Monday, April 25, 2016

నారాయణ స్తోత్రం :::రేవతి::రాగం




రేవతి::రాగం 
రచన::ఆది శంకరాచార్య
{హిందుస్తాని రాగ బైరాగి}

1::నారాయణ నారాయణ జయ గోవింద హరే గోవింద హరే
నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే 

నారాయణ నారాయణ జయ గోవింద హరే గోవింద హరే
నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే 

2::కరుణాపారావార వరుణాలయగంభీర నారాయణ  
ఘననీరదసంకాశ కృతకలికల్మషనాశన నారాయణ||నా||  

3::యమునాతీరవిహార ధృతకౌస్తుభమణిహార నారాయణ  
పీతాంబరపరిధాన సురకళ్యాణనిధాన నారాయణ ||నా||  

4::మంజులగుంజాభూష మాయామానుషవేష నారాయణ  
రాధాధరమధురసిక రజనీకర కులతిలక నారాయణ ||నా||  

5::మురళీగానవినోద వేదస్తుతభూపాద నారాయణ
వారిజభూషాభరణ రాజీవరుక్మిణీరమణ నారాయణ ||నా||  

6:: జలరుహదళనిభనేత్ర జగదారంభకసూత్ర నారాయణ  
పాతకరజనీసంహార కరుణాలయ మాముద్ధర నారాయణ ||నా||  

7::అఘబకహయకంసారే కేశవ కృష్ణ మురారే నారాయణ  
హాటకనిభపీతాంబర అభయం కురు మే మావర నారాయణ ||నా||   

8::దశరథరాజకుమార దానవమదసంహార నారాయణ   
గోవర్ధనగిరి రమణ గోపీమానసహరణ నారాయణ ||నా||  

9::సరయుతీరవిహార సజ్జనఋషిమందార నారాయణ 
విశ్వామిత్రమఖత్ర వివిధవరానుచరిత్ర నారాయణ  ||నా|| 

10::ధ్వజవజ్రాంకుశపాద ధరణీసుతసహమోద నారాయణ 
జనకసుతాప్రతిపాల జయ జయ సంస్మృతిలీల నారాయణ ||నా|| 

11::దశరథవాగ్ధృతిభార దండక వనసంచార నారాయణ 
ముష్టికచాణూరసంహార మునిమానసవిహార నారాయణ ||నా|| 

12::వాలివినిగ్రహశౌర్య వరసుగ్రీవహితార్య నారాయణ 
శ్రీ మురళీకర ధీవర పాలయ పాలయ శ్రీధర నారాయణ ||నా||  

13::జలనిధి బంధన ధీర రావణకంఠవిదార నారాయణ 
తాటకమర్దన రామ నటగుణవివిధ సురామ నారాయణ ||నా||  

14::గౌతమపత్నీపూజన కరుణాఘనావలోకన నారాయణ 
సంభ్రమసీతాహార సాకేతపురవిహార నారాయణ ||నా|| 

15::అచలోద్ధృతచంచత్కర భక్తానుగ్రహతత్పర నారాయణ 
నైగమగానవినోద రక్షిత సుప్రహ్లాద నారాయణ ||నా||  


ఇతి శ్రీమత్ శంకరాచార్య విరచిత నారాయణస్తోత్రం సంపూర్ణం 

1::నారాయణ నారాయణ జయ గోవింద హరే 
నారాయణ నారాయణ జయ గోపాల హరే 

2::కరుణాపారావార వరుణాలయగంభీర నారాయణ 
ఘననీరదసంకాశ కృతకలికల్మషనాశన నారాయణ  

3::యమునాతీరవిహార ధృతకౌస్తుభమణిహార నారాయణ  
పీతాంబరపరిధాన సురకళ్యాణనిధాన నారాయణ  

4::మంజులగుంజాభూష మాయామానుషవేష నారాయణ  
రాధాధరమధురసిక రజనీకరకులతిలక నారాయణ  

5::మురళీగానవినోద వేదస్తుతభూపాద నారాయణ  
బర్హినిబర్హాపీడ నటనాటకఫణిక్రీడ నారాయణ  

6::వారిజభూషాభరణ రాజీవరుక్మిణీరమణ నారాయణ 
జలరుహదళనిభనేత్ర జగదారంభకసూత్ర నారాయణ  

7::పాతకరజనీసంహార కరుణాలయ మాముద్ధర నారాయణ 
అఘ బకహయకంసారే కేశవ కృష్ణ మురారే నారాయణ  

8::హాటకనిభపీతాంబర అభయం కురు మే మావర నారాయణ  
దశరథరాజకుమార దానవమదసంహార నారాయణ 

9::గోవర్ధనగిరి రమణ గోపీమానసహరణ నారాయణ  
సరయుతీరవిహార సజ్జన‌ఋషిమందార నారాయణ  

10::విశ్వామిత్రమఖత్ర వివిధవరానుచరిత్ర నారాయణ  
ధ్వజవజ్రాంకుశపాద ధరణీసుతసహమోద నారాయణ  

11::జనకసుతాప్రతిపాల జయ జయ సంస్మృతిలీల నారాయణ  
దశరథవాగ్ధృతిభార దండక వనసంచార నారాయణ  

12::ముష్టికచాణూరసంహార మునిమానసవిహార నారాయణ 
వాలివినిగ్రహశౌర్య వరసుగ్రీవహితార్య నారాయణ  

13::మాం మురళీకర ధీవర పాలయ పాలయ శ్రీధర నారాయణ  
జలనిధి బంధన ధీర రావణకంఠవిదార నారాయణ 

14::తాటకమర్దన రామ నటగుణవివిధ సురామ నారాయణ 
గౌతమపత్నీపూజన కరుణాఘనావలోకన నారాయణ  

15::సంభ్రమసీతాహార సాకేతపురవిహార నారాయణ  
అచలోద్ధృతచంచత్కర భక్తానుగ్రహతత్పర నారాయణ  

16::నైగమగానవినోద రక్షిత సుప్రహ్లాద నారాయణ  
భారత యతవరశంకర నామామృతమఖిలాంతర నారాయణ  

 Revati Raga
Sankaraachaarya::rachana
(Hindustaani Raga Bairagi)

nārāyaṇa nārāyaṇa jaya govinda hare  
nārāyaṇa nārāyaṇa jaya gopāla hare  

1::karuṇāpārāvāra varuṇālayagambhīra nārāyaṇa  
ghananīradasaṅkāśa kṛtakalikalmaṣanāśana nārāyaṇa  

2::yamunātīravihāra dhṛtakaustubhamaṇihāra nārāyaṇa  
pītāmbaraparidhāna surakaḷyāṇanidhāna nārāyaṇa  

3::mañjulaguñjābhūṣa māyāmānuṣaveṣa nārāyaṇa  
rādhādharamadhurasika rajanīkarakulatilaka nārāyaṇa  

4::muraḷīgānavinoda vedastutabhūpāda nārāyaṇa  
barhinibarhāpīḍa naṭanāṭakaphaṇikrīḍa nārāyaṇa  

5::vārijabhūṣābharaṇa rājīvarukmiṇīramaṇa nārāyaṇa  
jalaruhadaḷanibhanetra jagadārambhakasūtra nārāyaṇa  

6::pātakarajanīsaṃhāra karuṇālaya māmuddhara nārāyaṇa  
agha bakahayakaṃsāre keśava kṛṣṇa murāre nārāyaṇa  

7::hāṭakanibhapītāmbara abhayaṃ kuru me māvara nārāyaṇa  
daśaratharājakumāra dānavamadasaṃhāra nārāyaṇa  

8::govardhanagiri ramaṇa gopīmānasaharaṇa nārāyaṇa  
sarayutīravihāra sajjana--ṛṣimandāra nārāyaṇa  

9::viśvāmitramakhatra vividhavarānucaritra nārāyaṇa  
dhvajavajrāṅkuśapāda dharaṇīsutasahamoda nārāyaṇa  

10::janakasutāpratipāla jaya jaya saṃsmṛtilīla nārāyaṇa  
daśarathavāgdhṛtibhāra daṇḍaka vanasañcāra nārāyaṇa  

11::muṣṭikacāṇūrasaṃhāra munimānasavihāra nārāyaṇa  
vālivinigrahaśaurya varasugrīvahitārya nārāyaṇa  

12::māṃ muraḷīkara dhīvara pālaya pālaya śrīdhara nārāyaṇa  
jalanidhi bandhana dhīra rāvaṇakaṇṭhavidāra nārāyaṇa  

13::tāṭakamardana rāma naṭaguṇavividha surāma nārāyaṇa  
gautamapatnīpūjana karuṇāghanāvalokana nārāyaṇa  

14::sambhramasītāhāra sāketapuravihāra nārāyaṇa  
acaloddhṛtacañcatkara bhaktānugrahatatpara nārāyaṇa  

15::naigamagānavinoda rakṣita suprahlāda nārāyaṇa  
bhārata yatavaraśaṅkara nāmāmṛtamakhilāntara nārāyaṇa  

Wednesday, April 13, 2016

మూడు తొండాల గణపతి


అరుదైన విగ్రహం - మూడు తొండాల గణపతి
ఏ పని మొదలుపెట్టాలన్నాముందుగా మనం పూజించేది ఆ గణనాథుడిని. ఏకదంతుడిగా ప్రసిద్ధి చెందిన ఆ వినాయకుడికి మూడు తొండాలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా, నమ్మాలి మరి. ఇలా మూడు తొండాలున్న త్రిసూంద్ గణపతిని చూడాలంటే మనం పూనేలో ఉన్న సోమ్వర్ పేట్ జిల్లాకి వెళ్ళాల్సిందే. ఈ ప్రాంతంలో ఉన్న నజగిరి అనే నదీ తీరంలో ఉంది ఈ త్రిసూంద్ గణపతి దేవాలయం. 

భీమజీగిరి గోసవి అనే వ్యక్తీ ఈ ఆలయాన్ని 1754లో మొదలుపెట్టారట. పదహారు సంవత్సరాల నిర్మాణం తరువాత 1770లో గణపతిని ప్రతిష్టించారు. ఇక్కడి గర్భగుడి గోడల మీద మూడు శాసనాలు చెక్కబడి ఉన్నాయట. రెండు శాసనాలు సంస్కృతంలో ఉంటే మూడోది పెర్షియన్ భాషలో ఉందట. ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఆలయంలోని వినాయకుడికి మూడు తొండాలు, ఆరు చేతులు ఉండి స్వామి నెమలి వాహనంపై ఆశీనుడై ఉంటాడట. 

ఆలయ ప్రవేశ ద్వారం దగ్గర ఉన్న ద్వారపాలకుల విగ్రహాలు ఎంతో అందంగా చెక్కబడి ఉంటాయి. ఆలయంప్రాంగణంలో కూడా అనేక దేవతా విగ్రహాలు, ఏనుగులు, గుర్రాలు మొదలైన జంతువుల విగ్రహాలు శోభాయమానంగా కనపడతాయి. ఎక్కడా లేని మరొక వింత ఈ ఆలయంలో ఒక గోడ మీద అమెరికన్ సైనికుడు ఖడ్గ మృగాన్ని ఇనప చైనులతో కడుతున్నట్టుగా ఉండే విగ్రహం. ఇలాంటి విగ్రహాలు మన దేశంలో మరెక్కడా చూడలేము. అలాగే ఆలయాన్ని నిర్మించిన గోసవి మహాశయుడి సమాధి కూడా ఆ ఆలయ ప్రాంగణంలో ఉండటం ఇంకో విశేషం. ఆలయం క్రింద భాగంలో నీరు నిలవ ఉండే విధంగా కొలనులాంటిది కట్టారు. ఎప్పుడూ నీటితో ఉండే ఆ కొలనుని గురుపూర్ణిమ రోజు నీరంతా ఖాళీ చేసి పొడిగా ఉంచుతారు. ఆ రోజు అక్కడివారు తమ గురువుగా భావించే ఆలయ నిర్మాణకర్త గోసవికి పూజలు నిర్వహిస్తారు.

ఈ ఆలయంలో సంకటహర చతుర్థిని ఎంతో ఘనంగా నిర్వహించే ఆచారం ఎప్పటి నుంచో కొనసాగుతూ వస్తోందిట. నెలలో ఆ ఒక్క రోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కూడా. ఇక వినాయక చవితి ఉత్సవాలు ఇంకెంత ఘనంగా జరుగుతాయో వేరే చెప్పకర్లెద్దు. తొమ్మిది రోజులు పూనే చుట్టుపక్కల ఉన్న ఊరుల నుంచి భక్తులు వచ్చి ఇక్కడ విశేష పూజలు నిర్వహిస్తారట. రాజస్థాని, మాల్వా మాదిరి శిల్పకళ ఉట్టిపడే ఈ ఆలయాన్ని ప్రస్తుతం ఒక ట్రస్ట్ నడిపిస్తోందని చెపుతున్నారు ఇక్కడి అధికారులు
teluguone.com nundi sekarana