విష్ణుమూర్తి యొక్క దశావతారాలలోని 4వ అవతారమే నరసింహ స్వామి. నరసింహ జయంతి వైశాఖ శుక్ల చతుర్ధతి నాడు జరుపుకొంటారు. నరసింహ స్వామి ఎంతో శక్తివంతమైన భగవంతుడు. నరసింహ జయంతి వృత్తాంతం: నరసింహ స్వామి విష్ణుమూర్తి అవతారాలలో చాలా ముఖ్యమైన, శక్తివంతమైన అవతారం. నరసింహస్వామి శరీరం సగ భాగం మనిషి ఆకారం, సగ భాగం సింహ రూపంలో దర్శనమిస్తారు. హిరణ్యకశిపుడి వరాన్ని ఉద్దేశించి స్వామి ఈ రూపంలో అవతరించారని పురాణాల ప్రశస్తి. హిందు పురాణాలలో పూర్వం కశ్యపుడనే ఒక మహర్షికి భార్య దితి, ఇద్దరు కుమారులు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అని ఉండేవారు. విష్ణుభగవానుడు లోకకళ్యాణార్ధం రాక్షసుడైన హిరణ్యాక్షుడుని సంహరించాడు. ఇది భరించలేని సోదరుడైన హిరణ్యకశిపుడు విష్ణుమూర్తితో వైరం పెంచుకున్నాడు. కోపోద్రిక్తుడైన హిరణ్యకశిపుడు తీవ్ర తపమొనర్చి బ్రహ్మను ప్రత్యక్షం గావించుకొన్నాడు. బ్రహ్మ వలన చావులేని వరం పొందిన హిరణ్యకశిపుడు అన్ని లోకాలను శాసించసాగాడు. దేవతలను, మునులను, ఋషులను బాధించసాగాడు. చివరకు దేవలోకంలో ఇంద్రునితో సహా అందరు నిస్సహాయ స్థితిలో రాక్షసుల ఆగడాలను భరించసాగారు. ఆ సమయంలో హిరణ్యకశిపుని భార్య కయధు మగపిల్లవాడు ప్రహ్లాదుడికి జన్మనిచ్చింది. ఆ పిల్లవాడికి ఈ రాక్షస ప్రవృత్తులు ఏమే అంటలేదు. అతడు పూర్తిగా విష్ణుమూర్తి భక్తుడయ్యాడు. హిరణ్యకశిపుడు శతవిధాల ప్రహ్లాదుని విష్ణుభక్తి నుండి మరల్చుదామని ప్రయత్నించాడు. ఎన్నిమార్లు ప్రయత్నించిన విఫలమౌతూనే ఉన్నాడు. తండ్రి ప్రయత్నిస్తున్నకొద్దీ ప్రహ్లాదునిలో భక్తి మరింత ఎక్కువ కాసాగింది. ప్రహ్లాదుని మృత్యువు వరకు తీసుకువెళ్లినా అతనిలో ఏమార్పూ లేదు. విషప్రయోగం చేసినా, ఏనుగులతో తొక్కించినా లోయలో పడవేసినా ఎప్పటికప్పుడు విష్ణుమూర్తి రక్షిస్తు ఉండేవాడు. ప్రహ్లాదుని నారాయణ మంత్రం విన్నమాత్రంతొ క్రుద్ధుడై తన కుమారుని పరిపరివిధాల మృత్యు సమీపానికి దండించే నిమిత్తం శిక్షలు వేయసాగాడు. ఇక విసిగిపోయిన హిరణ్యకశిపుడు నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడో చెప్పమంటాడు. ఇందుగలడని అందు లేడని సందేహము వలదు, ఎందెందు వెదికిన అందందే కలడు నా శ్రీహరి అని శలవిస్తాడు ప్రహ్లాదుడు. దానితో మరింత ఆగ్రహావేశాలకు లోనయి ఉన్న హిరణ్యకశిపుడు ఐతే ఈ స్థంభంలో ఉంటాడా నీ శ్రీ హరి అని ఒక్కపెట్టున ఆ స్థంభాన్ని తన గదతో పడగొడతాడు. అంతే భయంకరాకారుడై, తల సింహం రూపంలో మొండెం మనిషి ఆకారంలో గర్జిస్తూ ఒక్క ఉదుటున ఆ రాక్షసుడిని తన తొడలమీద పరుండబెట్టి ఆయన వాడి గోళ్లతో అతని వక్షస్థలాన్ని చీల్చి చెండాడి హిరణ్యకశిపుడిని అంతమొందిస్తాడు. ప్రహ్లాదుని ఆశీర్వదించి ఎవరైతే ఈ రోజున నా నామసంకీర్తనతో ఉపవసించి ఉంటారో వారి సమస్యలు, బాధలు తొలగిపోతాయి అని శలవిస్తారు.కావున ఈ శుభదినాన్ని మనం అందరం నరసింహజయంతిగా జరుపుకుంటున్నాము. ఈ రోజున స్వామివారి శాంతి కొరకు పానకం నివేదించడం ఆనవాయితీగా వస్తోంది. మనం భగవంతుడికి పండ్లు, పూలు, దక్షిణ తాంబూలాలను భక్తి తో సమర్పించుకోవాలి.
మనం ఎంత సమర్పించాము, ఏమి సమర్పించాము అనే లౌకికమైన భావనలకంటే ముఖ్యమైనది మన హృదయాంజలి. మనసా, వాచా, కర్మణా స్వామికి ఏకాగ్ర చిత్తంతో ఆత్మ నివేదనను మించిన పూజ లేదు. 1:::ఉగ్రంవీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహ భీషణం భద్రం మృత్యు మృత్యుం నమామ్యహం. 2:::నృం నృం నృం నరసింహాయ నమహా ఈ మంత్రాలు పఠించడం వలన మనిషి తన బాధలనుండి విముక్తి గావింపబడి విష్ణు సాయుజ్యాన్ని పొందుతారు.
1::నారాయణ నారాయణ జయ గోవింద హరే గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే నారాయణ నారాయణ జయ గోవింద హరే గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే 2::కరుణాపారావార వరుణాలయగంభీర నారాయణ ఘననీరదసంకాశ కృతకలికల్మషనాశన నారాయణ||నా|| 3::యమునాతీరవిహార ధృతకౌస్తుభమణిహార నారాయణ పీతాంబరపరిధాన సురకళ్యాణనిధాన నారాయణ ||నా|| 4::మంజులగుంజాభూష మాయామానుషవేష నారాయణ రాధాధరమధురసిక రజనీకర కులతిలక నారాయణ ||నా|| 5::మురళీగానవినోద వేదస్తుతభూపాద నారాయణ వారిజభూషాభరణ రాజీవరుక్మిణీరమణ నారాయణ ||నా|| 6:: జలరుహదళనిభనేత్ర జగదారంభకసూత్ర నారాయణ పాతకరజనీసంహార కరుణాలయ మాముద్ధర నారాయణ ||నా|| 7::అఘబకహయకంసారే కేశవ కృష్ణ మురారే నారాయణ హాటకనిభపీతాంబర అభయం కురు మే మావర నారాయణ ||నా|| 8::దశరథరాజకుమార దానవమదసంహార నారాయణ గోవర్ధనగిరి రమణ గోపీమానసహరణ నారాయణ ||నా|| 9::సరయుతీరవిహార సజ్జనఋషిమందార నారాయణ విశ్వామిత్రమఖత్ర వివిధవరానుచరిత్ర నారాయణ ||నా||
10::ధ్వజవజ్రాంకుశపాద ధరణీసుతసహమోద నారాయణ జనకసుతాప్రతిపాల జయ జయ సంస్మృతిలీల నారాయణ ||నా||
11::దశరథవాగ్ధృతిభార దండక వనసంచార నారాయణ ముష్టికచాణూరసంహార మునిమానసవిహార నారాయణ ||నా||
12::వాలివినిగ్రహశౌర్య వరసుగ్రీవహితార్య నారాయణ శ్రీ మురళీకర ధీవర పాలయ పాలయ శ్రీధర నారాయణ ||నా|| 13::జలనిధి బంధన ధీర రావణకంఠవిదార నారాయణ తాటకమర్దన రామ నటగుణవివిధ సురామ నారాయణ ||నా|| 14::గౌతమపత్నీపూజన కరుణాఘనావలోకన నారాయణ సంభ్రమసీతాహార సాకేతపురవిహార నారాయణ ||నా|| 15::అచలోద్ధృతచంచత్కర భక్తానుగ్రహతత్పర నారాయణ నైగమగానవినోద రక్షిత సుప్రహ్లాద నారాయణ ||నా|| ఇతి శ్రీమత్ శంకరాచార్య విరచిత నారాయణస్తోత్రం సంపూర్ణం 1::నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే 2::కరుణాపారావార వరుణాలయగంభీర నారాయణ ఘననీరదసంకాశ కృతకలికల్మషనాశన నారాయణ 3::యమునాతీరవిహార ధృతకౌస్తుభమణిహార నారాయణ పీతాంబరపరిధాన సురకళ్యాణనిధాన నారాయణ 4::మంజులగుంజాభూష మాయామానుషవేష నారాయణ రాధాధరమధురసిక రజనీకరకులతిలక నారాయణ 5::మురళీగానవినోద వేదస్తుతభూపాద నారాయణ బర్హినిబర్హాపీడ నటనాటకఫణిక్రీడ నారాయణ 6::వారిజభూషాభరణ రాజీవరుక్మిణీరమణ నారాయణ జలరుహదళనిభనేత్ర జగదారంభకసూత్ర నారాయణ 7::పాతకరజనీసంహార కరుణాలయ మాముద్ధర నారాయణ అఘ బకహయకంసారే కేశవ కృష్ణ మురారే నారాయణ 8::హాటకనిభపీతాంబర అభయం కురు మే మావర నారాయణ దశరథరాజకుమార దానవమదసంహార నారాయణ 9::గోవర్ధనగిరి రమణ గోపీమానసహరణ నారాయణ సరయుతీరవిహార సజ్జనఋషిమందార నారాయణ 10::విశ్వామిత్రమఖత్ర వివిధవరానుచరిత్ర నారాయణ ధ్వజవజ్రాంకుశపాద ధరణీసుతసహమోద నారాయణ 11::జనకసుతాప్రతిపాల జయ జయ సంస్మృతిలీల నారాయణ దశరథవాగ్ధృతిభార దండక వనసంచార నారాయణ 12::ముష్టికచాణూరసంహార మునిమానసవిహార నారాయణ వాలివినిగ్రహశౌర్య వరసుగ్రీవహితార్య నారాయణ 13::మాం మురళీకర ధీవర పాలయ పాలయ శ్రీధర నారాయణ జలనిధి బంధన ధీర రావణకంఠవిదార నారాయణ 14::తాటకమర్దన రామ నటగుణవివిధ సురామ నారాయణ గౌతమపత్నీపూజన కరుణాఘనావలోకన నారాయణ 15::సంభ్రమసీతాహార సాకేతపురవిహార నారాయణ అచలోద్ధృతచంచత్కర భక్తానుగ్రహతత్పర నారాయణ 16::నైగమగానవినోద రక్షిత సుప్రహ్లాద నారాయణ భారత యతవరశంకర నామామృతమఖిలాంతర నారాయణ Revati Raga Sankaraachaarya::rachana (Hindustaani Raga Bairagi) nārāyaṇa nārāyaṇa jaya govinda hare nārāyaṇa nārāyaṇa jaya gopāla hare 1::karuṇāpārāvāra varuṇālayagambhīra nārāyaṇa ghananīradasaṅkāśa kṛtakalikalmaṣanāśana nārāyaṇa 2::yamunātīravihāra dhṛtakaustubhamaṇihāra nārāyaṇa pītāmbaraparidhāna surakaḷyāṇanidhāna nārāyaṇa 3::mañjulaguñjābhūṣa māyāmānuṣaveṣa nārāyaṇa rādhādharamadhurasika rajanīkarakulatilaka nārāyaṇa 4::muraḷīgānavinoda vedastutabhūpāda nārāyaṇa barhinibarhāpīḍa naṭanāṭakaphaṇikrīḍa nārāyaṇa 5::vārijabhūṣābharaṇa rājīvarukmiṇīramaṇa nārāyaṇa jalaruhadaḷanibhanetra jagadārambhakasūtra nārāyaṇa 6::pātakarajanīsaṃhāra karuṇālaya māmuddhara nārāyaṇa agha bakahayakaṃsāre keśava kṛṣṇa murāre nārāyaṇa 7::hāṭakanibhapītāmbara abhayaṃ kuru me māvara nārāyaṇa daśaratharājakumāra dānavamadasaṃhāra nārāyaṇa 8::govardhanagiri ramaṇa gopīmānasaharaṇa nārāyaṇa sarayutīravihāra sajjana--ṛṣimandāra nārāyaṇa 9::viśvāmitramakhatra vividhavarānucaritra nārāyaṇa dhvajavajrāṅkuśapāda dharaṇīsutasahamoda nārāyaṇa 10::janakasutāpratipāla jaya jaya saṃsmṛtilīla nārāyaṇa daśarathavāgdhṛtibhāra daṇḍaka vanasañcāra nārāyaṇa 11::muṣṭikacāṇūrasaṃhāra munimānasavihāra nārāyaṇa vālivinigrahaśaurya varasugrīvahitārya nārāyaṇa 12::māṃ muraḷīkara dhīvara pālaya pālaya śrīdhara nārāyaṇa jalanidhi bandhana dhīra rāvaṇakaṇṭhavidāra nārāyaṇa 13::tāṭakamardana rāma naṭaguṇavividha surāma nārāyaṇa gautamapatnīpūjana karuṇāghanāvalokana nārāyaṇa 14::sambhramasītāhāra sāketapuravihāra nārāyaṇa acaloddhṛtacañcatkara bhaktānugrahatatpara nārāyaṇa 15::naigamagānavinoda rakṣita suprahlāda nārāyaṇa bhārata yatavaraśaṅkara nāmāmṛtamakhilāntara nārāyaṇa
అరుదైన విగ్రహం - మూడు తొండాల గణపతి ఏ పని మొదలుపెట్టాలన్నాముందుగా మనం పూజించేది ఆ గణనాథుడిని. ఏకదంతుడిగా ప్రసిద్ధి చెందిన ఆ వినాయకుడికి మూడు తొండాలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా, నమ్మాలి మరి. ఇలా మూడు తొండాలున్న త్రిసూంద్ గణపతిని చూడాలంటే మనం పూనేలో ఉన్న సోమ్వర్ పేట్ జిల్లాకి వెళ్ళాల్సిందే. ఈ ప్రాంతంలో ఉన్న నజగిరి అనే నదీ తీరంలో ఉంది ఈ త్రిసూంద్ గణపతి దేవాలయం. భీమజీగిరి గోసవి అనే వ్యక్తీ ఈ ఆలయాన్ని 1754లో మొదలుపెట్టారట. పదహారు సంవత్సరాల నిర్మాణం తరువాత 1770లో గణపతిని ప్రతిష్టించారు. ఇక్కడి గర్భగుడి గోడల మీద మూడు శాసనాలు చెక్కబడి ఉన్నాయట. రెండు శాసనాలు సంస్కృతంలో ఉంటే మూడోది పెర్షియన్ భాషలో ఉందట. ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఆలయంలోని వినాయకుడికి మూడు తొండాలు, ఆరు చేతులు ఉండి స్వామి నెమలి వాహనంపై ఆశీనుడై ఉంటాడట. ఆలయ ప్రవేశ ద్వారం దగ్గర ఉన్న ద్వారపాలకుల విగ్రహాలు ఎంతో అందంగా చెక్కబడి ఉంటాయి. ఆలయంప్రాంగణంలో కూడా అనేక దేవతా విగ్రహాలు, ఏనుగులు, గుర్రాలు మొదలైన జంతువుల విగ్రహాలు శోభాయమానంగా కనపడతాయి. ఎక్కడా లేని మరొక వింత ఈ ఆలయంలో ఒక గోడ మీద అమెరికన్ సైనికుడు ఖడ్గ మృగాన్ని ఇనప చైనులతో కడుతున్నట్టుగా ఉండే విగ్రహం. ఇలాంటి విగ్రహాలు మన దేశంలో మరెక్కడా చూడలేము. అలాగే ఆలయాన్ని నిర్మించిన గోసవి మహాశయుడి సమాధి కూడా ఆ ఆలయ ప్రాంగణంలో ఉండటం ఇంకో విశేషం. ఆలయం క్రింద భాగంలో నీరు నిలవ ఉండే విధంగా కొలనులాంటిది కట్టారు. ఎప్పుడూ నీటితో ఉండే ఆ కొలనుని గురుపూర్ణిమ రోజు నీరంతా ఖాళీ చేసి పొడిగా ఉంచుతారు. ఆ రోజు అక్కడివారు తమ గురువుగా భావించే ఆలయ నిర్మాణకర్త గోసవికి పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో సంకటహర చతుర్థిని ఎంతో ఘనంగా నిర్వహించే ఆచారం ఎప్పటి నుంచో కొనసాగుతూ వస్తోందిట. నెలలో ఆ ఒక్క రోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కూడా. ఇక వినాయక చవితి ఉత్సవాలు ఇంకెంత ఘనంగా జరుగుతాయో వేరే చెప్పకర్లెద్దు. తొమ్మిది రోజులు పూనే చుట్టుపక్కల ఉన్న ఊరుల నుంచి భక్తులు వచ్చి ఇక్కడ విశేష పూజలు నిర్వహిస్తారట. రాజస్థాని, మాల్వా మాదిరి శిల్పకళ ఉట్టిపడే ఈ ఆలయాన్ని ప్రస్తుతం ఒక ట్రస్ట్ నడిపిస్తోందని చెపుతున్నారు ఇక్కడి అధికారులు teluguone.com nundi sekarana