Monday, January 30, 2012

నవగ్రహ మూలధ్యాన శ్లోకం

























సూర్యుడు

వేదీమధ్యే లలిత కమలే కర్ణికాయాం రథస్థః,
సప్తాశ్వోర్కో రుణరుచివపుస్సప్తరజ్జు ర్ద్విబాహుః,
గోత్రేరమ్యే బహువిధగుణే కాశ్యపాఖ్యే ప్రసూతః,
కాళింగాఖ్యే విషయజనితః ప్రాఙ్ముఖఃపద్మహస్తః,
పద్మసనఃపద్మకరో ద్విబాహుఃపద్మద్యుతిస్సప్తతురంగవాహః,
దివాకరో లోకవపుఃకిరిటీ మయిప్రసాదం విదధాతు దేవః.

చంద్రుడు

ఆగ్నేయభాగే సరథో దశాశ్వశ్చాత్రేయజో యామున దేశజశ్చ,
ప్రత్యఙ్ముఖస్థ శ్చతురశ్రపీఠే గదాధరాం గోహిమవత్స్వభావః,
శ్వేతాంబర శ్శ్వేతవపుఃకిరిటిశ్వేతద్యుతిర్దండధరోద్విబాహుః,
చంద్రోమృతాతా వరదఃకిరీటీ శ్రేయాంసిమహ్యం విదధాతు దేవః.

కుజుడు

యామ్యే గదాశక్తి ధరశ్చశూలీ వరప్రదోయామ్యముఖోతిరిక్తం,
కుజస్త్వవంతీ విషయస్త్రికొణ స్తస్మిన్ భరద్వాజకులే ప్రసూతః,
రక్తాంబరో రక్తవపుః కిరీటీ చతుర్భుజో మేషగమో గదాభృత్,
ధరాసుత శ్శక్తిధరశ్చ శూలీ సదా మమస్యాద్వరదః ప్రశాంతః.

బుధుడు

ఉదఙ్మఖోమాగధ దేశరజాత శ్చాత్రేయగోత్రశ్శర మండలస్థః,
సఖడ్గ చర్మోరుగదాధరోఙ్ఙ స్త్వీశావభాగే వరద స్సుపీతః,
పీతాంబరః పీతవపుఃకిరీటీ చతుర్భజో దండధరశ్చ సౌమ్యః,
చర్మాసిదృక్సో మసుతస్సుమేరో స్సింహాధిరూఢో వరదో బుధశ్చ.

గురుడు

సౌమ్యేసుదీర్ఘే చతురశ్రపీఠే రథేఙ్గిరాఃపూర్వముఖ స్వభావః,
దండాక్షమాలా జలపాత్రధారీ సింధ్వాఖ్వదేశే వరద స్సుజీవః,
పీతాంబరః పీతవపుఃకిరీటీ చతుర్భుజో దేవగురుః ప్రశాంతః,
తథాసిదండంచ కమండలుంచ తథాక్ష సూత్రం వరదోస్తు మహ్యం.

శుక్రుడు

ప్రాచ్యాం భృగుర్భోజకటి ప్రదేశ స్సభార్గవఃపూర్వముఖ స్వభావః,
స పంచకోణేశ రథాధిరూఢో దండాక్షమాలా వరదోంబుపాత్రః,
శ్వేతాంబరఃశ్వేతవపుః కిరీటీ చతుర్భుజో దైత్యగురుఃప్రశాంతః,
తథాసి దండంచ కమండలుంచ తథాక్షసూత్రం వరదోస్తుమహ్యం.

శని

చాపాసనో గృధ్రరథ స్సునీలః ప్రత్యఙ్ముఖ కాశ్యపజః ప్రతీచ్యాం,
సశూల చాపేషు వరప్రదశ్చ సౌరాష్ట్రదేశే ప్రభవశ్చసౌరీ,
నీలద్యుతిర్నీలవపుఃకిరీటీ గృధ్రస్థితశ్చాపకరో ధనుష్మాన్,
చతుర్భుజ స్సూర్యసుతఃప్రశాంత స్సచాస్తుమహ్యం వరమందగామి.

రాహు

పైఠీనసోబర్బర దేశజాత శ్శూర్పాసన స్సింహగతస్వభావః,
యామ్యాననోనైర్ఋతి దిక్కరాళో వరప్రదశ్శూల సచర్మఖడ్గః,
నీలాంబరో నీలవపుఃకిరీటీ కరాళవక్త్రఃకరవాలశూలీ,
చతుర్భుజ శ్చర్మధరశ్చ రాహు స్సింహధిరూఢో వరదోస్తు మహ్యం.

కేతుః

ధ్వజాసనోజైమినిగోత్ర జాంతర్వేదేషు దేశేషు విచిత్రవర్ణః,
యామ్యాననో వాయుదిశః ప్రఖడ్గశ్చర్మాసిభిశ్చాష్టసుతశ్చకేతుః,
ధూమ్రోద్విబాహుర్వరదో గదాభృద్గృధ్రాసనస్థో వికృతాననశ్చ,
కిరీట కేయూర విభూషితాంగ స్సచాస్తుమే కేతుగణఃప్రశాంతః

!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!
!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!

!!! navagraha mUladhyana SlOkam !!!

sooryuDu

vaedeemadhyae lalita kamalae karNikaayaaM rathastha@h,
saptaaSvOrkO ruNaruchivapussaptarajju rdvibaahu@h,
gOtraeramyae bahuvidhaguNae kaaSyapaakhyae prasoota@h,
kaaLiMgaakhyae vishayajanita@h praa~mmukha@hpadmahasta@h,
padmasana@hpadmakarO dvibaahu@hpadmadyutissaptaturaMgavaaha@h,
divaakarO lOkavapu@hkiriTee mayiprasaadaM vidadhaatu daeva@h.

chaMdruDu

aagnaeyabhaagae sarathO daSaaSvaSchaatraeyajO yaamuna daeSajaScha,
pratya~mmukhastha SchaturaSrapeeThae gadaadharaaM gOhimavatsvabhaava@h,
SvaetaaMbara SSvaetavapu@hkiriTiSvaetadyutirdaMDadharOdvibaahu@h,
chaMdrOmRtaataa varada@hkireeTee SraeyaaMsimahyaM vidadhaatu daeva@h.

kujuDu

yaamyae gadaaSakti dharaSchaSoolee varapradOyaamyamukhOtiriktaM,
kujastvavaMtee vishayastrikoNa stasmin^ bharadvaajakulae prasoota@h,
raktaaMbarO raktavapu@h kireeTee chaturbhujO maeshagamO gadaabhRt^,
dharaasuta SSaktidharaScha Soolee sadaa mamasyaadvarada@h praSaaMta@h.

budhuDu

uda~mmakhOmaagadha daeSarajaata SchaatraeyagOtraSSara maMDalastha@h,
sakhaDga charmOrugadaadharO~m~ma stveeSaavabhaagae varada ssupeeta@h,
peetaaMbara@h peetavapu@hkireeTee chaturbhajO daMDadharaScha saumya@h,
charmaasidRksO masutassumaerO ssiMhaadhirooDhO varadO budhaScha.

guruDu

saumyaesudeerghae chaturaSrapeeThae rathae~mgiraa@hpoorvamukha svabhaava@h,
daMDaakshamaalaa jalapaatradhaaree siMdhvaakhvadaeSae varada ssujeeva@h,
peetaaMbara@h peetavapu@hkireeTee chaturbhujO daevaguru@h praSaaMta@h,
tathaasidaMDaMcha kamaMDaluMcha tathaaksha sootraM varadOstu mahyaM.

SukruDu

praachyaaM bhRgurbhOjakaTi pradaeSa ssabhaargava@hpoorvamukha svabhaava@h,
sa paMchakONaeSa rathaadhirooDhO daMDaakshamaalaa varadOMbupaatra@h,
SvaetaaMbara@hSvaetavapu@h kireeTee chaturbhujO daityaguru@hpraSaaMta@h,
tathaasi daMDaMcha kamaMDaluMcha tathaakshasootraM varadOstumahyaM.

Sani

chaapaasanO gRdhraratha ssuneela@h pratya~mmukha kaaSyapaja@h prateechyaaM,
saSoola chaapaeshu varapradaScha sauraashTradaeSae prabhavaSchasauree,
neeladyutirneelavapu@hkireeTee gRdhrasthitaSchaapakarO dhanu

నవగ్రహ మంత్రములు

























నవగ్రహ మంత్రం

ఓం ఆదిత్యయ, సోమయ మంగళాయ భుధయ చ
గురు శుక్ర శనిభ్యస్య రాహవే కేతవే నమః

సూర్య మంత్రం

జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్
తమోరిం సర్వ పాపగన్నం ప్రణతోస్మి దివాకరం

చంద్ర మంత్రం

దధి శంక తుషారాభం క్షీరార్ణవ సముద్భవం
నమామి శశినం సోమం శంభోర్మకుట భూషణం

కుజ మంత్రం

ధరణీ గర్భ సంభూతం విధ్యుత్ కాంతి సమప్రభం
కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం

బుధ మంత్రం

ప్రియంగు కలిశ్యామం – రూపేణా ప్రతిమం బుధం
సౌమ్యం సౌమ్య గుణోపెతం తం బుధం ప్రణమామ్యహం

బృహస్పతి (గురు) మంత్రం

దేవానాంచ బుషీనాంచ గురుం కాంచన సన్నిభం
భుధ్ధిమతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం

శుక్ర మంత్రం

హిమ కుంద మృణలాభం దైత్యానాం పరమం గురుం
సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం

శని మంత్రం

నీలాంజన సమాభాసం – రవిపుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైచ్చరం

రాహు మంత్రం

అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం
సింహీకాగర్బ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం

కేతు మంత్రం

పలాశపుష్ప సంకాశం – తారకాగ్రహ మస్తకం
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం

శ్రీ సూర్య అష్టోత్తరశతనామ స్తోత్రం








1::అరుణాయ శరణ్యాయ కరుణారససింధవే
అసమానబలాయాజ్ర్తరక్షకాయ నమో నమః

2::ఆదిత్యాయాజ్దిభూతాయ అఖిలాగమవేదినే
అచ్యుతాయాజ్ఖిలజ్ఞాయ అనంతాయ నమో నమః

3::ఇనాయ విశ్వరూపాయ ఇజ్యాయైంద్రాయ భానవే
ఇందిరామందిరాప్తాయ వందనీయాయ తే నమః

4::ఈశాయ సుప్రసన్నాయ సుశీలాయ సువర్చసే
వసుప్రదాయ వసవే వాసుదేవాయ తే నమః

5::ఉజ్జ్వలాయోగ్రరూపాయ ఊర్ధ్వగాయ వివస్వతే
ఉద్యత్కిరణజాలాయ హృషీకేశాయ తే నమః

6::ఊర్జస్వలాయ వీరాయ నిర్జరాయ జయాయ చ
ఊరుద్వయాభావరూపయుక్తసారథయే నమః

7::ఋషివంద్యాయ రుగ్ఘంత్రే ఋక్షచక్రచరాయ చ
ఋజుస్వభావచిత్తాయ నిత్యస్తుత్యాయ తే నమః

8::ఋకారమాతృకావర్ణరూపాయోజ్జ్వలతేజసే
ఋక్షాధినాథమిత్రాయ పుష్కరాక్షాయ తే నమః

9::లుప్తదంతాయ శాంతాయ కాంతిదాయ ఘనాయ చ
కనత్కనకభూషాయ ఖద్యోతాయ తే నమః

10::లూనితాఖిలదైత్యాయ సత్యానందస్వరూపిణే
అపవర్గప్రదాయాజ్ర్తశరణ్యాయ నమో నమః

11::ఏకాకినే భగవతే సృష్టిస్థిత్యంతకారిణే
గుణాత్మనే ఘృణిభృతే బృహతే బ్రహ్మణే నమః

12::ఐశ్వర్యదాయ శర్వాయ హరిదశ్వాయ శౌరయే
దశదిక్సంప్రకాశాయ భక్తవశ్యాయ తే నమః

13::ఓజస్కరాయ జయినే జగదానందహేతవే
జన్మమృత్యుజరావ్యాధివర్జితాయ నమో నమః

14::ఔన్నత్యపదసంచారరథస్థాయాత్మరూపినే
కమనీయకరాయాజ్బ్జవల్లభాయ నమో నమః

15::అంతర్బహిఃప్రకాశాయ అచింత్యాయాజ్త్మరూపిణే
అచ్యుతాయ సురేశాయ పరస్మైజ్యోతిషే నమః

16::అహస్కరాయ రవయే హరయే పరమాత్మనే
తరుణాయ వరేణ్యాయ గ్రహాణాంపతయే నమః

17::ఓం నమో భాస్కరాయాజ్దిమధ్యాంతరహితాయ చ
సౌఖ్యప్రదాయ సకలజగతాంపతయే నమః

18::నమః సూర్యాయ కవయే నమో నారాయణాయ చ
నమో నమః పరేశాయ తేజోరూపాయ తే నమః

19::ఓం శ్రీం హిరణ్యగర్భాయ ఓం హ్రీం సంపత్కరాయ చ
ఓం ఐం ఇష్టార్థదాయాజ్నుప్రసన్నాయ నమో నమః

20::శ్రీమతే శ్రేయసే భక్తకోటిసౌఖ్యప్రదాయినే
నిఖిలాగమవేద్యాయ నిత్యానందాయ తే నమః

**********************************************************************************
**********************************************************************************

!!! Sree sUrya ashTOttara Satanaama stOtram !!!

1::aruNaaya SaraNyaaya karuNaarasasiMdhavae
asamaanabalaayaajrtarakshakaaya namO nama@h

2::aadityaayaajdibhootaaya akhilaagamavaedinae
achyutaayaajkhilaj~naaya anaMtaaya namO nama@h

3::inaaya viSvaroopaaya ijyaayaiMdraaya bhaanavae
iMdiraamaMdiraaptaaya vaMdaneeyaaya tae nama@h

4::eeSaaya suprasannaaya suSeelaaya suvarchasae
vasupradaaya vasavae vaasudaevaaya tae nama@h

5::ujjvalaayOgraroopaaya oordhvagaaya vivasvatae
udyatkiraNajaalaaya hRsheekaeSaaya tae nama@h

6::oorjasvalaaya veeraaya nirjaraaya jayaaya cha
oorudvayaabhaavaroopayuktasaarathayae nama@h

7::RshivaMdyaaya rugghaMtrae Rkshachakracharaaya cha
Rjusvabhaavachittaaya nityastutyaaya tae nama@h

8::RkaaramaatRkaavarNaroopaayOjjvalataejasae
Rkshaadhinaathamitraaya pushkaraakshaaya tae nama@h

9::luptadaMtaaya SaaMtaaya kaaMtidaaya ghanaaya cha
kanatkanakabhooshaaya khadyOtaaya tae nama@h

10::loonitaakhiladaityaaya satyaanaMdasvaroopiNae
apavargapradaayaajrtaSaraNyaaya namO nama@h

11::aekaakinae bhagavatae sRshTisthityaMtakaariNae
guNaatmanae ghRNibhRtae bRhatae brahmaNae nama@h

12::aiSvaryadaaya Sarvaaya haridaSvaaya Saurayae
daSadiksaMprakaaSaaya bhaktavaSyaaya tae nama@h

13::Ojaskaraaya jayinae jagadaanaMdahaetavae
janmamRtyujaraavyaadhivarjitaaya namO nama@h

14::aunnatyapadasaMchaararathasthaayaatmaroopinae
kamaneeyakaraayaajbjavallabhaaya namO nama@h

15::aMtarbahi@hprakaaSaaya achiMtyaayaajtmaroopiNae
achyutaaya suraeSaaya parasmaijyOtishae nama@h

16::ahaskaraaya ravayae harayae paramaatmanae
taruNaaya varaeNyaaya grahaaNaaMpatayae nama@h

17::OM namO bhaaskaraayaajdimadhyaaMtarahitaaya cha
saukhyapradaaya sakalajagataaMpatayae nama@h

18::nama@h sooryaaya kavayae namO naaraayaNaaya cha
namO nama@h paraeSaaya taejOroopaaya tae nama@h

19::OM SreeM hiraNyagarbhaaya OM hreeM saMpatkaraaya cha
OM aiM ishTaarthadaayaajnuprasannaaya namO nama@h

20::Sreematae Sraeyasae bhaktakOTisaukhyapradaayinae
nikhilaagamavaedyaaya nityaanaMdaaya tae nama@h

Tuesday, January 17, 2012

కనుమ పండుగ 2012







ఈ రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు.
ఈ రోజుతో దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది.
ఈ రోజున స్వర్గ వాకిళ్లు తెరుస్తారని హిందువుల నమ్మకం.

సంక్రాంతి పండుగ పుష్య మాసంలో వస్తుంది.
ఇది మూడు రోజుల పండుగ.
దీనిని పెద్ద పండుగగా పరిగణిస్తాము.

మార్గశిర మాసం, పుష్య మాసాలు హేమంత ఋతువులో వస్తాయి.
ఇది చలి కాలం. చలి గజ గజా వణికిస్తూ వుంటుంది.

మొదటి రోజు “భోగి”:

ఉదయాన్నే లేచి ఇంటి ముందు ముగ్గులు వేస్తారు.
“స్వర్గ వాకిళ్లు” అనే ముగ్గును వేస్తారు.



ముగ్గుమధ్యలో “గొబ్బెమ్మలు” పెడతారు. వీధులలో “భోగి మంటలు” వేస్తారు.
కుటుంబంలోని వారందరూ తలస్నానాలు చేసి
కొత్త బట్టలు కట్టుకొని ఆనందంతో“సంక్రాంతి లక్ష్మి” ని పూజిస్తారు. ఇది మన ఆనవాయితి



భోగి రోజు మూడు లేక ఐదు కూరగాయలను కలిపి కూరగా వండుతాము.
దీన్ని “కలగూర” అంటారు.కొత్తగా వచ్చిన ధాన్యాలతో
"జొన్నలు" , "సజ్జలు" , అన్ని ధాన్యాలు..అయితే
జొన్నరొట్టేలూ..చేయడంకూడ మన వాళ్ళకు ఆనవాయితి
“నువ్వు పులగం, పొంగలి”, ప్రధాన వంటకాలు.



సాయంత్రము చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోసి పేరంటము జరుపుతారు.
కనుమ మరునాటిని ముక్కనుమ అని అంటారు. దీనికి బొమ్మల పండుగ అని పేరు.
దక్షిణ భారతదేశం లోని ప్రజలు ఈ పండుగ మూడు రోజులను శ్రద్ధాసక్తులతో జరుపుకుంటారు.
బొమ్మలకు హారతి యిచ్చి, పేరంటం చేస్తారు.

రెండవ రోజు “సంక్రాంతి”

ఈ రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు.
ఈ రోజుతో దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది.
ఈ రోజున స్వర్గ వాకిళ్లు తెరుస్తారని హిందువుల నమ్మకం.

బెల్లం, గుమ్మడి కాయలు “దానమి”స్తారు. పితృదేవతలకు “తర్పణాలు” వదులుతారు.

ఈ రోజున కూడ ఇంటి ముందు ముగ్గులు వేస్తారు.
“రథం” ముగ్గు వేయటం సాంప్రదాయం.



ఈరోజు కూడ “గొబ్బెమ్మలు” పెడతారు.
బొమ్మల కొలువు, పేరంటం చేస్తారు.

మూడవ రోజు “కనుమ పండగ”:

ఈ రోజును “పశువుల పండుగ” అని కూడ అంటారు.
వ్యవసాయదారులు పశువులను నీళ్ళతో కడిగి శుభ్రం చేస్తారు.
పసుపు కుంకుమలతో, పూలతో అలంకరిస్తారు.
పశువులను పూజిస్తారు. పశువుల కొట్టంలో “పొంగలి” వండి
అందులో పసుపు, కుంకుమ కలిపి పొలాలలో చల్లుతారు.
చీడ-పీడలు సోకకుండా కాపాడమని దేవతలను ప్రార్ధిస్తారు.






గుమ్మడి కాయలు పగులకొట్టి పోలి (బలి) వేస్తారు.
పూల దండలు గుచ్చి పశువుల మెడలో వేస్తారు.
దూడల మెడలకు, కాళ్ళకు చిరుగంటలు కడతారు.
ఎద్దు కొమ్ములకు వారి వారి అభిరుచిని బట్టి పసుపు, కుంకుమలు,
రంగులతో తీర్చి దిద్దుతారు. గంగిరెద్దులను అలంకరిస్తారు.
కొన్నిప్రాంతాలలో పశువుల ఊరేగింపు, కోడి పందెములు,
గొర్రె పొట్టేళ్ళ పందెములు కనుమ నాటి సాయంత్రము జరుపుతారు.



“కనుమ” రోజు “మినుము” తినాలని “గారెలు” చేసుకొని తింటారు.
పుట్టింటికి వచ్చిన ఆడపిల్లలు, అత్తింటికి వెళ్ళిన అల్లుళ్ళు కూడ కనుమ రోజు
తిరుగు ప్రయాణమవ్వరు. కనుమ నాడు కాకి కూడ కదలదని సామెత.
కనుమ రోజున మాంసాహారం తినడం ఆంధ్ర దేశాన ఆనవాయితీగా వస్తూంది.
మాంసా హారులు కాని వారు, గారెలుని తింటారు



ఈ మూడురోజులు మనము పూర్తిగా సంతోషం గా గడిపాం కదా.
ఈ రోజు మన ఇంట్లో వుండే పశువులకు పూజ చేసి వాటికి కృతఙ్ఞత తెలుపుకుంటున్నారు.
ఈ నెలరోజులు వాకిట అందమైన ముగ్గులు తో అలంకరిస్తాము కదా.
ఈ కనుమరోజును మాత్రము రధము ముగ్గువేసి ఆరధమును వీదిచివరి వరకు లాగినట్టుగా ముగ్గు వేస్తారు.
దీని అర్ధము సూర్యుడు తన దిశను మార్చుకున్న మొదటిరోజు అని తెలుస్తున్నది.
ఈ కనుమ పండుగను బాగా జరుపుకోవాలి అని తలుస్తున్నాను.అలాగని పసుపక్షులను భాదించకండి.

సంక్రాంతి పండుగ










సంక్రాంతి పండుగ

ఈ రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు.
ఈ రోజుతో దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది.
ఈ రోజున స్వర్గ వాకిళ్లు తెరుస్తారని హిందువుల నమ్మకం.

సంక్రాంతి పండుగ పుష్య మాసంలో వస్తుంది.
ఇది మూడు రోజుల పండుగ.
దీనిని పెద్ద పండుగగా పరిగణిస్తాము.

మార్గశిర మాసం, పుష్య మాసాలు హేమంత ఋతువులో వస్తాయి.
ఇది చలి కాలం. చలి గజ గజా వణికిస్తూ వుంటుంది.

మొదటి రోజు “భోగి”:

ఉదయాన్నే లేచి ఇంటి ముందు ముగ్గులు వేస్తారు.
“స్వర్గ వాకిళ్లు” అనే ముగ్గును వేస్తారు.



ముగ్గుమధ్యలో “గొబ్బెమ్మలు” పెడతారు. వీధులలో “భోగి మంటలు” వేస్తారు.
కుటుంబంలోని వారందరూ తలస్నానాలు చేసి
కొత్త బట్టలు కట్టుkoni aanandamtO“సంక్రాంతి లక్ష్మి” ని పూజిస్తారు. idi mana aanavaayiti

భోగి రోజు మూడు లేక ఐదు కూరగాయలను కలిపి కూరగా వండుtaamu.
దీన్ని “కలగూర” అంటారు.kottagaa vachchina dhaanyaalatO
"jonnalu" , "sajjalu" , anni dhaanyaalu..ayitE
jonnaroTTElU..chEyaDamkUDa mana vaaLLaku aanavaayiti
“నువ్వు పులగం, పొంగలి”, ప్రధాన వంటకాలు.

సాయంత్రము చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోసి పేరంటము జరుపుతారు.
కనుమ మరునాటిని ముక్కనుమ అని అంటారు. దీనికి బొమ్మల పండుగ అని పేరు.
దక్షిణ భారతదేశం లోని ప్రజలు ఈ పండుగ మూడు రోజులను శ్రద్ధాసక్తులతో జరుపుకుంటారు.
బొమ్మలకు హారతి యిచ్చి, పేరంటం చేస్తారు.

రెండవ రోజు “సంక్రాంతి”

ఈ రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు.
ఈ రోజుతో దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది.
ఈ రోజున స్వర్గ వాకిళ్లు తెరుస్తారని హిందువుల నమ్మకం.

బెల్లం, గుమ్మడి కాయలు “దానమి”స్తారు. పితృదేవతలకు “తర్పణాలు” వదులుతారు.



ఈ రోజున కూడ ఇంటి ముందు ముగ్గులు వేస్తారు.
“రథం” ముగ్గు వేయటం సాంప్రదాయం.
ఈరోజు కూడ “గొబ్బెమ్మలు” పెడతారు.
బొమ్మల కొలువు, పేరంటం చేస్తారు.

మూడవ రోజు “కనుమ పండగ”:

ఈ రోజును “పశువుల పండుగ” అని కూడ అంటారు.
వ్యవసాయదారులు పశువులను నీళ్ళతో కడిగి శుభ్రం చేస్తారు.
పసుపు కుంకుమలతో, పూలతో అలంకరిస్తారు.
పశువులను పూజిస్తారు. పశువుల కొట్టంలో “పొంగలి” వండి
అందులో పసుపు, కుంకుమ కలిపి పొలాలలో చల్లుతారు.
చీడ-పీడలు సోకకుండా కాపాడమని దేవతలను ప్రార్ధిస్తారు.

గుమ్మడి కాయలు పగులకొట్టి పోలి (బలి) వేస్తారు.
పూల దండలు గుచ్చి పశువుల మెడలో వేస్తారు.
దూడల మెడలకు, కాళ్ళకు చిరుగంటలు కడతారు.
ఎద్దు కొమ్ములకు వారి వారి అభిరుచిని బట్టి పసుపు, కుంకుమలు,
రంగులతో తీర్చి దిద్దుతారు. గంగిరెద్దులను అలంకరిస్తారు.
కొన్నిప్రాంతాలలో పశువుల ఊరేగింపు, కోడి పందెములు,
గొర్రె పొట్టేళ్ళ పందెములు కనుమ నాటి సాయంత్రము జరుపుతారు.

“కనుమ” రోజు “మినుము” తినాలని “గారెలు” చేసుకొని తింటారు.
పుట్టింటికి వచ్చిన ఆడపిల్లలు, అత్తింటికి వెళ్ళిన అల్లుళ్ళు కూడ కనుమ రోజు
తిరుగు ప్రయాణమవ్వరు. కనుమ నాడు కాకి కూడ కదలదని సామెత.
కనుమ రోజున మాంసాహారం తినడం ఆంధ్ర దేశాన ఆనవాయితీగా వస్తూంది.
మాంసా హారులు కాని వారు, గారెలుని తింటారు

ఈ మూడురోజులు మనము పూర్తిగా సంతోషం గా గడిపాం కదా.
ఈ రోజు మన ఇంట్లో వుండే పశువులకు పూజ చేసి వాటికి కృతఙ్ఞత తెలుపుకుంటున్నారు.
ఈ నెలరోజులు వాకిట అందమైన ముగ్గులు తో అలంకరిస్తాము కదా.
ఈ కనుమరోజును మాత్రము రధము ముగ్గువేసి ఆరధమును వీదిచివరి వరకు లాగినట్టుగా ముగ్గు వేస్తారు.
దీని అర్ధము సూర్యుడు తన దిశను మార్చుకున్న మొదటిరోజు అని తెలుస్తున్నది.
ఈ కనుమ పండుగను బాగా జరుపుకోవాలి అని తలుస్తున్నాను.అలాగని పసుపక్షులను భాదించకండి.

Friday, January 13, 2012

అందరికీ సంక్రాంతి,పొంగల్,& కనుమ శుభాకాంక్షలు

ANDARIKII HAPPY PONGAL,SANKRANTI AND KANUMA SUBHAKANKSHALU







































































సంక్రాంతి పండగ
సంక్రాంతి మన దక్షిన దేశం వారికి ముఖ్యమైన పండగ. మన వాళ్ళంతా ఆనందంతో ఉత్సాహంతో ఒక పెద్ద పండగ చేసుకుంటారు. ప్రకృతిలో వసంత ఋతువు ఆహ్లాదాన్ని ఇచ్చినా, ఈ కాలం మనకు పంటలతో ఒక నిండు తనాన్ని కల్గించే కాలంగా మనం అనుభవిస్తుంటాం. నెలరోజులు ధనుర్మాస వ్రతం ఆచరించిన గోదాదేవి, తనను ఒక గోపికగా భావించి శ్రీరంగంలో వేంచేసి ఉన్న శ్రీరంగనాథుణ్ణి వివాహమాడాలని అనుకుంది. తత్ ఫలితంగా శ్రీవెల్లిపుత్తూర్ నుండి గోదాదేవిని రప్పించుకొని శ్రీరంగనాథుడు విగ్రహస్వరూపంతోనే వివాహమాడాడు. గోదాదేవి వ్రతం ఆచరించి రంగనాథుణ్ణి పోందిన రోజుని భోగి అంటారు. రంగనాథుణ్ణి భోగరంగడు అని అంటారు. భగవంతుణ్ణి వివాహమాడి వైభోగ్యాన్ని పొందింది కనుక ఆ రోజుకి భోగి అని పేరు. భోగి దాటిన మరునాడే సంక్రాంతి. తరువాత రోజు కనుమ. ఈ మూడు రోజులు కలిపితే ఒక అందమైన పండగ.

దక్షినాయీనం పూర్తయ్యి ఉత్తయాయీణం వస్తుంది. దక్షినాయీణం దేవతలు రాత్రి, ఉత్తరాయణం పగలు. రాత్రి మనం విశ్రాంతి తీసుకొని పగలు లోకంలో ప్రవర్తిస్తుంటాం. మనలో ఎలాగైతే పగలు ప్రవృత్తి ఇక రాత్రి నివృత్తి అయ్యినట్లుగనే దేవతలకు ఉత్తయాయీణం ప్రవృత్తి ఇక దక్షినాయీణం నివృత్తి. దేవతలు మేల్గాంచి ఉన్నప్పుడు మనుష్యులలో దైవీ శక్తులు మేలుకొని ఉంటాయి, దక్షినాయీనంలో అసురీ ప్రవృత్తులు మేలుకొని ఉంటాయి. రోజులో బ్రహ్మ ముహూర్తం ఎట్లా అయితే తెల తెల వారే సమయంలో ఉంటుందో, ధనుర్మాస కాలం సత్వగుణాన్ని పెంచేదిలా ఉంటుంది, ఇప్పుడు చేసిన ఆచరణ ఏడాది కాలం మనల్ని మంచి మార్గంలో నడిచేట్టు చేస్తుంది. ఈ భావనతోనే మనం ధనుర్మాస వ్రతం ఆచరిస్తాం. తిరుప్పావై ఒక్కో పాశురాన్ని తెలుసుకొని ఆ జ్ఞానంతో బాగుపడేట్టు మనల్ని తయారుచేసుకుంటాం, తద్వార చుట్టూ ఉండే లోకాన్ని ఎట్లా చూడాలి, మన చుట్టు ఉండే సమాజంతో ఎట్లా ప్రవర్తించాలి అనేది తెలుస్తుంది. మనలో చక్కని సంస్కారం ఏర్పడుతుంది. మంచి మార్గంలో అడుగు పెట్టడం అన్నమాట, క్రాంతి అంటే అడుగు పెట్టడం, సం అంటే మంచిగా అని అర్థం. ఈ రకంగా మంచిగా బ్రతకటానికి తీసుకున్న నిర్ణయం కాబట్టి అది "సంక్రాంతి" అయ్యింది.

సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశికి మారే సమయం కూడా, ధనుఃరాశి నుండి మకర రాశికి మారుతాడు కనుక కొందరు ఈ రోజు శుభకార్యాలు చెయ్యరు. సంక్రమణం ఏర్పడ్డప్పుడు పితృదేవతలకు తృప్తి కలిగించటానికి నువ్వులు మొదలైన వాటితో తర్పణాదులు చేస్తుంటారు. అందుకే మరునాడు కనుమ పండుగ, తమ బంధువులను, అల్లుల్లను ఇంటికి రప్పించుకొని వివిద సత్కారాలు చేస్తారు. ఎందుకు చేస్తుంటారంటే తిరిగి గోదాదేవి ఆచరణయే కారణం. శ్రీరంగనాథుడు గోదాదేవిని వివాహమాడటంచే విష్ణుచిత్తులవారికి ఆల్లుడైయ్యాడు. శ్రీరంగంలో వివాహం జరిగి, కనుమ నాడు గోదాదేవితో కలిసి శ్రీవెల్లిపుత్తూర్ చేరి ఆరాధన అందుకున్నాడు.

ఇవన్నీ భావించి మన పూర్వులు మనకోక పండగను అందించారు. ఈ పండగలో గొబ్బిల్లను పూజిస్తారు, గొబ్బిల్లు వ్రతం ఆచరించిన గోపికల ప్రతీక. గోపికలు శ్రీకృష్ణుడిని కోరినవారు, వేరొకరు వారికి తెలియదు. శ్రీకృష్ణుడు ఏది చెబితే అది వారికి వేదం. ఆయన చెప్పినదాన్ని పాటించాలి అని కోరుకుంటారు. ప్రతి వ్యక్తి ఈ గోపీ ప్రవృత్తితో గోదాదేవి ఎలాగైతే భగవంతుణ్ణి పొందిందో, మనంకూడా భగవత్ ప్రవృత్తి కల్గి లోకంలో ప్రవర్తించాలని తెలియడానికి మన పెద్దలు మనకు ఈ అందమైన పండగను ఏర్పాటు చేసి ఇచ్చారు.

మనం ఆచరించే ప్రతి పండగకీ పై పై కి ఆనందాన్ని ఇచ్చేవిగా అనిపించినా, దాని వెనకాతల ఆధ్యాత్మిక సందేషం మన ప్రతీ పండగలో కనిపిస్తుంది.

ప్రతి పండగలో మూడు విషయాలు సూచిస్తారు.

1. ఆధ్యాత్మిక ఉన్నతి
2. శారీరక ఆనందం
3. మన దోషాలు తొలగటం

మామూలుగా మనం వంట వండేప్పుడు కూరగాయలు తరిగేప్పుడో, అన్నం ఉడికించేప్పుడో మనకు తెలియకుండా కొన్ని సూక్ష్మ జీవులని సంహరిస్తుంటాం. అలా చేసినందుకు మనకు పంచ మహా పాతకాలు చుట్టుకుంటాయి అంటుంటారు. మనం అన్నం మాని నివృత్తి చేయలేం, అందుకే పంచ మహా యజ్ఞాలు చెయ్యాలని అంటారు.

అవి మనం దేవతలని ఆరాదించటం, మనకు శరీరం ఇచ్చినందుకు పితృ దేవతలను ఆరాదించటం, మన చుట్టూ ఉండే ప్రాణికోటితో భూతదయతో ప్రవర్తించటం, ధానధర్మాలు చెయ్యటం ఇలా మంచ మహా యజ్ఞాలు చెయ్యాలని అంటారు. ఇక ఒక రైతు పంట పండించేందుకు భూమి దున్నిన మొదలుకొని, క్రిమికీటాదులని సంహారం చేస్తాడు కాబట్టి రైతు తప్పని సరి పంచమహా యజ్ఞం చెయ్యాల్సి వస్తుంది. ఇండ్లముందు వివిద ధాన్యాలను చల్లటం, ఇలా తమ వృద్దిని చూపటంతో పాటు లోపల భూత దయ ఇమిడి ఉంది. పంట ఇంటికి తెచ్చేముందు ప్రకృతి దేవతలకు ఆరగింపు చేస్తారు.

వివిద ధానధర్మాలు చెతనైనంతవరకు చేస్తారు. బసవన్నలకు సత్కరిస్తారు. రంగనాథుణ్ణి సత్కరించినట్లా అన్నట్లు తమ తమ అల్లుల్లను సత్కరిస్తారు. అలాంటి ఈ పండగ మనలోని దోషాలని తొలగించి పుష్టిని ఇవ్వుగాక.

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి ప్రవచనం


తిరుప్పావై--30






























































































30)వంగ క్కడల్ కడైంద మాదవనై క్కేశవనై
తింగళ్ తిరుముగత్తు శేయిరైయార్ శెన్ఱిఱైంజి
అంగ ప్పఱై కొండవాత్తై అణి పుదువై
ప్పైంగమల త్తణ్ తెరియల్ పట్టర్బిరాన్ కోదై శొన్న
శంగ త్తమిర్ మాలై ముప్పదుం తప్పామే
ఇంగిప్పరిశురైప్పర్ ఈరిరండు మాల్ వరైత్తోళ్
శెంగణ్ తిరుముగత్తు చ్చెల్వ త్తిరుమాలాల్
ఎంగుం తిరువగుళ్ పెత్తిన్భుఱువర్ ఎంబావాయ్

Thiruppavai in English - Pasuram 30.

30)Vanga-k-kadal kadaindha maadhavaani kesavanai
Thingal thirumugathu seyzhayaar senru irainji
Anga-p-paraikonda aattrai ani puduvai
Painkamala thanntheriyal pattar piraan kothai sonna
Sangath-thamizhmaalai muppadum thappaame
Ingi-p-parisuraippaar eerirandu maalvarai-th-thool
Senkam thirumugaththu selvaththirumaalaal
Engum thiruvarul petru inburuvar empaavaai

Thiruppavai in Tamil-திருப்பாவை பாசுரம் 30

30)வங்கக் கடல் கடைந்த மாதவனைக் கேசவனை
திங்கள் திருமுகத்து சேயிழையார் சென்றிறைஞ்சி
அங்கப் பறைகொண்ட ஆற்றை அணிபுதுவை
பைங்கமலத் தண்தெரியல் பட்டர்பிரான் கோதை சொன்ன
சங்கத் தமிழ் மாலை முப்பதும் தப்பாமே
இங்குஇப் பரிசுரைப்பார் ஈரிரண்டு மால்வரைத் தோள்
செங்கண் திருமுகத்து செல்வத்திருமாலால்
எங்கும் திருவருள் பெற்று இன்புறுவ ரெம்பாவாய்

తిరుప్పావై ముప్పైవ రోజు సంక్రాంతి. సంక్రాంతి మన దక్షిన దేశం వారికి ముఖ్యమైన పండగ. మన వాళ్ళంతా ఆనందంతో ఉత్సాహంతో ఒక పెద్ద పండగ చేసుకుంటారు. ప్రకృతిలో వసంత ఋతువు ఆహ్లాదాన్ని ఇచ్చినా, ఈ కాలం మనకు పంటలతో ఒక నిండు తనాన్ని కల్గించే కాలంగా మనం అనుభవిస్తుంటాం. నెలరోజులు ధనుర్మాస వ్రతం ఆచరించిన గోదాదేవి, తనను ఒక గోపికగా భావించి శ్రీరంగంలో వేంచేసి ఉన్న శ్రీరంగనాథుణ్ణి వివాహమాడాలని అనుకుంది. తత్ ఫలితంగా శ్రీవెల్లిపుత్తూర్ నుండి గోదాదేవిని రప్పించుకొని శ్రీరంగనాథుడు విగ్రహస్వరూపంతోనే వివాహమాడాడు. గోదాదేవి వ్రతం ఆచరించి రంగనాథుణ్ణి పోందిన రోజుని భోగి అంటారు. రంగనాథుణ్ణి భోగరంగడు అని అంటారు. భగవంతుణ్ణి వివాహమాడి వైభోగ్యాన్ని పొందింది కనుక ఆ రోజుకి భోగి అని పేరు. భోగి దాటిన మరునాడే సంక్రాంతి. తరువాత రోజు కనుమ. ఈ మూడు రోజులు కలిపితే ఒక అందమైన పండగ.

దక్షినాయీనం పూర్తయ్యి ఉత్తయాయీణం వస్తుంది. దక్షినాయీణం దేవతలు రాత్రి, ఉత్తరాయణం పగలు. రాత్రి మనం విశ్రాంతి తీసుకొని పగలు లోకంలో ప్రవర్తిస్తుంటాం. మనలో ఎలాగైతే పగలు ప్రవృత్తి ఇక రాత్రి నివృత్తి అయ్యినట్లుగనే దేవతలకు ఉత్తయాయీణం ప్రవృత్తి ఇక దక్షినాయీణం నివృత్తి. దేవతలు మేల్గాంచి ఉన్నప్పుడు మనుష్యులలో దైవీ శక్తులు మేలుకొని ఉంటాయి, దక్షినాయీనంలో అసురీ ప్రవృత్తులు మేలుకొని ఉంటాయి. రోజులో బ్రహ్మ ముహూర్తం ఎట్లా అయితే తెల తెల వారే సమయంలో ఉంటుందో, ధనుర్మాస కాలం సత్వగుణాన్ని పెంచేదిలా ఉంటుంది, ఇప్పుడు చేసిన ఆచరణ ఏడాది కాలం మనల్ని మంచి మార్గంలో నడిచేట్టు చేస్తుంది. ఈ భావనతోనే మనం ధనుర్మాస వ్రతం ఆచరిస్తాం. తిరుప్పావై ఒక్కో పాశురాన్ని తెలుసుకొని ఆ జ్ఞానంతో బాగుపడేట్టు మనల్ని తయారుచేసుకుంటాం, తద్వార చుట్టూ ఉండే లోకాన్ని ఎట్లా చూడాలి, మన చుట్టు ఉండే సమాజంతో ఎట్లా ప్రవర్తించాలి అనేది తెలుస్తుంది. మనలో చక్కని సంస్కారం ఏర్పడుతుంది. మంచి మార్గంలో అడుగు పెట్టడం అన్నమాట, క్రాంతి అంటే అడుగు పెట్టడం, సం అంటే మంచిగా అని అర్థం. ఈ రకంగా మంచిగా బ్రతకటానికి తీసుకున్న నిర్ణయం కాబట్టి అది "సంక్రాంతి" అయ్యింది.

సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశికి మారే సమయం కూడా, ధనుఃరాశి నుండి మకర రాశికి మారుతాడు కనుక కొందరు ఈ రోజు శుభకార్యాలు చెయ్యరు. సంక్రమణం ఏర్పడ్డప్పుడు పితృదేవతలకు తృప్తి కలిగించటానికి నువ్వులు మొదలైన వాటితో తర్పణాదులు చేస్తుంటారు. అందుకే మరునాడు కనుమ పండుగ, తమ బంధువులను, అల్లుల్లను ఇంటికి రప్పించుకొని వివిద సత్కారాలు చేస్తారు. ఎందుకు చేస్తుంటారంటే తిరిగి గోదాదేవి ఆచరణయే కారణం. శ్రీరంగనాథుడు గోదాదేవిని వివాహమాడటంచే విష్ణుచిత్తులవారికి ఆల్లుడైయ్యాడు. శ్రీరంగంలో వివాహం జరిగి, కనుమ నాడు గోదాదేవితో కలిసి శ్రీవెల్లిపుత్తూర్ చేరి ఆరాధన అందుకున్నాడు.

ఇవన్నీ భావించి మన పూర్వులు మనకోక పండగను అందించారు. ఈ పండగలో గొబ్బిల్లను పూజిస్తారు, గొబ్బిల్లు వ్రతం ఆచరించిన గోపికల ప్రతీక. గోపికలు శ్రీకృష్ణుడిని కోరినవారు, వేరొకరు వారికి తెలియదు. శ్రీకృష్ణుడు ఏది చెబితే అది వారికి వేదం. ఆయన చెప్పినదాన్ని పాటించాలి అని కోరుకుంటారు. ప్రతి వ్యక్తి ఈ గోపీ ప్రవృత్తితో గోదాదేవి ఎలాగైతే భగవంతుణ్ణి పొందిందో, మనంకూడా భగవత్ ప్రవృత్తి కల్గి లోకంలో ప్రవర్తించాలని తెలియడానికి మన పెద్దలు మనకు ఈ అందమైన పండగను ఏర్పాటు చేసి ఇచ్చారు.

మనం ఆచరించే ప్రతి పండగకీ పై పై కి ఆనందాన్ని ఇచ్చేవిగా అనిపించినా, దాని వెనకాతల ఆధ్యాత్మిక సందేషం మన ప్రతీ పండగలో కనిపిస్తుంది.

ప్రతి పండగలో మూడు విషయాలు సూచిస్తారు.

1. ఆధ్యాత్మిక ఉన్నతి
2. శారీరక ఆనందం
3. మన దోషాలు తొలగటం

మామూలుగా మనం వంట వండేప్పుడు కూరగాయలు తరిగేప్పుడో, అన్నం ఉడికించేప్పుడో మనకు తెలియకుండా కొన్ని సూక్ష్మ జీవులని సంహరిస్తుంటాం. అలా చేసినందుకు మనకు పంచ మహా పాతకాలు చుట్టుకుంటాయి అంటుంటారు. మనం అన్నం మాని నివృత్తి చేయలేం, అందుకే పంచ మహా యజ్ఞాలు చెయ్యాలని అంటారు.

అవి మనం దేవతలని ఆరాదించటం, మనకు శరీరం ఇచ్చినందుకు పితృ దేవతలను ఆరాదించటం, మన చుట్టూ ఉండే ప్రాణికోటితో భూతదయతో ప్రవర్తించటం, ధానధర్మాలు చెయ్యటం ఇలా మంచ మహా యజ్ఞాలు చెయ్యాలని అంటారు. ఇక ఒక రైతు పంట పండించేందుకు భూమి దున్నిన మొదలుకొని, క్రిమికీటాదులని సంహారం చేస్తాడు కాబట్టి రైతు తప్పని సరి పంచమహా యజ్ఞం చెయ్యాల్సి వస్తుంది. ఇండ్లముందు వివిద ధాన్యాలను చల్లటం, ఇలా తమ వృద్దిని చూపటంతో పాటు లోపల భూత దయ ఇమిడి ఉంది. పంట ఇంటికి తెచ్చేముందు ప్రకృతి దేవతలకు ఆరగింపు చేస్తారు.

వివిద ధానధర్మాలు చెతనైనంతవరకు చేస్తారు. బసవన్నలకు సత్కరిస్తారు. రంగనాథుణ్ణి సత్కరించినట్లా అన్నట్లు తమ తమ అల్లుల్లను సత్కరిస్తారు. అలాంటి ఈ పండగ మనలోని దోషాలని తొలగించి పుష్టిని ఇవ్వుగాక.

ఈ రోజు పాశురం ఈ దివ్య ప్రభందాన్ని రాసిందెవరు అని తెలిపే పాశురం. ఇక ఫలశృతిని తెలుపుతుంది ఈ పాశురం. ఈ ముప్పై పాశురాలను రోజు చదవాలి, లేని పట్ల చివరి రెండు అయినా తప్పని సరి అనుసంధానం చేయాలి. ద్వాపరంలో గోపికలు ఈ వ్రతం ఆచరించి కృష్ణుణ్ణి పోందారు. కలియుగంలో గోదాదేవి ఈ వ్రతం ఆచరించి రంగనాథుణ్ణి చేరింది.

"వంగ క్కడల్" అలలతో కూడిన ఆ పాలసముద్రాన్ని "కడైంద" చిలికినప్పుడు "మాదవనై" ఆయన లక్ష్మీదేవిని పొందినవాడైయ్యాడు. ఆయనే "క్కేశవనై" కేశవుడు, అందమైన కేశపాశం కల వాడు.

దేవలోక ఐశ్వర్యాన్ని వెలికి తీయడానికి పాల సముద్రంలో మందర పర్వతాన్ని వాసుకీ అనే పాముతో దేవతలు అసురులు మైత్రితో చిలికారు. ఆనాడు స్వామి వారి మైత్రిని కాపాడటానికి ఎన్నో రూపాలు ధరించాడు. పర్వతం క్రిందకు పడి పోకుండా కూర్మంగా ఒక రూపం, పైన పర్వతం నిలిచి ఉండటానికి పైన ఒక రూపం, ఇటు దేవతలకు అటు అసురలకు బలాన్నిచ్చేలా మరో రెండు రూపాలు ధరించాడు. కలిసి చేసే పనికి పరమాత్మ తనిదిగా భావించి చేస్తాడనే దానికి ఇది నిదర్శణం. అలా మనం కలిసి ఆచరించే తిరుప్పావైకి ఫలితం ఆయన తప్పక ఇస్తాడు. ఆలా చిలికినందుకు అమృతానికి అమృతమైన అమ్మవారిని పొంది ఆయన మాధవుడైనాడు. అసలు సాగర మధనం స్వామి జరిపింది అమ్మను తన వద్దకి చేర్చుకోవడానికే అని ఆండాళ్ అమ్మ "మాదవనై" అంటూ రహస్యం చెబుతుంది.

"శేయిరైయార్" భగవత్ కైంకర్య రూపమైన ఆభరణాలు కల "శెన్ఱిఱైంజి" ఆ గోపికలు "అంగ ప్పఱై కొండవాత్తై" చంద్రుడివలె ప్రకాశించే "తింగళ్ తిరుముగత్తు" ఆ శ్రీకృష్ణుడి దివ్య అనుగ్రహం పోందారు. "అణి పుదువై" భూమికి అలంకారమైన శ్రీవెల్లిపుత్తూర్ లో "ప్పైంగమల త్తణ్ తెరియల్" చల్లటి తులసి మాలను ధరించి ఉన్న "పట్టర్బిరాన్" విష్ణుచిత్తుల వారి కూతురైన "కోదై" గోదాదేవి "శొన్న" చెప్పిన "శంగ త్తమిర్ మాలై" తీపైన ఈ పాటల మాలయైన "ముప్పదుం తప్పామే" ముప్పై పాటలను, ఒక్కటీ వదలకుండా చెప్పాలి. తిరుప్పావై ఒక మాలిక కదా, మాలలో ఏ ఒక్క రత్నం లేకున్నా ఆ మాల అందం లేకుండా పోతుంది. మరియూ ఈ తిరుప్పావై భగవంతుణ్ణి చేరే క్రమమైన మెట్ల మాదిరివి, ప్రతి మెట్టూ అవసరం. "శెంగణ్ తిరుముగత్తు" వాత్సల్యమైన ఆ ముఖంతో "చ్చెల్వ త్తిరుమాలాల్" ఉభయ విభూది అనే ఐశ్వర్యం కల నాథుడు, "ఇంగిప్పరిశురైప్పర్" ఆయన చల్లని చూపులు తిరుప్పావై చదివే వారిపై ఉంటాయి. "ఈరిరండు మాల్ వరైత్తోళ్" రెండు హస్తాలతో ఉన్న ఆయన నాలుగు హస్తాలు చేసుకొని నాలుగు పురుషార్థాలను ఇస్తాడు. "ఎంగుం తిరువగుళ్ పెత్త్" అన్ని చోట్లా దివ్య అనుగ్రహాన్ని పొంది "ఇన్బుఱువర్" ఆచరించిన వారు ఆనందాన్ని అనుభవిస్తారు.

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి ప్రవచనం

Thursday, January 12, 2012

తిరుప్పావై--29












































































29)శిత్తమ్ శిఱుకాలే వంద్ ఉన్నై చ్చేవిత్తు ఉన్
పొత్తామరై యడియే పోట్రుం పొరుళ్ కేళాయ్
పెత్తం మేయ్ త్తుణ్ణుం కులత్తిల్ పిఱందు, నీ
కుత్తేవల్ ఎంగలై క్కోళ్ళామల్ పోగాదు
ఇత్తై పఱై కోళ్వాన్ అన్ఱు కాణ్ గోవిందా!
ఎత్తెక్కుం ఏరేర్ పిఱవిక్కుం ఉన్ తన్నో
డుత్తోమేయావోం ఉనక్కే నాం అట్చెయ్ వోం
మత్తై నం కామంగళ్ మాత్త్-ఏలోర్ ఎంబావాయ్


Thiruppavai in English - Pasuram 29.

29)Sittran sirukaale vandhu unnai seviththu un
Pottraamarai adiye pottrum porul kelaai
Pettram mayththunnum kulaththil pirandhu nee
Kuttreval engalai kollamal pogaathu
Ittrai parai kolvaan anru kaann Govindaa!
Ettraikkum azh-azh piravikkum un thannoda
Uttrome yaavom unakke nam aatcheivom!
Mattrai nam kaamangal maattru-el or empaavaai


Thiruppavai in Tamil-திருப்பாவை பாசுரம் 29

29)சிற்றஞ் சிறுகாலே வந்துன்னை சேவித்துஉன்
பொற்றா மரையடியே போற்றும் பொருள் கேளாய்
பெற்றம்மேய்த் துண்ணும் குலத்தில் பிறந்து நீ
குற்றேவல் எங்களைக் கொள்ளாமல் போகாது
இற்றைப் பறைகொள்வான் அன்றுகாண் கோவிந்தா!
எற்றைக்கும் ஏழேழ் பிறவிக்கும் உன்தன்னோடு
உற்றோமே ஆவோம் உனக்கே நாம் ஆட்செய்வோம்
மற்றைநம் காமங்கள் மாற்றேலோ ரெம்பாவாய்


అర్థము::
ఈ రోజు ఆండాళ్ తన వెంట ఉన్న గోపీ జనాలతో తను ఏం కోరి వచ్చిందో నీరూపించిన రోజు.మన వాళ్ళు మేం పరిశుద్దులమై వచ్చాం అని గతంలో రెండు సార్లు చెప్పారు,మేం ఏ ఇతర ఫలితాలు కోరి రాలేదు,ఏ ఉపాయాలు కూడా వాళ్ళ వద్ద లేవని నిన్న చెప్పారు.ఈరోజు స్వామి ముందర తమ ఆర్తిని ఆవిష్కరిస్తున్నారు.మేం రావడం సాధన కాదు,మా ఆర్తిని చూసైనా అనుగ్రహించాలని అనిపించటం లేదా అని అంటున్నారు."శిత్తమ్ శిఱుకాలే" ఇంకా చీకటి తొలగని తెల తెల వారే సమయంలో "వంద్" మేం నీ దగ్గరికి వచ్చాం.మాలో ఆర్తి పెంచినది నీవే కదా,ఎంత కాలం నీవు చేసిన ఫలితమో ఇన్నాళ్ళకు మాకు ఈ జ్ఞానం కల్గింది.ఇది నీవు చేసిన కృషేకదా."ఉన్నై చ్చేవిత్తు" అన్ని నీవు చేసినవాడివి,శభరి లాంటి వారికి నీవే వెళ్ళి అనుగ్రహించావు.కానీ మేం చేయాల్సి వస్తుంది. మేం నిన్ను సేవిస్తున్నాం.మనకున్న జ్ఞానంతో ఒక్క సారి మేం నీవాడమని చెప్పగల్గుతే,ఇది రాగ ప్రయుక్తం."ఉన్ పొత్తామరై యడియే పోట్రుం" నీ పద్మాలవంటి ఆ దివ్యమైన పాదాలకు మంగళం పాడుతున్నాం.

"ఎం కించిత్ పురుషాదమం కటిపయ గ్రాణేశం అల్పార్దకం సేవాయ" ఈ లోకంలో అల్పమైన పురుషార్దం కోసం వాడి కున్న కొంత ఆస్తి చూసి వాడే నాయకుడని చుట్టూ వీల్ల వాల్ల చుట్టూ తిరుగుతారే జనం ఎంత ఆశ్చర్యం కదా."నాదేన పురుషోత్తమే త్రిజగతామే ఏకాధిపే చేతసా సేవ్యె సస్య పదస్య దాసరీ సురే నారాయణే తిష్టతి" సమస్త జీవులకు ఆయన నాథుడై ఉన్న ఆ పురుషోత్తముడు ఆయన కదా,ఆయన ముల్లోకాలను నడిపేవాడు,చేతులు కట్టుకున్నా సరే ఒక్క సారి మనస్సులో నీవాడనని తెలిపినా ఆయన పరమ పదాన్ని ఇస్తాడు అని కులశేఖర ఆళ్వార్ చెప్పినట్లుగా,మేం నీ పాదాలను పాడటనికి వచ్చాం అని చెప్పారు.

ఆయన ఎం విననట్టుగా సుదీర్గమైన ఆలోచనలో పడి ప్రేమతో వీళ్ళకేసి చూస్తున్నాడు."పొరుళ్ కేళాయ్"మేం ఎందుకు స్తుతిస్తున్నామో వినవయ్యా అంటూ ఆయనను తట్టి పాటం చెబుతోంది గోదా.ఆండాళ్ తల్లికి పాటం చెప్పడం అలవాటు కదా.ఆయనకీ పాటం చెప్పగలదు."పెత్తం మేయ్ త్తుణ్ణుం కులత్తిల్ పిఱందు"మొదట పశువులని మేపి అవి తిన్నాకగాని మేం తినేవాళ్ళం కాదు.నీకు మా స్వరూపం తెలియదా.మరి నీవేమి చేస్తున్నావు! మాకు ఆహారం నీసేవయే,అది మాకు లభించాకే,ఆ తర్వాతే కదా నీవు ఆహారం తినాలి,"నీ కుత్తేవల్ ఎంగలై క్కోళ్ళామల్ పోగాదు"నీ ఆంతరంగిక సేవకై మమ్మల్ని స్వీకరించవలసిందే.ఎదో వ్రత పరికరాలు అని అన్నారు ఇదిగో అని అక్కడ పెట్టాడు."ఇత్తై పఱై కోళ్వాన్ అన్ఱు కాణ్ గోవిందా!" మేం ఎదో అడగాలని వాటిని అడిగాం,మేం కోరేవి ఇవికాదు.కేవలం మాట పట్టుకొని చూస్తావా,మా మనస్సులో ఎం ఉందో తెలియదా అని అడిగారు.నాకేం తెలియదు,నేను మీ గొల్లల్లో ఒకడినే కదా అని అన్నాడు శ్రీకృష్ణుడు.

"ఎత్తెక్కుం"ఎల్లప్పటికీ,ఈ కాలం ఆ కాలం అని కాదు,సర్వ దేశముల యందు,సర్వ అవస్తల యందు,"ఏరేర్ పిఱవిక్కుం "ఏడేడు జన్మలలో కూడా "ఉన్ తన్నో డుత్తోమేయావోం" నీతో సంబంధమే కావాలి.కాలాధీనం కాని పరమపదం లో ఉన్నామాకు నీ సంబంధమే ఉండాలి "ఉనక్కే నాం అట్చెయ్ వోం మత్తై నం కామంగళ్ మాత్త్" కేవలం నీ ఆనందం కోసమే మా సేవ అంకితమై ఉండాలి. తెలియక ఏదైన లోపం ఉంటే నీవే సరి దిద్దాలి,మాపై భారం వెయ్యవద్దు.

ఇలా వ్రతం ఆచరించిన అందరికి ఫలితం లభించింది. శ్రీకృష్ణ సమాగమం లభించింది,దీనికి సహకరించిన వారికి కోరినవి లభించాయి. ఈ రోజు పురుషార్థం పొందిన రోజు.ఈ రోజు స్వామి గోదాదేవిని రప్పించుకొని మానవ కన్యగా ఉన్న ఆమెను తాను విగ్రహరూపంలోనే వివాహమాడాడు.గోదాదేవి కోరిన వైభోగాన్ని పొందిన రోజు కనక "భోగి" అంటారు

Wednesday, January 11, 2012

తిరుప్పావై--28












































28}కఱవైగళ్ పిన్ శెన్ఱు కానమ్ శేర్-నుంద్-ణ్బోమ్
అఱివొన్ఱు మిల్లాద వాయ్-క్కులత్తు, ఉన్ఱన్నై
ప్పిఱవి పిఱన్దనై పుణ్ణియమ్ యాముడయోమ్
కుఱైవొన్ఱుమిల్లాద గోవిందా, ఉందన్నో
డుఱవేల్ నమక్కు ఇంగొరిక్క వొరియాదు
అఱియాద పిళ్ళైగళోమ్ అంబినాల్, ఉన్ఱన్నై
చ్చిఱు పేర్-అళైత్తనవుం శీఱి యరుళాదే
ఇఱైవా! నీ తారాయ్ పఱై ఏలోర్-ఎంబావాయ్

Thiruppavai in English - Pasuram 28.

28)Karavaigal pinsenru gaanam serndhu unbhom
Arivonrum illaadha aai-kulaththu unrannai
Piravi Perunthanai punniyam yaamudaiyom
Kurai onrum illadha Govindaa! Un rannodu
Uravel namakku ingu ozhikka ozhiyaadhu
Ariyaadha pillaikalom anbinaal unrannai
Siruper azhaiththanavum seeri arulaadhe
Iraivaa! Nee thaaraai parai-el or empaavaai

Thiruppavai in Tamil-திருப்பாவை பாசுரம் 28

28)கறவைகள் பின்சென்று கானம் சேர்ந்துண்போம்
அறிவொன்று மில்லாத ஆய்குலத்து உன்தன்னை
பிறவிப் பெருந்துணை புண்ணியம் யாமுடையோம்;
குறைவொன்று மில்லாத கோவிந்தா! உன்தன்னோடு
உறவேல் நமக்கு இங்கு ஒழிக்க ஒழியாது
அறியாத பிள்ளைகளோம் அன்பினால் உன்தன்னைச்
சிறுபே ரழைத்தனவும் சீறியருளாதே;
இறைவா! நீ தாராய் பறையேலோ ரெம்பாவாய்.

గోపికలు శ్రీ కృష్ణునితో అన్నారు మేము మార్గ శీర్ష స్నానము చేయవలెనని వచ్చాము.మాకు మా వ్రతమునకు కావలసిన పరికరములు అడిగారు.ఆ వ్రతము చేసిన తర్వాత తామూ పొందవలసిన ఆభరణములను,వస్త్రములను,భోగములను ప్రార్దిమ్చినారు .
శ్రీ కృష్ణునకు వారు హృదయము తెలియును.ఇదంతయు లుకిక వ్రత గాధ కాదు.వీరు కోరునవి లుకిక వ్రతోపకరనములు కావు. ఆముష్మిక ఫలమునండుతకే వీరు కోరుచున్నారు.కాని వీరి నోటివేమ్తనే దానిని చెప్పిమ్చవలెను అని తలంచి ఇట్లు అడిగినారు.
ఓ గోపికలారా ! మీరు కోరినవన్నియు చాలా చక్కగా వున్నాయి.మీరు " పరిశీలించి కృపచేయమని" అనిఅన్నారు.
కదా పరిశీలించినా మీ అభిప్రాయమేమో నాకు తోచటంలేదు.వ్రతము చేసి మహత్తరమైన అలంకరనములను భోగములను అందవలెనన్నా దానికొక అదికారము ఉండాలి కదా? ఫలమునాశించిన మీరు ఆ ఫలాప్రాప్తికి ఏదోఒక యత్నము కుడా చేసి యుండాలి కదా? మా కది కావాలని అన్నంత మాత్రమున నేను ఇచ్చుటకు వీలుకాదు.దానికి తగిన యోగ్యతా మీకున్న ఇవ్వగలను.కావున మీకున్న అధికారము అనగా మీ యోగ్యతా ఎట్టిదో వివరించుము.ఫలమును అందగోరు వారు దానికి సాధనమునుగూడ సంపాదిమ్పవలేనుగాడా? మీరు అట్టి సాధనమును దేనినైనా ఆర్జించినారా ?
ఇట్లు అడుగగానే గోపికలు తమ హృదయము విప్పి చెప్పుచున్నారు.
గోపికలు కామ్క్షిమ్చునది పరమ పుశార్ధముఅగు నారంట భగవత్ పురక భవత్కైమ్కర్యము.దానికి వరేమియు యోగ్య తను సంపాదించుకొని రాలేదు.పరమాత్మే ఉపాయముగా నమ్మిన వారు,వాటి కంటే వేరే ఉపాయము తాము పొందుటకు ప్రతిభందకములని తెలుసుకున్నవారు.కర్మలు చేసి,జ్ఞానము సంపాదించి,భక్తి తో ఉపాసించి పరమాత్మను పొందాలని తలంపు వీరికి లేదు.వాడె వానిని పొందించ వలెనని నమ్మినవారు.అందుచే ఇట్లు భగవానుడే యుపాయమని నమ్మకము కలవారు.భగవానుని ముందు ఏమి విజ్ఞాపనము చేయవలెనో ఆమాటలను గోపికలు ఈ పాసురమున వివరిచుచున్నారు.

అర్థము::

పశువుల వెంట వానిని మేపుటకై అడవికిపోయి. అచటనే శుచినియమములు లేక తిని,జీవిమ్చియుమ్డుతయే ప్రయోజనముగా తిని, తిరిగెడివారము.ఏమియు జ్ఞానములేని మాగోప వంశమున మాతో సజాతీయుడవై నీవు జన్మిచిన పుణ్యమే మాకున్న పుణ్యము. మాకెన్ని లోపాలున్నా తీర్చగాల్గినట్లు ఏ లోపము లేని వాడవు కదా నీవు.గోవిందా! ఓ స్వామీ ! నీతో మాకుగల సంబంధము పోగొట్టుకోన వీలుకాదు.లోక మర్యాదనేరుగని పిల్లలము.అందుచే ప్రేమవలన నిన్ను చిన్న పేరు పెట్టి పిలచినాము.దానికి కోపము తెచ్చుకొని మమ్ములననుగ్రహింపక ఉండకుము.మాకు ఆపేక్షితమగు పరను పరను ఇవ్వుము.

Tuesday, January 10, 2012

తిరుప్పావై--27












































27)కూడారై వెల్లుమ్ శీర్ గోవిందా, ఉన్ఱనై
ప్పాడి పఱైకొండు యామ్ పెరుసమ్మానమ్
నాడు పుకరం పరిశినాళ్ నన్ఱాక
శూడగమే తోళ్ వళైయే తోడే శెవి పువ్వే
పాడగమే యెన్ఱనైయ పల్కలనుమ్ యామణివోమ్
ఆడైయడుప్పోం అతన్ పిన్నే పాల్ శోఱు
మూడనెయ్ పెయ్దు మురంగైవరివార
కూడి ఇరుందు కుళిరుంద్-ఏలోర్ ఎంబావాయ్

Thiruppavai in English - Pasuram 27

27)Koodaarai vellum seer Govinda! Unrannai
Paadi-p-paraikondu yaamperu sammaanam
Naadu pugazhum parisinaal nanraaga
Choodagame thol valaye thoday sevi-p-poovay
Paadagame enranaya palkalanum yaam anivom
Aadai uduppom adhanpinnay paar choru
Mooda nei peidhu muzhangai vazhivaara-
Koodi irundhu kulirndhu-el or empaavaai

Thiruppavai in Tamil-திருப்பாவை பாசுரம் 27


27)கூடாரை வெல்லும் சீர் கோவிந்தா! உன்தன்னைப்
பாடிப்பறை கொண்டு யாம் பெறும் சம்மானம்
நாடுபுகழும் பரிசினால் நன்றாக
சூடகமே தோள் வளையே தோடேசெவிப் பூவே
பாடகமே யென்றனைய பல்கலனும் யாமணிவோம்
ஆடையுடுப்போம் அதன் பின்னே பாற்சோறு
மூடநெய் பெய்து முழங்கை வழிவாரக்
கூடியிருந்து குளிர்ந்தேலோ ரெம்பாவாய்.

గోపికలు తామూ ఆచరించబోవు మార్గ శీర్ష వ్రతమునకు కావలసిన పరికరములను వెనుకటి పాసురమున విన్నవిమ్చినారు. అందు వారడిగిన ద్రవ్యములు సులభాములేయైననాను వారు కోరిన వారు కోరిన గునముఅలు గల ద్రవ్యము దుర్లభాములు.అందుచే శ్రీ కృష్ణ పరమాత్మ వీరి హృదయము వస్తువులను గోరుట కాదు,నన్నే కోరి వీరీ వస్తువులను కోరినారు.అనుకొనెను.పాచజన్యమును పోలిన శంఖములను కోరారు.మరి అల్లాంటి శంఖము దొరకదు.ఆ శంఖము శ్రీ కృష్ణుని వీడదు.అందుచే శ్రీ కృష్ణుడే శంఖధరుడై తమతో నుండవలెనని వారు కోరారు.
చల్లా పెద్ద పర కావలెనని గోపికలు కోరారు.శ్రీ కృష్ణుడు త్రివిక్రమావతారమున జాంబవంతుడు త్రివిక్రముని విజయమును చాటుచు వాయించిన పరయోకటి కలదు.శ్రీ కృష్ణ రుపముననున్న నేను కుంభ నృత్యము చేయునప్పుడు కట్టుకొని వాయించిన పర చాల పెద్ద పర.ఈ మూడింటిని ఇచ్చెదనని శ్రీ కృష్ణుడు గోపికలకు చెప్పెను.మంగళా శాసనము చేయువారు కావలెనని కోరిరి.మంగళా శాసనము చేయువారెచట నున్న పరమాత్మయే వారి వెంట నుండునని వీరీ అభిప్రాయము.
తమ దేవేరియగు శ్రీ మహాలక్ష్మి నే మంగళ దీపముగా వారితో ఉండునట్లు అంగీకరించెను.జెండా గరుత్మంతుడు.వారికి గరుడునికుడా ఒసగుటకు శ్రీ కృష్ణుడు సమ్మతించెను.
తరువాత చాందినీగా అనంతునే పంపనంగీకరించెను.మధురా నగరమున జన్మించి వ్రేపల్లెకు వచ్చిన ఆ రాత్రి వర్షమున శ్రీ కృష్ణునకు మేలు కట్టుగా తన పడగలనుపయోగించిన మహానీయుడు కదా! అనంతుడు,పడగ ఆసనము,వస్త్రము,పాదుకలు, తలగడ,చత్రము, చాందిని మొదలగున్నవి విధముల సర్వేస్వరునకు తన శరీరమును భిన్న భిన్న రుపములుగాకుర్చి యుపయోగపడి తనచేతలచే శేషుడు అను పేరు పొందిన మహనీయుడు.వీరు కూడా శేషత్వమునే కోరుతున్నవారగుటచే,శేషునే వారికి చాందినిగా ఇచ్చెను .
ఇలా పరికరములన్నీ సమకూరినవి కదా ! ఇక మీ వ్రతమునకు ఫలమేమో వివరించమని స్వామీ కోరగా.గోపికలు ఈ పాసురమున ఈ వ్రతాచరణముచే తామూ పోందకోరిన ఫలమును వివరించుచున్నారు.ఈ పాసురము విశేషమైనది నేటి నివేదన చక్కెరపోంగళి ఆరగింపుగాఇస్తారు.గోపికలు ఈ పాసురము రోజు 108 గిన్నెలు చెక్కరపొంగలి నెయ్యి ఎక్కువ వేసి మోచేతి నుండి కారునట్లు వేసిచేస్తారు.ఎందుకుఅంటే 26 రోజులు వీరు నెయ్యి వాడలేదు కదా.అందువల్ల ఈ పాసురము రోజు మంచిగా చెక్కెర పొంగలి నివేదిస్తారు.

అర్థము::

తనతో కూడని శత్రువులను జయిమ్చేది కళ్యాణ గుణ సంపదగల గోవిందా ! నిన్ను కీర్తించి వ్రతసాధనమగు పర అను వాద్యమును పొంది పొందదలచిన ఘన సన్మానము లోకులందరు పొగడెడి తీరులో నుండును.చేతులుకు గాజులు మొదలుగు ఆభరణములు, బాహువులకు డందకదియములు,చెవి క్రిందు భాగమున దాలెచేది దుద్దు,పై భాగమున పెట్టుకొనే కర్ణపువ్వులు,కాలి అందెలు మొదలుగు అనేక ఆభరణాలు మేము ధరించాలి.తరువాత మంచి చీరలను దాల్చి వుండాలి.దాని తరువాత పాలు అన్నము మున్నగున్నవి నెయ్యి పోసి ఆ మధుర పదార్ధము మోచేతి వెంబడి కారునట్లు నీతో కలసి కూర్చొని చల్లగా హాయిగా భుజిమ్చవలెను. గోపికలు తమ వ్రత ఫలమును ఇందులో వివరించారు.

Monday, January 9, 2012

తిరుప్పావై--26











































26)మాలే మణివణ్ణా మార్-గరి నీరాడువాన్
మేలైయార్ శేయ్-వనగళ్ వేండువన కేట్టియేల్
ఞాలత్తై యెల్లాం నడుంగ మురల్వన
పాలన్న వణ్ణత్తు ఉన్-పాంచజన్నియమే
పోల్వన శంగంగళ్ పోయ్ ప్పాడుడైయనవే
శాలప్పెరుం పఱైయే పల్లాండిశైప్పారే
కోలవిళక్కే కొడియే వితానమే
ఆలిన్-ఇలైయాయ్ యరుళ్-ఏలోర్ ఎంబావాయ్

Thiruppavai in English - Pasuram 26.


26)Maaley! Manivanna! Maargazhi neeraaduvaam
Melaiyaar seivanangal venduvana kettliyel
Gnalath-thai ellam nadunga muralvana
Paalanna Vannathu un Paanchajanyamey
Polvana sangangal poi-p-paadu udaiyanave
Saalap-preum paraiyey pallaandu isaipparey
Kola vilakkey kodiyey vidhaaname
Aalin ilayai! arul-el or empaavai

Thiruppavai in Tamil-திருப்பாவை பாசுரம் 26

26)மாலே! மணிவண்ணா! மார்கழி நீராடுவான்
மேலையார் செய்வனகள் வேண்டுவன கேட்டியேல்
ஞாலத்தையெல்லாம் நடுங்க முரல்வன
பாலன்ன வண்ணத்து உன் பாஞ்சசன்னியமே
போல்வன சங்கங்கள் போய்ப்பாடுடையனவே
சாலப்பெரும் பறையே பல்லாண்டிசைப்பாரே
கோல விளக்கே கொடியே விதானமே
ஆலினிலையாய்! அருளேலோர் எம்பாவாய்.

శ్రీ కృష్ణ పరమాత్మ గోపికల మాటలకు పరమానందము తో వారిని చుచుతూ ఉండిపోయాడు.వారి పాసురము పాసురము మండలమును,నేత్ర ములను,వక్షస్థలమును,నడుమును చూచుచు ఇతర స్పృహ లేనంతగా వ్యామోహముతో పరవశమై ఉన్నాడు.వారి మాటలు విని మరి కొన్ని వినాలన్న కోరికతో ఒక ప్రశ్న అడిగెను " గోపికలారా ! నన్నే కోరి వచ్చాము అని చెప్పారు.మరలా నీకిష్టమైనచో పర అను వాద్యమును ఇమ్మని అంటున్నారు.నన్నే కలియవలేనని కోరిక ఉన్నవారు వేరోక దానిని కాంక్షించారు కదా? మీరు పర అడుగుటలో ఉద్దేశ్యము ఏమి? మీ కోరిక విషయములో నాకు సందేహముకలుగుతున్నది.అని శ్రీ కృష్ణుడు వారిని ప్రశ్నించెను.వారు దానికి భగవద్ ప్రీతి కొరకు మా పెద్దలు ధనుర్మాస వ్రతము చెయ్యమన్నారు.మేము పెద్దల యెడ ఉపకారబుద్ధితో ఈ వ్రతము ఆచరించ బూనినాము.అని గోపికలు చెప్పారు.
అంత శ్రీ కృష్ణ పరమాత్మ సరే కానిండు.అయితే ఆవ్రతము ఏమి ? దానికి ప్రమాణము ఏమి ? దానికి కావలిసిన పదార్ధాలు ఏమి ? అవి ఎన్ని కావాలి? వివరాలు తెలపండి.అని అడిగెను.అంత గోపికలు ఈ వ్రతమునకు కావలసిన పరికరములు అర్ధించుచున్నారు.ఈ పాశురములో

అర్థము::
ఆశ్రిత వ్యామోహముకలవాడా! ఇంద్ర నీలము అను మణిని పోలిన కాంతియు, స్వభావమును కలవాడా! అఘటిత ఘటనా సామర్ధ్యముచే చిన్న మర్రియాకుపై అమరి పరుండువాడా ! మేము మార్గశీర్ష స్నానము చేయగోరి దానికి కావలసిన పరికరాలు అర్ధించి నీ వద్దకు వచ్చితిమి.ఆ స్నాన వ్రతమును మా పూర్వులు శిష్టులు ఆచరించినారు.నీవు విన్నచో దానికి కావలసిన పరికరాలు విన్నవించేదము.ఈ భూమండలమంతను వణుకుచున్నట్లు శబ్ధము చేయు,పాలవలె తెల్లనైన,నీ పాంచజన్యమనబడే శంఖమును పోలిన శంఖములు కావలెను.విశాలమగు చాలా పెద్ద "పర " అను వాద్యము కావాలి మంగళ గానము చేయు భాగవతులు కావాలి.మంగళ దీపములు కావాలి.ధ్వజములు కావాలి.మేలుకట్లు కావాలి.పై పరికరములు ను క్రుపచేయుము అని గోపికలు శ్రీ కృష్ణుని ప్రార్ధించిరి.సర్వ శ క్తిమంతుడవై మాకోరకు శ్రీ కృష్ణుడు వై సులభుడవైన నీవు మాపై దయ చూపి మా వ్రతమునకు కావలసిన పరికరములు నోసగుమని గోపికలు ఈ ప్రాసురమున ప్రార్ధించినారు

ఈ అర్థమును లహరి బ్లాగునుండి స్వీకరించినది

Sunday, January 8, 2012

తిరుప్పావై--25











































25)ఒరుత్తి మగనాయ్ పిఱందు ఓరిరవిల్
ఒరుత్తి మగనాయ్ యొళిత్తు వళర
తరిక్కిలానాకి త్తాన్ తీంగు నినైంద
కరుత్తై పిరపిత్తు కంజన్ వైత్తిల్
నెరుప్పెన్న నిన్న నెడుమాలే ఉన్నై
అరుత్తిత్తు వందోం పఱై తరుతియాగిల్
తిరుత్తక్క శెల్వముమ్ శేవకముమ్ యాంపాడి
వరుత్తముమ్ తీరుంద్ ముగిరుంద్-ఏలోర్ ఎంబావాయ్

Thiruppavai in English - Pasuram 25.

25)Oruththi maganaai-p-pirandhu or iravil
Oruththi maganaai oliththu valara
Tharikkilaanaagi-th-thaan theengu ninaindha
Karuththai pizhai-p-piththu kanjan vayittril
Neruppenna ninra nedumaley! unnai
Aruththuthu vandhom parai tharudhi yaagil
Thiruththakka selvamum sevakamum yaampaadi
Varuththamum theerndhu magizhndhu-el or empaavaai

Thiruppavai in Tamil-திருப்பாவை பாசுரம் 25.

25)ஒருத்தி மகனாய்ப் பிறந்து ஓரிரவில்
ஒருத்தி மகனாய் ஒளித்து வளரத்
தரிக்க்ல னாகித் தான் தீங்கு நினைத்த
கருத்தைப் பிழைப்பித்த கஞ்சன் வயிற்றில்
நெருப்பென நின்ற நெடுமாலே! உன்னை
அருத்தித்து வந்தோம் பறைதருதியாகில்
திருத்தக்க செல்வமும் சேவகமும்யாம் பாடி
வருத்தமும் தீர்ந்து மகிழ்ந்தேலோர் எம்பாவாய்

గోపికలు ఈ విధముగా మంగళము పాడుతుఉంటే శ్రీ కృష్ణ పరమాత్మ వారి ప్రేమకు,వాగ్వైభవనమునకు చాలా సంతోష్మ్చి " ఓ గోపికలారా! మీకు జన్మసిద్దాముగా మా యందుగల ప్రీతిచే మంగళము నాకాక్షించుచున్నారు.చాలా సంతోషమే,కానీ ఈ రాత్రివేళ మంచులో నడచి శ్రమ పడి వచ్చారు.చాలా శ్రమ అయ్యింది. కేవలము మంగళ శాసనము కాంక్షతోనే యున్నట్లు చెప్పుతున్నారు . కానీ దానికంటే వేరొక ప్రయోజనము లేదా? ఉన్నచో చెప్పండి.తప్పక నేరవేర్చుతాను.అనెను.నీగుణ కీర్తనము చేయుచూ వచ్చుటచే మంచు,రాత్రి,మొదలగున్నవి మాకు ఇబ్బందిని కలిగించవు.మాకు ప్రధాన ప్రయోజనము నీకు మంగళము పాడుతయే.లోకులకై వ్రతమోనర్చుటకుపర నొసంగిన ఒసగుము. మేము మీ స్వరూపమును మా స్వరూపమును తెలిసిన వారమే.కావునామంగళా శాసనమే ప్రధాన ప్రయోజనము అని తెలియచేయుచు శ్రీ కృష్ణ అవతార రహస్యమును తామెరుగుదుము అని దానిని ఈ పాశురములో వివరించినా మన గోపికలు.
గోపికలు ఈ పాశురములో శ్రీ కృష్ణుని జన్మ రహస్యమును కీర్తించుచు దానివలన శ్రమ తీరి ఆనందించుచున్నారు. అని చెప్పుచున్నారు.

అర్థము::
భగవానుడే తన కుమారుడుగా కావలెనని కోరి,శంఖచక్రగధాధరుడు అగు భగవానునే కుమారునిగా పొందగల్గిన సాటిలేని దేవకీ దేవి కుమారుడవై జన్మించి,శ్రీ కృష్ణుని లీలలను పరిపూర్ణముగా అనుభవించి,కట్టను కొట్టను భగవానుని వశమొనర్చుకొనిన అద్వితీయ వైభావముగల యశోదకు,ఆ రాత్రియే కుమారుడవై,దాగి పెరిగినవాడా! అట్లు పెరుగుచున్న నిన్ను చూచి ఓర్వలేక చంపవలెనని దుష్ట భావముతో నున్న కంసుని అభిప్రాయమును వ్యతముచేసి వానికడుపులో చ్చిచ్చువై నిన్ను చంపవలెనని తలచిన వానిని నీవే చంపిన ఆశ్రిత వ్యామోహము కలవాడా! నిన్నే కోరి వచ్చినాము.పర అను వాద్యము నిచ్చిన ఇమ్ము.సాక్షాత్తు లక్ష్మీ దేవే పొందవలెనని కోరదగిన నీ ఐశ్వర్యమును,నీ వీర చరిత్రమును,కీర్తించి శ్రమను విడిచి పెట్టి సంతోషించు.
భగవానుని పాడుటకు సాధనానుస్టానము చేయుచున్నప్పుడు చాలా శ్రమలు కలుగును.ఆ శ్రమలు శ్రమగా కాక ఆనందముగా ఉండాలి.దానికి నామసంకీర్తనమే సాధనము అని గోపికలు ఇందులో వివరించారు.

ఈ అర్థమును లహరి బ్లాగునుండి స్వీకరించినది

తిరుప్పావై--24



24)అన్ఱివ్వులగమ్ అళందాయ్ అడి పోత్తి
శెన్ఱంగు త్తెన్-ఇలంగై శెత్తాయ్ తిఱల్ పోత్తి
పొన్ఱచ్చకడం ఉదైత్తాయ్ పుగర్ పోత్తి
కన్ఱుకుణిలా వెఱిందాయ్ కరిల్ పోత్తి
కున్ఱుకుడైయా వెడుత్తాయ్ కుణమ్ పోత్తి
వెన్ఱు పకై కెడుక్కుమ్ నిన్ కైయిల్ వేల్ పోత్తి
ఎన్ఱెన్ఱుమ్ శేవకమే యేత్తి ప్పఱైకొళ్వాన్
ఇన్ఱు యాం వందోం ఇరంగ్-ఏలోర్ ఎంబావాయ్

24)Thiruppavai in English - Pasuram 24.

anRu ivvulagam aLandhaay adi pORRi
senRangu(th) then ilangai seRRaay thiRal pORRi
ponRa(ch) chakatam udhaiththaay pugazh pORRi
kanRu kuNil aaveRindhaay kazhal pORRi
kunRu kudaiyaay eduththaay guNam pORRi
venRu pagai kedukkum nin kaiyil vEl pORRi
enRenRum un sEvagamE Eththi(p) paRai koLvaan
inRu yaam vandhOm irangElOr empaavaai


Thiruppavai in Tamil-திருப்பாவை பாசுரம் 24

24)அன்றிவ்வுலகமளந்தாய்! அடிபோற்றி
சென்றங்குத் தென்னிலங்கை செற்றாய்! திறல் போற்றி
பொன்றச்சகடமுடைத்தாய்! புகழ் போற்றி
கன்று குணிலாவெறிந்தாய்! கழல் போற்றி
குன்று குடையாவெடுத்தாய்! குணம் போற்றி
வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போற்றி
என்றென்று உன் சேவகமே ஏத்திப் பறைகொள்வான்
இன்றுயாம் வந்தோம்; இரங்கேலோர் எம்பாவாய்

ప్రస్తుతము గోపికలు మంచి దశకు చేరి ప్రేమ దసలోనున్న వారగుటచే తమకు కలిగిన అమంగళములను అతనిని దర్శించి పోగొట్టుకోవాలని,తమకు లేని మంగళములను సంపాదించుట మాని ప్రేమైక హృదయులై శ్రీ కృష్ణునకు మంగళము పాడుచున్నారు.ఇట్లే గోపికలు శ్రీ కృష్ణ పరమాత్మ వలన తమ కార్యము నెరవేరునని,తమ ప్రభువు నడచి వచ్చి ఆసనము పై కుర్చొనగానే ఆ పాదాలు ఎర్రదనము చూచి తామూ చేసిన యపచారమునకు భాధపడి మంగళము పాడిరి.ఈ పాశురము చాలా విశేషమైనది.స్వామివారికి హారతి చాలా ఇష్టం కదా ఈ పాసురములో స్వామికి హారతి ఎక్కువగా ఇస్తారు.విశేషమైన నివేదనగా దద్యోజనం ఆరగింపుగా ఇవ్వాలి

అర్థము::
ఆనాడు బలి చక్రవర్తి తనదికాని రాజ్యమును తానూ ఆక్రమించి దేవతలను పీడించగా ఈ లోకమునంతను వానివద్దనుండి దానము పట్టి పాదములతో కొలిచిన మీ దివ్య పాదములకు మంగళము.రావణుడు సీతమ్మను అపహరించుకొని పోగా ఆ రావనుడుండు లంకకే వెళ్లి సుందరమగు భవనములు కోటయుగల దక్షినదిసనున్న లంకలో ఉన్నా రాక్షసులను చెండాడిన మీ భాహు పరాక్రమములకు మంగళము.శ్రీ కృష్ణునకు రక్షణకై యుంచిన బండిపై ఆవేసించిన రాక్షసుని చంపుటకై ఆ బండికి తగులునట్లు కాలుచాచి నేలకూల్చిన మీ అప్రతిమ కీర్తికి మంగళము.వత్సము పై ఆవేసించిన అసురునితో వెలగ చుట్టుపై నాఎసించిన యసురుని చంపుటకై ఓడిసేలరాయి విసరినట్లుగా వెలగ చెట్టుపైకి దూడను విసరనపుడు ముందువేనుకకు పాదములుంచి నిలచిన మీ దివ్య పాదములకు మంగళము. ఇంద్రుడు తనకు యాగము లేకుండా చేసినని కోపముతో రాళ్ళ వాన కురియగా గోపాలురకు గోవులకు భాధ కలుగకుండా గోవర్ధన పర్వతమును గోడుగువలే ఎత్తిన మీ వాత్సల్యమునకు మంగళము. శ త్రువులను సములముగా పెకలిచి విజయము నార్జించి ఇచ్చేది మీ హస్తమునందలి వేలాయుధమునకు మంగళము.
ఈ విధముగా నీ వీర చరత్రములనే కీర్తించి పర అనే సాధనము నందగ మేమీనాడు వచ్చాము అనుగ్రహించుము.
అని ఈ పాశురములో మంగళము పాడుతూ భగవానుని అనుగ్రహించమని కోరుచున్నారు.