Monday, December 24, 2012

ఆధ్యాత్మికం

నిత్య మానవ ధర్మాలు - పార్ట్ 5

ఇంతకు క్రితం వరకు స్నానం చేయడం వరకు పాటించాల్సిన 

నియమాలను గురించి తెలుసుకున్నాం... ఇప్పుడు స్నానం 
తర్వాత 

చేయాల్సిన విధులను గురించి తెలుసుకుందాం....

21. స్నానం తర్వాత ముందుగా ముకం, తర్వాత వక్షస్థలం, 

ఆ తర్వాత శిరస్సు... ఆపైన మిగతా శరీర భాగాలను 

తుడుచుకోవాలి. 

పొడి వస్త్ర్రంతోనే తుడుచుకోవాలి. తడిబట్టను వాడకూడదు.

22. స్త్ర్రీలు సాధారణంగా కంఠస్నానం చేసేప్పుడు జుట్టు చివర 

తప్పనిసరిగా ముడి వేసుకోవాలి. లేనట్లయితే దేహం 

పిశాచగ్రస్తమవుతుంది. తలంటు చేసేప్పుడు ఆ అవసరం 

లేదు. అయితే... స్నానం పూర్తయిన వెంటనే జుట్టుకు ముడి 

వేయాలి.


23. స్నానం చేసేందుకు కట్టుకుని, తడిపిన బట్టను కిందకు 


వదలాలి. ఈ బట్టను తానైనా ఉతికి ఆరవేయాలి. లేదా భార్య, 

పిల్లలు 

ఆరవేయాలి. ఇతరులకు దాన్ని ఉతకడానికి గానీ, 

ఆరవేయడానికి గానీ ఇవ్వకూడదు.

24. బట్టలు మార్చుకునేప్పుడు పొడిబట్టలు పైకి తీయాలి. 

కిందకు విడవకూడదు.


25. స్నానం ఎక్కువ సేపు చేయాలి. గోడపై నీళ్లు చల్లినట్లు 

మమ అనిపించుకోకూడదు.
26. స్నానాలు ప్రధానంగా మూడు రకాలు:

అ) అభ్యంగన స్నానం (తలంటు పోసుకోవడం)

ఆ) అవబృద స్నానం (దీక్ష చివర చేసేది)

ఇ) అఘమర్షణ స్నానం (తడి బట్టలతో దేహాన్ని 

రుద్దుకోవడం. ఈ తర్వా స్నానం వల్ల బుద్దిజ్నానాలు 

పెరుగుతాయి)


27. తలంటు స్నానాలు ఏయేరోజుల్లో ఏ ఫలితాన్నిస్తాయి?

ఆదివారం - తాపం

సోమవారం - కాంతి

మంగళవారం - మంచిదికాదు

బుధవారం - లక్ష్మీ

గురువారం - ధననాశం

శుక్రవారం - విపత్తు

శనివారం - భోగం

(ఇవి పురుషులకు మాత్రమే. స్త్ర్రీలు రోజూప తలంటు 

చేసుకోవచ్చు. పురుషులు ప్రత్యేక దీక్షల్లో ఉన్నప్పుడు, 

వ్రతాలు చేసేప్పుడు ఈ 

నిబంధన అడ్డురాదు)


28. శిరస్సు స్నానం చేసినప్పుడు మాత్రమే తడి విభూతి 

నుదుటన పెట్టుకోవాలి. కంఠ స్నానం చేసినప్పుడు పొడి 

విభూపతిని మాత్రమే 

పెట్టుకోవాలి.


29. విభూతిని ముందుగా బొటన వేలితో కుడి నుంచి 

ఎడమకు పెట్టుకోవాలి. మధ్యవేలితో సరిచేసుకోవాలి. తర్వాత 

మధ్యమూడు 

వేళ్లతో అడ్డంగా విభూతి పెట్టుకోవాలి.30. విభూతిని మూడు గీతులగా పెట్టుకోవడం అంటే... 

సత్వ, రజ, తమో గుణాలకు అతీతుడు అని అర్థం.నోట్: ఇవన్నీ పెద్దలు చెప్పిన మాటలు... మనుధర్మశాస్త్ర్రాల 

సారాలు. కాబట్టి.. ఎందుకు, ఏమిటి?? అని 

ప్రశ్నించకుండా... 

హిందూమతాభిమానం ఉన్నవారు పాటించగలరు. ప్రతిరోజూ 

కొన్ని ధర్మాలను మీ ముందు పెడతాను. దయచేసి 

అన్యమతస్తులు 

మీరు ఇష్యూ చేయడానికి నా వాల్ ను, నా పోస్టులను 

వేదికగా చేసుకోకండి. ఇక మనుధర్మశాస్త్ర్రాలను 

వ్యతిరేకించేవారున్నారు. 

అయితే... అందరికీ ఆమోదయోగ్యమైన ధర్మసూత్రాలను 

మాత్రమే ఇక్కడ నేను పోస్టు చేస్తున్నాను.

No comments: