Saturday, February 11, 2012

శ్రీ త్రిమూర్తులను వర్ణించు శ్లోకము
























రచన:::నన్నయ్య

శ్రీ వాణీ గిరిజా శ్చిరాయ దధతో వక్షో ముఖాంగేషు యే
లోకానాం స్థితి మావహన్త్యవిహతాం స్త్రీపుంసయోగోద్భవాం
తేవేదత్రయమూర్తయ స్త్రీపురుషా స్సంపూజితా వస్సురై
ర్భూయాసుః పురుషోత్తమాంబుజ భవ శ్రీకంధరా శ్శ్రేయసే

















చతుర్ముఖ బ్రహ్మకు వందనం___/\___

సృష్టికర్త బ్రహ్మదేవుడు ఆర్తత్రాణపరాయణుడు. 
అందుకే దేవతలు, ఋషులు తదితరులు తమకేమయినా 
ఆపదలు ఎదురైనపుడు ముందుగా బ్రహ్మదేవుని దగ్గరకు పరుగెడు తుంటారు. 
అందుకు తగిన సూచనలను కూడ పొందు తుంటారన్నది నిజం.

ఓం వేదాత్మకాయ విద్మహే
హరణ్యగర్భాయ ధీమహి
తన్నో బ్రహ్మః ప్రచోదయాత్

ఓం హంసరూఢాయ విద్మహే
కూర్చ హస్తాయ ధీమహి
తన్నో బ్రహః ప్రచోదయాత్

ఓం తత్పురుషాయ విద్మహే
చతుర్ముఖాయ ధీమహి
తన్నో బ్రహ్మః ప్రచోదయాత్

ఓం సురారాధ్యాయ విధ్మహే
వేదాత్మనాయ ధీమహి
తన్నో బ్రహ్మః ప్రచోదయాత్

ఓం వేదాత్మనే చ విద్మహే
హిరణ్యగర్భాయ ధీమహీ
తన్నో బ్రహ్మః ప్రచోదయాత్

ఓం పరమేశ్వరాయ విద్మహే
పరతత్వాయ ధీమహి
తన్నో బ్రహ్మః ప్రచోదయాత్

ఇక రకరకాల గాయత్రీ మంత్రాలలో బ్రహ్మదేవుని ప్రార్థిస్తుంటారు ఆయన భక్తజనకోటి.

బ్రహ్మపుట్టుక గురించి పురాణాలలో మనకు రకరకాల కథనాలు కనబడుతుంటాయి. 
కూర్మపురాణం బ్రహ్మ దేవుడు విష్ణుపుత్రుడంటే, శివ పురాణం బ్రహ్మ శివపుత్రుడని అంటోంది.

ఒకసారి నారాయణుడు పాలకడలిపై శయనించి ఉండగా, ఆయన మహిమ వలన, ఆయన నాభి నుంచి ఒక కమలం పుట్టింది. 
అటుగా వచ్చిన బ్రహ్మ, విష్ణుమూర్తిలో సమస్తలోకాలన్నీ ఉంటాయి. కనుక, ఆయాలోకాలన్నింటినీ చూడాలన్న ఉత్సుకతతో విష్ణుమూర్తి లోనికి ప్రవేశించాడు. ఇంతలో విష్ణుమూర్తి తన నవరంధ్రాలను మూయడంతో, వేరే గత్యంతరం లేని బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి నాభికమలం ద్వారా బయటకు వచ్చాడని కూర్మపురాణ కథనం.


ఇక శివపురాణం ప్రకారం శివుని దక్షిణాంగం నుండి బ్రహ్మ జన్మించాడు. అప్పటికే విష్ణువు నాభియందు ఒక కమలం పుట్టింది. బ్రహ్మలీలతో ఆ కమలంలో ప్రవేశించాడు. ఆ కమలం యొక్క ఆదిని చూడాలను కున్న బ్రహ్మ దానిని చూడలేక విస్మయంతో బయటపడి తన తండ్రి ఎవరన్న విషయంపై విష్ణుమూర్తిని ప్రార్థించి గ్రహిస్తాడు. ఒకసారి బ్రహ్మ సృష్టి చేయడానికి సంకల్పించి సనత్కుమారులను పుట్టించాడు. వారిని సృష్టిని చేయమని పురమాయించగా, అందుకు వారు విముఖత చూపిస్తారు. అందుకు కోపగించుకున్న బ్రహ్మ విష్ణువు సలహాతో తన కనబోమల నుండి రుద్రుని సృష్టిస్తాడు. అతని నుంచి ఏకాదశ రుద్రులు ఉదయిస్తారు. వారి ద్వారా ఈ సృష్టి జరుగుతుంది. ఇలా బ్రహ్మ సృష్టిని నిర్వహిస్తూ మనలను కాపాడుతున్నాడు.

No comments: