Thursday, April 26, 2012

ఆది శంకరాచార్యుల జయంతి శుభాకాంక్షలు






ఆది శంకరాచర్య

బౌద్ధమతం ప్రభావం వల్ల క్షీణించిన హిందూ ధర్మాన్ని పున రుద్ధరించడం. దేశదేశాలలో పండితులతో వాదనలు సాగిం చి, వారిని ఒప్పించి, నెగ్గి, తన సిద్ధాంతాన్ని మెప్పించాడు.
ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలకు, విష్ణు సహ స్ర నామాలకు భాష్యాలు రచించారు. తరువాత శంకరుని అనుస రించిన వారికీ, విభేదించిన వారికీ ఇవి మౌలికమయ్యాయి.
శృంగేరి, ద్వారక, పూరి, జ్యోతిర్మఠం - అనే నాలుగు మఠా లను స్థాపించాడు. అవి శంకరుని సిద్ధాంతానికి, హిందూ ధర్మానికి నాలుగు దిక్కులా దీపస్తంభాలలా పనిచేశాయి.
గణేశ పంచరత్న స్తోత్రం, భజ గోవిందం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, కనకధారా స్తోత్రం, శివా నందలహరి, సౌందర్యలహరి వంటి అనేక రచనలు హిందువులకు నిత్య ప్రార్ధనా స్తోత్రాలుగా ఈనాటికీ ఉపయుక్త మవుతు న్నాయి.

వెయ్యి సంవత్సరాల పాటు బౌద్ధమతం ప్రచారంలోకి వచ్చాక, సనాతన ధర్మా నికి ముప్పు ఏర్పడింది. ఈ సనాతన ధర్మాన్ని పున రుద్ధరించడా నికి ఆది శంకరులు జన్మించారు. బౌద్ధ మతం ధర్మం గురించీ, సంఘం గురించీ చెప్పింది కాని దేవుడిని గుర్తించలేదు. బౌద్ధమత ధర్మాల వ్యాప్తిలో వైదిక కర్మలు సంకటంలో పడ్డాయి. ఆ సమయంలో శంక రాచార్యులు ఆధ్యాత్మిక ధర్మాన్ని బలీయ శక్తిగా మలచ గలిగారు.

బాల్యం
కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన నంబూద్రి బ్రాహ్మణ దంపతు లైన ఆర్యమాంబ, శివగురువులకు కేరళలోని పూర్ణా నది ఒడ్డున ఉన్న కాలడి (త్రిచూర్‌ సమీపంలో)లో శంకరులు జన్మించారు.

శంకరుని బాల్యంలోనే తండ్రి మరణించారు. శంకరులు ఏ సం థాగ్రాహి. బాల్యంలోనే వేదవిద్యలు అభ్యసించారు. బాలబ్రహ్మచారి గా శంకరుడు ఒకరోజు భిక్షాటనం చేస్తూ ఒక పేదరాలి ఇంటికి వెళ్ళి భిక్ష అడుగగా, భిక్ష వేసేందుకు ఏమీ లేక, తన ఉపవాసాన్ని విరమిం చడం కోసం ఉంచుకొన్న ఉసిరి కాయను దానం చేసింది. దానికి చలించిన శంకరులు, ఆశువుగా కనకధారా స్తోత్రాన్ని చెప్పారు. కనకధారా స్తోత్రంతో పులకించిన లక్ష్మీ దేవి బంగారు ఉసిరికా యలు వర్షింప జేస్తుంది.ఒకరోజు శంకరుని తల్లి ఆర్యమాంబ పూర్ణా నది నుండి నీళ్ళు తెచ్చుకుంటుండగా స్పృహ తప్పి పడిపోయింది. అప్పుడు శంక రులు పూర్ణానదిని ప్రార్థించి, నదిని ఇంటివద్దకు తెప్పించారు. తల్లిని ఒప్పించి సన్యాసం స్వీకరంచారు.

గౌడపాదుల శిష్యుడైన గోవింద భగవత్పాదులను ఆశ్రయించారు. ఒక ఛండాలుడి మాటలలో అంతరార్థం గ్రహించి సాక్షాత్తు పరమశివుడే నాలుగు వేదాలతో వచ్చాడని గ్రహించి మహాదేవుడిని మనీషా పంచకం అనే ఐదు శ్లోకాలతో స్తోత్రం చేశాడు. శంకరునికి పరమశివుడు కర్తవ్యవబోధ చేశారు. అలా భారతదేశంలో శంకరాచార్య చేపట్టిన హిందూ ధర్మ పునరుద్ధరణ ఆరంభమైంది. మండన మిశ్రునితో తర్క గోష్ఠిలో పాల్గొని ఆయనను ఓడించారు. అలా ఎందరో ఉద్ధండ పండితులను ఓడించి అదె్వైత ప్రచారం చేశారు. నాలుగు పదుల వయస్సు రాకముందే పరమాత్మను చేరుకున్నారు. నేడు హిందూ సమాజం ఈ విధంగా ఉన్నదంటే అందుకు కారణం ఆదిశంకరాచార్యులనే చెప్పవచ్చు.

No comments: