Thursday, November 28, 2013

శ్రీ శైలేశ భ్రమరాంబా స్తుతిః

1::నమ శ్శివాభ్యాం నమయౌవ నాభ్యాం 
పరస్పరాశ్లి ష్టవ పుర్ద రాభ్యామ్ 
నాగేంద్ర కన్యావృషకేత నాభ్యాం 
నమోనమ శ్శంకర పార్వతీ భ్యామ్  

2::నమశ్శి వాభ్యాం వృష వాహనాభ్యాం 
విరించివిష్ణ్వింద సుపూజితాభ్యామ్ 
విభూతిపాటీ రవిలేప నాభ్యాం
నమో నమశ్శంకర పార్వతీ భ్యామ్ 

3::అనఘం జనకం జగతాం ప్రధమం 
వరదం కర శూలధరం సులభమ్ 
కరుణాంబునిధం కలుషా పహరం 
ప్రణమామి మహేశ్వర మేక మహామ్ 

4::అమలం కమలో ద్భవగీత గుణం 
శమదం సమదాసుర నాశకరమ్ 
రమణీయ రుచం కమనీయతనుం 
నమ సాంబ శివం నత పాపహరమ్ 

5::శివం శంకరం బంధురం సుందరేశం 
నటేశం గణేశం గిరీశం మహేశమ్ 
దినేశేందునేత్రం సుగాత్రం మృడానీ 
పతిం శ్రీగిరీశం హృదాభావయామి  

6::భ్రంగీచ్చా నటనోత్కటః కరిమద గ్రాహీస్ఫురన్మాధవా
హ్లాదో నాదయుతో మహాసితవపుః పంచేషుణాచాదృతః 
సత్పక్ష స్సుమనో వనేషుస పున స్సాక్షాన్మదీయే మనో 
రాజీవే భ్రమరాధ పోవిహరతాం శ్రీ శైలవాసీ విభుః   

7::సోమోత్తం సస్సుర పరి షదా మేష జీవాతు రీశః 
పాశచ్చేత్తా పద యుగ జుషాం పుల్ల మల్లీ నీకాశః 
ధ్యేయో దేవః ప్రకటి తవధూ రూపనామాత్మభాగః 
శ్రీ శైలాగ్రే కలితవ సతి ర్విశ్వరక్షాధురీణః  

8::ఏణం పాణౌ శిరసిత రుణో ల్లాసమేణాంక ఖండం 
పార్శ్వే మామేవ పుషి తరుణీం దృక్షు కారుణ్యలీ లాం 
భూతిం ఫాలే స్మిత మపి ముఖే గాంగ మంభః కపర్దే 
బిభ్రత్ప్రేమ్ణా భువన మఖిలం శ్రీ గిరీశస్స పాయూత్    

9::శ్రీశైలే స్వర్ణ శృంగేమణి గణరచితే కల్ప వృక్షాళిళీతే 
స్ఫీతే సౌవర్ణ రత్నస్ఫురిత నవగృహే దివ్య పీటే శుభార్షే 
ఆసీన స్సోమచూడ స్సకరుణన యన స్సాంగన స్స్మేర వక్త్రః 
శంభుః శ్రీభ్రా మరీశః ప్రకటిత విభవో దేవతాసార్వ భౌమః    

10:యాయోగి బృంద హృద యాంబుజరాజ హంసీ 
మంద స్మిత స్తుత ముఖీ మధు కైటభఘ్నీ 
విఘ్నాంధ కారతట భేద పటీయసీసా 
మూర్తిః కరోతు కుతుకం భ్రమరాంబి కాయాః 

11:కస్తూరీ తిలకాంచితేందువిలస త్ప్రోద్భా సిఫాల స్థలీం 
కర్పూర ద్రవమిశ్ర చూర్ణ ఖపురా మోదోల్ల సద్వీటికాం 
లోలాపాంగ దరంగి తైరధ కృపా సారైర్నతానంది నీం 
శ్రీశైలస్థల వాసినీం భగవతీం శ్రీమాతరం భావయే  

12:రాజన్మత్త మరాళ మంద గమనాం రాజీవ పత్రేక్షణాం 
రాజీవ ప్రభ వాది దేవమకుటై రాజత్పదాంభోరుహామ్ 
రాజీవవాయ పుత్ర మండి తకుచాం రాజాధ రాజేశ్వరీం 
శ్రీశైలస్థల వాసినీం భగవతీం శ్రీమాతరం భావయే    

13:శ్రీ నాధాదృత పాలిత త్రిభువనాం శ్రీ చక్ర సంచారిణీం 
గానా సక్త మనోజ్ఞ యౌవనలస ద్గంధర్వక న్యాదృతామ్ 
దీనానా మతివేల భాగ్య జననీం  దివ్యాంబరాలంకృతాం 
శ్రీశైలస్థల వాసినీం భగవతీం శ్రీమాతరం భావయే 

14:ఉభౌదర్వీకుంభౌ మణి కనక సంభావిత గుణౌ 
దధానా పాణిభ్యా మమృతర సమృతర సమృష్టాన్నకలితౌ 
కలాడ్యా కల్యాణీ కలిత సదనా శ్రీగిరిశిర 
స్యసౌ భ్రామర్యంబా రచయతు మదిష్టార్ద విభవమ్ 

ఇతి శ్రీ శైలేశ భ్ర మరాంబాస్తుతిః

శ్రీ విఘ్నేశ్వరాష్టోత్తర శతనామస్తోత్రం1::వినాయకో విఘ్నరాజో గౌరీపుత్రో గణేశ్వరః 
   స్కందాగ్రజోవ్యయః పూతో దక్షోక్షో ద్విజప్రియః 

2::అగ్నిగర్వచ్ఛిదింద్రశ్రీప్రదో వాణీప్రదోవ్యయః
   సర్వసిద్ధిప్రదశ్శర్వతనయః శర్వరీప్రియః 

3::సర్వాత్మకః సృష్టికర్తా దేవోనేకార్చితశ్శివః 
   శుద్ధో బుద్ధిప్రియశ్శాంతో బ్రహ్మచారీ గజాననః 

4::ద్వైమాత్రేయో మునిస్తుత్యో భక్తవిఘ్నవినాశనః 
   ఏకదంతశ్చతుర్బాహుశ్చతురశ్శక్తిసంయుతః 

5::లంబోదరశ్శూర్పకర్ణో హరర్బ్రహ్మ విదుత్తమః 
   కాలో గ్రహపతిః కామీ సోమసూర్యాగ్నిలోచనః 

6::పాశాంకుశధరశ్చండో గుణాతీతో నిరంజనః 
   అకల్మషస్స్వయంసిద్ధస్సిద్ధార్చితపదాంబుజః 

7::బీజపూరఫలాసక్తో వరదశ్శాశ్వతః కృతీ 
   ద్విజప్రియో వీతభయో గదీ చక్రీక్షుచాపధృత్ 8::శ్రీదోజ ఉత్పలకరః శ్రీపతిః స్తుతిహర్షితః 
   కులాద్రిభేత్తా జటిలః కలికల్మషనాశనః 

9::చంద్రచూడామణిః కాంతః పాపహారీ సమాహితః 
   అశ్రితశ్రీకరస్సౌమ్యో భక్తవాంఛితదాయకః 

10:శాంతః కైవల్యసుఖదస్సచ్చిదానందవిగ్రహః 
   జ్ఞానీ దయాయుతో దాంతో బ్రహ్మద్వేషవివర్జితః 

11:ప్రమత్తదైత్యభయదః శ్రీకంఠో విబుధేశ్వరః 
   రమార్చితోవిధిర్నాగరాజయజ్ఞోపవీతవాన్ 

12:స్థూలకంఠః స్వయంకర్తా సామఘోషప్రియః పరః 
   స్థూలతుండోగ్రణీర్ధీరో వాగీశస్సిద్ధిదాయకః 

13:దూర్వాబిల్వప్రియోవ్యక్తమూర్తిరద్భుతమూర్తిమాన్ 
   శైలేంద్రతనుజోత్సంగఖేలనోత్సుకమానసః 

14:స్వలావణ్యసుధాసారో జితమన్మథవిగ్రహః 
   సమస్తజగదాధారో మాయీ మూషకవాహనః 

15:హృష్టస్తుష్టః ప్రసన్నాత్మా సర్వసిద్ధిప్రదాయకః 
   అష్టోత్తరశతేనైవం నామ్నాం విఘ్నేశ్వరం విభుం 

16:తుష్టావ శంకరః పుత్రం త్రిపురం హంతుముత్యతః 
   యః పూజయేదనేనైవ భక్త్యా సిద్ధివినాయకమ్ 

17:దూర్వాదళైర్బిల్వపత్రైః పుష్పైర్వా చందనాక్షతైః 
   సర్వాన్కామానవాప్నోతి సర్వవిఘ్నైః ప్రముచ్యతే 

Wednesday, November 27, 2013

పంచ దేవతలు ఎవరు?


"మన హిందూ దేవాలయాలు,మరియు వాటి విశిష్టతలు''
పంచ దేవతలు ఎవరు? "పంచాయతనము" గురించి క్లుప్తంగా తెలుసుకుందాము:-
...........................................

ఆదిత్య మంబికా విష్ణుం గణనాథ మహేశ్వరమ్ 
సర్వేష్టం సారభూతం చ పంచదేవాయ సేవనమ్!! 
తాత్పర్యం:- 
................

సూర్యుడు, అంబిక , విష్ణు, గణపతి, ఈశ్వరుడు వీరినే పంచ దేవతలు అంటారు. వీరు కలియుగ పాపకర్మలు భరించలేక కొన్ని ప్రత్యేక శిలల్లో ఉన్నట్లు 'సిద్ధాంత శేఖరంలో' చెప్పబడినది. ఆ శిలలో మాత్రమే ఆ దేవతా విగ్రహాలను మలచి పూజలు సల్పిన సత్ఫలితము లొసంగును. దేవతా పూజా నిరాటంకముగా (ఆటంకం లేకుండా) సాగగలదు. పంచదేవతా పూజ చాలా ప్రశస్తమని 'దేవీ భాగవతము' నందు కలదు. కలియుగ ధర్మాన్ని అనుసరించి ఈ అయిదుగురు దేవతలు ఆయా సాల గ్రామ శిలలోనే ఉంటారట. 
1) సాల గ్రామ లింగం (విష్ణువు):-
............................................ 

ఈ శిలలు నేపాలులో ముక్తినాథ దగ్గర గండకీ నది యందు లభించును. ఈ శిలలు చిన్న చిన్న రంధ్రములు కలిగి ఉంటాయి. నీటిలో రాయి వేసి తులసీ దళం వేసిన ఆ రంధ్రానికి దగ్గరగా తులసి చేరునట. విష్ణువుని మధ్యలో పెట్టి మిగతా దేవతా విగ్రహాలు శాస్త్ర ప్రకారము పెట్టిన, అది విష్ణు పంచాయతన మందురు. అట్లు పూజించిన వారికి విష్ణు సాయుజ్యము కలుగునని పద్మ పురాణంలో గలదు. 
2)బాణ లింగం(శివుడు):- 
.................................

మధ్యప్రదేశ్ లో ఓంకారేశ్వర్ దగ్గర నర్మదానదిలో లభించును. బాణలింగ సహిత రుద్రుని పూజించుట వల్ల ఆత్మజ్ఞానం లభించును. బాణలింగ సహిత రుద్రుణ్ణి మధ్యలో పెట్టి పూజించిన శివాపంచాయతనమందురు.
3)స్ఫటిక లింగం (సూర్యుడు):- 
.......................................

ఈ స్ఫటికలింగాలు తంజావూరు దగ్గర కావేరీ నదిలో లభించును. ఆదిత్యం ఆరోగ్యం అన్నట్లు సూర్య పూజ వల్ల ఆరోగ్యం లభించును. సూర్యుని మధ్యలో పెట్టి పూజించిన సూర్య పంచాయతనమందురు. 
4)అంబికా లింగం (అంబిక):- 
....................................

ఈ లింగములు ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ కాళహస్తి దగ్గర గల సువర్ల ముఖీనదిలో దొరుకును. అంబికాలింగ సహిత పూజసల్పిన భోగం లభించునని సిద్ధాంత శేఖరంలో గలదు. దేవీస్తానమందు దుర్గనుగాని, లక్ష్మినిగాని, సరస్వతిని గాని, శక్తి శ్రయాన్ని అర్చించవచ్చు. 
5)శోణలింగం (గణపతి):-
................................

ఉత్తరప్రదేశ్ లోని శోణభద్ర జిల్లాలో యున్న నదిలో కల శిలలు మైనాక పర్వతం నుండి ఉత్తరంగా వచ్చి గంగలో కలియుచున్నది.(పాట్నా వద్ద) ఈ శోణలింగ సహిత గణపతి పూజ వల్ల కార్యములు నిర్విఘ్నముగా నెరవేరును. గణపతిని మధ్యలో పెట్టి ఉంచిన గణపతిపంచాయతన మందురు.

Monday, November 18, 2013

బిల్వ వృక్షం భూలోకంలో ఉద్భవించడానికి గల కారణం?


బిల్వ వృక్షం భూలోకంలో ఉద్భవించడానికి గల కారణం?
.......................................................................

ఒకరోజు వైకుంఠంలో లక్ష్మీదేవి శ్రీహరికి సేవలు చేస్తుండగా, సంతుష్టుడైన శ్రీహరి, ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. 
అందుకామె "ఏ భార్య అయినా భర్త అనురాగాన్నే కోరుకుంటుంది. 
మీ అనురాగం నాకు పుష్కలంగా లభిస్తున్నప్పుడు, నాకంటే అదృష్టవంతురాలెవరు ఉంటుంది. చెప్పండి?" అని చెప్పింది. 
ఆమె మాటలను విన్న శ్రీహరి, ఆమెకు పరమేశ్వరాను గ్రహం కూడా కావాలని, ఆయనను ప్రసన్నం చేసుకోమని చెబుతాడు. 
తద్వారా, ఓ లోకోపకారం కూడ జరుగనున్నదని శ్రీహరి పలుకుతాడు. 
అలా శ్రీహరి అనుజ్ఞను పొందిన లక్ష్మీదేవి, భూలోకానికి చేరుకుని తపస్సు చేసుకునేందుకు తగిన స్థలాన్ని వెదుకుతుండగా, 
అటుగా వచ్చిన నారదుడు అనువైన చోటును చూపిస్తాడు, 
ఆయన సూచన ప్రకారం, శ్రీశైల క్షేత్ర సమీపంలోని పాతాళగంగను చేరుకుని ఓ అశ్వత్థ వృక్షం నీడన తపస్సు మొదలు పెట్టింది.  అయితే, తపస్సును ప్రారంభించే ముందు గణపతిని ప్రార్థించకుండా పొరపాటు చేసింది. 
అందుకు కోపగించుకున్న వినాయకుడు, 
లక్ష్మీదేవి తపస్సుకు ఆటంకం కలిగించమని సరస్వతీదేవిని ప్రార్థిస్తాడు 
గణనాథుని విన్నపం మేరకు, తన అత్తగారి తపస్సుకు విఘ్నాలు కలుగజేయసాగింది సరస్వతీదేవి. 
లక్ష్మీదేవి ఎంతగా శివపంచాక్షరీ జపం చేద్దామనుకున్నప్పటికీ తపస్సుపై ఆమె మనసు లగ్నం కాకపోవడంతో, దివ్యదృష్టితో అసలు సంగతిని గ్రహించిన లక్ష్మీదేవి, వినాయక వ్రతాన్ని చేసి, ఆయన అనుగ్రహాన్ని పొందుతుంది. 
ఆనాటి నుంచి వాయుభక్షణం చేస్తూ ఘోరతపస్సు చేయసాగింది లక్ష్మీదేవి. 
అయినా పరమేశ్వరుడు ప్రత్యక్షం కాలేదు. ఆమె చుట్టూ పుట్టలు పెరిగి, అనంతరం ఆమె దేహం నుండి దివ్యతేజోమయ అగ్ని బయల్వెడలి సమస్తలోకాలను దహించడానికి బయలుదేరింది. 
ఇది చూసిన ఋషులు, దేవతలు పరమేశ్వరునికి మొరపెట్టుకున్నారు. అప్పుడు పరమశివుడు నందీశ్వరుని భూలోకానికి పంపాడు. 
ఒక బ్రాహ్మణుని వేషంలో లక్ష్మీదేవి వద్దకు వచ్చిన నందీశ్వరుడు, ఆమె మనోభీష్టం నెరవేరాలంటే రుద్రహోమం చేయాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోమని, అయితే స్వామి నివేదనకు ఒక శరీరావయవాన్ని సమర్పించాలని చెప్పి వెళ్ళిపోయాడు.  
వెంటనే లక్ష్మీదేవి సప్తర్షులను ఋత్విక్కులుగా నియమించుకుని ఏకాదశ రుద్ర యాగాన్ని ప్రారంభించింది. యాగం నిర్విఘ్నంగా ముగియడంతో, హోమగుండం నుంచి ఓ వికృత శక్తి స్వరూపం బయటకు వచ్చి 'ఆకలి! ఆకలి!!' అని కేకలు వేయసాగింది. 
అప్పుడు లక్ష్మీదేవి ఖడ్గంతో తన వామభాగపుస్తనాన్ని ఖండించి. శక్తికి సమర్పించబోగా, ఆ శక్తిస్థానంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై, లక్ష్మీదేవిని కరుణించి, ఆమె వక్షభాగంలో ఎలాంటి లోపం లేకుండా చేసి, వరం కోరుకోమన్నాడు. 
అప్పుడామె సర్వవేళలా తనకు శివానుగ్రహం కావాలని ప్రార్థించింది. 
అందుకు ప్రసన్నుడైన పరమశివుడు, "తథాస్తు! నీవు విష్ణు వక్షః స్థలంలో స్థిరంగా ఉంటావు. 
నీ నామాల్లో 'విష్ణు వక్షఃస్థల స్థితాయ నమః' అని స్తుతించిన వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. 
నీ నివేదిత స్థనాన్ని ఈ హోమగుండం నుంచి ఓ వృక్షంగా సృష్టిస్తున్నాను. దీనిని భూలోకవాసులు బిల్వవృక్షమని పిలుస్తారు. 
మూడుదళాలతో ఉండే మారేడు దళాలలో పూజించేవారికి సర్వశుభాలు కలుగతాయి" అని దీవించాడు. 
ఇలా బిల్వవృక్షం పరమశివుని సేవ కొరకై భూలోకంలో సృష్టించబడింది. 

Visraja

భక్త కన్నప్ప--1976

శివ శివ శంకర..భక్తవశంకర
శంభో  హర హర..నమో నమో
శివ శివ శంకర..భక్తవ శంకర
శంభో  హర హర..నమో నమో

పున్నెము పాపము ఎరుగని నేను
పూజలు సేవలు తెలియని నేను
పున్నెము పాపము ఎరుగని నేను
పూజలు సేవలు తెలియని నేను

ఏ పూలు తేవాలి నీ పూజకు
ఏ పూలు తేవాలి నీ పూజకు
ఏ లీల చేయాలి నీ సేవలు

శివ శివ శంకర..భక్తవశంకర
శంభో  హర హర..నమో నమో

మారేడు నీవని ఏరేరి తేనా
మారేడు దళములు నీ పూజకు
మారేడు నీవని ఏరేరి తేనా
మారేడు దళములు నీ పూజకు

గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని
గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని
గంగను తేనా నీ సేవకు

శివ శివ శంకర..భక్తవశంకర 
శంభో  హర హర..నమో నమో 

!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!శ్రీ మంజునాథ--2001

ఓం మహా ప్రాణ దీపం శివం శివం
మహోంకార  రూపం శివం శివం
మహా సూర్య చంద్రాగ్ని నేత్రం పవిత్రం
మహా గాఢ తిమిరాంతకం సౌరగాత్రం

మహా కాంతి భీజం మహా దివ్య తేజం
భవానీ సమేతం భజే మంజునాథం
ఓం ఓం ఓం నమ: శంకరాయచ
మయస్కరాయచ నమ: శివాయచ
శివతరాయచ భవహరాయచ

మహా ప్రాణ దీపం శివం శివం
భజే మంజునాథం శివం శివం

అద్వైత భాస్కరం అర్ఠనారీశ్వరం
త్రిదశ హృదయంగమం చతుర్దతిసంగమం
పంచభూతాత్మకం శత్చత్రునాశకం
సప్త స్వరేశ్వరం అష్ట సిద్దిశ్వరం
నవరస మనోహరం  దశ దిశా సువిమలం

ఏకాదశోజ్వలం ఏకనాదేశ్వరం
ప్రస్తుతివశంకరం ప్రనదగణ కింకరం
దుర్జన భయంకరం సజ్జన శుభంకరం
ప్రాణి భవతారకం ప్రకృతి హిత కారకం
భువన భవ్య భవనాయకం భాగ్యాత్మకం  రక్షకం

ఈశమ్..సురేశం..ఋషేశం..పరేశం
నటేశం..గౌరీశం..గణేశం..భూతేశం
మహామధుర పంచాక్షరీ మంత్రమార్చం
మహా హర్ష వర్ష ప్రవర్షం సుశీర్శమ్

ఓం నమోహరాయచ స్మర హరాయచ 
పుర హరాయచ రుద్రాయచ భద్రాయచ 
ఇంద్రాయచ నిత్యాయచ నిర్నిద్రాయచ

మహా ప్రాణ దీపం శివం శివం
భజే మంజునాథం శివం శివం

డండండ డండండ డండండ డండండ
డక్కానినాధ నవ తాండవాడంబరం
తద్దిమ్మి తకదిమ్మి దిద్దిమ్మి దిమిదిమ్మి
సంగీత సాహిత్య సుమ కమల భంబరం

ఓంకార హ్రీంకార  శ్రీంకార  ఐంకార
మంత్రభీజాక్షరం మంజునాదేశ్వరం
రుగ్వేదమాద్యం యజుర్వేద వేద్యం
సామ ప్రగీతమ్ అధర్మ ప్రగాతం
పురణేతిహాసం ప్రసిద్ధం విశుద్ధం
ప్రపంచైక సూత్రం విబుద్దం సుసిద్దం

నకారం మకారం శికారం వకారం యకారం
నిరాకార సాకార సారం
మహా కాల కాలం మహా నీలకంఠం
మహానందనందం మహాటాట్టహాసం

జటాజూటరంగైకగంగాసుచిత్రం
జ్వలద్వుగ్ర నేత్రం సుమిత్రం సుగోత్రం
మహాకాశ భాసం మహా భానులింగం
మహా వత్రు వర్ణం సువర్ణం ప్రవర్ణం

సౌరష్ట్ర సుందరం సౌమనాదేశ్వరం
శ్రీశైల మందిరం శ్రీ మల్లికార్జునం
ఉజ్జయినిపుర మహాకాళేశ్వరం
బైద్యనాదేశ్వరం మహాభీమేశ్వరమ్
అమరలింగేశ్వరం రామలింగేశ్వరం
కాశి విశ్వేశ్వరం  పరంఘ్రుష్మేశ్వరం
త్ర్యమ్బకాదీశ్వరమ్ నాగలింగేశ్వరం
శ్రీ కేదారలింగేశ్వరం

అగ్నిలింగాత్మకం జ్యోతిలింగాత్మకం
వాయులింగాత్మకం అత్మలింగాత్మకం
అఖిలలింగాత్మకం అగ్నిసోమాత్మకం
అనాదిం అమేయం అజేయం అచింత్యం
అమోఘం అపూర్వం అనంతం అఖండం

అనాదిం అమేయం అజేయం అచింత్యం
అమోఘం అపూర్వం అనంతం అఖండం
ధర్మస్థలక్షేత్ర వరపరంజ్యోతిం
ధర్మస్థలక్షేత్ర వరపరంజ్యోతిం..ధర్మస్థలక్షేత్ర వరపరంజ్యోతిం

ఓం నమ: సోమయచ సౌమ్యయచ
భవ్యాయచ భాగ్యాయచ శాంతాయచ శౌర్యాయచ
యోగాయచ భోగాయచ కాలాయచ కాంతాయచ
రమ్యాయచ  గమ్యాయచ ఈశాయచ శ్రీశాయచ
శర్వాయచ సర్వయచా

!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!


శ్రీ కాళహస్తి మహాత్మ్యం--1954

ఓం నమశ్శివాయా 
నవనీత హృదయా సమప్రకాశా  
కరునేందుభూషా నమో శంకరా దేవ దేవా  

మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా 
నిన్ను నమ్మినాను రావా నీలకంధరా..దేవా
మహేశా పాప వనాశా కైలాసవాసా ఈశా 
నిన్ను నమ్మినాను రావా నీలకంధరా 

భక్తి యేదో పూజ లేవో తెలియనైతినే 
పాపమేదో పుణ్యమేదో కాననైతినే..దేవా
పాపమేదో పుణ్యమేదో కాననైతినే..దేవా

మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా 
నిన్ను నమ్మినాను రావా నీలకంధరా

మంత్రయుక్త పూజచేయ మనసు కరుగునా 
మంత్ర యుక్త పూజచేయ మనసు కరుగునా
మంత్రమో తంత్రమో యెరుగ నైతినే 
మంత్రమో తంత్రమో యెరుగ నైతినే

నాదమేదో వేదమేదో తెలియనైతినే 
నాదమేదో వేదమేదో తెలియనైతినే
వాదమేల పేద బాధా..తీర్చరావయా..స్వామీ
వాదమేల పేద బాధా..తీర్చరావయా..స్వామీ

మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా 
నిన్ను నమ్మినాను రావా నీలకంధరా


!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

భుకైలాస్--1958
సంగీతం::R.సుదర్శనం, R.గోవర్ధనం
రచన::సముద్రాల రాఘవాచార్య
గానం::ఘంటసాల


దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమోనమో
దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమోనమో

దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమోనమో
దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమోనమో

పాలితకింకర భవనా శంకర శంకర పురహర నమోనమో
పాలితకింకర భవనా శంకర శంకర పురహర నమోనమో
హాలాహలధర శూలాయుధకరా శైలసుతావర నమో నమో
హాలాహలధర శూలాయుధకరా శైలసుతావర నమో నమో

దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమోనమో
దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమోనమో

దురిత విమోచనా..ఆఅ..ఆఅ..ఆఆఅ..ఆఅ..అ.అ 
దురిత విమోచన ఫాలవిలోచన పరమదయాకర నమో నమో
కరిచర్మాంబర చంద్రకళాధర సాంబ దిగంబర నమో నమో
కరిచర్మాంబర చంద్రకళాధర సాంబ దిగంబర నమో నమో

దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమోనమో
దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమోనమో

నమో నమో నమో నమో నమో నమో

నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో
నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో
నారద హృదయ విహారి నమో నమో 
నారద హృదయ విహారి నమో నమో
నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో
పంకజ నయనా పన్నగ శయనా..ఆ ఆ ఆఆఆఅ...
పంకజనయనా పన్నగ శయనా
పంకజనయనా పన్నగ శయనా
శంకర వినుతా నమో నమో
శంకర వినుతా నమో నమో

నారాయణ హరి నమో నమో 
నారాయణ హరి నారాయణ హరి
నారా..యణ హరి నమో నమో

!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

తిలంగ్:::రాగం
{హిందుస్తానీ-కర్నాటక


సంగీతం::C.సముద్రాల
రచన::C.రాఘవాచార్య
గానం::ఘంటసాల

జయజయ మహాదేవా శంభో సదాశివా
ఆశ్రిత మందార శృతిశిఖర సంచారా..ఆ ఆఆ

నీలకంధరా దేవా దీన బాంధవా రారా ననుగావరా
నీలకంధరా దేవా దీన బాంధవా రారా ననుగావరా
సత్యసుందరా స్వామి..నిత్య నిర్మల పాహి
సత్యసుందరా స్వామి..నిత్య నిర్మల పాహి
నీలకంధరా దేవా దీన బాంధవా రారా ననుగావరా

చరణం::1

అన్యదైవము గొలువా
ఆఆ ఆఆఆ ఆఆఆ ఆఆ
అన్యదైవము గొలువా
నీదుపాదము విడువా
అన్యదైవము..ఉ ఉ..గొలువా
నీదుపాదము విడువా
దర్శనమ్ము నీరా మంగళాంగ గంగాధరా
దర్శనమ్ము నీరా మంగళాంగ గంగాధరా
నీలకంధరా దేవా దీన బాంధవా రారా ననుగావరా

చరణం::2

దేహి అన వరములిడు దానగుణసీమ
పాహియన్నను మ్రొక్కి నిన్ను పరంధామా
నీమమున నీ దివ్య నామ సంస్మరణ
ఏమరక చేయుదును భవతాప హరణ
నీ దయామయ దృష్టి సురితమ్ములార
వరసుభావృత్తి నా వాంఛ నీవేరా
కరుణించు పరమేశ దరహాస భాసా
హరహర మహాదేవ కైలాసవాసా కైలాసవాసా

చరణం::3

ఫాలలోచన నాదు మొరవిని జాలిని బూనవయా
నాగభూషణ నన్నుకావగ జాగును సేయకయా
ఫాలలోచన నాదు మొరవిని జాలిని బూనవయా
నాగభూషణ నన్నుకావగ జాగును సేయకయా
కన్నులవిందుగా భక్తవత్సల కానగ రావయ్యా
కన్నులవిందుగా భక్తవత్సల కానగ రావయ్యా
ప్రేమమీర నీదు భక్తుని మాటను నిల్పవయా
ప్రేమమీర నీదు భక్తుని మాటను నిల్పవయా
ఫాలలోచన నాదు మొరవిని జాలిని బూనవయా
నాగభూషణ నన్నుకావగ జాగును సేయకయా
శంకర శివశంకరా అభయంకరా విజయంకరా
శంకర శివశంకరా అభయంకరా విజయంకరా
శంకర శివశంకరా అభయంకరా విజయంకరా


!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!Wednesday, November 13, 2013

అంజన పుట్టుక ( హనుమంతుడి తల్లి )అంజన పుట్టుక ( హనుమంతుడి తల్లి )
...............................................

ఒకసారి దేవలోకమందు దేవేంద్రుడు కొలువుతీరిన సమయాన "పుంజికస్థల" అను అప్సరస బృహస్పతి వద్దకు చేరి హాస్య ప్రసంగం చేయసాగింది, ఆమె యొక్క హావ భావ వికారాలకు బృహస్పతి మిక్కిలి ఆగ్రహించి నీవు భూలోకమందు "వానర స్త్రీ" గా జన్మింతువుగాక! అని శాపం పెట్టాడు. అంత ఆ "పుంజికస్థల" తన తప్పిదాన్ని మన్నించి శాపవిమోచనమీయమని పరిపరి విధముల ప్రార్ధించింది. దానికి బృహస్పతి సంతసించి నీవు భూలోకమందు "హనుమంతునికి" జన్మనిచ్చిన తరువాత తిరిగి దేవలోకమునకు రాగలవని అనుగ్రహించే. ఇది కంబ రామాయణ గాధలో గల వృత్తాంతము.

ఆ శాపకారణంగా "పుంజికస్థల" భూలోకమందు వానరకన్యగా జన్మించి "కేసరి" అను అందమైన వానరాన్ని ప్రేమించి వివాహమాడింది. అంత ఆమె గర్భము దాల్చి శివాంశ సంభూతుడైన "శ్రీ ఆంజనేయస్వామి" వారికి జన్మనిచ్చింది. ఆ బాలుడు శుక్ల పక్ష చంద్రునిలా దిన దిన ప్రవర్ధమానముగా పెరిగి సూర్య భగవానుని వద్ద సమస్త విద్యలు అభ్యసిస్తూ ఏకసంథాగ్రాహియై అచిరకాలములోనే సర్వశాస్త్ర పారంగతుడైనాడు. అందుకు సూర్యభగవానుడు గురుదక్షిణగా నీవు "సుగ్రీవుని" వాలి బారి నుండి ఎల్లప్పుడు రక్షిస్తూ ఉండవలసిందిగా కోరెను.అందువల్లనే హనుమంతుడు సూర్యభగవానుని కోరిక మేరకు సుగ్రీవునికి ఆప్తమిత్రుడుగా, మంత్రిగా ఉంటూ వివిధ సేవలు అందించసాగే. 

విచిత్ర రామాయణంలో అంజన పుట్టుక గురించి ఓ వింత కథ ఉంది.
అంజన --(అహల్య, గౌతమ ముని కుమార్తె)

వృక్షవ్రజస్సు (కుంజరుడు) అనే గొప్ప వానరరాజు ఉండేవాడు. ఒకసారి వృక్షవ్రజస్సు ఒక తటాకంలో స్నానం చేస్తాడు, ఆ తటాకమునకు ఉన్న శాపప్రభావం వల్ల వృక్షవ్రజస్సు ఒక అప్సరసగా మారిపోతాడు. అప్పుడు ఆ ప్రదేశంలొ సూర్యుడు, ఇంద్రుడు ఆ అప్సరసగా ఉన్న వృక్షవ్రజస్సు చూసి మోహిస్తారు. స్త్రీగా మారిన వ్రుక్షవ్రజస్సు ...అహల్యగా గౌతమమునిని వివాహమాడే. కొంతకాలానికి గౌతమముని వలన అంజన (శాపగ్రస్తురాలైన "పుంజికస్థలి" అనే అప్సరస), సూర్యుని వలన వాలి, ఇంద్రుని వలన సుగ్రీవులు జన్మిస్తారు. ఈ విషయాన్ని కుంభకర్ణుడు సుగ్రీవుడితో పలికిన మాటలు.
కొన్నాళ్ళకు ఓ రోజు గౌతముడు కుమారులను ఎత్తుకుని, కూతురిని నడిపించుకుని, సముద్రతీరంలో తిరుగుతూ ఉంటే అంజన "నీ కూతురిని నడిపించి పరుల బిడ్డలను ఎత్తుకుంటావా?" అన్నదట. దానితో గౌతముడు సందేహించి "మీరు పరుల బిడ్డలైతే మీ ముఖాలు వానర ముఖాలగుగాక" అని శపించి వారిని సముద్రంలోకి తోశాడు. ఆ పిల్లలే వాలి, సుగ్రీవులైనారని, తన గుట్టు బయటపెట్టినది, కనుక అహల్య, అంజనను - నీయందు వానరుడు జన్మించునని శపించెననీ - విచిత్ర రామాయణంలో ఉంది.
హనుమంతుడు సీతారాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రధాతగా, రక్షకునిగా హిందూమతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి వంటి ఎన్నో పేర్లతో హనుమంతునిని ఆరాధిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో హనుమంతుని గుడి లేని ఊరు అరుదు.
హనుమంతుని జీవితం గురించి వివిధ గాధలు ప్రచారంలో ఉన్నాయి. ప్రధానంగా రామాయణంలో హనుమంతుడు శ్రీరాముని బంటుగానే ప్రస్తావింపబడింది. కొన్ని పురాణాలు, ఉపనిషత్తులు, సంప్రదాయ గాధలలో మరికొన్ని విషయాలు, కథలు ఉన్నాయి. ఇక జానపద సాహిత్యంలోనూ, వివిధ స్థలపురాణాలలోనూ కొల్లలుగా గాధలున్నాయి. ఈ వ్యాసంలో ప్రధానంగా వాల్మీకి రామాయణ ఇతివృత్తమైన గాధే క్లుప్తంగా చెప్పబడింది.
rachana::venkata madhu

Monday, November 4, 2013

కార్తీక మాసం విశిష్టత:-


కార్తీక మాసం విశిష్టత:-
............................

స్నాన, దాన, జపాలు, పూజలు, ఉపవాస వ్రతాలు, దీపాలు వెలిగించడం, 
వనభోజనాలు వంటి వాటిని చేయడం వల్ల జన్మజన్మల పాపాలను ప్రక్షాళన చేసి 
అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసం “కార్తీకమాసం’. 
చాంద్రమానం ప్రకారం కార్తీకమాసం ఎనిమిదవది. 

“న కార్తీక నమో మాసః
న దేవం కేశవాత్పరం!
నచవేద సమం శాస్త్రం
న తీర్థం గంగాయాస్థమమ్”

అని స్కంద పురాణంలో పేర్కొనబడింది. అంటే “కార్తీకమాసానికి సమానమైన మాసము లేదు. 
శ్రీమహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు. 
వేదముతో సమానమైన శాస్త్రము లేదు గంగతో సమానమైన తీర్థము లేదు.” అని అర్ధం.

శివునికి ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. 
ప్రతి ఏటా దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. 

ఈ మాసంలో భక్తులంతా నిత్యం భోళాశంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు. 
పురాణ కాలంనుంచీ ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. 
హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తూ కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది. 
ఈ మాసంలో పాఢ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిధుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం 
మహిళలు పూజలు చేస్తుంటారు. 
హరిహరాదులకు ప్రీతికరం..కార్తీక మాసం

మన భారతీయ సంస్కృతిలో కార్తీకమాసం వచ్చింది అంటే ఆ నెల రోజులు పండుగదినాలే! 
అందులోను కార్తీకమాసం ఈశ్వరారాధనకు చాలా ముఖ్యమైనది. 

దేశం నలుమూలలా ఉన్న వివిధ ఆలయాలలో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వదళాలతో పూజలు, 
అమ్మవారికి లక్షకుంకుమార్చనలు, విశేషంగా జరుపుతూ ఉంటారు. 

అలా విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై కొంగుబంగారంలా సంతోషం కలిగిస్తాడు. 
కాబట్టి ఆ స్వామికి ‘‘ఆశుతోషుడు’’ అనే బిరుదు వచ్చింది.

‘‘హరిః ఓం నమస్తే అస్తు భగవన్విశ్వేశ్వరాయ మహాదేవాయ త్య్రంబకాయ
త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ
మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః''

ప్రతి ఈశ్వరాలయంలో ఆ రుద్ర నమకం మంత్రభాగం మారుమోగిపోతూ, ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. 
హిందువుల గృహాలలో ‘‘ఆదిత్యమంబికా విష్ణూగణనాథం మహేశ్వరం’’ అనే పంచాయతన దేవతలను విశేషంగా ఆరాధిస్తారు. 

ఈ కార్తీకమాస మహత్యం గురించి పూర్వం నైమిశారణ్య ఆశ్రమములో శౌనకాది మహామునులు 
అందరికీ సూతమహాముని ఎన్నో విష్ణు భక్తుల చరిత్రలు, విష్ణు మహిమలను వినిపించే సమయంలో, 

"ఓ సూతముని శ్రేష్ఠా! కలియుగంలో ప్రజలు సంసార సాగరమునుండి తరింపలేక, 
అరిషడ్వర్గాలకు దాసులై, సుఖంగా మోక్షమార్గం తెలియక ఎన్నో ఈతిబాధలు అనుభవిస్తున్న ఈ మానవులకు 
ధర్మాలన్నింటిలో ఉత్తమ ధర్మమేది? దేవతలు అందరిలోనూ ముక్తి నొసంగు ఉత్తమ దైవమెవరు? 
మానవునికి ఆవరించియున్న ఈ అజ్ఞానాన్ని రూపుమాపి పుణ్యఫలం యిచ్చే కార్యమేది? 
ప్రతిక్షణం మృత్యువు వల్ల వెంబడించబడే ఈ మానవులకు మోక్షము కలిగించు చక్కని ఉపాయము చెప్ప''మని కోరారు.

ఆ ప్రశ్నలను విన్న సూతముని, "ఓ ముని పుంగవులారా! క్షణికమైన సుఖభోగాల కోసం పరితపించుతూ, 
మందబుద్ధులు అవుతున్న మానవులకు ‘‘ఈ కార్తీకమాస వ్రతము’’ హరిహరాదులకు అత్యంత ప్రీతికరమైంది. 

దీనిని ఆచరించటం వల్ల సకల పాపాలు హరింపబడి మరు జన్మలేక పరంధామము పొందగలరు. 
పుణ్యాత్ములకు మాత్రమే ఈ కార్తీకమాస వ్రతమాచరించాలని కోరికను కలుగచేస్తాడు ఆ పరమాత్మ! 
దుష్టులకు, దుర్మార్గులకు వారి కర్మలు పరిపక్వమయ్యేవరకు ఏవగింపు కలిగిస్తాడు.

ఈ మాసంలో వచ్చే సోమవారాలు చవితి, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి, అత్యంత పుణ్యప్రదమైనవి. 
నెల అంతా సాధ్యపడని భక్తులు కనీసం ఆయా రోజులలో పవిత్రపుణ్య నదీ స్నానం ఆచరించి, 
ఉపవాస దీక్షలు చేస్తూ మహాన్యాస పూర్వక మహా రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు, లక్ష కుంకుమార్చనలు, 
లలిత, విష్ణు సహస్రనామ పారాయణాలు, ప్రతి నిత్యం ఉభయ సంధ్యలలో దీపారాధన చేసేవారికి విశేష పుణ్య ఫలం లభిస్తుంది. 
ఈ కార్తీకమాసం ముప్పై రోజులు ఆచరించిన వారికి అనంతకోటి పుణ్యఫలం లభిస్తుందని చెప్పబడింది.

ఇందులో అత్యంత మహిమాన్వితమైన కాలం ప్రదోషకాలం. 
సూర్యాస్తమయం అయ్యాక మూడు గడియలు (ఒక గంట) ప్రదోషోరజనీముఖమ్‌. 
రాత్రికి ఆరంభకాలమే ఈ ప్రదోష సమయం. 
ఇలా ప్రతి నిత్ర్యం వచ్చే ప్రదోషాన్ని నిత్య ప్రదోషంగా చెప్తారు. 
ఈ ప్రదోషం నాలుగు విధాలుగా మహాత్ములు వివరిస్తూ ఉంటారు. 
1. నిత్య ప్రదోషం. 2. పక్ష ప్రదోషం 3. మాస ప్రదోషం 4. మహాప్రదోషం అని చెప్తారు.

కొందరు నిష్టాపరులు ఈ కార్తీకమాసమంతా పుణ్యనదీస్నానం ఆచరిస్తూ 
ప్రతి నిత్యం హరిహరాదులను పూజిస్తూ పగలు అపక్వాహారం అంటే వండని ఆహారం. పాలు, పండ్లు,తింటు పూజిస్తూ ఉంటారు.

ప్రత్యూష కిరణాలు::రచన వెంకట మధు