Sunday, June 26, 2011

శ్రీ దేవీ మహాత్యం నవవర్ణ విధి



రచన::ఋషి మార్కండేయ

శ్రీగణపతిర్జయతి  ఓం అస్య శ్రీనవావర్ణమంత్రస్య బ్రహ్మవిష్ణురుద్రా ఋషయః,
గాయత్ర్యుష్ణిగనుష్టుభశ్ఛందాంసి శ్రీమహాకాలీమాహాలక్ష్మీమహాసరస్వత్యో దేవతాః,
ఐం బీజం, హ్రీం శక్తి:, క్లీం కీలకం, శ్రీమహాకాలీమాహాలక్ష్మీమహాసరస్వతీప్రీత్యర్థే జపే
వినియోగః||

ఋష్యాదిన్యాసః

బ్రహ్మవిష్ణురుద్రా ఋషిభ్యో నమః, ముఖే |
మహాకాలీమాహాలక్ష్మీమహాసరస్వతీదేవతాభ్యో నమః,హృది | ఐం బీజాయ నమః, గుహ్యే |
హ్రీం శక్తయే నమః, పాదయోః | క్లీం కీలకాయ నమః, నాభౌ | ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై
విచ్చే — ఇతి మూలేన కరౌ సంశోధ్య

కరన్యాసః

ఓం ఐమ్ అంగుష్ఠాభ్యాం నమః | ఓం హ్రీం తర్జనీభ్యాం నమః | ఓం క్లీం మధ్యమాభ్యాం
నమః | ఓం చాముండాయై అనామికాభ్యాం నమః | ఓం విచ్చే కనిష్ఠికాభ్యాం నమః | ఓం ఐం
హ్రీం క్లీం చాముండాయై విచ్చే కరతలకరపృష్ఠాభ్యాం నమః |

హృదయాదిన్యాసః

ఓం ఐం హృదయాయ నమః | ఓం హ్రీం శిరసే స్వాహ | ఓం క్లీం శిఖాయై వషట్ | ఓం చాముండాయై
కవచాయ హుమ్ | ఓం విచ్చే నేత్రత్రయాయ వౌషట్ | ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే
అస్త్రాయ ఫట్ |

అక్షరన్యాసః

ఓం ఐం నమః, శిఖాయామ్ | ఓం హ్రీం నమః, దక్షిణనేత్రే | ఓం క్లీం నమః, వామనేత్రే | ఓం
చాం నమః, దక్షిణకర్ణే | ఓం ముం నమః, వామకర్ణే | ఓం డాం నమః,
దక్షిణనాసాపుటే | ఓం యైం నమః, వామనాసాపుటే | ఓం విం నమః, ముఖే | ఓం చ్చేం
నమః, గుహ్యే |
ఏవం విన్యస్యాష్టవారం మూలేన వ్యాపకం కుర్యాత్ |

దిఙ్న్యాసః

ఓం ఐం ప్రాచ్యై నమః | ఓం ఐమ్ ఆగ్నేయ్యై నమః | ఓం హ్రీం దక్షిణాయై నమః | ఓం హ్రీం
నై‌ఋత్యై నమః | ఓం క్లీం పతీచ్యై నమః | ఓం క్లీం వాయువ్యై నమః | ఓం చాముండాయై
ఉదీచ్యై నమః | ఓం చాముండాయై ఐశాన్యై నమః | ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే
ఊర్ధ్వాయై నమః | ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే భూమ్యై నమః |

ధ్యానమ్

ఓం ఖడ్గం చక్రగదేషుచాపపరిఘాఞ్ఛూలం భుశుండీం శిరః
శంఖం సందధతీం కరైస్త్రినయనాం సర్వాంగభూషావృతామ్ |
నీలాశ్మద్యుతిమాస్యపాదదశకాం సేవే మహాకాలికాం
యామస్తౌత్స్వపితే హరౌ కమలజో హంతుం మధుం కౌటభమ్ ||

ఓం అక్షస్రక్పరశూ గదేషుకులిశం పద్మం ధనుః కుండికాం
దండం శక్తిమసిం చ చర్మ జలజం ఘంటాం సురాభాజనమ్ |
శూలం పాశసుదర్శనే చ దధతీం హస్తైః ప్రవాలప్రభాం
సేవే సైరిభమర్దినీమిహ మహాలక్ష్మీం సరోజస్థితామ్ ||

ఓం ఘంటాశూలహలాని శంఖముసలే చక్రం ధనుః సాయకమ్ |
హస్తాబ్జైర్ధధతీం ఘనాంతవిలసచ్ఛీతాంశుతుల్యప్రభామ్ |
గౌరీదేహసముద్భవాం త్రిజగతాధారభూతాం మహా |
పూర్వామత్ర సరస్వతీమనుభజే శుంభాదిదైత్యార్ధినీమ్ ||

ఓం మాం మాలేం మహామాయే సర్వశక్తిస్వరూపిణి |
చతుర్వర్గస్త్వయి న్యస్తస్తస్మాన్మే సిద్ధిదా భవ ||

ఓం అవిఘ్నం కురు మాలే త్వం గృహ్ణామి దక్షిణే కరే |
జపకాలే చ సిద్ధ్యర్థం ప్రసీద మమసిద్ధయే ||

ఐం హ్రీమ్ అక్షమాలికాయై నమః || 108 ||

ఓం మాం మాలేం మహామాయే సర్వశక్తిస్వరూపిణి |
చతుర్వర్గస్త్వయి న్యస్తస్తస్మాన్మే సిద్ధిదా భవ ||

ఓం అవిఘ్నం కురు మాలే త్వం గృహ్ణామి దక్షిణే కరే |
జపకాలే చ సిద్ధ్యర్థం ప్రసీద మమసిద్ధయే ||

ఓం అక్షమాలాధిపతయే సుసిద్ధిం దేహి దేహి సర్వమంత్రార్థసాధిని
సాధయ సాధయ సర్వసిద్ధిం పరికల్పయ పరికల్పయ మే స్వాహా |

ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే || 108 ||

గుహ్యాతిగుహ్యగోప్త్రీ త్వం గృహాణాస్మత్కృతం జపమ్ |
సిద్ధిర్భవతు మే దేవి త్వత్ప్రసాదాన్మహేశ్వరి ||

ఓం అక్షమాలాధిపతయే సుసిద్ధిం దేహి దేహి సర్వమంత్రార్థసాధిని
సాధయ సాధయ సర్వసిద్ధిం పరికల్పయ పరికల్పయ మే స్వాహా |
గుహ్యాతిగుహ్యగోప్త్రీ త్వం గృహాణాస్మత్కృతం జపమ్ |
సిద్ధిర్భవతు మే దేవి త్వత్ప్రసాదాన్మహేశ్వరి ||

కరన్యాసః

ఓం హ్రీమ్ అంగుష్ఠాభ్యాం నమః | ఓం చం తర్జనీభ్యాం నమః | ఓం డిం మధ్యమాభ్యాం
నమః | ఓం కామ్ అనామికాభ్యాం నమః | ఓం యైం కనిష్ఠికాభ్యాం నమః | ఓం హ్రీం
చండికాయై కరతలకరపృష్ఠాభ్యాం నమః |

హృదయాదిన్యాసః

ఖడ్గినీ శూలినీ ఘోరా గదినీ చక్రిణీ తథా |
శంఖినీ చాపినీ బాణభుశుండీ పైఘాయుధా | హృదయాయ నమః ||

ఓం శూలేన పాహి నో దేవి పాహి ఖడ్గేన చాంబికే |
ఘంటాస్వనేన నః పాహి చాపజ్యానిఃస్వనేన చ | శిరసే స్వాహా ||

ఓం ప్రాచ్యాం రక్ష ప్రతీంచ్యాం చ రక్ష చండికే రక్ష దక్షిణే |
భ్రామణేనాత్మశూలస్య ఉత్తరస్యాం తథేశ్వరి | శిఖాయై వషట్ ||

ఓం సౌమ్యాని యాని రూపాణి త్రైలోక్యే విచరంతి తే |
యాని చాత్యర్థఘోరాణి తై రక్షాస్మాంస్తథా భువమ్ | కవచాయ హుమ్ ||

ఓం ఖడ్గశూలగదాదీని యానిచాస్త్రాణి తే‌உంబికే |
కరపల్లవ సంగీని తైరస్మాన్ రక్ష సర్వతః | నేత్రత్రయాయ వౌషట్ ||

ఓం సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తిసమన్వితే |
భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గే నమో‌உస్తుతే | అస్త్రాయ ఫట్ ||

ధ్యానమ్

ఓం విద్యుద్దామప్రభాం మృగపతిస్కంధస్థితాం భీషణామ్ |
కన్యాభిః కరవాలఖేటవిలసద్ధస్తాభిరాసేవితామ్ |
హస్తైశ్చక్రగదాసిఖేటవిశిఖాంశ్చాపం గుణం తర్జనీమ్ |
బిభ్రాణామనలాత్మికాం శశిధరాం దు

Thursday, June 16, 2011

గంగావతరణం



















సగర పుత్రులకు స్వర్గ ప్రాప్తికై భగీరుథుడు గంగను భువికి రప్పించాడు. ఇది మనకు తెలిసిందే. కాని, అసలు ఏమి జరిగింది అన్న విషయం కొంత తెలుసుకుందాము.

శ్రీమద్వాల్మీకి రామాయణంలో బాలకాండ 38 - 44 సర్గలలో ఈ గంగావతరణాన్ని విశ్వామిత్ర-రామలక్ష్మణ సంవాదంలో వివరించారు. కాళిదాసు రఘువంశం కావ్యంలో రమణీయంగా, విపులంగా ఈ విషయాన్ని రచించారు. నేను ఇంటర్ మీడియట్ రెండో సంవత్సరంలో (రెండవ భాష సంస్కృతం) రఘువంశంలోని ఈ అంశాన్ని చదువుకున్నాను. ఇటీవల రామాయణ పారాయణంలో మళ్లీ పఠించాను.

ఇక్ష్వాకు వంశంలో జన్మించిన సగరునికి ఇద్దరు భార్యలు - కేశిని, సుమతి. వీరికి సంతతి కలుగక, హిమాలయాలకు వెళ్లి భృగుప్రవర్శన మనే చోట తపస్సు చేశారు. వీరి తపస్సుకు మెచ్చి భృగు మహర్షి సగరుడి భార్యలలో ఒకరికి వంశాభివృద్ధి కలిగించే ఒక పుత్రుడు, ఇంకొకరికి అరవై వేల మంది పుత్రులు కలుగుతారు అని ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వాద ఫలంతో కేశినికి అసమంజుడు, సుమతికి అరవైవేలమంది సగర పుత్రులు జన్మిస్తారు. వీరిలో అసమంజుడు దుష్ట చేష్టలు చేస్తూ ఉంటే సగరుడు అతడిని రాజ్య బహిష్కారం చేస్తాడు. అసమంజుని కుమారుడు అంశుమానుడు యోగ్యుడు.

ఈ సమయంలో సగరుడు యాగం తలపెడతాడు. యాగాశ్వాన్ని ఇంద్రుడు అపహరించి కపిల మహర్షి ఆశ్రమంలో దాచుతాడు. దీని వలన యాగం అసంపూర్ణంగా ఉంటుంది. అది తనకు అరిష్టమని గ్రహించిన సగరుడు తన అరవైవేలమంది పుత్రులను అశ్వాన్ని వెదకమని పంపిస్తాడు. భూనభోంతరాళములలో ఎక్కడ ఉన్నా వెదికి తీసుకురమ్మని ఆదేశిస్తాడు. సగర పుత్రులు భూమి అంతటా వెదికి, భూమిలో తవ్వి, సర్పలోకాన్ని వెదికి ఎక్కడ అశ్వం కనిపించక రసాతాలానికి వెళ్తారు. అన్ని దిక్కులు వెదికినా అశ్వం కనిపించదు. ఈశాన్య దిక్కులో శివస్థానంలో భూమిని తవ్వి వెదుకుతారు. అక్కడ కపిల మహర్షి ఆశ్రమంలో వారికి అశ్వం కనిపిస్తుంది. 'ఓరీ దుష్టుడా! నీవే మా తండ్రి గారి యాగాశ్వాన్నిఅపహరించావు' అని ఆ మహర్షిని దూషిస్తారు. అప్పుడు ఆ మహర్షి ఆగ్రహంతో వారిని ఒక్క చూపుతో భస్మీపటలం చేస్తాడు. ఆ మహర్షి క్రోధాగ్నికి భస్మపు కుప్పగా మారుతారు సగర పుత్రులు.

ఎన్నాళ్ళైనా పుత్రులు తిరిగి రాకపోయేసరికి సగరుడు మనుమడైన అంశుమానుడిని యాగాశ్వాన్ని, పిన తండ్రులను వెదకమని పంపిస్తాడు. కపిల మహర్షి ఆశ్రమము వద్దకు వచ్చి వారు దగ్ధమై ఉండటం చూసి దుఃఖితుడవుతాడు. వారికి ఉత్తరక్రియలు జరుపుదామని నిశ్చయిస్తాడు. కానీ, ఆ ప్రాంతంలో ఎక్కడ నీరు అనేది కనిపించదు. అప్పుడు సగర పుత్రుల మేనమామ (సుమతి సోదరుడు) అయిన గరుత్మంతుడు ప్రత్యక్షమై అంశుమానుడితో - 'నాయనా, ఇలా దగ్ధమైన నీ పిన తండ్రులకు స్వర్గ ప్రాప్తి జరగాలంటే మామూలు జలం చాలదు. దేవలోకంలో ఉన్న గంగానది వచ్చి వీరి భస్మంపై ప్రవహిస్తే వీరికి స్వర్గ ప్రాప్తి కలుగుతుంది' - అని చెప్తాడు. అంశుమానుడు యాగాశ్వాన్ని తీసుకొని సగరుడి దగ్గరకు తిరిగి వచ్చి జరిగింది వివరిస్తాడు. సగరుడు యాగాన్ని పరిసమాప్తి చేస్తాడు.

సగరుడు గంగను భువికి ఎలా తీసుకురావాలి అన్న దానిమీద నిర్ణయం తీసుకోలేకపోతాడు. తరువాత ముప్ఫై వేల సంవత్సరాలు పాలించి తనువు చాలిస్తాడు. అంశుమానుడు రాజ్యం పాలిస్తాడు. అతనికి దిలీపుడు అని ఒక సుపుత్రుడు జన్మిస్తాడు. అంశుమానుడు కొడుకుకి రాజ్యభారం అప్పగించి తపస్సులకై హిమాలయాలకు వెళతాడు. అంశుమానుడు ముప్ఫై రెండువేల ఏళ్ళు తపస్సు చేసిన తర్వాత స్వర్గ ప్రాప్తి పొందుతాడు కాని గంగను భూమి మీదకు తీసుకు రాలేకపోతాడు.

దిలీపుడు ధర్మబద్ధంగా పాలిస్తాడు. కానీ, ఆయన కూడా గంగను ఎలా తీసుకువచ్చి సగర పుత్రులకు స్వర్గ ప్రాప్తి కలిగించాలి అన్న సంకల్పం,నిశ్చయం చేసుకోలేకపోతాడు. దీని గురించి విచారపడతాడు దిలీపుడు. ఆ విచారంలోనే అతడు ప్రాణం విడుస్తాడు. దిలీపుడికి సర్వ లక్షణ సంపన్నుడైన కుమారుడు కలుగుతాడు. అతడే భగీరథుడు.

భగీరథుడు పుత్రసంతానం లేక విచారంలో ఉంటాడు. అప్పుడు ఆ మహారాజు రాజ్యభారాన్ని మంత్రులకు అప్పగించి, తన పిత్రుదేవతలైన సగర పుత్రుల స్వర్గ ప్రాప్తికి, తనకు పుత్ర సంతాన ప్రాప్తి కోసం ఘోర తపస్సు చేస్తాడు. కొన్ని వేల ఏళ్ళు తపమొనరించిన తర్వాత బ్రహ్మ దేవుడు ప్రత్యక్షమై అతని తపస్సుకి మెచ్చి గంగ ప్రవాహం ద్వారా సాగరపుత్రులకు స్వర్గ ప్రాప్తి, భగీరథుడుకి పుత్రప్రాప్తి వరాలను ఇస్తాడు. కానీ, గంగా ప్రవాహాన్ని తట్టుకొనే శక్తి భూమికి లేదని, ఆ పనికి ఒక్క శంకరుడే సమర్థుడని చెప్పి అంతర్ధానం అవుతాడు బ్రహ్మ.

గంగావతరణం కోసం భగీరథుడు ఏడాది శివుడి గురించి తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్షమై గంగను తన శిరస్సులో దాల్చటానికి ఒప్పుకుంటాడు. దేవతలా ఆశీర్వాదంతో గంగావతరణం మొదలవుతుంది.

గంగ పొగరుతో శివున్ని ముంచి పాతాళానికి వెళ్లాలని ఉవ్విళ్లూరుతుంది. శివుడి క్రోధంతో ఆమె మదాన్ని అణిచి తన జటా ఝూటాల్లో ఆమెను బంధిస్తాడు. గంగ ఆ బంధనంలోంచి బయట పడటానికి తీవ్ర ప్రయత్నం చేసి విఫలమవుతుంది. అలా బందీ అయిన గంగను భువి మీదికి వదలమని భగీరథుడు మళ్ళీ శివుని మెప్పించ తపస్సు చేస్తాడు. ఆ సదాశివుడు సంతుష్టుడై గంగను భూమి మీదకు విడుస్తాడు.




















అలా శివుని జటా ఝూటాల్లోంచి గంగానది హిమాలయాలలోని బిందు సరస్సు ప్రాంతంలో భూమిని ఏడు పాయలుగా తాకుతుంది - తూర్పు దిక్కుగా హ్లాదిని, పావని, నళిని నదులుగా, పశ్చిమ దిక్కుగా సుచక్షు, సీత, సింధు నదులుగా పారుతుంది.

గంగా ప్రవాహమున సాగి వచ్చిన చేపలు, తాబేళ్లు, మొసళ్ళు మరియు ఇతర జంతువులతో భూమి మిక్కిలి శోబిల్లెను. దివినుండి భువికి దిగి వచ్చిన గంగను దేవతులు, ఋషులు, గంధర్వులు, సిద్ధులు కన్నుల పండువగా, సంభ్రమాశ్చర్యములతో చూశారు. గంగా ప్రవాహము కొన్ని చోట్ల అతివేగంగా, కొన్ని చోట్ల వంకరగా, కొన్ని చోట్ల విశాలముగా, కొన్ని చోట్ల దూకుతూ, తుళ్ళి పడుతూ, ఇంకొక చోట ప్రశాంతముగా సాగింది. దేవతలు, ఋషులు మున్నగు వారు "ఈ జలము శివుని శిరస్సునుంది పడింది, కనుక అతి పవిత్రమైనది" అని తలచుకుంటూ, ఆ నీటిని తమ శిరస్సుపై చల్లుకొని ఆచమనం చేశారు. శాపం వలన దివినుండి భువికి చేరినవారు ఈ గంగలో మునిగి పాపరాహితులై, తిరిగి తమ లోకాలకు వెళ్లారు. పవిత్ర గంగానదీ స్నానముచే జనాలు అలసటలు తొలగి సంతోషించారు.


ఏడవ పాయ భగీరథుడి రథాన్ని దక్షిణ దిక్కుగా అనుసరించి, జహ్ను మహర్షి ఆశ్రమాన్ని, యజ్ఞ వాటికను ముంచెత్తుతుంది. ఆ మహర్షి ఆగ్రహం చెంది ఆ నదిని మింగేస్తాడు. దేవతలు, ఋషులు, యక్షులు, గంధర్వులు ఆ మహర్షి పాదాలపై పడి గంగను వదలమని ప్రార్థిస్తారు. అప్పుడు శాంతించిన జహ్ను మహర్షి తన చెవి ద్వారా గంగను వదులుతాడు. అలా జహ్ను మహర్షి కుమార్తెయై గంగ జాహ్నవి అనే నామంతో కూడా పిలవబడింది. దక్షిణ దిశగా ప్రవహించి సాగరంలో కలిసి, పాతాళానికి వెళ్లి సగర పుత్రులను పావనం చేస్తుంది గంగ.

అప్పుడు బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమై భగీరథుడిని ప్రశంసించి, సాగరపుత్రులకు స్వర్గాలోకాలను అనుగ్రహిస్తారు. పిత్రుదేవతలకోసం అంతటి కష్టతరమైన కార్యం సాధించిన భగీరథుడికి ఎన్నో వరాలు ఇస్తారు. గంగావతరణానికి కారకుడైన అతడిని భువిలో గంగకు తండ్రిగా శ్లాఘిస్తారు. అప్పటినుంచి గంగ భాగీరథిగా ప్రసిద్ధి చెందింది.

గంగ మూడు లోకాలు (దివి, భువి, పాతాళం), మూడు దిక్కులు (తూర్పు, పడమర, దక్షిణ) పారింది కనుక త్రిపథగ గా పేరొందింది. అలా అవతరించిన గంగా నది ఈ అవనిలో అత్యంత పావనమైన నదిగా విశ్వ విఖ్యాతి పొందింది.

సీతా కల్యాణం చిత్రంలో బాపు, రమణలు ఈ ఘట్టాన్ని అందంగా, సవివరంగా తెరకు ఎక్కించారు. సదాశివ బ్రహ్మేన్ద్రులు మంచి కీర్తన రచించారు ఈ గంగా నదిపై.

తుంగ తరంగే గంగే జయ తుంగ తురంగే గంగే
దూరీకృత జన పాప సమూహే పూరిత కచ్ఛప పృచ్ఛగ్రాహే |తుంగ|
పరమహంస గురు భణిత చరిత్రే బ్రహ్మా విష్ణు శంకర నుతి పాత్రే |తుంగ|

శ్రీ రామ జయ రామ జయ జయ రామ

అంతర్యామి - అంతయును నీవే
నుండి సేకరించినది :)

వీరిచే పోస్ట్ చెయ్యబడింది Prasad Akkiraju వద్ద

గోవు పూజ పాట














గోవు అడుగులయందు అష్టైశ్వర్యములుండును.
గిట్టల మధ్యన గంధర్వులుందురు.
పాదాలయందు చతుర్వేదములుండు
పిక్కలయండు గుడి గంటలుండు
గిట్టల చివర పన్నగులుందురు
గిట్టల ప్రక్కలో అప్సరసలుందురు
తొడలయందు సర్వలోక తీర్ధములుండు
పొదుగున పుండరీకాక్షుడు ఉండును
చనులయందు సాలగ్రామాలుండును
పితుకుల యందు సప్త సముద్రములుండు
నాభియందున శ్రీకమలముండు
కడుపున భూదేవి స్థిరముగానుండు
తోకను సోముడు నివసించుచుండును
తోకయందలి రోమాల సూర్యరశ్మి యుండు
ఉర మధ్యమున ఋషులు నివసింతురు.
చర్మమున సకల శుభములు వర్ధిల్లు
శరీరములోని రోమాల సకల దేవతలు ఉండు
మాంసమున మాధవుడు నిలయమై ఉండు
ఎముకల యందు బ్రహ్మ నివసించు
పృష్ట భాగమున ఏకాదశ రుద్రులు ఉండెదరు
హృదయమున సాధ్వులు వసించుచుందురు
మూపురమున చుక్కలు మెరయుచునుందురు
మెడను ఇంద్రుడు నివసించుచుండు
పెదవులు వైకుంట ద్వారములగును
నాలుకయండు నారాయణుడుండు
దవడలయందు ధర్మదేవత యుండు
నోరున లోకేశము నిలయమై యుండు
హుంకారమున సరస్వతీ దేవి నివసించు
ముక్కున శీతాచల పుత్రి యుండు
ముక్కు కాడన కుమార స్వామి వర్ధిల్లు
గడ్డము కైలాస శిఖరమై యుండు
నుదురున పరమేశ్వరుడు నివసించును
నేత్రముల సూర్య చంద్రులు మెరయు
కర్ణముల అశ్వనీ దేవతలు వెలయు
కొమ్ములు గోవర్ధన పర్వతములగును
కొమ్ముల కొసలు సర్వ తీర్ధములగును
గోవు పాలయందు సరస్వతీ నదియు,
పంచితమున గంగానదియు,
గోమయమున శ్రీమహాలక్ష్మియును
ఆజ్యమున అగ్నిదేవుడును నివసించును

గోవుపాట పాడిన ఫలితమెయ్యది యనగా
వేకువన పాడితే కోటి వేల నదులలో స్నానాలు చేసిన ఫలితం
ప్రొద్దున్నే పాడితే కోటి వేల బ్రహ్మ కలశాల నోము నోచిన ఫలితం
మధ్యాహ్నమున పాడితే కోటి వేల బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఫలితం
సంధ్య వేళ పాడితే కోటి దేవాలయములలో దీపారాధన చేసిన ఫలితం
అమావాస్య నాడు పాడితే ఆరునెలల పాపం,
పౌర్ణమి నాడు పాడితే పది నెలల పాపం పోవును
గోవును వర్ణించిన ఇంతికి సకల శుభములు, ఇహ పర సుఖములు కలుగును.