neck.
He killed the god of love, destroyed Tripura, liberates from materialistic life, is the sacrifice-destroyer.
He cut off demon Gaja, cut off demon Andhak, cuts off bonds death - I worship Him.

Because of the sweet honey from the bunch of auspicious Kadamba flowers
He has bees flying all over.
He killed the god of love, destroyed Tripura, liberates from materialistic life, is the sacrifice-destroyer.
He killed demon Gaja, killed demon Andhak, cuts off bonds of death - I worship Him.

Glory to Lord Siva, who has fire on His forehead,
Fire spreading from breath of snakes wandering and whirling in glorious sky.
dhimit dhimit dhimit auspicious sound from whose drum
Is in tune with His fierce tandava dance.

Towards different ways of the world, towards a snake or a garland,
Towards precious gems or lump of dirt, friends or enemies,
Towards grass or lotus-eyed people, towards common man and king,
When will I have equal vision and I will worship Lord Sadashiva?

When will I be happy living in a hollow place in the thickets of the river,
Being free from ill thinking, folding heads above my head,
And uttering Shiva mantra thus devoted in the God
Of glorious forehead with vibrating eyes.

One who reads, remembers and talks about this great hyman daily is purified for ever.
He gets deep devotion in great guru Lord Hara.
Thought of Lord Shankar removes one's delusion.
One who recites this song composed by Ravan
At the end of prayer to Lord Shiva early morning-
He gets wealth of chariots, elephants, horses.
Lord Shambhu always gives him prosperity.

Om Nama Shiya.
Yogi Ananda Saraswathi

Wednesday, April 25, 2012

నమో వేంకటేశా నమో తిరుమలేశా



నమో వేంకటేశా నమో తిరుమలేశా
నమస్తే నమస్తే నమః

నమో వేంకటేశా నమో తిరుమలేశా
మహానందమాయె ఓ మహాదేవదేవ "నమో"

ముడుపులు నీకొసగి మా మొక్కులు దీర్తుమయా
ముక్తి కోరి వచ్చే నీ భక్తుల బ్రోవుమయా
భక్తుల బ్రోవుమయా "నమో"

నరక తుల్యమౌ యీ భువి స్వర్గము చేయవయా
మనుజులు నిను చేరే పరమార్థము తెల్పవయా
పరమార్థము తెల్పవయా "నమో"

నమో వేంకటేశా నమో తిరుమలేశా
నమో వేంకటేశా నమో తిరుమలేశా
నమో తిరుమలేశా నమో నమో తిరుమలేశా

Saturday, April 14, 2012

శ్రీ కల్యాణవృష్టిస్తవః






























1)కల్యాణవృష్టిభిరివామృతపూరితాభి-
ర్లక్ష్మీస్వయంవరణమఙ్గళదీపికాభిః
సేవాభిరమ్బ తవ పాదసరొజమూలే
నాకారి కిం మనసి భాగ్యవతాం జనానామ్

కళ్యాణములను వర్షించునవీ, అమృతముతొ నిండినవీ, లక్ష్మి స్వయముగా ప్రాప్తించు నట్టి మంగళములను చూపించునవీ, అగు నీ పాదపద్మముల సేవలచే భాగ్యవంతులైన జనుల యొక్క మనస్సునందు ఏమేమి కల్గింప బడలేదు?

2)ఏతావదేవ జనని స్పృహణీయమాస్తే
త్వద్వన్దనేషు సలిలస్థగితే చ నేత్రే
సాన్నిధ్యముద్యదరుణాయుతసొదరస్య
త్వద్విగ్రహస్య పరయా సుధయా ప్లుతస్య

ఒ తల్లీ| నిన్ను నమస్కరించునపుడు కన్నులు ఆనంద బాష్పములతొ నిండుగాక. పదివేల సూర్యుల సమానమైనదీ, అమృతముతొ నిండినదీ, అగు నీ దివ్యస్వరూపము యొక్క సాన్నిధ్యము కలుగుగాక. ఇది మాత్రమే నా కొరిక.

3)ఈశత్వనామకలుషాః కతి వా న సన్తి
బ్రహ్మాదయః ప్రతిభవం ప్రలయాభిభూతాః
ఏకః స ఏవ జనని స్థిరసిద్ధిరాస్తే
యః పాదయొస్తవ సకృత్ప్రణతిం కరొతి

ఈశ్వరుడు (ప్రభువు) అను పేరును కలుషితము చేయుచూ ప్రతి జన్మము నందును వినాశమును పొందు బ్రహ్మ మొదలగు దేవతలేందరు లేరు? నీపాదములకు ఒక్కసారి ఏవడు నమస్కరించునొ ఒ జననీ| వాడే స్థిరమైన సిద్దిని పొందగలడు.

4)లబ్ధ్వా సకృత్త్రిపురసున్దరి తావకీనం
కారుణ్యకన్దలితకాన్తిభరం కటాక్షమ్
కన్దర్పకొటిసుభగాస్త్వయి భక్తిభాజః
సంమొహయన్తి తరుణీర్భువనత్రయేపి

ఒ త్రిపురసుందరీ| కారుణ్యముతొ నిండినదీ, కాంతివంతమైనదీ, అగు నీ కటాక్షమును ఒక్కసారి పొంది నీ భక్తులు కొటి మన్మథసమానులై ముల్లొకములందలి యువతులను సమ్మొహ పరచుచున్నారు.

5)హ్రీంకారమేవ తవ నామ గృణన్తి వేదా
మాతస్త్రికొణనిలయే త్రిపురే త్రినేత్రే
త్వత్సంస్మృతౌ యమభటాభిభవం విహాయ
దీవ్యన్తి నన్దనవనే సహలొకపాలైః

త్రికొణము నందు నివసించు ఒ తల్లీ| త్రిపుర సుందరీ| మూడు కన్నులు ఉన్న దానా| నీ నామమగు హ్రీంకారమునే వేదములు వర్ణించుచున్నవి. నీభక్తులు నిన్ను స్మరించుచూ యమభటుల పరాభవమును వదలి నందనవనము నందు లొకపాలులతొ క్రీడించుచున్నారు.

6)హన్తుః పురామధిగళం పరిపీయమానః
క్రూరః కథం న భవితా గరలస్య వేగః
నాశ్వాసనాయ యది మాతరిదం తవార్థం
దేహస్య శశ్వదమృతాప్లుతశీతలస్య

ఒ తల్లీ| అమృతముతొ తడిసి చల్లనై న నీ దేహము పరమేశ్వరుని అర్ధశరీరమై తాపమును చల్లార్చనిచొ త్రిపురాంతకుడగు శివుడు కంఠము నిండుగా త్రాగిన గరళము యొక్క తీవ్రత ఏంత క్రూరముగా ఉండేదొ కదా|

7)సర్వజ్ఞతాం సదసి వాక్పటుతాం ప్రసూతే
దేవి త్వదఙ్ఘ్రిసరసీరుహయొః ప్రణామః
కిం చ స్ఫురన్మకుటముజ్జ్వలమాతపత్రం
ద్వే చామరే చ మహతీం వసుధాం దదాతి

ఒ దేవి| నీ పాదపద్మములకు చేసిన నమస్కారము సర్వజ్ఞత్వమును, సభలొ వాక్పాటవమును కలిగించును. అంతేకాక మేరుస్తున్న కిరీటమును, ఉజ్జ్వలమైన తేల్లని గొడుగును, రేండు పక్కల వింజామరలను, విశాలమైన భూమిని(రాజ్యాధికారమును) ఇచ్చును.

8)కల్పద్రుమైరభిమతప్రతిపాదనేషు
కారుణ్యవారిధిభిరమ్బ భవత్కటాక్షైః
ఆలొకయ త్రిపురసున్దరి మామనాథం
త్వయ్యేవ భక్తిభరితం త్వయి బద్ధతృష్ణమ్

ఒ తల్లీ| త్రిపురాసుందరీ| కొరికలు తీర్చు కల్పవృక్షములు, కరుణా సముద్రములు అగు నీ కటాక్షముతొ అనాథయైన, నీ పై ఆశలు పేట్టుకున్న నన్ను చూడుము.

9)హన్తేతరేష్వపి మనాంసి నిధాయ చాన్యే
భక్తిం వహన్తి కిల పామరదైవతేషు
త్వామేవ దేవి మనసా సమనుస్మరామి
త్వామేవ నౌ మి శరణం జనని త్వమేవ

అన్య మానవులు ఇతరులైన చిన్న దేవతల పై మనస్సులనుంచి భక్తి పేంపొందించుకొనుచున్నారు. ఒ దేవి| నేను మనస్సుతొ నిన్నే స్మరించుచున్నాను. నిన్నే నమస్కరించుచున్నాను. ఒ తల్లీ| నీ వే శరణము.

10)లక్ష్యేషు సత్స్వపి కటాక్షనిరీక్షణానా-
మాలొకయ త్రిపురసున్దరి మాం కదాచిత్
నూనం మయా తు సదృశః కరుణైకపాత్రం
జాతొ జనిష్యతి జనొ న చ జాయతే చ

ఒ త్రిపుర సుందరీ| నీ కటాక్షవీక్షనములకు గమ్యస్థలములు ఏన్ని ఉన్ననూ నన్ను ఒక్కసారి చూడుము.నాతొ సమానముగా దయచూపదగినవాడు పుట్టలేదు, పుట్టబొడు, పుట్టుట లేదు.

11)హ్రీం హ్రీమితి ప్రతిదినం జపతాం తవాఖ్యాం
కిం నామ దుర్లభమిహ త్రిపురాధివాసే
మాలాకిరీటమదవారణమాననీయా
తాన్సేవతే వసుమతీ స్వయమేవ లక్ష్మీః

ఒ త్రిపుర సుందరీ| ’హ్రీం’ హ్రీం’ అని ప్రతిదినమూ జపించువారికి లభించినది ఈ లొకములొ ఏమి కలదు? పుష్పమాల, కిరీటము, మదపుటేనుగులతొ విరాజిల్లు భూదేవి శ్రీదేవి స్వయముగనే వారిని సేవించును.

12)సమ్పత్కరాణి సకలేన్ద్రియనన్దనాని
సామ్రాజ్యదాననిరతాని సరొరుహాక్షి
త్వద్వన్దనాని దురితాహరణొద్యతాని
మామేవ మాతరనిశం కలయన్తు నాన్యమ్

పద్మముల వంటి కన్నులు కల ఒ త్రిపుర సుందరీ| నేకు చేయు వందనములు సంపదలను కలిగించును. ఇంద్రియములన్నిటికీ సంతొషము నిచ్చును. సామ్రాజ్యములనిచ్చును. పాపములను తొలగించును. ఒ తలీ నీ నమస్కార ఫలితము ఏల్లప్పుడు నన్ను పొందుగాక.

13)కల్పొపసంహృతిషు కల్పితతాణ్డవస్య
దేవస్య ఖణ్డపరశొః పరభైరవస్య
పాశాఙ్కుశైక్షవశరాసనపుష్పబాణా
సా సాక్షిణీ విజయతే తవ మూర్తిరేకా

ఒ త్రిపురసుందరీ| ప్రళయకాలమునందు తాండవము చేయుచూ గండ్రగొడ్డలిని చేపట్టిన పరమేశ్వరునకు సాక్షిగా పాశము-అంకుశము-చేరకువిల్లు-పుష్పబాణము ధరించిన నీ స్వరూప మొక్కటే నిలబడుచున్నది.

14)లగ్నం సదా భవతు మాతరిదం తవార్ధం
తేజః పరం బహులకుఙ్కుమ పఙ్కశొణమ్
భాస్వత్కిరీటమమృతాంశుకలావతంసం
మధ్యే త్రికొణనిలయం పరమామృతార్ద్రమ్

అమ్మా| తేజొవంతమైనదీ, కుంకుమతొ ఏర్రనైనదీ, ప్రకాశించు కిరీటమును ధరించినదీ, చంద్రకళను తలపై అలంకరించుకున్నదీ, త్రికొణము యొక్క మధ్యలొనున్నదీ, అమృతముతొ తడిసినదీ, అగు నీ అర్ధశరీరము ఏల్లప్పుడు నా మనస్సునందు లగ్నమగు గాక.

15)హ్రీంకారమేవ తవ నామ తదేవ రూపం
త్వన్నామ దుర్లభమిహ త్రిపురే గృణన్తి
త్వత్తేజసా పరిణతం వియదాది భూతం
సౌఖ్యం తనొతి సరసీరుహసమ్భవాదేః

ఒ త్రిపుర సుందరీ| ’హ్రీం’ కారమే నీ పేరు. నీ రూపము. అది దుర్లభమైనదని చేప్పుచుందురు. నీ తేజస్సుచే ఏర్పడిన ఆకాశము మొదలగు పంచ భూతసముదాయము బ్రహ్మ ముదలగు సమస్త జీవరాశికి సుఖమును కల్గించుచున్నది.

16)హ్రీంకారత్రయసమ్పుటేన మహతా మన్త్రేణ సన్దీపితం
స్తొత్రం యః ప్రతివాసరం తవ పురొ మాతర్జపేన్మన్త్రవిత్
తస్య క్షొణిభుజొ భవన్తి వశగా లక్ష్మీశ్చిరస్థాయినీ
వాణీ నిర్మలసూక్తిభారభరితా జాగర్తి దీర్ఘం వయః

ఒ తల్లీ| మూడు ’హ్రీం’ కారములతొ సంపుటితమైన మహామంత్రముతొ వేలుగొందుచున్న ఈ స్తొత్రమును ప్రతిరొజూ నీ ముందు నిలబడి ఏ మంత్తవేత్త జపించునొ అతనికి రాజులేల్లరు వశులగుదురు.లక్ష్మి చిరస్థాయిగా నుండును. నిర్మలమైన సూక్తులతొ నిండిన సరస్వతి ప్రసన్నురాలగును.చిరాయువు కలుగును.


హర హర శంకర జయ జయ శంకర

హర హర శంకర జయ జయ శంకర

శ్రీ గౌరీదశకమ్





















1)లీలారబ్ధస్థాపితలుప్తాఖిలలొకాం
లొకాతీతైర్యోగిభిరన్తశ్చిరమృగ్యామ్
బాలాదిత్యశ్రెణిసమానద్యుతిపుంజాం
గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడె

తన లీలచే సమస్తలోకములను సృష్టించి కాపాడి నశింపచేయునదీ, లోకాతీతులైన యోగులచే చిరకాలముగా వెతకబడుచున్నదీ, బాలసూర్యసమూహము వంటి కాంతి మండలము కలదీ, పద్మములవంటి కన్నులు కలదీ అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.

2)ప్రత్యాహారధ్యానసమాధిస్థితిభాజాం
నిత్యం చిత్తే నిర్వృతికాష్టాం కలయంతీమ్
సత్యజ్ఞానానన్దమయీం తాం తనురూపాం
గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడె

ప్రత్యాహారము-ధ్యానము-సమాధి అనుయోగముల నాచరించు యోగుల మనస్సునందు ఎల్లప్పుడు సంతోషమును కలిగించునదీ, సత్యము- జ్ఞానము- ఆనందములు స్వరూపముగా కలదీ, సూక్ష్మరూపమున్నదీ, పద్మములవంటి కన్నులు కలదీ,అగు జగదంబయైన గౌరీదేవిని నేనుస్తుతించుచున్నాను.

3)చన్ద్రాపీడానన్దితమన్దస్మితవక్త్రాం
చన్ద్రాపీడాలంకృతనీలాలకశొభామ్
ఇంద్రొపెంద్రాద్యర్చితపాదామ్బుజయుగ్మాం
గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడె

చంద్రచూడుడగు శివునిచే ఆనందింపచేయబడిన చిరునవ్వు ముఖము కలదీ, తన నల్లని కురులలో చంద్రుని అలంకరించుకున్నదీ, ఇంద్రుడు- విష్ణువు మొదలగు దేవతలచే పూజింపబడు పాదపద్మములు కలదీ, పద్మముల వంటి కన్నులు కలదీ, అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.

4)ఆదిక్షాన్తామక్షరమూర్త్యా విలసన్తీం
భూతె భూతె భూతకదంబప్రసవిత్రీమ్
శబ్దబ్రహ్మానందమయీం తాం తటిదాభాం
గౌరీమంబామంబురుహాక్షీమహమీడే

’అ’ కారము మొదలు ’క్ష’ కారము వరకు ఉన్న అక్షరములు తన స్వరూపముగా విలసిల్లుచున్నదీ, పంచమహాభూతములలో (భూమి- నీరు- గాలి- అగ్ని- ఆకాశము) ప్రతి దానియందు అనేక ప్రాణులను సృష్టించునదీ, శబ్దబ్రహ్మస్వరూపిణియైనదీ, ఆనందముతో నండినదీ మెరుపువలే ప్రకాశించునదీ, పద్మముల వంటి కన్నులు కలదీ, అగు జగదంబయైన గౌరీ దేవిని నేను స్తుతించుచున్నాను.

5)మూలాధారాదుత్థితవీథ్యా విధిరన్ధ్రం
సౌరం చాన్ద్రం వ్యాప్య విహారజ్వలితాఙ్గీమ్
యేయం సూక్ష్మాత్సూక్ష్మతనుస్తాం సుఖరూపాం
గౌరీమంబామమ్బురుహాక్షీమహమీడే

సుషుమ్నానాడీ మార్గము ద్వారా మూలాదారచక్రము నుండి బ్రహ్మరంధ్రము వరకు సూర్య చంద్రస్థానములైన ’ఇడా’ ’పీంగళా’ నాడుల యందు విహారించు తేజోమూర్తియైనదీ, సూక్ష్మమైన పధార్థము కంటే సూక్ష్మమైనదీ, సుఖస్వరూపిణియైనదీ, పద్మముల వంటి కన్నుల కలదీ, అగు జగదంబయైన గౌరీదేవిని స్తుతించుచున్నాను.

6)నిత్యః శుద్ధో నిష్కల ఎకో జగదీశః
సాక్షీ యస్యాః సర్గవిధౌ సంహరణే చ
విశ్వత్రాణక్రీడనలోలాం శివపత్నీం
గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడే

నిత్యుడు- శుద్దుడు- పరిపూర్ణుడు- ఒక్కడు- జగదీశుడు అగు పరమేశ్వరుడు గౌరీదేవిని చేయు సృష్టి స్థితిలయలకు సాక్షి, ప్రపంచరక్షణము అను క్రీడయందు ఇష్టము కలదీ, శివుని భార్య యైనదీ, పద్మములవంటి కన్నులు కలదీ, అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.

7)యస్యాః కుక్షౌ లీనమఖణ్డం జగదణ్డం
భూయోభూయః ప్రాదురభూదుత్థితమేవ
పత్యా సార్ధం తాం రజతాద్రౌ విహరన్తీం
గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడే

గౌరీదేవి గర్భమునందున్న సమస్తలోకములు మరల మరల పుట్టుచుండును. లీనమగుచుండును. భర్తతో కలిసి వెండికొండపై విహరించునదీ,పద్మములవంటి కన్నులు కలదీ, అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.

8)యస్యామోతం ప్రోతమశేషం మణిమాలా
సూత్రే యద్వత్ క్వాపి చరం చాప్యచరం చ
తామధ్యాత్మజ్ఞానపదవ్యా గమనీయాం
గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడే

చరాచరరూపమైన ఈ ప్రపంచమంతయు, దారము నందు మణులవలే గౌరీ దేవియందు అల్లుకుని ఉన్నది. అద్యాత్మజ్ఞానమార్గముచే తెలుసుకొనదగినదీ, పద్మములవంటి కన్నులు కలదీ. అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.

9)నానాకారైః శక్తికదమ్బైర్భువనాని
వాప్య స్వైరం క్రీడతి యేయం స్వయమేకా
కల్యాణీం తాం కల్పలతామానతిభాజాం
గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడే

గౌరీదేవి తాను ఒక్కతేగానే ఉండి శక్తివంతములైన నానారూపములతో లోకములనన్నిటినీ వ్యాపించి స్వేచ్చగా క్రీడించిచున్నది. కళ్యాణస్వరూపిణి, భక్తుల పాలిట కల్పలత, పద్మములవంటి కన్నులు కలదీ. అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.

10)ఆశాపాశక్లేశవినాశం విదధానాం
పాదామ్భోజధ్యానపరాణాం పురుషాణామ్
ఈశామీశార్ధాఙ్గహరాం తామభిరామాం
గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడే

తన పద్మములను ధ్యానించు మనుషులకు ఆశాపాశములవలన కలుగు బాధలను నశింపచేయునదీ, పరమశివుని అర్ధాంగి, పరమేశ్వరీ, పద్మములవంటి కన్నులు కలదీ అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.

11)ప్రాతఃకాలే భావవిశుద్ధః ప్రణిధానా-
ద్భక్త్యా నిత్యం జల్పతి గౌరీదశకం యః
వాచాం సిద్ధిం సంపదమగ్ర్యాం శివభక్తిం
తశ్యావశ్యం పర్వతపుత్రీ విదధాతి

ఎవడైతే శుద్ధమైన హృదయమును కలవాడై భక్తితో ప్రాతఃకాలమునందు ఈ గౌరీ దశకమను స్తోత్రమును పఠించునో అతనికి వాక్సిద్దినీ, ఉన్నతమైన సంపదను, శివభక్తినీ గౌరీదేవి తప్పక ప్రసాదించును.

జయ జయ శంకర హర హర శంకర

Thursday, April 12, 2012

శ్రీ త్రిపురసుందర్యష్టకమ్







శ్రీ మచ్చంకరాచార్య కృత త్రిపురసుందర్యష్టకమ్

కదమ్బవనచారిణీం మునికదమ్బకాదమ్బినీం
నితమ్బజితభూధరాం సురనితమ్బినీసేవితామ్|
నవామ్బురుహలొచనామభినవామ్బుదశ్యామలాం
త్రిలొచనకుటుమ్బినీం త్రిపురసున్దరీమాశ్రయే||౧||
కదంబవృక్షములు (కడిమి చేట్లు) వనమందు నివసించునదీ,మునిసముదాయమను కదంబవృక్షములను వికసింపచేయు (ఆనందింప చేయు) మేఘమాలయైనదీ, పర్వతముల కంటే ఏత్తైన నితంబము కలదీ, దేవతాస్త్రీలచే సేవింపబడునదీ, తామరలవంటి కన్నులు కలదీ,తొలకరిమబ్బు వలే నల్లనైనదీ, మూడు కన్నులు కల పరమేశ్వరుని ఇల్లాలు అగు త్రిపురసుందరిని ఆశ్రయించుచున్నాను.

కదమ్బవనవాసినీం కనకవల్లకీధారిణీం
మహార్హమణిహారిణీం ముఖసముల్లసద్వారుణీమ్|
దయావిభవకారిణీం విశదరొచనాచారిణీం
త్రిలొచనకుటుమ్బినీం త్రిపురసున్దరీమాశ్రయే||౨||
కదంబవనమందు నివసించునదీ, బంగారు వీణను ధరించినదీ, అమూల్యమైన మణిహారముల నలంకరించుకున్నదీ, ముఖము నందు వారుణీ (ఉత్తమమైన మద్యము) పరిమళము కలదీ,అత్యధికమైన దయను కురిపించునదీ, గొరొచనము పూసుకున్నదీ, మూడు కన్నులు కల పరమేశ్వరుని ఇల్లాలు అగు త్రిపుర సున్దరిని ఆశ్రయించుచున్నాను.

కదమ్బవనశాలయా కుచభరొల్లసన్మాలయా
కుచొపమితశైలయా గురుకృపాలసద్వేలయా|
మదారుణకపొలయా మధురగీతవాచాలయా
కయాపి ఘనలీలయా కవచితా వయం లేఏలయా||౩||
కదంబవనములొనున్న ఇంటిలొ నివసించునదీ, వక్షొజములపై పుష్పమాలనలంకరించుకున్నదీ, పర్వతములవలే ఏత్తైన స్తనములు కలదీ, అధికమైన కృపాసముద్రమునకు తీరము వంటిదీ, మద్యముచే ఏర్రనైన చేంపలు కలదీ, మధుర సంగీతమును గానము చేయు చున్నదీ, వర్ణించనలవి కానిదీ, మేఘము వలే నల్లనైనదీ అగు ఒక లీలచే మనము రక్షించబడుచున్నాము.

కదమ్బవనమధ్యగాం కనకమణ్డలొపస్థితాం
షడమ్బురుహవాసినీం సతతసిద్ధసౌదామినీమ్|
విడమ్బితజపారుచిం వికచచన్ద్రచూడామణిం
త్రిలొచనకుటుమ్బినీం త్రిపురసున్దరీమాశ్రయే||౪||
కదంబవన మధ్యమునందున్నదీ, బంగారు మండపము నందు కొలువు తీర్చునదీ మూలాధారము-స్వాదిష్ఠానము-మణిపూరము-అనాహతము-విశుద్దము-ఆజ్ఞ అనే ఆరుచక్రములందు నివసించు నదీ, ఏల్లప్పుడు యొగసిద్దులకు మేరుపు తీగవలే దర్శనమిచ్చునదీ, జపాపుష్పము (మంకేన పువ్వు) వంటి శరీర కాంతి కలదీ, శిరస్సుపై చంద్రుని ఆభరణముగా ధరించునదీ, మూడు కన్నులు గల పరమేశ్వరుని ఇల్లాలు అగు త్రిపురసున్దరిని ఆశ్రయించుచున్నాను.

కుచాఞ్చితవిపఞ్చికాం కుటిలకున్తలాలఙ్కృతాం
కుశేశయనివాసినీం కుటిలచిత్తవిద్వేషిణీమ్|
మదారుణవిలొచనాం మనసిజారిసమ్మొహినీం
మతఙ్గమునికన్యకాం మధురభాషిణీమాశ్రయే||౫||
వక్షస్థలము నందు వీణ కలదీ, వంకరయైన కేశములతొ అలంకరింపబడినదీ, సహస్రార పద్మము నందు నివసించునదీ, దుష్టులను ద్వేషించునదీ, మద్యపానముచే ఏర్రనైనకన్నులు కలదీ, మన్మథుని జయించిన శివుని కూడ మొహింపచేయునదీ, మతంగమహర్షికి కుమార్తేగా అవతరించినదీ, మధురముగా మాట్లాడునదీ అగు త్రిపురసున్దరిని ఆశ్రయించుచున్నాను.

స్మరేత్ప్రథమపుష్పిణీం రుధిరమిన్దునీలామ్బరాం
గృహీతమధుపాత్రికాం మదవిఘూర్ణనేత్రాఞ్చలామ్|ఘనస్తనభరొన్నతాం గలితచూలికాం శ్యామలాం
త్రిలొచనకుటుమ్బినీం త్రిపురసున్దరీమాశ్రయే||౬||
ప్రథమరజస్వలయై ఆరక్తబిందువు లంటియున్న నల్లని వస్త్రమును ధరించినదీ, మద్యపాత్రను పట్టుకున్నదీ, మద్యపానముచే ఏర్రనై కదలుచున్న కన్నులు కలదీ, ఉన్నతమైన స్తనములు కలదీ, జారుచున్న జడముడి కలదీ, శ్యామల (నల్లనిది) యైనదీ, మూడు కన్నులు గల పరమేశ్వరుని ఇల్లాలు అగు త్రిపురసున్దరిని ఆశ్రయించుచున్నాను.

సకుఙ్కుమవిలేపనామలికచుమ్బికస్తూరికాం
సమన్దహసితేక్షణాం సశరచాపపాశాఙ్కుశామ్|
అశేషజనమొహినీమరుణమాల్యభూషామ్బరాం
జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరామ్యమ్బికామ్||౭||
కుంకుమతొ కలిసిన విలేపమును పూసుకున్నదీ, ముంగురులను తాకుచున్న కస్తూరీ తిలకమును ధరించినదీ,చిరునవ్వుతొ కలిసిన కన్నులు కలదీ, పుష్పభాణమును-చేరకువింటినీ-పాశాంకుశములను ధరించినదీ, అశేష జనులను మొహింపచేయునదీ, ఏర్రని పూలదండలను-ఆభరణములను-వస్త్రములను ధరించినదీ, జపాపుష్పము వలేప్రకాశించుచున్నదీ అగు జగదంబను జపము చేయునపుడు స్మరించేదను.

పురందరపురంధ్రికాచికురబన్ధసైరంధ్రికాం
పితామహపతివ్రతాపటుపటీరచర్చారతామ్|
ముకున్దరమణీమణీలసదలఙ్క్రియాకారిణీం
భజామి భువనామ్బికాం సురవధూటికాచేటికామ్||౮||
ఇంద్రుని భార్యయగు శచీ దేవిచే కేశాలంకరణ చేయబడినదీ, బ్రహ్మదేవుని భార్యయగు సరస్వతిచే మంచి గంధము పూయబడినదీ, విష్ణుపత్నియగు లక్ష్మీచే అలంకరింపబడినదీ, దేవతాస్త్రీలు చేలికత్తేలుగా కలదీ యగు జగన్మాతను సేవించుచున్నాను

జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర