Wednesday, October 5, 2016

ఋణ విమోచన నృసింహ స్తోత్రం

















1::దేవతా కార్య సిద్ధ్యర్థం సభా స్తంభ సముద్భవమ్  
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే  

2::లక్ష్మ్యాలింగిత వామాంగం భక్తానాం వరదాయకమ్  
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే  

3::ఆంత్ర మాలాధరం శంఖ చక్రాబ్జాయుధ ధారిణం  
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే  

4::స్మరణాత్ సర్వపాపఘ్నం కద్రూజవిషనాశనమ్  
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే  

5::సింహనాదేన మహతా దిగ్దంతిభయనాశనమ్  
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే  

6::ప్రహ్లాద వరదం శ్రీశం దైత్యేశ్వర విదారిణమ్  
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే 

7::క్రూరగ్రహైః పీడితానాం భక్తానామభయప్రదమ్  
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే  

8::వేద వేదాంత యజ్ఞేశం బ్రహ్మ రుద్రాది వందితమ్  
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే 

9::య ఇదం పఠతే నిత్యం ఋణమోచన సంజ్ఞితమ్  
అనృణే జాయతే సత్యో ధనం శీఘ్రమవాప్నుయాత్ 

:::ఇతి ఋణవిమోచననృసింహస్తోత్రం సమాప్తం:::

శ్రీ హయగ్రీవ స్తోత్రం



1::జ్ఞానానన్దమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం
ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే  

2::స్వతస్సిద్ధం శుద్ధస్ఫటికమణిభూ భృత్ప్రతిభటం
సుధాసధ్రీచీభి ర్ద్యుతిభి రవదాతత్రిభువనం
అనంతై స్త్రయ్యంతై రనువిహిత హేషాహలహలం
హతాశేషావద్యం హయవదన మీడేమహి మహః  

3::సమాహార స్సామ్నాం ప్రతిపదమృచాం ధామ యజుషాం
లయః ప్రత్యూహానాం లహరివితతి ర్బోధజలధేః
కథాదర్పక్షుభ్య త్కథకకులకోలాహలభవం
హర త్వంతర్ధ్వాన్తం హయవదనహేషాహలహలః  

4::ప్రాచీ సన్ధ్యా కాచి దన్తర్నిశాయాః ప్రజ్ఞాదృష్టే రఞ్జనశ్రీ రపూర్వా
వక్త్రీ వేదాన్ భాతు మే వాజివక్త్రా వాగీశాఖ్యా వాసుదేవస్య మూర్తిః  

5::విశుద్ధవిజ్ఞానఘనస్వరూపం విజ్ఞానవిశ్రాణనబద్ధదీక్షం
దయానిధిం దేహభృతాం శరణ్యం దేవం హయగ్రీవ మహం ప్రపద్యే  

6::అపౌరుషేయైరపి వాక్ప్రపంచై రద్యాపి తే భూతి మదృష్టపారాం
స్తువ న్నహం ముగ్ధ ఇతి త్వయైవ కారుణ్యతో నాథ కటాక్షణీయః  

7::దాక్షిణ్యరమ్యా గిరిశస్య మూర్తి ర్దేవీ సరోజాసనధర్మపత్నీ
వ్యాసాదయోఽ పి వ్యపదేశ్యవాచ స్స్ఫురన్తి సర్వే తవ శక్తిలేశైః  

8::మనోఽభవిష్య న్నియతం విరించో వాచాం నిధే ర్వంచితభాగధేయః
దైత్యాపనీతాన్ దయయైన భూయో ప్యధ్యాపయిష్యో నిగమా న్నచేత్త్వమ్  

9::వితర్కడోలాం వ్యవధూయ సత్త్వే
బృహస్పతిం వర్తయసే యత స్త్వం
తేనైవ దేవ! త్రిదేశేశ్వరాణా
మస్పృష్టడోలాయిత మాధిరాజ్యమ్  

10::అగ్నౌ సమిద్ధార్చిషి సప్తతన్తో 
రాతస్థివాన్మంత్రమయం శరీరం
అఖణ్డసారై ర్హవిషాం ప్రదానై 
రాప్యాయనం వ్యోమసదాం విధత్సే  

11::యన్మూల మీదృ క్ప్రతిభాతత్త్వం
యా మూల మామ్నాయమహాద్రుమాణాం
తత్త్వేన జానంతి విశుద్ధసత్త్వా 
స్త్వా మక్షరా మక్షరమాతృకాంతే  

12::అవ్యాకృతా ద్వ్యాకృతవానసి త్వం
నామాని రూపాణి చ యాని పూర్వం
శంసన్తి తేషాం చరమాం ప్రతిష్ఠాం
వాగీశ్వర త్వాం త్వదుపజ్ఞవాచః  

13::ముగ్ధేన్దునిష్యన్దవిలోభనీయాం
మూర్తిం తవానన్దసుధాప్రసూతిం
విపశ్చిత శ్చేతసి భావయన్తో
వేలాముదారామివ దుగ్ధ సిన్ధోః  

14::మనోగతం పశ్యతి య స్సదా త్వాం
మనీషిణాం మానసరాజహంసం
స్వయంపురోభావవివాదభాజః
కింకుర్వతే తస్య గిరో యథార్హమ్  

15::అపి క్షణార్ధం కలయన్తి యే త్వా
మాప్లావయన్తం విశదై ర్మయూఖైః
వాచాం ప్రవాహై రనివారితై స్తే
మందాకినీం మన్దయితుం క్షమన్తే  

16::స్వామి న్భవద్ద్యానసుధాభిషేకా
ద్వహన్తి ధన్యాః పులకానుబన్దం
అలక్షితే క్వాపి నిరూఢ మూల  
మంగ్వేష్వి వానన్దథుమఙ్కురన్తమ్  

17::స్వామి న్ప్రతీచా హృదయేన ధన్యా  
స్త్వద్ధ్యానచన్ద్రోదయవర్ధమానం
అమాన్త మానన్దపయోధిమన్తః
పయోభి రక్ష్ణాం పరివాహయన్తి 

18::స్వైరానుభావాస్ త్వదధీనభావా 
స్సమృద్ధవీర్యా స్త్వదనుగ్రహేణ
విపశ్చితోనాథ! తరన్తి మాయాం
వైహారికీం మోహనపిఞ్ఛికాం తే  

19::ప్రాఙ్నిర్మితానాం తపసాం విపాకా
త్ప్రత్యగ్రనిశ్శ్రేయససమ్బదో మే
సమేధిషీరం స్తవ పాదపద్మే
సఙ్కల్పచిన్తామణయః ప్రణామాః  

20::విలుప్తమూర్ధన్యలిపిక్రమాణా
సురేన్ద్రచూడాపదలాలితానాం
త్వదంఘ్రి రాజీవరజఃకణానాం
భూయా న్ప్రసాదో మయి నాథ భూయాత్  

21::పరిస్ఫురన్నూపురచిత్రభాను 
ప్రకాశనిర్ధూతతమోనుషంగా
పదద్వయీం తే పరిచిన్మహేఽన్తః
ప్రబోధరాజీవవిభాతసన్ధ్యామ్  

22::త్వత్కిఙ్కరాలంకరణోచితానాం
త్వయైవ కల్పాన్తరపాలితానాం
మంజుప్రణాదం మణినూపురం తే
మంజూషికాం వేదగిరాం ప్రతీమః  

23::సంచిన్తయామి ప్రతిభాదశాస్థా  
న్సన్ధుక్షయన్తం సమయప్రదీపాన్
విజ్ఞానకల్పద్రుమపల్లవాభం
వ్యాఖ్యానముద్రామధురం కరం తే  

24::చిత్తే కరోమి స్ఫురితా క్షమాలాం
సవ్యేతరం నాథ! కరం త్వదీయం
జ్ఞానామృతోదంచనలాలసానాం
లీలాఘటీయన్త్రమివాఽఽశ్రితానామ్ 

25::ప్రబోధసిన్ధో రరుణైః ప్రకాశైః
ప్రవాళసఙ్ఘాతమివోద్వహన్తం
విభావయే దేవ! సపుస్తకం తే
వామం కరం దక్షిణ మాశ్రితానామ్  

26::తమాం సిభిత్త్వావిశదై ర్మయూఖై  
స్సమ్ప్రీణయ న్తం విదుష శ్చకోరాన్
నిశామయే త్వాం నవపుణ్డరీకే
శరద్ఘనేచన్ద్రమివ స్ఫురన్తమ్  

27::దిశన్తు మే దేవ సదా త్వదీయా
దయాతరంగానుచరాః కటాక్షాః
శ్రోత్రేషు పుంసా మమృతంక్షర న్తీం
సరస్వతీం సంశ్రితకామధేనుమ్ 

28::విశేషవిత్పారిషదేషు నాథ!
విదగ్ధగోష్ఠీ సమరాంగణేషు
జిగీషతో మే కవితార్కికేంద్రాన్
జిహ్వాగ్రసింహాసన మభ్యుపేయాః 

29::త్వాం చిన్తయన్ త్వన్మయతాం ప్రపన్న  
స్త్వా ముద్గృణన్ శబ్దమయేన ధామ్నా
స్వామి న్సమాజేషు సమేధిషీయ
స్వచ్ఛన్దవాదాహవబద్ధశూరః 

30::నానావిధానా మగతిః కలానాం
న చాపి తీర్థేషు కృతావతారః
ధ్రువం తవాఽనాధ పరిగ్రహాయాః
నవ నవం పాత్ర మిదం దయాయాః  

31::అకమ్పనీయాన్యపనీతిభేదై  
రలంకృషీరన్ హృదయం మదీయమ్
శంకా కళంకా పగమోజ్జ్వలాని
తత్త్వాని సమ్యంచి తవ ప్రసాదాత్  

32::వ్యాఖ్యాముద్రాం కరసరసిజైః-పుస్తకం శంఖచక్రే  
భిభ్రద్భిన్న స్ఫటికరుచిరే పుణ్డరీకే నిషణ్ణః
అమ్లానశ్రీ రమృతవిశదై రంశుభిః ప్లావయన్మా
మావిర్భూయా దనఘమహిమామానసే వాగధీశః  

33::వాగర్థసిద్ధిహేతోఃపఠత హయగ్రీవసంస్తుతిం భక్త్యా
కవితార్కికకేసరిణా వేఙ్కటనాథేన విరచితా మేతామ్  

Sunday, September 18, 2016

సర్ప స్తోత్రం



సర్ప స్తోత్రాన్ని ప్రతి రోజు మరుయు నాగ పంచమి రోజున చదివిన వారికి ఇంద్రియాల వల్ల ఎలాంటి భాదలు లేక రోగాలు రావు .


*సర్ప స్తోత్రాన్ని ప్రతో రోజు చదివిన వారికి అనుకున్న కార్యములు నెరవేరతాయి మరియు నాగుల విగ్రహాన్నికి పాలు పోస్తూ సర్ప స్తోత్రాన్ని చదివిన వారికి కార్య సిద్ది జరుగుతుంది

సర్ప స్తోత్రం



సర్ప స్తోత్రాన్ని ప్రతి రోజు మరుయు నాగ పంచమి రోజున చదివిన వారికి ఇంద్రియాల వల్ల ఎలాంటి భాదలు లేక రోగాలు రావు .


*సర్ప స్తోత్రాన్ని ప్రతో రోజు చదివిన వారికి అనుకున్న కార్యములు నెరవేరతాయి మరియు నాగుల విగ్రహాన్నికి పాలు పోస్తూ సర్ప స్తోత్రాన్ని చదివిన వారికి కార్య సిద్ది జరుగుతుంది



Monday, August 1, 2016

తనియన్లు సంగ్రహ శ్లోకాలు


శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ: 

1::*శ్రీశైలేశ దయా పాత్రం ధీ భక్త్యాది గుణార్ణవం |
యతీంద్ర ప్రవణం వన్దే రమ్య జామాతరం మునిం ||

2::లక్ష్మీ:నాధ సమారంభామ్ నాధ యామున మధ్యమామ్
అస్మదాచార్య పర్యంతామ్ వందే గురు పరంపరాం

3::కూరత్తాళ్వాన్ తనియన్:
యోనిత్య మచ్యుత పదామ్భుజ యుగ్మ రుక్మ
వ్యామోహతః స్తధితరాణి తృణాయ మేనే
అస్మద్గురోః భగవతోస్య దయైకసింధోః
రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే

4::ఆళవందార్లు తనియన్:
మాతా పితా యువతయ స్థనయా విభూతి:
సర్వం య దేవ నియమేన మదన్వయానాం
ఆద్యస్యన: కులపతేర: వకుళాభిరామం
శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా

5::పరాశర భట్టర్ తనియన్:
భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ
శ్రీ భక్తిసార కులశేకర యోగివాహాన్
భక్తాంఘ్రి రేణు పరకాల యతీంధ్ర మిశ్రాన్
శ్రీమత్ పరాంకుశ మునిం ప్రణతోస్మి నిత్యం





















 1::పెరియ పెరుమాళ్  తనియన్: 

శ్రీ స్తనాభరణమ్ తేజః శ్రీరంగేశయమాశ్రయే
చింతామణి మివోద్వాన్తం ఉత్సంగే అనంతభోగినః

2::పెరియ పిరాట్టి తనియన్

నమః శ్రీరంగ నాయక్యై యద్బ్రో విభ్రమ భేదతః
ఈశేషితవ్య వైషమ్య నిమ్నోన్నత మిదమ్ జగత్

3::నమ్మాళ్వార్ల తనియన్: 

మాతా పితా యువతయ: తనయా విభూతి:
సర్వం యదేవ నియమేన మదన్వయానాం |
ఆద్యస్య న: కులపతే: వకుళాభిరామం
శ్రీమత్ తదంఘ్రి యుగళం ప్రణమామి మూర్ధ్నా ||

4::నాథమునుల తనియన్ :

నమో అచింత్యాద్బుత అక్లిష్ట ఙ్ఞానవైరాగ్య రాశయే !
నాథాయ మునయే అగాధ భగవద్భక్తి సింధవే !!

అడియేన్ రఘువంశీ రామానుజదాసన్.

5::ఆళవందార్ తనియన్ :

యత్ పదామ్భోరుహ ద్యాన విద్వస్తా శేశ కల్మశ: !
వస్తుతాముపయా దోహమ్ యామునేయమ్ నమామితమ్. !!

6::ఎమ్పెర్మానార్ల  తనియన్:

యోనిత్యమచ్యుత పదామ్బుజ యుగ్మ రుక్మ 
వ్యామోహతస్ తదితరాణి తృణాయ మేనే
అస్మద్గురోర్ భగవతోస్య దయైకసింధోః
రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే

కార్యసిద్ధిని చేకూర్చే శక్తివంతమైన ఆంజనేయ శ్లోకాలు



హనుమంతుడు కార్యసాధకుడు. భక్తితో హనుమంతుడిని కొలిచిన వారికి వారి కోరికలు తప్పక నెరవేరతాయి. భక్తులు వారి వారి కోరికను అనుసరించి ఆంజనేయ శ్లోకాలను భక్తితో స్మరిస్తే కార్యసిద్ధి సాధించగలుగుతారు.

1::విద్యా ప్రాప్తికి:-
పూజ్యాయ, వాయుపుత్రాయ వాగ్ధోష వినాశన!
సకల విద్యాంకురమే దేవ రామదూత నమోస్తుతే!!

2::ఉద్యోగ ప్రాప్తికి:-
హనుమాన్ సర్వధర్మజ్ఞ సర్వా పీడా వినాశినే!
ఉద్యోగ ప్రాప్త సిద్ధ్యర్థం శివరూపా నమోస్తుతే!!

3::కార్య సాధనకు:-
అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తమకిమ్ వద
రామదూత కృపాం సింధో మమకార్యమ్ సాధయప్రభో!

4::గ్రహదోష నివారణకు:-
మర్కటేశ మహోత్సాహా స్రవ గ్రహ నివారణ
శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాపయామ్ ప్రభో!

5::ఆరోగ్యమునకు:-
ఆయుః ప్రజ్ఞ యశోలక్ష్మీ శ్రద్ధా పుత్రాస్సుశీలతా
ఆరోగ్యం దేహ సౌఖ్యంచ కపినాథ నమోస్తుతే!

6::సంతాన ప్రాప్తికి:-
పూజ్యాయ ఆంజనేయ గర్భదోషాపహారిత్
సంతానం కురమే దేవ రామదూత నమోస్తుతే!

7::వ్యాపారాభివృద్ధికి:-
సర్వ కళ్యాణ దాతరమ్ సర్వాపత్ నివారకమ్
అపార కరుణామూర్తిం ఆంజనేయం నమామ్యహమ్!

8::వివాహ ప్రాప్తికి:-
యోగి ధ్యే యాం ఘ్రి పద్మాయ జగతాం పతయేనమః
వివాహం కురమేదేవ రామదూత నమోస్తుతే!

ఈ శ్లోకాలను ఆయా కార్యసిద్ధిని కోరుకునేవారు 40 దినాలు నిష్ఠతో స్మరిస్తూ, ప్రతిరోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి శక్తికొద్దీ ప్రదక్షణా సంఖ్యా నియమాన్ని అనుసరించి ప్రదక్షణాలు చేసి ఆ స్వామిని పూజిస్తే తమ తమ కార్యాలలో విజేతలు అవుతారు.

Sunday, July 31, 2016

శ్రీ వెంకటేశ్వర మంగళాశాసనం



శ్రీ వెంకటేశ్వర మంగళాశాసనం

1::శ్రియ కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినామ్ 
శ్రీ వేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళమ్. 

2::లక్ష్మీత విభ్రమా లోక సుభ్రూవిభ్రమచక్షుషే
చక్షుషే సర్వలోకానాం వేంకటేశాయ మంగళమ్. 

3::శ్రీ వేంకటాద్రి శృంగాగ్ర మంగళాభరణాంఘ్రయే 
మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్. 

4::సర్వావయవ సౌందర్య సంపదా సర్వచేతసామ్ 
సదా సంమ్మోహనాయాస్తు వేంకటేశాయ మంగళమ్.

5::నిత్యాయ నిరవద్యాయ సత్యానంద చిదాత్మనే 
సర్వాంతరాత్మనే శ్రీమద్వేంకటేశాయ మంగళమ్. 

6::స్వతస్సర్వవిదే సర్వశక్తయే సర్వశేషినే 
సులభాయ సుశీలాయ వేంకటేశాయ మంగళమ్. 

7::పరస్త్మ బ్రాహ్మణే పూర్ణకామాయ పరమాత్మనే
ప్రయుంజే పరతత్త్వాయ వేంకటేశాయ మంగళమ్.

8::ఆకాలతత్వ మశ్రాంత మాత్మనా మనుపశ్యతాం 
అతృప్త్యమృతరూపాయ వేంకటేశాయ మంగళమ్.

9::ప్రాయః స్వచరణౌ పుంసాం శరణ్యత్వేన 
కృపయాదిశతే శ్రీమద్వేంకటేశాయ మంగళమ్. 

10::దయామృతతరంగిణ్యౌ స్తరంగైరివ శీతలైః 
అపాంగై స్సించతే విశ్వం వేంకటేశాయ మంగళమ్. 

11::స్రగ్భూషాంబర హేతీనాం సుషమావహ మూర్తయే 
సర్వార్తి శమనాయాస్తు వేంకటేశాయ మంగళమ్. 

12::శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే, 
రమయా రమమాణాయ వేంకటేశాయ మంగళమ్. (2 తిమెస్)

13::శ్రీమత్సుందరజామాతృముని మానసవాసినే
సర్వలోక నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్. 

14::మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమైః 
సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తూ మంగళమ్. 

Monday, June 13, 2016

నిత్యపారాయణ శ్లోకాలు


1::(నిద్రలేవగానే)
కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ 
కరమూలే స్థితాగౌరీ ప్రభాతే కరదర్శనమ్ 
సముద్ర వసనే దేవి పర్వతస్తన మండలే 
విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే 

2::ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ 
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః 

3::బ్రహ్మా మురారిస్త్రిపురాంతకారీ 
భానుశ్శశీ భూమిసుతో బుధశ్చ 
గురుశ్చ శుక్రః శని రాహుకేతవః 
కుర్వంతు సర్వే మమ సుప్రభాతమ్ 

4::కృష్ణాయ వాసుదేవాయ హరయేపరమాత్మనే 
ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమోనమః 

5::(స్నానం చేయునప్పుడు)
గంగే చ యమునే కృష్ణే గోదవరి సరస్వతి 
నర్మదే సింధు కావేర్యౌ జలేఽస్మిన్ సన్నిధిం కురు 
గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి 
ముచ్యతే సర్వ పాపాభ్యో విష్ణులోకం స గచ్ఛతి 
అంబ త్వద్దర్శనాన్ముక్తిః న జానే స్నానజం ఫలమ్
స్వర్గారోహణ సోపానం మహాపుణ్య తరంగిణీం 
వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికామ్ 
గంగే మాం పునీహి 

6::(సూర్యుని దర్శించునప్పుడు)
బ్రహ్మస్వరూపముదయే మధ్యాహ్నేతు మహేశ్వరమ్  
సాయం ధ్యాయేత్సదా విష్ణుం త్రిమూర్తిం చ దివాకరమ్  

7::(విదియ [ద్వితీయ] చంద్రుని దర్శించునప్పుడు)
క్షీరసాగర సంపన్న లక్ష్మీప్రియ సహోదర  
హిరణ్యమకుటాభాస్వద్బాలచంద్ర నమోఽస్తుతే  

8::(తులసీమాతకు నమస్కరిస్తూ)
యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః 
యదగ్రే సర్వవేదాశ్చ తులసి త్వాం నమామ్యహమ్  
నమస్తులసి కళ్యాణి నమో విష్ణుప్రియే శుభే  
నమో మోక్షప్రదే దేవి నమః సంపత్ప్రదాయిని 

9::(తులసి దళములు గ్రహించునప్పుడు)
తులస్యమృతజన్మాసి సదా త్వం కేశవప్రియే  
కేశవార్థం లునామి త్వా వరదా భవి శోభనే 

10::(అశ్వత్థవృక్షమునకు నమస్కరించునప్పుడు)
మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే  
అగ్రతః శివరూపాయ వృక్షరాజాయతే నమః  

11::(భోజనమునకు ముందు)
అహం వైశ్వానరోభూత్వా ప్రాణినాం దేహమాశ్రితః  
ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్  
బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతమ్  
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మసమాధినా  

12::(ఏకశ్లోకీ రామాయణం)
ఆదౌ రామ తపోవనాదిగమనం హత్వా మృగం కాంచనమ్  
వైదేహీ హరణం జటాయు మరణం సుగ్రీవ సంభాషణమ్  
వాలీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీదాహనమ్  
పశ్చాద్రావణకుంభకర్ణహననం చేతద్ధి రామాయణమ్  

13::(ఏకశ్లోకీ భాగవతం)
ఆదౌ దేవకిదేవి గర్భజననం గోపీ గృహేవర్ధనం 
మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణమ్  
కంసచ్ఛేదన కౌరవాది హననం కుంతీసుతాపాలనం  
హ్యేతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతమ్  

14::(ఏకశ్లోకీ భారతం)
ఆదౌ పాండవధార్తరాష్ట్రజననం లాక్షాగృహేదాహనం  
ద్యూతశ్రీహరణం వనే విచరణం మత్స్యాలయే వర్తనమ్  
లీలాగోగ్రహణం రణే విహరణం సంధిక్రియాజృంభణం  
భీష్మద్రోణసుయోధనాదిమథనం హ్యేతన్మహాభారతమ్  

15::(నాగస్తోత్రం)
నమస్తే దేవదేవేశ నమస్తే ధరణీధర  
నమస్తే సర్వనాగేంద్ర ఆదిశేష నమోఽస్తుతే  

16::(యజ్ఞేశ్వర ప్రార్థన)
నమస్తే యజ్ఞభోక్త్రే చ నమస్తే హవ్యవాహన  
నమస్తే వీతిహోత్రాయ సప్తజిహ్వాయ తే నమః  

17::(ఔషధమును సేవించునప్పుడు)
అచ్యుతానంద గోవింద నామోచ్ఛారణ భేషజాత్  
నశ్యంతి సకలా రోగాస్సత్యం సత్యం వదామ్యహమ్  
శరీరే జర్జరీ భూతే వ్యాధిగ్రస్తే కళేబరే  
ఔషధం జాహ్నవీతోయం వైద్యోనారాయణోహరిః  

18::(ప్రయాణమునకు బయలుదేరుచునప్పుడు)
యశ్శివోనామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా  
తయోస్సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళమ్  
నారాయణ నారాయణ నారాయణ  

19::(దీపం వెలిగించిన పిదప)
దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వ తమోఽపహమ్  
దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీప నమోఽస్తుతే 
శుభం కరోతు కళ్యాణమారోగ్యం సుఖసంపదమ్ 
శత్రుబుద్దివినాశం చ దీప జ్యోతిర్నమోఽస్తుతే  

20::(నిద్రకు ఉపక్రమించినపుడు)
రామం స్కందం హనూమంతం వైనతేయం వృకోదరమ్  
శయనే యః స్మరేన్నిత్యం దుఃస్వప్నం తస్య నశ్యతి  
అపరాధ సహస్రాణి క్రియంతేఽహర్నిశం మయా  
దాసోఽయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వర  
కార్పణ్యదోషోపహతస్వభావః
పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః  
యచ్ఛ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే
శిష్యస్తేఽహం శాధి మాం త్వాం ప్రపన్నమ్  

21::(చెడు కల వచ్చినప్పుడు)
బ్రహ్మాణం శంకరం విష్ణుం యమం రామం దనుం బలిమ్  
సప్తైతాన్ సంస్మరేన్నిత్యం దుఃస్వప్నం తస్య నశ్యతి  

22::(కలిదోష నివారణం)
కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య చ  
ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలినాశనమ్  

23::(శమీవృక్షమును దర్శించునప్పుడు)
శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశినీ  
అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ  

24::(దారిద్ర దుఃఖ నివారణకు)
దుర్గేస్మృతా హరసి భీతిమశేషజంతోః  
స్వస్థైఃస్మృతామతిమతీవ శుభాం దదాసి  
దారిద్ర్యదుఃఖభయహారిణి కా త్వదన్యా  
సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్తా  

25::(ఆపద నివారణకు)
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదామ్  
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ 

26::(కలికల్మషనాశన మహామంత్రము)
హరే రామ హరే రామ రామ రామ హరే హరే  
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే  

Friday, May 20, 2016

నరసింహ జయంతి


SRI ASTAMUKA GANDA BHERUNDA NARASIMHA SWAMI 

విష్ణుమూర్తి యొక్క దశావతారాలలోని 4వ అవతారమే నరసింహ స్వామి. 
నరసింహ జయంతి వైశాఖ శుక్ల చతుర్ధతి నాడు జరుపుకొంటారు. 
నరసింహ స్వామి ఎంతో శక్తివంతమైన భగవంతుడు.

నరసింహ జయంతి వృత్తాంతం:

నరసింహ స్వామి విష్ణుమూర్తి అవతారాలలో చాలా ముఖ్యమైన, శక్తివంతమైన అవతారం. 

నరసింహస్వామి శరీరం సగ భాగం మనిషి ఆకారం, సగ భాగం సింహ రూపంలో దర్శనమిస్తారు. హిరణ్యకశిపుడి వరాన్ని ఉద్దేశించి స్వామి ఈ రూపంలో అవతరించారని పురాణాల ప్రశస్తి.

హిందు పురాణాలలో పూర్వం కశ్యపుడనే ఒక మహర్షికి భార్య దితి, ఇద్దరు కుమారులు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అని ఉండేవారు. 

విష్ణుభగవానుడు లోకకళ్యాణార్ధం రాక్షసుడైన హిరణ్యాక్షుడుని సంహరించాడు. 

ఇది భరించలేని సోదరుడైన హిరణ్యకశిపుడు విష్ణుమూర్తితో వైరం పెంచుకున్నాడు. 

కోపోద్రిక్తుడైన హిరణ్యకశిపుడు తీవ్ర తపమొనర్చి బ్రహ్మను ప్రత్యక్షం గావించుకొన్నాడు. 

బ్రహ్మ వలన చావులేని వరం పొందిన హిరణ్యకశిపుడు అన్ని లోకాలను శాసించసాగాడు. 

దేవతలను, మునులను, ఋషులను బాధించసాగాడు. 

చివరకు దేవలోకంలో ఇంద్రునితో సహా అందరు నిస్సహాయ స్థితిలో రాక్షసుల ఆగడాలను భరించసాగారు.

ఆ సమయంలో హిరణ్యకశిపుని భార్య కయధు మగపిల్లవాడు ప్రహ్లాదుడికి జన్మనిచ్చింది. 

ఆ పిల్లవాడికి ఈ రాక్షస ప్రవృత్తులు ఏమే అంటలేదు. అతడు పూర్తిగా విష్ణుమూర్తి భక్తుడయ్యాడు

హిరణ్యకశిపుడు శతవిధాల ప్రహ్లాదుని విష్ణుభక్తి నుండి మరల్చుదామని ప్రయత్నించాడు. 

ఎన్నిమార్లు ప్రయత్నించిన విఫలమౌతూనే ఉన్నాడు. 

తండ్రి ప్రయత్నిస్తున్నకొద్దీ ప్రహ్లాదునిలో భక్తి మరింత ఎక్కువ కాసాగింది. 

ప్రహ్లాదుని మృత్యువు వరకు తీసుకువెళ్లినా అతనిలో ఏమార్పూ లేదు. 

విషప్రయోగం చేసినా, ఏనుగులతో తొక్కించినా లోయలో పడవేసినా ఎప్పటికప్పుడు విష్ణుమూర్తి రక్షిస్తు ఉండేవాడు.

ప్రహ్లాదుని నారాయణ మంత్రం విన్నమాత్రంతొ క్రుద్ధుడై తన కుమారుని పరిపరివిధాల మృత్యు సమీపానికి దండించే నిమిత్తం శిక్షలు వేయసాగాడు. 

ఇక విసిగిపోయిన హిరణ్యకశిపుడు నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడో చెప్పమంటాడు. 
ఇందుగలడని అందు లేడని సందేహము వలదు, ఎందెందు వెదికిన అందందే కలడు నా శ్రీహరి అని శలవిస్తాడు ప్రహ్లాదుడు. 

దానితో మరింత ఆగ్రహావేశాలకు లోనయి ఉన్న హిరణ్యకశిపుడు ఐతే ఈ స్థంభంలో ఉంటాడా నీ శ్రీ హరి అని ఒక్కపెట్టున ఆ స్థంభాన్ని తన గదతో పడగొడతాడు.

అంతే భయంకరాకారుడై, తల సింహం రూపంలో మొండెం మనిషి ఆకారంలో గర్జిస్తూ ఒక్క ఉదుటున ఆ రాక్షసుడిని తన తొడలమీద పరుండబెట్టి ఆయన వాడి గోళ్లతో అతని వక్షస్థలాన్ని చీల్చి చెండాడి హిరణ్యకశిపుడిని అంతమొందిస్తాడు. 

ప్రహ్లాదుని ఆశీర్వదించి ఎవరైతే ఈ రోజున నా నామసంకీర్తనతో ఉపవసించి ఉంటారో వారి సమస్యలు, బాధలు తొలగిపోతాయి అని శలవిస్తారు.కావున ఈ శుభదినాన్ని మనం అందరం నరసింహజయంతిగా జరుపుకుంటున్నాము.

ఈ రోజున స్వామివారి శాంతి కొరకు పానకం నివేదించడం ఆనవాయితీగా వస్తోంది. 

మనం భగవంతుడికి పండ్లు, పూలు, దక్షిణ తాంబూలాలను భక్తి తో సమర్పించుకోవాలి.

మనం ఎంత సమర్పించాము, ఏమి సమర్పించాము అనే లౌకికమైన భావనలకంటే ముఖ్యమైనది మన హృదయాంజలి. 

మనసా, వాచా, కర్మణా స్వామికి ఏకాగ్ర చిత్తంతో ఆత్మ నివేదనను మించిన పూజ లేదు.

1:::ఉగ్రంవీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం
నృసింహ భీషణం భద్రం మృత్యు మృత్యుం నమామ్యహం.

2:::నృం నృం నృం నరసింహాయ నమహా

ఈ మంత్రాలు పఠించడం వలన మనిషి తన బాధలనుండి విముక్తి గావింపబడి విష్ణు సాయుజ్యాన్ని పొందుతారు.

Monday, April 25, 2016

నారాయణ స్తోత్రం :::రేవతి::రాగం




రేవతి::రాగం 
రచన::ఆది శంకరాచార్య
{హిందుస్తాని రాగ బైరాగి}

1::నారాయణ నారాయణ జయ గోవింద హరే గోవింద హరే
నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే 

నారాయణ నారాయణ జయ గోవింద హరే గోవింద హరే
నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే 

2::కరుణాపారావార వరుణాలయగంభీర నారాయణ  
ఘననీరదసంకాశ కృతకలికల్మషనాశన నారాయణ||నా||  

3::యమునాతీరవిహార ధృతకౌస్తుభమణిహార నారాయణ  
పీతాంబరపరిధాన సురకళ్యాణనిధాన నారాయణ ||నా||  

4::మంజులగుంజాభూష మాయామానుషవేష నారాయణ  
రాధాధరమధురసిక రజనీకర కులతిలక నారాయణ ||నా||  

5::మురళీగానవినోద వేదస్తుతభూపాద నారాయణ
వారిజభూషాభరణ రాజీవరుక్మిణీరమణ నారాయణ ||నా||  

6:: జలరుహదళనిభనేత్ర జగదారంభకసూత్ర నారాయణ  
పాతకరజనీసంహార కరుణాలయ మాముద్ధర నారాయణ ||నా||  

7::అఘబకహయకంసారే కేశవ కృష్ణ మురారే నారాయణ  
హాటకనిభపీతాంబర అభయం కురు మే మావర నారాయణ ||నా||   

8::దశరథరాజకుమార దానవమదసంహార నారాయణ   
గోవర్ధనగిరి రమణ గోపీమానసహరణ నారాయణ ||నా||  

9::సరయుతీరవిహార సజ్జనఋషిమందార నారాయణ 
విశ్వామిత్రమఖత్ర వివిధవరానుచరిత్ర నారాయణ  ||నా|| 

10::ధ్వజవజ్రాంకుశపాద ధరణీసుతసహమోద నారాయణ 
జనకసుతాప్రతిపాల జయ జయ సంస్మృతిలీల నారాయణ ||నా|| 

11::దశరథవాగ్ధృతిభార దండక వనసంచార నారాయణ 
ముష్టికచాణూరసంహార మునిమానసవిహార నారాయణ ||నా|| 

12::వాలివినిగ్రహశౌర్య వరసుగ్రీవహితార్య నారాయణ 
శ్రీ మురళీకర ధీవర పాలయ పాలయ శ్రీధర నారాయణ ||నా||  

13::జలనిధి బంధన ధీర రావణకంఠవిదార నారాయణ 
తాటకమర్దన రామ నటగుణవివిధ సురామ నారాయణ ||నా||  

14::గౌతమపత్నీపూజన కరుణాఘనావలోకన నారాయణ 
సంభ్రమసీతాహార సాకేతపురవిహార నారాయణ ||నా|| 

15::అచలోద్ధృతచంచత్కర భక్తానుగ్రహతత్పర నారాయణ 
నైగమగానవినోద రక్షిత సుప్రహ్లాద నారాయణ ||నా||  


ఇతి శ్రీమత్ శంకరాచార్య విరచిత నారాయణస్తోత్రం సంపూర్ణం 

1::నారాయణ నారాయణ జయ గోవింద హరే 
నారాయణ నారాయణ జయ గోపాల హరే 

2::కరుణాపారావార వరుణాలయగంభీర నారాయణ 
ఘననీరదసంకాశ కృతకలికల్మషనాశన నారాయణ  

3::యమునాతీరవిహార ధృతకౌస్తుభమణిహార నారాయణ  
పీతాంబరపరిధాన సురకళ్యాణనిధాన నారాయణ  

4::మంజులగుంజాభూష మాయామానుషవేష నారాయణ  
రాధాధరమధురసిక రజనీకరకులతిలక నారాయణ  

5::మురళీగానవినోద వేదస్తుతభూపాద నారాయణ  
బర్హినిబర్హాపీడ నటనాటకఫణిక్రీడ నారాయణ  

6::వారిజభూషాభరణ రాజీవరుక్మిణీరమణ నారాయణ 
జలరుహదళనిభనేత్ర జగదారంభకసూత్ర నారాయణ  

7::పాతకరజనీసంహార కరుణాలయ మాముద్ధర నారాయణ 
అఘ బకహయకంసారే కేశవ కృష్ణ మురారే నారాయణ  

8::హాటకనిభపీతాంబర అభయం కురు మే మావర నారాయణ  
దశరథరాజకుమార దానవమదసంహార నారాయణ 

9::గోవర్ధనగిరి రమణ గోపీమానసహరణ నారాయణ  
సరయుతీరవిహార సజ్జన‌ఋషిమందార నారాయణ  

10::విశ్వామిత్రమఖత్ర వివిధవరానుచరిత్ర నారాయణ  
ధ్వజవజ్రాంకుశపాద ధరణీసుతసహమోద నారాయణ  

11::జనకసుతాప్రతిపాల జయ జయ సంస్మృతిలీల నారాయణ  
దశరథవాగ్ధృతిభార దండక వనసంచార నారాయణ  

12::ముష్టికచాణూరసంహార మునిమానసవిహార నారాయణ 
వాలివినిగ్రహశౌర్య వరసుగ్రీవహితార్య నారాయణ  

13::మాం మురళీకర ధీవర పాలయ పాలయ శ్రీధర నారాయణ  
జలనిధి బంధన ధీర రావణకంఠవిదార నారాయణ 

14::తాటకమర్దన రామ నటగుణవివిధ సురామ నారాయణ 
గౌతమపత్నీపూజన కరుణాఘనావలోకన నారాయణ  

15::సంభ్రమసీతాహార సాకేతపురవిహార నారాయణ  
అచలోద్ధృతచంచత్కర భక్తానుగ్రహతత్పర నారాయణ  

16::నైగమగానవినోద రక్షిత సుప్రహ్లాద నారాయణ  
భారత యతవరశంకర నామామృతమఖిలాంతర నారాయణ  

 Revati Raga
Sankaraachaarya::rachana
(Hindustaani Raga Bairagi)

nārāyaṇa nārāyaṇa jaya govinda hare  
nārāyaṇa nārāyaṇa jaya gopāla hare  

1::karuṇāpārāvāra varuṇālayagambhīra nārāyaṇa  
ghananīradasaṅkāśa kṛtakalikalmaṣanāśana nārāyaṇa  

2::yamunātīravihāra dhṛtakaustubhamaṇihāra nārāyaṇa  
pītāmbaraparidhāna surakaḷyāṇanidhāna nārāyaṇa  

3::mañjulaguñjābhūṣa māyāmānuṣaveṣa nārāyaṇa  
rādhādharamadhurasika rajanīkarakulatilaka nārāyaṇa  

4::muraḷīgānavinoda vedastutabhūpāda nārāyaṇa  
barhinibarhāpīḍa naṭanāṭakaphaṇikrīḍa nārāyaṇa  

5::vārijabhūṣābharaṇa rājīvarukmiṇīramaṇa nārāyaṇa  
jalaruhadaḷanibhanetra jagadārambhakasūtra nārāyaṇa  

6::pātakarajanīsaṃhāra karuṇālaya māmuddhara nārāyaṇa  
agha bakahayakaṃsāre keśava kṛṣṇa murāre nārāyaṇa  

7::hāṭakanibhapītāmbara abhayaṃ kuru me māvara nārāyaṇa  
daśaratharājakumāra dānavamadasaṃhāra nārāyaṇa  

8::govardhanagiri ramaṇa gopīmānasaharaṇa nārāyaṇa  
sarayutīravihāra sajjana--ṛṣimandāra nārāyaṇa  

9::viśvāmitramakhatra vividhavarānucaritra nārāyaṇa  
dhvajavajrāṅkuśapāda dharaṇīsutasahamoda nārāyaṇa  

10::janakasutāpratipāla jaya jaya saṃsmṛtilīla nārāyaṇa  
daśarathavāgdhṛtibhāra daṇḍaka vanasañcāra nārāyaṇa  

11::muṣṭikacāṇūrasaṃhāra munimānasavihāra nārāyaṇa  
vālivinigrahaśaurya varasugrīvahitārya nārāyaṇa  

12::māṃ muraḷīkara dhīvara pālaya pālaya śrīdhara nārāyaṇa  
jalanidhi bandhana dhīra rāvaṇakaṇṭhavidāra nārāyaṇa  

13::tāṭakamardana rāma naṭaguṇavividha surāma nārāyaṇa  
gautamapatnīpūjana karuṇāghanāvalokana nārāyaṇa  

14::sambhramasītāhāra sāketapuravihāra nārāyaṇa  
acaloddhṛtacañcatkara bhaktānugrahatatpara nārāyaṇa  

15::naigamagānavinoda rakṣita suprahlāda nārāyaṇa  
bhārata yatavaraśaṅkara nāmāmṛtamakhilāntara nārāyaṇa  

Wednesday, April 13, 2016

మూడు తొండాల గణపతి


అరుదైన విగ్రహం - మూడు తొండాల గణపతి
ఏ పని మొదలుపెట్టాలన్నాముందుగా మనం పూజించేది ఆ గణనాథుడిని. ఏకదంతుడిగా ప్రసిద్ధి చెందిన ఆ వినాయకుడికి మూడు తొండాలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా, నమ్మాలి మరి. ఇలా మూడు తొండాలున్న త్రిసూంద్ గణపతిని చూడాలంటే మనం పూనేలో ఉన్న సోమ్వర్ పేట్ జిల్లాకి వెళ్ళాల్సిందే. ఈ ప్రాంతంలో ఉన్న నజగిరి అనే నదీ తీరంలో ఉంది ఈ త్రిసూంద్ గణపతి దేవాలయం. 

భీమజీగిరి గోసవి అనే వ్యక్తీ ఈ ఆలయాన్ని 1754లో మొదలుపెట్టారట. పదహారు సంవత్సరాల నిర్మాణం తరువాత 1770లో గణపతిని ప్రతిష్టించారు. ఇక్కడి గర్భగుడి గోడల మీద మూడు శాసనాలు చెక్కబడి ఉన్నాయట. రెండు శాసనాలు సంస్కృతంలో ఉంటే మూడోది పెర్షియన్ భాషలో ఉందట. ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఆలయంలోని వినాయకుడికి మూడు తొండాలు, ఆరు చేతులు ఉండి స్వామి నెమలి వాహనంపై ఆశీనుడై ఉంటాడట. 

ఆలయ ప్రవేశ ద్వారం దగ్గర ఉన్న ద్వారపాలకుల విగ్రహాలు ఎంతో అందంగా చెక్కబడి ఉంటాయి. ఆలయంప్రాంగణంలో కూడా అనేక దేవతా విగ్రహాలు, ఏనుగులు, గుర్రాలు మొదలైన జంతువుల విగ్రహాలు శోభాయమానంగా కనపడతాయి. ఎక్కడా లేని మరొక వింత ఈ ఆలయంలో ఒక గోడ మీద అమెరికన్ సైనికుడు ఖడ్గ మృగాన్ని ఇనప చైనులతో కడుతున్నట్టుగా ఉండే విగ్రహం. ఇలాంటి విగ్రహాలు మన దేశంలో మరెక్కడా చూడలేము. అలాగే ఆలయాన్ని నిర్మించిన గోసవి మహాశయుడి సమాధి కూడా ఆ ఆలయ ప్రాంగణంలో ఉండటం ఇంకో విశేషం. ఆలయం క్రింద భాగంలో నీరు నిలవ ఉండే విధంగా కొలనులాంటిది కట్టారు. ఎప్పుడూ నీటితో ఉండే ఆ కొలనుని గురుపూర్ణిమ రోజు నీరంతా ఖాళీ చేసి పొడిగా ఉంచుతారు. ఆ రోజు అక్కడివారు తమ గురువుగా భావించే ఆలయ నిర్మాణకర్త గోసవికి పూజలు నిర్వహిస్తారు.

ఈ ఆలయంలో సంకటహర చతుర్థిని ఎంతో ఘనంగా నిర్వహించే ఆచారం ఎప్పటి నుంచో కొనసాగుతూ వస్తోందిట. నెలలో ఆ ఒక్క రోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కూడా. ఇక వినాయక చవితి ఉత్సవాలు ఇంకెంత ఘనంగా జరుగుతాయో వేరే చెప్పకర్లెద్దు. తొమ్మిది రోజులు పూనే చుట్టుపక్కల ఉన్న ఊరుల నుంచి భక్తులు వచ్చి ఇక్కడ విశేష పూజలు నిర్వహిస్తారట. రాజస్థాని, మాల్వా మాదిరి శిల్పకళ ఉట్టిపడే ఈ ఆలయాన్ని ప్రస్తుతం ఒక ట్రస్ట్ నడిపిస్తోందని చెపుతున్నారు ఇక్కడి అధికారులు
teluguone.com nundi sekarana

Tuesday, March 15, 2016

ఓం దుర్గాదేవి నమోనమః ___/\___



ఎవరైతే ఈ నామాలను రోజూ పఠిస్తారో  వారికి కోరిన కోర్కెలు తప్పక నెరవేరుతాయి..ఇది సత్యం

1::ఓమ్ శ్రీమాతా బాలత్రిపురసుందరీ నమోనమః
2::ఓమ్ శ్రీమాతా గాయత్రీదేవి నమోనమః
3::ఓమ్ శ్రీమాతా అన్నపూర్ణేశ్వరీ నమోనమః
4::ఓమ్ శ్రీమాతా లలితాదేవి నమోనమః
5::ఓమ్ శ్రీమాతా లక్ష్మీదేవి నమోనమః 
6::ఓమ్ శ్రీమాతా సరస్వతీదేవి నమోనమః  
7::ఓమ్ శ్రీమాతా దుర్గాదేవి నమోనమః 
8::ఓమ్ శ్రీమాతా మహిషాసురమర్ధిని నమోనమః  
9::ఓమ్ శ్రీమాతా రాజరాజేశ్వరీ నమోనమః 
10:ఓమ్ శ్రీమాతా చండికాదేవి నమోనమః 
11:ఓమ్ శ్రీమాతా కాళికాదేవి నమోనమః
12:ఓమ్ శ్రీమాతా ప్రళయబంధినీ దుర్గ నమోనమః 
13:ఓమ్ శ్రీమాతా చాముండేశ్వరీదేవి నమోనమః 
14:ఓమ్ శ్రీమాతా పరాశక్తి దేవీ నమోనమః 
15:ఓమ్ శ్రీమాతా సర్వదేవతా స్వరూపిణి నమోనమః
16:ఓమ్ శ్రీమాతా విజయేశ్వరీదేవి నమోనమః  
17:ఓమ్ శ్రీమాతా విశాలాక్షీ నమోనమః     
18:ఓమ్ శ్రీమాతా అన్నాదేవి నమోనమః
19:ఓమ్ శ్రీమాతా పార్వతిదేవి నమోనమః
20:ఓమ్ శ్రీమాతా శూలినై నమోనమః
21:ఓమ్ శ్రీమాతా మూకాంబికే నమోనమః
22:ఓమ్ శ్రీమాతా సతీదేవి నమోనమః 
23:ఓమ్ శ్రీమాతా పద్మవతిదేవి నమోనమః
24:ఓమ్ శ్రీమాతా అంబికాదేవి నమోనమః 
25:ఓమ్ శ్రీమాతా పరమేశ్వరీదేవి నమోనమః 
26:ఓమ్ శ్రీమాతా మహాగౌరీదేవి నమోనమః
27:ఓమ్ శ్రీమాతా భైరవిదేవి నమోనమః 
28:ఓమ్ శ్రీమాతా రుద్రప్రియదేవి నమోనమః  







మాతా దుర్గాదేవి మంత్రం 
 దేవీ మహాత్మ్యమ్ దుర్గా సప్తశతి చతుర్థో‌అధ్యాయంలోని స్తోత్రాలు 

ఈ మంత్రాన్ని పగలు..రాత్రి..108సార్లు ఏకదీక్షగా చదువుతారో
వారికి నెరవేరని పనంటులేదు నమ్మకము చాలా ముఖ్యము  
ఆరోగ్యం ఐశ్వర్యానికి కావలసిన మంత్రం ...ఓం శ్రీమాతా నమోనమః 
   
1::శూలేన పాహి నో దేవి పాహి ఖడ్గేన చాంభికే |
ఘంటాస్వనేన నః పాహి చాపజ్యానిస్వనేన చ ||24||Slokam

2::దేహి సౌభాగ్యం ఆరోగ్యం దేహి మే పరమం సుఖం 
రూపం దేహి జయం దేహి యషే దేహి ద్విషే జహి |  


  

Wednesday, March 9, 2016

కాశీఖండాంతర్గత సూర్యస్తుతి


1::ఓం హంసాయ నమః 
2::ఓం భానవే నమః
3::ఓం సహశ్రాంశవే నమః
4::ఓం తపనాయ నమః
5::ఓం తాపనాయ నమః
6::ఓం రవయే నమః 
7::ఓం వికర్తనాయ నమః
8::ఓం వివస్వతే నమః 
9::ఓం విశ్వ కర్మణే నమః 
10:ఓం విభావసవే నమః 

11:ఓం విశ్వ రూపాయ నమః 
12:ఓం విశ్వ కర్త్రే నమః
13:ఓం మార్తాండాయ నమః 
14:ఓం మిహిరాయ నమః 
15:ఓం అంశు మతే నమః 
16:ఓం ఆదిత్యాయ నమః 
17:ఓం ఉష్ణగవే నమః 
18:ఓం సూర్యాయ నమః 
19:ఓం ఆర్యంణే నమః 
20:ఓం బ్రద్నాయ నమః 
21:ఓం దివాకరాయ నమః 
22:ఓం ద్వాదశాత్మనే నమః
23:ఓం సప్తహయాయ నమః 
24:ఓం భాస్కరాయ నమః 
25::ఓం అహస్కరాయ నమః 
26:ఓం ఖగాయ నమః 
27:ఓం సూరాయ నమః 
28:ఓం ప్రభాకరాయ నమః 
29:ఓం లోక చక్షుషే నమః 
30:ఓం గ్రహేస్వరాయ నమః 
31:ఓం త్రిలోకేశాయ నమః 
32:ఓం లోక సాక్షిణే నమః 
33:ఓం తమోరయే నమః 
34:ఓం శాశ్వతాయ నమః 
35:ఓం శుచయే నమః 
36:ఓం గభస్తి హస్తాయ నమః 
37:ఓం తీవ్రాంశయే నమః 
38:ఓం తరణయే నమః 
39:ఓం సుమహసే నమః 
40:ఓం అరణయే నమః 
41:ఓం ద్యుమణయే నమః 
42:ఓం హరిదశ్వాయ నమః 
43:ఓం అర్కాయ నమః 
44:ఓం భానుమతే నమః 
45:ఓం భయ నాశనాయ నమః 
46:ఓం చందోశ్వాయ నమః 
47:ఓం వేద వేద్యాయ నమః 
48:ఓం భాస్వతే నమః 
49:ఓం పూష్ణే నమః 
50:ఓం వృషా కపయే నమః 
51:ఓం ఏక చక్ర ధరాయ నమః 
52:ఓం మిత్రాయ నమః 
53:ఓం మందేహారయే నమః 
54:ఓం తమిస్రఘ్నే నమః 
55:ఓం దైత్యఘ్నే నమః 
56:ఓం పాప హర్త్రే నమః 
57:ఓం ధర్మాయ నమః 
58:ఓం ధర్మ ప్రకాశకాయ నమః 
59:ఓం హేలికాయ నమః 
60:ఓం చిత్ర భానవే నమః 
61:ఓం కలిఘ్నాయ నమః 
62:ఓం తాక్ష్య వాహనాయ నమః 
63:ఓం దిక్పతయే నమః 
64:ఓం పద్మినీ నాధాయ నమః 
65:ఓం కుశేశయ నమః 
66:ఓం హరయే నమః 
67:ఓం ఘర్మ రశ్మయే నమః 
68:ఓం దుర్నిరీక్ష్యాయ నమః 
69:ఓం చండాశవే నమః 
70:ఓం కశ్యపాత్మజాయ నమః

Monday, March 7, 2016

మహాశివరాత్రి మహాత్యం




శివరాత్రి పర్వదినానికి ఎంతటి మహాత్మ్యం ఉందో తెలియచెప్పే కథ ఇది. శక్తి ఉన్నవారు, పండితులు శాస్త్రబద్ధంగా వ్రతాలు, పూజలు శివరాత్రినాడు చేసి పుణ్యఫలం పొందుతుంటారు. మరి అలాంటివేవీ లేని సామాన్యుల పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్నకు సమాధానం కూడా ఈ కథాంశంలో దొరుకుతుంది. బిల్వ దళార్చన, జలాభిషేకం అంటే శివుడికి ఎంత ప్రీతో కూడా ఇక్కడ అవగతమవుతుంది. ఇంకా విచిత్రమేమిటంటే ఈ కథంతా ఓ ఆటవికుడు, ఓ మూడు లేళ్ళ నడుమ జరిగింది కావటం. శివపురాణం కోటి రుద్రసహిత నలభయ్యో అధ్యాయంలో ఈ కథ ఉంది.

పూర్వం ఓ అడవిలో ఓ వేటగాడు ఉండేవాడు. అడవిలో ఉన్న జంతువులను సంహరిస్తూ తన కుటుంబాన్ని పోషించుకోవటమే అతని పని. అతను చిన్నప్పటి నుంచి ఒక్క పుణ్యకార్యమూ చేయలేదు. దాదాపు అడవిలో ఉన్న జంతువులన్నింటినీ తన కుటుంబ పోషణ కోసమే బలిపెట్టాడు ఆ భిల్లుడు. ఇలా ఉండగా ఓ రోజున అతడి తల్లి,తండ్రి, భార్య ఇంట్లో తినటానికి ఏమీ లేదని, ఆహారంగా ఏ జంతువునైనా చంపి తెమ్మనమని కోరారు. తన కుటుంబ సభ్యుల ఆకలిని తీర్చటం కోసం విల్లు, అమ్ములు తీసుకొని అడవిలోకి బయలుదేరి వెళ్ళాడు ఆ భిల్లుడు. ఆ రోజున ఎంతసేపు వెతికినా ఒక్క జంతువూ అతని కంట పడలేదు. అలా సూర్యాస్తమయం కావటం, ఇంకా చీకటి పడటం జరిగింది. ఎలాగైనా సరే ఒక్క మృగాన్నైనా వేటాడి కానీ ఇంటికి వెళ్ళకూడదనుకున్నాడు. ఓ పక్క ఆకలి, మరో పక్క ఏ జంతువూ దొరకలేదన్న కోపమూ, బాధ వెంటాడసాగాయి. ఇంతలో అతనికి ఒక మారేడు చెట్టు కనిపించింది. ఆ చెట్టు సమీపంలోనే ఒక నీటి మడుగు కూడా ఉంది. 

భిల్లుడి మనస్సులో తళుక్కున ఆలోచన ఒకటి మెదిలింది. మడుగులో ఉన్న నీళ్ళు తాగటానికి ఏదో ఒక జంతువు అటు వచ్చి తీరుతుంది కనుక వెంటనే మారేడు చెట్టు పైకెక్కి ఓ కొమ్మ మీద నక్కి కూర్చొని అటొచ్చిన జంతువును వేటాడవచ్చని అనుకొన్నాడు. వెంటనే తనతో తెచ్చుకున్న తాబేటి కాయ (మంచినీరు తెచ్చుకొనే పాత్ర)లోమడుగులో ఉన్న నీరు నింపుకొని మారేడు చెట్టు కొమ్మ పైకి ఎక్కి కూర్చొన్నాడు. దైవలీలగానో, విచిత్రంగానో ఆ చెట్టు కిందే అంతకు ముందు ఎవరో ఉంచిన ఓ శివలింగం ఉంది. ఆ రాత్రి తొలిజాము గడుస్తుండగా అతని నిరీక్షణ ఫలించింది. ఒక లేడి మడుగులో నీరు తాగటానికి వచ్చింది. లేడి కన్పించిదన్న ఆనందంలో విల్లును, బాణాన్ని సిద్ధం చేస్తుండగా చెట్టుకున్న నాలుగు మారేడు దళాలు, తాబేటి కాయలో ఉన్న నీరు చెట్టు కింద ఉన్న శివలింగం మీద పడ్డాయి.

ఆ రోజు శివరాత్రి అని అతనికి తెలియకపోయినా అనుకోకుండానైనా శివలింగం మీద మారేడు దళాలను ఉంచి పూజించిన ఫలితం, శివలింగానికి జలాభిషేకం చేసిన పుణ్యఫలితం వెంటనే వేటగాడికి ప్రాప్తించాయి. దాంతో తెలియకుండానే అతనిలో ఉన్న క్రూరత్వం చాలా వరకు నశించింది. తనపై బాణాన్ని సంధించబోతున్న ఆ బోయతో ఆ ఆడ లేడి ఏమి చెయ్యబోతున్నాడో చెప్పమని బోయవాడిని అడిగింది. ఆ బోయ కూడా అసత్యమాడకుండా లేడిన చంపి తనకు, తన కుటుంబానికి ఆహారంగా వినియోగించబోతున్నట్లు చెప్పాడు. అప్పుడు ఆ లేడి ఇతరులకు ఉపయోగపడబోతున్నందుకు తనకెంతో ఆనందంగా ఉందని, అయితే ఇంటి దగ్గర తన పసిపిల్లలున్నారని, వారిని తన సోదరికి, తన భర్తకు అప్పగించి వస్తానని అంది. 

బోయవాడు ముందు ఆ మాటలు వినలేదు కానీ ఆ తర్వాత లేడి చేసిన శపథాలను విని దాన్ని వెళ్ళి రమ్మనమని చెప్పాడు. ఇదంతా జరిగేసరికి శివరాత్రి నాడు మొదటి జాము ముగిసింది. బోయ మళ్ళీ చెట్టెక్కి అంతకు ముందు లాగానే జంతువుల కోసం ఎదురు చూడసాగాడు. ఇంతలో మరొక ఆడ లేడి వచ్చింది. దాన్ని వేటాడబోతుండగా మళ్ళీ కాసిని మారేడు ఆకులు, చంకకు తగిలించుకున్న తాబేటి కాయ నుండి కాసిని నీళ్ళు చెట్టుకింద ఉన్న శివలింగం మీద పడ్డాయి. రెండో లేడి కూడా వేటగాడిని నన్నేం చేయబోతున్నావు అని అడిగింది. అతను మొదటి లేడికి చెప్పినట్టే చెప్పాడు. అప్పుడు ఆ లేడి కూడా ఇంటి దగ్గర తన భర్త, పిల్లలు ఉన్నారని, అంతకు ముందే తన సోదరి బయటకు వచ్చి ఎంతకూ ఇంటికి తిరిగి రాకపోవటంతో ఆమెను వెతుకుతూ తాను వచ్చానని అంది. పిల్లలను భర్తకు, సోదరికి అప్పగించి తాను వస్తానని అప్పుడు ఆహారంగా స్వీకరించమని చెప్పింది. నమ్మకమేమిటి అని లేడిని అతను ప్రశించాడు. అది కూడా సత్య శపథాలు చేసింది. 

శివలింగానికి మారేడు దళాలు, జలాభిషేకంతో అతని క్రూరత్వం అంతా నశించినందు వల్ల లేడిని వెళ్ళి రమ్మన్నాడు. అప్పటికి రెండో జాము ముగిసింది. మూడో జాములో ఒక మగ లేడి అటుగా వచ్చింది. దాన్ని వేటాడాలని అనుకున్నంతలో అతని కదలికలకు కాసిని మారేడు దళాలు, కాసిని నీరు మళ్లీ శివలింగం మీద పడ్డాయి. మగ లేడి కూడా అతనితో పరులకు ఉపయోగపడటం కన్నా ఈ శరీరానికి కావలసినది ఏమిటి? అయితే ఇంటి దగ్గర ఇద్దరు భార్యలు, పిల్లలు ఉన్నారని, భార్యలకు పిల్లల బాధ్యతలను అప్పగించి తాను తిరిగొస్తానని చెప్పింది. ఆ వేటగాడు సత్యభూషణం మీద నమ్మకంతో వెళ్ళి రమ్మన్నాడు. మూడు లేళ్ళు ఒక చోట చేరి బోయవాడి సంగతి ముచ్చటించుకుంటున్నాయి. అవి నేనంటే నేనే ముందు వెళతానని బోయవాడికిచ్చిన మాటను తప్పడం బాగుండదని వాటిలో అవి వాదించుకున్నాయి. చివరకు మూడు లేళ్ళూ తమ పిల్లలను పొరుగు లేళ్ళకు అప్పగించి వాటిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వేటగాడికిచ్చిన మాటను నిలబెట్టుకోవటానికి బయులుదేరాయి. తమ తండ్రి, తల్లులు ఇచ్చిన మాట నిలబెట్టుకోవటానికి ప్రాణాలను సైతం లెక్కచేయక పోవటాన్ని చూసిన పిల్లలు అంతటి ఉత్తములైన ఆ పెద్దల బాటలోనే నడవాలని నిశ్చయించుకొని అవి కూడా బయులుదేరాయి. అలా ఆ లేళ్ళన్నీ మాట నిలుపుకోవటానికి పిల్లలతో సహా తరలి రావటాన్ని చూసిన వేటగాడికి మనస్సు చలించిపోయింది. 

జంతు జన్మనెత్తిన వాటికి సత్యవాక్యాన్ని పాలించే అంత గొప్ప మనస్సుంటే మనిషిగా పుట్టిఇన్నాళ్ళూ తాను హింస చేస్తూ బతుకుతున్నందుకు వాడికి పశ్చాత్తాపం కలిగింది. వాటిని ఆదరించి తిరిగి వెళ్ళిపోమ్మని చెప్పాడు. బోయవాడిలో కలిగిన ఆ మంచి మార్పు, ఆ రాత్రి ప్రతి జాములోనూ చేసిన మారేడు దళాల పూజ, జలాభిషేకం, జాగారం, ఉపవాసం ఇవన్నీ శివుడికి ప్రీతి కలిగించి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. మరుసటి జన్మలో ఆ భిల్లుడు గుహుడు అనే పేరున జన్మించి దశరథ మహారాజు కుమారుడైన శ్రీ రామచంద్రుడికి సేవ చేసే భాగ్యాన్ని పొందుతాడని శివుడు వరమిచ్చాడు. అలాగే బోయవాడికి కన్పించిన లేళ్ళు కూడా సత్యాన్ని పాలించినందుకు మోక్షాన్ని పొందుతాయని శివుడు చెప్పాడు. ఆనాడిక్కడ ప్రత్యక్షమైన శివుడే వ్యాదేశ్వరుడు అనే శివలింగంగా అవతరించాడు. సంస్కృతంలో వ్యాద శబ్దానికి తెలుగులో బోయ అని అర్థం. 

ఈ కథలో శివరాత్రి మహాత్య్మం మారేడు దళాల పూజ, జలాభిషేకం వ్యాదేశ్వర అవతారం ఇవన్నీ అటుంచిన ఓ గొప్ప సందేశం ఉంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవటంలో ఉన్న గొప్పతనం, తల్లిదండ్రులు ఎంత నీతి, నిజాయితీలతో ఉంటే పిల్లలు కూడా అదే బాటలో నడుస్తారని చెప్పే సందేహాలు ఇమిడి ఉన్నాయి. వీటిని గమనించి ఆచరిస్తే గొప్ప పుణ్యఫలందక్కినట్టే అవుతుంది. అసలు మన పండుగలు, పర్వదినాలు, వ్రతాలు కథలలోని గొప్ప అంతరార్థం ఇదే
Rachana::Harikrishna Harikrishna