Monday, July 30, 2012

శ్రీ దుర్గా అష్టోత్తర శతనామ స్తోత్రం




















శ్రీ దుర్గా అష్టోత్తర శతనామ స్తోత్రం 

1::దుర్గా శివా మహాలక్ష్మీ-ర్మహాగౌరీచ చండికా 
సర్వజ్ఞా సర్వలోకేశీ సర్వకర్మఫలప్రదా 

2::సర్వతీర్థమయీ పుణ్యా దేవయోనిరయోనిజా 
భూమిజా నిర్గుణాధారశక్తిశ్చానీశ్వరీ తథా 

3::నిర్గుణా నిరహంకారా సర్వగర్వవిమర్దినీ 
సర్వలోకప్రియా వాణీ సర్వవిద్యాధిదేవతా 

4::పార్వతీ దేవమాతా చ వనీశా వింధ్యవాసినీ 
తేజోవతీ మహామాతా కోతిసూర్యసమప్రభా 

5::దేవతా వహ్నిరూపా చ సరోజా వర్ణరూపిణీ 
గుణాశ్రయా గుణమధ్యా గుణత్రయవివర్జితా 

6::కర్మజ్ఞానప్రదా కాంతా సర్వసంహారకారిణీ 
ధర్మజ్ఞానా ధర్మనిష్టా సర్వకర్మవివర్జితా 

7::కామాక్షీ కామసంహర్త్రీ కామక్రోధవివర్జితా 
శాంకరీ శాంభవీ శాంతా చంద్రసూర్యాగ్నిలోచనా 

8::సుజయా జయభూమిష్ఠా జాహ్నవీ జనపూజితా 
శాస్త్రా శాస్త్రమయా నిత్యా శుభా చంద్రార్ధమస్తకా 

9::భారతీ భ్రామరీ కల్పా కరాళీ కృష్ణపింగళా 
బ్రాహ్మీ నారాయణీ రౌద్రీ చంద్రామృతపరివృతా 

10::జ్యేష్ఠేందిరా మహామాయా జగత్సృష్ట్యాధికారిణీ 
బ్రహ్మాండకోటిసంస్థానా కామినీ కమలాలయా 

11::కాత్యాయనీ కలాతీతా కాలసంహారకారిణీ 
యోగనిష్ఠా యోగగమ్యా యోగధ్యేయా తపస్వినీ 

12::జ్ఞానరూపా నిరాకారా భక్తాభీష్టఫలప్రదా 
భూతాత్మికా భూతమాతా భూతేశా భూతధారిణీ 

13::స్వధానారీమధ్యగతా షడాధారాదివర్ధినీ 
మోహితాంశుభవా శుభ్రా సూక్ష్మా మాత్రా నిరాలసా 

14::నిమ్నగా నీలసంకాశా నిత్యానందా హరా పరా 
సర్వజ్ఞానప్రదానందా సత్యా దుర్లభరూపిణీ 

15::సరస్వతీ సర్వగతా సర్వాభీష్టప్రదాయినీ 
ఇతి శ్రీదుర్గా అష్టోత్తర శతనామస్తోత్రం సంపూర్ణమ్ 


Sree Durga Ashtottara Satanama Stotram

1::durgaa Sivaa mahaalakshmee-rmahaagaureecha chaMDikaa 
sarvaj~naa sarvalOkaeSee sarvakarmaphalapradaa 

2::sarvateerthamayee puNyaa daevayOnirayOnijaa 
bhoomijaa nirguNaadhaaraSaktiSchaaneeSvaree tathaa 

3::nirguNaa nirahaMkaaraa sarvagarvavimardinee 
sarvalOkapriyaa vaaNee sarvavidyaadhidaevataa 

4::paarvatee daevamaataa cha vaneeSaa viMdhyavaasinee 
taejOvatee mahaamaataa kOtisooryasamaprabhaa 

5::daevataa vahniroopaa cha sarOjaa varNaroopiNee 
guNaaSrayaa guNamadhyaa guNatrayavivarjitaa 

6::karmaj~naanapradaa kaaMtaa sarvasaMhaarakaariNee 
dharmaj~naanaa dharmanishTaa sarvakarmavivarjitaa 

7::kaamaakshee kaamasaMhartree kaamakrOdhavivarjitaa 
SaaMkaree SaaMbhavee SaaMtaa chaMdrasooryaagnilOchanaa 

8::sujayaa jayabhoomishThaa jaahnavee janapoojitaa 
Saastraa Saastramayaa nityaa Subhaa chaMdraardhamastakaa 

9::bhaaratee bhraamaree kalpaa karaaLee kRshNapiMgaLaa 
braahmee naaraayaNee raudree chaMdraamRtaparivRtaa 

10::jyaeshThaeMdiraa mahaamaayaa jagatsRshTyaadhikaariNee 
brahmaaMDakOTisaMsthaanaa kaaminee kamalaalayaa 

11::kaatyaayanee kalaateetaa kaalasaMhaarakaariNee 
yOganishThaa yOgagamyaa yOgadhyaeyaa tapasvinee 

12::j~naanaroopaa niraakaaraa bhaktaabheeshTaphalapradaa 
bhootaatmikaa bhootamaataa bhootaeSaa bhootadhaariNee 

13::svadhaanaareemadhyagataa shaDaadhaaraadivardhinee 
mOhitaaMSubhavaa Subhraa sookshmaa maatraa niraalasaa 

14::nimnagaa neelasaMkaaSaa nityaanaMdaa haraa paraa 
sarvaj~naanapradaanaMdaa satyaa durlabharoopiNee 

15::sarasvatee sarvagataa sarvaabheeshTapradaayinee 
iti Sreedurgaa ashTOttara SatanaamastOtraM saMpoorNam

Friday, July 27, 2012

స్నేహితులు అందరికీ వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు





స్తుతి-పాఠ

నమో నమః

పద్మాననే పద్మిని పద్మ-హస్తే పద్మ-ప్రియే పద్మ-దలాయతాక్షి
విశ్వే-ప్రియే విష్ణు-మనోనుకూలే, త్వత్-పాద-పద్మం మయి సన్నిధత్స్వ

పద్మాననే పద్మ-ఉరు, పద్మాక్షీ పద్మ-సమ్భవే
త్వన్మా భజస్వ పద్మాక్షి, యేన సౌఖ్యం లభామ్యహమ్

అశ్వ-దాయి చ గో-దాయి, ధనదాయై మహా-ధనే
ధనం మే జుషతాం దేవి, సర్వ-కామాంశ్చ దేహి మే

పుత్ర-పౌత్ర-ధన-ధాన్యం, హస్త్యశ్వాది-గవే రథమ్
ప్రజానాం భవతి మాతః, అయుష్మన్తం కరోతు మామ్

ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసుః
ధనమిన్ద్రా వృహస్పతిర్వరుణో ధనమశ్నుతే

వైనతేయ సోమం పిబ, సోమం పిబతు వృత్రహా
సోమం ధనస్య సోమినో, మహ్మం దదాతు సోమిని

న క్రోధో న చ మాత్సర్యం, న లోభో నాశుభా మతీః
భవన్తీ కృత-పుణ్యానాం, భక్తానాం శ్రీ-సూక్తం జపేత్

Tuesday, July 24, 2012

మంగళగౌరీ వ్రతం




శ్రావణ మాస వ్రతాలు అనగానే ప్రధానంగా గుర్తుకు వచ్చేది "వరలక్ష్మీ వ్రతం". ఆ తరువాత శ్రావణమాసంలో మహిళలు ఆచరించే మరో ప్రధాన వ్రతం “మంగళ గౌరీ వ్రతం". దీనికే "శ్రావణ మంగళవార వ్రతం" అని,"మంగళ గౌరీ నోము" అని పేర్లు.
ఈ మాసంలో అందరి ఇళ్లు మామిడి తోరణాలతోనూ, పసుపు గడపలతోనూ, ముత్తైదువుల రాకపోకలతోనూ కళ కళలాడుతూ ఉంటాయి. శ్రవణ మాసం లో వచ్చే నాలుగు మంగళవరాలు మంగళ గౌరీని పూజించాలి

పార్వతి దేవి కి మరొక పేరు (గౌరీ ) మంగళ గౌరీ. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన “ఐదవతనం” కలకాలం నిలుస్తుందని ప్రతీతి. ఈ వ్రతాన్నిగురించి స్వయంగా శ్రీ కృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి.

ఒకసారి ద్రౌపది శ్రీ కృష్ణుని వద్దకు వెళ్లి “అన్నా!మహిళలకు వైధవ్యాన్ని కలిగించని వ్రతం ఏదైనా ఉంటే చెప్ప” మని అడగ్గా, శ్రీ కృష్ణుడు వెంటనే “మంగళగౌరీదేవి మహాదేవత. ఆది పరాశక్తియే మంగళగౌరీగా ప్రసిద్ధిచెందింది. త్రిపురాసుర సంహార సమయంలో పరమశివుడు మంగళగౌరీదేవిని పూజించి విజయం సాధించాడు. అంగారకుడు మంగళగౌరీ దేవిని పూజించి గ్రహరాజై, మంగళవారానికి అధిపగా వెలుగొందుతున్నాడు. ఆ మంగళగౌరీని పూజిస్తూ, శ్రావణ మాస మంగళవారాలలో వ్రతాన్నిఆచరించినట్లయితే వైధవ్యం ప్రాప్తించదు. ఈ వ్రతాన్ని ఆచరించినవారు సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుతారు – అని చెప్పాడని పురాణ కథనం. పురాణకాలం నుంచీ ఈ వ్రతం ఆచరణలో ఉన్నట్లు తెలుస్తోంది.

మంగళగౌరీ వ్రతాన్ని ఎవరు చేయవచ్చు?

శ్రావణంలోని ప్రతి మంగళవారం కొత్తగా పెళ్లైన స్త్రీలు మాంగల్యానికి అధిదేవత ‘గౌరీదేవి’ని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. అలా కొత్తగా వివాహమైన స్త్రీలు తమ మాంగల్యాన్ని పదికాలలపాటు పచ్చగా కాపాడమని కోరుతూ వివాహమైన సంవత్సరం మొదలు కొని ఐదేళ్లపాటు ఆచరించే వ్రతమే ‘మంగళగౌరీ వ్రతం’. శ్రావణ మాసంలో ఎన్ని మంగళ వారాలు వస్తాయో అన్ని మంగళవారాలు ఈ వ్రతం చేసి మంగళగౌరీని పూజిస్తారు. వివాహమైన మొదటి సంవత్సరం పుట్టినింటి లోనూ, ఆ తరువాతి నాలుగు సంవత్సరాలు అత్తవారింటిలోనూ ఈ వ్రతాన్ని ఆచరించుకుంటారు. ఈ వ్రతం చేయడం వలన భోగభాగ్యాలే కాక, దీర్ఘ సుమంగళి భాగ్యం కూడా స్వంతమవుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి. అందువలన పరమ శివుడు కూడా మంగళగౌరీని ఆరాధించి త్రిపురాసుర సంహారం చేశాడని ప్రతీతి.

మంగళగౌరీ వ్రత నియమాలు

తొలిసారిగా నోమును ప్రారంభించేటప్పుడు వ్రతం చేస్తున్నవారి తల్లి ప్రక్కనే వుండి వ్రతాన్ని చేయించడం శ్రేష్టం. అలాగే తొలి వాయనాన్ని తల్లికే ఇవ్వడం మంచిది. ఒకవేళ తల్లి లేకపోయినట్లయితే అత్తగానీ, లేదా ఇతర ముత్తైదువుల సహాయంతోగానీ వ్రతాన్ని ఆచరించవచ్చు. వ్రతాన్నిఆచరించే మహిళలు తప్పనిసరిగా కాళ్ళకు పారాణి పెట్టుకోవాలి.

వ్రతాన్ని పాటించే రోజు రాత్రి ఉపవాసం ఉండాలి.
వ్రతాన్ని ఆచరించే నాటి ముందు రోజు, వ్రతం రోజూ దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి.
వ్రతానికి తప్పనిసరిగా ఐదుగురు ముత్తైదువులను పేరంటానికి పిలిచి వారికి వాయనములు ఇవ్వాలి. (శక్తిని బట్టి వారి వారి ఆచారం ప్రకారం వాయనములు ఇవ్వచును)
ఒకే మంగళగౌరీదేవి విగ్రహాన్ని ఆ నెలలో వచ్చే అన్ని వారాల్లో ఉపయోగించాలి. వారానికొక కొత్త విగ్రహాన్ని ఉపయోగించకూడదు.
ఆ సంవత్సరం వ్రతం పూర్తయిన తరువాత, వినాయక చవితి పండుగ పిదప, వినాయకుడి నిమజ్జనంతో పాటు అమ్మవారినీ నిమజ్జనం చేయాలి.
పూజకు గరికె, ఉత్తరేణి, తంగేడుపూలు తప్పనిసరిగా వాడాలి.
మంగళగౌరీ వ్రతానికి కావలసిన వస్తువులు :

పసుపు, కుంకుమ వాయనమునకు అవసరమైన వస్తువులు. ఎర్రటి రవికె గుడ్డ, గంధము, పూలు, పండ్లు, ఆకులు, వక్కలు, తోరములకు దారము, టెంకాయ, పసుపుతాడు , దీపపు సెమ్మెలు -2, ఐదు వత్తులతో హారతి ఇవ్వడానికి అవసరమైన హారతి పళ్ళెం, గోధుమపిండితో గానీ, పూర్ణంతో గానీ చేసిన ఐదు ప్రమిదలు, కర్పూరం , అగరవత్తులు, బియ్యము, కొబ్బరిచిప్ప ,శనగలు, దీపారాధనకు నెయ్యి మొదలైనవి.

మంగళగౌరీని ప్రతిష్టించుకునే విధం :

వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నేలేచి తల స్నానం చేసి,ఇంటిని శుభ్రంగా కడగాలి. పూజగదిలో గానీ, ఇంట్లో వ్రతం చేయదలుచుకున్న ప్రాంతంలో గానీ, ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యపు పిండితో అష్టదళ పద్మములను ముగ్గుగా తీర్చిదిద్దాలి. దానిపైన బియ్యాన్ని పోసి బియ్యం పై ఒక కొబ్బరి చిప్పను ఉంచాలి. దానిమీద జాకెట్ బట్ట ఉంచి, తమలపాకులను పెట్టి, ఆ పైన మంగళగౌరీని ప్రతిష్టించుకోవాలి. మంగళగౌరీని సాధారణంగా పసుపుతో చేసుకోవటం మంచిది.అయితే ఒక మాసమంతా ఉంచుకోవాలి కాబట్టి, పసుపుకు గోధుమ పిండిని కలిపి మంగళగౌరీని తయారు చేసుకోవాలి.

మంగళగౌరీని ఐదు ముఖాలతో తయారు చేసుకోవాలి. అంటే పసుపు, గోధుమ పిండి మిశ్రమముతో ఒక పీఠముగా చేసుకుని, దానిపై నాలుగు మూలలా చిన్న స్తంభాలుగా ఉంచాలి. వాటి మధ్యలో ఐదవదాన్నిఉంచాలి. ఈ విధంగా మంగళగౌరీని ఐదు ముఖాలతో తయారు చేసుకుని పీఠముపై ప్రతిష్టించి, కుంకుమ, పూలను అలంకరించాలి.

పైన చెప్పినటువంటివే ప్రస్తుతం “మంగళగౌరీ” విగ్రహాలు వెండి లేదా బంగారపువి మార్కెట్టులో లభిస్తాయి. కొందరు వాటిని కూడా ఉపయోగిస్తున్నారు. వాటిని ఉపయోగించి లేదా పసుపుతో చేసి ప్రతిష్టించుకోవాలి లేక గౌరీ దేవి ఫొటో ని కూడా పూజించవచ్చు. పూజా పీఠాన్ని ఎవరి శక్తి కొద్దీ వారు అలంకరించు కోవచ్చు. ఈ విధంగా అమ్మవారిని ప్రతిష్టించుకుని వ్రతాన్నిచేసుకోవాలి.




మంగళగౌరీ వ్రత విధానం ::>>

ఆచమనం

ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా

(అని మూడుసార్లు ఆచమనం చేయాలి)

ఓం గోవిందాయ నమః (నీళ్ళు వదిలి వెయవలెను)

విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః
ఋషీకేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః

ప్రద్యుమ్నాయ నమః అనిరుద్దాయ నమః పురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమః నారసింహాయ నమః
అచ్యుతాయ నమః జనార్ధనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీ కృష్ణాయ నమః

ఉత్తిష్ఠంతు భూతపిశాచా ఏతే భూమిభారకాః
ఏతేషా మవిరోధేనా బ్రహ్మకర్మ సమారభే ||

(ప్రాణాయామం చేసి అక్షతలు వెనుకకు వేసుకొనవలెను.)

ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్బువస్సువరోమ్

(కుడిచేతితో ముక్కుపట్టుకొని యీ మంత్రమును ముమ్మారు చెప్పవలెను)

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే

ఓం లక్ష్మినారాయణభ్యయం నమః శ్రీ ఉమామహేశ్వరాభ్యం నమః

శ్రీ వాణిహిరణ్యగర్భాభ్యం నమః శ్రీ శచిపురంధరాభ్యం నమః

శ్రీ అరుంధతివసిష్టాభ్యం నమః శ్రీ సీతారామాభ్యం నమః

సర్వేభ్యో దేవేభ్యో నమః మాతృభ్యో నమః, పితృభ్యో నమః

ఓం మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ మంగళ గౌరీ ప్రీత్యర్ధం అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే, భరతఖండే మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీశైలశ్య ఈశాన్య (మీరు ఉన్న దిక్కును చప్పండి) ప్రదేశే కృష్ణ/గంగా/గోదావర్యోర్మద్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షినములలొ ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన (ప్రస్తుత సంవత్సరం) దక్షిణాయనే,వర్ష ఋతవ్, శ్రావణ మాసే, శుక్ల పక్షే , శుభ తిథౌ, శుక్రవాసరే, శుభనక్షత్రే (ఈరోజు నక్షత్రము) శుభయోగే, శుభకరణే. ఏవంగుణ విశేషణ విషిష్ఠాయాం, శ్రీమాన్ (మీ గొత్రము) గోత్రస్య (మీ పూర్తి పేరు) నామధేయస్య ధర్మపత్నీ (పేరు) అహం మమోపాత్త దురితక్షయద్వారా యావజ్జీవ సామాంగల్య సిద్ధ్యర్థ పుత్ర, పౌత్ర సంపత్సౌభాగ్య సిద్ధ్యర్థం మమ వివాహ ప్రథమ వర్షాది పంచమ వర్ష పర్యంతరం శ్రీమంగళగౌరీ వ్రతం కరిష్యే. అద్య శ్రీ మంగళగౌరీ దేవతా ముద్దిశ్య శ్రీ మంగళగౌరీ దేవతా ప్రీత్యర్థం, సంభవద్భిర్త్రవై: సంభవితానియమేన ధ్యానవాహనాది షాడోశోపచార పూజాం కరిష్యే.

(అక్షతలు నీళ్ళతో పళ్ళెములో వదలవలెను.)

తదంగత్వేన కలశారాధనం కరిష్యే

శ్లో : కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః
మూలే తత్రోస్థితోబ్రహ్మా మధ్యేమాతృగణా స్మృతాః
కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుందరా
ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః

(కలశపాత్రకు గంధము,కుంకుమబొట్లు పెట్టి పుష్పాక్షతలతో అలంకరింపవలెను.కలశపాత్రపై కుడిఅరచేయినుంచి ఈ క్రిందిమంత్రము చదువవలెను.)

శ్లో : గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
ఆయాంతు దేవపూజార్థం – మమ దురితక్షయకారకాః
కలశోదకేన పూజాద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య

(కలశములోని జలమును పుష్పముతో దేవునిపైనా పూజాద్రవ్యములపైన,తమపైన జల్లుకొనవలెను.తదుపరి పసుపు వినాయకునిపై జలము జల్లుచు ఈ క్రింది మంత్రము చదువవలెను.)

మం : ఓం గణానాంత్వ గణపతిగ్ హవామహే కవింకవీనాముపమశ్రస్తవం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్

శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి,ఆవాహయామి,నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి మీద అక్షతలు, గంధం పువ్వులు వేయవలెను .

ఓం సుముఖాయ నమః,ఏకదంతాయ నమః,కపిలాయ నమః,గజకర్ణికాయ నమః,లంబోదరాయ నమః,వికటాయ నమః,విఘ్నరాజాయ నమః,గణాదిపాయ నమః,ధూమకేతవే నమః,గణాధ్యక్షాయ నమః,ఫాలచంద్రాయ నమః,గజాననాయ నమః,వక్రతుండాయనమః,శూర్పకర్ణాయ నమః,హేరంబాయ నమః,స్కందపూర్వజాయ నమః,ఒం సర్వసిద్ది ప్రదాయకాయ నమః,మహాగణాదిపతియే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పపూజాంసమ్ర్పయామి. మహాగణాదిపత్యేనమః ధూపమాఘ్రాపయామి.

ఓం భూర్బువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ మహాగణాధిపతయే నమః గుడోపహారం నివేదయామి.

(నీరు నివేదన చుట్టూ చల్లుతూ) సత్యం త్వర్తేన పరిషించామి, అమ్రుతమస్తు అమృతో పస్తరణమసి… ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహో, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మేణ్యే స్వాహో గూడ సహితఫల నివేదనం సమర్పయామి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.(నీటిని వదలాలి).

శ్రీ మహాగణాథిపతయే నమ: తాంబూలం సమర్పయామి, తాంబూలానంతరం ఆచమనం సమర్పయామి.

శ్రీ మహాగణాథిపతయే నమ: కర్పూర నీరాజనం సమర్పయామి.

అనేన మాయా చరిత గణపతి అర్చనేన భగవత: సర్వాత్మక: శ్రీ గణపతిర్దేవతా

సుప్రీత, సుప్రసన్న వరాదభవతు ! మమ యిష్టకామ్యార్థ సిద్ధిరస్తు !!

వినాయకునికి నమస్కరించి అక్షతలు తల మీద చల్లుకోవాలి.ఈ విధంగా మహాగణపతి పూజను ముగించిన అనంతరం మంగళగౌరీ వ్రతాన్ని ప్రారంభించాలి. పూజను ప్రారంభించే ముందు తోరణములను తయారు చేసుకోవాలి.



తోర పూజ ::>>

తెల్లటి దారమును ఐదు పోగులు తీసుకుని దానికి పసుపు రాసుకోవాలి. ఆ దారానికి ఐదు పూలు, ఐదు చోట్ల కట్టి ముడులు వేయాలి. అంటే ఐదు పోగుల దారమును ఉపయోగించి, ఐదు పువ్వులతో ఐదు ముడులతో తోరములను తయారు చేసుకుని, పీఠం వద్ద ఉంచి, పుష్పములు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి, తోరములను పూజించి ఉంచుకోవాలి. ఈ విధంగా తోరములను తయారు చేసుకున్న అనంతరం పూజకు ఉపక్రమించాలి.

అనంతరం మంగళ గౌరీ పూజ ప్రారంభం – శ్రీ మంగళ గౌరీ ధ్యానమ్ :

ఓం శ్రీ మంగళ గౌరీ ఆవాహయామి

ఓం శ్రీ గౌరీ రత్నసింహాసనం సమర్పయామి

ఓం శ్రీ మంగళ గౌరీ అర్జ్యం సమర్పయామి

ఓం శ్రీ మంగళ గౌరీ పాద్యం సమర్పయామి

ఓం శ్రీ మంగళ గౌరీ ఆచమనీయం సమర్పయామి

ఓం శ్రీ మంగళ గౌరీ పంచామృతస్నానం సమర్పయామి

ఓం శ్రీ మంగళ గౌరీ శుద్ధోదకస్నానం సమర్పయామి

ఓం శ్రీ మంగళ గౌరీ వస్త్రయుగ్నం సమర్పయామి

ఓం శ్రీ మంగళ గౌరీ ఆభరణానే సమర్పయామి

ఓం శ్రీ మంగళ గౌరీ మాంగల్యం సమర్పయామి

ఓం శ్రీ మంగళ గౌరీ గంధం సమర్పయామి

ఓం శ్రీ మంగళ గౌరీ అక్షాతన్ సమర్పయామి

ఓం శ్రీ మంగళ గౌరీ పుష్పాణి సమర్పయామి

అంటూ వరుసగా చదువుకోవాలి. ఆయా ద్రవ్యాల పేరులు చెప్పేటప్పుడు దేవికి అని సమర్పించాలి.

రత్నసింహాసనాలు, బంగారు మాంగల్యం లాంటివి సమర్పించడం మనకు సాధ్యం కాదు కాబట్టి వీటికి బదులుగా అక్షింతలు లేదా పువ్వులు సమర్పించవచ్చు.

తరువాత శ్రీ మంగళ గౌరీ అష్టోత్తర నామములు ( శ్రీ గౌరీ అస్తోతరములు) చదవండి ..

ఆ తరువాత ఈ విధంగా చేయాలి.

ఓం శ్రీ మంగళ గౌరీ ధూపం ఆఘ్రాపయామి – అగరువత్తులు వెలిగించి చూపించాలి.

ఓం శ్రీ మంగళ గౌరీ దీపం దర్శయామి. కుందులలో నూనెపోసి వత్తులు వేసి దీపారాధన చేసి చూపించాలి.

ఓం శ్రీ మంగళ గౌరీ నైవేద్యం సమర్పయామి నైవేద్యం సమర్పించాలి.

ఓం శ్రీ మంగళ గౌరీ తాంబూలం సమర్పయామి తమలపాకులు వక్కలతో తాంబూలం సమర్పించాలి.

ఓం శ్రీ మంగళ గౌరీ నీరాజనం సమర్పయామి కర్పూరం వెలిగించి హారతి ఇవ్వాలి.

ఓం శ్రీ మంగళ గౌరీ మంత్రపుష్పం సమర్పయామి పువ్వులు వేయాలి.

ఓం శ్రీ మంగళ గౌరీమీ ప్రదక్షిణ నమస్కాన్ సమర్పయామి ప్రదక్షిణలు చేయాలి.

ఓం శ్రీ మంగళ గౌరీ నమస్కారన్ సమర్పయామి. నమస్కరించాలి.



శ్రీ మంగళ గౌరీ వ్రతకథ ::>>

పూర్వం ధర్మపాలుడనే ఒక ధనికునికి సదాచార సంపన్నురాలైన భార్య ఉండేది. కానీ వారికి పుత్ర సంతానం లేదు. వారు ఎన్నో వ్రతాలు చేశారు. దానాలు చేశారు. కానీ సంతానం కలగలేదు. ఒకనాడు భర్త అనుమతితో భార్య తన ఇంటి ముందునుంచి వెళ్లే భిక్షకుని జోలెలో బంగారం వేయగా, అతను కోపించి సంతానం కలుగకుండుగాక అని శపించాడు. దాంతో ఆ దంపతులు అతణ్ని ప్రార్థిస్తే అల్పాయుష్కుడైన ఒక కుమారుడు కలుగుతాడని, అయితే అతనిని పెళ్లాడే అమ్మాయి తల్లి ‘మంగళ గౌరీ వ్రతం’ చేసి కుమార్తెకు వాయనమిస్తే ఆ ప్రభావంవల్ల ఈ కుమారుడు మరణించడని అంటే ఆమెకు వైధవ్యం ప్రాప్తించదని భిక్షువు సూచించాడు.

అనంతరం వారు సంతానవంతులై కుమారునికి పదహారేళ్ల వయసురాగానే కాశీకి వెళ్లే వీరికి మార్గ మధ్యంలో దైవలీల ఫలితంగా మంగళగౌరీ వ్రతాన్ని చేసిన తల్లి గల ‘సుశీల’ అనే కన్యతారస పడుతుంది. సుశీల తల్లిదండ్రులను ఒప్పించి సుశీలతో తమ కుమారుని వివాహం జరిపిస్తారు. ఆమె సాహచర్యంతో భర్తకు పదహారేండ్ల అకాల మరణం ఉన్నా ‘మంగళగౌరీ’ వ్రతవాయినం తీసుకున్న కారణంగా భర్త పూర్ణాష్కుడవు తాడు. కాబట్టిన శ్రావణ మంగళ గౌరీ వ్రతా చరణ వలన స్త్రీలకు వైధవ్యం రాదని, పుణ్య స్త్రీలుగానే ఉంటారని పురాణ ప్రతీతి.

మంగళ గౌరీని ఉత్తరేణి దళాలతోనూ, గరికతోనూ అర్చించడం తప్పనిసరి. మహానివేదనలో పూర్ణపు కుడుములు, పులగం, బియ్యంతో చేసిన పరమానాన్ని నివేదించాలి. వ్రతం నాటి సాయంత్రం ముత్తైదువలను పిలిచి నానబెట్టిన శనగలు వాయనంగా ఇచ్చి వారి ఆశీర్వచనాలు పొందాలి.

ఈ వ్రతంలో ప్రత్యేకంగా పేర్కొన దగింది తోరపూజ. పసుపు పూసిన దారాన్ని మూడు పొరలుగా తీసుకుని, దానికి తొమ్మిది ముళ్లు వేస్తారు. ఆ దారానికి మధ్యమధ్యలో దవనాన్ని కడ్తారు. ఈ తోరాలను గౌరీ దేవి ముందు పెట్టి పూజచేసి ఒక తోరాన్ని పూజచేసిన వారు కట్టుకుంటారు. రెండవ తోరాన్ని ముత్తైదువకు ఇస్తారు. మూడో తోరాన్ని గౌరీదేవికే సమర్పిస్తారు. ఈ విధంగా చేసే వ్రతాల ద్వారా సర్వ వాంచాఫలసిద్ధి కలుగుతుంది.

ఈ వ్రతంలో ఆకులు, వక్కలు ఐదేసిచొప్పున ఉంచి ఐదు జ్యోతులతో గౌరీదేవికి మంగళహారతి ఇస్తారు. తరువాత వాటిని సెనగలతో కలిపి తల్లికిగాని, బ్రాహ్మణ ముత్తైదువకు గాని వాయనంగా ఇస్తారు. ఇది చాలా మంచి శుభకరమైన వ్రతం.మంగళగౌరీ కటాక్షం వల్లే కుజుడు మంగళ వారానికి అధిపతి అయ్యడు. ఆడవారి ఐదోతనాన్ని రక్షించే ఈ మంగళ గౌరీ వ్రతాన్ని అయిదేళ్లు చేసి ఉద్యాపన చేస్తారు.

మధ్యలో ఏదైనా కారణాల వల్ల ఆటంకం ఏర్పడితే ఆ తదుపరి సంవత్సరం నుండి వ్రతాన్ని కొన సాగించాలి. చివరగా ఉద్యాపన చేసి వ్రతాన్ని ముగించాలి.

Monday, July 23, 2012

అందరికీ నాగపంచమి+గరుడపంచమి శుభాకాంక్షలు





గురుస్వరూపుడు సుబ్రహ్మణ్యుడు

(Guru swaroopudu Subrahmanyudu)



నాగులచవితి అనగానే మనకు దీపావళి పండుగ తర్వాత జరుపుకునే పండుగ గుర్తుకువస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ, తెలంగాణాలోని కొన్ని ప్రాంతాలలో శ్రావణమాసంలోని నాల్గవరోజును నాగులచవితిగా జరుపుకుంటారు. ఆ తర్వాత రోజును నాగపంచమిగా పాటిస్తారు.

దీపావళి తర్వాత నాగుల చవితిని ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా శ్రావణమాసంలో జరుపుకునే నాగుల చవితిని, నాగ పంచమిని జరుపుకుంటారు. ఈరోజు సుబ్రహ్మణ్యస్వామి దేవాలయానికి వెళ్ళి, పుట్టలో పాలు పోసి, స్వామిని ఆరాధిస్తారు.

కొందరు బంగారంతోకానీ, వెండితోకానీ, మట్టితోకానీ చేసిన నాగపడగలను దానం చేస్తారు. ఇలా చేయడం వల్ల సర్పదోషాలు పోతాయని భావిస్తారు. రైతులు ఈ నాగపంచమి, నాగుల చవితి రోజున భూమిని తవ్వడం, చదును చేయడం వంటి పనులు చేయరు.




సుబ్రహ్మణ్యస్వామి గురించిన ప్రత్యేక వ్యాసం...

గురుస్వరూపుడు సుబ్రహ్మణ్యుడు

పరమపురుషుడు – శివుడు (లేదా విష్ణువు), అవ్యక్త శక్తి – ఉమాదేవి (లేదా లక్ష్మి) వీరిరువురి సంయోగమైన సమన్యాయమూర్తి కుమారస్వామి. ఈయననే స్కందుడు, సుబ్రహ్మణ్యుడు, షణ్ముఖుడు మొదలైన పేర్లతో శాస్త్రాలు సన్నుతించాయి. కుమారస్వామిని అర్చించడం అంటే, పార్వతీ పరమేశ్వరులను (లక్ష్మీ నారాయణులను) ఆరాధించడమే. బ్రహ్మచేత నిర్మితమైన అగ్నిమయ దివ్య శరణం (రెల్లుతప్ప) లో శివతేజం షణ్ముఖాకృతి ధరించిందని గాథ. కుమారస్వామి యొక్క అగ్నిమయ శివశక్తి రూపాన్ని స్పష్టం చేసే గాథలో ఇది ఒకటి.

కాలకాలుడు శంకరుడు ‘కాలాగ్ని’ అని పిలువబడే ఈ అఖండ రుద్రమూర్తి యొక్క తేజస్సే ‘సంవర్సరాగ్ని’, ఈ సంవత్సరాన్ని ఆధారం చేసుకొనే కాలగణన సాగుతుంది. ఈ సంవత్సరాగ్నికి సంకేతమే – పన్నెండు చేతులు ఆరు ముఖాలు. ద్వాదశ హస్తాలూ పన్నెండు మాసాలకు, ఆరు ముఖాలూ ఆరు ఋతువులకూ సంకేతాలు.

ఇక స్వామి కూర్చున్న మయూరం ‘చిత్రాగ్ని’ అనబడే అగ్నితత్వమే వర్ణాలకు సంకేతమిది. అగ్ని, అమృతాల సమైక్యమూర్తి (అగ్నీ సోమాత్మకం) సుబ్రహ్మణ్యుడు. స్వామి చేతిలో ఉన్న శక్తి ఆయుధం, అమ్మవారు ఇచ్చినదే. ‘శివజ్ఞాన ప్రదాయిని’ అయిన శ్రీమాత ఇచ్చిన ఆ శక్తి బలం – జ్ఞానం. ‘అహంకారం స్కందం’ అని చెప్పబడ్డ ప్రకారం.... సృష్టిలోనూ, ప్రతి జీవులలోనూ ‘నేను’ అనే భావనే స్కంధుడు. మనస్సుతో కలిపి అయిదు జ్ఞానేంద్రియాలూ ఉన్న ‘అహంకారమే’ కుమారస్వామి. ఇచ్చ, జ్ఞాన, క్రియ – ఈ మూడు ఈ ఆరు ముఖాలతో సాగుతున్నాయి.

ఇచ్ఛా, జ్ఞాన, క్రియా రూప మహిశక్తిధరం భజే!

శివశక్తి జ్ఞానశక్తి స్వరూకమ్!! (శివపురాణం)

కవిత్వ సంగీతాది విద్యల్లో కూడా అగ్రగణ్యుడు స్కందుడు. సుబ్రహ్మణ్యుని కవిరూపంగా వర్ణించాయి పురాణాలు.

‘పుట్టన్ బుట్ట శరంబునన్ మొలవ... ‘అనే పద్యంలో స్వామిని కవిగా పేర్కొన్నాడు పోతన. మహామహిమాన్వితమైన షట్కోణం షణ్ముఖునికి ప్రతీక, అన్ని కోణాలనుండి సమగ్రంగా విషయ జ్ఞానం సాధించగలిగే నిశితమైన బహుముఖప్రజ్ఞే ‘షణ్ముఖీ ప్రతిభ.’ బ్రహ్మ విష్ణు, శివాత్మక పరబ్రహ్మ శక్తిగా సుబ్రహ్మణ్యుని ‘మురుక’ అన్నారు. ‘ము’ కారస్తు ముకుంద: స్యాత్ ‘రు’ కారో రుద్రవాచక:! ‘క కారో బ్రహ్మనాదీ ఛ మురుకో గుహవాచకం!! (స్కందపురాణం) రహస్యమైన బ్రహ్మజ్ఞానమే ‘గుహ’ రూపం. అదే గురురూపం.

గురుస్వరూపుడైన – శివశక్తుల సమన్వయమూర్తి సుబ్రహ్మణ్యుని ఆరాధించి సకల శుభాలను పొందవచ్చు. కుమార స్వామి జననం స్కందపురాణంలో కుమారస్వామి జననం గురించి ఇలా వివరించబడింది. శివుడు ధ్యాననిష్టలో వున్న సమయంలో ఆయన తపస్సును భంగపరచడానికి మన్మధుడు వచ్చాడు.

మన్మధుడు ఉపయోగించిన కామశరాలు శివునిపై పడగా కోపించిన శివుడు తన జ్ఞాననేత్రం తెరిచాడు. దాంతో మన్మదుడు భస్మమయ్యాడు. పరమేశ్వరుని జ్ఞాననేత్రం నుంచి కదలిన జ్ఞానాగ్ని మన్మదుని భస్మం చేసి, ఆకాశాన పయనిస్తుండగా దాన్ని వాయువు సంగ్రహించి తాళలేక, మోయలేక అగ్నిదేవునికిచ్చాడు. అగ్నిదేవుడు కూడా శివుని తేజాన్ని తనలో నిలుపుకోలేక గంగాజలంలో పడేశాడు. ఆ దివ్యతేజాన్ని గంగ కూడా తనలో నిలుపుకోలేక శరవణంలో పడేసింది. ఆ రెల్లుపొదలో కుమారస్వామి ఆవిర్భవించాడు. అందువల్ల కుమారస్వామి శరవణుడు, శరవనోద్భవుడు అని కూడా అంటారు.

మంగళకరమైన శివుని మూడవ కంటినుంచి ఉద్భవించిన జ్ఞానకిరణమే కుమారస్వామి జన్మకు కారణమైంది. రూప విశిష్టం..... కుమారస్వామికి ఆరు తలలు వుండడం చేత షణ్ముఖుడు అనే పేరు వచ్చింది. సుబ్రహ్మణ్యస్వామి జ్ఞానస్వరూపం. అందుచేతనే అజ్ఞాన స్వరూపులైన రాక్షసులను హతమార్చాడు. అ జ్ఞానానికి ఆరు తాళాలుంటాయి. అవే – కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం అనే అరిషడ్వర్గాలు. ఆ ఆరు దుర్గుణాలున్న అజ్ఞాన రాక్షసిని ఆరుతలలు ఉంటే తప్ప చంపలేరు.

దైవ సంపదయైన ఆరు తలలు కలిగి అసుర సంపదకు సంభవించిన అరిష్టద్వార్గాలనే ఆరు తలలను తుంచివేయాలి. ఇదే షణ్ముఖుని రూపవిశిష్టం. మార్గశిర మాసంలో శుద్ధ షష్టి రోజున వచ్చే ఈ సుబ్రహ్మణ్య షష్టి పర్వదినం. భక్తులందరికీ ఎంతో పవిత్రమైనది.

teluguone site nundi sekarinchinadi

Saturday, July 21, 2012

శివస్తోత్రం:::దేవకృతం:::Sivastotram:::Devakrtam





















1::నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే
రక్తపింగళనేత్రాయ జటామకుట ధారిణే

2::భూత భేతాళ జుష్టాయ మహాభోగపవీతినే
భీమాట్టహాసవక్ర్తాయ కపర్దిస్థాణవే నమః

3::పూషదంత వినాశాయ భాగానేత్రహనే నమః
భవిష్యద్వృష్ట చిహ్నాయ మహాభూతపతే నమః

4::భవిష్యత్త్రి పురాంతాయ తథాంధక వినాశినే
కైలాస వరవాసాయ కరికృత్తినివాసినే

5::వికరాళోర్ద్వ కేశాయ భైరవాయ నమోనమః
అగ్నిజ్వాలా కరాళాయ శశిమౌళి కృతేనమః

6::భవిష్యత్ కృత కాపాలివ్రతాయ పరమేష్టినే
తథా దారువన ధ్వంసకారిణే తిగ్ముశూలినే

7::కృతకంకణభోగీంద్ర నీలకంఠ త్రిశూలినే
ప్రచండ దండహస్తాయ బడబాగ్ని ముఖాయచ

8::వేదాంత వేద్యాయ నమో యజ్ఞమూర్తే నమోనమః
దక్షయజ్ఞవినాశాయ జగద్భయకరాయ చ

9::విశ్వేశ్వరాయ దేవాయ శివశ్శంభో భవాయ చ
కపర్దినే కరాళాయ మహాదేవాయ తే నమః

10::ఏవం దేవైస్తృత శ్శంభు రుగ్రధన్వా సనాతనః
ఉవాచ దేవదేవోయం యత్కరోమి తదుచ్యతే

(వరాహ పురాణే దైవకృత శివస్త్రోత్రం సంపూర్ణం)
ఫలం: శ్రీమంతం, సామంతం, శివసాక్షాత్కారాది


Sivastotram:::Devakrtam

1::namO devaadidevaaya trinetraaya mahaatmane
raktapingalanetraaya jataamakuta dhaarine

2::bhoota bhetaala jushtaaya mahaabhOgapaveetine
bheemaattahaasavakrtaaya kapardisthaanave nama:

3::pooshadanta vinaaSaaya bhaagaanetrahane nama:
bhavishyadvrshta chihnaaya mahaabhootapate nama:

4::bhavishyattri puraantaaya tathaandhaka vinaasine
kailaasa varavaasaaya karikrttinivaasine

5::vikaraalOrdva kesaaya bhairavaaya namOnama:
agnijvaalaa karaalaaya sasimauli krtenama:

6::bhavishyat kruta kaapaalivrataaya parameshtine
tathaa daaruvana dhvansakaarine tigmuSooline

7::krutakankanabhOgeendra neelakantha triSooline
prachanda dandahastaaya badabaagni mukhaayacha

8::vedaanta vedyaaya namO yajnamoorte namOnama:
dakshayajnavinaasaaya jagadbhayakaraayacha

9::visvesvaraaya devaaya SivassambhO bhavaayacha
kapardine karaalaaya mahaadevaaya te nama:

10::evam devaistruta ssanbhu rugradhanvaa sanaatana:
uvaacha devadevOyam yatkarOmi taduchyate

varaaha puraane daivakruta SivastrOtram sampoornam
phalam:: Sreemantam, saamantam, Sivasaakshaatkaaraadi

Thursday, July 19, 2012

సూర్యభగవానుడి సర్వరోగ నివారణా స్తోత్రం




















శ్రీ కృష్ణుని కుమారుడైన సాంబుడు తనకు వచ్చిన అనారోగ్యమును ఈ సూర్యస్తోత్రమును పఠించి పోగొట్టుకోగలిగాడట. 

ఇది అతి శక్తివంతమైన స్తోత్రము. 

1}ఉద్యన్నద్య వివస్వాన్ ఆరోహన్నుత్తరాం దివందేవః 
హృద్రోగం మమ సూర్యో హరిమాణం చాశునాశయతు 

ఇప్పుడే ఉదయించి ఉత్తరదిక్కుగా పయనిస్తూన్న సూర్యదేవుడు నా గుండెజబ్బును, కంటిజబ్బును, 
(పచ్చకామెర్లు) త్వరగా పోగొట్టుగాక.

2}నిమిషార్టే నైకేన త్వేచశ తేద్వేసహస్రేద్వే 
క్రమమాణ యోజనానాం నమోస్తుతే నళిననాధాయ 

అరనిముషంలో ఆకాశముపైరెండువేలరెండువందల రెండు యోజనాలు పయనించే పద్మబాంధవా "నీకు నమోవాకం"

3}కర్మజ్ఞానఖదశకం మనశ్చజీవ ఇతి విశ్వసర్గాయ 
ద్వాదశధాయోవిచరతి సద్వాదశమూర్తి రస్తు మోదాయ

కర్మేంద్రియాలు ఐదు, జ్ఞానేద్రియాలు ఐదు, మనస్సు, జీవుడు, కూడా తానే అయి సకల సృష్టినీ కల్పించే 
ఆ ద్వాదశ మూర్తి నాకు ఆనందాన్ని, తృప్తిని కలిగించుగాక.

4}త్వం యజుఋక్ సామత్వం త్వమాగమస్త్వం వషట్కారః
త్వం విశ్వం త్వం హంసః త్వం భానో పరమహంసశ్చ 

సూర్యదేవా! మూడువేదాలు, వషట్కారము, ప్రపంచము, హంస, పరమహంస నీవే

5}శివరూపాత్ జ్ఞానమహంత్వత్తో ముక్తిం జనార్దనాకారాత్ 
శిఖిరూపాదైశ్వర్యం భవతశ్చారోగ్యమిచ్చామి 

శివరూపుడవైన నీవల్ల ఆత్మజ్ఞానమును, విష్ణురూపుడవైన నీవల్ల మోక్షమును, అగ్ని రూపుడవైన 
నీవల్ల ఐశ్వర్యమును, నీవల్ల ఆరోగ్యమును కోరుచున్నాను. అనుగ్రహించు.

6}త్వచిరోషా దృశిదోషా హృదిదోషా యే~ఖిలేంద్రి యజదోషాః 
తాన్ పూషా హతదోషః కించిద్రోషాగ్నినాదహదు.

చర్మదోషాలను, కంటిదోషాలను, హృదయదోషాలను, ఇంద్రియాల దోషాలను, 
సూర్యదేవుడు ఒకవిధమైన కోపరూపమైన అగ్నితో దగ్ధం చేయుగాక.



7}తిమిరమివ నేత్రతిమిరం పటలమివాశేషరోగపటలం నహః 
కాచమివాధినికోశం కాలపితారోగశూన్యతాం కురుతాత్ 

చీకటిని పోగొట్టినట్టు కంటిరోగాలను రేచీకటి జబ్బును రోగపటలమును,గాజును పగులగొట్టినట్టు 
రోగాలమూలమును కాలకర్త అయిన సూర్యభగవానుడు పోగొట్టుగాక.

8}యశ్యచ సహస్రాంశోరభిషులేశో హిమాంశు బింబగతః 
భాసయతి నక్తమఖిలం కీలయతు విపద్గణానరుణః 

వేయికిరణాలు గల ఆ సూర్యుని ఒక కిరణభాగము చంద్రబింబము నందుండి రాత్రివేళ చీకటినంతనూ
మటుమాయంచేసి వెలుగు కలిగిస్తుంది.అలాంటి సూర్యుడు నా ఆపదలను బాపుగాక.

9}యేనవినాంధం తమసం జగదేతత్, యత్రసతి చరాచరం విశ్వం 
దృతబోధం, తం నళినీ భర్తారం హర్తారమా పదామీళే.  

ఏ దేవుని దర్శనం లేకపోతే జగమంతా కటికచీకటిమయం , ఏ సూర్యుని వెలుగుచే తెలివిగలదీ అవుతుందో ఏ భాస్కరుడు ఆపదల రూపుమాపుతాడో ఆ పద్మభాందవుణ్ణి ప్రార్ధిస్తాను. 

10}వాతాశ్మరీ గదార్శః త్వగ్దోష మహోదర ప్రమేహాంశ్చ
గ్రహణీ భగంధరాఖ్యా మహారుజోపిత్వమేవహంసి. 

వాతరోగం, చర్మరోగం, మహోదరం, అతిమేహం, గ్రహణి, భగంధరం అనే మహారోగాలను సూర్యదేవా
నీవే పోగొట్టే దివ్యవైద్యుడవు. 

11}ధర్మార్ధ కామ మోక్ష ప్రతిరోధిన ఉగ్రతాపవేగకరాన్  
బందీకృతేంద్రియ గణాన్ గదాన్ విఖండ యతుచండాంశుః.

ధర్మార్ధ కామమోక్షములను సాధించే కర్మలను చెయ్యనియ్యక మిక్కిలి తాపం కలిగించి ఇంద్రియాలను 
బంధించే రోగాలను చండకరుడైన సూర్యుడు చెండాడుగాక.మా ఎడల కరుణ జూపించుగాక.

12}త్వం మాతాత్వం శరణత్వం దాతాత్వం ధనః త్వమాచార్యః 
త్వం త్రాతా త్వం హర్తావిపదాం ; అర్క ! ప్రసీద మమ.

సూర్యదేవా! నీవే నాతల్లివి, నీవేదిక్కు, నాకు కావలసింది ఇచ్చే దాతవు నీవే.
నీవే ధనం,మంచి చెడ్డలను బోధించే గురువు నీవే. 
రక్షకుడవు,ఆపదలను పోగొట్టే వాడవు నీవే,నన్ను అనుగ్రహించు. 

ఫలశ్రుతి::

ఇత్యార్యా ద్వాదశకం సాంబస్య పురోనభా స్థలాత్పతితం  
పఠతాం భాగ్యసమృద్ధిః సమస్త రోగక్షయ స్స్యాత్ 

ఇలాగ పన్నెండు ఆర్యావృత్తములు ఆకాశం నుంచి సాంబుని ముందు పడినవి. 
వీటిని శ్రద్ధాభక్తులతో చదివేవారికి భాగ్యాభివృద్ధి కలుగుతుంది.అన్ని జబ్బులూ అంతరిస్తాయి.

విశేష నవగ్రహ స్తుతి






















ద్విభుజం పద్మహస్తంచ వరదం మకుటాన్వితం 
ధ్యాయేత్ దివాకరం దేవం సర్వాభీష్టప్రదాయకం

చంద్రం చతుర్భుజం దేవం కేయూరమకుటోజ్వలం  
ధ్యాయేత్ అమృత సంభూతం శంకరస్య చ భూషనమ్  

నమామి అన్గారకం దేవం సర్వ శత్రు వినాశనం 
సర్వ రోగహరంచైవ సర్వ సౌభాగ్య వర్ధనం 

బుధం జ్ఞానమయం సర్వం విశేష వినయాన్వితం
సోమపుత్రం మహాసౌమ్యం ధ్యాయేత్ సర్వార్ధ సిద్ధదమ్

అభీష్టవరదం దేవం సర్వజ్ఞ సురపూజితం 
సర్వకార్యార్ధ సిద్ధ్యర్ధం ప్రణమామి గురుం సదా 

శుక్రం చతుర్భుజం దేవం అక్షమాలాధరం విభుం 
శుక్లాంబరం శుక్లమాల్యం ధ్యాయేత్ తత్త్వదర్శినం

శనైశ్చరాయ శాంతాయ సర్వాభీష్ట ప్రదాయినే 
శరణ్యాయ వరేణ్యాయ సర్వేశాయ నమో నమః  

ప్రణమామి సదా రాహుం సర్పాకారం కిరీటినమ్ 
నీలసింహాసనం దేవం భక్తానాం అభయప్రదమ్ 

కేతుం కారాళవదనం సర్వలోక భయంకరం  
ప్రణమామి సదాదేవం చిత్ర గంధాను లేపనం 

ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ  
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః 

Monday, July 16, 2012

శ్రీ సరస్వతీ స్తోత్రం--Sri Saraswati Stotram

























శ్రీ సరస్వతీ స్తోత్రం

సరస్వతీ నమ స్తుభ్యం సర్వదేవీ నమో నమః
శాంతరూపే శశిదరే సర్వయోగే నమో నమః

నిత్యానందే నిరాదారే నిష్కళాయే నమో నమః
విద్యాధరే విశాలక్షీ శుధ్దజ్ఞానే నమో నమః
శుద్ద స్పటిక రూపాయై సూక్ష్మరూపే నమో నమః
శబ్ద బ్రహ్మ చతుర్హస్తే సర్వసిద్దై నమో నమః

ముక్తాలంకృత సర్వాంగై మూలాదారే నమో నమః
మూలమంత్ర స్వరూపాయై మూలశక్యై నమో నమః
మనోన్మని మహాయోగే వాగీశ్వరీ నమో నమః
వాగ్మ్యైవరద హస్తాయై వరదాయై నమో నమః

యా కుందేందు తుషార హార ధవళా యా శుభ్ర వస్త్రాన్వితా
యా వీణా వరదండ మండిత కరా యా శ్వేత పద్మాసనా
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభి ర్దేవ్యై స్సదా పూజితా
సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహా

దోర్భి ర్యుక్తా చతుర్భిః స్పటిక మణి నిభై రక్ష్మాలా స్తదానా
హస్తే నైకేన పద్మం సిత మపి చ శుకం పుస్తకం చాపరేణ
భాసా కుందేందు శంఖస్ఫటిక మణి నిభా భాసమానా సమానా
సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా

సురాసురైస్సేవిత పాదపంకజా కరే విరాజత్కమనీయ పుస్తకా
విరించి పత్నీ కమలాసన స్థితా సరస్వతీ నృత్యుతు వాచిమే సదా
సరస్వతీ సరసిజ కేసర తపస్విని సిత కమలాసినీ ప్రియా
ఘనస్తనీ కమల విలోల లోచనా మనస్వినీ భవతు వరప్రసాదినీ

వేదాయై వేదరూపాయై వేదాంతాయై నమో నమః
గుణదోష వివర్జిన్యై గుణదీప్యై నమో నమః
సర్వజ్ఞానే సదానందే సర్వరూపే నమో నమః
సంపన్నయై కుమార్యై చ సర్వజ్ఞేతే నమో నమః

యోగానార్య ఉమాదైవ్యై యోగానందే నమో నమః
దివ్యజ్ఞాన త్రినేత్రాయై దివ్యమూర్త్యై నమో నమః

అర్ధచంద్ర జటాధారి చంద్ర బింబే నమో నమః
చంద్రా దిత్య జటాధారి చంద్ర బింబే నమో నమః

అణురూపే మహారూపే విశ్వరూపే నమో నమః
అణీమాద్యష్ట సిద్దాయై ఆనందాయై నమో నమః

జ్ఞాన విజ్ఞాన రూపాయై జ్ఞాన మూర్తే నమో నమః
నా శాస్త్ర స్వరూపాయై నా రూపే నమో నమః

పద్మదా పద్మవంశా చ పద్మ రూపే నమో నమః
పరమేష్ట్యై పరామూర్త్యై నమస్తే పాపనాశిని

మహాదేవ్యై మహాకాళ్యై మహాలక్ష్మ్యై నమో నమః
బ్రహ్మ విష్ణు శివాయై చ బ్రహ్మణార్యై నమో నమః
కమలాకర పుష్పా చ కామరూపే నమో నమః
కపాలి కర్మ దీప్తాయై కర్మదాయై నమో నమః

ఫలశ్రుతి::
సాయం ప్రాతః పఠేన్నిత్యం షాణ్మాసాత్సిద్ది రుచ్యతే
చోర వ్యాఘ్ర భయం పఠ్యతాం శృణ్వతా మపి

ఇట్థం సరస్వతీ స్తోత్ర మగస్త్యముని వాచకం
సర్వసిద్ది కరం నృణాం సర్వపాప ప్రణాశనం

(ఇతి శ్రీ అగస్త్య మునిప్రోక్త సరస్వతీ స్తోత్రమ్ సమాప్తం)




Sree sarasvatee stOtraM

sarasvatee nama stubhyaM sarvadaevee namO nama@h
SaaMtaroopae SaSidarae sarvayOgae namO nama@h

nityaanaMdae niraadaarae nishkaLaayae namO nama@h
vidyaadharae viSaalakshee Sudhdaj~naanae namO nama@h
Sudda spaTika roopaayai sookshmaroopae namO nama@h
Sabda brahma chaturhastae sarvasiddai namO nama@h

muktaalaMkRta sarvaaMgai moolaadaarae namO nama@h
moolamaMtra svaroopaayai moolaSakyai namO nama@h
manOnmani mahaayOgae vaageeSvaree namO nama@h
vaagmyaivarada hastaayai varadaayai namO nama@h

yaa kuMdaeMdu tushaara haara dhavaLaa yaa Subhra vastraanvitaa
yaa veeNaa varadaMDa maMDita karaa yaa Svaeta padmaasanaa
yaa brahmaachyuta SaMkara prabhRtibhi rdaevyai ssadaa poojitaa
saa maaM paatu sarasvatee bhagavatee niSSaesha jaaDyaapahaa

dOrbhi ryuktaa chaturbhi@h spaTika maNi nibhai rakshmaalaa stadaanaa
hastae naikaena padmaM sita mapi cha SukaM pustakaM chaaparaeNa
bhaasaa kuMdaeMdu SaMkhasphaTika maNi nibhaa bhaasamaanaa samaanaa
saa mae vaagdaevataeyaM nivasatu vadanae sarvadaa suprasannaa

suraasuraissaevita paadapaMkajaa karae viraajatkamaneeya pustakaa
viriMchi patnee kamalaasana sthitaa sarasvatee nRtyutu vaachimae sadaa
sarasvatee sarasija kaesara tapasvini sita kamalaasinee priyaa
ghanastanee kamala vilOla lOchanaa manasvinee bhavatu varaprasaadinee

vaedaayai vaedaroopaayai vaedaaMtaayai namO nama@h
guNadOsha vivarjinyai guNadeepyai namO nama@h
sarvaj~naanae sadaanaMdae sarvaroopae namO nama@h
saMpannayai kumaaryai cha sarvaj~naetae namO nama@h

yOgaanaarya umaadaivyai yOgaanaMdae namO nama@h
divyaj~naana trinaetraayai divyamoortyai namO nama@h

ardhachaMdra jaTaadhaari chaMdra biMbae namO nama@h
chaMdraa ditya jaTaadhaari chaMdra biMbae namO nama@h

aNuroopae mahaaroopae viSvaroopae namO nama@h
aNeemaadyashTa siddaayai aanaMdaayai namO nama@h

j~naana vij~naana roopaayai j~naana moortae namO nama@h
naa Saastra svaroopaayai naa roopae namO nama@h

padmadaa padmavaMSaa cha padma roopae namO nama@h
paramaeshTyai paraamoortyai namastae paapanaaSini

mahaadaevyai mahaakaaLyai mahaalakshmyai namO nama@h
brahma vishNu Sivaayai cha brahmaNaaryai namO nama@h
kamalaakara pushpaa cha kaamaroopae namO nama@h
kapaali karma deeptaayai karmadaayai namO nama@h

phalaSruti::>>
saayaM praata@h paThaennityaM shaaNmaasaatsiddi ruchyatae
chOra vyaaghra bhayaM paThyataaM SRNvataa mapi

iTthaM sarasvatee stOtra magastyamuni vaachakaM
sarvasiddi karaM nRNaaM sarvapaapa praNaaSanaM

(iti Sree agastya muniprOkta sarasvatee stOtram^ samaaptaM)

Saturday, July 14, 2012

నవగ్రహ మంత్రం





 












 శ్రీగణేశాయ నమః

అథ సూర్యస్య మంత్రం
ఓమ్ హ్సౌః శ్రీం ఆం గ్రహాధిరాజాయ ఆదిత్యాయ స్వాహా

అథ చన్ద్రస్య మంత్రం
ఓమ్ శ్రీం క్రీం హ్రాం చం చన్ద్రాయ నమః

అథ భౌమస్య మంత్రం
ఐం హ్సౌః శ్రీం ద్రాం కం గ్రహాధిపతయే భౌమాయ స్వాహా

అథ బుధస్య మంత్రం
ఓమ్ హ్రాం క్రీం టం గ్రహనాథాయ బుధాయ స్వాహా

అథ జీవస్య మంత్రం
ఓమ్ హ్రీం శ్రీం ఖ్రీం ఐం గ్లౌం గ్రహాధిపతయే బృహస్పతయే బ్రీంఠః ఐంఠః శ్రీంఠః స్వాహా

అథ శుక్రస్య మంత్రం
ఓమ్ ఐం జం గం గ్రహేశ్వరాయ శుక్రాయ నమః

అథ శనైశ్చరస్య మంత్రం

ఓమ్ హ్రీం శ్రీం గ్రహచక్రవర్తినే శనైశ్చరాయ క్లీం ఐంసః స్వాహా

అథ రాహోర్మన్త్రః 
ఓమ్ క్రీం క్రీం హూఁ హూఁ టం టఙ్కధారిణే రాహవే రం హ్రీం శ్రీం భైం స్వాహా

అథ కేతు మంత్రం
ఓమ్ హ్రీం క్రూం క్రూరరూపిణే కేతవే ఐం సౌః స్వాహా

|| ఇతి నవగ్రహమంత్రం సంపూర్ణం|| 

Friday, July 13, 2012

నవగ్రహధ్యానమ్


























 శ్రీగణేశాయ నమః

అథ సూర్యస్య ధ్యానం

ప్రత్యక్షదేవం విశదం సహస్రమరీచిభిః శోభితభూమిదేశమ్
సప్తాశ్వగం సద్ధ్వజహస్తమాద్యం దేవం భజేऽహం మిహిరం హృదబ్‍జే

అథ చన్ద్రస్య ధ్యానం
శఙ్ఖప్రభమేణప్రియం శశాఙ్కమీశానమౌలిస్థితమీడ్యవృత్తమ్
తమీపతిం నీరజయుగ్మహస్తం ధ్యాయే హృదబ్‍జే శశినం గ్రహేశమ్

అథ కుజ ధ్యానం
ప్రతప్తగాఙ్గేయనిభం గ్రహేశం సింహాసనస్థం కమలాసిహస్తమ్
సురాసురైః పూజితపాదపద్మం భౌమం దయాలుం హృదయే స్మరామి

అథ బుధ ధ్యానం
సోమాత్మజం హంసగతం ద్విబాహుం శఙ్ఖేన్దురూపం హ్యసిపాశహస్తమ్
దయానిధిం భూషణభూషితాఙ్గం బుధం స్మరే మానసపఙ్కజేऽహమ్

అథ గురు ధ్యానం
తేజోమయం శక్తిత్రిశూలహస్తం సురేన్ద్రజ్యేష్ఠైః స్తుతపాదపద్మమ్
మేధానిధిం హస్తిగతం ద్విబాహుం గురుం స్మరే మానసపఙ్కజేऽహమ్

అథ శుక్రస్య ధ్యానం
సన్తప్తకాఞ్‍చననిభం ద్విభుజం దయాలుం
పీతామ్బరం ధృతసరోరుహద్వన్ద్వశూలమ్
క్రౌం‍చాసనం హ్యసురసేవితపాదపద్మం
శుక్రం స్మరే ద్వినయనం హృది పఙ్కజేऽహమ్

అథ శనేర్ధ్యానం
నీలాం‍జనాభం మిహిరేష్టపుత్రం గ్రహేశ్వరం పాశభుజఙ్గపాణిమ్
సురాసురాణాం భయదం ద్విబాహుం శనిం స్మరే మానసపఙ్కజేऽహమ్

అథ సైంహికేయస్య ధ్యానం
శీతాంశుమిత్రాన్తకమీడ్యరూపం ఘోరం చ వైడుర్యనిభం విబాహుమ్
త్రైలోక్యరక్షాప్రదంమిష్టదం చ రాహుం గ్రహేన్ద్రం హృదయే స్మరామి

అథ కేతోశ్చ ధ్యానం
లాఙ్గులయుక్తం భయదం జనానాం కృష్ణామ్బుభృత్సన్నిభమేకవీరమ్
కృష్ణామ్బరం శక్తిత్రిశూలహస్తం కేతుం భజే మానసపఙ్కజేऽహమ్


|| ఇతి నవగ్రహధ్యానం సమ్పూర్ణమ్ ||

Navagraha Dhyaanam


Sree gaNaeSaaya nama@h


Dhyana sloka for Sun
pratyaksha devaM viSadaM sahasramareechibhi@h SObhitabhoomidaeSam
saptaaSvagaM saddhvajahastamaadyaM devaM bhaje@2haM mihiraM hRdbaje

 (Dhyana Sloka for Moon)
Sa~mkhaprabhamaeNapriyaM SaSaa~mkameeSaanamaulisthitameeDyavRttam
tameepatiM neerajayugmahastaM dhyaayae hRdabjae SaSinaM grahaeSam

(Dhyana sloka for Mars)
prataptagaa~mgaeyanibhaM grahaeSaM siMhaasanasthaM kamalaasihastam
suraasurai@h poojitapaadapadmaM bhaumaM dayaaluM hRdayae smaraami

(Dhyana sloka for Mercury)
sOmaatmajaM haMsagataM dvibaahuM Sa~mkhaenduroopaM hyasipaaSahastam
dayaanidhiM bhooshaNabhooshitaa~mgaM budhaM smarae maanasapa~mkajae@2ham

 (Dhyana sloka for Jupiter)
taejOmayaM SaktitriSoolahastaM suraendrajyaeshThai@h stutapaadapadmam
maedhaanidhiM hastigataM dvibaahuM guruM smarae maanasapa~mkajae@2ham

 (Dhyana Sloka for Venus)
santaptakaa~nchananibhaM dvibhujaM dayaaluM
peetaambaraM dhRtasarOruhadvandvaSoolam
krauM‍chaasanaM hyasurasaevitapaadapadmaM
SukraM smarae dvinayanaM hRdi pa~mkajae@2ham

(Dhyana sloka for Saturn)
neelaaM‍janaabhaM mihiraeshTaputraM grahaeSvaraM paaSabhuja~mgapaaNim
suraasuraaNaaM bhayadaM dvibaahuM SaniM smarae maanasapa~mkajae@2ham

(Dhyana Sloka for Rahu)
SeetaaMSumitraantakameeDyaroopaM ghOraM cha vaiDuryanibhaM vibaahum
trailOkyarakshaapradaMmishTadaM cha raahuM grahaendraM hRdayae smaraami

Dhyana Sloka for Ketu
laa~mgulayuktaM bhayadaM janaanaaM kRshNaambubhRtsannibhamaekaveeram
kRshNaambaraM SaktitriSoolahastaM kaetuM bhajae maanasapa~mkajae@2ham
|| Iti NavagrahadhyaanaM SampoorNam ||

వ్యాస కృత నవగ్రహ స్తోత్రం





 
















 1} సూర్య మంత్రం :
జపాకుసుమసంకాశం కాశ్యపేయం మహద్యుతిమ్‌
తమోऽరిం సర్వపాపఘ్నం ప్రణతోऽస్మి దివాకరమ్‌

2} చంద్రమంత్రం:
దధిశఙ్ఖతుషారాభం క్శీరోదార్ణవసంభవమ్‌
నమామి శశినం సోమం శమ్భోర్ముకుటభూషణమ్‌

3} కుజమంత్రం:
ధరణీగర్భసంభూతం విద్యుత్కాన్తిసమప్రభమ్‌
కుమారం శక్తిహస్తం చ మఙ్గలం ప్రణమామ్యహమ్‌

4} బుధమంత్రం:
ప్రియఙ్‌గుకలికాశ్యామం రూపేణాప్రతిమం బుధమ్‌
సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్‌

5} గురుమంత్రం:
దేవానాం చ ఋషీణాం చ గురుం కాఞ్చనసంనిభమ్‌
బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిమ్‌

6} శుక్రమంత్రం:
హిమకున్దమృణాలాభం దైత్యానాం పరమం గురుమ్‌
సర్వశాస్త్రప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్‌

7} శనిమంత్రం:
నీలాంజనసమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్‌
ఛాయామార్తణ్డసంభూతం తం నమామి శనైశ్చరమ్‌

8} రాహుమంత్రం:
అర్ధకాయం మహావీర్యం చన్ద్రాదిత్యవిమర్దనమ్‌
సింహికాగర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్‌

9} కేతుమంత్రం:
పలాశపుష్పసంకాశం తారకాగ్రహమస్తకమ్‌
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్‌

ఫలశృతి:
ఇతి వ్యాసముఖోద్గీతం యః పఠేత్సుసమాహితః
దివా వా యది వా రాత్రౌ విఘ్‍నశాన్తిర్భవిష్యతి

నరనారీనృపాణాం చ భవేద్దుఃస్వప్ననాశనమ్‌
ఐశ్వర్యమతులం తేషామారోగ్యం పుష్టివర్ధనమ్‌

గృహనక్శత్రజాః పీడాస్తస్కరాగ్నిసముద్‌భవాః
తాః సర్వాః ప్రశమం యాన్తి వ్యాసో బ్రూతే న సంశయః



Vyasa Krita Navagraha Stotra

1} Surya Mantra:
Japaakusuma-saknkaasham kaashyapeyam mahaadyutim
Tamorim sarva-paapaghnam pranato~smi Divaakaram

I bow down to the sun who is red like the color of the hibiscus; who is the son of Kashapa Rhishi; who is very bright and radiant; who is the destroyer of darkness; who is the destroyer of all sins

2} Chandra Mantra:
Dadhi-shaknkhatushaaraabham kshiirodaarnava-sambhavam
Namaami shashinam Somam Shambhor-mukuta-bhuushanam

I bow down to the moon who is white and lustrous like curd, the conch and droplets of water; who arose from the churning of the ocean called kshira-sagar; who gives beauty to Lord Shivas crown.

3} Kuja Mantra:
Dharanii-garbha-sambhuutam vidyut-kaanti-samaprabham
Kumaaram shakti-hastam tam makngalam pranamaamyaham

I bow down to Mars who was born from the earth; who is as bright as lightening; who is a divine youth with great power in his hands.

4} Budha Mantra
Priyakngu-kalikaa-shyaamam ruupenaa-pratimam Budham
Saumyam saumya-gunopetam tam Budham pranamaamyaham

I bow down to Budha (Mercury) who is the color of wheat and the bud of the Priyangu plant; who is very beautiful; who is calm and quiet in nature.

5} Guru Mantra:
Devaanaayn cha rhushiinaayn cha Gurum kaaynchana-sannibham
Buddhibhuutam trilokesham tam namaami Bruhaspatim

I bow down to Guru (Jupiter) who is the master of all the Gods and Rhishis; who shines like gold; who embodies immense wisdom; who has control over earth, heaven and hell.

6} Sukra Mantra:
Himakunda-mrunaalaabham daityaanaam paramayn gurum
Sarva-shaastra-pravaktaaram Bhaargavam pranamaamyaham

I bow down to Bhargav (Venus) who has the appearance of ice, the Jasmine flower and the stem of the lotus; who is the master of the demons; who has knowledge of all the sciences. 

7} Shani Mantra:
Niilaaynjana-samaabhaasam Raviputram Yamaagrajam
Chhaayaa-Maartanda-sambhuutam tam namaami Shanaishcharam

I bow down to Shani (Saturn) who is blue like the color of Nilanjan; who is the son of the sun; who is the elder brother of Yama (the God of death); who is the son of Chhaya and the sun

8} Rahu Mantra:
Ardha-kaayam mahaaviiryam Chandraaditya-vimardanam
Simhikaa-garbha-sambhuutam tam Raahum pranamaamyaham

I bow down to Rahu (north node) who has no body, only a head; who has great power; who can trouble even the moon and the sun; who is the son of the female demon Sinvikha

9} Ketu Mantra:
Palaasha-pushpa-saknkaasham taarakaagraha-mastakam
Raudram raudraatmakan(g) ghoram tan(g) Ketum pranamaamyaham 9

I bow down to Ketu (south node) who is red like the color of the Palasa tree (flame tree); who has the stars and planets as his head; who is frightening by nature; who is harsh in action and fierce in nature







Phala Sruti:

Iti Vyaasa-mukhod-giitam yah: pathet-susamaahitah:
Divaa vaa yadi vaa raatrau vighna-shantir-bhavishyati

This stotra is composed by Shri Vyaasa Rhishi. A person who chants this stotra during the day or at night will become free from all troubles.

Nara-naarii-nrupaanaayn cha bhaved-duh:svapna-naashanam
Aishvaryamatulam teshaam aarogyam pushti-vardanam

By chanting this stotra the effect of bad dreams of men, women, kings and so on will be destroyed. Everyone will have good health, wealth and energy.

Graha-nakshatrajaa piidaah: taskaraagni-samudbhavaah:
Taah: sarvaah: prashamam yaanti Vyaaso bruute na sanshayah:

A person who chants this stotra becomes free from the troubles created by planets, constellations, thieves, fire etc. Vyasa Rhishi says that there is no doubt about the result of chanting this stotra

Iti Shrii Vyaasa-virachitam Navagraha-stotram sampuurnam
Chant This Stotra daily to nullify negative effects of navagrahas.

Thursday, July 12, 2012

శ్రీ గాయత్రి విశిష్టత



శ్రీ గాయత్రి విశిష్టత
రాసిన వారు::యర్రమల్లి హేమరత్నం గారిచే
సిలికానాంధ్ర .కం నుండి ....

***********************************************

సర్వదేవతా తత్వాలకు ప్రత్యేకమైన, ముఖ్యమైన గాయత్రీ మంత్రాలు కొన్ని తెలుసుకుందాం. ధీమహి, విద్మహే, ప్రమోదయాత్ అనే పదాలు ప్రతి మంత్రంలో వాడబడ్డాయి.

1. గణేశ గాయత్రి - ఓం ఏక దంష్ట్రాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో బుద్ధిః ప్రచోదయాత్.

2. విష్ణు గాయత్రి - ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రమోదయాత్

3. శివ గాయత్రి - ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో శివ ప్రచోదయాత్

4. కృష్ణ గాయత్రి - ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో కృష్ణ ప్రచోదయాత్

5. సుబ్రహ్మణ్య గాయత్రి - ఓం తత్పురుషాయ విద్మహే మహాసేవాయ ధీమహి తన్నో షణ్ముఖః ప్రచోదయాత్

6. నృసింహ గాయత్రి - ఓం వజ్రనాభాయ విద్మహే తీక్ష దంష్ట్రాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్

7. రామ గాయత్రి - ఓం దాశరథాయ విద్మహే సీతా వల్లభాయ ధీమహి తన్నో రామ ప్రచోదయాత్

8. హనుమద్గాయత్రి - ఓం అంజనీసుతాయ విద్మహే, వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్

9. ఆదిత్య గాయత్రి - ఓం భాస్కరాయ విద్మహే, మహర్ద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్

10. రుద్ర గాయత్రి - ఓం పురుషస్య విద్మహే, మహాదేవస్య ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్

11. గురు గాయత్రి - ఓం పరబ్రహ్మణే విద్మహే, గురుదేవాయ ధీమహి తన్నో గురుః ప్రచోదయాత్

12. లక్ష్మి గాయత్రి - ఓం మహాలక్ష్మైచ విద్మహే విష్ణు పత్నైచ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్

13. దుర్గా గాయత్రి - ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్

14. సరస్వతీ మంత్రం - ఓం సరస్వతీ విద్మహే బ్రహ్మపుత్రైచ ధీమహి తన్నో సర్వః ప్రచోదయాత్

గాయత్రీ మంత్రం కేవలం పురుషులు మాత్రమే జపించాలని నియమం వేదంలోకానీ, శాస్త్రంలోకానీ ఎక్కడా లేదు. గాయత్రీ మంత్రానికి శబ్దపరంగానూ, మంత్రపరంగానూ ప్రత్యేక స్థానం ఉంది. చైతన్యవంతం చేస్తుంది. ఐహికంగా, పరమార్ధికంగా మనిషికి సవ్యమైన మార్గాన్ని నిర్దేశించి, అనుగ్రహించే మహామంత్రం, గాయత్రీ మంత్రం. కేవలం స్వలాభం కోసం కాకుండా, మన తోటి వారి కోసం, ప్రజాక్షేమం కోసం, దేశ క్షేమం కోసం, ప్రపంచ శాంతి కోసం, మంత్రానుష్టానం చేస్తే ఆ తల్లి పరిపూర్ణ అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఆపై సర్వశ్య శాంతి, ఆత్మదర్శనం పొంది, జగజ్జనని చరణచ్చాయలో నిశ్చింతగా విశ్రమించగలం. ఇది నిశ్చయం.

సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ మానవత్వపు విలువలు, పరతత్వ అన్వేషణలో మనకు సహాయపడే దివ్యమైన, అద్భుతమైన పరికరాలు. మనలోని మనస్సే మనః శ్శాంతిని కానీ, సహయపడే దివ్యమైన, అద్భుతమైన పరికరాలు. మనలోని మనస్సే మనః శ్శాంతిని కానీ, మనోక్లేశాన్ని కానీ కలిగించే వస్తువు. ఆ మనస్సును నియంత్రించి, జగజ్జనని దివ్య నామస్మరణతో మనోలయం చేయాలి. సకల ధర్మ సర్వస్వమై, సకల లోకాలను పాలించే మహత్తత్వం, పరదేవత తత్వం. నిరర్ధకమైన బాహ్యసుఖాన్వేషణకై అలసట పడక, పరతత్వాన్వేషణకై పరితపించాలి. సాధించాలి. చివరిగా చిన్న విన్నపం. అందరం ఆ తల్లిని

“ఓం గుహ్యతి గుహ్య చోస్త్రీత్వం గృహాణాస్మత్కృతం జపం
సిద్ధిర్భవతుమే దేవి త్వత్ర్పసాదాత్ మహేశ్వరి” అని వేడుకుందాం.

ఓ దేవీ! అంతర్యామివై అందరిని కాపాడు. నా ప్రార్ధన స్వీకరించి, నీ దివ్య తేజస్సుచే మోక్షానుభూతిని కలుగజేయి.

నమో దేవి మహావిద్యే వేదమాతః పరాత్పరే
వ్యాహృతాది మహామంత్రరూపే ప్రణవరూపిణి
లోకస్సమస్తా సుఖినోభవంతు
మా ఇలవేల్పు శ్రీ శ్రుంగేరీ శారదాంబ
చరణ కమలాల చెంత భక్త్యర్పణ

ఓం తత్సవితురేణ్యాయ నమః
ఓం తత్పూర్వా జయాయ నమః
ఓం తత్ర్పాతరాదిత్యాయ నమః
ఓం తత్ప్రాతరాదిత్య ప్రతిష్టాయ నమః (దేవీ భాగవతం)


రోజు ఈ నాలుగు నామాలు మనసారా స్మరించి, ఆ తల్లిని తలుచుకంటే చాలు. సర్వాభీష్టాలు ప్రసాదిస్తుంది.

Monday, July 2, 2012

శ్రీ వ్యాసపూర్ణిమ ... శ్రీ గురు పూర్ణిమ


గురు పూర్ణిమ

మన (చాంద్రమాన) పంచాంగం లో ఆషాఢ మాసం (జులై-ఆగస్టు) లో వచ్చే పౌర్ణమిని "గురు పూర్ణిమ" లేదా "వ్యాస పూర్ణిమ" గా పరిగణిస్తారు. ఇది వేద వ్యాసుని జన్మ దినం (వ్యాస జయంతి). ఇతడు పరాశర మహర్షికి, సత్యవతికి కృష్ణ వర్ణం (నల్ల రంగు) తో ఒక ద్వీపంలో జన్మించాడు. కనుక "కృష్ణ ద్వైపాయనుడు" అని పిలవబడ్డాడు. అయితే, తన తండ్రియైన పరాశర మహర్షి సంకల్పించి ప్రోగు చేసిన వేద రాశులను నిత్య కర్మలలో, క్రతువులలో వాటివాటి ఉపయోగాన్ని బట్టి ఋగ్-యజుర్-సామ-అధర్వణ అను నాలుగు వేదములుగా విభజించి లేదా వేర్పరచినందువలన "వేద వ్యాసుడు" అను పేర సార్ధక నామధేయుడైనాడు. తదుపరి బ్రహ్మ అనుజ్ఞతో, సరస్వతీ కటాక్షంతో విఘ్నాధిపతియైన గణేశుడు వ్రాయగా చతుర్వేదములలోని సారం ప్రతిబింబించేవిధంగా ఘనతకెక్కిన మహాభారత ఇతిహాసకావ్యాన్ని రచింపజేసాడు. అందుకే భారతాన్ని "పంచమవేదం" అన్నారు. ఇవే కాక, వేద వ్యాసుడు మనకు అష్టాదశ (పద్ధెనిమిది) పురాణాలను, మరెన్నో పురాణేతిహాసాలను ప్రసాదించిన పూజ్యుడు, తొలి గురువు. విష్ణుతేజం తో జన్మించిన ఈ మహనీయుని సాక్షాత్తు శ్రీమహావిష్ణు అవతారంగా భావిస్తారు. అందుకే శ్రీ విష్ణుసహస్రనామం పీఠికలో "వ్యాసాయ విష్ణు రూపాయ - వ్యాస రూపాయ విష్ణవే" అని తలచుకుంటారు.

అటువంటి వేద వ్యాసుడు మనకు తొలి గురువు. "గురు" అన్న పదం లో గల రెండు అక్షరాలలో "గు" అనగా "తమస్సు" లేదా "చీకటి", "రు" అనగా "చీకటిని తొలగించే వాడు", వెరసి "గురువు" అనే వ్యక్తి మనలోని అజ్ఞానమనే చీకటిని పారద్రోలి జ్ఞానజ్యోతి తో వెలుగును నింపేవాడు అని వివరణ చెప్పవచ్చు. ఇదే "తమసోమా జ్యోతిర్గమయ", అంటే "తమస్సు లేదా చీకటి నుండి జ్యోతి లేదా వెలుగు లోనికి" అని. గురువు త్రిమూర్త్యవతారం కూడా. ఎందుకంటే బ్రహ్మవలె మనలో జ్ఞాన బీజం సృష్టించి, విష్ణువువలె దాన్ని స్థితిని కొనసాగించి, మహేశ్వరుని వలె మనలోని అజ్ఞానతిమిరాన్ని నశింపజేస్తాడు. అందుకే "గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణుః, గురుర్ దేవో మహేశ్వరః అన్నాం. అటువంటి గురువు సాక్షాత్తు పరబ్రహ్మ, అటువంటి గురువుకు నమస్కరించెదము గాక. దాన్నే "గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః" అని గురుశ్లోకం లో రెండవ పంక్తికి అర్ధం.

పుట్టిన ప్రతి బిడ్డకు తల్లే తొలి గురువు. తరువాత చెప్పుకోవాలంటే తండ్రి, తదుపరి అధ్యాపకుడు. అందువలనే "మాతృ దేవోభవ! పితృ దేవోభవ! ఆచార్య దేవోభవ! " అన్నారు. వేదాలలోను, జ్యోతిషశాస్త్రంలోను దేవతల గురువైన "బృహస్పతి" ని గురువుగా తలుస్తారు. అతనిని ఒక గ్రహం గా గణించి అతని పేర "బృహస్పతి వారం" లేదా "గురు వారం" ఏర్పరచుకున్నాం.

ప్రతి వ్యక్తికీ గురువు అవసరం ఉంది. శిష్యులు లేని గురువులుండొచ్చు. కాని గురువు లేని శిష్యులుండరు. పరిపూర్ణ అవతారుడై, జగద్గురువైన శ్రీకృష్ణుడు కూడ కుచేలుడు (సుధాముడు) సహాధ్యాయుడుగా సాందీపని మహర్షి వద్ద శిష్యుడై గురు శుశ్రూష చేశాడు. అంతేకాక కురుక్షేత్ర సంగ్రామారంభంలో పార్థుడు శ్రీకృష్ణుని ప్రార్ధించి "భగవత్-గీతోపదేశం" పొందాడు. అందుకే "కృష్ణం వందే జగద్గురుం" అంటాం.

మనకు అధ్యాపకులు, ఉపాధ్యాయులు, లేదా బోధకులు అంతా గురువులే అయినా వీరందరు "సద్గురువులు" లేదా నిజమైన గురువులు కాలేరు. "సద్గురువు" లకు ఒకే జేవిత పరమావధి మరియు లక్ష్యం వుంటుంది. అదేంటంటే, శిష్యుడుగా ఉపాసన పొందినవానికి "ఆత్మశోధన" ద్వారా, అంటే తనను తాను తెలుసుకొని, తద్వారా భగవంతుని తెలుసుకొనేలా చేయగల పవిత్రమూర్తి "సద్గురువు". ఈ సద్గురువు కూడ ఇదే పద్ధతిలో తనను, భగవంతుని తెలుసుకున్నవాడై ఉండాలి. జ్ఞాన సంపన్నుడైన సద్గురువు నామ స్మరణ వలన శిష్యులకు జీవన్ముక్తి మరియు మోక్షప్రాప్తి కలుగుతాయి. అందుచేత ఆశయ సాధనకు ప్రతివొక్కరూ సద్గురువును ఆశ్రయించాలి. ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన గురు ముఖతః విషయాలను గ్రహించి స్వీకరించాలి. మన భరతావనిలో ఎందరో సద్గురువులు మనకు జ్ఞానభిక్ష నొసగి ముముక్ష మార్గమును చూపిస్తున్నారు. అయితే సద్గురువులైన వారు చీనాంబరాలను, అధికారాలను, ఆడంబరాలను ఆశించరు. పాదపూజలు, కానుకలు కోరరు. వారు కోరేది కేవలం శ్రద్ధ, సహనము, నిర్మలమైన భక్తి మరియు అచంచల విశ్వాసము. గురువును దైవంగా కొలిచే ఈ అత్యంత ప్రశస్తమైన గురు పూర్ణిమ నాడు సద్భావనతో మనసును కేంద్రీకరించి మరోమారు వేదవ్యాసుని ఈ విధంగా తలచుకుందాం.

"వ్యాసం వశిష్ట నప్తారం శక్తేః పౌత్రం అకల్మషం, పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం"

అంటే, వశిష్టుని మునిమనుమడైన, కల్మషరహితుడైన శక్తికి మనుమడైన, పరాశరుని కుమారుడైన, శుకమహర్షి తండ్రియైన ఓ! వ్యాస మహర్షీ! నీకు వందనము. ఈ గురు పౌర్ణమి రోజున మీరు కూడా సద్గురువులను సేవించి వారి ఆశీస్సులను పొందుదురు గాక!

నేను రచిస్తున్న ఈ మహేతిహాసంలోని విషయమే ప్రపంచంలో ఉన్నది. ఇందులో లేనిది మరెక్కడా కొంచెమైనా లేదు'- ఈ మాటలు అనాలంటే ఆ కవికి ఎంతటి ఆత్మప్రత్యయం ఉండాలి? ఆ ఇతిహాసం ఎంత గొప్పదై ఉండాలి? ఆ విధంగా అని 'నిజమే!' అని నిరూపించుకొన్న కవివృషభుడు వేదవ్యాసుడు. ఆ ఇతిహాసం మహాభారతం. శ్రీమన్నారాయణుని 21 అవతారాల్లో పదిహేడో అవతారం వ్యాసుడని భాగవతం తెలియజెబుతోంది.

ఈ రోజున చాలామంది ప్రజలు రోజు పొడవునా ఉపవాసం ఉంటారు. సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి, చంద్రోదయం వేళకు ఉపవాసం ముగిస్తారు. చంద్రోదయాన్ని చూసిన తర్వాత లేదా సాయంత్రం పూజలు ముగిసిన తర్వాత ఉపవాసకులు ఆహారం స్వీకరిస్తారు.

దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తూంటారు. ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజను నిర్వహిస్తుంటారు.

వసిష్ఠమహామునికి మునిమనుమడు, శక్తి మహామునికి మనుమడు, పరాశరమునికి పుత్రుడు, శుకమర్షికి జనకుడైనట్టియు, నిర్మలుడైనట్టి, తపవు అనే ధనరాశి గలిగిన శ్రీ వ్యాసులవారికి నమస్కారము. ఆదిగురువు వేదవ్యాసులవారు. వ్యాసులవారు పుట్టినరోజునే గురుపూర్ణిమ, వ్యాసపూర్ణిమ, అంటారు
నారాయణమూర్తి స్వరూపమే వేదవ్యాసులవారు. అందుకే ఆయన్ని అపర నారాయణుడని పిలుస్తారు. వేదవిభజన చేసిన మహానుభావుడాయన. ఆయనవల్లనే మనకు అష్టాదశ పురాణాలు ఏర్పడ్డాయి. భారత భాగవతాలనందించినవారే వ్యాసులవారు.

వ్యాసుని తల్లిదండ్రులు సత్యవతి,పరాశరుడు. వేదాలను నాలుగుభాగాలుగా విభజించి పైలుడనే శిష్యుడికి ఋగ్వేదాన్ని, వైశంపాయనుడికి యజుర్వేదాన్ని, జైమిని అనే శిష్యుడికి సామవేదాన్ని, సుమంతుడనే శిష్యుడికి అధర్వణవేదాన్ని తెలిపి వ్యాప్తిచేయమని ఆదేశించాడు.

గురుపౌర్ణమినాడు వ్యాసులవారు రచించిన ఏ గ్రంథం చదివినా, చాలా మంచిది. గురుపీఠానికి ఆద్యులైన నారాయణుడిని , సదాశివుడిని, బ్రహ్మదేవుడిని, వసిష్ఠులవారిని, శక్తిమునిని, పరాశరుడిని, వ్యాసులవారిని, శుకమహామునిని, గౌడపాదులవారిని, గోవింద భగవత్పాదులను, శంకరాచార్యులవారిని ఈ రోజు పూజిస్తే విశేషఫలం లభిస్తుంది. అంతేకాదు తమ గురువులను కూడా ప్రతి ఒక్కరూ ఈ రోజున గౌరవించి పూజించాలి.
ఈ రోజునే చాతుర్మాస్యవ్రతాన్ని ఆరంభిస్తారు. ఆచార్యులవారిని అంటే గురుదేవుణ్ణి త్రిమూర్తి స్వరూపంగా ఆరాధించాలనేది ఋషివచనం. విజ్ఞానానికి మూలం విద్య. ఆ విజ్ఞానాన్ని నేర్పేవాడే గురువు. అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని అందించే గురువుని ఎప్పుడూ గౌరవించాలి.

ఒకప్పుడు గురుకులాలుండేవి.వాటిలో చేరిని విద్యార్థులకు తల్లీ తండ్రీ అన్నీ తామే అయ్యేవారు గురువులు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అంటారు. తల్లీ తండ్రీ తరువాత స్థానం గురువుదే.

"గురుబ్రహ్మ, గురుర్విష్ణుః, గురుర్దేవో మహేశ్వరఃగురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః"అంటారు. దైవోపచారం చేస్తే గురువైనా రక్షిస్తాడు. అదే గురువుకు కోపం వస్తే ముల్లోకాలలో ఎవరూ రక్షించలేరట. అందుకే సమస్త విద్యలను నేర్పే గురువుకు, జ్ఞనాన్ని అందించే గురువుకు సేవచేసి, గురుకృప పొంది మహనీయులైనవారు ఎందరో వున్నారు.
"గురువునూ, గోవిందుడిని పక్కనపెట్టి ముందు ఎవరికి నకస్కారం చేస్తావంటే, గురువుకే నమస్కరిస్తాను. కారణం గోవిందుడు వున్నాడని చెప్పింది గురువేకదా" అంటాడు భక్తకబీర్ దాస్. అదీ మన భరతీయసంస్కృతి ఆర్షధర్మం నేర్పిన గురువు యొక్క ప్రాముఖ్యం. కాబట్టి గురుపౌర్ణమినాడు ప్రతి ఒక్కరూ గురువుల్ని సేవించాలి.



గురు సందేశము :
వేదవ్యాసుడు తన రెండు చేతులనూ పైకి ఎత్తి లోకమంతటికీ నమస్కరిస్తూ చెప్పిన మాటల్లో విశిష్టమైనది ఏమిటంటే- 'ఇతరులు మీ పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తే మీరు బాధపడతారో మీరు ఇతరుల పట్ల ఆ విధంగా ప్రవర్తించవద్దు.' పరమ ధర్మపథాలన్నింటిలోకీ పరాయణమైన ఈ ఒకే ఒక్క విషయాన్ని త్రికరణశుద్ధిగా పాటించినట్లయితే మన సమాజం కచ్చితంగా శాంతిధామమవుతుంది

వ్యాసుని జన్మ వుత్తాంతము :
వేదవ్యాసుడు జన్మ వృత్తాంతం అష్టాదశ పురాణాలలొ పెక్కు మార్లు ఎన్నోమార్పులు చేసి చెప్పబడింది. ఈ దిగువ నున్న వృత్తాంతం మహాభారతము ఆది పర్వం తృతీయా ఆశ్వాసము నండి గ్రహించబడింది.

పూర్వకాలములో చేది రాజ్యాన్ని వసువు అనే మహారాజు పరిపాలన చేస్తుండేవాడు, ఒకరోజు వేటకు అడవికి వెళ్ళిన రాజు ఆ అడవి లో మునులు తపస్సు చేయడము చూసి తాను తపస్సు చేయడం ఆరంభించాడు. అప్పుడు ఇంద్రుడు అది గ్రహించి ఆ మహారాజు వద్దకు వెళ్ళి దైవత్వము ప్రసాదిస్తున్నాని చెప్పి ఒక విమానాన్ని ఇచ్చి, భూలోకములో రాజ్యం చేస్తూ, అప్పుడప్పుడు స్వర్గానికి రమ్మని చెబుతాడు. ఇంద్రుడు వేణుదుస్టి అనే అతి పరాక్రమ వంతమైన ఆయుధాన్ని కుడా ప్రసాదిస్తాడు. వసువు నివసిస్తున్న నగరానికి ప్రక్కగా శుక్తిమతి అనే నది ఉన్నది. శుక్తిమతి అనే నది ప్రక్కన ఉన్న కోలహలుడు అనే పర్వతము శుక్తిమతి మీద మోజుపడి ఆ నదిలో పడతాడు. అప్పుడు ఆ నది మార్గములో వెళ్తున్న వసువు తన ఆయుధంతో కోలహలుడిని ప్రక్కన పడెస్తాడు. శుక్తిమతికి మరియు కోలహలుడికి మధ్య జరిగిన సంపర్కము వలన గిరిక అనే కుమార్తె వసుపదుడు అనే కుమారుడు జన్మిస్తారు. శుక్తిమతి వారివురిని వసువు కి కానుక గా ఇస్తుంది. వసువు గిరికని వివాహం చేసుకొంటాడు. వసువు , వసుపదుడు ని సైన్యాధిపతిగా చేస్తాడు. ఒకరోజు వసువు వేటకు వెళ్తాడు అప్పుడు తన భార్య గిరిక గుర్తు రావడం తో రేతస్సు పడుతుంది. ఆ పడిన రేతస్సుని ఒక దొన్నెలో చేర్చి , ఆ దొన్నెని డేగకి ఇచ్చి తన భార్యకి ఇవ్వమంటాడు. ఆ డేగ ఆ దొన్నెను తీసుకొని పోవుతుండగా మరో డేగ చూసి అది ఏదో తినే పదార్థం అని ఆలోచించి, ఆ డేగతో పోట్లాడూతుంది అప్పుడూ ఆ రేతస్సు యమునా నదిలో పడుతుంది. ఆ యమునా నదిలో ఉన్న ఒక చేప ఆ రేతస్సు ని భక్షిస్తుంది ఆ భక్షించడం వల్ల అది అండంతో కూడి పిండం గా మారుతుంది. ఒకరోజు బెస్తవారు చేపలు పట్టు తుండగా ఈ చేప చిక్కుతుంది. ఆ చేపను బెస్తవారు వారి రాజైన దాశరాజు వద్దకు తీసుకొని పోతారు.

దాశరాజు ఆ చేపని చీల్చి చూడగా ఆ చేపలొ ఒక మగ శిశువు మరియు మరో ఆడ శిశువు ఉంటారు. బ్రహ్మ శాపం వల్ల ఒక అద్రిక అనే అప్సరస చేప క్రింద మారి యమునా నదిలో ఉంది. చేపని చీల్చిన వేంటనే అ చేప అక్కడ నుండి అంతర్థానమై పోయింది. ఆ మగ బిడ్డ పెద్దవాడై ఆ రాజ్యానికి రాజయ్యాడు. ఆ బాలిక మత్స్యగంధి పేరుతో పెద్దదయ్యింది. మత్స్యగంధి తండ్రి లేనప్పుడు యమునా నది పై నావ నడుపుతుండేది. ఇలా జరుగుతుండగా ఒక రోజు వశిష్ట మహర్షి మనమడు, శక్తి మహర్షి కుమారుడాయిన పరాశరుడు ఆ నది స్నానానికి అక్కడ కు వస్తాడు.
పరాశరుడు జ్యోతిష్యాస్త్రము లో ఆరితేరినవాడు . ప్రతిరోజు వార , తిది , నక్షత్రాలను తం అరచేతిలోనే చూడగల మహిమాన్వితుడు . ఆ రోజు దినచర్య ప్రకారము జ్యోతిష ఫలితాలను నెమరువేయు చుండగా " మరో గంటలో దివ్యమైన ముహూర్తము న జన్మించిన వారు బ్రహ్మ సమానులని " గ్రహించి ఆ విధముగా అలోచించి ఆ పుట్టుకకు గల నియమ నిబంధనలు దివ్యదృష్టితో చూడగా ... ఆ ని్యమాలు ఇలా ఉనాయిట :->
దంపతులకు శాస్త్రోక్తము గా పెళ్ళి జరగాలి ,
బ్రాహ్మణ పురోహితునిచే పెండ్లి జరుపబడాలి ,
వదువు కన్య అయి ఉండాలి ,
వరుడు అస్కలిత బ్రహ్మచారి అయి ఉండాలి ,
లంక లో పెండ్లి జరగాలి ,
పిండోత్పత్తి ' ఆ దివ్య మూర్తాన జరిగి ఉండాలి ,
ఇన్ని నియమాల లో పుట్టే శిశువు బ్రహ్మ జ్ఞానము కలిగి , బ్రహ్మసమానుడై ఉంటాడని అలోచిస్తూ నదీతీరాన నడుస్తూ ఉన్న ఆ పరశరునికి ... తనే ఆ బిడ్డను ఎందుకు కనకూడదని అలోచన కలిగి చుట్టు చూడగా ......అక్కడ కనిపించిన మత్స్యగంధిని చూసి మోహించే రతి సుఖాన్ని ఇవ్వమంటాడు, ఆ రతి వెనక ఉన్న జన్మరహస్యాన్ని వివరిస్తాడు . అప్పుడు మత్స్యగంధి తన శరీరం అంతా చేపల వాసనతో ఉంటుందని, కన్యత్వం చెడిన తాను తన తండ్రికి ఏవిధంగా మొగము చూపగలని ప్రశ్నిస్తుంది. అప్పుడు పరాశరుడు మత్స్యగంధి వసువు వీర్యానికి అద్రిక నే అప్సరసకి జన్మించినది ... అని జన్మ వృత్తాంతం చెబుతాడు. చేపల వాసన పోయేటట్లుగా ఒక యోజన దూరము వరకు సుగంధం వెదజల్లేటట్లు వరాన్ని ఇస్తాడు. అప్పటి నుండి యోజన గంధిగా పేరు పొందింది. అప్పటి రతి గరపడానికి సంకోచిస్తున్న మత్స్యగంధి తో పరాశరుడు ఆమె కన్యత్వం చెడకుండా ఉండే వరాన్ని ఇస్తాడు. పగటి పూట రతి సలపడం అనే విషయం వ్యక్తపరిస్తే , అక్కడా ఉన్న ప్రదేశాన్ని మేఘాలతో కప్పేస్తాడు. నదిలో లంక ఉండనే ఉన్నది , బ్రాహ్మణునికై బ్రహ్మదేవుని రమ్మని కోరగా ... తన శక్తి స్వరూపాలతో పుట్టె బిడ్డకు (తన డిటో) తాను సహకరించే ప్రశ్నేలేదని ఖరాకండిగా చెప్పడం తో , నారదముని సహయము తో వివాహం జరిపించి ఆ మహత్తర కార్యానికి నాందిపలికేరు .ఆ విధంగా రతి జరపగా ఒక తేజోవంతుడైన శిశువు జన్మిస్తాడు. ఆ శిశువు పుట్టిన వెంటనే తల్లికి తండ్రికి నమస్కరించి తపస్సుకి వెళ్ళి పోతాడు. తల్లికి ఎప్పుడైన మననం చేసుకొంటే ప్రత్యక్షమయ్యే వరాన్ని ఇస్తాడు.

భారతంలో వ్యాసుని పాత్ర

వ్యాసుడు జన్మించిన వెంటనే తల్లి అనుమతితో తపోవనానికి వెళతాడు. ఆ తరవాత సత్యవతీ శంతనుల వివాహం జరిగింది. వివాహకాలంలో దాశరాజు విధించిన షరతుకారణంగా భీష్ముడు ఆమరణాంతం బ్రహ్మచర్య వ్రతం అవలంబిస్తానని భీషణ ప్రతిజ్ఞ చేశాడు. శంతనుని మరణం తరవాత వారి కుమారులైన చిత్రాంగధుడు బలగర్వంతో గంధర్వుని చేతిలో మరణం చెందాడు. విచిత్రవీరుడు సుఖలాలసతో అకాలమరణం చెందాడు. భరతవంశం వారసులను కోల్పోయిన తరుణంలో సత్యవతి భరతవంశ పునరుద్ధరణ కొరకు తన పుత్రుడైన వ్యాసుని మనన మాత్రంచే తన వద్దకు రప్పించింది. భరతవంశాన్ని నిలపమని వ్యాసునికి ఆదేశించింది. తల్లి ఆదేశాన్ననుసరించి వ్యాసుడు అంబికకు దృతరాష్ట్రుని, అంబాలికకు పాండురాజుని మరియు దాశీకు విదురుని ప్రసాదించి తిరిగి తపోవనానికి వెళతాడు. ఆతరవాత వ్యాసుడు గాంధారి గర్భస్రావం సమయంలో ప్రవేశించి గాంధారి మృత పిండం నూట ఒక్క నేతికుండలలో పెట్టి వాటిని పరిరక్షించే విధానాన్ని చెప్పి తిరిగి తనదారిన తాను వెళతాడు. ఆతరవాత దుర్యోధనుడు భీమునిపై మూడుమార్లు హత్యాప్రయత్నం జరిపిన పిమ్మట తన తల్లికి కురువంశంలో రానున్న పెను దుష్పరిణామాలు సూచించి వాటిని ఆమె తట్టుకోవడం కష్టమని తపోవనానికి వెళ్ళి ప్రశాంత జీవితం గడపమని సూచించి తిరిగి తనదారిన తాను వెళతాడు. ఆ తరవాత లక్క ఇంటి దహనం తరవాత హిడింబాసురుని మరనానంతరం హిడింబి భవిష్య సూచనపై శాలిహోత్రుడు నివశించిన ఆశ్రమప్రాంతంలో పాండవులు నివసించే సమయంలో వ్యాసుడు పాండవుల చెంతకు వచ్చి వారికి ఊరట కలిగించాడు. ఆ ఆశ్రమ మహత్యం చెప్పి అక్కడ సరస్సులో జలము త్రాగిన వారికి ఆకలి దప్పులు ఉండవని, అక్కడి వృక్షముకింద నివసించే వారికి శైత్య, వాత, వర్ష, ఆతప భయములుండవని సలహా అందించాడు. భీముని వివాహమాడ కోరిన హిడింబను కోడలిగా చేసుకోవడానికి సంశయిస్తున్న కుంతీదేవికి హిడింబ పతివ్రత అని ఆమెను కోడలిగా చేసుకోవడం శుభప్రదమని ఆమె సంతానం ద్వారా పాండవులకు సహాయమందగలదని సూచించి తనదారిని తాను వెళతాడు. ఆ తరవాత కాలంలో ద్రౌపతీ స్వయంవరానికి ముందుగా పాండవులకు దర్శనమిచ్చి వారికి ద్రౌపతి పూర్వజన్మ వృత్తాంతం వివరించి స్వయంవరానికి వెళ్ళమని వారికి శుభంకలుగుతందని చెప్పి ద్రౌపతీ వివాహం తీరు ముందుగానే సూచించి అంతర్ధాన మయ్యాడు.
భారతము కధ అంతులేనిది ... ఎంత చెప్పిన ఇంకా ఉందనే తలంపు నిచ్చే మహాకావ్యము .

తెలుగు పందుగలు నుండి శేషగిరి రావ్ గారు రచించినది

గురుపౌర్ణమి విశిష్ఠత




గురుపౌర్ణమి విశిష్ఠత

గురుపౌర్ణమి విశిష్ఠత
గురుర్ర్బహ్మ గురుర్విష్ణర్ గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః


ఆషాఢ శుద్ధపౌర్ణమిని 'గురుపౌర్ణమి' లేదా 'వ్యాసపౌర్ణమి' అని అంటారు.ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి, ముక్తి వైపు నడిపించివందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు.

గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు. చాలామంది హిందువులు తమ గురువులతో జీవితాంతం అనుబంధం ఏర్పరుచుకుని ఉంటారు. ఇది కుటుంబ సంబంధం కూడా కావచ్చు. తర తరాలకూ కొనసాగవచ్చు. హిందూ మతంలో గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంధాన కర్తగా భావిస్తుంటారు.

అసలు ఈ ఆసాఢ శుద్ధపౌర్ణమి యొక్క విశిష్ఠత ఏమిటో? తెలుసుకుందాం. దీనికి ఒక చక్కని ప్రాచీన గాధకలదు.పూర్వం వారణాశిలో కడుపేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారట. ఆ బ్రాహ్మణుని పేరు 'వేదనిధి'. ఆయన సతీమణి పేరు 'వేదవతి'. వీరిరువురు ఎల్లప్పుడూ చక్కని ఆధ్యాత్మిక చింతనతో భక్తి జ్ఞానము కలిగి జీవించేవారు. ఇంకా సంతాన భాగ్యము కోసం ఎన్ని నోములు నోచినా, ఎన్ని వ్రతాలు చేసినా ఫలితం లేకపోయింది.

ఒకనాడు వేదనిధికి ప్రతిరోజూ మధ్యాహ్న సమయమందు వ్యాసభగవానులు రహస్యంగా గంగానదికి స్నానానికై వస్తూ ఉంటారని తెలుస్తుంది. ఎలాగైనా సరే వ్యాసమహర్షి దర్శనం పొందాలని ప్రతిరోజు వేయికళ్ళతో వెతక నారంభిస్తాడు. ఈ క్రమంలో ఒకరోజు ఒక భిక్షువు రూపం ధరించి దండధరుడైన వ్యక్తిని వేదనిధి దర్శిస్తాడు. వెంటనే వేదనిధి వారి పాదాలను ఆశ్రయిస్తాడు. దానికి ఆ భిక్షువు చీదరించుకుని కసురుకుంటాడు. అయినా సరే పట్టిన పాదాలను మాత్రము విడువకుండా మహానుభావా తమరు సాక్షాత్తు వ్యాసభగవానులని నేను గ్రహించాను. అందుచేతనే మిమ్మల్ని శరణు పొందగోరుచున్నాను అంటాడు. ఆ మాటలు విన్న ఆ భిక్షువు గంగానది ఒడ్డువైపునకు నలుదిశలా బిత్తరి చూపులు చూస్తూ, ఇంకాతనను ఎవరైనా చూస్తున్నారేమోనని తలచి వెంటనే వేదనిధిని ఆప్యాయంగా చేరదీసి, ఏమి కావాలో కోరుకోమంటారు.ఈ క్రమంలో రేపు నా తండ్రిగారి పితృకార్యము. దానికి తమరు బ్రాహ్మణార్థమై భోజనానికి మా ఇంటికి తప్పక దయచేయాలని వేడుకుంటాడు. అందుకు ఆ మహర్షి వేదనిధి ఆహ్వానాన్ని అంగీకరిస్తాడు.

అనంతరం ఎంతోసంతోషంగా ఇంటికి చేరుకున్న వేదనిధి తన సతీమణికి గంగానదీతీరాన జరిగిన వృత్తాంతమంతా వివరిస్తాడు. మరుసటిరోజు ఉదయమే ఇచ్చిన మాటప్రకారం వారిగృహానికి విచ్చేసిన వ్యాస మహర్షిని ఆ దంపతులు సాదరంగా లోనికి ఆహ్వానించి అతిథి సత్కారము చేసి పూజిస్తారు. అనంతరం దేవతార్చనకు తులసీదళాలు, పువ్వులను సిద్ధం చేస్తారు. వారి పూజ అనంతరం ఎంతోశుచిగా వంటకాలను సిద్ధపరిచి శ్రాద్ధవిధులను విధి విధానంగా నిర్వహిస్తారు. అనంతరం ఆ దంపతులు ఆ వ్యాస భగవానునికి సాష్టాంగ నమస్కారం చేస్తారు.

వారి ఆతిథ్యానికి ఎంతో సంతుష్ఠులైన ఆ ముని శ్రేష్ఠుడు.. ఓ పుణ్య దంపతులారా.. మీకు ఏమి వరం కావాలో కోరుకోండి అని అంటాడు. ఎన్ని నోములు, వ్రతాలు చేసినా సంతానభాగ్యము మాత్రము మాకు కలుగలేదు. అని బదులు పలుకుతారు. అందుకు త్వరలోనే మీకు తేజోవంతులు, ఐశ్వర్యవంతులు అయిన పదిమంది పుత్రసంతతి కలుగుతుందని ఆశీర్వదిస్తాడు. ఈ క్రమంలో వేదనిధి, వేదవతి దంపతులు వ్యాసముని అనుగ్రహంతో సుఖసంతోషాలు, అంత్యమున విష్ణుసాయుజ్యాన్ని పొందగలిగారు.

కాబట్టి వ్యాసపూర్ణిమ రోజున ఆ మహామునిని ప్రార్థించి ఆయన అనుగ్రహము పొందుదుముగాక! వేదవ్యాసుని మానవజాతి కంతటికీ మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళాడు కాబట్టి ఆయన్ను మానవాళికంతటికీ గురువుగా భావిస్తుంటారు. వేదవ్యాసుని పూర్వనామం కృష్ణ ద్వైపాయనుడు. వేదకాలపు సంస్కృతినంతా నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేసిన తరువాత ఆయన్ను వేదవ్యాసుడిగా పిలవడం ప్రారంభించారు.

దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తూంటారు. ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజను నిర్వహిస్తుంటారు.

షిరిడీ సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

మన సంస్కృతి బ్లాగునిండి సేకరించిన గురు మాణిక్యాలు

శ్రీ గురు అష్టోత్తరశతనామ స్తోత్రం



1::గురుర్గుణవరో గోప్తా గోచరో గోపతిప్రియః
గుణీ గుణవతాంశ్రేష్ఠో గురూణాంగురురవ్యయః

2::జేతా జయంతో జయదో జీవోజ్నంతో జయావహః
ఆంగీరసోజ్ధ్వరాసక్తో వివిక్తోజ్ధ్వరకృత్పరః

3::వాచస్పతిర్ వశీ వశ్యో వరిష్ఠో వాగ్విచక్షణః
చిత్తశుద్ధికరః శ్రీమాన్ చైత్రః చిత్రశిఖండిజః

4::బృహద్రథో బృహద్భానుర్బృహస్పతిరభీష్టదః
సురాచార్యః సురారాధ్యః సురకార్యహితంకరః

5::గీర్వాణపోషకో ధన్యో గీష్పతిర్గిరిశోజ్నఘః
ధీవరో ధిషణో దివ్యభూషణో దేవపూజితః

6::ధనుర్ధరో దైత్యహంతా దయాసారో దయాకరః
దారిద్ర్యనాశకో ధన్యో దక్షిణాయనసంభవః

7::ధనుర్మీనాధిపో దేవో ధనుర్బాణధరో హరిః
ఆంగీరసాబ్జసంజాతః ఆంగీరసకులసంభవః

8::సింధుదేశాధిపో ధీమాన్ స్వర్ణవర్ణః చతుర్భుజః
హేమాంగదో హేమవపుర్హేమభూషణభూషితః

9::పుష్యనాథః పుష్యరాగమణిమండలమండితః
కాశపుష్పసమానాభః కలిదోషనివారకః

10::ఇంద్రాదిదేవోదేవేశో దేవతాభీష్టదాయకః
అసమానబలః సత్త్వగుణసంపద్విభాసురః

11::భూసురాభీష్టదో భూరియశః పుణ్యవివర్ధనః
ధర్మరూపో ధనాధ్యక్షో ధనదో ధర్మపాలనః

12::సర్వవేదార్థతత్త్వజ్ఞః సర్వాపద్వినివారకః
సర్వపాపప్రశమనః స్వమతానుగతామరః

13::ఋగ్వేదపారగో ఋక్షరాశిమార్గప్రచారకః
సదానందః సత్యసంధః సత్యసంకల్పమానసః

14::సర్వాగమజ్ఞః సర్వజ్ఞః సర్వవేదాంతవిద్వరః
బ్రహ్మపుత్రో బ్రాహ్మణేశో బ్రహ్మవిద్యావిశారదః

15::సమానాధికనిర్ముక్తః సర్వలోకవశంవదః
ససురాసురగంధర్వవందితః సత్యభాషణః

16::నమః సురేంద్రవంద్యాయ దేవాచార్యాయ తే నమః
నమస్తేజ్నంతసామర్థ్య వేదసిద్ధాంతపారగః

17::సదానంద నమస్తేస్తు నమః పీడాహరాయ చ
నమో వాచస్పతే తుభ్యం నమస్తే పీతవాససే

18::నమోజ్ద్వితీయరూపాయ లంబకూర్చాయ తే నమః
నమః ప్రకృష్టనేత్రాయ విప్రాణాంపతయే నమః

19::నమో భార్గవశిష్యాయ విపన్నహితకారిణే
నమస్తే సురసైన్యానాంవిపత్ఛిద్రానకేతవే

20::బృహస్పతిః సురాచార్యో దయావాన్ శుభలక్షణః
లోకత్రయగురుః శ్రీమాన్ సర్వగః సర్వతోవిభుః

21::సర్వేశః సర్వదాతుష్టః సర్వదః సర్వపూజితః
అక్రోధనో మునిశ్రేష్ఠో దీప్తికర్తా జగత్పితా

22::విశ్వాత్మా విశ్వకర్తా చ విశ్వయోనిరయోనిజః
భూర్భువోధనదాసాజభక్తాజీవో మహాబలః

23::బృహస్పతిః కాశ్యపేయో దయావాన్ శుభలక్షణః
అభీష్టఫలదః శ్రీమాన్ సుభద్గర నమోస్తు తే

24::బృహస్పతిస్సురాచార్యో దేవాసురసుపూజితః
ఆచార్యోదానవారిష్ట సురమంత్రీ పురోహితః

25::కాలజ్ఞః కాలఋగ్వేత్తా చిత్తదశ్చ ప్రజాపతిః
విష్ణుః కృష్ణః సదాసూక్ష్మః ప్రతిదేవోజ్జ్వలగ్రహః



Sree guru ashTOttaraSatanaama stOtraM

1::gururguNavarO gOptaa gOcharO gOpatipriya@h
guNee guNavataaMSraeshThO gurooNaaMgururavyaya@h

2::jaetaa jayaMtO jayadO jeevOjnaMtO jayaavaha@h
aaMgeerasOjdhvaraasaktO viviktOjdhvarakRtpara@h

3::vaachaspatir^ vaSee vaSyO varishThO vaagvichakshaNa@h
chittaSuddhikara@h Sreemaan^ chaitra@h chitraSikhaMDija@h

4::bRhadrathO bRhadbhaanurbRhaspatirabheeshTada@h
suraachaarya@h suraaraadhya@h surakaaryahitaMkara@h

5::geervaaNapOshakO dhanyO geeshpatirgiriSOjnagha@h
dheevarO dhishaNO divyabhooshaNO daevapoojita@h

6::dhanurdharO daityahaMtaa dayaasaarO dayaakara@h
daaridryanaaSakO dhanyO dakshiNaayanasaMbhava@h

7::dhanurmeenaadhipO daevO dhanurbaaNadharO hari@h
aaMgeerasaabjasaMjaata@h aaMgeerasakulasaMbhava@h

8::siMdhudaeSaadhipO dheemaan^ svarNavarNa@h chaturbhuja@h
haemaaMgadO haemavapurhaemabhooshaNabhooshita@h

9::pushyanaatha@h pushyaraagamaNimaMDalamaMDita@h
kaaSapushpasamaanaabha@h kalidOshanivaaraka@h

10::iMdraadidaevOdaevaeSO daevataabheeshTadaayaka@h
asamaanabala@h sattvaguNasaMpadvibhaasura@h

11::bhoosuraabheeshTadO bhooriyaSa@h puNyavivardhana@h
dharmaroopO dhanaadhyakshO dhanadO dharmapaalana@h

12::sarvavaedaarthatattvaj~na@h sarvaapadvinivaaraka@h
sarvapaapapraSamana@h svamataanugataamara@h

13::RgvaedapaaragO RksharaaSimaargaprachaaraka@h
sadaanaMda@h satyasaMdha@h satyasaMkalpamaanasa@h

14::sarvaagamaj~na@h sarvaj~na@h sarvavaedaaMtavidvara@h
brahmaputrO braahmaNaeSO brahmavidyaaviSaarada@h

15::samaanaadhikanirmukta@h sarvalOkavaSaMvada@h
sasuraasuragaMdharvavaMdita@h satyabhaashaNa@h

16::nama@h suraeMdravaMdyaaya daevaachaaryaaya tae nama@h
namastaejnaMtasaamarthya vaedasiddhaaMtapaaraga@h

17::sadaanaMda namastaestu nama@h peeDaaharaaya cha
namO vaachaspatae tubhyaM namastae peetavaasasae

18::namOjdviteeyaroopaaya laMbakoorchaaya tae nama@h
nama@h prakRshTanaetraaya vipraaNaaMpatayae nama@h

19::namO bhaargavaSishyaaya vipannahitakaariNae
namastae surasainyaanaaMvipatChidraanakaetavae

20::bRhaspati@h suraachaaryO dayaavaan^ SubhalakshaNa@h
lOkatrayaguru@h Sreemaan^ sarvaga@h sarvatOvibhu@h

21::sarvaeSa@h sarvadaatushTa@h sarvada@h sarvapoojita@h
akrOdhanO muniSraeshThO deeptikartaa jagatpitaa

22::viSvaatmaa viSvakartaa cha viSvayOnirayOnija@h
bhoorbhuvOdhanadaasaajabhaktaajeevO mahaabala@h

23::bRhaspati@h kaaSyapaeyO dayaavaan^ SubhalakshaNa@h
abheeshTaphalada@h Sreemaan^ subhadgara namOstu tae

24::bRhaspatissuraachaaryO daevaasurasupoojita@h
aachaaryOdaanavaarishTa suramaMtree purOhita@h

25::kaalaj~na@h kaalaRgvaettaa chittadaScha prajaapati@h
vishNu@h kRshNa@h sadaasookshma@h pratidaevOjjvalagraha@h

అందరికీ వ్యాసపూర్ణిమ శుభాకాంక్షలు



శ్రీ వేద వ్యాస అష్టోత్తర శత నామావళి

ఓం..కృష్ణ ద్వైపాయనం వ్యాసం సర్వలోక హితేరతం
వేదాబ్జభాస్కరం వందే శమాది నిలయం మునిం


1.ఓం వ్యాసాయ నమః
2..ద్వైపాయనాయ నమః
3..శ్రేష్ఠాయ నమః
4..సత్యాత్మనే నమః
5..బాదరాయణాయ నమః
6..మునయే నమః
7..సత్యవతీ పుత్రాయ నమః
8..శుక తాతాయ నమః
9..తపోనిధయే నమః
10..వశిష్ఠనప్త్రే నమః
11..సర్వజ్ఞాయ నమః
12..విష్ణు రూపాయ నమః
13..దయానిధాయే నమః
14..పరాశరాత్మజాయ నమః
15..శాంతాయ నమః
16..శక్తిపౌత్రాయ నమః
17..గుణాంబుధయే నమః
18..కృష్ణాయ నమః
19..వేదవిభక్త్రే నమః
20..బ్రహ్మసూత్రకృతే నమః
21..అవ్యయాయ నమః
22..మహాయోగీశ్వరాయ నమః
23..సౌమ్యాయ నమః
24..ధన్యాయ నమః
25..పింగజటాధరాయ నమః
26..చీరాజనధరాయ నమః
27..శ్రీమతే నమః
28..అష్టాదశపురాణకృతే నమః
29..దండినే నమః
30..కమండలధరాయ నమః
31..కురువంశప్రవర్ధకాయ నమః
32..నిర్మమాయ నమః
33..నిరహంకారాయ నమః
34..నిష్కళంకాయ నమః
35..నిరంజనాయ నమః
36..జితేంద్రియాయ నమః
37..జితక్రోధాయ నమః
38..స్మృతికర్త్రే నమః
39..మహాకవయే నమః
40..తత్త్వ జ్ఞానినే నమః
41..తత్త్వబోధకర్త్రే నమః
42..కాశీనివాసభువే నమః
43..మహాభారత కర్త్రే నమః
44..చిరంజీవినే నమః
45..మహామతయే నమః
46..సజ్జనానుగ్రహపరాయ నమః
47..సత్యవాదినే నమః
48..ధృఢవ్రతాయ నమః
49..బదర్యాశ్రమసంచారిణే నమః
50..కోటిసూర్యసమప్రభాయ నమః
51..త్రిపుండ్రవిలసత్ఫాలాయ నమః
52..అష్టావింశతిరూపభ్రుతే నమః
53..రవీందుమిత్రశిష్యాడ్యాయ నమః
54..సుశీలాయ నమః
55..యతిపూజితాయ నమః
56..వైయ్యాఘ్రచర్మవసనాయ నమః
57..చిన్ముద్రావిలసత్కరాయ నమః
58..రుద్రాక్షమాలాభూషాడ్యాయ నమః
59..కలిపాపనివారకాయ నమః
60..ధర్మాశ్వమేధసందేష్ట్రే నమః
61..సంజయజ్ఞానదృష్టిదాయ నమః
62..ద్రుతరాష్ట్రపుత్రదర్శినే నమః
63..విదురాదిప్రపూజితాయ నమః
64..పుత్రమోహవ్యాకులాత్మనే నమః
65..జనకజ్ఞానదాయకాయ నమః
66..కర్మఠాయ నమః
67..దీర్ఘ దేహాఢ్యాయ నమః
68..దర్భాసీనాయ నమః
69..వరప్రదాయ నమః
70..యమునాద్వీపజననాయ నమః
71..మొక్షోపాయప్రదర్శకాయ నమః
72..ఋషిపూజ్యాయ నమః
73..బ్రహ్మనిధయే నమః
74..శిఖావతే నమః
75..జటిలాయ నమః
76..పరాయ నమః
77..అష్టాంగయోగనిరతాయ నమః
78..గాంధారీగర్భసంరక్షకాయ నమః
79..పాండవప్రీతిసంయుతాయ నమః
80..వసుభూపాలదౌహిత్రాయ నమః
81..వ్యాసకాశీసదావాసాయ నమః
82..నరనారాయణార్చకాయ నమః
83..నిత్యోపవాససంతుష్టాయ నమః
84..పరహింసాపరాన్గ్ముఖాయ నమః
85..శివపూజైకనిరతాయ నమః
86..సురాసురసుపూజితాయ నమః
87..సర్వక్షేత్రనివాసినే నమః
88..సర్వతీర్ధావగాహనాయ నమః
89..యుధిష్టిరాభిషేక్త్రే నమః
90..స్మృతిమాత్రాప్తసన్నిధయే నమః
91..త్రికాలజ్ఞాయ నమః
92..విశుద్దాత్మనే నమః
93..నిర్వికారాయ నమః
94..నిరామయాయ నమః
95..ఊర్ధ్వరేతసే నమః
96..మాతృభక్తాయ నమః
97..నిశ్చింతాయ నమః
98..నిర్మలాశయాయ నమః
99..రూపాంతరచరాయ నమః
100..పూజ్యాయ నమః
101..సదా శిష్యసమావృతాయ నమః
102.. భిక్షేశ్వర ప్రతిష్ఠాత్రే నమః
103..నిరవద్యాయ నమః
104..నిరంకుశాయ నమః
105..సర్వభూతహృదావాసాయ నమః
106..సర్వేష్టార్ధప్రదాయకాయ నమః
107..సర్వలోకగురవే నమః
108 ..సచ్చిదానందజ్ఞాననిధయే నమః