Tuesday, December 3, 2013

సంపదలు, సుఖసంతోషాలు ప్రసాదించే శ్వేతార్క గణపతి పూజా విధానం



















సంపదలు, సుఖసంతోషాలు ప్రసాదించే శ్వేతార్క గణపతి


 (Swetarka Ganapati)

శ్వేతార్క మూలం (తెల్ల జిల్లేడు వేరు)లో వినాయకుడు నివశిస్తాడని ప్రతీతి. 
దీన్ని మనం పొందగలిగి, ఇంట్లో ప్రతిష్టించుకోగలిగితే సుఖసంతోషాలు పొందగలం. 
కొన్ని తెల్ల జిల్లేడు వేళ్ళు అచ్చం గణేశుని ఆకారంలో కనిపిస్తాయి. 
నేపాల్ లో ముఖ్యంగా హిమాలయ ప్రాంతంలో మనకు కనిపించే వివిధ రకాల వనమూలికలలో ఈ శ్వేతార్కం ఒకటి. 
ఇది రాజస్థాన్ లోని కొన్ని ప్రాంతాలలోనూ మనకు దొరుకుతుంది. 
ఈ చెట్టు ఆకులు ఆకుపచ్చగా,పూలు చిన్నవిగా, నీలం రంగుతో ఉంటాయి, అయితే ఇవి చాలా అరుదుగా మాత్రమే దొరుకుతాయి. 
ఈ శ్వేతార్క మూలాన్ని వెలికి తీసి, మట్టిని కడిగివేసి, నీళ్లలో నానబెట్టి జాగ్రత్తగా పరిశీలించినట్టయితే 
ఆ వేళ్ల మీద గణపతి ఆకృతి కనిపిస్తుందని చెబుతారు. 
ఈ గణపతిని తంత్రశాస్త్రంలో శ్వేతార్క గణపతి అని అంటారు. 
శ్వేతార్క గణపతి గురించి ప్రస్తావనలు, వివరణలు మనకు అనేక గ్రంథాలలో కానవస్తాయి. 
శ్వేతార్క గణపతిని ఇంట్లో ప్రతిష్టించుకునేందుకు సరైన ముహూర్తాన్ని నిర్ణయించుకోవాలి. 
కుటుంబ పురోహితుల్ని సంప్రదించి, వారి సలహా మేరకు ముహూర్తం పెట్టించుకోవాలి. 
వినాయక చవితి పండుగ రోజున ఈ శ్వేతార్క గణపతిని ప్రతిష్టించి పూజ చేసుకోవాలి. 
పుష్యమీ నక్షత్రం ఉన్న ఆదివారం శ్వేతార్క గణపతిని ప్రతిష్టించుకునేందుకు సర్వశ్రేయస్కరం, 
ఈ రోజును ‘రవి పుష్యయోగ’ దినంగా పేర్కొంటారు.

  పూజా విధానం

శ్వేతార్క మూలగణపతిని శుద్ధమైన నీతితో కడిగి, తర్వాత దానిపై ఎర్రని వస్త్రం మీద పెట్టి పూజ చేయాలి. 
పూజలో ఎర్ర చందనం, అక్షతలు, ఎర్రపూలు సింధూరం ఎరుపు రంగు ఉండే వస్తువులే ఎక్కువగా వాడాలి. 
ధూపదీప నైవేద్యాలు సమర్పించాలు. 
వీటితో ఒక నాణాన్ని దక్షిణగా సమర్పించి తర్వాత ఈ దిగువ ఇచ్చిన మంత్రాలలో ఏదో ఒక మంత్రంతో గణేశుని పూజ చేయాలి. 

ఓం గం గణపతయే నమః

ఓం గ్లౌం గణపతయే నమః

ఓం శ్రీ గణేశాయ నమః

ఓం శ్రీ ఫాలచంద్రాయ నమః

ఓం ఏకదంతాయ నమః

ఓం లంబోదరాయ నమః

మంత్ర జప ఆరంభానికి ముందే ఎన్ని సార్లు మంత్ర పఠనం చేసేది సంకల్పం చెప్పుకోవాలి. 
మంత్ర జపం చేసే సమయంలో ఎర్రని జపమాల, రుద్రాక్షమాల వాడడం మంచిది. 
ప్రతి జపమాలలోనూ 108 గింజలు ఉంటాయి. 
ఒకసారి అన్ని గింజలు లెక్కిస్తూ పూజ చేస్తే 108 సార్లు జపం చేసినట్టవుతుంది. 
అలా పది సార్లు జపమాల చెయ్యడమంటే వెయ్యి సార్లు నామ జపం అవుతుంది. 
ఈ విధంగా ఎన్ని జపమాలలు పూజ చేయాలనుకుంటారో ఆ ప్రకారం చేయాలి. 
శ్వేతార్క గణపతిని సాక్షాత్తూ గణపతిగా భావించి పూజలు చేస్తారో వారికి జ్ఞాన సంపద సురక్ష సుఖశాంతులు లభిస్తాయి.
శ్వేతార్క మూలానికి వశీకరణశక్తి ఉంటుందిట, 
ఏదైనా శుభముహూర్తాన శుచియైన తర్వాత ఆవునెయ్యి, గోరోజనం సిద్ధంగా ఉంచుకుని, 
ఈ ఆవునెయ్యి గోరోజనంలో శ్వేతార్క మూలాన్ని గంథంలాగా అరగదీసి 
ఇష్టదైవాన్ని మనసులో ప్రార్ధిస్తూ నుదుటి మీద తిలకం వలె ధరిస్తే ఆ తిలకానికి ఉన్న వశీకరణ శక్తి స్వయంగా అనుభవంలోకి వస్తుంది. 
ఇక శరీర రక్ష కోసం శ్వేతార్క మూలాన్ని చిన్నదిగా తీసుకుని భుజం మీద లేదా కంఠంలో ధరించడం వల్ల ఆరోగ్య రక్ష కలుగుతుంది. 
భూత ప్రేత పిశాచాల భయం, నరుల దిష్టి వంటి హాని కలగకుండా ఇది కాపాడుతుంది.
శ్వేతార్క గణపతిని పూజా గృహంలో పెట్టుకుని దాని ముందు ప్రతిరోజూ ఓం గం గణపతియే నమః 
అని ఒక జపమాల జపించడం వల్ల జీవితంలో ఉన్నతి లభిస్తుంది. ధన ధాన్య సుఖ సౌభాగ్య వృద్ది కలుగుతుంది. 
దారిద్ర్య నివారణకు తరుణోపాయం శ్వేతార్క గణపతి జీవితంలో సర్వతోముఖాభివృద్ధి కోసం 
దిగివ చెప్పిన మంత్రాన్ని ప్రతిరోజూ కనీసం ఒక జపమాల చేయాలి.

  మంత్రం

  ‘ఓం సమో విఘ్నహరాయ గం గణపతియే నమః’


 ఈ మంత్రాన్ని 5 జపమాలలు పఠించిన తర్వాత 
పూజ సామగ్రిని శ్వేతార్క గణపతి సహితంగా ఒక ఎర్రని వస్త్రంలో చుట్టి, 
గణేశ చతుర్ధి రోజున మీ సమీపంలో గణేశాలయంలో దానిని గణేశుని చరణాల వద్ద సమర్పించండి. 
భక్తి పూర్వకంగా నమస్కరించి, శ్వేతార్క మూలాన్ని భస్మం చేసి 
దానిని తిలకంగా నుదుటి మీద ధారణ చేయడం వల్ల లక్ష్మీ ప్రసన్నం కూడా కలుగుతుంది.
sundarpriya 
తెలుగువన్ మూలంగా సెకరించినది 

No comments: