Thursday, July 12, 2012

శ్రీ గాయత్రి విశిష్టత



శ్రీ గాయత్రి విశిష్టత
రాసిన వారు::యర్రమల్లి హేమరత్నం గారిచే
సిలికానాంధ్ర .కం నుండి ....

***********************************************

సర్వదేవతా తత్వాలకు ప్రత్యేకమైన, ముఖ్యమైన గాయత్రీ మంత్రాలు కొన్ని తెలుసుకుందాం. ధీమహి, విద్మహే, ప్రమోదయాత్ అనే పదాలు ప్రతి మంత్రంలో వాడబడ్డాయి.

1. గణేశ గాయత్రి - ఓం ఏక దంష్ట్రాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో బుద్ధిః ప్రచోదయాత్.

2. విష్ణు గాయత్రి - ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రమోదయాత్

3. శివ గాయత్రి - ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో శివ ప్రచోదయాత్

4. కృష్ణ గాయత్రి - ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో కృష్ణ ప్రచోదయాత్

5. సుబ్రహ్మణ్య గాయత్రి - ఓం తత్పురుషాయ విద్మహే మహాసేవాయ ధీమహి తన్నో షణ్ముఖః ప్రచోదయాత్

6. నృసింహ గాయత్రి - ఓం వజ్రనాభాయ విద్మహే తీక్ష దంష్ట్రాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్

7. రామ గాయత్రి - ఓం దాశరథాయ విద్మహే సీతా వల్లభాయ ధీమహి తన్నో రామ ప్రచోదయాత్

8. హనుమద్గాయత్రి - ఓం అంజనీసుతాయ విద్మహే, వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్

9. ఆదిత్య గాయత్రి - ఓం భాస్కరాయ విద్మహే, మహర్ద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్

10. రుద్ర గాయత్రి - ఓం పురుషస్య విద్మహే, మహాదేవస్య ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్

11. గురు గాయత్రి - ఓం పరబ్రహ్మణే విద్మహే, గురుదేవాయ ధీమహి తన్నో గురుః ప్రచోదయాత్

12. లక్ష్మి గాయత్రి - ఓం మహాలక్ష్మైచ విద్మహే విష్ణు పత్నైచ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్

13. దుర్గా గాయత్రి - ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్

14. సరస్వతీ మంత్రం - ఓం సరస్వతీ విద్మహే బ్రహ్మపుత్రైచ ధీమహి తన్నో సర్వః ప్రచోదయాత్

గాయత్రీ మంత్రం కేవలం పురుషులు మాత్రమే జపించాలని నియమం వేదంలోకానీ, శాస్త్రంలోకానీ ఎక్కడా లేదు. గాయత్రీ మంత్రానికి శబ్దపరంగానూ, మంత్రపరంగానూ ప్రత్యేక స్థానం ఉంది. చైతన్యవంతం చేస్తుంది. ఐహికంగా, పరమార్ధికంగా మనిషికి సవ్యమైన మార్గాన్ని నిర్దేశించి, అనుగ్రహించే మహామంత్రం, గాయత్రీ మంత్రం. కేవలం స్వలాభం కోసం కాకుండా, మన తోటి వారి కోసం, ప్రజాక్షేమం కోసం, దేశ క్షేమం కోసం, ప్రపంచ శాంతి కోసం, మంత్రానుష్టానం చేస్తే ఆ తల్లి పరిపూర్ణ అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఆపై సర్వశ్య శాంతి, ఆత్మదర్శనం పొంది, జగజ్జనని చరణచ్చాయలో నిశ్చింతగా విశ్రమించగలం. ఇది నిశ్చయం.

సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ మానవత్వపు విలువలు, పరతత్వ అన్వేషణలో మనకు సహాయపడే దివ్యమైన, అద్భుతమైన పరికరాలు. మనలోని మనస్సే మనః శ్శాంతిని కానీ, సహయపడే దివ్యమైన, అద్భుతమైన పరికరాలు. మనలోని మనస్సే మనః శ్శాంతిని కానీ, మనోక్లేశాన్ని కానీ కలిగించే వస్తువు. ఆ మనస్సును నియంత్రించి, జగజ్జనని దివ్య నామస్మరణతో మనోలయం చేయాలి. సకల ధర్మ సర్వస్వమై, సకల లోకాలను పాలించే మహత్తత్వం, పరదేవత తత్వం. నిరర్ధకమైన బాహ్యసుఖాన్వేషణకై అలసట పడక, పరతత్వాన్వేషణకై పరితపించాలి. సాధించాలి. చివరిగా చిన్న విన్నపం. అందరం ఆ తల్లిని

“ఓం గుహ్యతి గుహ్య చోస్త్రీత్వం గృహాణాస్మత్కృతం జపం
సిద్ధిర్భవతుమే దేవి త్వత్ర్పసాదాత్ మహేశ్వరి” అని వేడుకుందాం.

ఓ దేవీ! అంతర్యామివై అందరిని కాపాడు. నా ప్రార్ధన స్వీకరించి, నీ దివ్య తేజస్సుచే మోక్షానుభూతిని కలుగజేయి.

నమో దేవి మహావిద్యే వేదమాతః పరాత్పరే
వ్యాహృతాది మహామంత్రరూపే ప్రణవరూపిణి
లోకస్సమస్తా సుఖినోభవంతు
మా ఇలవేల్పు శ్రీ శ్రుంగేరీ శారదాంబ
చరణ కమలాల చెంత భక్త్యర్పణ

ఓం తత్సవితురేణ్యాయ నమః
ఓం తత్పూర్వా జయాయ నమః
ఓం తత్ర్పాతరాదిత్యాయ నమః
ఓం తత్ప్రాతరాదిత్య ప్రతిష్టాయ నమః (దేవీ భాగవతం)


రోజు ఈ నాలుగు నామాలు మనసారా స్మరించి, ఆ తల్లిని తలుచుకంటే చాలు. సర్వాభీష్టాలు ప్రసాదిస్తుంది.

No comments: