Monday, October 5, 2009

దుర్గా ఆపదుద్ధారాష్టకమ్

1:నమస్తే శరణ్యే శివే సానుకమ్పే నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే
నమస్తే జగద్వన్ద్యపాదారవిన్దే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే

2:నమస్తే జగచ్చిన్త్యమానస్వరూపే నమస్తే మహాయోగివిఙ్యానరూపే
నమస్తే నమస్తే సదానన్ద రూపే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే

3:అనాథస్య దీనస్య తృష్ణాతురస్య భయార్తస్య భీతస్య బద్ధస్య జన్తోః
త్వమేకా గతిర్దేవి నిస్తారకర్త్రీ నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే

4:అరణ్యే రణే దారుణే శుత్రుమధ్యే జలే సఙ్కటే రాజగ్రేహే ప్రవాతే
త్వమేకా గతిర్దేవి నిస్తార హేతుర్నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే

5:అపారే మహదుస్తరేఽత్యన్తఘోరే విపత్ సాగరే మజ్జతాం దేహభాజామ్
త్వమేకా గతిర్దేవి నిస్తారనౌకా నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే

6:నమశ్చణ్డికే చణ్డోర్దణ్డలీలాసముత్ఖణ్డితా ఖణ్డలాశేషశత్రోః
త్వమేకా గతిర్విఘ్నసన్దోహహర్త్రీ నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే

7:త్వమేకా సదారాధితా సత్యవాదిన్యనేకాఖిలా క్రోధనా క్రోధనిష్ఠా
ఇడా పిఙ్గలా త్వం సుషుమ్నా చ నాడీ నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే

8:నమో దేవి దుర్గే శివే భీమనాదే సదాసర్వసిద్ధిప్రదాతృస్వరూపే
విభూతిః సతాం కాలరాత్రిస్వరూపే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే

9:శరణమసి సురాణాం సిద్ధవిద్యాధరాణాం మునిదనుజవరాణాం వ్యాధిభిః పీడితానామ్
నృపతిగృహగతానాం దస్యుభిస్త్రాసితానాం త్వమసి శరణమేకా దేవి దుర్గే ప్రసీద

:::::ఇతి సిద్ధేశ్వరతన్త్రే హరగౌరీసంవాదే ఆపదుద్ధారాష్టకస్తోత్రం సంపూర్ణం :::::

దుర్గా దుర్గార్తి శమనీ దుర్గాపద్వినివారిణీ|
దుర్గామచ్ఛేదినీ దుర్గ సాధినీ దుర్గ నాశినీ 
దుర్గ మఙ్ఞానదా దుర్గదైత్యలోకదవానలా
దుర్గమా దుర్గమాలోకా దుర్గమాత్మస్వరూపిణీ
దుర్గమార్గప్రదా దుర్గమవిద్యా దుర్గమాశ్రితా
దుర్గమఙ్ఞానసంస్థానా దుర్గమధ్యానభాసినీ
దుర్గమోహా దుర్గమగా దుర్గమార్థస్వరూపిణీ
దుర్గమాసురసంహంత్రీ దుర్గమాయుధధారిణీ 
దుర్గమాంగీ దుర్గమాతా దుర్గమ్యా దుర్గమేశ్వరీ
దుర్గభీమా దుర్గభామా దుర్లభా దుర్గధారిణీ
నామావళీ మమాయాస్తూ దుర్గయా మమ మానసః
పఠేత్ సర్వ భయాన్ముక్తో భవిష్యతి న సంశయః

దుర్గామానస పూజా
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
::: ఓమ్ శ్రీ గణేశాయ నమః :::
1:ఉద్యచ్చన్దనకుఙ్కుమారుణపయోధారాభిరాప్లావితాం
నానానర్ఘ్యమణిప్రవాలఘటితాం దత్తాం గృహాణామ్బికే
ఆమృష్టాం సురసున్దరీభిరభితో హస్తామ్బుజైర్భక్తితో
మాతః సున్దరి భక్తకల్పలతికే శ్రీపాదుకామాదరాత్

2:దేవేన్ద్రాదిభిరర్చితం సురగణైరాదాయ సింహాసనం
చఞ్చత్కాఞ్చనసఞ్చయాభిరచితం చారుప్రభాభాస్వరమ్
ఏతచ్చమ్పకకేతకీపరిమలం తైలం మహానిర్మలం
గన్ధోద్వర్తనమాదరేణ తరుణీదత్తం గృహాణామ్బికే

3:పశ్చాద్దేవి గృహాణ శమ్భుగృహిణి శ్రీసున్దరి ప్రాయశో
గన్ధద్రవ్యసమూహనిర్భరతరం ధాత్రీఫలం నిర్మలమ్
తత్కేశాన్ పరిశోధ్య కఙ్కతికయా మన్దాకినీస్రోతసి
స్నాత్వా ప్రోజ్జ్వలగన్ధకం భవతు హే శ్రీసున్దరి త్వన్ముదే

4:సురాధిపతికామినీకరసరోజనాలీధృతాం
సచన్దనసకుఙ్కుమాగురుభరేణ విభ్రాజితామ్
మహాపరిమలోజ్జ్వలాం సరసశుద్ధకస్తూరికాం
గృహాణ వరదాయిని త్రిపురసున్దరి శ్రీప్రదే

5:గన్ధర్వామరకిన్నరప్రియతమాసన్తానహస్తామ్బుజ
ప్రస్తారైర్ధ్రియమాణముత్తమతరం కాశ్మీరజాపిఞ్జరమ్
మాతర్భాస్వరభానుమణ్డలలసత్కాన్తిప్రదానోజ్జ్వలం
చైతన్నిర్మలమాతనోతు వసనం శ్రీసున్దరి త్వన్ముదమ్

6:స్వర్ణాకల్పితకుణ్డలే శ్రుతియుగే హస్తామ్బుజే ముద్రికా
మధ్యే సారసనా నితమ్బఫలకే మఞ్జీరమంఘ్రిద్వయే
హారో వక్షసి కఙ్కణౌ క్వణరణత్కారౌ కరద్వన్ద్వకే
విన్యస్తం ముకుటం శిరస్యనుదినం దత్తోన్మదం స్తూయతామ్

7:గ్రీవాయాం ధృతకాన్తికాన్తపటలం గ్రైవేయకం సున్దరం
సిన్దూరం విలసల్లలాటఫలకే సౌన్దర్యముద్రాధరమ్
రాజత్కజ్జలముజ్జ్వలోత్పలదలశ్రీమోచనే లోచనే
తద్దివ్యౌషధినిర్మితం రచయతు శ్రీశామ్భవి శ్రీప్రదే

అమన్దతరమన్దరోన్మథితదుగ్ధసిన్ధూద్భవం
నిశాకరకరోపమం త్రిపురసున్దరి శ్రీప్రదే
గృహాణ ముఖమీక్షతుం ముకురబిమ్బమావిద్రుమై
ర్వినిర్మితమధచ్ఛిదే రతికరామ్బుజస్థాయినమ్

8:కస్తూరీద్రవచన్దనాగురుసుధాధారాభిరాప్లావితం
చఞ్చచ్చమ్పకపాటలాదిసురభిర్ద్రవ్యైః సుగన్ధీకృతమ్
దేవస్త్రీగణమస్తకస్థితమహారత్నాదికుమ్భవ్రజై
రమ్భఃశామ్భవి సమ్భ్రమేణ విమలం దత్తం గృహాణామ్బికే

9:కహ్లారోత్పలనాగకేసరసరోజాఖ్యావలీమాలతీ
మల్లీకైరవకేతకాదికుసుమై రక్తాశ్వమారాదిభిః
పుష్పైర్మాల్యభరేణ వై సురభిణా నానారసస్రోతసా
తామ్రామ్భోజనివాసినీం భగవతీం శ్రీచణ్డికాం పూజయే

10:మాంసీగుగ్గులచన్దనాగురురజః కర్పూరశైలేయజై
ర్మాధ్వీకైః సహకుఙ్కుమైః సురచితైః సర్పిభిరామిశ్రితైః
సౌరభ్యస్థితిమన్దిరే మణిమయే పాత్రే భవేత్ ప్రీతయే
ధూపోఽయం సురకామినీవిరచితః శ్రీచణ్డికే త్వన్ముదే

11:ఘృతద్రవపరిస్ఫురద్రుచిరరత్నయష్ట్యాన్వితో
మహాతిమిరనాశనః సురనితమ్బినీనిర్మితః
సువర్ణచషకస్థితః సఘనసారవర్త్యాన్విత
స్తవ త్రిపురసున్దరి స్ఫురతి దేవి దీపో ముదే

12:జాతీసౌరభనిర్భరం రుచికరం శాల్యోదనం నిర్మలం
యుక్తం హిఙ్గుమరీచజీరసురభిర్ద్రవ్యాన్వితైర్వ్యఞ్జనైః
పక్వాన్నేన సపాయసేన మధునా దధ్యాజ్యసమ్మిశ్రితం
నైవేద్యం సురకామినీవిరచితం శ్రీచణ్డికే త్వన్ముదే

13:లవఙ్గకలికోజ్జ్వలం బహులనాగవల్లీదలం
సజాతిఫలకోమలం సఘనసారపూగీఫలమ్
సుధామధురమాకులం రుచిరరత్నపాత్రస్థితం
గృహాణ ముఖపఙ్కజే స్ఫురితమమ్బ తామ్బూలకమ్
శరత్ప్రభవచన్ద్రమః స్ఫురితచన్ద్రికాసున్దరం
గలత్సురతరఙ్గిణీలలితమౌక్తికాడమ్బరమ్
గృహాణ నవకాఞ్చనప్రభవదణ్డఖణ్డోజ్జ్వలం
మహాత్రిపురసున్దరి ప్రకటమాతపత్రం మహత్

14:మాతస్త్వన్ముదమాతనోతు సుభగస్త్రీభిః సదాఽఽన్దోలితం
శుభ్రం చామరమిన్దుకున్దసదృశం ప్రస్వేదదుఃఖాపహమ్
సద్యోఽగస్త్యవసిష్ఠనారదశుకవ్యాసాదివాల్మీకిభిః
స్వే చిత్తే క్రియమాణ ఏవ కురుతాం శర్మాణి వేదధ్వనిః

15:స్వర్గాఙ్గణే వేణుమృదఙ్గశఙ్ఖభేరీనినాదైరూపగీయమానా
కోలాహలైరాకలితాతవాస్తు విద్యాధరీనృత్యకలాసుఖాయ

16:దేవి భక్తిరసభావితవృత్తే ప్రీయతాం యది కుతోపి లభ్యతే
తత్ర లౌల్యమపి సత్ఫలమేకఞ్జన్మకోటిభిరపీహ న లభ్యమ్

17:ఏతైః షోడశభిః పద్యైరూపచారోపకల్పితైః
యః పరాం దేవతాం స్తౌతి స తేషాం ఫలమాప్నుయాత్

::: ఇతి దుర్గాతన్త్రే దుర్గామానసపూజా సమాప్తా :::

Sunday, August 16, 2009

శ్రీ గోవిందాష్టకమ్


1)సత్యం జ్ఞానమనంతం నిత్యమనాకాశం పరమాకాశం
గోష్ఠప్రాంగణరింగణలోలమనాయాసం పరమాయాసం
మాయాకల్పితనానాకారమనాకారం భువనాకారం
క్ష్మామానాథమనాథం ప్రణమత గోవిందం పరమానందం

2)మృత్స్నామత్సీహేతి యశోదాతాడనశైశవ సంత్రాసం
వ్యాదితవక్త్రాలోకితలోకాలోకచతుర్దశలోకాలం
లోకత్రయపురమూలస్తంభం లోకాలోకమనాలోకం
లోకేశం పరమేశం ప్రణమత గోవిందం పరమానందం

3)త్రైవిష్టపరిపువీరఘ్నం క్షితిభారఘ్నం భవరోగఘ్నం
కైవల్యం నవనీతాహారమనాహారం భువనాహారం
వైమల్యస్ఫుటచేతోవృత్తివిసేషాభాసమనాభాసం
శైవం కేవలశాంతం ప్రణమత గోవిందం పరమానందం

4)గోపాలం భూలీలావిగ్రహగోపాలం కులగోపాలం
గోపీఖేలనగోవర్ధనధృతిలీలాలాలితగోపాలం
గోభిర్నిగదిత గోవిందస్ఫుటనామానం బహునామానం
గోపీగోచరదూరం ప్రణమత గోవిందం పరమానందం

5)గోపీమండలగోష్ఠీభేదం భేదావస్థమభేదాభం
శశ్వద్గోఖురనిర్ధూతోత్కృతధూలీధూసరసౌభాగ్యం
శ్రద్ధాభక్తిగృహీతానందమచింత్యం చింతిత సద్భావం
చింతామణిమహిమానం ప్రణమత గోవిందం పరమానందం

6)స్నానవ్యాకులయోషిద్వస్త్రముపాదాయాగముపారూఢం
వ్యాదిత్సంతీరథ దిగ్వస్త్రా దాతుముపాకర్షంతం తాః
నిర్ధూతద్వయశోకవిమోహం బుద్ధం బుద్ధేరంతస్స్థం
సత్తామాత్రశరీరం ప్రణమత గోవిందం పరమానందం

7)కాంతం కారణకారణమాదిమనాదిం కాలమనాభాసం
కాలిందీగతకాలియశిరసి ముహుర్నృత్యంతం సునృత్యంతం
కాలం కాలకలాతీతం కలితాశేషం కలిదోషఘ్నం
కాలత్రయగతిహేతుం ప్రణమత గోవిందం పరమానందం

8)వృందావనభువి వృందారకగణవృందారాధ్యం వందేహం
కుందాభామలమందస్మేరసుధానందం సుహృదానందం
వంద్యాశేషమహామునిమానసవంధ్యానందపదద్వంద్వం
వంద్యాశేషగుణాబ్ధిం ప్రణమత గోవిందం పరమానందం

9)గోవిందాష్టకమేతదధీతే గోవిందార్పితచేతా యో
గోవిందాత్చ్యుత మాధవ విష్ణో గోకులనాయక కృష్ణేతి
గోవిందాంఘ్రిసరో జధ్యానసుధాజలధౌతసమస్తాఘో
గోవిందం పరమానందామృతమంతస్స్థం స సమభ్యేతి

ఇతి శ్రీ శంకరాచార్య విరచిత శ్రీ గోవిందాష్టకమ్ సమాప్తం

Sree gOviMdaashTakamSree gOviMdaashTakam^

1)satyaM jnaanamanaMtaM nityamanaakaaSaM paramaakaaSaM
gOshThapraaMgaNariMgaNalOlamanaayaasaM paramaayaasaM
maayaakalpitanaanaakaaramanaakaaraM bhuvanaakaaraM
kshmaamaanaathamanaathaM praNamata gOviMdaM paramaanaMdaM

2)mRtsnaamatseehEti yaSOdaataaDanaSaiSava saMtraasaM
vyaaditavaktraalOkitalOkaalOkachaturdaSalOkaalaM
lOkatrayapuramoolastaMbhaM lOkaalOkamanaalOkaM
lOkESaM paramESaM praNamata gOviMdaM paramaanaMdaM

3)traivishTaparipuveeraghnaM kshitibhaaraghnaM bhavarOgaghnaM
kaivalyaM navaneetaahaaramanaahaaraM bhuvanaahaaraM
vaimalyasphuTachEtOvRttivisEshaabhaasamanaabhaasaM
SaivaM kEvalaSaaMtaM praNamata gOviMdaM paramaanaMdaM

4)gOpaalaM bhooleelaavigrahagOpaalaM kulagOpaalaM
gOpeekhElanagOvardhanadhRtileelaalaalitagOpaalaM
gObhirnigadita gOviMdasphuTanaamaanaM bahunaamaanaM
gOpeegOcharadooraM praNamata gOviMdaM paramaanaMdaM

5)gOpeemaMDalagOshTheebhEdaM bhEdaavasthamabhEdaabhaM
SaSvadgOkhuranirdhootOtkRtadhooleedhoosarasaubhaagyaM
SraddhaabhaktigRheetaanaMdamachiMtyaM chiMtita sadbhaavaM
chiMtaamaNimahimaanaM praNamata gOviMdaM paramaanaMdaM

6)snaanavyaakulayOshidvastramupaadaayaagamupaarooDhaM
vyaaditsaMteeratha digvastraa daatumupaakarshaMtaM taa@h
nirdhootadvayaSOkavimOhaM buddhaM buddhEraMtassthaM
sattaamaatraSareeraM praNamata gOviMdaM paramaanaMdaM

7)kaaMtaM kaaraNakaaraNamaadimanaadiM kaalamanaabhaasaM
kaaliMdeegatakaaliyaSirasi muhurnRtyaMtaM sunRtyaMtaM
kaalaM kaalakalaateetaM kalitaaSEshaM kalidOshaghnaM
kaalatrayagatihEtuM praNamata gOviMdaM paramaanaMdaM

8)vRMdaavanabhuvi vRMdaarakagaNavRMdaaraadhyaM vaMdEhaM
kuMdaabhaamalamaMdasmErasudhaanaMdaM suhRdaanaMdaM
vaMdyaaSEshamahaamunimaanasavaMdhyaanaMdapadadvaMdvaM
vaMdyaaSEshaguNaabdhiM praNamata gOviMdaM paramaanaMdaM

9)gOviMdaashTakamEtadadheetE gOviMdaarpitachEtaa yO
gOviMdaatchyuta maadhava vishNO gOkulanaayaka kRshNEti
gOviMdaaMghrisarO jadhyaanasudhaajaladhautasamastaaghO
gOviMdaM paramaanaMdaamRtamaMtassthaM sa samabhyEti

iti Sree SaMkaraachaarya virachita SreegOviMdaashTakam^ samaaptaM

Thursday, August 13, 2009

అచ్యుతాష్టకం
1::అచ్యుతం కేశవం రామ నారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం హరిమ్ 
శ్రీధరం మాధవం గోపికావల్లభం జానకీనాయకం రామచంద్రం భజే

2::అచ్యుతం కేశవం సత్యభామాధవం మాధవం శ్రీధరం రాధికాజ్రాధితమ్ 
ఇందిరామందిరం చేతసా సుందరం దేవకీనందనం నందజం సందధే 

3::విష్ణవే జిష్ణవే శంఖినే చక్రిణే రుక్మిణీరాగిణే జానకీజానయే 
వల్లవీవల్లభాయాజ్ర్చితాయాత్మనే కంసవిధ్వంసినే వంశినే తే నమః 

4::కృష్ణ గోవింద హే రామ నారాయణ శ్రీపతే వాసుదేవాజిత శ్రీనిధే 
అచ్యుతానంత హే మాధవాధోక్షజ ద్వారకానాయక ద్రౌపదీరక్షక 

5::రాక్షసక్షోభితః సీతయా శోభితో దండకారణ్యభూపుణ్యతాకారణమ్ 
లక్ష్మణేనాన్వితో వానరైస్సేవితోజ్గస్త్యసంపూజితో రాఘవః పాతు మామ్

6::ధేనుకారిష్టహానిష్టకృద్ద్వేషిణాం కేశిహా కంసహృద్వంశికావాదకః 
పూతనాకోపకః సూరజాఖేలనో బాలగోపాలకః పాతు మామ్ సర్వదా 

7::విద్యుదుద్యోతవత్ప్రస్ఫురద్వాససం ప్రావృడంభోదవత్ప్రోల్లసద్విగ్రహమ్ 
వన్యయా మాలయా శోభితోరఃస్థలం లోహితాంఘ్రిద్వయం వారిజాక్షం భజే 

8::కుంచితైః కుంతలైర్భ్రాజమానాననం రత్నమౌళిం లసత్కుండలం గండయోః 
హారకేయూరకం కంకణప్రోజ్జ్వలం కింకిణీమంజులం శ్యామలం తం భజే 

9::అచ్యుతస్యాష్టకం యః పఠేదిష్టదం ప్రేమతః ప్రత్యహం పూరుషః సస్పృహమ్ 
వృత్తతస్సుందరం వేద్య విశ్వంభరం తస్య వశ్యో హరిర్జాయతే సత్వరమ్ 

1)achyutaM kESavaM raamanaaraayaNaM
kRshNadaamOdaraM vaasudEvaM hariM
SreedharaM maadhavaM gOpikaavallabhaM
jaanakeenaayakaM raamachaMdraM bhajE

2)achyutaM kESavaM satyabhaamaadhavaM
maadhavaM SreedharaM raadhikaaraadhitaM
iMdiraamaMdiraM chEtasaa suMdaraM
dEvakeenaMdanaM naMdajaM saMdadhE

3)vishNavE jishNavE SaMkhinE chakriNE
rukmiNeeraagiNE jaanakeejaanayE
vallavee vallabhaayaarchitaayaatmanE
kaMsavidhvaMsinE vaMSinE tE nama@h

4)kRshNa gOviMda hE raamanaaraayaNa
SreepatE vaasudEvaajita SreenidhE
achyutaanaMta hE maadhavaadhOkshaja
dvaarakaanaayaka draupadeerakshaka

5)raakshasakshObhita@h seetayaaSObhitO
daMDakaaraNyabhoopuNyataa kaaraNa@h
lakshmanEnaanvitO vaanarai@h sEvitO
gastyasaMpoojitO raaghava@h paatu maaM

6)dhEnukaarishTakaanishTakRddvEshiNaaM
kESihaa kaMsahRdvaMSikaavaadaka@h
pootanaakOpaka@h soorajaakhElanO
baalagOpaalaka@h paatu maaM sarvadaa

7)vidyududyOtavat^ prasphuradvaasasaM
praavRDaMbhOdavat^ prOllasadvigrahaM
vanyayaa maalayaa SObhitOrasthalaM
lOhitaaMghridvayaM vaarijaakshaM bhajE

8)kuMchitai@h kuMtalairbraajamaanaananaM
ratnamauliM lasatkuMDalaM gaMDayO@h
haarakEyoorakaM kaMkaNaprOjjvalaM
kiMkiNeemaMjulaM SyaamalaM taM bhajE

9)achyutasyaashTakaM ya@h paThEdishTadaM
prEmata@h pratyahaM poorusha@h saspRhaM
vRttata@h suMdaraM kartRviSvaMbharaM
tasya vaSyO harirjaayatE satvaraM

<::: iti SreeachyutaashTakaM saMpoorNaM :::>

:: శ్రీ అచ్యుతాష్టకము ::


1)అచ్యుతం కేశవం రామనారాయణం
కృష్ణదామోదరం వాసుదేవం హరిం
శ్రీధరం మాధవం గోపికావల్లభం
జానకీనాయకం రామచంద్రం భజే


2)అచ్యుతం కేశవం సత్యభామాధవం
మాధవం శ్రీధరం రాధికారాధితం
ఇందిరామందిరం చేతసా సుందరం
దేవకీనందనం నందజం సందధే


3)విష్ణవే జిష్ణవే శంఖినే చక్రిణే
రుక్మిణీరాగిణే జానకీజానయే
వల్లవీ వల్లభాయార్చితాయాత్మనే
కంసవిధ్వంసినే వంశినే తే నమః


4)కృష్ణ గోవింద హే రామనారాయణ
శ్రీపతే వాసుదేవాజిత శ్రీనిధే
అచ్యుతానంత హే మాధవాధోక్షజ
ద్వారకానాయక ద్రౌపదీరక్షక


5)రాక్షసక్షోభితః సీతయాశోభితో
దండకారణ్యభూపుణ్యతా కారణః
లక్ష్మనేనాన్వితో వానరైః సేవితో
గస్త్యసంపూజితో రాఘవః పాతు మాం

6)ధేనుకారిష్టకానిష్టకృద్ద్వేషిణాం
కేశిహా కంసహృద్వంశికావాదకః
పూతనాకోపకః సూరజాఖేలనో
బాలగోపాలకః పాతు మాం సర్వదా


7)విద్యుదుద్యోతవత్ ప్రస్ఫురద్వాససం
ప్రావృడంభోదవత్ ప్రోల్లసద్విగ్రహం
వన్యయా మాలయా శోభితోరస్థలం
లోహితాంఘ్రిద్వయం వారిజాక్షం భజే


8)కుంచితైః కుంతలైర్బ్రాజమానాననం
రత్నమౌలిం లసత్కుండలం గండయోః
హారకేయూరకం కంకణప్రోజ్జ్వలం
కింకిణీమంజులం శ్యామలం తం భజే

9)అచ్యుతస్యాష్టకం యః పఠేదిష్టదం
ప్రేమతః ప్రత్యహం పూరుషః సస్పృహం
వృత్తతః సుందరం కర్తృవిశ్వంభరం
తస్య వశ్యో హరిర్జాయతే సత్వరం


::: ఇతి శ్రీఅచ్యుతాష్టకం సంపూర్ణం :::
>

::: గోవింద నామాలు :::
ఏడుకొండలవాడ వేంకటరమణ
గోవిదా...గోవిందా....2

1)శ్రీనివాస గోవిందా
శ్రీ వెంకటేశా గోవిందా 2
భక్త వత్సల గోవిందా
భాగవతా ప్రియ గోవిందా
గోవిందా హరి గోవిందా
వేంకటరమణా గోవిందా
గోవిందా హరి గోవిందా
వేంకటరమణా గోవిందా 2


2)నిత్య నిర్మల గోవిందా
నీలమేఘ శ్యామ గోవిందా
పురాణ పురుషా గోవిందా
పుండరీకాక్ష గోవిందా
గోవిందా హరి గోవిందా
వేంకటరమణా గోవిందా
గోవిందా హరి గోవిందా
వేంకటరమణా గోవిందా 2

3)నంద నందనా గోవిందా
నవనీత చోరా గోవిందా
పశుపాలక శ్రీ గోవిందా
పాప విమోచన గోవిందా
గోవిందా హరి గోవిందా
వేంకటరమణా గోవిందా
గోవిందా హరి గోవిందా
వేంకటరమణా గోవిందా 2


4)దుష్ట సంహార గోవిందా
దురిత నివారణ గోవిందా
శిష్ట పరిపాలక గోవిందా
కష్ట నివారణ గోవిందా
గోవిందా హరి గోవిందా
వేంకటరమణా గోవిందా
గోవిందా హరి గోవిందా
వేంకటరమణా గోవిందా 2


5)వజ్ర మకుటధర గోవిందా
వరాహ మూర్తీ గోవిందా
గోపీజన లోల గోవిందా
గోవర్ధనోద్ధార గోవిందా
గోవిందా హరి గోవిందా
వేంకటరమణా గోవిందా
గోవిందా హరి గోవిందా
వేంకటరమణా గోవిందా 2


6)దశరధ నందన గోవిందా
దశముఖ మర్ధన గోవిందా
పక్షి వాహనా గోవిందా
పాండవ ప్రియనే గోవిందా
గోవిందా హరి గోవిందా
వేంకటరమణా గోవిందా
గోవిందా హరి గోవిందా
వేంకటరమణా గోవిందా 2


7)మత్శ్త్య కూర్మ గోవిందా
మధుసూధన హరి గోవిందా
వరాహ న్రుసింహ గోవిందా
వామన మూర్తి గోవిందా
గోవిందా హరి గోవిందా
వేంకటరమణా గోవిందా
గోవిందా హరి గోవిందా
వేంకటరమణా గోవిందా 2


8)సీతా నాయక గోవిందా
శ్రితజనపాలన గోవిందా
దానవ వీర గోవిందా
ధర్మ రక్షణ గోవిందా
గోవిందా హరి గోవిందా
వేంకటరమణా గోవిందా
గోవిందా హరి గోవిందా
వేంకటరమణా గోవిందా
2

9)అనాథ రక్షక గోవిందా
ఆపధ్భాందవ గోవిందా
ఆశ్రిత రక్షక గోవిందా
కరుణా సాగర గోవిందా
గోవిందా హరి గోవిందా
వేంకటరమణా గోవిందా
గోవిందా హరి గోవిందా
వేంకటరమణా గోవిందా 2


10)బలరామానిజ గోవిందా
బుద్ధ కలికి గోవిందా
వేణు గాన ప్రియ గోవింద
వేంకట రమణా గోవిందా
గోవిందా హరి గోవిందా
వేంకటరమణా గోవిందా
గోవిందా హరి గోవిందా
వేంకటరమణా గోవిందా 2


11)కరుణసాగర గోవిందా
శరణాగత విధే గోవిందా
కమల దళాక్షా గోవిందా
కామిత ఫలదాత గోవిందా
పాప వినాశక గోవిందా
పాహి మురారే గోవిందా
గోవిందా హరి గోవిందా
వేంకటరమణా గోవిందా
గోవిందా హరి గోవిందా
వేంకటరమణా గోవిందా 2


12)శ్రీముద్రాంకిత గోవిందా
శ్రీవత్సాంకిత గోవిందా
ధరణీ నాయక గోవిందా
దినకర తేజా గోవిందా
గోవిందా హరి గోవిందా
వేంకటరమణా గోవిందా
గోవిందా హరి గోవిందా
వేంకటరమణా గోవిందా 2


13)పద్మావతీ ప్రియ గోవిందా
ప్రసన్న మూర్తే గోవిందా
అభయ హస్తా గోవిందా
మత్స్సవతార గోవిందా
గోవిందా హరి గోవిందా
వేంకటరమణా గోవిందా
గోవిందా హరి గోవిందా
వేంకటరమణా గోవిందా
2

14)శంఖ చక్రధర గోవిందా
శ్రాంగ గదాధర గోవిందా
విరాజ తీర్థ గోవిందా
విరోధి మర్ధన గోవిందా
గోవిందా హరి గోవిందా
వేంకటరమణా గోవిందా
గోవిందా హరి గోవిందా
వేంకటరమణా గోవిందా
2


15)సహస్ర నామ గోవిందా
సరసిజ నయన గోవిందా
లక్ష్మీ వల్లభ గోవిందా
లక్ష్మణాగ్రజ గోవిందా
గోవిందా హరి గోవిందా
వేంకటరమణా గోవిందా
గోవిందా హరి గోవిందా
వేంకటరమణా గోవిందా
2

16)కస్తూరి తిలక గోవిందా
కనకపీతాంభర గోవిందా
గరుడ వాహన గోవిందా
గానలోల గోవిందా
గోవిందా హరి గోవిందా
వేంకటరమణా గోవిందా
గోవిందా హరి గోవిందా
వేంకటరమణా గోవిందా
2

17)వానర సేవిత గోవిందా
వారథి బంధన గోవిందా
ఏకస్వరూప గోవిందా
సప్తగిరీశా గోవిందా
గోవిందా హరి గోవిందా
వేంకటరమణా గోవిందా
గోవిందా హరి గోవిందా
వేంకటరమణా గోవిందా
2

18)రామ క్రిష్ణా గోవిందా
రఘుకుల నందన గోవిందా
ప్రత్యక్ష దేవ గోవిందా
పరమ దయాకర గోవిందా
గోవిందా హరి గోవిందా
వేంకటరమణా గోవిందా
గోవిందా హరి గోవిందా
వేంకటరమణా గోవిందా
2

19)వజ్ర కవచధర గోవిందా
వైభవమూర్తీ గోవిందా
రత్నకిరీట గోవిందా
వసుదేవసుతా గోవిందా
గోవిందా హరి గోవిందా
వేంకటరమణా గోవిందా
గోవిందా హరి గోవిందా
వేంకటరమణా గోవిందా
2

20)బిల్వపత్రార్చిత గోవిందా
భిక్షుక సంస్తుత గోవిందా
స్త్రీ పుం రూపా గోవిందా
శివకేశవ మూర్తి గోవిందా
గోవిందా హరి గోవిందా
వేంకటరమణా గోవిందా
గోవిందా హరి గోవిందా
వేంకటరమణా గోవిందా 2

21)బ్రహ్మానంద రూపా గోవిందా
భక్త తారకా గోవిందా
నిత్య కళ్యాణ గోవిందా
నీరజ నాభా గోవిందా
గోవిందా హరి గోవిందా
వేంకటరమణా గోవిందా
గోవిందా హరి గోవిందా
వేంకటరమణా గోవిందా
2

22)ఆనంద రూపా గోవిందా
అధ్యంత రహిత గోవిందా
ఇహపర దాయక గోవింద
ఇపరాజ రక్షక గోవిందా
గోవిందా హరి గోవిందా
వేంకటరమణా గోవిందా
గోవిందా హరి గోవిందా
వేంకటరమణా గోవిందా
2

23)శేష సాయి గోవిందా
శేషాద్రి నిలయ గోవిందా
శ్రీ శ్రీనివాసా గోవిందా
శ్రీ వేంకటేశా గోవిందా
గోవిందా హరి గోవిందా
వేంకటరమణా గోవిందా
గోవిందా హరి గోవిందా
వేంకటరమణా గోవిందా
2

24)హతి రామ ప్రియ గోవిందా
హరి సర్వోత్తమ గోవిందా
జనార్ధన మూర్తి గోవిందా
జగత్ సాక్షి రూపా గోవిందా
గోవిందా హరి గోవిందా
వేంకటరమణా గోవిందా
గోవిందా హరి గోవిందా
వేంకటరమణా గోవిందా 2


25)అభిషేక ప్రియ గోవిందా
అభన్నిరాసాద గోవిందా
నిత్య శుభాత గోవిందా
నిఖిల లోకేశా గోవిందా
గోవిందా హరి గోవిందా
వేంకటరమణా గోవిందా
గోవిందా హరి గోవిందా
వేంకటరమణా గోవిందా
2

26)పద్మ దలక్ష గోవిందా
పద్మనాభా గోవిందా
తిరుమల నివాసా గోవిదా
తులసీ వనమాల గోవిందా
గోవిందా హరి గోవిందా
వేంకటరమణా గోవిందా
గోవిందా హరి గోవిందా
వేంకటరమణా గోవిందా
2

Tuesday, August 11, 2009

శ్రీ మహర్షికౄత శ్రీమన్నారాయణ స్తుతి
నమ: కౄష్ణాయ హరయే పరమస్మై బ్రహ్మ రూపిణే
నమో భగవతే తస్మై విష్ణవే పరమాత్మనే!!

సర్వభూత శరణ్యాయ సర్వ జ్ణ్జాయ నమోనమ:
వాసుదేవాయ భక్తానాం సర్వకామ ప్రదాయినే!!

నమ: పంకజ నేత్రాయ జగత్ధాత్రే చ్యుతాయచ
హౄషికేశాయ సర్వాయ నమ: కమలమాలినే!!

అనంత నాగ ప్రర్యంకే సహస్ర ఫణ శోభితే
దీప్యమానే మలే దివ్యే సహస్రార్కసమప్రభే!!

యోగ నిద్రాముపేతాయ తస్మై భగవతే నమ:
యద్రూపం నచ పశ్యంతి సూరయో నచ యోనిన:!!

సందర్భము:

వేంకటాద్రిపై అవతరించిన శ్రీమన్నారాయణుని బ్రహ్మరుద్రుల్ని
స్తుతించిన పిమ్మట మహర్షులు ఇట్లు స్తుతించినారు.


శ్రీకృష్ణా! శ్రీహరీ! నమస్కారము. పరబ్రహ్మ స్వరూపా!

షడ్గుణపూర్ణుడా! పరమాత్మా! విష్ణుదేవా! విశ్వవ్యాపీ!

నీకు నమస్కారము. సర్వ ప్రాణులను రక్షించువాడా!

శరణు పొంద దగిన వాడా! సమస్తము తెలిసినవాడా!

వసుదేవుని పుత్రములు గలవాడా! అభీష్టముల నొసంగువాడా!

సమస్కారము. పద్మ పత్రముల వంటి నేత్రములు గలవాడా!

జగదాధారా! అచ్యుతా! నాశరహితా! ఇంద్రియములను నియమించువాడా!

విశ్వమంతటా వ్యాపించు వాడా! పద్మముల మాలలను ధరించిన దేవా!నీకు నమస్కారము.

వేయి పడగలచే ప్రకాశించుచు,స్వచ్చముగా ప్రకాశించుచు,

వేయిమంది సూర్యుల కాంతితో సమానమగు కాంతి గలిగిన శేషపానుపుపై

యోగనిద్రను జెందియున్న జ్ణ్జాన శక్త్యాది కల్యాణ గుణములు గలవానికి నమస్కారాము.

యోగనిద్రలో నున్న నీ రూపమును పండితులు యోగులు కూడా చూడజాలరు.

శ్రీ విష్ణు సహాస్రనామ స్తోత్రం

>:: పూర్వభాగము ::
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే

యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతం
విఘ్నం నిఘ్నంతి సతతం విష్వక్సేనం తమాశ్రయే

వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం

వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే
నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః

అవికారాయ శుద్ధాయ నిత్యాయపరమాత్మనే
సదైక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే

యస్య స్మరణమాత్రేణ జన్మసంసారబంధనాత్
విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే

! ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే !

::: శ్రీ వైశంపాయన ఉవాచ :::

శ్రుత్వా ధర్మా నశేషేణ పావనాని చ సర్వశః
యుధిష్ఠిరః శాంతనవం పునరేవాభ్యభాషత

::: యుధిష్టిర ఉవాచ :::

కిమేకం దైవతం లోకే కిం వా ప్యేకం పరాయణం
స్తువంతః కం క మర్చంతః ప్రాప్నుయుః మానవాశ్శుభం

కో ధర్మ స్సర్వధర్మాణాం భవతః పరమో మతః
కిం జపన్ ముచ్యతే జంతుర్జన్మ సంసారబంధనాత్

::: శ్రీ భీష్మ ఉవాచ :::

జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం
స్తువన్నా మసహస్రేణ పురుషస్సతతోత్థితః

తమేవ చార్చయన్నిత్యం భక్త్యా పురుషమవ్యయం
ధ్యాయన్ స్తువన్ నమస్యంశ్చ యజమానస్తమేవ చ

అనాది నిధనం విష్ణుం సర్వలోక మహేశ్వరం
లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వదుఃఖాతిగో భవేత్

బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం
లోకనాథం మహద్భూతం సర్వభూతభవోద్భవం

ఏష మే సర్వధర్మాణాం ధర్మోధికతమో మతః
యద్భక్త్యా పుణ్డరీకాక్షం స్తవైరర్చే న్నర స్సదా

పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః
పరమం యో మహద్బ్రహ్మ పరమం యః పరాయణం

పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళం
దైవతం దేవతానాం చ భూతానాం యో వ్యయఃపితా

యత స్సర్వాణి భూతాని భవంత్యాది యుగాగమే
యస్మింశ్చ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే

తస్య లోక ప్రధానస్య జగన్నాథస్య భూపతే
విష్ణో ర్నామసహస్రం మే శృణు పాపభయాపహం

యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః
ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే

ఋషిర్నామ్నాం సహస్రస్య వేదవ్యాసో మహామునిః
చందో నుష్టుప్ తథా దేవో భగవాన్ దేవకీసుతః

అమృతాం శూద్భవో బీజం శక్తిర్దేవకి నందనః
త్రిసామా హృదయం తస్య శాంత్యర్థే వినియుజ్యతే

విష్ణుజిష్ణుం మహా విష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం
అనేక రూపదైత్యాంతం నమామి పురుషోత్తమం

:: పూర్వన్యాసః ::

అస్య శ్రీ విష్ణోః దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య, శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషిః, అనుష్టుప్ఛంధః, శ్రీ మహావిష్ణుః పరమాత్మా శ్రీమన్నారాయణో దేవతా, అమృతాంశూద్భవో భానురితి భీజం, దేవకీ నందన స్రష్టేతి శక్తిః, ఉద్భవః క్షోభణోదేవ ఇతి పరమోమంత్రః, శంఖభృన్నందకీ చక్రీతి కీలకం, శారంగ ధన్వా గదాధర ఇత్యస్త్రం, రధాంగపాణి రక్షోభ్య ఇతినేత్రం, త్రిసామా సామగస్సామేతి కవచం, ఆనందం పరబ్రహ్మేతి యోనిః, ఋతుస్సుదర్శనః కాల ఇతి దిగ్భందః, శ్రీ విశ్వరూప ఇతి ధ్యానం,
శ్రీ మహావిష్ణు (కైంకర్యరూపే) ప్రీత్యర్ధే శ్రీ సహస్రనామ స్తోత్రజపే వినియోగః

:: కరన్యాసః ::

విశ్వం విష్ణుర్వషట్కార ఇత్యంగుష్టాభ్యాం నమః
అమౄతాంశూద్భవోభానురితి తర్జనీభాం నమః

బ్రాహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మేతి మధ్యమాభ్యాం నమః
సువర్ణబిందు రక్ష్యోభ్య ఇతి అనామికాభ్యాం నమః

నిమిషో ௨నిమిషః స్రగ్వీతి కనిష్టి కాభ్యాం నమః
రధాంగపాణి రక్షోభ్య ఇతి కరతలక.ర పృష్టాభ్యాం నమః

:: అంగన్యాసః ::

స్వరతస్సుముఖస్సూక్ష్మం ఇతిజ్ఞానాయ హృదయాయ నమః
సహస్రమూర్తిః విశ్వాత్మా ఇతి ఐశ్వర్యానీయ శిరసే స్వాహా

సహస్రార్చిః సప్తజిహ్వా ఇతిశక్యై శిఖాయై వషట్
త్రిసామాసామగస్సమేతి బలాయ కవచాయహుం

రధాంగపాణి రక్షోభ్య ఇతి నేత్రాభ్యాం వౌషట్
శార్‌జ్గధన్వాగదాధర ఇతి వీర్యాయ అస్త్రాయఫట్

(ఋతుస్సుదర్శనః కాల ఇతి దిగ్బంధః )

::: ధ్యానం :::

క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం
మాలా క్లుప్తా సనస్ధః స్ఫటికమణి నిభైః, మౌక్తికైర్మండితాంగః

శుభ్రై రభ్రై రదభ్రైః రుపరి విచరితైర్ముక్త పీయూష వర్షైః
ఆనందీ నః పునీయా దరినళిన గదా శంఖపాణిః ముకుందః

భూఃపాదౌ యస్యనాభిః వియదసురనిలః చంద్రసూర్యౌచనేత్రే
కర్ణావాసాశ్శిరోద్యౌః ముఖమపి దహనో యస్యవాస్తేయమబ్ధిః

అంతస్థం యస్యవిశ్వం సురనర ఖగగో భోగి గంధర్వ దైత్యైః
చిత్రం రం రమ్యతే తం త్రిభువనవపుషం విష్ణుమీశం నమామి

( ఓం నమో భగవతే వాసుదేవాయ )

శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం

లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం
వందే విష్ణుంభవభయహరం సర్వలోకైక నాధం

మేఘశ్యామం పీతకౌసేయవాసం శ్రీవత్సాంకంకౌస్ధుభోద్భాసితాంగం
పుణ్యోపేతం పుణ్డరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాధం

సశంఖ చక్రం సకిరీటకుణ్డలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం
సహారవక్షస్ధల శోభి కౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం

( స్తోత్రము ) హరిః ఓం

విశ్వం విష్ణు ర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః
భూతకృత్ భూతభృద్భావో భూతాత్మా భూతభావనః

పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః
అవ్యయః పురుష స్సాక్షీ క్షేత్రజ్ఞోక్షర ఏవ చ

యోగో యోగవిదాం నేతా ప్రధానపురుషేశ్వరః
నారసింహవపు శ్రీమాన్ కేశవః పురుషోత్తమః

సర్వశ్శర్వ శ్శివ స్ధాణుః భూతాది ర్నిధి రవ్యయః
సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః

స్వయంభూశ్శంభు రాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః
అనాది నిధనో ధాతా విధాతా ధారురుత్తమః

అప్రమేయా హృషీకేశః పద్మనాభో మరప్రభుః
విశ్వకర్మా మనుస్త్వష్టా స్ధవిష్ఠః స్ధవిరో ధ్రువః

అగ్రాహ్యాః శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః
ప్రభూత స్త్రికకుద్ధామ పవిత్రం మంగళం పరం

ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః
హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః

ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః క్రమః
అనుత్తమో దురాధర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్

సురేశ శ్శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః
అహ స్సవంత్సరో వ్యాళః ప్రత్యయ స్సర్వదర్శనః

అజ స్సర్వేశ్వర స్సిద్ధః సిద్ధి స్సర్వాది రచ్యుతః
వృషాకపి రమేయాత్మా సర్వయోగ వినిస్సృతః

వసు ర్వసుమనా స్సత్యః సమాత్మా సమ్మిత స్సమః
అమోఘః పుణ్డరీకాక్షో వృషకర్మా వృషాకృతిః

రుద్రో బహుశిరా బభ్రుః విశ్వయోని శ్శుచిశ్రవాః
అమృత శ్శాశ్వతః స్ధాణుః వరారోహో మహాతపాః

సర్వగ స్సర్వవిద్భానుః విష్యక్సేనో జనార్దనః
వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః

లోకాధ్యక్ష స్సురాధ్యక్షో ధర్మాధ్యక్షః కృతాకృతః
చతురాత్మా చతుర్వ్యూహః చతుర్దంష్ట్రశ్చతుర్భుజః


భ్రాజిష్ణు ర్భోజనం భోక్తా సహిష్ణు ర్జగదాదిజః
అనఘో విజయోజేతా విశ్వయోనిః పునర్వసుః


ఉపేంద్రో వామనః ప్రాంశుః అమోఘ శ్శుచి రూర్జితః
అతీంద్ర స్సంగ్రహా స్సర్గో ధృతాత్మా నియమో యమః


వేద్యో వైద్య స్సదా యోగీ వీరహా మాధవో మధుః
అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః

మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః
అనిర్దేశ్యవపు శ్శ్రీమాన్ అమేయాత్మా మహాద్రిధృత్

మహేష్వాసో మహీభర్తా శ్రీనివాస స్సతాంగతిః
అనిరుద్ధ స్సురానందో గోవిందో గోవిదాం పతిః

మరీచి ర్దమనో హంసః సువర్ణో భుజగోత్తమః
హిరణ్యనాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః

అమృత్యు స్సర్వదృక్సింహః సంధాతా సంధిమాన్ స్ధిరః
అజో దుర్మర్షణ శ్శాస్తా విశ్రుతాత్మా సురారిహా

గురు ర్గురుతమో ధామః సత్యస్సత్య పరాక్రమః
నిమిషో నిమిష స్స్రగ్వీ వాచస్పతి రుదారధీః

అగ్రణీర్ద్రామణీ శ్శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః
సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షః సహస్రపాత్

ఆవర్తనో నివృత్తాత్మా సంవృత స్సంప్రమర్దనః
అహస్సంవర్తకో వహ్ని రనిలోధరణీధరః

సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వ దౄగ్విశ్వభుగ్విభుః
సత్కర్తా సత్కృతస్సాధుః జహ్నుర్నారాయణో నరః

అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్ట శ్శిష్టకృచ్ఛుచిః
సిద్ధార్థః సిద్ధసంకల్పః సిద్ధిద సిద్ధి సాధనః

వృషాహీ వృషభో విష్ణుః వృషపర్వా వృషోదరః
వర్థనో వర్ధమానశ్చ వివిక్త శ్ర్శుతిసాగరః

సుభుజో దుర్ధరో వాగ్మీ మహేంద్రో వసుదో వసుః
నైకరూపో బృహద్రూపః శిపివిష్టః ప్రకాశనః

ఓజస్తేజో ద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః
ఋద్ధఃస్పష్టాక్షరో మంత్రః చంద్రాంశుర్భాస్కరద్యుతిః

అమృతాంశూద్భవో భానుః శశిబిందుస్సురేశ్వరః
ఔషధం జగతః సేతుః సత్యధర్మ పరాక్రమః

భూతభవ్య భవన్నాథః పవనః పావనో నలః
కామహా కామకృత్కాంతః కామః కామప్రదః ప్రభుః

యుగాదికృద్యుగావర్తో నైకమాయో మహాశనః
అదృశ్యోవ్యక్తరూపశ్చ సహస్రజిత్ అనంతజిత్

ఇష్టోవిశిష్ట శ్శిష్టేష్టః శిఖణ్ణీ నహుషో వృషః
క్రోధహా క్రోధకృత్కర్తా విశ్వబాహుర్మహీధరః

అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః
అపాం నిధి రధిష్ఠాన మప్రమత్తః ప్రతిష్ఠితః

స్కందః స్కందధరో ధుర్యోవరదో వాయు వాహనః
వాసుదేవో బృహద్భానుః ఆదిదేవః పురందరః

అశోక స్తారణ స్తారః శూరశ్శౌరి ర్జనేశ్వరః
అనుకూల శ్శతావర్తః పద్మీ పద్మనిభేక్షణః

పద్మనాభోరవిందాక్షః పద్మగర్భశ్శరీరభృత్
మహర్థి ఋద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజః

అతులశ్శరభో భీమః సమయజ్ఞో హవిర్హరిః
సర్వలక్షణ లక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః

విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదర స్సహః
మహీధరో మహాభాగో వేగవానమితాశనః

ఉద్భవ క్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరః
కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః

వ్యవసాయో వ్యవస్థానః సంస్థానః స్థానదో ధ్రువః
పరర్థిః పరమస్పష్టః తుష్టః పుష్టశ్శుభేక్షణః

రామో విరామో విర(తో)జో మార్గో నేయో నయోనయః
వీరశ్శక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మవిదుత్తమః

వైకుణ్ఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః
హిరణ్యగర్భ శ్శత్రుఘ్నో వ్యాప్తో వాయురధోక్షజః

ఋతుస్సుదర్శనః కాలఃపరమేష్ఠీ పరిగ్రహః
ఉగ్రస్సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః

విస్తారః స్ధావర స్ధాణుః ప్రమాణం బీజమవ్యయం
అర్థో నర్థో మహాకోశో మహాభోగో మహాధనః

అనిర్విణ్ణః స్థవిష్ఠో భూః ధర్మయూపో మహామఖః
నక్షత్రనేమిర్నక్షత్రీ క్షమః క్షామస్సమీహనః

యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతుస్సత్రం సతాం గతిః
సర్వదర్శీ నివృత్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం

సువ్రతస్సుముఖసూక్ష్మః సుఘోష స్సుఖద స్సుహృత్
మనోహరో జితక్రోధో వీరబాహుర్విదారణః

స్వాపనః స్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్
వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః

ధర్మకృబ్ధర్మకృద్ధర్మీ సదసత్ క్షరమక్షరం
అవిజ్ఞాతా సహస్రాంశుః విధాతా కృతలక్షణః

గభస్తినేమిస్సత్వస్ధః సింహో భూతమహేశ్వరః
ఆదిదేవో మహాదేవో దేవోశో దేవభృద్గురుః

ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః
శరీరభూతభృద్భోక్తా కపీంద్రో భూరిదక్షిణః

సోమపో మృతపస్సోమః పురుజిత్పురుసత్తమః
వినయోజయస్సత్ససంధో దాశార్హ స్సాత్వతాం పతిః

జీవో వినయితా సాక్షీ ముకుందోమిత విక్రమః
అంభోనిధి రనంతాత్మా మహోదధిశయో అంతకః

అజో మహర్హః స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః
ఆనందో నందనో నందః సత్యధర్మా త్రివిక్రమః

మహర్షిః కపిలాచార్యః కృతజ్ఞో మేదినీపతిః
త్రిపదస్త్రిదశాధ్యక్షో మహాశృంగకృతాంతకృత్

మహావరాహో గోవిందః సుషేణః కానాకాంగదీ
గుహ్యోగభీరో గహనో గుప్తశ్చక్ర గదాధరః

వేదాస్వ్యాంగో జితఃకృష్ణోదృఢస్సంకర్షణోచ్యుతః
వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహమనాః

భగవాన్ భగహానందీ వనమాలీ హలాయుధః
ఆదిత్యో జ్యోరిరాదిత్యః సహిష్ణుర్గతిసత్తమః

సుధన్వా ఖండపరశుః దారుణో ద్రవిణః ప్రదః
దివిస్పృక్సర్వ దృగ్వ్యాసో వాచస్పతి రయోనిజః

త్రిసామా సామగస్సామ నిర్వాణం భేషజం భిషక్
సన్యాసకృచ్ఛమశ్శాంతో నిష్ఠాశాంతిః పరాయణం

శుభాంగశ్శాంతిదస్స్రష్టా కుముదః కువలేశయః
గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః

అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః
శ్రీవత్సవక్షాః శ్రీవాసః శ్రీపతిః శ్రీమతాం వరః

శ్రీదశ్శ్రీశః శ్రీనివాసః శ్రీనిధిశ్శ్రీవిభావనః
శ్రీధరశ్శ్రీకరశ్శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః

స్వక్ష స్స్వంగ శ్శతానందో నందిర్జ్యోతి ర్గణేశ్వరః
విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్ఛిన్న సంశయః

ఉదీర్ణ సర్వ తశ్చక్షు రనీశ శ్శాశ్వతః స్ధిరః
భూశయో భూషణో భూతిః విశోకః శ్శోకనాశనః

అర్చిష్మా నర్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనః
అనిరుద్ధో ప్రతిరధః ప్రద్యుమ్నోమితవిక్రమః

కాలనేమినిహా వీరః శౌరిః శూర శ్శూరజనేశ్వరః
త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహా హరిః

కామదేవః కామపాలః కామీ కాంతః కృతాగమః
అనిర్దేశ్యవపుః విష్ణుః వీరోనంతో ధనంజయః

బహ్మణ్యోబ్రహ్మకృత్ బ్రహ్మ బ్రహ్మబ్రహ్మ వివర్థనః
బ్రహ్మవిద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః

మహాక్రమో మహాకర్మా మహాతేజా మహోరగః
మహాక్రతు ర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః

స్తవ్యస్తవప్రియ స్తోత్రం స్తుత స్తోతారణప్రియః
పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తి రనామయః

మనోజవ స్తీర్థకరో వసురేతా వసుప్రదః
వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనా హవిః

సద్గతి స్సత్కృతిస్సత్తా సద్భూతి స్సత్పరాయణః
శూరసేనో యదుశ్రేష్ఠః సన్నివాస స్సుయామునః

భూతావాసో వాసుదేవః సర్వాసు నిలయో నలః
దర్పహా దర్పదో దృప్తో దుర్ధరో థాపరాజితః

విశ్వమూర్తిర్మహామూర్తిః దీప్తమూర్తి రమూర్తిమాన్
అనేకమూర్తిరవ్యక్తః శతమూర్తి శ్శతాననః

ఏకో నైక స్సవః కః కిం యత్తత్పద మనుత్తమం
లోకబంధు ర్లోకనాథో మాధవో భక్తవత్సలః

సువర్ణ వర్ణో హేమాంగో వరాంగ శ్చందనాంగదీ
వీరహా విషమ శ్శూన్యో ఘృతాశీ రచల శ్చలః

అమానీ మానదో మాన్యో లోకఃస్వామీ త్రిలోకధృత్
సుమేధా మేధజో ధన్యః సత్యమేథా ధరాధరః

తేజో వృషో ద్యుతిధరః సర్వశస్త్రభృతాం వరః
ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైక శృంగో గదాగ్రజః

చతుర్మూర్తి శ్చతుర్బాహుః చతుర్వ్యూహః చతుర్గతిః
చతురాత్మా చతుర్భావః చతుర్వేద విదేకపాత్

సమావర్తో నివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః
దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహా

శుభాంగో లోకసారంగః సుతంతుః తంతువర్ధనః
ఇంద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః


ఉద్భవ స్సుందర స్సుందో రత్ననాభ స్సులోచనః
అర్కో వాజసనః శృంగీ జయంతః సర్వవిజ్జయీ

సువర్ణ బిందురక్షోభ్యః సర్వవాగీశ్వరేశ్వరః
మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధిః

కుముదః కుందరః కుందః పర్జన్యః పావనో నిలః
అమృతాంశోమృతవపుః సర్వజ్ఞః సర్వతోముఖః

సులభ స్సువ్రత స్సిద్ధః శత్రుజిచ్ఛత్రుతాపనః
న్యగ్రోధోదుంబరో శ్వత్థః చాణూరాంద్ర నిషూదనః

సహస్రార్చి స్సప్తజిహ్వః సప్తైథా స్సప్తవాహనః
అమూర్తి రనఘో చింత్యో భయకృద్భయనాశనః

అణుర్బృహత్కృశః స్థూలో గుణభృన్నిర్గుణో మహాన్
అధృత స్స్వధృత స్య్సాస్థ్యః ప్రాగ్వంశో వంశవర్థనః

భారభృత్ కథితో యోగీ యోగీశ స్సర్వకామదః
ఆశ్రమ శ్శ్రమణః క్షామః సుపర్ణో వాయువాహనః

ధనుర్ధరో ధనుర్వేదో దణ్డో దమయితా దమః
అపరాజిత స్సర్వసహో నియంతా నియమో యమః

సత్త్వవాన్ సాత్విక స్సత్యః సత్యధర్మపరాయణః
అభిప్రాయః ప్రియార్హోర్హః ప్రియకృత్ ప్రీతివర్ధనః

విహాయసగతి ర్జ్యోతిః సురుచిర్హుతభుగ్విభుః
రవి ర్విరోచన స్సూర్యః సవితా రవి లోచనః

అనంతో హుతభుగ్భోక్తా సుఖదో నైకదో గ్రజః
అనిర్విణ్ణ స్సదామర్షీ లోకాధిష్ఠాన మద్భుతః

సనాత్సనాతనతమః కపిలః కపిరవ్యయః
స్వస్తిద స్స్యస్తికృత్ స్వస్తి స్వస్తిభుక్ స్వస్తి దక్షిణః

అరౌద్రః కుణ్డలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసనః
శబ్దాతిగ శ్శబ్దసహః శిశిర శ్శర్వరీకరః

అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః
విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః

ఉత్తారణో దుష్కృతిహా పుణ్యో దుస్స్యప్న నాశనః
వీరహా రక్షణ స్సంతో జీవనం పర్యవస్ధితః

అనంతరూపో నంత శ్రీః జితమన్యుర్భయాపహః
చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః

అనాది ర్భూర్భువో లక్ష్మీః సువీరో రుచిరాంగదః
జననో జన జన్మాదిః భీమో భీమపరాక్రమః

ఆధార నిలయో ధాతా పుష్పహాసః ప్రజాగరః
ఊర్ధ్వగ స్సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణః

ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ ప్రాణజీవనః
తత్త్వం తత్త్వ విదేకాత్మా జన్మమృత్యు జరాతిగః

భూర్భువ స్స్యస్తరుస్తారః సవితా ప్రపితామహః
యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహనః

యజ్ఞభృత్ యజ్ఞకృత్ యజ్ఞీ యజ్ఞభుక్ యజ్ఞసాధనః
యజ్ఞాంతకృత్ యజ్ఞగుహ్యం మన్నమన్నాద ఏవచ

ఆత్మయోని స్స్యయంజాతో వైఖాన స్సామగాయనః
దేవకీ నందన స్స్రష్టా క్షితీశః పాపనాశనః

శంఖభృత్ నందకీ చక్రీ శారంగధన్వా గదాధరః
రథాంగపాణి రక్ష్యోభ్యః సర్వ ప్రహరణాయుధః

::: శ్రీ సర్వప్రహరణాయుధ ఓం నమ ఇతి :::

వనమాలీ గదీ శారంగీ శంఖీ చక్రీ చ నందకీ
శ్రీమన్నారాయణో విష్ణుః వాసుదేవో భిరక్షతు

శ్రీ వాసుదేవోభి రక్షతు ఓం నమ ఇతి

::: ఉత్తర భాగము :::(ఫలశౄతి)

ఇతీదం కీర్తనీయస్య కేశవస్య మహాత్మనః
నామ్నాం సహస్రం దివ్యానాం అశేషేణ ప్రకీర్తితం

య ఇదం శృణుయాత్ నిత్యం యశ్చాపి పరికీర్తయేత్
నాశుభం ప్రాప్నుయాత్కించిత్ సో ముత్రేహచమానవః

వేదాంతగోబ్రాహ్మణస్స్యాత్ క్షత్రియో విజయీ భవేత్
వైశ్యో ధనసమృద్ధః స్యాత్ , శూద్రః స్సుఖ మవాప్నుయాత్

ధర్మార్థీ ప్రాప్నుయాద్ధర్మ మర్థార్థీ చార్ధ మాప్నుయాత్
కామానవాప్నుయాత్ కామీ ప్రజార్థీ చాప్ను యాత్ప్రజాః

భక్తిమాన్య స్సదోత్థాయ శుచిస్తద్గత మానసః
సహస్రం వాసుదేవస్య నామ్నా మేతత్ ప్రకీర్తయేత్

యశః ప్రాప్నోతి విపులం యాతి ప్రాధాన్యమేవచ
అచలాం శ్రియ మాప్నోతి శ్రేయః ప్రాప్నోత్యనుత్తమం

న భయం క్వచి దాప్నోతి వీర్యం తేజశ్చ విందతి
భవ త్యరోగో ద్యుతిమాన్ బలరూప గుణాన్వితః

రోగార్తో ముచ్యతే రోగాత్ బద్ధో ముచ్యేత బంధనాత్
భయా న్ముచ్యేత భీతస్తు ముచ్యే తాపన్న ఆపదః

దుర్గాణ్యతితర త్యాశు పురుషః పురుషోత్తమం
స్తువ న్నామసహస్రేణ నిత్యం భక్తి సమన్వితః

వాసుదేవాశ్రయో మర్త్యో వాసుదేవ పరాయణః
సర్వపాప విశుద్ధాత్మా యాతి బ్రహ్మ సనాతనం

న వాసుదేవ భక్తానాం అశుభం విద్యతే క్వచిత్
జన్మ మృత్యు జరా వ్యాధి భయం నైవోపజాయతే

ఇమం స్తవ మధీయానః శ్రద్ధాభక్తి సమన్వితః
యుజ్యే తాత్మ సుఖక్షాంతిః శ్రీ ధృతి స్మృతి కీర్తిభిః

నక్రోధో న చ మాత్సర్యం న లోభో నా శుభామతిః
భవంతి కృత పుణ్యానాం భక్తానాం పురుషోత్తమే

ద్యౌ స్సచంద్రార్కనక్షత్రం ఖం దిశో భూర్మహోదధిః
వాసుదేవస్య వీర్యేణ విధృతాని మహాత్మనః

ససురాసుర గంధర్వం సయక్షోరగ రాక్షసం
జగద్వశే వర్తతేదం కృష్ణస్య సచరాచరం

ఇంద్రియాణి మనోబుద్ధిః సత్త్వం తేజోబలం ధృతిః
వాసుదేవాత్మ కాన్యాహుః క్షేత్రం క్షేత్రజ్ఞ ఏవ చ

సర్వాగమానా మాచారః ప్రథమం పరికల్పితః
ఆచార ప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుతః

ఋషయః పితరో దేవః మహాభూతాని ధాతవః
జంగమాజంగమం చేదం జగన్నారాయణోద్భవం

యోగో జ్ఞానం తథా సాంఖ్యం విద్యా శ్శిలాది కర్మచ
వేదాః శాస్త్రాణి విజ్ఞానం ఏతత్ సర్వం జనార్దనాత్

ఏకోవిష్ణుః ర్మహద్భూతం పృథగ్భూతా న్యనేకశః
త్రీన్ లోకాన్ వ్యాప్య భూతాత్మా భుంక్తే విశ్వభుగవ్యయః

ఇమం స్తవం భగవతో విష్ణోర్వ్యాసేన కీర్తితం
పఠేద్య ఇచ్ఛేత్ పురుషః శ్రేయః ప్రాప్తుం సుఖానిచ

విశ్వేశ్వర మజం దేవం జగతః ప్రభుమవ్యయం
భజంతి యే పుష్కరాక్షం నతే యాంతి పరాభవం

::: నతే యాంతి పరాభవం ఓం నమ ఇతి :::

::: అర్జున ఉవాచ :::

పద్మపత్ర విశాలాక్ష పద్మనాభ సురోత్తమ
భక్తానా మనురక్తానాం త్రాతా భవ జనర్ధన

::: శ్రీ భగవానువాచ :::

యోమాం నాం సహస్రేణ స్తోతు మిచ్ఛతి పాణ్డవ
సో హ మేకేన శ్లోకేన స్తుత ఏవ న సంశయః

::: స్తుత ఏవ న సంశయ ఓం నమ ఇతి :::

::: వ్యాస ఉవాచ :::

వాసనాత్ వాసుదేవస్య వాసితం తే జగత్రయం
సర్వభూత నివాసో సి వాసుదేవ నమోస్తుతే

::: శ్రీ వాసుదేవ నమోస్తుత ఓం నమ ఇతి :::

::: పార్వత్యువాచ :::

కేనోపాయేన లఘనా విష్ణోర్నామ సహస్రకం
పఠ్యతే పండితైర్నిత్యం శ్రోతు మిచ్ఛామ్యహం ప్రభో

::: ఈశ్వర ఉవాచ :::

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే (3)

::: శ్రీ రామనామ వరానన్ ఓం నమ ఇతి :::

::: బ్రహ్మోవాచ :::

నమో స్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే
సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటీయుగధారిణే నమః

::: శ్రీ సహస్ర్రకోటీ యుగధారిణే ఓం నమ ఇతి :::

::: సంజయ ఉవాచ :::

యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః
తత్రశ్రీః విజయోభూతిః ధ్రువా నీతిః మతిర్మమ

::: శ్రీ భగవానువాచ :::

అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం

పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే

అర్తా విషణ్ణాశ్శిథిలాశ్చభీతాః ఘోరేషుచవ్యాధిషు వర్తమానాః
సంకీర్త్యనారాయణ శబ్దమాత్రం విముక్త ధుఃఖాస్సు ఖినోభవంతి

కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ద్యాత్మనా వా పకౄతేః స్వభావత్
కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణా యేతి సమర్పయామి

యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్
తత్సర్వం క్షమ్యతాం దేవ! నారాయణ! నమోస్తుతే

ఇతి శ్రీ మహాభారతే శతసహస్రీకాయాం సంహితాయాం వైయాసిక్యాం ఆనుశాస నికపర్వణి మోక్షధర్మే
శ్రీ భీష్మ యుధిష్ఠిర సంవాదే శ్రీ విష్ణోః దివ్యసహస్రనామ స్తోత్రం నామ ఏకోన పంచాశదధిక ద్విశతతమోధ్యాయః


!!!!!!! ఓం తత్ సత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు !!!!!!! naa

maharshikRuta SreemannaaraayaNa stuti

maharshikRuta SreemannaaraayaNa stuti

nama: kRushNaaya harayae paramasmai brahma roopiNae
namO bhagavatae tasmai vishNavae paramaatmanae!!

sarvabhoota SaraNyaaya sarva jNjaaya namOnama:
vaasudaevaaya bhaktaanaaM sarvakaama pradaayinae!!

nama: paMkaja naetraaya jagatdhaatrae chyutaayacha
hRushikaeSaaya sarvaaya nama: kamalamaalinae!!

anaMta naaga praryaMkae sahasra phaNa SObhitae
deepyamaanae malae divyae sahasraarkasamaprabhae!!

yOga nidraamupaetaaya tasmai bhagavatae nama:
yadroopaM nacha paSyaMti soorayO nacha yOnina:!!

saMdarbhamu:

vaeMkaTaadripai avatariMchina SreemannaaraayaNuni brahmarudrulni
stutiMchina pimmaTa maharshulu iTlu stutiMchinaaru.


SreekRshNaa! Sreeharee! namaskaaramu. parabrahma svaroopaa!

shaDguNapoorNuDaa! paramaatmaa! vishNudaevaa! viSvavyaapee!

neeku namaskaaramu. sarva praaNulanu rakshiMchuvaaDaa!

SaraNu poMda dagina vaaDaa! samastamu telisinavaaDaa!

vasudaevuni putramulu galavaaDaa! abheeshTamula nosaMguvaaDaa!

samaskaaramu. padma patramula vaMTi naetramulu galavaaDaa!

jagadaadhaaraa! achyutaa! naaSarahitaa! iM

Tuesday, July 28, 2009

వరలక్ష్మీ వ్రతకల్పము
!!! వరలక్ష్మీ వ్రతకల్పము !!!

!!! వరలక్ష్మి పూజ విధానం !!!

శ్రీ మహాగణాధిపతయే నమః

అమ్మలగన్న అమ్మ మాయమ్మను ఏ నామముతో
పిలిచినా ఏ విధంగా తలచినా వేంటనే దర్శనమిచ్చే
దయాస్వరూపిణి.
ఆ తల్లి వరాలు ఇచ్చే వరలక్ష్మీ దేవి.
ఆ చల్లని తల్లి దీవెనలతో
చిరకాలం ముత్తైదువుగా వుండాలని
ఆ జగజ్జననిని కొలిచి
ఆ శక్తిస్వరూపిణి దయకు పాత్రులమై
చిరకాలం ఆనందంగా వుండాలనేదే మన అందరి కోరిక.
కొలిచేకొద్దీ రక్తినీ,శక్తినీ,భక్తినీ మోక్షన్నీ ప్రసాదించే ఆ తల్లి
అనురాగకల్పవల్లి .
దండిగా,నిండుగా విద్యా,ఉద్యోగ వౄత్తి వ్యాపార,పదవీలను
సుఖ శాంతి సంతోషాలను సమస్త సంపదలను కురిపించే చల్లని తల్లి.
ఈ వరలక్ష్మీ పూజని భక్తి శ్రద్ధలతో మనమందరం కొలిచి ముక్తిని పొంది
సౌభాగ్యవతులుగా వుండాలని ఆ పరమేశ్వరిని వేడుకొందాం.

ఆ తల్లిని కొలిచే నేను ఈనాడు సంతోషముతో

ఆనందంగా ఏదానికి కొదవలేకుండగా వున్నాను

మీరూ అమ్మను నమ్మి భక్తి శ్రధలతో పూజచేసి

ఆ తల్లి దీవెనలు అందుకొని సంతోషంగా వుండండీ అని నా ప్రాథన!__/\__

ముందు పూజకు ఏమేమి చేసుకోవాలో చూద్దామా :)

ఇంటిలో ఈశాన్య మూలలో స్థలమును శుబ్రం చేసి అలికి బియ్యంపిండితో గాని ముగ్గుపిండితో గాని ముగ్గులుపెట్టి,దైవస్తాపన నిమిత్తమై ఒక పీటను వేయాలి.పీట మరీ ఎత్తుగా గాని,మరీ పల్లముగా గాని వుండకూడదు. పిదప ఆపీటనుకూడ చక్కగా పసుపురాసి,కుంకుమబొట్టు పెట్టి పసుపుతో గాని,బియ్యంపిండితో గాని ముగ్గువేయాలి.
కమలాలు వచ్చేటట్లు ముగ్గుపెడితే మరీ మంచిది.పూజ చేసే వారు తూర్పుముఖంగా కూర్చోవాలి. ఏదైవాన్ని పూజించబోతున్నారో ఆ దైవం యొక్క ప్రతిమగాని,విగ్రహము గాని చిత్రపఠము గాని ఆ పీటపై పెట్టాలి.
ముందు పసుపుతో గణపతిని తయారుచేసి(పసుపును సుమారు అంగుళంసైజులో త్రికోణ ఆకౄతిలో ముద్దగాచేసి దానికి కుంకుమ బొట్టు పెట్టి పిదప ఒక పళ్ళెములో గాని,కొత్త తుండుగుడ్డపై గాని బియ్యం పోసి దానిపై ఒక తమలపాకునుంచి, అందు పసుపు గణపతిని వుంచి అగరవత్తులు వెలిగించీగరవత్తులు వెలిగించాలి.(ఏదేవుణ్ణి కొలిచినగాని ముందు గణపతిని పూజించి ఆ పిమ్మట మనము అనుకొన్న దేవిగాని,దేవుడుగాని పూజించవలెను.)

!! పూజకు కావలసిన వస్తువులు !!

దీపారాధన చేయుటకు కుంది,(ప్రమిద)వెండిదిగాని,ఇత్తడిగాని,మట్టిదిగాని,వాడవచ్చును.
కుందిలో 3అడ్డవత్తులు,1కుంభవత్తి(మధ్యలో)వేసి
నూనెతో తడపవలెను.
ఇంకొక అడ్డవత్తి నూనెలో తడిపి ఏక హారతిలో వేసి ముందుగా ఏకహారతిలో వేసిన వత్తిని అగ్గిపుల్లతో వెలిగించి,వెలిగించిన వత్తితో కుందిలోని 1అడ్డవత్తి,1కుంభవత్తి వెలిగించాలి.
తర్వాత చేయ్యి కడుక్కొని నూనె కుంది నిండుగా వేసి పిదప ఆ కుందికి మూడుచోట్ల కుంకుమపెట్టి, అక్షంతలువేసి,దీపారాధనను లక్ష్మీస్వరూపంగా భావించి నమస్కారము చేయవలెను.
కుందిలోని మిగిలిన 2 అడ్డవత్తులు పూజాసమయంలో ధూపము చూపిన తరువాత,దీపము చూపించుటకు వాడవలెను.
నువ్వులనూనెగాని,ఆవునెయ్యిగాని,కొబ్బరనూనెగాని
వాడవచ్చును.
మనము ఆచమనము చేసినటువంటి పంచపాత్రలోని నీళ్ళు దేవునుపూజకు వాదరాదు.
పూజకు విడిగా ఒకగ్లాసుగాని,చెంబుగాని,చిన్న పంచపాత్రగాని తీసుకొని దానిలో శుధజలము పోసి,ఆ చెంబునకు కలశరాధనచేసి ఆ నీళ్ళు మాత్రమే దేవునిపూజకు ఉపయోగించవలెను.

శక్త్యనుసారంగా వెండిగాని,బంగారుగాని,ఇత్తడిగాని చిత్రపటము, వరలక్ష్మిని కొందరు కొబ్బరకాయకు పసుపుపూసి బొట్టుపెట్టి కలశంపైపెట్టి పూజిస్తారు.

మరికొందరు ఈ విధంగాచేసి పూజిస్తారు.
కొబ్బరకాయకు పీచుతీసి కాయనుబాగా పీచులెకుండగా గీకి,నున్నగాచేసి తొడిమనుపైకి వచ్చెలా వుంచుకొని,
పసుపురాసి,గోధుమ,మైదా,లేదా పసుపుముద్దతో చేసిన ముక్కు,చెవులు,అమర్చి,కాటుకను కళ్ళుకనుబొమ్మలను గీసి,
కళ్ళలోపల నానబెట్టినసుద్దముక్కతో తెలుపురంగు గీసి,మరల కనుపాపకుకాటుకనుమధ్యలో గుండ్రంగాపెట్టి,నోరు తిలకముతోగాని,లిప్ష్టిక్,తోగాని పెట్టి
ఈ బొమ్మను పెద్ద చెంబుపై గాని,బిందెపై గాని,అమర్చుతారు.
కొత్తజాకెట్ గుడ్డను త్రిభుజాకారంలో మడచి పైన తొడిమకు తొడుగుతారు.
కొత్త చీరనుకట్టి,ఆభరణాలతో అలంకరించి ఆ ప్రతిమను
వరలక్ష్మిదేవిగా భావిస్తారు.

!! పూజకు కావలసిన వస్తువులు !!

1)ధూపమునకు సాంబ్రాణీ

2)దీపారాధనకు అగరుబత్తి

3)కుందులు,అగ్గిపెట్టె,ఆవునెయ్యి

4)పత్తితో చేసిన వత్తులు

5)అక్షతలు(పసుపుతోకలిపినవి కొద్దిగా)

6)పసుపు,కుంకుమ,పువ్వులు,గంధం,హారతి కర్పూరము.

7)పళ్ళు,కొబ్బరికాయలు

8)తోరములు(దారమును 9 వరసలుగాతీసి పసుపురాసి
తొమ్మిది చోట్ల పువ్వులతో 9 ముడులువేసి సిధముగా వుంచుకొనవలెను.)

9)నివేదనకు,స్త్రీదేవతా రాధనకు ప్రత్యేకంగా చలిమిడి
(బియ్యంపిండి,బెల్లం తో చేస్తారు
)
10)పానకం,(శుధమైన నీటిలో బెల్లంపొడి,ఏలక్కాయపొడి,మిరియాలపొడి కొద్దిగా కలుపుతారు)

11)మహా నైవేద్యం కొరకు,మంచి భక్ష్యములతో కూడిన భోజనము, 9 రకాల పిండివంటలను తయారుచేసి,నైవెద్యం పెట్టిన తరువాత అన్నీ రకాల పిండివంటలను 9 చొప్పున
పళ్ళెములో వుంచి,దానిపై తోరమును,తాంబూలము,తమలపాకులు,వక్క,పండ్లు,పువ్వులు,పెట్టి
ముత్తైదువునకు వాయనము ఇవ్వవలెను.శక్తి వున్నవారు చీరకూడ పెట్టవచ్చును.వ్రతము పూర్తి అయిన తరువాత
ఆరోజు సాయంత్రము మీ వీలునుబట్టి 4 ముత్తైదువులను పిలిచి
తాంబూలము ఇస్తారు. ఇవన్నియు అమర్చుకొనిన తరువాత పూజకు
సిద్ధముచేసుకొనిన పిమ్మట యజమానులు(పూజ చేసే వారు)
ఈ క్రింద కేశవనామాలను స్మరిస్తూ ఆచమనం చెయ్యాలి.
ఈ నామములు మొత్తం 24 కలవు.

!! పూజ ప్రారంభం !!

1)ఓం కేశవాయస్వహా'..అని చెప్పుకొని చేతిలో నీరు తీసుకొని
లోనికి తీసుకోవాలి.

2)ఓం నారాయణస్వాహా...'అనుకొని రెండోసారి

3)ఓం మాధవాయస్వాహా'...అనుకొని మూడోసారి జలమును తీసుకోవలెను.

4)ఓం గోవిందాయ నమః'...అని చేతులు కడుక్కోవాలి.

5)విష్ణవే నమః'...అనుకొంటూ నీళ్ళుతాగి,మధ్యవ్రేలు,బొటనవ్రేళ్ళతో కళ్ళు తుడుచుకొనవలెను.

6)ఓం మధుసూదనాయ నమః'...అని పై పెదవిని కుడినుంచి,
ఎడమకి నిమురుకోవాలి.

7)ఓం త్రివిక్రమాయ నమః'...క్రింది పెదవిని కుడినుండి,ఎడమకి
నిమురుకోవాలి.

8)ఓం వామనాయ నమః, ..
9)ఓం శ్రీధరాయ నమః ... ఈ రెండు నామాలు స్మరిస్తూ తలపై కొంచం నీళ్ళు చల్లుకోవాలి.

10)ఓం హౄషికేశాయ నమః ...ఎడమచేతిలో నీళ్ళు చల్లాలి.

11)ఓం పద్మనాభాయ నమః ... పాదాలపై ఒక్కొక్క చుక్కజలము చల్లుకోవాలి.

12) ఓం దామోదరాయ నమః ... శిరస్సుపైజలమును ప్రోక్షించుకోవాలి.

13)ఓం సంకర్షణాయ నమః ... చేతి వ్రేళ్ళు గిన్నెలా వుంచి
గడ్డము తుడుచుకోవాలి.

14)ఓం వాసుదేవాయ నమః ... వ్రేళ్ళతో ముక్కును వదులుగా పట్టుకోవలెను.

15)ఓం ప్రద్యుమ్నాయ నమః ...

16)ఓం అనిరుద్దాయ నమః ... నేత్రాలు తాకవలెను.

17)ఓం పురుషోత్తమాయ నమః.
18)ఓం అధోక్షజాయ నమః ... రెండు చెవులూ తాకవలెను.

19)నారసింహాయ నమః...
20)ఓం అచ్యుతాయ నమః ... బొడ్డును స్పౄశించ వలెను.

21)జనార్ధనాయ నమః ... చేతి వ్రేళ్ళతో వక్షస్థలం,(హౄదయం)తాకవలెను.

22)ఓం ఉపేంద్రాయ నమః ...చేతి కొనతో శిరస్సు తాకవలెను.

23)ఓం హరయే నమః ..
24)ఓం శ్రీకృష్ణాయ నమః ...కుడిమూపురమును ఎడమచేతితోనూ,
ఎడమ మూపురము కుడి చేతి

ఆచమనము చేసిన తరువాత వేంటనే సంకల్పము చెప్పుకోవలెను.

ఆచమనము అయిన తరువాత, కొంచం నీరు చేతిలో పోసుకొని
నేలపై చిలకరించుతూ ఈ శ్లోకము పఠించవలెను.

ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమికారకాః
ఏతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే !!

ప్రాణాయామమ్యః ::- ఓంభూః - ఓం భువః - ఓం సువః - ఓం మహః - ఓం జనః - ఓం తపః
ఓగ్ ఒ సత్యం - ఓం తత్ నవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహీ ధీయోయోనః ప్రచోదయాత్ -ఓం అపోజ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువ స్సువరోం -- అని సంకల్పము చెప్పుకొనచలెను.

సంకల్పము::-మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం
శుభే శోభనముహుర్తే ఆద్య బ్రహ్మణః (ఇక్కడ ఏదేవుడినైతే పూజిస్తామూ ఆదేవుని పేరు,దేవీ పేరు చెప్పుకొనవలెను)
ద్వితీయపరార్థే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో ర్దక్షణదిగ్భాంగే శ్రీశైలస్య ఈశాన్య
ప్రదేశే కృఇష్ణా గోదావరి మధ్యప్రదేశే,శోభనగౄహే(అద్దె ఇల్లు అయినచో ,వసతి గ్రుహే అనియు,సొంత ఇల్లైనచో స్వగౄహే అనియు చెప్పుకొనవలెను )సమస్తదేవతాభ్రాహ్మణ హరిహర సన్నిదౌ అస్మిన్ వర్తమానే వ్యవహారిక చాంద్ర మానేన......సంవత్సరే,(ఇక్కడ తెలుగు సంవత్సరము అంటే పూజ చేయునపుడు ఏ సంవత్సరము జరుగుచున్నదో ఆ సంవత్సరము యొక్క పేరును చెప్పుకోవలిను), ......ఆయనే,(సంవత్సరమునకు 2 ఆయనములు - ఉత్తరాయణం,దక్షణాయనము.జనవరి 15 మకర సంక్రమణం మొదలు జులై 14 కర్కాటక సంక్రమణం వరకు ఉత్తరాయణం , జులై 15 కర్కాటక సంక్రమణం నుండి మరల జనవరి 14 పెద్దపండుగ అనగా మకర సంక్రమణం వరకు దక్షణాయణం, పూజ చేయునపుడు ఏ ఆయనము జరుగుచున్నదో దానిని చెప్పవలెను.) .....ఋతుః,(వసంత,గీస్మ,వర్ష మొదలగు ఋతువులలో పూజసమయంలో జరుగుచున్న ఋతువుపేరు.)....మాసే,(చైత్ర,వైశాఖ మొదలు 12 మాసములలో
పూజసమయములో జరుగుచున్న మాసంపేరు.)....పక్షే,(నెలకురెండు పక్షములు పౌర్ణమికి ముందు శుక్లపక్షము, అమవాస్యకుముందు

కృష్ణపక్షములు,వీటిలో పూజ జరుగుతున్న సమయమున
గల పక్షము పేరు)....తిథౌ,(ఆ రోజు తిథి)...వాసరే,(ఆరోజు ఏవారమైనదీ చెప్పుకొని)
శుభ నక్షత్రే, శుభయోగే,శుభ కరణే,ఏవంగుణ
విశేషణ విశిష్టాయాం శుభతిథౌ మమౌపాత్త సమస్త
దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య,శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం 'పురుషులైనచూ శ్రీమాన్....గోత్రస్య....నామధేయః,శ్రీమత్యః,గోత్రస్య,నామధేయస్య అనియు,
స్త్రీలైనచో శ్రీమతి,గోత్రవతి,నామధేయవతి,శ్రీమత్యాః,గోత్రవత్యాః,నామధేయవత్యాః,
అనియు(పూజ చేయువారి గోత్రము,నామము చెప్పి)నామధేయస్యః ధర్మపత్నీ సమేతస్య(పురుషులైనచో)మమ సహకుటుంబస్య,క్షేమ,స్థైర్య ,వీర్య,విజయ,అభయ,ఆయురారోగ్య,ఐశ్వర్యాభివౄధ్యార్థం,పుత్రపౌత్రాభివౄధ్యార్థం,మమధర్మార్థ,కామమోక్ష,చతుర్విధ,ఫలపురుషార్థం,సర్వ్వాభీష్ట సిధార్థం,అని(స్త్రీలు మాత్రము పూజ చేసుకొనునప్పుడు)అఖండితసర్వవిధసుఖసౌభాగ్య,సంతతి ఆయుఃఆరోగ్య,ఐశ్వార్యాఃఅభి వౄధ్యార్థం,అని(దంపతులు కూర్చోని చేసుకొన్నప్పుడు)శ్రీవరలక్ష్మీ దేవతా ముద్దస్య వరలక్ష్మీ దేవతా ప్రీతార్థం(ఏ దేవుని పూజించు చున్నామో ఆ దేవుని పేరు చెప్పుకొని)కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి(నాకు తోచిన రీతిలో,నాకు తోచిన నియమముతో,నాకు తోచిన విధముగా శక్తానుసారముగా,భక్తి,శ్రధలతో,సమర్పించుకొంటున్న పూజ)ధ్యానావాహనాది షోడోపచార పూజాం కరిష్యే .తద్ధంగ కలశపూజాం కరిష్యే.
పిదప కలశారాధనను చేయవలెను.

కలశ పూజ:::-
వెండి,రాగి,లేక కంచు గ్లాసులు లేదా పంచపాత్ర,రెండింటిలో శుధ జలము తీసుకొని ఒక దానియందు ఉద్దారిణి,రెండవదానియందు అక్షంతలు,తమలపాకు,పువ్వు,ఉంచుకొనవలెను.రెండవ పాత్రకు బయట 3 వైపులా గంధం పూసి కుంకుమను పెట్టవలెను.(ఇలా గంధం పూసేటప్పుడు గ్లాసును గుండ్రంగా తిప్పరాదు,గంధమును ఉంగరపు వేలితో పూయవలెను.కుంకుమ,అక్షంతలు,వగైరా,బొటన,మధ్య,ఉంగరపు వ్రేళ్ళను కలిపి సమర్పించవలెను.)యజమానులు(ఒకరైతే ఒకరు,దంపతులైతె ఇద్దరూను.)ఆ కలశాన్ని కుడిచేతితో మూసివుంచి,ఇలా అనుకోవాలి.ఈ విధముగా కలశమును తయారుచేసి పూజను చేయునపుడు మొదటగా ఈ శ్లోకమును చదువవలెను.

మం::--కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర స్సమాశ్శ్రితః
మూలే తత్ర స్థితో బ్రహ్మమధ్యే మాతృగణాస్మౄతాః
ఋగ్వేదో ధ యజుర్వేద స్సామవేదో హ్యధర్వణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః

శ్లో::--గంగైచ యమునేచైవ గోదావరి,సరస్వతీ,నర్మదా,సింధు,కావేర్యౌ జలేస్మిన్ సన్నిధింకురు

ఈ శ్లోకాన్ని చదువుకొని ఈ క్రిందవిధగా పూజించాలి.

ఏవం కలశ పూజాం కుర్యాత్ పూజార్థం మమ దురితక్షయకారకాః

కలశోదకేన ఓం దేవం సంప్రోక్ష్య(కలశమందలి నీళ్ళు దేవునిపై చల్లాలి.)ఓం ఆత్మానం సంప్రోక్ష్య అని (ఆనీటిని మన తలపై చల్లుకోవాలి.)ఓం పూజాద్రవ్యాణి సంప్రోక్ష్య్(పూజాద్రవ్యములపైకూడాచల్లాలి)కలశ మందలి నీటిని పై మంత్రం చదువుతూ పువ్వుతోగాని,ఆకుతోగాని చల్లాలి.

శ్లో::--ఓం అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగ తో పివా
యస్స్మరేత్పుండరీకాక్షం సభాహ్యాభ్యంతరశ్శుచిః

అని పిదప కొద్దిగ అక్షంతలు,కుంకుమ,పసుపు వరలక్ష్మీదేవిపైవేసి,ఆమెను తాకి నమస్కరించాలి.

ప్రార్థన::శ్లో::- పద్మాసనే పద్మకరే సర్వలోకైకపూజితే
నారాయణప్రియే దేవి సుప్రితాభవసర్వదా
(శ్రీవరలక్ష్మీదేవతాయైనమః ప్రాథనా నమస్కారం సమర్పయామి)

ధ్యానం::శ్లో::-- క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే
సుస్థిరాభవమేగేహే సురాసుర నమస్కౄతే
(శ్రీవరలక్ష్మీదేవతాయైనమ@ధ్యానం సమర్పయామి)
అని ఆదేవిని మనస్పూర్తిగా ధ్యానించాలి.

ఆవాహనం::శ్లో::-- సర్వమంగళ మాంగల్యే విష్ణువక్షఃస్థలాలయే
ఆవాహయామిదేవి త్వాం సుప్రీతాభవసర్వదా
(శ్రీవరలక్ష్మీదేవతాయైనమః ఆవాహయామి అని దేవిని మనసారా స్వాగతం పలుకుతున్నట్లుగా తలచి ఆహ్వానించాలి,నమస్కరించాలి.)

ఆసనం::శ్లో::-- సూర్యాయుత నిభస్ఫూర్తే స్ఫురద్రత్నవిభుషితే
సింహాసనమిదం దేవీ స్వీయతాం సురపూజితే
(శ్రీవరలక్ష్మీదేవతాయైనమః ఆసనం సమర్పయామి,కుర్చోమన్నట్లు ఆసనం చూపి పసుపు,కుంకుమ,పూలు,అక్షంతలు దేవిపై చల్లావలెను)

పాద్యం::శ్లో::-- సువాసిత జలం రమ్య సర్వతీర్థం సముద్భవం,
పాద్యం గృహాణదేవీ త్వం సర్వదేవ నమస్కృతే
(శ్రీవరలక్ష్మీదేవతాం పాద్యం సమర్పయామి అని కాళ్ళు కడుగుకొనుటకు నీళ్ళు ఇస్తున్నట్లు భావించిఉద్దరిణితో పంచపారలోని జలమును వరలక్మీదేవిపై చల్లి,రెండు చుక్కల జలము వేరొక పార్తలోనికి వదలవలెను)

అర్ఘ్యం::శ్లో::- శుద్ధోదకంచ పాత్ర స్థంగంధ పుష్పాది మిశ్రితం,
అర్ఘ్యం దాస్యామి తే దేవీ గృహాణ సురపూజితే
(శ్రీవరలక్ష్మీ దేవతాం అర్ఘ్యం సమర్పయామి.అని చేతులు కడుగుకొనుటకుకూడా నీరు ఇచ్చు చున్నట్లు భావిస్తూ పంచపాత్ర లోని జలమును పువ్వుతో వరలక్ష్మీదేవిపై చల్లి,అర్ఘ్యంపాత్రలో రెండుచుక్కలు వదలవలెను)

ఆచమనీయం::శ్లో::- సువర్ణ కలశానీతం చందనాగరు సమ్యుతం,
గృహాణచమనందేవిమయాదత్తం శుభప్రదే
(వరలక్ష్నీదేవతాం ఆచమనీయం సమర్పయామి.అని దేవిముఖమునుశుబ్రము చేసుకొనుటకు నీరు ఇచ్చునట్లు భావిస్తూ జలమును వేరొక పాత్రలోనికి వదలవలెను.)

పంచామృత స్నానం::శ్లో::- పయోదధీఘృతోపేతం శర్కరా మధుసంయుతం,
పంచామృతస్నాన మిదం గృహాణ కమలాలయే
(శ్రీవరలక్ష్మీదేవతాం పంచామృతస్నానం సమర్పయామి. అని స్నానమునకు పంచామౄతములతో కూడిన నీరు ఇచ్చినట్లు భావించి,ఆవునెయ్యి,ఆవుపాలు,ఆవుపెరుగు,తేనె,పంచదార కలిపిన పంచామౄతమును దేవిపై ఉద్దరిణితో చల్లవలెను.)

శుద్ధోదకస్నానం:శ్లో::- గంగాజలం మయానీతం మహాదేవ శిరఃస్థితం,
శుద్దోదకమిదంస్నానం గృహాణవిధుసోదరీ
(శ్రీ వరలక్ష్మీదేవతాం శుద్ధోదకస్నానం సమర్పయామి.అని పంచపాత్రలోని శుద్ధమైన నీటినిపువ్వుతో దేవిపై చల్లవలెను.)

వస్త్ర యుగ్మం:శ్లో::-సురార్చితాం ఘ్రియుగళే దుకూలవసనప్రియే,
వస్త్ర్యుగ్మం ప్రదాస్యామి గృహాణ హరి వల్లభే
(శ్రీ వరలక్ష్మీదేవతాం వస్త్రయుగ్మం సమర్పయామి.
పట్టులేదాశక్తికి తగిన వస్త్రమును దేవికీస్తున్నట్లుగాతలచి పత్తితో చేసుకొన్న వస్త్రయుగ్మమును (ప్రత్తిని గుండ్రని బిళ్ళగాచేసి తడిచేత్తో పసుపు,కుంకుమ,తీసుకొనిరెండువైపులాద్ది రెండు తయారుచేసుకోవాలి.)శ్రీవరలక్ష్మీదేవికి కలశంపై ఎడమవైపువేయవలెను.

ఆభరణము:శ్లో::- కేయూరకంకణా దేవీ హారనూపుర మేఖలాః
విభూషణా న్య మూల్యాని గృహాణ ఋషిపూజితే
(శ్రీవరలక్ష్మీదేవతాం ఆభరణం సమర్పయామి.బంగారముకాని,వెండికాని,మీషక్తానుసారం దేవికి సమర్పించుకోవాలి(లేకున్నచో అక్షంతలు వేసి నమస్కరించుకోవాలి.)

ఉపవీతం:శ్లో::- తప్త హేమకృతం దేవీ మాంగల్యం మంగళప్రదం,
మయాసమర్పితం దేవీ గృహాణ త్వం శుభప్రదే
(శ్రీవరలక్ష్మీదేవతాం ఉపవీతం సమర్పయామి.అని పత్తిని 3లేదా 4 అంగుళములు పొడవుగా మధ్య మధ్యలో పసుపుతో అద్దుతూ నలిపిన యగ్నోపవీతమునుదేవికి సమర్పించుకోవాలి

గంధం:శ్లో::- అక్షతాన్ దవళాన్ దివ్యాన్ శాలీయాన్ స్తండులాన్ శుభాన్,
హరిద్రా కుంకుమో పేతాన్ గృహ్యతా మబ్ది పుత్రికే
((శ్రీవరలక్ష్మీదేవతాం అక్షతాన్ సమర్పయామి.అని అక్షంతలు (పసుపుకలిపిన బియ్యమును)దేవిపై చల్లవలెను.

పుష్పపూజ:శ్లో::- మల్లికాజాజికుసుమైశ్చంపకైర్వకుళైస్తధా,
నీలోత్పలైఃశ్చలళారైఃపూజయామి హరిప్రియే
(శ్రీవరలక్ష్మీదేవతాం పుష్పైః పూజయామి.అని అన్నిరకములపూవులతో దేవిని పూజించవలెను.)
ఈ శోడశోపచార పూర్తి అయినతరువాత అధాంగ పూజ చేయవలెను.

అధాంగపూజ::- కుడిచేతిలోనికి అక్షంతలు తీసుకొనిక్రిందనామములను చదువుతూ అక్షతలను దేవిపైచల్లవలెను.
పసుపు,లేదా కుంకుమతోనైనను పూజించవచ్చును.

చంచలాయై నమః --- పాదౌ పూజయామి
చపలాయై నమః --- జానునీ పూజయామి
పీతాంబరాయై నమః --- ఊరూం పూజయామి
కమలవాసిన్యైనమః --- కటిం పూజయామి
పద్మాలయాయైనమః --- నాభిం పూజయామి
మదనమాత్రే నమః --- స్తనౌ పూజయామి
కంబుకంఠ్యై నమః --- కంఠం పూజయామి
సుముఖాయై నమః --- ముఖం పూజయామి
లలితాయైనమః --- భుజద్వయం పూజయామి
శ్రియైనమః ---ఓస్ఠౌ పూజయామి
సునాసికాయైనమః --- నాసికాః పూజయామి
సునేత్రాయై నమః --- నేత్రౌ పూజయామి
రమాయైనమః --- కర్ణౌ పూజయామి
కమలాయైనమః --- శిరః పూజయామి
శ్రీవరలక్ష్మై నమః --- సర్వాణ్యంగాని పూజయామి

!! శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామావళిః !!
(ప్రతినామమునకు ముందు ఓం అని,చివరకు నమః అని చేర్చుకొని చెప్పవలెను)

ఓం ప్రకృత్యై నమః , ఓం వికృతై నమః , ఓం విద్యాయై నమః , ఓం సర్వభూత హిత ప్రదాయై నమః , ఓం శ్రద్ధాయై నమః , ఓం విభూత్యై నమః , ఓం సురభ్యై నమః , ఓం పరమాత్మికాయై నమః , ఓం వాచ్యై నమః , ఓం పద్మాలయాయై నమః , ఓం పద్మాయై నమః , ఓం శుచయే నమః , ఓం స్వాహాయై నమః , ఓం స్వధాయై నమః , ఓం సుధాయై నమః , ఓం ధన్యాయై నమః , ఓం హిరణ్మయ్యై నమః , ఓం లక్ష్మీ నమః , ఓం నిత్యపొష్టాయై నమః , ఓం విభావర్యై నమః , ఓం ఆదిత్యై నమః , ఓం దిత్యై నమః , ఓందీప్తాయై నమః , ఓం రమాయై నమః , ఓం వసుధాయై నమః , ఓం వసుధారిణై నమః , ఓం కమలాయ నమః , ఓం కాంతాయ నమః , ఓం కామాక్షె నమః , ఓం క్రోధ సంభవాయ నమః , ఓం నృపవేశగతానందాయై నమః , ఓంవరలక్ష్మె నమః , ఓం వసుప్రదాయై నమః , ఓం శుభాయై నమః , ఓం హిరణ్యప్రాకారయై నమః , ఓం సముద్రతనయాయై నమః , ఓం అనుగ్రహప్రదాయై నమః , ఓం బుద్ధ్యె నమః , ఓం అనఘాయ నమః , ఓంహరివల్లభాయ నమః , ఓం అశోకాయ నమః , ఓం అమృతాయ నమః , ఓం దీపాయై నమః , ఓం తుష్టయే నమః , ఓం విష్ణుపత్నే నమః , ఓం లోకశోకవినశిన్యై నమః , ఓం ధర్మనిలయాయై నమః , ఓం కరుణాయై నమః , ఓం లోకమాత్రే నమః , ఓం పద్మప్రియాయై నమః , ఓం పద్మహస్తాయై నమః , ఓం పద్మాక్ష్యె నమః , ఓం పద్మసుందర్యై నమః , ఓంపద్మోద్భవాయై నమః , ఓం పద్మముఖీయై నమః , ఓం పద్మనాభప్రియాయై నమః , ఓం రమాయై నమః , ఓం పద్మమాలధరాయై నమః , ఓం దేవ్యై నమః , ఓం పద్మిన్యై నమః , ఓం పద్మ గంధిన్యై నమః , ఓం పుణ్యగంధాయై నమః , ఓం సుప్రసన్నాయై నమః , ఓం ప్రసాదాభిముఖీయై నమః , ఓం ప్రభాయై నమః , ఓం చంద్రవదనాయై నమః , ఓం జయాయై నమః , ఓం మంగళాదేవ్యై నమః , ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః , ఓం ప్రసన్నాక్షై నమః , ఓం నారాయణ సమాశ్రితాయై నమః , ఓం దారిద్ర్యద్వంసిన్యై నమః , ఓం చంద్రాయై నమః , ఓం చంద్రసహూదర్యై నమః , ఓం చతుర్భుజాయై నమః , ఓంచంద్ర రూపాయై నమః , ఓం ఇందిరాయై నమః , ఓం ఇందుశీతలాయై నమః , ఓం ఆహ్లాదజనన్యై నమః , ఓం పుష్ట్యై నమః , ఓం శివాయై నమః , ఓం శివకర్యై నమః , ఓం సత్యై నమః , ఓం విమలాయై నమః , ఓం విశ్వజనన్యై నమః , ఓం దారిద్ర నాశిన్యై నమః , ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః , ఓం శాంత్యై నమః , ఓం శుక్లమాలాంబరాయై నమః , ఓం శ్రియ్యై నమః , ఓం భాస్కర్యై నమః , ఓం బిల్వ నిలయాయై నమః , ఓం వరారోహాయై నమః , ఓం యశస్విన్యై నమః , ఓం వసుంధరాయై నమః , ఓం ఉదారాంగాయై నమః , ఓం హరిణ్యై నమః , ఓం ధనాధాన్యకర్యై నమః , ఓం సిద్ద్యై నమః , ఓం తైణ్ సౌమ్యాయై నమః , ఓం శుభప్రదాయై నమః , ఓం సర్వోపద్రవవారిణ్యై నమః , ఓం మహాకాళ్యై నమః , ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయైనమః , ఓం త్రికాలఙ్ఞానసంపన్నాయై నమః , ఓం నవదుర్గాయై నమః , ఓం భువనేశ్వర్యై నమః ,
ఓం వరలక్ష్మీ దేవతాయైనమః
(అష్టోత్తర శతనామపూజాం సమర్పయామి,అని పూలు పాదాలముందు వుంచి నమస్కారంచేసుకోవాలి.)

ధూపం:శ్లో::- దశాంగం గుగ్గులోపేతం సుగంధం చ మనోహరం
ధూపం దాస్యామి దేవేశే గృహాణ కమలప్రియే
(శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ధూపమాఘ్రాపయామి.అని రెండు అగరువత్తులను తీసుకొని వెలిగించి ధూపమును దేవికి చూపించవలెను)

దీపం:శ్లో::- ఘృతావర్తి సంయుక్తం అంధకార వినాశకం
దీపం దాస్యామితే దేవీ గృహాణ ముదితా భవ
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః దీపం సమర్పయామి(దర్శయామి)
అని వెలుగుతున్న దీపమును(రెండు అడ్డవత్తులు,ఒక కుంభవత్తివున్న రెండవ కుందిలో నూనె వేసి కర్పూరహారతి పళ్ళెములో వెలుగుచున్నదీపమును వెలిగించి ఆ దీపమును దేవికి చూపవలెను.)
ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి)

నైవేద్యం:శ్లో::- నైవేద్యం షడ్రషోపేతం దధిమధ్వాజ్య సంయుతం
నానాభక్ష్య ఫలోపేతం గృహాణ హరి వల్లభే
(శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః నైవేద్యం సమర్పయామి
అని దేవికి ప్రత్యేకంగా చేసిన రకరకాల పిండివంటలు,పాయసం,పానకం,(శుధమైన నీటిలో బెల్లం,ఏలక్కాయపొడి,మిరియాలపొడి,కలుపవలెను.)వడపప్పు,నీటిలో నానబెట్టిన పెదరపప్పును విడిగా తీసి నీళ్ళులేకుండగా అమ్మకు సమర్పించవలెను)మరియు మహా నైవేద్యం కొరకు చేసిన అన్నం,పప్పు,నెయ్యి,కూరలు,మొదలైనవి అమ్మవద్దపెట్టి నైవేద్యం చేయాలి.)

నైవేద్యం పై పువ్వుతో నీళ్ళు చల్లుతూ ఎడమచేత్తో,గంటవాయిస్తూ, 'ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం వ్యానాయ స్వాహా , ఓం ఉదానాయ స్వాహా , ఓం సమానాయ స్వాహా , ఓం స్రీవరలక్ష్మీదేవతాయైనమః నైవేద్యం సమర్పయామీ అంటూ ఆరుమార్లు చేతిలో(చేతిలోని ఉద్దరిణితో) దేవికి నివేదనం చూపించాలి.పిదప నైవేద్యానంతరం 'హస్తౌ ప్రక్షాళయామీఅని ఉద్దరిణెతో అర్ఘ్యం వదలాలి. తరువాత పాదౌ పేక్షాళయామీ అని మరో సారి నీరు అర్ఘ్యం పాత్రలో ఉద్దరిణెతో నీరు వదలాలి.పునః శుద్దాచమనీయం సమర్పయామి అని ఇంకొక పర్యాయం నీరు వదలాలి.

పానీయం:శ్లో::- ఘనసార సుగంధేన మిశ్రితం పుష్పవాసితం
పానీయం గృహ్యాతాం దేవి శీతలం సుమనోహరం
(శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః పానీయం సమర్పయామి.అని భోజనానంతరం నీళ్ళు ఇచ్చినట్లు భావించి కుడిచేత్తో నీటిని చూపుతూ ఎడమచేత్తో గంటవాయించవలెను.)

తాంబూలం:శ్లో::- పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం
కర్పూర చూర్ణసంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం
(శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః తాంబూలం సమర్పయామి.అని తమలపాకు,వక్క,సున్నం సుగంధాలతో తాంబూలం ఇవ్వడం
ఆ తరువాత శుధ ఆచమనీయం సమర్పయామి అంటు ఉద్దరిణితో నీరు అర్ఘ్యపాత్రలో వదలాలి.)
పిమ్మట కర్పూరం వెలిగించి.

నీరాజనం:శ్లో::- నీరాజనం సమానీతం కర్పూరెణ సమన్వితం
తుభ్యం దాస్యామ్యహం దేవీ గృహ్యతాం విష్ణువల్లభే
శ్రీ వరలక్ష్మీ దేవతాయైనమః నీరాజనం సమర్పయామి.అంటూ కర్పూరము వెలిగించి దేవికి హారతి ఇవ్వవలెను.తరువాత కర్పూర హారతి ఒక పక్కన పెట్టి ఒక చుక్క పంచపాత్రలోని నీరు హారతి పల్లెంలో వేయవలెను.)

మంత్రపుష్పం:శ్లో::- పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే
నారాయణే ప్రియే దేవీ సుప్రీతో భవసర్వదా
శ్రీ వరలక్ష్మీ దేవతాయైనమః మంత్రపుష్పం సమర్పయామి.అని కిన్ని పూవులు,అక్షంతలు,తీసుకొని లేచి నిలబడి నమస్కరించి ఈ పూవులు,అక్షంతలు దేవిపై వేసి కూర్చోవలెను.)

ప్రదక్షణ:శ్లో::- యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే
పాపోహం పాప కర్మాహం పాపాత్మ పాపసంభవః
త్రాహి మాం కృపయాదేవి శరణాగతవత్సలే
అన్యధా శరణంనాస్తి త్వమేవ శరణంమమ
తస్మాత్కారుణ్య భావేన రక్షరక్ష జగధారిణి
(శ్రీ వరలక్ష్మీ దేవతాయైనమః ప్రదక్షిణం సమర్పయామి.అని మోకాళ్ళపై పడుకొని కుడికాలు ఎడమకాలుపైవేసి)తరువాత దేవిపైచేతిలోనున్న అక్షంతలు,పువ్వులు చల్లవలెను.)

నమస్కారం:శ్లో::- నమస్తే లోక్యజననీ నమస్తే విష్ణువల్లభే
పాహిమాం భక్తవరదే వరలక్ష్మీ నమో నమః
(శ్రీ వరలక్ష్మీ దేవతాయైనమః నమస్కారాన్ సమర్పయామి.అని మనస్పూర్తిగా దేవికి నమస్కరించవలెను.పిమ్మట చేసిఉంచుకొన్న తోరములను ఒక పళ్ళెములో పెట్టి పసుపు,కుంకుమ,అక్షంఅతలతో పూజించవలెను.9 వరసలు 9 ముడులు కలిగిన తోరమును 9 (నవమగ్రంధిం)నామములతో పూజిస్తారు.

తోరపూజ:శ్లో::- తోరమును అమ్మవారి వద్ద ఉంచి అక్షతలతో ఈ క్రింద విధముగా పూజించవలెను.
ఓం కమలాయైనమః ప్రథమగ్రంథిం పూజయామి
ఓం రమాయైనమః ద్వితీయగ్రంథిం పూజయామి
ఓం లోకమాత్రే నమః తృతీయగ్రంథిం పూజయామి
ఓం విశ్వజనన్యైనమః చతుర్థగ్రంథిం పూజయామి
ఓం మహాలక్ష్మీనమః పంచమగ్రంథిం పూజయామి
ఓం క్షీరాబ్ధితనయాయైనమః షష్టమగ్రంథిం పూజయామి
ఓం విశ్వసాక్షిణ్యైనమః సప్తమగ్రంథిం పూజయామి
ఓం చంద్రసోదర్యైనమః అష్టమగ్రంథిం పూజయామి
ఓం శ్రీవరలక్ష్మీయైనమః నవమగ్రంథిం పూజయామి

ఈ క్రింది శ్లోకములు చదువుతూ తోరము కట్టుకొనవలెను.

బధ్నామి దక్షిణేహస్తే నవసూత్రం శుభప్రదం
పుత్రపౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహిమే రమే
(తోరమును కట్టుకొంటూ ఈ శ్లోకమును చదివి కుడిచేతికి తోరణమును కట్టి తోరమునకు పసుపు,కుంకుమ అద్దవలెను)


వాయనమిచ్చునపుడు,ఈ క్రింది శ్లోకమును చదువుచు ఇవ్వవలెను.

శ్లో::- ఏవం సంపూజ్య కళ్యాణీం వరలక్ష్మీం స్వశక్తితః
దాతవ్యం ద్వాదహాపూపం వాయనం హిద్విజాతయే


శ్లో::- ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరా వై దదాతిచ
ఇందిరా తారకోబాభ్యాం ఇందిరాయై నమోనమః
(శ్రీవరలక్ష్మీదేవతాయైనమః వాయనదానం సమర్పయామి. అనుకొని శనగలు(నానబెట్టినవి),తాంబూలం ,ఆకులు,వక్కలు,అరటిపండు,రవికగుడ్డ,పువ్వులు,మరియుతయారు చేసిన పిండివంటలను ఒకపళ్ళెములోనికి 9 రకములు రకమునకు 9 వంతునగాని(లేదా ఎవరి శక్తానుసారముగా వారు)తీసుకొని మరొక్కపళ్ళెముతో మూసి పైన కొంగును కప్పి ముత్తైదువకు బొట్టుపెట్టి ఆమెను వరలక్ష్మీదేవిగా భావించి ఈ వాయినమును అందిస్తూ ఇచ్చువారు ఇస్తినమ్మ వాయనము అని,పుచ్చుకొనేవారు అనాలి,పుచ్చుకొంటినమ్మ వాయనం అనాలి, ఇలా మూడుసార్లు చెప్పి,ఇచ్చెవారు అనాలి,నావాయనం అందుకొన్నదెవరు అని ఇచ్చేవారు, నేనేనమ్మావరలక్ష్మీదేవిని అని పుచ్చుకొనేవారు అనాలి.
ఇచ్చేవారు 'అడిగితివరం అని,పుచ్చుకొనేవారు ఇస్తివరం అని 3 సార్లు అనాలి.ఈ విధంగా దేవికి వాయనము సమర్పించి నమస్కరించాలి.)
పునః పూజ:శ్లో::- ఓం శ్రీవరలక్ష్మీ దేవ్యైనమః పునఃపూజాంచ కరిష్యే అని చెప్పుకొని పంచపాత్రలోని నీటిని చేతితో తాకి,అక్షంతలు దేవిపై చల్లుతూ ఈ క్రింద మంత్రమును చదువుకొనవలెను.

ఛత్రం ఆఛ్చాదయామి, చామరం వీజయామి,నృత్యం దర్శయామి,గీతంశ్రావయామి,సమస్తరాజోపచార, శక్యోపచార,భక్త్యోపచార,పూజాంసమర్పయామి.అనుకొని నమస్కరిస్తూ ఈ క్రింది శ్లోకమును చదవవలెను.

ఏతత్ఫలం శ్రీవరలక్ష్మీ మాతార్పణమస్తు,అంటు అక్షంతలు నీటితోపాటు అరవేణంలో వదలవలెను.పిమ్మటాశ్రీవరలక్ష్మీదేవతా ప్రసాదం శిరసా గృహ్ణామీ అనుకొని దేవివద్ద అక్షంతలు తీసుకొని తమతమ తలలపై వేసుకొనవలెను.ఆ పిదప పసుపుగణపతి వున్న పళ్ళెమునొకసారి పైకి ఎత్తి తిరిగి క్రిందవుంచి,పళ్ళెములో వున్న పసుపు గణపతిని తీసి దేవునిపీటముపై నుంచవలెను దీనిని ఉద్వాసనం చెప్పటం అంటారు.

శ్లో::- యస్య స్మృత్యాచ నోమోక్త్యాత పః పూజాక్రియాది ఘున్యూనం సంపూర్ణం తాం యాతి సద్యో వందే తమచ్యుతం మంత్ర హీనం,క్రియాహీనం,భక్తిహీనం,జనార్ధన,యత్పూజితం మయాదేవీ పరిపూర్ణం తదస్తుతే,అనయాధ్యాన ఆవాహనాదిశోడోపచార పూజయాచ భగవాన్సర్వాత్మకః శ్రీవరలక్ష్మీ దేవతా స్సుప్రీతోవరదో భవతు,
శ్రీవరలక్ష్మీదేవతా ప్రసాదం శిరసా గృహ్ణామి.
శ్రీ వరలక్ష్మీ దేవి పూజావిధానము సంపూర్ణం !!

!! శ్రీ వరలక్ష్మీ వ్రత కధా ప్రారంభం !!

శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూతుడు ఇట్లు చెప్పుచున్నాడు. మునులారా! స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒకదానిని శివుడు పార్వతికి తెలియచెప్పెను. లోకోపకారమునకై దానిని మీకు వివరంగా వివరిస్తాను. శ్రద్ధగావినవలసిందన్నాడు.

పూర్వం శివుడు ఒకనాడు తన భస్మసింహాసనంపై కూర్చొని ఉండగా ఇంద్రాది ఇతర దిక్పాలకులు, నారద మహర్షి స్తుతి స్తోత్రములతో పరమేశ్వరుడ్ని కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడ్ని ఉద్దేశించి నాథా! స్త్రీలు సర్వసౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటుకు తగిన వ్రతమునొకదానిని ఆనతీయవలసినదని అడిగినది. అందుకు ఆ త్రినేత్రుడు మిక్కిలి ఆనందించిన వాడై దేవీ! నీవు కోరిన విదముగా స్త్రీలను ఉద్ధరించు వ్రతమొకటున్నది, అది వరలక్ష్మీ వ్రతం, దాని విధివిధానం వివరిస్తాను విను. శ్రావణ మాసంలో పౌర్ణమి రోజుకు ముందువచ్చు శుక్రవారంనాడు ఈ వ్రతమును చేయవలెనని పరమేశ్వరుడు పార్వతికి చెప్పెను. పార్వతీదేవి దేవా! ఈ వరలక్ష్మీవ్రతమునకు ఆది దేవతగా ఎవరిని చేసిరి? ఈ వ్రతమును చేయవలసిన విధానమును తెలియచెప్పమని పార్వతి అడిగినది.

కాత్యాయనీ! ఈ వరలక్ష్మీవ్రతమును వివరంగా చెబుతాను భక్తి శ్రద్ధలతో విను. పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనబడు పట్టణమొకటుండేది. ఆ పట్టణము బంగారు కుడ్యములతో రమణీయముగా ఉండేది. ఆ పట్టణములో చారుమతి అనబడు ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె మిగుల సుగుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతిరోజూ ప్రాతఃకాల గృహకృత్యాలు పూర్తి చేసుకొని అత్తమామలను సేవించుకొని మితముగా సంభాషిస్తూ జీవిస్తుండేది. వరలక్ష్మీవ్రతానికి ఆది దేవతయైన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయమున చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతి! నీ యందు అనుగ్రహము కలిగినదానను, ఈ శ్రావణపౌర్ణమి నాటికి ముందువచ్చు శుక్రవారము నాడు నన్ను పూజించుము. నీవు కోరిన వరాలను కానుకలను ఇచ్చెదనని చెప్పి అంతర్ధానమయ్యెను.

చారుమతి అత్యంత ఆనందమును పొంది హే జననీ! నీ కృపాకటాక్షములు కలిగినవారు ధన్యులు, వారు సంపన్నులుగా, విద్వాంసులుగా అయ్యెదరు. ఓ పావనీ! నా పూర్వజన్మసుకృతమువలన నీ పాద దర్శనం నాకు కలిగినది అని పరిపరి విధాల వరలక్ష్మీదేవిని స్తుతించినది. చారుమతి మేల్కొని, అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు, అత్తమామలకు తెలియచెప్పింది. వారు మిక్కిలి ఆనందించినవారై చారుమతిని వరలక్ష్మీవ్రతమును చేసుకోవలసిందని చెప్పారు.

ఊరిలోని వనితలు చారుమతి కలను గురించి విన్నవారై పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురుచూస్తున్నారు. శ్రావణ శుక్రవారం రోజున చారుమతి, గ్రామంలోని స్త్రీలు ఉదయాన్నే లేచి తలారాస్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి అందరు చారుమతి గృహానికి చేరుకొన్నారు.

ఆమె గృహంలో మండపం ఏర్పరచి ఆ మండపంపై బియ్యం పోసి పంచపల్లవాలు రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలగు పల్లవములచే కలశం ఏర్పాటుచేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో "సర్వమంగలమాంగళ్యేశివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే" అని ఆహ్వానించి ప్రతిష్టించుకున్నారు. {సాద్యమైనవారు స్వర్ణ, రజిత, తామ్ర, మృణ్మయ మూర్తులను ప్రతిష్టించుకోవచ్చు}. అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు. భక్ష్య,భోజ్యాలను నివేదించారు. తొమ్మిది పోగుల తోరమును చేతికి కట్టుకున్నారు. ప్రదక్షిణ నమస్కారాలు చేసారు.

మొదటి ప్రదక్షిణ చేయగానే కాళ్ళకు అందియలు ఘల్లు ఘల్లున మ్రోగాయి. రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తములకు నవరత్న ఖచిత కంకణాలు దగద్ధగాయమానమయ్యాయి. మూడవ ప్రదక్షిణచేయగా అందరూ సర్వాభరణభూషితులయ్యారు. చారుమతి యొక్క వరలక్ష్మివ్రతం ఫలితంగా ఇతర స్త్రీలయొక్క ఇళ్ళు ధన, కనక, వస్తు వాహనములతో నిండిపోయాయి. ఆయా స్త్రీల ఇళ్ళనుండి గజతురగ రధ వాహనములు వచ్చి వారిని ఇళ్ళకు తీసుకువెళ్ళాయి. వారంతా మార్గమధ్యంలో చారుమతిని మిక్కిలి పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీ కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మీవ్రతంతో తామందరిని మహద్భాగ్యవంతులను చేసినదని పొగిడిరి. వారంతా ప్రతీ సంవత్సరం వరలక్ష్మీ వ్రతం చేసి సకలసౌభాగ్యములతో సిరిసంపదలు కలిగి సుఖజీవనం గడిపి అనంతరం ముక్తిని పొందారు.

మునులారా! మహర్షులారా! మముక్షువులారా! శివుడు పార్వతికి ఉపదేశించిన వరలక్ష్మీవ్రతాన్ని సవిస్తారంగా మీకు వివరించానన్నాడు సూతమహర్షి.
ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా సకల సౌభాగ్యాలు,సిరిసంపదలు, ఆయురారోగ్యైశ్వర్యాలు సిద్ధిస్తాయి

!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

వరలక్ష్మీ వ్రత కల్పము:

పూజా సామగ్రి:

శ్రీ వరలక్ష్మీ దేవతాయైనమః
1. పసుపు
2. కుంకుమ
3. పండ్లు
4. పూలు
5. తమలపాకులు
6. అగరవత్తులు
7. వక్కలు
8. కర్పూరం
9. గంధం
10. అక్షింతలు
11. కొబ్బరి కాయలు
12. కలశము
13. కలశ వస్త్రము

1. అమ్మవారి ప్రతిమ లేక విగ్రహము
2. పంచామృతము అనగా : ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, అన్నీ కలిపినది.
3. దీపములు , తైలం, నెయ్యి.
4. వస్త్రములు: పత్తితో చేయవచ్చు. లేదా కొత్తచీర, రవిక ( జాకెట్టు గుడ్డ ) ఉన్నచో అమ్మవారికి పూజా సమయంలో సమర్పించి తర్వాత కట్టుకోవచ్చు.
5. ఆభరణములు : కొత్తవి చేయిస్తే అవి అమ్మవారికి పెట్టిన తరువాత వేసుకోవచ్చు.
6. మహా నైవేద్యం : నేతితో చేసిన 12 రకముల పిండివంటలు. వీలు కాకపోతే వారి వారి శక్తి కొలదీ రకరకాల పిండివంటలు చేయవచ్చు.
7. తోరము : తొమ్మిది ముడులు వేసిన తోరము. పసుపు దారములో ఒక్కొక్క పూవు పెట్టి ఒక్కొక్క ముడి వేయవలెను. (తొమ్మిది తోరాలు కావాలి. ఒకటి అమ్మవారికి, మరొకటి మీకు, మిగతావి ముత్తయిదువులకు)
8. పసుపు ముద్దతో వినాయకుడిని చేయవలెను. ఒక పీటమీద కొద్దిగా బియ్యము పరచి, పూర్ణకుంభంలో ( వెండి/ఇత్తడి/రాగి/కంచు చెంబులో ) కొత్త బియ్యము వేసి, మర్రియిగుళ్ళు గాని, మామిడి ఆకులు గాని, అవి దొరకక పోతే తమల పాకులు గాని వేసి, ఆ కుంభం మీద కొత్త రవికెల గుడ్డ చుట్టిన కొబ్బరికాయ ఉంచి దానిని పీట మీద మధ్యగా ఉంచి, పూజకు సిద్ధం చేయాలి.
9. మంచి నీటితో గ్లాసు, ఉద్దరిణా ఉంచుకోవాలి.

శ్రీ వరలక్ష్మీదేవి వ్రత కథ:

అక్షింతలు చేతిలో వేసుకుని, కథ భక్తి,శ్రద్దలతో చదవండి /వినండి.

సూత మహాముని శౌనకుడు మొదలైన మహర్షులని చూసి యిలా అన్నాడు. 'ఓ మునీశ్వరు లారా! స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతమొకటి పూర్వము శివుడు పార్వతికి చెప్పాడు. దానిని చెప్తాను వినండి'.

ఒక రోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనము మీద కూర్చుని ఉండగా, పార్వతీదేవి ఆయనని సమీపించి, 'దేవా! లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వసౌభాగ్యములను, పుత్రపౌత్రాదులను కలిగి సుఖసంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతమేదో సెలవీయండి' అని అడుగగా పరమేశ్వరుడిలా చెప్పాడు. 'ఓ దేవీ! స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులనిచ్చే వ్రతం ఒకటి ఉంది. దాని పేరు వరలక్ష్మీ వ్రతం. ఆ వ్రతమును శ్రావణమాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారము రోజు చేయవలెను'.

పార్వతీదేవి ' నాథా! ఆ వరలక్ష్మీ వ్రతము ఎలా చేయాలి , ఏ దేవతను పూజించాలి? ఏ విధంగా చేయాలి? దీనినెవరైనా యింతకు ముందు చేసారా? ఆ వివరములన్నీ చెప్పండి' అని అడుగగా శివుడు పార్వతీదేవిని చూసి, ఓ కాత్యాయనీ! వరలక్ష్మీ వ్రత విశేషాలు చెప్తాను విను. పూర్వము మగధ దేశమున కుండినమనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణము నిండా బంగారు ప్రాకారములు, బంగారు గోడలు గల ఇళ్ళు ఉన్నాయి. అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది. ఆమె పతియే ప్రత్యక్ష దైవముగా భావించి, తెల్లవారు ఝామునే లేచి, స్నానం చేసి, పతిదేవుని పూవులతో కొలిచి ఆ తర్వాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి, యింటి పనులన్నీ ఓర్పుతో, నేర్పుతో చేసుకుంటుండేది. అందరితో ప్రియంగా, మితంగా మాట్లాడుతుండేది. గయ్యాళిగా కాకుండా , ఇంత అణకువగా నున్న ఆ మహా పతివ్రతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది.

ఒకరోజు ఆ మాహాయిల్లాలికి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది. 'ఓ చారుమతీ! నేను వరలక్ష్మీ దేవిని. నీ నడవడిక చూసి, నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను. శ్రావణమాసంలో శుక్ల పక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరములిస్తాను' అలా ప్రత్యక్షమైన అమ్మ వారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతీ దేవి కలలోనే వరలక్ష్మీ దేవికి ప్రదక్షిణ , నమస్కారములు చేసి ;

నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్య మూర్తయే
శరణ్యే త్రిజగ ద్వంద్యే విష్ణు వక్షస్థలాలయే


అని అనేక విధములు స్తోత్రం చేసింది.

'ఓ జగజ్జననీ! నీ కటాక్షంబు కలిగితే జనులు ధన్యులవుతారు. విద్వాంసులవుతారు. సకల సంపన్నులవుతారు. నేను పూర్వ జన్మలలో చేసిన పూజఫలం వల్ల నీ దర్శనము నాకు కలిగింది'. అనగా వరలక్ష్మీ దేవి సంతోషము చెందింది.

ఆ వెంటనే మెలకువ వచ్చి నాలుగు వైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మీ దేవి కనబడ లేదు. అప్పుడామెకు అర్థమైంది తాను కలగన్నానని. వెంటనే భర్తనీ, అత్తమామలని లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు. 'ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది. దేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఆ వ్రతం చెయ్యి' అన్నారు. చారుమతి తన యిరుగు పొరుగున ఉన్న స్త్రీలకు కూడా చెప్పింది. వాళ్ళు , చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగారు.

వారు ఎంతో ఎదురు చూసిన పౌర్ణమి ముందు శుక్రవారము రానే వచ్చింది. ఈ రోజే కదా వరలక్ష్మీ దేవి చెప్పిన రోజని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరూ పూజకుపక్రమించారు. ప్రాతః కాలమే లేచి తలారా స్నానం చేసి, పట్టు బట్టలను కట్టుకున్నారు. చారుమతి యింట్లో అందరూ చేరారు. అక్కడ ఒక ప్రదేశంలో గోమయముతో అలికారు. ఒక మంటపం ఏర్పరిచారు. దాని మీద ఒక ఆసనం వేసారు. ఆసనం పైన కొత్త బియ్యము పోసి , మర్రిచిగుళ్ళు, మామిడాకుల అలంకారలతో కలశం ఏర్పరిచారు. అందులోకి వరలక్ష్మీ దేవిని అవాహనము చేసారు.

చారుమతి మొదలగు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసారు.

పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే
నారాయణ ప్రియే దేవీ సుప్రీతా భవసర్వదా


అను ఈ శ్లోకంతో ధ్యానావాహనాది షోడశోపచార పూజ చేసారు. తొమ్మిది సూత్రములు గల తోరాన్ని కుడి చేతికి కట్టుకున్నారు. వరలక్ష్మీ దేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు.

దాని తర్వాత ప్రదక్షిణం చేస్తుండగా ఆ స్త్రీలందరికీ ఘల్లుఘల్లు మని శబ్ధం వినపడింది. వెంటనే తమ కాళ్ళను చూసుకుంటే గజ్జెలు మొదలైన ఆభరణములు కనిపించాయి. చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీ దేవి కృపా కటాక్షములు కలిగాయని ఎంతో మురిసి పోయారు. రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకు ధగధగ లాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణములు కనిపించాయి. ఇంక వాళ్ల ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది? మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే అ స్త్రీలంతా సర్వభూషణాలంకృతులయ్యారు. చారుమతి మొదలైన ఆ స్త్రీల యిళ్ళన్నీస్వర్ణమయాలయ్యాయి. వాళ్ళకి రథగజ తురగ వాహనాలు ప్రసాదింపబడ్డాయి.

చారుమతి యింటి నుంచి ఆ స్త్రీలను తీసుకుని పోవడానికి వారి వారి యిళ్ళ నుంచి గుర్రాలు, ఏనుగులు, రథాలు, బండ్లు వచ్చాయి. ఆ స్త్రీలు, చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధం, పుష్పం, అక్షింతలతో పూజించి 12 కుడుములు వాయనమిచ్చి , దక్షిణ తాంబూలములిచ్చి నమస్కరించారు. బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు. వరలక్ష్మీ దేవికి నైవేద్యం గా పెట్టిన పిండివంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు, ఏనుగులు మొదలైన వాహనాలలోవారి యిండ్లకు బయలు దేరారు.

వారు దోవలో చారిమతి భాగ్యమును, తమ భాగ్యమును ముచ్చటించుకుంటూ వెళ్ళారు. లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నములో వచ్చి ప్రత్యక్షమవట మంటే మాటలా? చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు. చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మటుకే దాచుకుని తను ఒక్కతే పూజించకూండా, తమ అందరికీ చెప్పి, తమకి కూడా ఇంతటి సౌభాగ్యం కలగజేసిన చారుమతి ఎంతటి పుణ్యురాలు, అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండిన తామెంత భాగ్యవంతులు అని ఎంతో మురుసిపోయారు.

అప్పటి నుంచీ చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతీ సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్రపౌత్రాభి వృద్ధి కలిగి, ధన కనక వస్తు వాహనములు కలిగి, సుఖ సంతోషాలతో ఉన్నారు. కావున 'ఓ పార్వతీ! ఈ ఉత్తమమైన వ్రతమును చేస్తే, అలా ఎదుటి వారికి చెప్పి చేయిస్తే సర్వసౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు. ఈ కథను విన్నవారికి, చదివిన వారికి కూడా వరలక్ష్మీ ప్రసాదము వలన సకల కార్యములూ సిద్ధించును' అన్నాడు పరమశివుడు.

సూత మహాముని శౌనకుడు మొదలగు వారితో 'మునులారా! విన్నారుగా చారుమతి ఎదుటివారి మంచి కూడా ఎలా కోరిందో! ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు యింకా ప్రసన్నురాలై మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుంది' అన్నారు.

వరలక్ష్మీ వ్రత కల్పము సమాప్తము.

కథాక్షతలు అమ్మవారి మీద వేసి, మీ మీద వేసుకుని, మిగతా వారి మీద వెయండి.

Wednesday, July 15, 2009

తిలక/విభూతి ధారణతిలక/విభూతి ధారణ

హిందూమత అనుయాయులందరూ ఫాలభాగంపై విభూతి గాని, చందనం కాని, కుంకుమ కానీ ఏదో ఒక చిహ్నం ధరించాలనే నియమం మతంయొక్క ప్రత్యేక అంశాలలో ఒకటి.

గోపీ చందన ధారణ మహావిష్ణువును, మధ్వలు ధరించే నల్లని రేఖలు విష్ణుమూర్తిని స్మరింప చేస్తాయి. ఆ విధంగా ప్రతి చిహ్నానికి ఒక ప్రత్యేకత ఉంటుంది.

విభూతి ధారణ పరమేశ్వరుని స్ఫురింపచేస్తుంది. "విభూతిర్భూతిరైశ్వర్యం". విభూతి అంటేనే ఐశ్వర్యం. లక్ష్మీ నిలయమైన గోవు పృష్ఠభాగము నుండి వెలువడిన ఆవుపేడతో విభూతి తయారు చేసుకోవాలి. మార్కెట్లో లభించేది స్వచ్ఛమైనది కాదు. లక్ష్మి గోవు పృష్ఠ భాగంలో ఉన్నట్లే ఇతర దేవతలు కూడా గోవుయొక్క వివిధ శారీరక భాగాల్లో ఉంటారు. కనుక గోమలానికి విశిష్ఠ ప్రాముఖ్యత ఉన్నది. దాని నుండి తయారు చేయబడే విభూతి సంపాదకు చిహ్నం కావడంలో విశేషం లేదు.

లక్ష్మి ప్రధానంగా ఐదు ప్రదేశాలలో నివశిస్తుంది. గోవు యొక్క పృష్ఠ భాగం, వివాహిత స్త్రీ యొక్క పాపిట భాగం, గజం యొక్క కుంభ స్థలం, పద్మం, బిల్వ దళాలు. అందుకే ఉత్తర భారత స్త్రీలు పాపిట సింధూరం ధరిస్తారు.

పూజ కొరకు వాడే పుష్పాలు, ఆకులు కోసిన రోజే వాడవలసి ఉంటుంది. కానీ బిల్వ దళాలు, పద్మాలు పది రోజుల వరకు నిల్వ ఉంచి ఉపయోగించుకోవచ్చు. అవి లక్ష్మీ నిలయాలు కానుక నిర్మాల్య దోషం వాటికి అంటదని నమ్మిక.

ధైర్య సాహసములు ఉండే చోట, సచ్చీలత నెలకొన్న స్తానలలో, సత్యసంధత విలసిల్లిన ప్రాంతాలలో కూడా లక్ష్మి నివసిస్తుంది. విభూతి ఐశ్వర్య చిహ్నం కనుక దానిని ధరించినందున దారిద్ర్యం ఉండదు, మనం ఋణగ్రస్తులం కాము.

మన ప్రజలు విభూతి ధారణను విసర్జించినారు. విభూతి ధారణను ప్రజలు పాటిస్తూ ఉన్నట్లైతే మనదేశం ఈ స్థాయిలో ఋణాలు సేకరించవలసిన అవసరం ఉండేది కాదు. ప్రజలు విభూతి ధారణ ప్రారంభించిన తరువాత దేశ ప్రగతి, శోభాయమానమైన సంఘటనలు దేశచరిత్రలో మనకు విరివిగా దర్శనమిస్తాయి. మదురైలో మహాత్మ తిరుజ్ఞాన సంబందార్ ప్రజలను విభూతి ధారణకై ప్రబోధించి ఆచరింపచేయగా దేశంలో దారిద్ర్యం నిర్మూలిమ్పబడి సర్వ సౌభాగ్యాలు నెలకొల్పాయి. కొంతమంది మాత్రము అనుష్ఠాన సమయాల్లో విభూతి ధరించి కార్యాలయాలకు వెళ్ళేటప్పుడు చెరిపి వేస్తారు. తత్ఫలితంగా ప్రజలకు లభించే ఫలితాలు, సంపదలూ, సంతోషాలు కూడా చాలా పరిమిత స్థాయిలో నిలిచిపోతున్నాయి.

ఈశ్వరుడు కూడా విభూతిని మూడు అడ్డు రేఖలుగా ఫాలభాగంపై ధరిస్తాడు. కనుక మనం కూడా విభూతి యొక్క ఆవశ్యకతను గుర్తించి, దాన్ని ఐశ్వర్యానికి, సుఖ సౌభాగ్యాలకి చిహ్నంగా భావించి నడుచుకోవాలి. విభూతి ధారణ అంతిమంగా ఈశ్వరుణ్ణి గురించి తలపింపచేస్తుందని మరచిపోకూడదు.

అంతేకాక ప్రపంచంలోని ప్రతి విషయం యొక్క అంతిమ స్థితిని విభూతి సూచిస్తుంది. దేనినైనా పూర్తిగా కాలిస్తే కడపటికి లభించేది బూడిదే. వస్తువుల యొక్క చరమ స్థాయి పరమేశ్వర తత్వమే. విభూతి స్వచ్ఛతను కూడా గోచరింప చేస్తుంది. ప్రాపంచిక విషయాలన్నితికి పరమావధి. అంతిమ స్థితి స్వచ్చమైన శ్వేతరూపుడైన పరబ్రహ్మ మాత్రమే. ఆ విధంగా విభూతి ధారణ గొప్ప వేదాంత సత్యాన్ని మనముందుంచుతుంది.

సర్వసృష్టికి హేతుభూతమైన నిత్యచైతన్య శక్తికి చిహ్నంగా మనం విభూతిదారణ చేస్తాం. ప్రపంచంలో ప్రతి విషయం శివమయమని, అదే మనకు అంతిమ లక్ష్యమని విభూతి విశదీకరిస్తుంది. ఒక వస్తువును కాలిస్తే, అది ముందు నల్లగా మారుతుంది. దానినింకా కాలిస్తే అది తెల్లటి బూడిదగా పరిణమిస్తుంది. దానిని ఇంకా కాల్చిన దానిలో మార్పు ఏమీ సంభవించదు. కనుక అన్నిరకాలైన దేహాల యొక్క చరమస్థితి బూడిద మాత్రమే. కానుక భౌతికరంగంలోని విభూతి ఆధ్యాత్మిక రంగంలో శివునితో సామ్యస్థితి కలిగియున్నది. విజ్ఞానమనే అగ్నిగుండంలో మనం ప్రతి వస్తువును కాలిస్తే చివరకు మిగిలేది శివుడు లేక పరబ్రహ్మము మాత్రమే.

అలాగే రక్తవర్ణం కల్గిన కుంకుమ లక్ష్మీదేవిని స్మృతిపథంలో నిల్పుతుంది. నిమ్మరసం, ఘ్రుతం, ఇంకా ఇతర పదార్ధాలు కలిపినా చింతపండుతో దీనిని తయారు చేస్తారు. ఈ కుంకుమనే మనం ధరించాలి. అది సాక్షాత్తు పార్వతీ స్వరూపాన్ని లేక లక్ష్మీ స్వరూపాన్ని స్మరణకు తెస్తుంది. సంపాదకు చిహ్నమైన కుంకుమ లక్ష్మీదేవిని తలపింపచేస్తుంది

శ్రీకృష్ణుని పాదఘట్టములచే పవిత్రీకరింపబడిన గోబి-మృణ్మయం మనం ధరించే గోపీచందనం ద్వారా మన స్ఫురణకు వస్తుంది. దీనివల్లనే భగవానుడు శ్రీకృష్ణుడు, గోపవనితలు కూడ మన హృదయసీమలో సాక్షాత్కారిస్తారు.

మధ్వలు వారి దేహంపైన, ఫాలభాగంపైన కూడా బొగ్గుతో మిళితమైన కాలవర్ణ రేఖల్ని ధరిస్తారు. ప్రపంచంలోని సమస్త వస్తుజాలం నశింపుకు గురి కావాల్సిందే. నశించిన ప్రతిది కాలిన బొగ్గుయొక్క మసిరూపాన్ని పొందవలసిందే. కానుక ప్రతివ్యక్తి ప్రాపంచిక విషయాలపై అనుబంధాన్ని త్యజించి, వైరాగ్య ప్రవృత్తిని అలవరచుకోవాలి. మధ్వలు దీనితో బాటు గోపీచందనాన్ని కూడా ధరిస్తారు. ఆ విధంగా వారు మహావిష్ణువుని హృదయంలో స్మరిస్తూ వైరాగ్య ప్రవృత్తిని పెంపొందించుకుంటారు.

పైన సూచించిన ఏ రూపంలోనైనా సరే తిలకం ధరించటం హిందూమతం యొక్క విశేష లక్షణం. ఈ తిలక ధారణ చేసే వారందరూ పునర్జన్మ సిద్ధాంతంలో విశ్వాసం ఉన్నవారనే విషయాన్ని కూడా ఇది సూచిస్తుంది. బౌద్ధులు, జైనులు కూడా ఈ సిద్ధాంతాన్ని ఆమోదిస్తారు కనుకనే వారుకూడా ఫాలభాగం మీద ఈ చిహ్నాలని ధరిస్తారు.

తిలకం గాని, విభూతిగాని, ధరించే విషయంలో మరొక విశిష్టత కూడా ఉంది "లలాట లిఖితా రేఖా"

శ్లో:యద్ధాత్రా నిజభాలపట్ట లిఖితం స్తోకం మహద్వాధనం!
తత్ ప్రాప్నోతి మరుస్థలేపి నితరాం మేరౌ తతోనాధికం!!
తద్దీరో భవ విత్తవతు కృపనాం వృత్తిం వృధా మా కృథా:!
కూపే పశ్య వయోనిధావాపి ఖఘటో గృహ్ణాతి తుల్యం జలం!!
వ్యక్తి యొక్క లలాట లిఖితాన్ని ఎవరూ మార్చలేరు. ఆ విషయంలో ఈశ్వరుడు కూడా అశక్తుడే. ఒక వ్యక్తి బాధలకు గురియై వాటిని గురించి వివరించినప్పుడు "అలాగని నీ లలాటం మీద వ్రాసియున్నది గనుక నీవు అనుభవించి తీరాల్సిందే"నని అంటాం. అదే విధంగా వ్యక్తికి సుఖప్రాప్తి కలిగితే 'అది నీకు రాసిపెట్టుంది గనుక నీవు సుఖంగా వున్నావు; ఆనందాన్ని అనుభవిస్తున్నావు' అని ఎవరూ చెప్పారు. వ్యక్తికి చెడు సంభవించినప్పుడు మాత్రమే లలాట లిఖితాన్ని ప్రస్తావిస్తారు. యదార్థంగా వ్యక్తికి మంచిగాని, చేదు గాని అతని లలాట లిఖితాన్ని బట్టే జరుగుతుందని, దానిని ఎవ్వరూ తప్పించలేరని, అది అనుభవించి తీరవలసిందేనని మనం గ్రహించాలి.

మనకు సూర్య, చంద్ర గ్రహణాలు సంభవిస్తూ ఉంటాయి. అవి ఎవరి జన్మనక్షత్రాల్లో సంభవిస్తాయో వారికవి కీడును కలుగచేస్తాయనే విశ్వాసం ప్రచారంలో ఉంది. ఆ కీడు నుండి రక్షించుకునే ప్రయత్నంలో వారు లిఖింపబడ్డ కాగితపు ముడత కల్గిన తాళ పత్రాన్ని ధరిస్తారు. ఉదాహరణకు చంద్రగ్రహణ కాలంలో వాడే కాగితపు మడతలో

శ్లో:ఇంద్రో నలో యమో నిర్రుతిర్వరునో వాయురేవచ!
కుబేర ఈశోఘ్నం త్విరదూపరాగోత్తవ్యధాం మమ!!

సూర్యగ్రహణ కాలంలో శబ్దాలు వస్తాయి. ఈ విధంగా చేస్తే గ్రహణ దోషాలు పోతాయి. కానీ దౌర్భాగ్యం ఏమంటే పై ఆచారం క్రమంగా మాసిపోతోంది.

మండుటెండలో బయటకు వెళ్ళవలసి వస్తే పాదరక్షలు ధరిస్తాం. అలాగే వర్షం కురిసే సమయంలో వర్షపు కోటు ధరించి బయటకు వెళ్తాం. అదేవిధంగా మంత్ర సంయుతమైన తాళ పత్రం గ్రహణం వల్ల ప్రాప్తించే చెడు ఫలితాలనుండి మనలను రక్షిస్తుంది. అలాగే విభూతి మనల్ని సర్వదా కాపాడుతూ, కర్మ సిద్ధాంతాన్ని, పరమేశ్వర తత్వాన్ని మనకు స్ఫురింప చేస్తుంది. మనం అందరం జీవితంలో సంభవించే సుఖదు:ఖాలని రెండింటినీ ఎదుర్కొనవలసినదే. కొంతవరకు వాటి తీవ్రతను తగ్గించుకొన గలమే కాని వాటిని పూర్తిగా నిర్మూలించలేము. బాధల తీవ్రతను తగ్గించుట కొరకే ప్రాయశ్చిత్తాలు, నవగ్రహ జపాలు, ఇత్యాది కర్మ కండలు ఏర్పడ్డాయి. మనం చేసిన కర్మ ఫలితాల్ని మనం ఆవశ్యం అనుభవించవలసినదే. దానినెవరూ ఆపలేరు. ఒక తమిళ సామెతలో చెప్పబడ్డట్లు
'తలను తీసివేయవలసి వస్తే తలపాగాను మాత్రమే తప్పించగలం, అంటే బాధల తీవ్రతను తగ్గించుకునే ప్రయత్నం చేయవచ్చునన్నమాట.

ఉత్తర భారతదేశంలో తలపై తలపాగ ధరించటం సర్వసామాన్యం గనుక పై సామెత అక్కడ ఆవిర్భవించినది అనుకోవచ్చు. కొన్ని సమయాలలో కొంతమంది ప్రజలు తమ బాధల్ని తట్టుకోలేక దు:ఖిస్తారు. కొద్దికాలం మాత్రమే దు:ఖా క్రాంతులై తర్వాత దానిని మరచి సహనశీలురై ప్రవర్తిస్తారు. విభూతిని ధరించినప్పుడు మనకు ఈశ్వరుడు స్మరణకు వస్తాడు. బ్రహ్మ మనలలాటం పై లిఖించిన కీరు ఈశ్వరుని కరుణ వలన తొలగి మన బాధలు నశిస్తాయి. కానుక ప్రతి వారు ప్రాతఃకాలంలో లేచి స్నానాది కాలకృత్యాలు నెరవేర్చుకొని, ఫాలభాగంపై విభూతినిగాని, తిలకాన్ని గాని, ధరించి సంధ్యావందనం, దేవతారాధన చేసి ఈశ్వర కృపకు పాత్రుడై దినచర్యలకు సమాయత్తం కావాలి.