Saturday, August 25, 2012

శిష్టజన రక్షణి దుర్గామాత



















శిష్టజన రక్షణి దుర్గామాత

సుమారు అన్ని వతారాలు దానవ సంహారము కొరకే అన్నట్లు కథలు ఉన్నాయి . తపస్సు చేసిన వారికి ... బ్రహ్మ , విష్ణు , మహేశ్వరులు వరాలివ్వడము ముందు వెనక ఆలోచించక -- వాటి ప్రభావమువలన దేవదానవ సోదర యుద్ధము ... తత్ఫలితము సురులు అతీత శక్తులుగా అవతారాలు ఎత్తడమే మన పురాణాల కథలు అన్నీ. ఆకోవకు చెందినదే దుర్గామాత అవతారము :

చిద్రూపి అయిన జగన్మాత శిష్టజన రక్షణార్థం దుష్ట శిక్షణకై భూమిపై అవతారాలు ఎత్తవలసి వచ్చింది. దుర్గగా పిలవబడటానికి ముందు ‘శతాక్షి’ పేరుతో స్తుతింపబడింది. హిరణ్యాక్షుని వంశంలో ‘రురుడు’ అనే రాక్షసునికి దుర్గముడు అనే కొడుకు పుట్టాడు. దుష్టుల హృదయాలు దురాలోచనలతోనే నిండి ఉంటాయి కదా! వాళ్ళకంటూ ఒక ప్రత్యేకత, గర్తింపు, ఏదో సాధించాలనే తపన ఉంటుంది. వాళ్ళు అనుకున్నది సాధించటానికి ఎంత వక్రమార్గమైనా, ఎంత దుర్మార్గంతో నిండినదైనా మానరు. రాక్షసాంశతో పుట్టిన ఈ దుర్గముడికి వేదాలు దొంగిలించాలనే దుర్బుద్ధి పుట్టింది. వాటిని అపహరిస్తే దేవతల బలం తగ్గుతుందని అతని ఆలోచన. వేదాలను పొందాలంటే ఏం చెయ్యాలి? అని ఆలోచించాడు. బ్రహ్మ ద్వారా పొందటం తేలిక అని నిర్ణయించుకున్నాడు.

బ్రహ్మను గూర్చి హిమాలయాల్లో వెయ్యి సంవత్సరాలు తపస్సు చేశాడు. గాలిని మాత్రమే ఆహారంగా తీసుకున్నాడు. అతని ఘోర తపస్సుకు బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. దుర్గముడు సాష్టాంగ నమస్కారం చేశాడు. ‘‘దుర్గమా! ఏం వరం కావాలో కోరుకో’’ అన్నాడు బ్రహ్మ, ‘‘వేదాలు, వేదమంత్రాలు నా ఆధీనంలో ఉండాలి’’ అన్నాడు దుర్గముడు. బ్రహ్మ ‘‘తథాస్తు’’ అన్నాడు. ఇక ఏముంది! వేదాలు, వేద మంత్రాలు అపాత్రుని ఆధీనంలోకి వచ్చాయి. భూమిపైన రుషులు స్నాన, సంధ్య, జపాదులు మరిచిపోయారు. యజ్ఞయాగాదులను మానేశారు. దేవతలకు హవిర్భాగాలు చెందక వాళ్ళు శక్తి హీనులయ్యారు. ఆదను చూసుకొని దుర్గముడు అమరావతిపై దండెత్తాడు. మంత్రశక్తి పొందిన దుర్గముడు దేవతలపైనా దండెత్తాడు. దేవతలు వాడి ధాటికి తట్టుకోలేక పారిపోయి కొండ గుహల్లో తలదాచుకున్నారు.జగజ్జననిని ప్రార్థిస్తూ జీవించారు.

అదిశక్తిని, ఆ శ్రీలత కల్పవల్లిని ఆదరించమని అనేక విధాల ప్రార్థించారు, ప్రాధేయపడ్డారు. జగదంబ కరుణించి వారి ముందు ప్రత్యక్షమయ్యింది.

చైత్రమాసం, నవమి, భృగువాసరాన దేవతల ఎదుట ఒక మహా తేజస్సు ఆవిర్భవించింది. దానికి నాలుగు వైపులా నాలుగు వేదాలూ స్తుతించాయి. కోటి సూర్య ప్రకాశంగా ఉండి, కోటి చంద్ర ప్రకాశంగా చల్లదనం విరజిమ్ముతోంది. కోటి మెరుపులు ఒక్కసారి మెరిసినట్టుగా అరుణకాంతులను వెదజల్లుతోంది. పైన గానీ ప్రక్కన గానీ మధ్య లో గానీ పల్చబారలేదు. ఆద్యంతాలు లేవు. కరచరణాద్యవయవాలు లేవు. స్ర్తీ రూపం కాదు. పురుషరూపం కాదు. ఉభయమూ కాదు. ఆ దీప్తికి దేవతల కన్నులు మసకబడ్డాయి. కళ్ళు నులుముకుని, ధైర్యం తెచ్చుకుని తేరిపార చూశారు.

అప్పటికి ఆ దివ్య తేజస్సు స్ర్తీ మూర్తిగా రూపు ధరించింది. రాశీభూత సౌందర్యం. తామర మొగ్గలను పరిహసిస్తున్న పీనకుచ ద్వంద్వం. చిరుమువ్వల సవ్వడి చేస్తున్న మొలనులు (మేఖల), మంజీరాలు, బంగారు కేయూరాలు, అంగదాలు, కంఠాభరణాలు, రత్నరాశులు పొదిగిన కంఠపట్టిక. చిన్న మొగలిరేకును ముడుచుకున్న కొప్పు. విశా లమైన కటిప్రదేశం. పొట్టమీద సన్నని నూగారు. కర్పూర తాంబూలంతో ఎరుపెక్కి, సువాస నలు విరజిమ్ముతున్న నోరు.

మెరిసిపోతున్న బంగారు లోలాకులతో తళకులీనుతున్న నున్నని చెక్కిళ్ళు. అష్టమినాటి చంద్రరేఖలాంటి నుదురు. దట్టమైన కనుబొమ్మలు. ఎర్ర కలువల్లాంట నేత్రాలు. కొనదేరిన ఎత్తయిన ముక్కు, మధురాధరం. మల్లె మొగ్గల్లాంటి పలువరుస, మెడలో ముత్యాల దండలు. రత్నకిరీటం, చెవికి అలంకరించుకున్న ఇంద్రరేఖ. జడలో మల్లికామాలతీ పుష్పాల దండ. నుదుట మూడవ కన్నులా ఎర్రని కుంకుమ బొట్టు. పాశాంకుశ వరదాభయహ స్తాలు. ఎర్రని చీరకట్టుకుని దానిమ్మపువ్వు రంగులో ధగధగలాడుతున్న జగన్మాత... సర్వ శృంగారవేషాఢ్య, సర్వదేవనమస్క్టృత, సర్వాశాపూరిక సర్వమత సర్వమోహినీ ప్రసన్నురాలై చిరునవ్వులు చిందిస్తోంది.

దేవతాకృత దేవీస్తుతి...
జగన్మాత రూపం దర్శించిన దేవతలందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ సాష్టాంగపడ్డారు. ఆనందబాష్పాలు అడ్డుపడి చూడలేకపోతు న్నారు. కొంతసేపటికి తేరుకుని మళ్ళీ ధైర్యం కూడగట్టుకుని జగదంబికను స్తుతించారు.

నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః
నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మతామ్‌
తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషూ జుష్టాం
ఓం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే! ఓం సుతరసి తరసే నమః
దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి
సానో మంత్రేషమూర్జం దుహానాం ధేనుర్వాగస్మానుపసుష్టూతైతు
కాళరాత్రీ! బ్రహ్మసుతా! వైష్ణవీ! స్కందజననీ! సరస్వతీ! అదితీ! దక్షదుహితా! పావనా! శివా! నమోనమః, మహాలక్ష్మీ! సర్వశక్తి! నిన్ను తెలు సుకుంటున్నాం, మమ్మల్ని నడిపించు. విరాట్‌స్వరూపిణీ! సూత్రాత్మమూర్తి! అవ్యాకృతరూపిణీ! శ్రీబ్రహ్మమూర్తి! నమోనమః
మహాలక్షై్మచ విద్మహే సర్వశక్యై చ ధీమహి
తన్నో దేవీ ప్రచోదయాత్‌

దేవీ! నిన్ను తెలుసుకుంటే ఈ జగత్తు, ఈ సంసారం అదృశ్యమైపోతుంది. తెలుసుకోక పోతే రజ్జు సర్పభ్రాంతిలాగా ఏడిపిస్తూ ఉంటుంది. చిదేకస్వరూపిణీ! అఖండానంద రూపా! వేదతాత్పర్యభూమికా! పంచకోశా తిక్తా! అవస్తాత్రయసాక్షిణీ! త్వంపదలక్ష్యార్థా! ప్రత్యగాత్మ స్వరూపిణీ! ప్రణవరూపా!హ్రీంకారమూర్తీ! నానామంత్రాత్మికా! కృపాసింధూ! నమోనమః.దేవతలు గద్గద స్వరాలతో చేసిన స్తుతులకు మహాదేవి సంతృప్తి చెందింది. మత్తకోకిల కంఠాన్ని సవరించి... ‘‘నేను భక్తులపాలిటి కల్పవృక్షాన్ని కదా! అడగండి ఏమి కావాలో నేనుండగా మీకు, నా భక్తులకు, దిగులు ఏమిటి? దుఃఖ సంసార సాగరం నుంచి నా భక్తులను ఎప్పుడూ ఉద్ధరిస్తూనే ఉంటాను. ఇది నా ప్రతిజ్ఞ. దేవతలారా! తెలుసుకోండి, ఏమి కావాలో అడగండి’’ అని పలికింది.
వేదాలు తిరిగి మాకు వచ్చేలా అనుగ్రహించమన్నారు.వారందరికీి తన చేతుల్లో వున్న ఆహార పదార్థాలు శాకములు ఇచ్చి వారి ఆకలి తీర్చింది. అనాటి నుండి ‘శతాక్షి’, ‘శాకంబరి’ పేర్లతో విరాజిల్లుతోంది. వేగుల ద్వారా దుర్గముడికి ఈ సమాచారం మొత్తం తెలిసింది. అప్పుడు అతడు సేనా సమేతుడై హిమాలయాలు చేరుకున్నాడు. అక్కడ వున్న రుషులు, దేవతలను బాధించసాగాడు. వారిపై శస్త్రాస్త్రాలను వేసి బాధించాడు. వారు ‘‘మాతా! జననీ! రక్షించు!రక్షించు’’ అని అంటూ ‘శతాక్షి’ని వేడుకున్నారు.

దుర్గముడు దిక్కులు పిక్కటిల్లేలా అరిచాడు. జగజ్జనని ‘భయపడకండని’ వారికి అభయమిచ్చింది. ఒక చక్రమును పైన ప్రయోగించి, అందరికీ గొడుగు అయ్యేలా చేసింది. అప్పుడు దుర్గముడు విడిచిన ఏ బాణమూ వారిమీద పడలేదు, వారిని బాధించలేదు. దుర్గముడికి, దేవికి భీకర సంగ్రామం జరిగింది.సూర్యమండలం బాణాల పంజరంలో మూసినట్లయింది. బాణాల రాపిడివల్ల అగ్ని పుట్టింది. ఆ ప్రాంతం విద్యుల్లతలా మిణుగురు పురుగులు తిరుగుతున్నట్లుగా అయ్యింది. అలా పది రోజులు ఆ సంగ్రామం కొనసాగింది. అందరూ చనిపోయినా దుర్గముడు ఒక్కడే మిగిలాడు. పదకొండవ రోజున దుర్గముడు శతాక్షీిదేవి రథానికి ముందు నిలిచి అస్త్రాలను ప్రయోగించటం మొదలు పెట్టాడు. రెండు జాముల యుద్ధం భయంకరంగా సాగింది.

శతాక్షి తీవ్రమైన పదిహేను అస్త్రాలను తీసింది. రెండు బాణాలతో దుర్గముడి కళ్ళను, నాలుగు శరాలతో గుర్రాలను, ఒక కోలతో జెండాను, వెండితో దుర్గముడి భుజాలను, ఒక శరంతో సారథిని పడగొట్టింది.నిప్పులు కురుస్తున్నట్లు వున్న వాడియైన చూపులతో ఐదు బాణాలను దుర్గమునిపై వేసింది.ఆ ధాటికి తట్టుకోలేక దుర్గముడు తూలి, కూలి రక్తం కక్కుతూ శతాక్షి ముందు పడిపోయాడు. ఆ రాక్షసుని ముందు నిలుచున్న శతాక్షీ దేవి శరీరంలోకి ఆ రాక్షసుని శరీరం నుండి పుట్టిన తేజస్సు కలిసిపోయింది.ఆ రాక్షసుని తేజస్సు అమ్మలో లీనమయ్యింది. పగ, ద్వేషంతో... ఆ పరమేశ్వరి, జగన్మాతను ఎదిరించిన దుర్గముడు ముక్తి పొందాడు.
--------------------------------------

‘‘జగన్మాతా! ముల్లోకాల్లో నీకు తెలియని దంటూ ఏమైనా ఉన్నదా? నువ్వు సర్వజ్ఞవు, సర్వసాక్షివి. తారకాసురుడు మమ్మల్ని రేయిం బవళ్ళు హింసిస్తున్నాడు. శివుడికి వారసుడుగా పుట్టిన పుత్రుడొక్కడే తారకుడిని చంప గలడని బ్రహ్మ దేవుడు చెప్పాడు. మరి ఇప్పుడు ఆ శివుడికి అసలు ఇల్లాలే లేదు. నీకు తెలుసుగదా! ఇంతకన్నా మేము చెప్పగలిగింది ఏమీ లేదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించి మా కు దారి చూపించు. నీ పాదపద్మాలను నిరంతరం ధ్యానించే భక్తులం మేము. ప్రాణ రక్షణ కోసం నిన్ను ప్రార్ధిస్తున్నాం. ఇంతకన్నా మాకు కోరదగినది ఇంకొకటి లేదు’’ అని వేడుకున్నారు.

పార్వతిగా అవతరణ...
‘‘దేవతలారా! భయపడకండి. నా శక్తి త్వరలోనే గౌరిగా హిమ వంతుడి ఇంట జన్మించబోతోంది. ఆ గౌరిని శివుడికి ఇచ్చి వివాహం జరిపిం చండి. హిమగిరీంద్రుడు ఎప్పుడూ మనస్సులో నన్నే ధ్యానిస్తుంటాడు. మీలాగానే నా భక్తుడు. అతడి ఇంట్లో కూతు రుగా జన్మించడం నాకు చాలా ఆనందదా యకం’’ అని పలికింది. జగదీశ్వరి మాటలను హిమవంతుడు విన్నా డు. అనుగ్రహానికి మురిసిపోయాడు. కళ్ళల్లో ఆనందబాష్పాలు. గొంతు జీరవోయింది. ‘‘హే సచ్చిత్‌ స్వరూపిణి! ధన్యోస్మి. అనుగ్రహ విశే షం ఎంతటి మహత్తునైనా కలిగిస్తుంది.

లేక పోతే స్థాణువునూ, జడము నూ అయిన నేనే మిటి, నీకు తండ్రిని కావడ మేమిటి! మరో నూరు జన్మలు ఎత్తితే మాత్రం ఈ భాగ్యం నా కు లభిస్తుందా? నూరు అశ్వ మేధాలు చేసి నా, వేల సంవత్సరాలు తపస్సు చేసినా, ఇంత టి మహావైభవం నాకు దక్కేనా? ఆహా! జగన్మా త నాకు కన్నకూతురు అయ్యిం దంటే ఈ రోజు నుంచి ఈ ప్రపంచంలో నా కీర్తికి తిరు గులేదు.అహో!హిమాలయుడా! ఎంతటి ధన్యుడవు అంటూ అందరూ ప్రశంసలు కురి పిస్తారు. ఏ తల్లి చల్లని కడుపులో బ్రహ్మాండ కోటలున్నాయో ఆ తల్లి నీకు చిట్టి తల్లిగా జన్మి ంచిందని కీర్తిస్తారు. నా తల్లిదండ్రులెవరో ఈ పర్వతరూపంగా నన్ను ఎందుకు నిర్మించారో తెలియదుగానీ ఇటువంటి దేవతలూ మహా తపస్వులూ నివసించడానికి నేను కారణమవు తున్నాను. ఇది చాలు ఈ జన్మకు అని మురిసి పోతున్న నాకు ఎంతటి గొప్పవరం ఇచ్చావు తల్లీ! ధన్యుణ్ణి, ధన్యుణ్ణి, ఇది నా అర్హత కాదు. కేవలం నీ కృప’’ అని మురిసిపోయాడు.

vEndaanta sangrahamunundi::
raasinavaaru::Suneel Kumar KotaVedanta

జయమ౦త్ర౦ - సు౦దర కా౦డ ౪౨(42)వ సర్గ:















జయమ౦త్ర౦ - సు౦దర కా౦డ ౪౨(42)వ సర్గ:

జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబల:!
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత:!!

దాసోహ౦ కోసలే౦ద్రస్య రామస్యాక్లిష్త కర్మణ:!
హనుమాన్ శత్రుసైన్యానా౦ నిహన్తా మారుతాత్మజ:!!

న రావణసహస్ర౦ మే యుధ్ధే ప్రతిబల౦ భవేత్!
శిలాభిస్తు ప్రహరత: పాదపైశ్చ సహస్రశ:!!

అర్ధయిత్వా పురీ౦ ల౦కామ్ అభివాద్య చ మైథిలీమ్!
సమ్రుధ్ధార్థో గమిష్యామి మిషతామ్ సర్వరక్షసామ్!!

శ్రీచక్రం మంగళ శాసనము
























శ్రీచక్రం
మంగళ శాసనము

శ్లో|| శుద్ధ స్ఫటిక సంకాశం సచ్చిదానంద విగ్రహమ్
దాతారం సర్వ కామానాం కామేశ్వరముపాస్మహే||
శ్లో|| కామేశ్వరీం పరామీడే కాదిహాది స్వరూపిణీం
మాతృకా వర్ణ లిప్తాంగీం మహా శ్రీచక్రమధ్యగాం||

శ్రీ కళ్యాణానంద భారతీ పురస్కార గ్రహీత, శ్రీవిద్యారత్నాకర,
బ్రహ్మశ్రీ నోరి సుబ్రహ్మణ్యశాస్త్రి గురువు గారి సహకారంతో.


శ్రీ చక్రం గురించి మరియు, మానవ శరీరంలో శ్రీచక్రం గురించి
౧] త్రైలోక్యమోహన చక్రము
ప్రథమావరణము, భూపురములు - శరీరంలో మూలాధారము

౨] సర్వాశాపరిపూరక చక్రము
ద్వితీయావరణము, షోడశదళాలు - శరీరంలో- స్వాధిష్టానం -లింగస్థానం

౩] సర్వసంక్షోభణ చక్రము
తృతీయావరణము, అష్టదళం - శరీరంలో మణిపూరం నాభిస్థానం

౪] సర్వసౌభాగ్యదాయక చక్రము
చతుర్థావరణము, మన్వస్రం - శరీరంలో అనాహతం - హృదయం

౫] సర్వార్ధసాధక చక్రము
పంచామావరణము, బహిర్దశారం [దశకోణం] శరీరంలో - విశుద్ధి - కంఠం

౬] సర్వ రక్షాకర చక్రము
షడావరణము, అంతర్దశారం [దశకోణం] శరీరంలో - ఆజ్ఞాచక్రం - భ్రుకుటి


౭] సర్వరోగహర చక్రము


సప్తమావరణము, అష్టకోణం - శరీరంలో - లలాటం


౮] సర్వసిద్ధిప్రద చక్రము
అష్టమావరణము, త్రికోణము - శరీరంలో - పాపిటి

౯] సర్వానందమయ చక్రము

నవమావరణము, బిందువు - శరీరంలో - సహస్రారం - బ్రహ్మరంధ్రం

శివ సందర్శన విధి:(బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు)
























శివ సందర్శన విధి:(బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు)

సాధారణ దేవాలయాల్లో మనం దర్శనం చెసుకునే విధానం,శివాలయంలో విధానం వేరు వేరుగా ఉంటుంది. అందుకే,శివాలయం దర్శిస్తే అందరు దేవుళ్ళని దర్సించినట్లే అని చెప్పబడింది.
శివాలయంలో ఉండే శివలింగానికి మొత్తం 5 ముఖాలు ఉంటాయి. అందులో నాలుగు ముఖాలు, నాలుగు దిక్కులని చూస్తుంటే, ఐదవ ముఖం ఊర్ద్వముఖమై (పైకి చూస్తు/ఆకాశం వైపు చూస్తూ) ఉంటుంది.
5 ముఖాలకి, 5 పేర్లు నిర్దేశించబడ్డాయి. అందుకే శివాలయంలో ఏ దిక్కున కూర్చొని అయినా,పూజ చేయోచ్చు అంటారు.
శివాలయాలు అన్నింటిలో అత్యంత మహిమ కలిగినది, కోరిన కోర్కెలు వెంటనే తీర్చేది, పశ్చిమాభి ముఖమైన శివాలయం. అంటే, మీరు,గుడిలోకి వెల్లగానే, శివలింగం పశ్చిమం వైపు చూస్థూ ఉంటుంది.. అలా శివలింగంకి ఎదురుగా ఉన్న ద్వారం పశ్చిమం వైపు ఉన్నా, లేదా, శివలింగం పశ్చిమం వైపు చూస్తున్నా, దానిని, సద్యోజాతజాత శివలింగం అని అంటారు.
అప్పుడు మనం తప్పకుండా,అటువంటి శివలింగాన్ని చూసినప్పుడు, ఓం సద్యోజాత ముఖాయ నమః అని అనాలి.శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో ఉన్న శివలింగం, సద్యోజాత శివలింగం.
శివలింగం, తూర్పు వైపుకు చూస్తూ ఉంటే, అటువంటి శివలింగాన్ని, తత్పురుష ముఖం అని అంటారు. తత్పురుష ముఖం అనేది మనల్ని తిరోదానాన్ని చేస్తూ ఉంటుంది.. తిరోదానము అంటే చీకటిలో ఉంచటం. అది, మనల్ని మాయ చేత కప్పబడిస్తూ చీకటిలో ఉంచుతూ ఉంటుంది..
ఆ మాయ కమ్మి ఉండడం చేతనే మనం అన్ని రకాల పాపాలు చేస్తూ ఉంటాం.. ఆ మాయని కప్పి ఉంచే ముఖమే ఆ సద్యోజాత ముఖం.
సద్యోజాత ముఖం పూజించ తగినదే,ఏ మాత్రం అనుమానం లేదు.. మనల్ని రక్షించినా,శిక్షించినా, అన్ని ఆ పరమేశ్వరుడేగా.

తూర్పుని చూస్తూ ఉండె శివలింగం, వాయువు (గాలి) మీద అదిష్టానం కలిగి ఉంటాడు.. ...

మనకు ప్రతీ శివాలయంలోనూ ఈ 5 ముఖాలు ఉంటాయి.. శైవాగమనంలో చెప్పినట్లుగా, మనం తప్పకుండా, శివాలయంలో, ఏ దిక్కు వైపు వెలితే,ఆ శివలింగం పేరుని స్మరించాలి.

ముఖాలు, మనకు 5 ఫలితాలని కలుగచేస్తాయి. ఆ 5 ముఖాలలో నుండే, స్ర్రుష్టి, స్థితి, లయ,తిరోదానము,అనుగ్రహము(మొక్షము) ఇవ్వబడతాయి.. అన్ని ముఖాలు,పూజనీయమైనవే.. అన్ని ముఖాలని మనం పుజించి తీరాల్సిందే.శివలింగం, దక్షిణం వైపు చూస్తూ ఉంటే, అటువంటి ముఖం, దక్షిణామూర్తి స్వరూపం. మనకు, శివాలయంలో, దక్షిణం ని చూస్తూ తప్పకుండా దక్షిణామూర్తి ఉంది తీరాలి. అసలు, దక్షిణామూర్తి విగ్రహం లేకుండా, శివాలయాలు కట్టకూడదు.
శివలింగం, దక్షిణానికి చూసే ముఖాన్ని, దక్షిణామూర్తి స్వరూపంగా, చూడమని చెప్తారు. ఆ ముఖాన్నే, అఘోర ముఖం అంటారు. ఈ అఘోర ముఖం , అగ్నిహోత్రానికి అంతటికీ, అధిష్టానం అయ్యి ఉంటుందిఈ సమస్త ప్రపంచాన్ని,లయం చేసే స్వరూపమే,ఈ అఘోర ముఖం. ఈ అఘోర ముఖమే, సమస్త ప్రపంచాన్ని లయం చేసి,మళ్ళీ,మనకు జన్మను ఇస్తూ ఉంటారు. మనకు మృత్యువు పట్ల,భయం పొగొట్టేది,మనకి ఙ్ఞానం ఇచ్చేది ఇదే.
మీరు జాగ్రత్తగా గమనిస్తే, చిన్న పిల్లలకు చదువు దగ్గర నుండి,సంపద(ధనము) దగ్గర నుండి, పెద్దలకు మొక్షము వరకు, దక్షిణా మూర్తి ఇవ్వలేని సంపద,విద్య లేనేలేదు. చదువుకు, సంపదకు, మొక్షముకి అదిష్టానం అయి ఉంటాడు.

ప్రతీరోజూ, ఒక్క 2 నిమిషాలు దక్షిణామూర్తిని ద్యానం చేస్తే, మొక్షము కరతళామలకము. వారి,అంత్యమునందు, సాక్షాత్తు, ఈశ్వరుడే, గుర్తుపెట్టుకొని, మొక్షముని ప్రసాదిస్తాడు.

ద్యానం చేయటానికి అత్యంత మంగళకరమైన స్వరూపం, అందమైన స్వరూపం, శాంతమైన స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం.
ఉత్తరం వైపు చూసే ముఖంని, "వామదేవ" ముఖం అని అంటారు.

ఇప్పటిదాక, 4 దిక్కులని చూస్తున్న, 4ముఖాల గురుంచి తెలుసుకోగలిగాం కదా!..

ఇక చివరి ముఖం, శివలింగం పైన (అంటే, ఆకాశం వైపు చూస్తూ ఉండే ముఖం) ఉండే ముఖం, ఆ ముఖంని "ఈశాన ముఖం" అంటారు. మనం, లింగం పైన చూసి, ఓం ఈశాన ముఖాయ నమః. అని అనాలి.

ఈశాన ముఖ దర్సనం, మనం మిగిలిన 4 ముఖాలని దర్సించిన తర్వతనే దర్సించాలి.. అప్పుడే విశిష్ట ఫలితం అని చెప్పబడింది. మనకు కాశీలో ఉండే ముఖం, అఘోర ముఖం. కాశీలో శివలింగం ఉత్తరం వైపు కూర్చొని, దక్షిణం వైపు చూస్తూ ఉంటుంది.
ఉత్తరం వైపు చూసే "వామదేవ ముఖం" నీటి మీద అధిష్టానం అయి ఉంటుంది. ఈ వామదేవ ముఖమే మనకు సమస్త మంగళమును ఇచ్చే ముఖం.

వామదేవ ముఖం అంటే ఎమిటి అనేది మనకు శివపురణంలో చెప్పబడింది. యదార్ధమునకు అదే విష్ణు స్వరూపం. అందుకే, విష్ణువు శివుడు ఒకరే.. రెండు లేనే లేవు...

శివపురణంలో రాస్తే ఎలా నమ్మాలి అని ఎవరికి సంసయం ఉంటే, ఒకటి గమనించండి.

శివఫురణం ని రాసినది, వేదవ్యాసుడు.. వ్యాసుడే విష్ణువు. విష్ణువే వ్యాసుడు. వ్యాసాయ విష్ణు రూపాయ,వ్యాస రూపాయ విష్ణవే, నమో వైబ్రహ్మ నిధయే వాశిష్టాయ నమో నమః ఉన్న పరమాత్మ ఒక్కడే.. రెండు కాదు.. చాలా మంది, వేరుగా చూస్తూ,పొరపడుతున్నారు..

క్రిష్ణ అని పిలిచినా నేనే పలుకుతాను. మూర్తి అని పిలిచినా నేనే పలుకుతాను.

ఈ వామదేవ ముఖం ని, ఓం వామదేవాయ నమః అని అంటే, మనకు అనారోగ్యం కలగకుండా,చూస్తాడు...

అంతే కాక, ఈ వామదేవ ముఖంని ఓం వామదేవాయ నమః అని అంటే,మనకు 3 ఫలితాలని కూడ ఇస్తుంది..అవి, 1) మీ దగ్గర ఏదైతో ఉందో, అది మీ చేయి జారి పోకుండ,మీతోనే ఉంచుతాడు. ఉదా: మీ దగ్గర ఒక కోటి రూపాయలు ఉన్నాయి (లేదా) ఒక మంచి ఉద్యోగంలో ఉన్నారు, ఎటువంటి కారణము చేతనూ,మీరు అవి కోల్పోకుండా కాపాడుతూ ఉంటాడు. 2) మనకు ఉత్తరోత్తరాభివృద్ధిని అయనే ఇస్తారు. ఉదా: అంటే, ఉన్న కోటిని, ద్ధర్మబద్దంగా, 2కోట్లు చేస్తారు. (edo saradagaa,meeku ardam kaavali ani alaa 2kotlu annanu,thappuga anukokandi.. )3) మనకు ఉన్నదానిని అనుభవించే ఆరోగ్యమ్ని ప్రసాదిస్తాడు. ఉదా: ఇప్పుడు, తీపి పదార్దాలని కొనగలిగే శక్తి ఉండి, తినలేని స్దితిలో (షుగర్ ఉందనుకోండి.) ఉంటే, అప్పుడు, ఉన్న దానిని అనుభవించటం అని అనరు కదా. అటువంటి స్థితి కలుగకుండ కాపడతాడు.

తదుపరి,ఈశాన ముఖము. శివాలయలో లింగ దర్శనం అయ్యాక, ఒక్కసారి, పైకి చూసి, ఓం ఈశాన ముఖాయ నమః అని అనాలి. ఆ ఈశాన ముఖమే మనకు మొక్షాన్ని ప్రసాదించేది. ఈ ఈశాన ముఖం ఆకాశంకి అధిష్టానం అయ్యి ఉంటుంది.
శివలయంలో మనకు బలిపీఠం అని ఉంటుంది. అక్కడికి ప్రదక్షిణంగా వెల్లినప్పుడు, మనలో ఉండే, అరిషట్ వర్గాలని మనం అక్కడ బలి ఇస్తున్నట్లుగా సంకల్పం చేసుకోని ముందుకు సాగాలి.

శివాలయలో పురుషులకి, ప్రత్యేకమైన వస్త్రధారణ నిర్దేసించబడింది. పురుషులు కేవలం పంచ మాత్రమే ధరించి, పైన ఉండే ఉత్తర్యం ని, నడుముకు కట్టుకొని మాత్రమే ప్రదక్షిణలు చేయాలి. అలా ఎవరైతే చేస్తారో, వారి పట్ల పరమశివుడు అత్యంత ప్రసన్నమవుతాడు. ముందుగా చెప్పినట్లు, పదఘట్టన వినపడకూడదు జాగ్రత్త.

మీరు శివాలయంలో, ఎట్టి పరిస్థితులలోను, విభూధిని కాని, బిల్వ పత్రాలనికాని, కుంకుమ కాని,ప్రసాదం కాని ఎట్టి పరిస్థితులలోను, నందీశ్వరుడి మీద పెట్టరాదు. సాధారణంగా, చాలా మంది, నంది మీద విభూధిని, బిల్వ ఆకులని వేస్తూ ఉంటారు. అది చాలా మహా పాపంగా పరిగణించబడింది. వీలైతే, అందరూ, శివరాత్రి రోజు, శివమహిమ్నా స్తోత్రం చదవండి.. శివస్తొత్రాలు అన్నింటిలోకి, చాలా ప్రాముఖ్యమైనది "శివమహిమ్నా స్తోత్రం"

సూర్య స్తుతి - కాశీ ఖండం - నవమోధ్యాయం

















సూర్య స్తుతి - కాశీ ఖండం - నవమోధ్యాయం.

ఈ 70 నామములను ఉచ్చరించుచూ, సూర్య భగవానుని చూస్తూ, మోకాళ్ళపై నిలబడి, రెండు చేతులతో రాగి పాత్రను పట్టుకొని, ఆ పాత్రను నీటితో నింపి, గన్నేరు మున్నగు ఎర్రని పూలు, ఎర్ర చందనము, దూర్వారాన్కురములు, అక్షతలు ఉంచి, ఆ పాత్రను తన నొసటికి ఎదురుగా ఉంచుకొని, సూర్య భగవానునకు అర్ఘ్యము నొసంగిన వారు దరిద్రులు కారు, దుఃఖము లను పొందరు, భయంకర వ్యాధుల నుండి విముక్తిని పొందెదరు, మరణానంతరము సూర్య లోకమున నివసింతురు.

౧. ఓం హంసాయ నమః
౨. ఓం భానవే నమః
౩.ఓం సహశ్రాంశవే నమః
౪.ఓం తపనాయ నమః
౫.ఓం తాపనాయ నమః
౬.ఓం రవయే నమః
౭.ఓం వికర్తనాయ నమః
౮.ఓం వివస్వతే నమః
౯. ఓం విశ్వ కర్మణే నమః
౧౦. ఓం విభావసవే నమః
౧౧. ఓం విశ్వ రూపాయ నమః
౧౨. ఓం విశ్వ కర్త్రే నమః
౧౩. ఓం మార్తాండాయ నమః
౧౪. ఓం మిహిరాయ నమః
౧౫. ఓం అంశు మతే నమః
౧౬. ఓం ఆదిత్యాయ నమః
౧౭. ఓం ఉష్ణగవే నమః
౧౮. ఓం సూర్యాయ నమః
౧౯. ఓం ఆర్యంణే నమః
౨౦. ఓం బ్రద్నాయ నమః
౨౧. ఓం దివాకరాయ నమః
౨౨. ఓం ద్వాదశాత్మనే నమః
౨౩. ఓం సప్తహయాయ నమః
౨౪. ఓం భాస్కరాయ నమః
౨౫. ఓం అహస్కరాయ నమః
౨౬. ఓం ఖగాయ నమః
౨౭. ఓం సూరాయ నమః
౨౮. ఓం ప్రభాకరాయ నమః
౨౯. ఓం లోక చక్షుషే నమః
౩౦. ఓం గ్రహేస్వరాయ నమః
౩౧. ఓం త్రిలోకేశాయ నమః
౩౨. ఓం లోక సాక్షిణే నమః
౩౩. ఓం తమోరయే నమః
౩౪. ఓం శాశ్వతాయ నమః
౩౫. ఓం శుచయే నమః
౩౬. ఓం గభస్తి హస్తాయ నమః
౩౭. ఓం తీవ్రాంశయే నమః
౩౮. ఓం తరణయే నమః
౩౯. ఓం సుమహసే నమః
౪౦. ఓం అరణయే నమః
౪౧. ఓం ద్యుమణయే నమః
౪౨. ఓం హరిదశ్వాయ నమః
౪౩. ఓం అర్కాయ నమః
౪౪. ఓం భానుమతే నమః
౪౫. ఓం భయ నాశనాయ నమః
౪౬. ఓం చందోశ్వాయ నమః
౪౭. ఓం వేద వేద్యాయ నమః
౪౮. ఓం భాస్వతే నమః
౪౯. ఓం పూష్ణే నమః
౫౦. ఓం వృషా కపయే నమః
౫౧. ఓం ఏక చక్ర ధరాయ నమః
౫౨. ఓం మిత్రాయ నమః
౫౩. ఓం మందేహారయే నమః
౫౪. ఓం తమిస్రఘ్నే నమః
౫౫. ఓం దైత్యఘ్నే నమః
౫౬. ఓం పాప హర్త్రే నమః
౫౭. ఓం ధర్మాయ నమః
౫౮. ఓం ధర్మ ప్రకాశకాయ నమః
౫౯. ఓం హేలికాయ నమః
౬౦. ఓం చిత్ర భానవే నమః
౬౧. ఓం కలిఘ్నాయ నమః
౬౨. ఓం తాక్ష్య వాహనాయ నమః
౬౩. ఓం దిక్పతయే నమః
౬౪. ఓం పద్మినీ నాధాయ నమః
౬౫. ఓం కుశేశయ నమః
౬౬. ఓం హరయే నమః
౬౭. ఓం ఘర్మ రశ్మయే నమః
౬౮. ఓం దుర్నిరీక్ష్యాయ నమః
౬౯. ఓం చండాశవే నమః
౭౦. ఓం కశ్యపాత్మజాయ నమః

Monday, August 20, 2012

శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం చదవాల్సిన మంత్రాలు!
























శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం చదవాల్సిన మంత్రాలు!

లక్ష్మీ ఉపాసన అనే గ్రంథంలో ఏయే రాశులలో పుట్టిన జాతకులు లక్ష్మీ కటాక్షం కోసం,
ఏ మంత్ర జం చేయాలన్న విషయం వివరింపబడింది.

శ్రీ మహాలక్ష్మిదేవి అనుగ్రహసిద్ధి కోసం ఆయా రాశులలో పుట్టినవారు చేయాల్సిన మంత్ర జపం నిర్దేశింపబడింది.
కొందరికి తమ జన్మరాశి తెలియక పోవచ్చు.
వారి సౌకర్యార్థం, వారి పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి కూడా ఏ విధమైన మంత్రజపం చేసుకోవచ్చునన్న విషయం సూచించబడింది.
గురుముఖతః ఉపదేశం పొందిన మంత్రాలు వెంటనే ఫలితాలను చూపిస్తే, భక్తి శ్రద్ధలతో చేసే మంత్రజపం తప్పక మంచి ఫలితాలనిస్తుంది.


మన రాశికి, లేక మన పేరుకు అనువైన మంత్రాన్ని జపిస్తే, తప్పక ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులవుతాం.
అందుచేత రాశిని బట్టి ఈ క్రింది మంత్రాలను జపించే వారికి అష్టైశ్వర్యాలు,
సుఖసంతోషాలు చేకూరుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

రాశి – పేరులో మొదటి అక్షరం – మంత్రం

మేషం------చూ,చే,చో,లా,లీ,లూ,లె,లో,అ- ఓం ఏం క్లీం సోః
వృషభం-----ఇ,ఉ,ఎ,ఓ,వా,వి,వూ,వె,వో- ఓం ఏం క్లీం శ్రీః
మిథునం-----కా,కీ,కూ,ఘ,చ,కె,కోహా -ఓం క్లీం ఏం సోః
కర్కాటకం----హీ,హో,హె,డా,డీ,డూ,డె,డో -ఓం ఏం క్లీం శ్రీః
సింహం-----మా,మీ, మూ,మె,మో,టా,టి,టూ,టె- ఓం హ్రీం ఏం సోః
కన్య-------టో,పా,పీ,పూ,ప,ణ,ఠ,పె,పో- ఓం శ్రీం ఏం సోః
తుల-------రా,రీ,రూ,రె,రో,తా,తీ,తూ,తె- ఓం హ్రీం క్లీం శ్రీం:
వృశ్చికం-----తో,నా,నీ,నూ,నె,నో,యా,యీ,యూ- ఓం ఏం క్లీం సోః
ధనుస్సు----యె,యో,భా,భీ,భూ,ధా,ఫా,ఢా,భె – ఓం హ్రీం క్లీం సోః
మకరం-----భో,జా,జీ,ఖీ,ఖూ,ఖె,ఖో,గా,గీ- ఓం ఏం క్లీం హ్రీం శ్రీం సోః
కుంభం-----గూ,గె,గో,సా,సీ,సూ,సె,సో,దా- ఓం హ్రీం ఏం క్లీం శ్రీం
మీనం------దీ,దూ,ధ,ఝ,దె,దో,చా,చీ- ఓం హ్రీం క్లీం సోః


ఈ మంత్రాలు బీజాక్షర సమన్వితాలు. అందుచేత మహాలక్ష్మీదేవి పరిపూర్ణ కటాక్షం కోసం ఈ మంత్రాలను పఠించాలి.
ఇంకా మంత్రాలను త్రిసంధ్యలలో పఠిస్తే, ధ్యానమావాహనాది షోడశోపచారపూజలు చేసిన ఫలితం కలుగుతుంది.

Thursday, August 2, 2012

శ్రావణ పూర్ణిమ విశిష్టత















శ్రీ మహావరలక్ష్మీ వ్రతాలు, పౌర్ణమి పూజలు, స్త్రీల పేరంటాల సందడి, మధ్య మధ్య వానజల్లులు యిలా ఎంతో కోలాహలంగా వుంటుంది శ్రావణమాసం.ఈ మాసంలో వచ్చే పౌర్ణమికి మరింత ప్రాముఖ్యం వుంది. దీన్నే కజరి పూర్ణిమ, నారియల్పౌర్ణమి, శ్రావణపౌర్ణమి, రుషి తర్పణం,రాఖీ పున్నమి అంట
శ్రావణమాస వైశిష్ట్యం ఎంతో గొప్పది. ఎందరికో ఆనందాన్నిచ్చేది. మంగళగౌరి, శ్రీ మహావరలక్ష్మీ వ్రతాలు, పౌర్ణమి పూజలు, స్త్రీల పేరంటాల సందడి, మధ్య మధ్య వానజల్లులు యిలా ఎంతో కోలాహలంగా వుంటుంది శ్రావణమాసం. ఈ మాసంలో వచ్చే పౌర్ణమికి మరింత ప్రాముఖ్యం వుంది. ఈ పున్నమిని భారతదేశ వివిధ ప్రాంతాల ప్రజలు రకరకాలుగా జరుపుకుంటారు.

శ్రావణంలో అధికంగా వానలు కురుస్తూ, ప్రకృతి కొత్త అందాలతో, పచ్చని పైరు పంటలతో ఆహ్లాదకరంగా వుంటుంది. రైతన్నలపాలిట వరం ఈ శ్రావణ వున్నమి. పంటలు బాగా పండాలని, సిరులు నిండాలని పుడమి తల్లికి పూజచేసి నార్లు నాటే సమయం ఇది. దీన్నే కజరి పూర్ణిమ అంటారు.




చేపలు పట్టేవారికి, వ్యాపారం చేసుకునేవారికి అనువైన కాలం. సముద్ర తీరప్రజలు ఇంద్రుణ్ణి, వరుణుడిని పూజిస్తారు. ఈ సమయంలో సముద్రం ప్రశాంతంగా ఉంటుంది. చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్లేరోజులు. తమని కాపాడమని, అధికంగా జలపుష్పాలు లభించాలనికోరుతూ ఆ దేవతలని పూజిస్తారు. ఈ పౌర్ణమినే కొన్ని ప్రాంతాల్లో "నారియల్పౌర్ణమి" అంటారు.

నారియల్ అంటే కొబ్బరికాయ. కొబ్బరికాయలని సముద్రంలో విసిరివేయడం ద్వారా తమ భక్తిని చాటుకుంటారు. ఇలా చేయడానికి రామాయణంలోని కథ ప్రచారంలో వుంది. శ్రీరాముడు లంకలో వున్న సీతని రావణాసురుని చెర నుంచి విడిపించడానికి వానరసేన సహాయం కోరినపుడు, వానరులు బండరాళ్లని సముద్రంలోకి విసిరి "సేతుబంధనం" నిర్మిస్తారు. రాముడు ఆ వారథిమీదుగా లంకని చేరుకుని సీతను రక్షించాడు అని రామాయణ కథ చెప్తూ కొబ్బరికాయని సముద్రంలోకి విసిరివేస్తూ వుంటారు. అంతేకాదు కొబ్బరికాయని మూడు కన్నులుగల శివునిగా భావిస్తారు. ఇది దక్షిణ భారతదేశంలో తీరవాసులు పాటిస్తారు.

"శ్రావణపౌర్ణమి"నే జంథ్యాల పౌర్ణమిగా బ్రాహ్మణులు పండుగ చేసుకుంటారు. కొన్ని చోట్ల రుషి తర్పణం అని కూడా పిలుస్తారు. ఆ రోజున గాయత్రీ మంత్రం జపిస్తూ, వేదమంత్రాల మధ్య పాత యజ్ఞోపవీతం తీసివేసి కొత్తది ధరిస్తారు. ఈ జంథ్యాల పౌర్ణమి భారతీయ సంస్కృతికి చిహ్నం. యజ్ఞోపవీతధారణ అనంతరం కొబ్బరితో చేసిన స్వీట్లు అందరికీ పంచుతారు. "జంథ్యం" వేసుకునే ప్రతి వ్యక్తి దీన్ని పాటిస్తాడు.

రాఖీ పున్నమిగా పేరొందిన ఈ పౌర్ణమినాడు భారతీయులంతా ఆనందోత్సాహాలతో పండగ జరుపుకుంటారు. ఇంటి ఆడపడుచులు తన సోదరుల నుంచి ఆత్మీయానురాగాలను, అనుబంధాలను, రక్షను కోరుతూ రాఖీ కడతారు.

రాకీలతోపాటు పూజాథాలీ( పూజ పళ్ళాలు) అలంకరణ కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది.

ఏదో బద్దో బలీరాజా దానవేంద్రో మహాబలా:తేనత్వం అనుబంధామి రక్షమాంచమాంచలం:

అంటూ బలిచక్రవర్తి రక్షకోరిన సోదరిని రక్షిస్తూ ఎలాంటి ఆటంకాలెదురైనా తడబడక ధైర్యంతో ఎదురొడ్డి నిలిచినవాడు. అటువంటి మహావీరునితో తన అన్నని పోలుస్తూ తనకి రక్షణ నివ్వమని కోరుతుంది. ఈ రాఖీ కట్టిన సోదరికి తగిన బహుమానం ఇస్తూ ఆశీర్వధిస్తాడు అన్న. రాఖీ పౌర్ణమి, శ్రావణ పున్నమిరోజును యిలా ఎన్నోరకాలుగా దేశమంతా ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. దేవతారాధనలు, ప్రకృతి దేవతారాధనలు, ఆత్మీయతానురాగబంధాలు... సకల పూజారాధనలు అందుకునే రోజు ఈ శ్రావణ పౌర్ణమి.