Showing posts with label వివిధ పండుగల శుభాకాంక్షలు. Show all posts
Showing posts with label వివిధ పండుగల శుభాకాంక్షలు. Show all posts

Thursday, May 15, 2014

లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం
























చందనోత్సవం

‘‘కుందాభనుందరతనుః పరిపూర్ణచంద్ర,
బింబానుకారి వదనో ద్విభుజస్ర్తినేత్రః
శాన్తస్ర్తిభంగి లలితః క్షితిగుప్తపాదః, సింహాచలే
జయంతి దేవవరో నృసింహః’’

శ్రీ సింహాచల క్షేత్రంలో వెలసిన శ్రీవరాహలక్ష్మీ నృసింహస్వామి చందనోత్సవం. సంవత్సరానికి ఒక్కరోజున అంటే ఈ వైశాఖ శుద్ధ తదియ నాడు మాత్రమే ఆ స్వామి నిజరూప దర్శనం లభిస్తుంది. సంవత్సరమంతా చందన లేపనంతో ఉండే స్వామి ఈ ఒక్కరోజు మాత్రం నిజరూపంతో భక్తులకు దర్శనమిస్తాడు. ఆ నిజరూప దర్శనం కోసం దేశం నలుమూల నుంచి ఎందరో భక్తులు వస్తారు. ఆ సింహాచలేశుని చందన యాత్రకి సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.

ఈ చందన యాత్ర వెనుక, విష్ణుమూర్తి నారసింహావతారం ధరించటం వెనుక ఓ కథ చెబుతారు. రాక్షణ రాజైన హిరణ్యకశిపుడు భ్రహ్మకోసం తపస్సు చేసి ఏ విధంగానూ తనకి మృత్యువు రాకుండా వరం పొందుతాడు. ఆ వరగర్వంతో లోకాలన్నింటినీ హింసించడం మొదలుపెడతాడు. అతని ఆగడాలను భరించటం కష్టమైన సమయంలో ముల్లోకవాసులు విష్ణువుకు మొరపెట్టుకుంటారు. అప్పుడు వారిని హిరణ్యకశిపుడు పెట్టే బాధలనుంచి రక్షించటానికి, బ్రహ్మ ఇచ్చిన వరాలకు భంగం కలగకుండా నరుడి దేహం, సింహపు తలతో నరసింహావతార మెత్తుతాడు విష్ణుమూర్తి. ఆ రూపంతో హిరణ్యకశిపుడిని సంహరిస్తాడు. ఆ సంహారం మహోగ్రంగా సాగుతుంది.

ఆ తరువాత ఆ ఉగ్రం వెంటనే శాతించదు. అప్పుడు బ్రహ్మాది దేవతలు భక్తుడైన ప్రహ్లాదునికి ఓ సలహా ఇస్తారు. బ్రహ్మదేవునికి ఓ విషయం గుర్తుకు వస్తుంది. శ్రీచందన వృక్షానికి ఉగ్రత, ఉష్ణం, తాపం తగ్గించే శక్తి వుంది. కాబట్టి ఆ స్వామి ఉగ్రాన్ని శ్రీ చందన లేపనంతో శాంతింప చేయమని ప్రహ్లాదునికి సలహా ఇస్తాడు బ్రహ్మ. ఆ మాటను అనుసరించి ప్రహ్లాదుడు చందనం తెప్పించాడు. ఆ పరిమళంలోని చలువ పరిసరాలలో ప్రసరించగానే ఆ ఉగ్రమూర్తి శాంతించ సాగాడు. ఇక అప్పుడు ప్రహ్లాదుడు ఆ స్వామిని ప్రార్థిస్తూ చందనం పూయటంతో పూర్తిగా శాంతించాడట ఆ ఉగ్రనరసింహుడు. ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని నరసింహ రూపంలోనే ప్రస్తుతం సింహాచలంగా పిలుస్తున్న సింహగిరిపై ప్రతిష్టించాడని భక్తుల నమ్మకం.

ప్రతీ ఏటా వైశాఖ శుద్ధ విదియనాడు రాత్రి ఆ విగ్రహానికి ఉన్న పాతచందనం అంతా పూర్తిగా ఒలిచివేస్తారు. తదియనాడు స్వామికి సహస్ర ఘటాభిషేకం, ఆ పైన విశేషపూజలు జరుపుతారు. ఈ ఒక్కరోజు భక్తులు వరాహ, నారసింహ రూపంలో ఉన్న స్వామిని దర్శించుకోగలుగుతారు. తిరిగి స్వామివారి చందన లేపనంతో చందనోత్సవం పూర్తవుతుంది. వచ్చే సంవత్సరం చందనోత్సవం లోపు నాలుగుసార్లు స్వామికి చందన లేపనం చేస్తారు. దానిని కరాళ చందన ఉత్సవం అంటారు. సింహాచలం చూసి తీరవలసిన క్షేత్రం. సంపెంగి పూల పరిమళాలతో, ప్రశాంతమైన వాతావరణంలో, ఎత్తైన కొండపై ఉన్న ఈ ఆలయం పడమటి ముఖంగా ఉంటుంది. ఇలా ఉన్న ఆలయాన్ని దర్శించటం వల్ల విజయం సిద్ధిస్తుందని చెబుతారు పెద్దలు. ఆ ప్రాంతవాసులు ఆపదలు తీర్చి ఆదుకునే 'అప్పన్న'గా పిలుస్తారు. ఈ రోజంతా అక్కడ అప్పన్న నామం ప్రతిధ్వనిస్తూ వుంటుంది. ఆ స్వామి నిజరూప దర్శనం సకల పాప హరణమని భక్తుల నమ్మకం. 


రేపు అప్పన్న చందనోత్సవం

తెల్లవారుజాము 4 నుంచే సాధారణ భక్తులకు దర్శనాలు
రాత్రి 7 గంటల వరకే క్యూల్లోకి ప్రవేశం
విస్తృత ఏర్పాట్లు చేపట్టిన ఆలయ వర్గాలు
సింహాచలం, న్యూస్‌లైన్ : సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం శుక్రవారం అంగరం వైభవంగా జరగనుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తికావచ్చాయి. వరాహ, నృసింహ రూపాలను ఒక్కటిగా చేసుకుని 12 మణుగులు (500 కిలోలు) చందనంతో ఏడాదంతా నిత్య రూపంతో దర్శనమిచ్చే స్వామి, ఏటా వైశాఖ శుద్ధ తదితయనాడు మాత్రమే నిజరూప దర్శనమిస్తారు.

 నాలుగు విడతలు చందనం సమర్పణ
 ఏడాదిలో నాలుగు విడతలుగా మూడు మణుగుల (120 కిలోలు) చొప్పున చందనాన్ని స్వామికి సమర్పిస్తారు. చందనోత్సవం రోజు రాత్రి, వైశాఖ, జ్యేష్ట, ఆషాఢ పౌర్ణమి రోజుల్లో మరో మూడు విడతలుగా మూడేసి మణుగుల చొప్పున చందనాన్ని సమర్పిస్తారు.
     
 అర్ధరాత్రి నుంచి వైదిక కార్యక్రమాలు ప్రారంభం

పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం గురువారం అర్ధరాత్రి 12.30 నుంచే వైదిక కార్యక్రమాలను అర్చకులు ప్రారంభిస్తారు. శుక్రవారం తెల్లవారుజాము 3.30 గంటలకు దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త పూసపాటి ఆనందగజపతిరాజు తొలి దర్శనం చేస్తారు. అనంతరం 4 గంటల నుంచి సాధారణ భక్తులకు దర్శనాలు అందజే స్తారు. రాత్రి  8.30 గంటల నుంచి శ్రీ వైష్ణవస్వాములు సహస్రఘట్టాభిషేకాన్ని నిర్వహిస్తారు. సింహగిరిపై ఉన్న గంగధార వద్ద నుంచి వెయ్యి కలశాలతో నీటిని తీసుకొచ్చి స్వామి నిజరూపాన్ని అభిషేకిస్తారు. 108 వెండి కలశాలతో పంచామృతాభిషేకాన్ని నిర్వహిస్తారు. అనంతరం స్వామికి తొలివిడత చందనాన్ని (125 కిలోలు) సమర్పించి మరల నిత్య రూపభరితుడ్ని చేస్తారు.
http://www.sakshi.com nundi sekarana

Monday, December 9, 2013

అందరికీ సుబ్రహ్మణ్య షష్టి శుభాకాంక్షలు























మా తండ్రి శివయ్యకు ముద్దుల తనయుడు
మమ్ము లాలనతో పాలించు దేవ సేనాని, 
సద్బుద్ధిని ఇచ్చు గణపతి అనుంగు సోదరుడు
సర్వ శక్తిమంతుడు, మహా బుద్ధిమంతుడు
బుద్ధిబలం, దేహబలం అనుగ్రహించు తల్లులు
వల్లీ దేవసేనల అనురాగాల కల్పవల్లి  
వివాహ ప్రదాత.. సత్సంతాన దాత 
యశోవైభవ ఐశ్వర్య వైరాగ్య విధాత
శివానందుడైన ఆ షణ్ముఖుడు 
మనలను సదా ఆరు ముఖాలతో 
చల్లగా కాచి కాపాడాలి. 

Monday, September 16, 2013

M.S.సుబ్బలక్ష్మీగారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలతో ___/\___







M.S.సుబ్బలక్ష్మీగారి జన్మదిన జయంతి సందర్భంగా శుభాకాంక్షలతో ___/\___ 

నాకిష్టమైన సంగీతలక్ష్మికి ప్రేమతో ___/\___

























ఎం.ఎస్. సుబ్బలక్ష్మి గారి జయంతి నేడు :

ఆమె పాడకపోతే దేవుళ్ళక్కూడా తెల్లవారదు!?


ఆమె పాట వినబడకపోతే దేశమే తానైన ఏ పల్లే లేవదు !?



తన సుప్రభాత గీతంతో భగవంతుణ్ణి నిదురలేపే ఆ సంగీత ఆధ్యాత్మిక స్వరం 


ఆమెకు ఒక వరం.


" కౌసల్యా సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే

ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవ మాహ్నికమ్ .....



.....అంటూ సాగే శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం తెలుగువాడి గుండెల్లో


భక్తిభావాల్ని కలిగిస్తుంది. ఆమె పాటలు వింటుంటే మనసు ప్రశాంతంగా, 

హాయిగా వుంటుంది. అభిమానులు ప్రేమగా ఎం.ఎస్ అని పిలిచుకొనే

మధురై షణ్ముఖవడివు సుబ్బలక్ష్మి


దేశములో మొట్ట మొదటి సారిగా భారతరత్న పురస్కారం అందుకున్న 


గాయకురాలుగా చరిత్ర సృష్టించి ఎందరికో స్ఫూర్తినిచ్చి చరిత్రలో తన 

గానంతో 

అజరామరురాలు అయ్యారు.ప్రపంచంలో ఎవరైనా ఒకవేళ భారతీయుల

 సాంప్రదాయ వస్త్రధారణ ఎలా వుంటుందని అడిగితే ఒక్క మాటలో 

చెప్పగలిగే సమాధానమే ఎమ్మెస్. నేను 'ఎమ్మెస్ సుబ్బలక్ష్మి'కి 

సమకాలీకుడనని చెబితే యముడు 'నువ్వు సకల స్తోత్రాలూ, మంత్రాలూ, 

కవచాలూ, సుప్రభాతాలూ..,అన్నీ వినే వుంటావు. ఇక నీకిక్కడ పని 

ఏమిటి స్వర్గానికి పో అంటాడు. మాతాతయ్య గాంధీని చూసానని 

చెప్పేవారు. నేను నా మనుమలకు ఎమ్మెస్ ని చూసానని గొప్పగా 

చెప్పుకొంటాను. పి.వి.ఆర్.కె.ప్రసాద్ గారి 'నాహం కర్తాః-హరిః కర్తాః'అనే 

పుస్తకం చదివితే, ఆమెపై గౌరవం మరింత పెరుగుతుంది.


http://te.wikipedia.org/wiki/ఎం.ఎస్._సుబ్బలక్ష్మి

Sunday, September 8, 2013

Monday, July 22, 2013

అందరికి గురుపౌర్ణమి శుభాకాంక్షలు

























అందరికి గురుపౌర్ణమి శుభాకాంక్షలు !!

ఈరోజు గురుపౌర్ణమి వ్యాసుల వారి జన్మదినం , మన గురువు గారు ఏ ప్రవచనం మొదలు పెట్టిన వ్యాసుల వారిని ఈ విధముగా సృతిస్తారు . 

వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే !
నమో వై బ్రహ్మనిథయే వాసిష్టాయ నమో నమః !

వ్యాస మహర్షి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం .

వేదవ్యాసుడు జన్మ వృత్తాంతం అష్టాదశ పురాణాలలొ పెక్కు మార్పు మార్లు చెప్పబడింది. ఈ దిగువ నున్న వృత్తాంతం మహాభారతము ఆది పర్వం తృతీయా ఆశ్వాసము నండి గ్రహించబడింది.

పూర్వకాలములో చేది రాజ్యాన్ని వసువు అనే మహారాజు పరిపాలన చేస్తుండేవాడు, ఒకరోజు వేటకు అడవికి వెళ్ళిన రాజు ఆ అడవి లో మునులు తపస్సు చేయడము చూసి తాను తపస్సు చేయడం ఆరంభించాడు. అప్పుడు ఇంద్రుడు అది గ్రహించి ఆ మహారాజు వద్దకు వెళ్ళి దైవత్వము ప్రసాదిస్తున్నాని చెప్పి ఒక విమానాన్ని ఇచ్చి, భూలోకములో రాజ్యం చేస్తూ, అప్పుడప్పుడు స్వర్గానికి రమ్మని చెబుతాడు. ఇంద్రుడు వేణుదుస్టి అనే అతి పరాక్రమ వంతమైన ఆయుధాన్ని కుడా ప్రసాదిస్తాడు. వసువు నివసిస్తున్న నగరానికి ప్రక్కగా శుక్తిమతి అనే నది ఉన్నది. శుక్తిమతి అనే నది ప్రక్కన ఉన్న కోలహలుడు అనే పర్వతము శుక్తిమతి మీద మోజుపడి ఆ నదిలో పడతాడు. అప్పుడు ఆ నది మార్గములో వెళ్తున్న వసువు తన ఆయుధంతో కోలహలుడిని ప్రక్కన పాడేస్తాడు. శుక్తిమతికి మరియు కోలహలుడికి మధ్య జరిగిన సంపర్కము వలన గిరిక అనే కుమార్తె వసుపదుడు అనే కుమారుడు జన్మిస్తారు. శుక్తిమతి వారివురిని వసువు కి కానుక గా ఇస్తుంది. వసువు గిరికని వివాహం చేసుకొంటాడు. వసువు వసుపదుడు ని సైన్యాధిపతిగా చేస్తాడు. ఒకరోజు వసువు వేటకు వెళ్తాడు అప్పుడు తన భార్య గిరిక గుర్తు రావడం తో రేతస్సు పడుతుంది. ఆ పడిన రేతస్సుని ఒక దొన్నెలో చేర్చి , ఆ దొన్నెని డేగకి ఇచ్చి తన భార్యకి ఇవ్వమంటాడు. ఆ డేగ ఆ దొన్నెను తీసుకొని పోవుతుండగా మరో డేగ చూసి అది ఏదో తినే పదార్థం అని ఆలోచించి, ఆ డేగతో పోట్లాడూతుంది అప్పుడూ ఆ రేతస్సు యమునా నదిలో పడుతుంది. ఆ యమునా నదిలో ఉన్న ఒక చేప ఆ రేతస్సు అని భక్షిస్తుంది ఆ భక్షించడం వల్ల అది అండంతో కూడి పిండం గా మారుతుంది. ఒకరోజు బెస్తవారు చేపలు పట్టు తుండగా ఈ చేప చిక్కుతుంది. ఆ చేపను బెస్తవారు వారి రాజైన దాశరాజు వద్దకు తీసుకొని పోతారు.

దాశరాజు ఆ చేపని చీల్చి చూడగా ఆ చేపలొ ఒక మగ శిశువు మరియు మరో ఆడ శిశువు ఉంటారు. బ్రహ్మ శాపం వల్ల ఒక అద్రిక అనే అప్సరస చేప క్రింద మారి యమునా నదిలో ఉంది. చేపని చీల్చిన వేంటనే అ చేప అక్కడ నుండి అంతర్థానమై పోయింది. ఆ మగ బిడ్డ పెద్దవాడై ఆ రాజ్యానికి రాజయ్యాడు. ఆ బాలిక మత్స్యగంధి పేరుతో పెద్దదయ్యింది. మత్స్యగంధి తండ్రి లేనప్పుడు యమునా నది పై నావ నడుపుతుండేది. ఇలా జరుగుతుండగా ఒక రోజు వశిష్ట మహర్షి మనమడు, శక్తి మహర్షి కుమారుడాయిన పరాశరుడు ఆ నది దాటడానికి అక్కడ కు వస్తాడు.

అక్కడ కనిపించిన మత్స్యగంధిని చూసి మోహించే రతి సుఖాన్ని ఇవ్వమంటాడు, అప్పుడు మత్స్యగంధి తన శరీరం అంతా చేపల వాసనతో ఉంటుందని, కన్యత్వం చెడిన తాను తన తండ్రికి ఏవిధంగా మొగము చూపగలని ప్రశ్నిస్తుంది. అప్పుడు పరాశరుడు మత్స్యగంధి వసువు వీర్యానికి అద్రిక నే అప్సరసకి జన్మించినది అనిజన్మ వృత్తాంతం చెబుతాడు. చేపల వాసన పోయేటట్లుగా ఒక యోజన దూరము వరకు సుగంధం వెదజల్లేటట్లు వరాన్ని ఇస్తాడు. అప్పటి నుండి యోజన గంధిగా పేరు పొందింది. అప్పటి రతి గరపడానికి సంకోచిస్తున్న మత్స్యగంధి తో పరాశరుడు ఆమె కన్యత్వం చెడకుండా ఉండే వరాన్ని ఇస్తాడు. పగటి పూట రతి సలపడం అనే విషయం వ్యక్తపరిస్తే , అక్కడా ఉన్న ప్రదేశాన్ని మేఘాలతో కప్పేస్తాడు. ఆ విధంగా రతి జరపగా ఒక తేజోవంతుడైన శిశువు జన్మిస్తాడు. ఆ శిశువు పుట్టిన వెంటనే తల్లికి తండ్రికి నమస్కరించి తపస్సుకి వెళ్ళి పోతాడు. తల్లికి ఎప్పుడైన మననం చేసుకొంటే ప్రత్యక్షమయ్యే వరాన్ని ఇస్తాడు.

వ్యాసుడు జన్మించిన వెంటనే తల్లి అనుమతితో తపోవనానికి వెళతాడు. ఆ తరువాత సత్యవతీ శంతనుల వివాహం జరిగింది. వివాహకాలంలో దాశరాజు విధించిన షరతుకారణంగా భీష్ముడు ఆమరణాంతం బ్రహ్మచర్య వ్రతం అవలంబిస్తానని భీషణ ప్రతిజ్ఞ చేశాడు. శంతనుని మరణం తరువాత వారి కుమారులైన చిత్రాంగధుడు బలగర్వంతో గంధర్వుని చేతిలో మరణం చెందాడు. విచిత్రవీరుడు సుఖలాలసతో అకాలమరణం చెందాడు. భరతవంశం వారసులను కోల్పోయిన తరుణంలో సత్యవతి భరతవంశ పునరుద్ధరణ కొరకు తన పుత్రుడైన వ్యాసుని మనన మాత్రంచే తన వద్దకు రప్పించింది. భరతవంశాన్ని నిలపమని వ్యాసునికి ఆదేశించింది. తల్లి ఆదేశాన్ననుసరించి వ్యాసుడు అంబికకు దృతరాష్ట్రుని, అంబాలికకు పాండురాజుని మరియు దాశీకు విదురుని ప్రసాదించి తిరిగి తపోవనానికి వెళతాడు. ఆతరువాత వ్యాసుడు గాంధారి గర్భస్రావం సమయంలో ప్రవేశించి గాంధారి మృత పిండం నూట ఒక్క నేతికుండలలో పెట్టి వాటిని పరిరక్షించే విధానాన్ని చెప్పి తిరిగి తనదారిన తాను వెళతాడు. ఆతరువాత దుర్యోధనుడు భీమునిపై మూడుమార్లు హత్యాప్రయత్నం జరిపిన పిమ్మట తన తల్లికి కురువంశంలో రానున్న పెను దుష్పరిణామాలు సూచించి వాటిని ఆమె తట్టుకోవడం కష్టమని తపోవనానికి వెళ్ళి ప్రశాంత జీవితం గడపమని సూచించి తిరిగి తనదారిన తాను వెళతాడు. ఆ తరువాత లక్క ఇంటి దహనం తరువాత హిడింబాసురుని మరనానంతరం హిడింబి భవిష్య సూచనపై శాలిహోత్రుడు నివశించిన ఆశ్రమప్రాంతంలో పాడవులు నివసించే సమయంలో వ్యాసుడు పాండవుల చెంతకు వచ్చి వారికి ఊరట కలిగించాడు. ఆ ఆశ్రమ మహత్యం చెప్పి అక్కడ సరస్సులో జలము త్రాగిన వారికి ఆకలి దప్పులు ఉండవని, అక్కడి వృక్షముకింద నివసించే వారికి శైత్య, వాత, వర్ష, ఆతప భయములుండవని సలహా అందించాడు. భీముని వివాహమాడ కోరిన హిడింబను కోడలిగా చేసుకోవడానికి సంశయిస్తున్న కుంతీదేవికి హిడింబ పతివ్రత అని ఆమెను కోడలిగా చేసుకోవడం శుభప్రథమని ఆమె సంతానం ద్వారా పాండవులకు సహాయమందగలరచి సూచించి తనదారిని తాను వెళతాడు. ఆ తరువాత కాలంలో ద్రౌపతీ స్వయంవరానికి ముందుగా పాందవులకు దర్శనమిచ్చి వారికి ద్రౌపతి పూర్వజన్మ వృత్తాంతం వివరించి స్వయంవరానికి వెళ్ళమని వారికి శుభంకలుగుతందని చెప్పి ద్రౌపతీ వివాహం తీరు ముందుగానే సూచించి అంతర్ధాన మయ్యాడు.
రచన:: చాగంటి కోటేశ్వర రావు గారు 

Sunday, March 10, 2013

అందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు...






అందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు... 

హిందూమతము సంప్రదాయంలో విస్తృతంగా ఉన్న నమ్మకం ప్రకారము, పురాణాలలో చెప్పిన ప్రకారము త్రిమూర్తులు, అనగా ముగ్గురు దేవుళ్ళు ప్రధాన ఆరాధ్యదైవాలు. వారు

* బ్రహ్మ - సృష్టికర్త
* విష్ణువు - సృష్టి పాలకుదు
* మహేశ్వరుడు - సృష్టి లయ కారకుడు

ఇది స్థూలంగా చెప్పబడే విషయం. ఇక వివరాలకొస్తే వివిధ సంప్రదాయాలను బట్టి, సిద్ధాంతాలను బట్టి, ప్రాంతాలను బట్టి, కాలానుగుణంగా ఆయా దేవుళ్ళకు సంబంధించిన కధలు, నమ్మకాలు, ఆరాధనామార్గాలు మారుతుంటాయి.

శివుని పుట్టుక గురించి అనేక కథలు ఉన్నాయి. విష్ణు పురాణంలో శివుడు బ్రహ్మ కుమారుడని ఉన్నది. మధు, కైటభులు అను రాక్షసులు బ్రహ్మను చంపటానికి రాగా, విష్ణువు వారిని తీక్షణంగా చూస్తాడు. ఆ సందర్భములో విష్ణువు నుదుటి నుండి శివుడు త్రిశూలాన్ని ధరించి జన్మించాడని మరొక ఇతిహాసములో ఉన్నది.

మరొక ఇతిహాసములో.. "బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులగు త్రిమూర్తులకు జన్మనిచ్చింది ఆది పరాశక్తి అగు శ్రీ రాజరాజేశ్వరీ దేవి. అప్పుడు రాజరాజేశ్వరీ దేవికి మూడవ నేత్రం ఉండేది. అనంతరం, తనను ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు వివాహమాడవలసిందిగా కోరింది. మొదట ముగ్గురూ నిరాకరించారు. ఆమె నచ్చచెప్పిన పిమ్మట, శివుడు తనని వివాహమాడేందుకు అంగీకరించి, ఒక షరతు పెట్టాడు. అది, తనను (ఆది పరాశక్తిని) వివాహమాడిన అనంతరం మూడవ నేత్రం శివునికి ఇవ్వాలి. అందుకు ఆ దేవత అంగీకరించి, వివాహానంతరం శివునికి మూడవ నేత్రమును ఇచ్చింది. అప్పుడు శివుడు ఆ మూడవ నేత్రముతో ఆ దేవతను భస్మం చేసి, ఆ భస్మరాశిని మూడు భాగాలుగా విభజించి, లక్ష్మి, సరస్వతి, పార్వతిలను సృష్టించాడు." అని ఉన్నది.

శివసిద్ధి :

ఆధ్యాత్మిక జీవితానికి అంకితమైన అనేకమంది ద్వంద్వ భావాలతో సందేహాలతో సతమతమవుతుంటారు. ముఖ్యంగా 'నేను' అనే భావననుంచి, దానికి సంబంధించిన 'అహంకారం'నుంచి బయటపడేందుకు బహువిధాలుగా ప్రయాస పడుతుంటారు. మాయ ఎంత బలీయమైనదంటే- ఒక్క క్షణంలోనే చంచలత్వాన్ని మనసులోకి ప్రవేశపెట్టేస్తుంది. అయోమయం ఆవహింపజేస్తుంది. మహాత్ములు సైతం తమ సాధనా కాలంలో ఈ దురవస్థలతో బాధపడినవారే.

సాక్షాత్తు శివాంశ సంభూతునిగా చెప్పుకొనే ఆదిశంకరులకూ ఇలాంటి అవస్థ ఒకసారి కలిగింది. మార్గంలో ఒక చండాలుడు ఎదురైనప్పుడు ఆదిశంకరులు ఏవగింపుతో 'తప్పుకో... తప్పుకో...' అని మందలించగా, అతడు నవ్వుతూ 'స్వామీ! తమరు దేన్ని తప్పుకోమంటున్నారు? అశాశ్వతమైన ఈ శరీరాన్నా, అనంతస్వరూపమైన ఆత్మనా?' అని ప్రశ్నించాడు. తక్షణం ఆదిశంకరుల్లో అజ్ఞానపు తెర మటుమాయమైంది. తదనంతర కాలంలో ఆయనలోంచి శివతత్వం గంగా తరంగాలుగా ప్రవహించింది. శివానందలహరి, సౌందర్యలహరి, భజగోవిందం వంటి అనితర సాధ్యమైన రచనలను భక్త లోకానికి అందించారు.

'శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు' అనటంలోని ఆంతర్యం- చీమనుంచి బ్రహ్మవరకు సర్వం శివాజ్ఞకు లోబడి ఉంటుందనే. సమస్త విశ్వమూ, సృష్టిలోని అణువణువూ శివమయమే. శివం కానిది 'శవ'మంటారు జ్ఞానులు. అంటే మృతపదార్థమని అర్థం. శివమే సత్యం, శివమే సుందరం, శివమే నిత్యం. శివమే అనంతం. శివమే జ్ఞానం. శివమే చైతన్యం. శివమే సర్వజగత్తులకు మూలాధారం. అనేక లక్షల జన్మల అనంతరం లభించే మానవజన్మ, ముక్తి సోపానానికి ముందుమెట్టు లాంటిది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలంటే శివభక్తిని వదలకూడదు.

శివానందలహరిలో ఒక శ్లోకముంది. సారాంశం ఏమిటంటే- శివుని పేరు పలికే నాలుకే నాలుక, శివుని దర్శించే కన్నులే కన్నులు, శివుని పూజించే చేతులే చేతులు. శివుని సదా స్మరించేవాడే ధన్యుడు.

పరిపూర్ణ జ్ఞానస్థితికి చేరుకున్న ఆదిశంకరులను 'నీవెవరు?' అని అడిగినప్పుడు- 'చిదానంద రూపం శివోహం శివోహం'- నేను చిదానంద స్వరూపుడనైన శివుణ్ని. మిగతా మరేమీ కాను అని ఆత్మస్థితిలో చెప్పగలిగారు. అదే 'శివసిద్ధి'. అంటే, సాధకుడు అనేక జన్మలనుంచి అనుభవిస్తున్న అజ్ఞానపు పొరల్ని ఒక్కొక్కటిగా చీల్చుకుంటూ బయటికి వచ్చి, తనను తాను చూసుకున్నప్పుడు, తాను ఆత్మననీ, అనగా సాక్షాత్తు శివస్వరూపమని గ్రహిస్తాడు. పూజలు, అర్చనలు, ప్రార్థనలు, ఉపవాసాలు, తపస్సులు, గురుశుశ్రూషలు- ఇవన్నీ ఈ అత్యున్నత స్థితిని అందుకోవటానికే.

శివానుగ్రహం అత్యంత సులభతరం. అందరికీ అందుబాటులో ఉంచటానికే- బిల్వార్చన, రుద్రాక్షధారణం, విభూతి లేపనం, అభిషేకంవంటి అతి సామాన్య విధానాలను పరమశివుడు భక్తుల కోసం ఏర్పరచాడంటారు.

జీవితకాలంలో మన ప్రతి చర్యనూ శివారాధన భావనతో ఆచరించడానికి మనసును అనుక్షణం హెచ్చరిస్తూ, అప్రమత్తంగా ఉంచుతుండాలి. అప్పుడు మనం సదా శివసాన్నిధ్యంలో ఉన్నట్లే. క్రమంగా అదే మన ఆత్మకు శివసిద్ధిని కలిగిస్తుంది. అదే పరమపదం.



పౌరాణిక వాఞ్మయంలో ప్రతి సంవత్సరం మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి అత్యంత ప్రాధాన్యంగల పవిత్రదినం. ప్రతి నెలా బహుళ చతుర్దశి నాడొచ్చేది మాస శివరాత్రి. ఉపవాసం, శివార్చన, జాగరణ... శివరాత్రినాడు ఆచరించవలసిన ప్రధాన విధులు. శివరాత్రి నాటి అర్ధరాత్రి సమయంలో శివలింగ ప్రాదుర్భావం జరుగుతుందంటారు. లింగం నిర్గుణోపాసనకు, శివస్వరూపం సగుణోపాసనకు సంకేతాలు.

స్కాంద పురాణంలోని ఈశాన సంహితలో ఓ కథ ఉంది. బ్రహ్మ, విష్ణువులోసారి ఒకరి కంటే ఒకరు అధికులమన్న అహంతో పరస్పరం కలహించుకుని తీర్పు కోసం పరమ శివుణ్ని అర్థించారట. శివుడు వారి మధ్య మహాగ్నిస్తంభాన్ని ఆవిర్భవింపజేశాడు. దాని ఆద్యంతాలు తెలుసుకురమ్మని వారిరువురినీ పంపాడు. బ్రహ్మ హంస రూపంలో వెళ్ళి అగ్రభాగాన్ని కనుగొనలేక వెనుదిరిగి వచ్చాడు. విష్ణువు శ్వేతవరాహ రూపంలో ఆ మహాలింగం మూలం తెలుసుకునే యత్నంచేసి, తానూ భంగపడ్డాడు. ఇదే లింగోద్భవ కథనం.

గుణనిధి అనే ఓ దుర్వ్యసనపరుడు నేరం చేసిన భయంతో కాకతాళీయంగా శివరాత్రినాడు శివాలయంలో శివలింగం వెనుక దాగివుండి, కొండెక్కుతున్న దీపం వత్తిని ఎగదోసి, తన ఉత్తరీయపు పోగుల్ని తెంచి దానికి జతచేసి ఆవునెయ్యి పోసి దీపప్రజ్వలనం కావించాడు. తెల్లవార్లూ భయంతో మేలుకొని ఉండి తెల్లారాక తలారి బాణపు దెబ్బకు మరణించాడు. బతుకంతా దుశ్శీలుడై నడిచినా ఆ శివరాత్రి నాడు దైవసన్నిధిలో ఉపవాసం, జాగరణ తనకు తెలియకుండానే చేసిన మహా పుణ్యకృత్య ఫలితంగా మరుజన్మలో కళింగ రాజు అరిందముడికి పుత్రుడై జన్మించి, దముడనే పేరుతో మహారాజై తన రాజ్యంలోని శివాలయాలన్నింటిలో అఖండ దీపారాధనలు చేయించి, ఆపై కుబేరుడిగా జన్మించి, ఉత్తర దిక్పాలకుడై శివుడికి ప్రాణసఖుడయ్యాడన్న కథ శ్రీనాధుడి కాశీఖండంలో ఉంది.

శ్రీరాముడు లంకపైకి దండెత్తే ముందు సాగర తీరాన ఇసుకతో శివలింగం చేసి పూజించాడు. ఆ సైకతలింగ క్షేత్రమే నేటి రామేశ్వరం. లంకాధీశుడు తన పది తలలు కోసి శివుణ్ని ప్రసన్నం చేసుకున్నదీపర్వదినానే అని చెబుతారు. జాంబవతికి సత్సంతానాన్ని ప్రసాదించమని ఇదే రోజున శివుణ్ని శ్రీకృష్ణుడు ప్రార్థించాడనీ కథనం వ్యాప్తిలో ఉంది.

'శివ' అంటే శుభం, ఆనందం, మంగళం, కైవల్యం, శ్రేయం అని అర్థాలు. 'శ' అంటే శివుడనీ, 'వ' అంటే 'శక్తి' అనీ శివ పదమణిమాల చెబుతోంది. శివరాత్రి వేళ అభిషేకప్రియుడైన శివుడి పార్థివ లింగాన్ని మహన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకంతో, నమక చమకాలతో, పురుష సూక్తంతో పూజిస్తారు. మొదటిజాములో పాలతో, రెండో జాములో పెరుగుతో, మూడో జాములో నెయ్యితో, నాలుగో జాములో తేనెతో అభిషేకిస్తారు. పరమశివునికి అత్యంత ప్రీతికరమైన బిల్వ పత్రాలతో శివార్చన చేసి, రుద్రాక్షమాలతో 'ఓం నమశ్శివాయ' అనే పంచాక్షరీ మంత్రం జపిస్తూ శివపురాణ పారాయణ చేస్తారు.

క్షీరసాగర మధన సమయంలో నిప్పులు చిమ్ముకుంటూ పెల్లుబికి వచ్చిన ఘోర కాకోల విషాగ్నుల నుంచి లోకాన్ని రక్షించవలసిందిగా దేవగణం వేడుకోగా, శివుడా గరళాన్ని గళాన నిలిపి ముల్లోకాలను కల్లోలం నుంచి కాపాడాడు. ఆ కాళరాత్రే శివరాత్రి. 'నిర్ణయ సింధు'లోని నారద సంహితలో శివరాత్రి వ్రత విధానం పేర్కొని ఉంది.

మార్కండేయుడు, నత్కీరుడు, సిరియాళుడు, చిరుతొండనంబి, తిన్నడు, శక్కనైనారు, అక్కమహాదేవి, బెజ్జమహాదేవి వంటి ఎందరో శివభక్తుల అమేయ భక్తిగాథలు మనకు పురాణాల్లో కనిపిస్తాయి.

రాముడికి 'పంచాక్షరి'ని ప్రబోధించి రామనామం జపించాడు సాంబశివుడు. రాముడు శివనామం జపించాడు. అందుకే 'శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే' అన్నారు. భగవంతుడు, భాగవతుడు తానేనన్న సనాతన ధర్మసూత్ర ప్రసూనం వెదజల్లే ఈ అద్వైత సుమగంధం సర్వులకు ఆఘ్రాణయోగ్యం. ఇది భక్తగణ భాగ్యం. శివభక్తులే నాకిష్టులని రాముడంటే, రామభక్తులే నాకిష్టులన్నాడు హరుడు. మంత్ర బీజాక్షరాలలో ప్రధమాక్షర బీజం 'ఓం'కారమే సదాశివుడు.

ఏటా అయిదు రకాలైన శివరాత్రులొస్తాయి. 1. నిత్య శివరాత్రి: ప్రతిరోజూ శివారాధాన చేస్తారు. 2. పక్ష శివరాత్రి: ప్రతినెలా శుద్ధ, బహుళ చతుర్దశులలో శివార్చన చేస్తారు. 3. మాస శివరాత్రి: ప్రతినెలా బహుళ చతుర్దశినాడు మాసశివరాత్రి. 4. మహాశివరాత్రి: మాఘ బహుళ చతుర్దశినాటి సర్వశ్రేష్ఠమైన శివరాత్రి. 5. యోగశివరాత్రి: యోగులు యోగసమాధిలో ఉండి చేసే శివచింతన.

దేవుడికి అతి సమీపంలో వసించడమే ఉపవాసం. మనం ఇంద్రియాలతో అనుభవిస్తున్నవన్నీ ఆహారాలే. వాటన్నింటికీ దూరంగా ఉండటమే నిజమైన నియంత్రణం. అదే నిజమైన ఉపవాసం. భౌతికాభిరుచులన్నింటినీ పక్కకు పెట్టి పూర్తిగా శివ సంబంధమైన కార్యక్రమాల్లోనే త్రికరణ శుద్ధిగా తాదాత్మ్యం చెందాలి. భోగానందాన్ని విస్మరించి, యోగానందావస్థలోకి ప్రవేశిస్తూ కోటి వెలుగుల ఆ శివజ్యోతి ప్రకాశాన్ని అంతరంగంలో ఆవిష్కరించుకుని సచ్చిదానందమైన ఆధ్యాత్మిక ప్రస్థానం చేయడమే మహాశివరాత్రి ఆంతర్యం!


రావణాసురుడు కైలాస పర్వతాన్ని ఎత్తుతూ మహాదేవుని ఆశువుగా చేసిన స్తోత్రం.

జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే
గలేవలంబ్యలంబితాం భుజంగతుంగమాలికాం
డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం
చకారచండతాండవంతనోతునశ్శివశ్శివం

జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ
విలోలవీచివల్లరీ విరాజమానమూర్ధని
ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్టపావకే
కిశోరచంద్రశేఖరేరతి:ప్రతిక్షణంమమ


ధరాధరేంద్రనందినీ విలాసబంధుబంధుర
స్పురద్ధిగంతసంతతి ప్రమోదమానమానసే
కృపాకటాక్షధోరణీ నిరుద్ధదుర్ధరాపది
క్వచిద్దిగంబరే మనోవినోదమేతు వస్తునీ

జటాభుజంగపింగళ స్ఫురత్ఫనామణిప్రభా
కదంబకుంకుమద్రవప్రలిప్తదిహ్వధూముఖే
మదాంధసింధురస్ఫుర త్వగుర్తరీయమేదురే
మనో వినోదమద్భుతంభిభర్తుభూతభర్తరి


సహస్రలోచన ప్రభుత్యశేషలేఖశేఖర
ప్రసూనధూళిధోరణీవిధూసరాంఘ్రిపీఠభూ:
భుజంగరాజమాలయానిబద్ధజాటజూటక:
శ్రియైచిరాయ జాయతాం చకోరబంధుశేఖర:

లలాటచత్వరజ్వలద్ధనంజయస్ఫులింగభా
నిపీతపంచసాయకంనమన్నిలింపనాయకం
సుధామయూఖలేఖాయావిరాజమానశేఖరం
మహాకపాలిసంపదేశిరోజటాలమస్తున:


కరాళ ఫాలపట్టికా దగద్ధగద్ధగజ్జ్వల
ద్ధనంజయాహుతీకృతప్రచండపంచసాయకే
ధరాధరేంద్రనందినీ కుచాగ్రచిత్రపత్రక
ప్రకల్ప నైకశిల్పిని త్రిలోచనే రతిర్మమ

నవీన మేఘమండలీ నిరుద్ధధుర్ధరస్ఫురత్
కుహూ నిశీధినీ తమః ప్రబంధ బద్ధకంధరః
నిలింపనిర్ఝరీ ధరస్తనోతు కృత్తిసింధురః
కళానిధాన బంధురః శ్రియం జగద్ధురంధరః


ప్రపుల్లనీలపంకజ ప్రపంచకాలిమప్రభా
వలంబి కంఠకందలీ రుచుప్రబద్ధకంధరం
స్మరచ్ఛిధం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదం
గజచ్ఛిదాంధకచ్ఛిదం తమంతకచ్ఛిదం భజే

అఖర్వసర్వమంగళా కళాకదంబమంజరీ
రసప్రవాహమాధురీ విజృంభణామధువ్రతం
స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం
గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే


జయత్వదభ్రవిభ్రమ భ్రమద్భుజంగ మశ్వస
ద్వినిర్గమత్ క్రమస్ఫురత్ కరాళఫాలహవ్యవాట్
ధిమిద్ధిమిద్ధిమిద్ధ్వనన్మృదంగతుంగతుంగమంగళ
ధ్వని క్రమ ప్రవర్తిత ప్రచండ తాండవశ్శివః

దృషద్విచిత్రతల్పయో ర్భుజంగమౌక్తికస్రజో
ర్గరిష్ఠరత్న లోష్టయోః సహృద్విపక్ష పక్షయో:
తృణారవింద చక్షుషోః ప్రజామహీ మహేంద్రయోః
సమప్రవృత్తికః కదా సదాశివం భజామ్యహమ్


కదానిలింపనిర్ఝరీ నికుంజకోటరేవసన్
విముక్తదుర్మతిః సదాశిరఃస్థమాంజలింవహన్
విలోలలోలలోచనో లలామఫాలలగ్నకః
శివేతిమంత్రముచ్ఛరణ్ సదాసుఖీ భవావ్యహం

నిమగ్ని నిత్యమేవముక్తముత్తమోత్తమం స్తవం
పఠన్ స్మరన్ బృవన్ నరో విశుద్ధమేతిసంతతం
హరేగురౌ సుభక్తిమాశుయాతినాం యధాగతిం
విమోహనం హి దేహినాంసు శంకరస్య చింత
నం

ఫలస్తుతి

పూజావసానసమయే దశవక్తంగీతం
యః శంభుపూజనపరం పఠతిః ప్రదోషే
తస్యస్థిరాం రదగజేంద్రతురంగయుక్తాం
లక్ష్మీంసదైవసుముఖీం ప్రదదాతి శంభుః



.telugupandagalu.blogspot,....wikipedia...సౌజన్యంతో
 — withనరసింహ శర్మ గారు

Friday, July 27, 2012

స్నేహితులు అందరికీ వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు





స్తుతి-పాఠ

నమో నమః

పద్మాననే పద్మిని పద్మ-హస్తే పద్మ-ప్రియే పద్మ-దలాయతాక్షి
విశ్వే-ప్రియే విష్ణు-మనోనుకూలే, త్వత్-పాద-పద్మం మయి సన్నిధత్స్వ

పద్మాననే పద్మ-ఉరు, పద్మాక్షీ పద్మ-సమ్భవే
త్వన్మా భజస్వ పద్మాక్షి, యేన సౌఖ్యం లభామ్యహమ్

అశ్వ-దాయి చ గో-దాయి, ధనదాయై మహా-ధనే
ధనం మే జుషతాం దేవి, సర్వ-కామాంశ్చ దేహి మే

పుత్ర-పౌత్ర-ధన-ధాన్యం, హస్త్యశ్వాది-గవే రథమ్
ప్రజానాం భవతి మాతః, అయుష్మన్తం కరోతు మామ్

ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసుః
ధనమిన్ద్రా వృహస్పతిర్వరుణో ధనమశ్నుతే

వైనతేయ సోమం పిబ, సోమం పిబతు వృత్రహా
సోమం ధనస్య సోమినో, మహ్మం దదాతు సోమిని

న క్రోధో న చ మాత్సర్యం, న లోభో నాశుభా మతీః
భవన్తీ కృత-పుణ్యానాం, భక్తానాం శ్రీ-సూక్తం జపేత్

Monday, July 2, 2012

అందరికీ వ్యాసపూర్ణిమ శుభాకాంక్షలు



శ్రీ వేద వ్యాస అష్టోత్తర శత నామావళి

ఓం..కృష్ణ ద్వైపాయనం వ్యాసం సర్వలోక హితేరతం
వేదాబ్జభాస్కరం వందే శమాది నిలయం మునిం


1.ఓం వ్యాసాయ నమః
2..ద్వైపాయనాయ నమః
3..శ్రేష్ఠాయ నమః
4..సత్యాత్మనే నమః
5..బాదరాయణాయ నమః
6..మునయే నమః
7..సత్యవతీ పుత్రాయ నమః
8..శుక తాతాయ నమః
9..తపోనిధయే నమః
10..వశిష్ఠనప్త్రే నమః
11..సర్వజ్ఞాయ నమః
12..విష్ణు రూపాయ నమః
13..దయానిధాయే నమః
14..పరాశరాత్మజాయ నమః
15..శాంతాయ నమః
16..శక్తిపౌత్రాయ నమః
17..గుణాంబుధయే నమః
18..కృష్ణాయ నమః
19..వేదవిభక్త్రే నమః
20..బ్రహ్మసూత్రకృతే నమః
21..అవ్యయాయ నమః
22..మహాయోగీశ్వరాయ నమః
23..సౌమ్యాయ నమః
24..ధన్యాయ నమః
25..పింగజటాధరాయ నమః
26..చీరాజనధరాయ నమః
27..శ్రీమతే నమః
28..అష్టాదశపురాణకృతే నమః
29..దండినే నమః
30..కమండలధరాయ నమః
31..కురువంశప్రవర్ధకాయ నమః
32..నిర్మమాయ నమః
33..నిరహంకారాయ నమః
34..నిష్కళంకాయ నమః
35..నిరంజనాయ నమః
36..జితేంద్రియాయ నమః
37..జితక్రోధాయ నమః
38..స్మృతికర్త్రే నమః
39..మహాకవయే నమః
40..తత్త్వ జ్ఞానినే నమః
41..తత్త్వబోధకర్త్రే నమః
42..కాశీనివాసభువే నమః
43..మహాభారత కర్త్రే నమః
44..చిరంజీవినే నమః
45..మహామతయే నమః
46..సజ్జనానుగ్రహపరాయ నమః
47..సత్యవాదినే నమః
48..ధృఢవ్రతాయ నమః
49..బదర్యాశ్రమసంచారిణే నమః
50..కోటిసూర్యసమప్రభాయ నమః
51..త్రిపుండ్రవిలసత్ఫాలాయ నమః
52..అష్టావింశతిరూపభ్రుతే నమః
53..రవీందుమిత్రశిష్యాడ్యాయ నమః
54..సుశీలాయ నమః
55..యతిపూజితాయ నమః
56..వైయ్యాఘ్రచర్మవసనాయ నమః
57..చిన్ముద్రావిలసత్కరాయ నమః
58..రుద్రాక్షమాలాభూషాడ్యాయ నమః
59..కలిపాపనివారకాయ నమః
60..ధర్మాశ్వమేధసందేష్ట్రే నమః
61..సంజయజ్ఞానదృష్టిదాయ నమః
62..ద్రుతరాష్ట్రపుత్రదర్శినే నమః
63..విదురాదిప్రపూజితాయ నమః
64..పుత్రమోహవ్యాకులాత్మనే నమః
65..జనకజ్ఞానదాయకాయ నమః
66..కర్మఠాయ నమః
67..దీర్ఘ దేహాఢ్యాయ నమః
68..దర్భాసీనాయ నమః
69..వరప్రదాయ నమః
70..యమునాద్వీపజననాయ నమః
71..మొక్షోపాయప్రదర్శకాయ నమః
72..ఋషిపూజ్యాయ నమః
73..బ్రహ్మనిధయే నమః
74..శిఖావతే నమః
75..జటిలాయ నమః
76..పరాయ నమః
77..అష్టాంగయోగనిరతాయ నమః
78..గాంధారీగర్భసంరక్షకాయ నమః
79..పాండవప్రీతిసంయుతాయ నమః
80..వసుభూపాలదౌహిత్రాయ నమః
81..వ్యాసకాశీసదావాసాయ నమః
82..నరనారాయణార్చకాయ నమః
83..నిత్యోపవాససంతుష్టాయ నమః
84..పరహింసాపరాన్గ్ముఖాయ నమః
85..శివపూజైకనిరతాయ నమః
86..సురాసురసుపూజితాయ నమః
87..సర్వక్షేత్రనివాసినే నమః
88..సర్వతీర్ధావగాహనాయ నమః
89..యుధిష్టిరాభిషేక్త్రే నమః
90..స్మృతిమాత్రాప్తసన్నిధయే నమః
91..త్రికాలజ్ఞాయ నమః
92..విశుద్దాత్మనే నమః
93..నిర్వికారాయ నమః
94..నిరామయాయ నమః
95..ఊర్ధ్వరేతసే నమః
96..మాతృభక్తాయ నమః
97..నిశ్చింతాయ నమః
98..నిర్మలాశయాయ నమః
99..రూపాంతరచరాయ నమః
100..పూజ్యాయ నమః
101..సదా శిష్యసమావృతాయ నమః
102.. భిక్షేశ్వర ప్రతిష్ఠాత్రే నమః
103..నిరవద్యాయ నమః
104..నిరంకుశాయ నమః
105..సర్వభూతహృదావాసాయ నమః
106..సర్వేష్టార్ధప్రదాయకాయ నమః
107..సర్వలోకగురవే నమః
108 ..సచ్చిదానందజ్ఞాననిధయే నమః

Saturday, May 5, 2012

నృసింహజయంతి శుభాకాంక్షలు























ఏకేన చక్ర మపరేణ కరేణ శంఖ
మన్యేన సింధుతనయా మవలంబ్య తిష్ఠన్ |
వామేతరేణ వరదాభయ పద్మ చిహ్నం
లక్ష్మీనృసింహ మమదేహి కరావలంబమ్ ||


ప్రార్ధన శ్లోకం:


సత్యజ్ఞాన శివస్వరూప మమలమ్ క్షీరాబ్ధి మధ్యస్థితం

యోగారూఢ మతిప్రసన్న వదనమ్ భూషా సహస్రోజ్వలమ్|

త్ర్యక్షం చక్ర పినాక సాభయ వరాన్విభ్రాణమర్కచ్ఛవిమ్

ఛత్రీభూత ఫణీన్ద్ర మిన్దు ధవళమ్ లక్ష్మీనృసింహం భజే|


నరసింహావతారం:::--

మానవ పరిణామ క్రమంలో అసంపూర్ణమైన (సగం మానవా కారం, సగం సింహాకారం) మానవ రూపంతో కంనిపించే మొట్టమొదటి అవతారమే నరసింహావతారం. ఈ అవతారానికి ముందు మత్స్య, కూర్మ, వరాహావతారాలున్నాయి. అవి జంతు సంబంధమైనవి. విజ్ఞాన శాస్త్రం ప్రకారం కూడా వెన్నెముక నిటారుగా ఉన్న అవతారాల్లో మొట్టమొదటిది నరసింహావతారమే. మానవావిర్భావం మొదట మత్స్య రూపమునుంచి ఆవిర్భవించిందనే సిద్ధాంతానికి, దశావతారాల్లో కనిపించే క్రమమూ, పరిణామమూ నిదర్శనాలుగా నిలుస్తాయి.

నరసింహావతారంలో రెండు భిన్న పార్శ్వాలు కనిపిస్తాయి. నృసింహుడు హిరణ్యకశిపుని పాలిట ఉగ్రుడై కనిపిస్తే, అదే రూపం ప్రహ్లాదునిపై దయారసాన్ని కురిపించింది. హిరణ్యకశిపుడు భయభ్రాంతుడైతే, అదే రూపాన్ని దర్శించిన ప్రహ్లాదుడు భక్తిరసాంబుధిలో ఓలాలాడాడు. హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు వీరిద్దరిలో ఎవరు ధైర్యవంతులు? భుజబలం ఉన్నప్పటికీ మానసిక శక్తులు లేని హిరణ్యకశిపునికన్నా, బాలుడైనా ఆత్మశక్తి ద్వారా సంపాదించిన భక్తిబలంతో ప్రహ్లాదుడు ఉగ్రభీకర నృసింహ స్వరూపాన్ని చూసి భయపడలేదు. అలాగే హిరణ్యకశిపుడు కోరిన కోర్కెలు విషయవాంఛలు. విషయ వాంఛలపై ఎంతగా ప్రలోభపడినా చివరికి ఏదో ఒక రూపంలో అవి మనల్ని కాటేయక మానవు.

సంప్రదాయంలో నారసింహస్వామి విజయాన్ని అందించే వేల్పుగా ఖ్యాతి వహించాడు. రాజ్యలక్ష్మి సమేతుడై శత్రుభయంకరుడై, ఆర్తుల ఆర్తిని పోగొట్టే ఆర్తత్రాణ పరాయణుడు. నియమపూర్వకమైన సాధనల ద్వారా యౌగిక స్తంభాన్ని చేధిస్తే మాత్రమే మన హృదయంలో ఆవిర్భవించే విజ్ఞాన స్వరూపుడు. అహంకారంతో, ప్రలోభాలతో శరీరాకృతిలో మనల్ని పీడించే భవబాధలను వివేకమనే నఖాగ్రాలతో చీల్చి ఉపశమంపచేసే వాత్సల్య స్వరూపుడు. అందుకే ఆది శంకరాచార్యులు -

సంసార సాగర విశాల కరాళకాల
నక్రగ్రహ గ్రసన నిగ్రహ విగ్రహస్య
వ్యగ్రస్య రాగరసనోర్మిని పీడితస్య
లక్ష్మీనృసింహ! మమదేహి కరావలంబం!!

అని లక్ష్మీనృసింహుని సంసారం నుంచి విముక్తి కలింగించే ఆపద్బాంధవునిగా కొనియాడారు. నరసింహుని వీరత్వంగానీ, వాత్సల్యం కానీ, విరాట్ రూపంగానీ సమాన్యమైనవి కాదు. వర్ణనాతీతమైనవి. ప్రహ్లాదుడంటేనే లోకానికి ఆహ్లాదం కలిగించేవాడు. ఆ ప్రహ్లాదునికే ఆహ్లాదంకలిగించిన నృసింహుడు ప్రహ్లాదహ్లాదుడై, ప్రహ్లాద భక్త వరదుడై, కరుణా సముద్రుడయ్యాడు. నృసింహనామాన్ని ఒక్కసారి స్మరిస్తే చాలు – సర్వారిష్టాలు, భయభ్రాంతులు, ఈతిబాధలు, శారీరక రోగాలు పటాపంచలై పోతాయని ఎందరో విశ్వసిస్తారు.

ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం
నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం!!

నృసింహజయంతి శుభాకాంక్షలు