Friday, July 19, 2013

చంద్రశేఖరేంద్ర స్తుతి

















1::కరుణా పర పర్యాయ కటాక్ష ప్రసృతి ప్రభః 
చిత్తస్య శాంతి దాతా మే హృది స్యాత్ చంద్రశేఖరః 

అర్థం::ఆయన కొనకంటి చూపు నుంచీ ప్రసరంచే కాంతి కరుణాపరత్వానికి మరో రూపం అనేలా ఉంటుంది. అలా మనస్సుకు శాంతి నిచ్చే వారయిన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి నా హృదయములో నిలచి యుందురు గాక.   

2::కామేశ తత్త్వ సర్వస్వ కలనామల మానసః 
అమృతాత్మా సమాత్మా మే హృది స్యాత్ చంద్రశేఖరః 

అర్థం: తంత్ర శాస్త్రంలోని 'కామేశ్వర' అనే తత్త్వమంతా నిండిన స్వచ్ఛమయిన మనసు వారిది. ఉపనిషత్తులలోని 'అమృతాత్మ' తత్త్వం తో సమానమయిన తత్త్వం (స్వభావం) గలవారయిన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి నా హృదయములో నిలచి యుందురు గాక.   

3::దక్షిణా చిన్మయీ మూర్తిః యస్య విశ్వాతిశాయినీ 
దక్షిణామూర్తి రూపో మే హృది స్యాత్ చంద్రశేఖరః 

అర్థం: ఎవరి దక్షిణమయిన (దక్షిణాభిముఖమయిన/ప్రసన్నమయిన) చిన్మయం (జ్ఞానమయం) అయిన రూపం విశ్వాన్నే దాటి వెళ్లేంత విస్తృతమైనదో అటువంటివారూ అలా దక్షిణామూర్తి దేవుని రూపమే అయిన వారూ అయిన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి నా హృదయములో నిలచి యుందురు గాక.   

4::నిరంతర నిరాలంబ నిరంజన మహోమయః 
మాయావృతి మతీతో మే హృది స్యాత్ చంద్రశేఖరః 

అర్థం: ముక్కలుగా, దశలుగా తెగనిదీ ఆధారం అవసరం లేనిదీ అత్యంత స్వచ్ఛమయినదీ అతిపెద్ద తనముతో నిండినదీ అయిన పరమాత్మ తత్త్వమే వారు. మాయ చేత కప్పబడటమనే (సామాన్య జీవులన్నింటి/లోకమంతటి) స్వభావానికి అతీతమయిన వారయిన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి నా హృదయములో నిలచి యుందురు గాక.   

5::ఏకామ్రేశేన కామాక్ష్యా శ్రుతిమాత్రా సతా చితా 
పరేణాభిన్న రూపో మే హృది స్యాత్ చంద్రశేఖరః 

అర్థం: కాంచీ పురంలోఉన్న ఏకామ్రేశ్వరుడనే శివుడూ వారూ వేరు వేరు కారు. కాంచీ పురంలోఉన్న కామాక్షీ అమ్మవారూ వారూ వేరు వేరు కారు. వేదమాత అయిన గాయత్రీ అమ్మవారూ వారూ వేరు వేరు కారు.

శని దోష నివారణకు ఏం చేయాలి






















మనలో చాలామంది కళ్యాణ దోషం, కాలసర్ప దోషం, దుష్టమానవుల దృష్టి దోషాలు, వాస్తుదోషాలు, నవగ్రహ దోషాలు 
ఇలా అనేక రకాల దోషాలతో బాధపడుతుంటారు. 
గ్రహల్లో శని ప్రభావం చాలా ఎక్కువ, శని దోషం ఉన్నవారు సుఖశాంతులు లేకుండా బాధపడుతుంటారు. 
శని దోషం వల్ల ఏవో కష్టనష్టాలు పట్టి పీడిస్తుంటాయి. శని దోషం నుండి బయట పడేందుకు దేవాలయాల్లో అర్చకులు ఉపశాంతి చేస్తుంటారు. 
నవగ్రహారాధన, ప్రత్యేకంగా శని గ్రహారాధన సూచిస్తుంటారు. శని గ్రహ పూజలతో పాటు, శని ధ్యానం చేసినా దోష నివారణ అవుతుంది. శనిధ్యానం శ్లోకాలు ఆరు. ఈ శ్లోకాలను మనసారా స్మరించుకోవాలి. 

సూర్యపుత్రో దీర్ఘదేహః
విశాలక్ష శ్శివప్రియ:
మందచార: ప్రసన్నాత్మా
పీడాం దహతు మే శని:

శన్యారిష్టే తు సంప్రాప్తే
శనిపూజాంచ కారయేత్
శనిధ్యానం ప్రవక్ష్యామి
ప్రాణి పీడోపశాంతయే

నీలాంజన సమాభాసం
రవిపుత్రం యమాగ్రజం
చాయా మార్తాండ సంభూతం
తన్నమామి శనైశ్చరం

నమస్తే కోణ సంస్థాయ
పింగళాయ నమోస్తుతే
నమస్తే బభ్రు రూపాయ
కృష్ణాయచ నమోస్తుతే

మనస్తే రౌద్ర దేహాయ
నమస్తే చాంతకాయచ
నమస్తే యమ సంజ్ఞాయ
నమస్తే సౌరాయే విభో

నమస్తే మంద సంజ్ఞాయ
శనైశ్చర నమోస్తు
ప్రసాదం మమదేవేశ
దీనస్య ప్ర్రణతస్యచ.

ఓం, ఐం, హ్రీం, శ్రీం శనైశ్చరాయనమః 

ఈ శని ధ్యాన శ్లోకాలను 19 వేలసార్లు పఠించినట్లయితే ఎలాంటి శని దోషాలైనా నివారణ అవుతాయి.
భక్తి శ్రధలతో 28 సార్లు పఠించినా శనిదోష నివారణ మవుతుంది 

Wednesday, July 17, 2013

నవగ్రహ పీడాహర స్తోత్రం












గ్రహాణామాది రాదిత్యోలోక రక్షణ కారకః
విషయ స్థాన సంభూతాం పీడాం హరతుమే రవి:
రోహిణీ శస్సుధామూర్తి స్సుధాగాత్రస్సురాళనః

భూమిపుత్రో మహాతేజా జగతాం భయకృత్నదా
వృష్టికృదృష్టి హర్తాచ పీడాం హరతు మేకుజః

ఉత్పాత్రూపోజగతాం చంద్రపుత్రో మహాద్యుతిః
సూర్యప్రియకరో విద్వాన్ పీడాం హరతుమే బుధః

దేవమంత్రీ విశాలాక్షః సదాలోకహితేరహః
అనేక శిష్య సంపూర్ణః పీడాం హరతుమే గురుః

దైత్యమంత్రీ గురుస్తేషాం ప్రాణదశ్చమహామతిః
ప్రభుస్తారాగ్రహాణాంచ పీడాం హరతుమే భ్రుగుః

సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్ష శివప్రియః
మందచారః ప్రసన్నాత్మా పీడాం హరతుమే శనిః

మహాశ్రీరామ మహావక్త్రో దీర్ఘదంస్త్రో మహాబలః
అతనుశ్చోర్ధ్వకేశశ్చ పీడాం హరతుమే శిఖీ

అనేక రూప్వర్వైశ్చ శతశో ధసహస్రశః
ఉత్పాతరుజోజగతాం పీడాం హరతుమే తమః

ప్రతిరోజూ ఈ నవగ్రహ పీడా పరిహార స్తోత్రాన్ని ఉదయాన్నే తొమ్మిదిసార్లు పఠిస్తే గ్రహపీడ తొలగి, కార్యసిద్ధి కలుగుతుంది.

Sunday, July 14, 2013

నవగ్రహ కరావలమ్బ స్తోత్రమ్




 










1::జ్యోతీశ దేవ భువనత్రయ మూలశక్తే
గోనాథ భాసుర సురాదిభిరీద్యమాన
నౄణాంశ్చ వీర్య వర దాయక ఆదిదేవ
ఆదిత్య వేద్య మమ దేహి కరావలమ్బమ్

2::నక్షత్రనాథ సుమనోహర శీతలాంశో
శ్రీ భార్గవీ ప్రియ సహోదర శ్వేతమూర్తే
క్షీరాబ్ధిజాత రజనీకర చారుశీల
శ్రీమచ్ఛశాంక మమ దేహి కరావలమ్బమ్

3::రుద్రాత్మజాత బుధపూజిత రోద్రమూర్తే
బ్రహ్మణ్య మంగల ధరాత్మజ బుద్ధిశాలిన్
రోగార్తిహార ఋణమోచక బుద్ధిదాయిన్
శ్రీ భూమిజాత మమ దేహి కరావలమ్బమ్

4::సోమాత్మజాత సురసేవిత సోమ్యమూర్తే
నారాయణప్రియ మనోహర దివ్యకీర్తే
ధీపాటవప్రద సుపండిత చారుభాషిన్
శ్రీ సోమ్యదేవ మమ దేహి కరావలమ్బమ్

5::వేదాన్తజ్ఞాన శ్రుతివాచ్య విభాసితాత్మన్
బ్రహ్మాది వన్దిత గురో సుర సేవితాంఘ్రే
యోగీశ బ్రహ్మ గుణ భూషిత విశ్వ యోనే
వాగీశ దేవ మమ దేహి కరావలమ్బమ్

6::ఉల్హాస దాయక కవే భృగువంశజాత
లక్ష్మీ సహోదర కలాత్మక భాగ్యదాయిన్
కామాదిరాగకర దైత్యగురో సుశీల
శ్రీ శుక్రదేవ మమ దేహి కరావలమ్బమ్

7::శుద్ధాత్మ జ్ఞాన పరిశోభిత కాలరూప
ఛాయాసునన్దన యమాగ్రజ క్రూరచేష్ట
కష్టాద్యనిష్ఠకర ధీవర మన్దగామిన్
మార్తండజాత మమ దేహి కరావలమ్బమ్

8::మార్తండ పూర్ణ శశి మర్దక రోద్రవేశ
సర్పాధినాథ సురభీకర దైత్యజన్మ
గోమేధికాభరణ భాసిత భక్తిదాయిన్
శ్రీ రాహుదేవ మమ దేహి కరావలమ్బమ్

9::ఆదిత్య సోమ పరిపీడక చిత్రవర్ణ
హే సింహికాతనయ వీర భుజంగ నాథ
మన్దస్య ముఖ్య సఖ ధీవర ముక్తిదాయిన్
శ్రీ కేతు దేవ మమ దేహి కరావలమ్బమ్

10::మార్తండ చన్ద్ర కుజ సౌమ్య బృహస్పతీనామ్
శుక్రస్య భాస్కర సుతస్య చ రాహు మూర్తేః
కేతోశ్చ యః పఠతి భూరి కరావలమ్బ
స్తోత్రమ్ స యాతు సకలాంశ్చ మనోరథారాన్

ఓమ్ శాంతిః శాంతిః శాంతిః
  :::: ఓమ్ తత్ సత్ ::::

Sunday, July 7, 2013

Monday, June 24, 2013

కుమారస్వామి పుట్టుక


కుమారస్వామి పుట్టుక
పార్వతి పరమేశ్వరులు జగత్తుకు ఆది దంపతులు. వారు కైలాసాంలో నివాసం ఉంటారు. వారు ఒకసారి 100 దివ్య సంవత్సరాలు క్రీడించారు. ఈ విషయం విని ఆశ్చర్యపోయిన దేవతలు పార్వతిదేవి, శంకరుడి తేజస్సులు అసమానమైనవి కాబట్టి వాళ్ళ కలయిక వల్ల జన్మించే సంతానాన్ని మనం తట్టుకోలేము అని భావించారు. దేవతలంతా బయలుదేరి కైలాసానికి వెళ్ళి శంకరుడిని ప్రార్ధించారు. అప్పుడు శంకరుడు బయటికి వచ్చాడు . అప్పుడు వాళ్ళు ఆయనతో, స్వామి! మీరు పార్వతిదేవి తో 100 దివ్య సంవత్సరాల నుండి క్రీడిస్తున్నారు. మీ తేజస్సు కనుక మరో ప్రాణి రూపంలో బయటకు వస్తే వాని యొక్క తేజస్సును మేము భరించలేము కనుక తమరి తేజస్సుని తమలోనే ఉంచుకుని, సంతాన ఆలోచన లేకుండా పార్వతిదేవి తో తపస్సు చేసుకోండి అన్నారు. ఏ వికారములు లేని శంకరుడు వాళ్ళు చెప్పినదానికి అంగీకరించాడు, కానీ ఇప్పటికే తన నుండి కొంత తేజస్సు కదిలింది కనుక దానిని భరించే వారు ఉంటే దానిని వదలిపెడతాను అని చెప్పాడు. అప్పుడు దేవతలు అన్నీ భరించగల భూమి దీనిని కూడా భరించగలదు అని చెప్పారు. శంకరుడు అలానే భూమి మీద తన తేజస్సుని వదిలిపెట్టాడు. వదిలిన ఆ తేజస్సు భూమి అంతా వ్యాపించింది. వ్యాపించిన ఆ శంకరుడి తేజస్సుని భూమి కూడా తట్టుకోలేకపోయింది. అప్పుడు దేవతలు అగ్నిదేవుడిని వాయువుతో కలిసి ఈ రుద్ర తేజస్సుని తనయందు పెట్టుకోమన్నారు. అప్పుడు అగ్ని ఆ తేజస్సుని తనలో పెట్టుకున్నాడు.
ఇంతలో జరుగుతున్నదానిని తెలుసుకున్న పార్వతిదేవి బయటికి వచ్చి, తనకు సంతానం కలుగ కుండా చేసిన దేవతలమీద కోపంతో వారెవరికీ తమతమ భార్యల ద్వారా ఇకమీద సంతానం కలుగదు అని శపించినది. తరువాత తను భరిఒచ వలసిన శివ తేజస్సును, భూమి భరించటానికి ఒప్పుకుంది కాబట్టి ఇకనుండి భూమి అనేక రూపాలు పొందుతుంది, ఒకే కాలం లో భూమికి అనేకులు భర్తలుగా ఉంటారు. భూమి తన కొడుకుల వలన సిగ్గు తో తల వంచుకుంటుందని శాపించింది. ఇక అగ్నిని సర్వభక్షకుడవు అవ్వమని శపించినది.
శంకరుడు పార్వతిదేవి తో తపస్సు చేసుకోవటానికి పశ్చిమ దిక్కుకి వెళ్ళిపోయాడు.
అదే సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ గురించి ఘోరమైన తపస్సు చేసి, తాను పార్వతి పరమేశ్వరుల కు జన్మించే బిడ్డ చేతిలోనే చనిపోయేట్టు వరం పొందాడు. ఇది తెలిసిన దేవతలకి ఏమీ చెయ్యాలో తెలియలేదు. ఇప్పుడు ఈ తేజస్సుతో పుట్టిన బిడ్డ మాత్రమే ఆ తారకాసురిడిని అంతమొందించగలడు, సాక్షాత్తు భూమి కూడా ఈ తేజస్సును భరించలేక పోయింది ఇక ఈ తేజస్సును ఎవరు తట్టుకోగలరు? ఎవరైనా తట్టుకోగలిగినా మరలా పార్వతీదేవి శాప భయం కూడా ఉంటుంది. కనుక ఏమీ తోచని దేవతలు బ్రహ్మగారి దగ్గరికి వెళ్లారు. అప్పుడు బ్రహ్మ గారు ఆలోచించి, హిమావంతుడు మనోరమాల కుమార్తెలైన గంగా పార్వతులకి తేడా లేదు. కావున పార్వతిదేవి అక్క అయిన గంగలో తేజస్సుని విడిచిపేడితే, పార్వతిదేవికి కోపం రాదు. కాబట్టి ఆ శివ తేజస్సుని గంగలో విడిచిపెట్టమన్నారు.
అప్పటికి అగ్ని శక్తి క్షీణించసాగింది. ఆ తేజస్సును అగ్నికూడ భరించలేక ఉన్నాడు.
అప్పుడా దేవతలు గంగమ్మ దగ్గరికి వెళ్ళి, దైవకార్య నిమిత్తము నువ్వు అగ్ని దగ్గరనుంచి శివ తేజస్సుని స్వీకరించి గర్భం ధరించాలి అన్నారు. దేవతా కార్యము కనుక గంగా సరే అన్నది. అప్పుడు గంగ ఒక అందమైన స్త్రీ రూపం దాల్చి, ఆ తేజస్సుని అగ్ని నుండి స్వీకరించింది. శివ తేజస్సు గంగలో ప్రవేశించగానే గంగా భరించలేక కేకలేసింది. ఈ తేజస్సుని నేను భరించలేను, నన్ను ఏమీ చెయ్యమంటారు అని అడిగింది. అప్పుడు అగ్నిడేవుడు చెప్పిన విధంగా గంగ ఆ తేజస్సుని కైలాస పర్వతం పక్కనున్న భూమి మీద వదిలింది. 
అలా భూమి మీద పడ్డ ఆ తేజస్సు యొక్క కాంతివంతమైన స్వరూపం నుంచి బంగారం, వెండి పుట్టాయి. ఆ తేజస్సు యొక్క క్షారం నుంచి రాగి, ఇనుము పుట్టాయి. మిగిలిన పదార్ధం నుంచి మిగతా ధాటువులు పుట్టి గనులుగా ఏర్పడ్డాయి. కొంత తేజస్సుఅక్కడే ఉన్నతటాకం లో పడింది, ఆ వీర్యం ఆరు భాగాలుగా పది మల్లి ఒకటి ఐంది. ఆ ఒకటి ఐన వీర్యం నుండి ఒక బాలుడు జన్మించాడు. తటాకం నుండి ఒక పిల్లవాడి ఏడుపు దేవతలకు వినిపించింది.
ఆకలికి ఏడుస్తున్న ఆ పిల్లవాడిని చూసి దేవతలు పార్వతీపరమేశ్వరులకు పుత్రుడు కలిగినందుకు సంతోషించారు కానీ ఇప్పుడు ఈ బిడ్డ ఆకలి తీర్చటానికి ఎవరూ లేరే అని విచారిస్తున్న సమయం లో అక్కడకు కృత్తికలు వచ్చారు. ఆ బిడ్డను చుస్తే తమకు మాతృవాత్సల్యం కలుగుతుంది కనుక ఆ బిడ్డను తమ పేరు మీద కార్తికేయుడు
అని పిలిచినట్లయితే తాము అతనికి ఆకలి తీర్చగలము అని దేవతలకు చెప్పారు. అందుకు అంగీకరించిన దేవతలు సరే అన్నారు. ఈ మాట విన్న కృత్తికలు ఆనందంగా పాలు పట్టారు. ఆ పుట్టిన పిల్లవాడు 6 ముఖాలతో పుట్టాడు. ఏక కాలం లో 6 కృత్తికల స్తన్యమునందు 6 ముఖాలతో పాలు తాగాడు కనుక ఆయనకి షాడాననుడు, షణ్ముఖుడు అనే పేర్లు వాచ్చాయి. అలాగే అగ్నిదేవుడి నుండి బయటకి వచ్చిన శివ తేజస్సు కనుక ఆయనకి పావక, అగ్నీసంభావహ అని నామాలు. అలాగే పరమేశ్వరుడి కుమారుడు కనుక ఆయనని కుమారస్వామి అని పిలిచారు. అలాగే శివుడి వీర్యము స్ఖలనమైనందున పుట్టినవాడు కనుక, స్కందుడు అని పిలిచారు. పార్వతిదేవి లా అందంగా ఉంటాడు కనుక మురుగన్ అని పిలిచారు. పరమశివుడికి ప్రాణవార్ధాన్ని వివరించాడు కనుక స్వామిమలై అన్నారు

Wednesday, May 15, 2013

సాయిబాబా తొమ్మిది గురువారముల వ్రతమహత్యం






నవ గురువార సాయిబాబా వ్రత ఆచరణ నియమాలు

1     ఏ భక్తుడైనా స్త్రీ పురుష భేదము లేకుండా ఈ వ్రతమును ఆచరించవచ్చును.
2     ఏ కులము వారైనా సరే, ఏ మతము వారైనా సరే ఈ వ్రతమును ఆచరించవచ్చును.
3    ఈ వ్రతమును సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో మరియు అత్యంత భక్తితోనూ ఆచరించినచో మహత్వపూరితమైన ఫలము ప్రాప్తించును.
4     ప్రార్థనలు ఫలించాలంటే, కోర్కెలు తీరాలంటే భక్తీపూరితముగా సాయి భగవానుని ప్రార్థించి గురువారం రోజున ఈ వ్రతమును ప్రారంభించాలి.
5     ఉదయం సమయమైనను, సాయంత్ర సమయమైనను ఈ పూజలు ఆచరించవచ్చును. ఒక పలకను సింహాసనముగా అమర్చి ఒక వస్త్రమును దానిపై పరిచి దానిపై సాయినాథుని పటమును గాని విగ్రహనును గాని ప్రతిష్టించి సాయినాథుని నుదిటిపై చందనం మరియు తిలకం దిద్దాలి. పూలమాలను గాని పసుపు పుష్పములను గాని సాయినాథునికి సమర్పించాలి. దీపస్తంభంలో సాయిజ్యోతిని వెలిగించి సాంబ్రాణి, అగరు దూపములను సమర్పించాలి. పవిత్ర ఆహార రూపంలో వున్న చక్కర గాని, మిఠాయిగాని, ఫలములు గాని నైవేద్యముగా సపర్పించాలి. వ్రతములో కూర్చున్నవారికి పవిత్ర ప్రసాదమును సమంగా పంచి భుజించాలి.
6     పాలుగాని, కాఫీగాని, టీగాని లేక మిఠాయిలనుగాని, ఫలములనుగాని ఆహారముగా సేవించో లేక వ్రతమును ఆచరించు భక్తుడు ఒకే పూత (మధ్యాహ్నం/రాత్రి) ఆహారం సేవించిగానీ వ్రతమును ఆచరించాలి. ఆకలి కడుపుతోను లేదా పూర్తీ ఉపవాసంతోనూ ఈ వ్రతమును ఆచరించరాదు.
7     వీలైనచో 9 గురువారములు సాయి మందిరానికి వెళ్ళి ప్రార్థించాలి. సాయిబాబా మందిరం దగ్గరలో లేని పక్షంలో గృహం లోనే అత్యంత భక్తితో పూజను ఆచరించాలి.
8     భక్తులు వేరే గ్రామానికి వెళ్ళిన సమయంలో కూడా ఈ వ్రతమును కొనసాగించవచ్చును.
9     ఈ 9 గురువారములు స్త్రీలు మైల పడితే లేక మరో కారణం చేత గాని పూజలను ఆచరించనిచో ఆ గురువారం వదిలివేయవచ్చును. ఈ వదిలివేయబడిన గురువారం లెక్కించరాదు. మరియు రాబోవు గురువారం ఈ పూజను ఆచరించి 9 గురువారములు పూర్తిచేయాలి.

సాయిబాబా వ్రత గాథ 


కోకిల అను సాధువైన స్త్రీ తన భర్త మహేష్ తో ఒక నగరంలో నివసిస్తోంది. పరస్పర ప్రేమానురాగాలతో, అన్యోన్యంగా వారు సంసారం సాగిస్తున్నారు. కాని మహేష్ ది దేబ్బలాడు స్వభావం మరియు అతనిమాటలతో, భాషలలో సభ్యత అను హద్దులే ఉండేవి కావు. ఇరుగుపొరుగు వాళ్ళకు మహేష్ స్వభావం చాలా ఇబ్బందికరంగా ఉండేది. కాని కోకిల చాలా శాంతస్వభావురాలైన భక్తురాలు. అపారమైన విశ్వాసంతో ఆమె సహనంతో అన్ని కష్టాలు సహిస్తూ వస్తుండేది. కాలక్రమంగా ఆమె భర్త యొక్క వ్యాపారము దెబ్బతినగా సంసారం సాగడమే కష్టంగా ఉండేది. కాని మహేష్ పొద్దస్తమానం భార్యతో చీటికీమాటికీ పోరాడుతూ, ఇబ్బందులకు గురిచేస్తూ ఉండేవాడు. ఒకరోజు మధ్యాహ్నం ఒక సాధువు వారి గృహముముందు నిలిచినాడు. ఆ సాధువు కోకిల వదనం చూసి బియ్యం మరియు పప్పు భిక్షం అడుగుతూ సాయిబాబా నిన్ను అనుగ్రహించుగాక అని కోకిలను దీవించాను. కోకిల చాలా బాధపడుతూ ఈ జీవితంలో తనకు సంతోషమనేది రాయబడిలేదంటూ తన విషాదగాధను చెప్పుకుంది.
 ఆ సాధువు ఆమెను సాయిబాబా వ్రతమును 9 గురువారములు ఆచరించమని ఉపదేశించాడు. వ్రతము సమయమునందు పళ్ళు పానీయములు లేక ఒక పూత ఆహారము మాత్రమే భుజించాలని ఆదేశించాడు. సాధ్యమైతే సాయిబాబా మందిరానికి వెళ్ళి ప్రార్థించాలని లేదా గృహంలో సాయి పూజను ఆచరించి 9 గురువారములు తన శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా నిర్ధేశించబడిన నియమాలను అనుసరించి బీదలకు అన్నదానం గావించి 5 మందికి లేక 11మందికి శ్రీసాయి వ్రత పుస్తకాలను ఉచితంగా ఇవ్వాలని, ఈ వ్రత ఆచరణ చాలా మహాత్వపూరితమైనది, మరియు కలియుగానికి చాలా యుక్తమైనది. ఈ వ్రతము భక్తుని కోర్కెలను తీర్చును. కాని భక్తునికి సాయినాథునిపై ప్రగాఢ విశ్వాసము మరియు భక్తీ కలిగి ఉండాలి. ఏ భక్తుడైతే ఈ వ్రతమును నియమానుసారంగా భక్తిశ్రద్ధలతో ఆచరించునో అతని సమస్త కోరికలు, ప్రార్థనలు సాఫల్యం గావించును అని సాధువు కోకిలకు చెప్పెను.



 కోకిల కూడా ఈ నవ గురువార వ్రతమును ఆచరించాలన్న నిర్ణయానికి వచ్చి నిర్ధేశించబడిన సమయానుసారంగా బీద సాదలకు అన్నదానం గావించి, సాయివ్రత పుస్తకములను తొమ్మిదవ గురువారం ఉచితంగా ఇచ్చింది. అలా కొన్ని రోజులు గడిచిన పిమ్మట ఆమె కష్టాలన్నీ మాయమైనవి. గృహంలో సుఖశాంతులు వెల్లివిరిసాయి. మహేష్ యొక్క కలహా స్వభావం శాశ్వతంగా అంతరించింది. అతని వ్యాపారం సజావుగా కొనసాగింది. వారి జీవనం వృద్ధి చెందినది. ఆ తరువాత కొద్ది రోజుల పిమ్మట ఒక దినం సూరత్ నుండి కోకిల యొక్క బావ భార్యతో కోకిల ఇంటికి విచ్చేశారు. వారు తమ పిల్లలు చదువుల్లో బాగా వెనకబడి ఉన్నారని, పరీక్షలలో ఉత్తీర్ణులు కాలేదని వాపోయారు. కోకిల వారికి 9 గురువారముల సాయిబాబా వ్రతమును గూర్చి వివరించింది. ఆత్మవిశ్వాసం మరియు సహనంతో సాయిబాబాను ప్రార్థించినచో వారి పిల్లలు చదువులో ప్రగతి చూపగలరని వారికి సలహా ఇచ్చింది. కోకిల యొక్క బావ, భార్య వారికి వ్రతం యొక్క వివరాలు చెప్పమని కోరగా
 .తొమ్మిది గురువారములు ఫలములు, పానీయములు తీసుకుని గానీ ఒక పూత ఉపవాసము ఉండిగానీ తొమ్మిది వారములు సాయి మందిరంలో సాయినాథుని దర్శనం చేసుకోవాలి. ఏ భక్తుడైనా స్త్రీ పురుష భేదము లేకుండా ఈ వ్రతమును ఆచరించవచ్చును. ఏ కులము వారైనా సరే, ఏ మతము వారైనా సరే ఈ వ్రతమును ఆచరించవచ్చును. ఈ వ్రతము సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో మరియు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించినచో మహాత్వపూరితమైన ఫలము ప్రాప్తించును. ప్రార్థనలు ఫలించాలంటే ప్రార్థనలు ఫలించాలంటే, కోర్కెలు తీరాలంటే భక్తీపూరితముగా సాయి భగవానుని ప్రార్థించి గురువారం రోజున ఈ వ్రతమును ప్రారంభించాలి. ఉదయం సమయమైనను, సాయంత్ర సమయమైనను ఈ పూజలు ఆచరించవచ్చును. ఒక పలకను సింహాసనముగా అమర్చి ఒక వస్త్రమును దానిపై పరిచి దానిపై సాయినాథుని పటమును గాని విగ్రహనును గాని ప్రతిష్టించి సాయినాథుని నుదిటిపై చందనం మరియు తిలకం దిద్దాలి. పూలమాలను గాని పసుపు పుష్పములను గాని సాయినాథునికి సమర్పించాలి. దీపస్తంభంలో సాయిజ్యోతిని వెలిగించి సాంబ్రాణి, అగరు దూపములను సమర్పించాలి. పవిత్ర ఆహార రూపంలో వున్న చక్కర గాని, మిఠాయిగాని, ఫలములు గాని నైవేద్యముగా సపర్పించాలి. వ్రతములో కూర్చున్నవారికి పవిత్ర ప్రసాదమును సమంగా పంచి భుజించాలి. పాలుగాని, కాఫీగాని, టీగాని లేక మిఠాయిలనుగాని, ఫలములనుగాని ఆహారముగా సేవించో లేక వ్రతమును ఆచరించు భక్తుడు ఒకే పూత (మధ్యాహ్నం/రాత్రి) ఆహారం సేవించిగానీ వ్రతమును ఆచరించాలి. ఆకలి కడుపుతోను లేదా పూర్తీ ఉపవాసంతోనూ ఈ వ్రతమును ఆచరించరాదు. వీలైనచో 9 గురువారములు సాయి మందిరానికి వెళ్ళి ప్రార్థించాలి. సాయిబాబా మందిరం దగ్గరలో లేని పక్షంలో గృహం లోనే అత్యంత భక్తితో పూజను ఆచరించాలి. 


 భక్తులు వేరే గ్రామానికి వెళ్ళిన సమయంలో కూడా ఈ వ్రతమును కొనసాగించవచ్చును. ఈ 9 గురువారములు స్త్రీలు మైల పడితే లేక మరో కారణం చేత గాని పూజలను ఆచరించనిచో ఆ గురువారం వదిలివేయవచ్చును. ఈ వదిలివేయబడిన గురువారం లెక్కించరాదు. మరియు రాబోవు గురువారం ఈ పూజను ఆచరించి 9 గురువారములు పూర్తిచేయాలని వారికి కోకిల సాయివ్రతం గురించి వివరించింది. కొన్ని దినముల తరువాత సూరత్ లో ఉన్న అక్కాబావల నుండి కోకిలకు ఉత్తరం వచ్చింది. వారి పిల్లలు సాయివ్రతం ప్రారంభించారని, ఇప్పుడు పిల్లలు బాగా చదువుకుంటున్నారని, తాము సహితం ఈ తొమ్మిది గురువారముల వ్రతము ఆచరించి సాయివ్రతం పుస్తకములను ఉచితంగా పంచామని వ్రాశారు. స్నేహితురాలు ఈ వ్రతం ఆచరించడం ద్వారా ఆమె కుమార్తె ఒక చక్కని అబ్బాయితో వివాహం నిశ్చయమైనదని, పక్కింటామె నగల పెట్టి కనపడకపోగా వారు సాయివ్రతం ఆచరించిన 2 నెలలకు పోగొట్టుకున్న నగలపెట్టేను ఎవరో ఆగంతకుడు వారికి తిరిగి పంపాడని ఆ ఉత్తరం ద్వారా తెలియజేసింది. ఇంత అద్భుతమైన అనుభవాలను ఉత్తరం ద్వారా తెలుసుకున్న కోకిల భగవానుని శక్తిని, సాయివ్రత మహిమను తెలుసుకుంది. దీంతో ఆమెకి సాయినాథుని మీదున్న భక్తీ మరీ ప్రగాఢమైంది.


ఉద్యాపన (వ్రతం పూర్తిచేయు) విధానం మరియు నియమాలు 
 1     తొమ్మిదవ గురువారం 5 మంది బీదలకు అన్నదానం చేయాలి.
2     ఈ వ్రతం యొక్క శక్తిని ప్రజలకు తెలియజేయడానికి ఈ 'సాయిబాబా వ్రతం' పుస్తకములను ఉచితంగా 5, 11, లేక 20 పంచవలెను.
3    తొమ్మిదో గురువారంనాడు ఈ పుస్తకములను పూజ గృహమునందు వుంచి పూజించి ఇతరులకు పంచితే పుస్తకం ప్రసాదముగా అందుకునే వారికి దైవానుగ్రహం లభించును.