Friday, December 8, 2023

🌺 శివలింగం 🌺



"శివం" అనే పదానికి అర్థం శుభప్రథమైనది. "లింగం" అంటే సంకేతం అని అర్థం. అంటే శివలింగం సర్వ శుభప్రథమైనది. శుభప్రథమైన దేవుడు.

శివలింగం శారికంగా శిలామయం. అయినా శివలింగాన్ని దర్శించి, అబిషేకించి, అర్చించి, ఆరాధించిన ఏ వ్యక్తి! అయినా శిలను పూజించానని భావించరు. శిలలో సైతం శివుణ్ని చూచే సంస్కృతి మనది. 

శివలింగములో మూడు భాగాలు ఉంటాయి. బ్రహ్మ భాగము భూమిలో, విష్ణు భాగం పీఠంలో, శివ భాగం మనకు కనిపించే పూజా భాగముగా శిల్పులు ఆగమ శాస్త్రాలలో సూచించిన విధముగ సరియైన రాతిలో గాని ఇతర పదార్ధాలతో నిర్మిస్తారు.

ఒకసారి భృగుమహర్షి శివుడి దగ్గరికి వస్తాడు. కానీ శివుడు తాండవం చేస్తూ మహర్షిని పట్టించుకోలేదు. దీంతో కోపోదృక్తుడైన మహర్షి “నేటి నుండి నీ శివలింగానికే కానీ నీ విగ్రహానికి పూజలుండవు, నీ ప్రసాదం నింద్యం అవుతుంది” అని శపిస్తాడు. అప్పటి నుండి శివుడిని లింగరూపంలో కొలుస్తారు.

శివుడికి రూపం కూడా ఉండకపోవటం వల్ల, ఆయన నిరాకారుడు, సాకారుడు కూడా. ఈశ్వరుడు నిరాకారుడు కాబట్టి నిరాకారమైన లింగమందు పూజింపబడుతున్నాడు. 

No comments: