Monday, December 26, 2011

తిరుప్పావై--12






12)కనైత్త్-ఇళంకత్తెరుమై కన్ఱుక్కిరంగి
నినైత్తు ములై వరియే నిన్ఱు పాల్ శోర
ననైత్త్-ఇల్లం శేఱాక్కుం నచ్చెల్వన్ తంగాయ్
పనిత్తలై వీర నిన్ వాశల్ కడై పత్తి
శినత్తినాల్ తెన్ ఇలంగై క్కోమానై చ్చెత్త
మనత్తుక్కినియానై ప్పాడవుం నీ వాయ్ తిఱవాయ్
ఇనిత్తాన్ ఎరుందిరాయ్ ఈదెన్న పేర్ ఉఱక్కమ్
అనైత్తిల్లత్తారుం అఱింద్-ఏలోర్ ఎంబావాయ్


Thiruppavai in English - Pasuram 12.

12)Kanaithu ilam katrerumai kanrukku irangi
Ninaithu mulai vazhiye ninru paal sora
Nanaithu illam serarkkum narchelvan thangaai!
Panithalai veezha nin vaasal kadai-patri
Sinathinaal then ilangai-k-komaanai-ch-chetra
Manaththukkiniyaanai paadavum nee vaaithiravaai!
Iniththan ezhundiraai, eethenna peruakkam!
Anaithu illaththuaarum arindhu-el or empaavaai

Thiruppavai in Tamil (திருப்பாவை தமிழில்)

திருப்பாவை பாசுரம் 12.


கனைத்து இளம் கற்றெருமை கன்றுக்கு இரங்கி
நினைத்து முலை வழியே நின்று பால்சோர
நனைத்து இல்லம் சேறாக்கும் நற்செல்வன் தங்காய்
பனித்தலை வீழநின் வாசற்கடை பற்றிச்
சினத்தினால் தென்இலங்கைக் கோமானைச் செற்ற
மனத்துக்கு இனியானைப் பாடவும்நீ வாய் திறவாய்
இனித்தான் எழுந்திராய் ஈதென்ன பேர்உறக்கம்!
அனைத்து இல்லத்தாரும் அறிந்தேலோர் எம்பாவாய்.


అర్థము::లేగ దూడలు గల గేదెలు పాలుపితుకువారు లేక లేగ దూడలును తలంచుకొని వానిపై మనసు పోవుటచే ఆ దూడలే వచ్చి మొదుగులో మూతి పెట్టునట్లు తోచి పొదుగునుండి కారిపోవుటచే ఇల్లంతయూ బురధగుచున్న ఒకానొక మహైశ్వర సంపన్నుని చెల్లెలా! మంచు తలపై పడుచుండ నీ వాకిట నిలచియుంటిమి..కోపముతో దక్షిన దిక్కున నున్న లంకకు అధిపతియైన రావణుని చంపిన మనోభి రాముడగు శ్రీరాముని గానము చేయుచుంటిమి..అది వినియైనను నీవు నోరు విప్పవా? ఇంక మమ్మేలు కొనవా? ఏమి యీ గాఢ నిద్ర? ఊరివారందరుకూ నీ విషయము తెలిసిపోయినది..లెమ్ము అని కృష్ణుని విడువక సర్వ కాలముల నుండుటచే స్వధర్మమును కూడ చేయలేని దశయందున్న ఐశ్వర్య సంపన్నుడగు ఒక గోపాలుని చేల్లెలిని మేల్కొల్పినారు.

No comments: