Wednesday, January 28, 2015

ఆదిత్య హృదయం










ప్రాథన___/\___
ఓం ఆకృష్ణేన  రజసార్తమానో
నివేశయన్నఘృతం మర్త్వంచ హిరణ్యయేన
సవితారధేనా దేవోయాత భువనాని పశ్యస్
స్తోత్రం ఆదిత్య

తతో యుద్దపరిశ్రాంతం 
సమరే చింతయా స్థితమ్‌
రావణం చాగ్రతో దృష్వా 
యుద్దాయ సముపస్థితమ్‌.1

దైవతై శ్చ సమాగమ్య 
ద్రష్టు మభ్యాగతో రణమ్‌
ఉపాగమ్యాబ్రవీద్రామం 
అగస్త్యో భగవాన్ ఋషి: 2

రామ! రామ! మహా్బాహొ 
శృణు గుహ్యం సనాతనమ్‌
యేన సర్వా నరీన్‌ వత్స
సమరే విజయిష్యసి.  3

ఆదిత్యహృదయం పుణ్యం 
సర్వశత్రు వినాశనమ్‌
జయావహం జపే న్నిత్యం 
అక్షయ్యం పరమం శివమ్‌. 4

సర్వమంగళ మాంగల్యం 
సర్వపాప ప్రణాశనమ్‌
చింతాశోక ప్రశమనం 
ఆయుర్వర్ధన ముత్తమమ్‌.  5

రశ్మిమంతం సముద్యంతం 
దేవాసుర నమస్కృతమ్‌
పూజయస్వ వివస్వంతం 
భాస్కరం భువనేశ్వరమ్‌. 6

సర్వ దేవాత్మకో హ్యేష: 
తేజస్వీ రశ్మిభావన:
ఏష దేవాసురగణాన్‌ 
లోకాన్‌ పాతి గభస్తిభి: 7

ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ 
శివ: స్కంద: ప్రజాపతి:
మహేంద్రో ధనద: కాలో 
యమ: సోమో హ్యపాంపతి: 8

పితరో వసవ: సాధ్యా 
హ్యశ్వినౌ మరుతో మను:
వాయు ర్వహ్ని:ప్రజా:ప్రాణా:
ఋతుకర్తా ప్రభాకర: 9

ఆదిత్యా: సవితా సూర్య: 
ఖగ: పూషా గభస్తిమాన్‌
సువర్ణసదృశో భానుహు
హిరణ్యరేతా దివాకర: 10
                      
హరిదశ్వ: సహస్రార్చి:   
సప్త సప్తి  మరీచిమాన్‌
తిమిరోన్మధన: శంభు స్త్వష్టా
మార్తాండ అంశు మాన్‌. 11

హిరణ్యగర్భ: శిశిర: 
స్తపనో భాస్కరో రవి:
అగ్నిగర్భో దితే: పుత్ర: 
శంఖ: శిశిరనాశన:  12

వ్యోమనాథ స్తమోభేదీ
ఋగ్యజుస్సామ పారగ:
ఘనవృష్టి రపాంమిత్రో 
వింధ్యవీథీ ప్లవంగమ:  13

ఆతపీ మండలీ మృత్యు: 
పింగళ: సర్వతాపన:
క(ర)వి ర్విశ్వో మహాతేజా: 
రక్త సర్వభవోద్భవ:  14
                 
నక్షత్ర గ్రహ తారణాం 
అధిపో విశ్వభావన:
తేజసామపి తేజస్వీ 
ద్వాదశాత్మన్‌! నమో స్తుతే.  15

* * *

నమ: పూర్వాయ గిరయే
పశ్చిమాద్రయే నమ:
జ్యోతిర్గణానాం పతయే 
దినాధిపతయే నమ:  16

జయాయ జయభద్రాయ 
హర్యశ్వాయ నమో నమ:
నమో నమ స్సహస్రాంశో 
ఆదిత్యాయ నమో నమ: 17

నమ ఉగ్రాయ వీరాయ 
సారంగాయ నమో నమ:
నమ: పద్మప్రబోధాయ 
మార్తాండాయ నమో నమ: 18

బ్రహ్మేశా నాచ్యుతేశాయ 
సూర్యా యాదిత్యవర్చసే
భాస్వతే సర్వభక్షాయ 
రౌద్రాయ వపుషే నమ: 19

తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే
కృతఘ్నఘ్నాయ దేవాయ 
జ్యోతిషాం పతయే నమ: 20

తప్త చామీకరాభాయ 
వహ్నయే విశ్వకర్మణే
నమస్తమో భినిఘ్నాయ 
రవయే లోకసాక్షిణే. 21
* * *

నాశయత్యేష వై భూతం 
తదేవ సృజతి ప్రభు:
పాయత్యేష తపత్యేష 
వర్షత్యేష గభస్తిభి:  22 

ఏష సుప్తేషు జాగర్తి 
భూతేషు పరినిష్టిత:
ఏష ఏవాగ్నిహోత్రం చ 
ఫలం చై వాగ్నిహోత్రిణామ్‌. 23

వేదాశ్చ క్రతవశ్చైవ 
క్రతూనాం ఫలమేవ చ
యాని కృత్యాని లోకేషు 
సర్వ ఏష రవి: ప్రభు:  24

ఏన మాపత్సు కృచ్చే షు 
కాంతారేషు భయేషు చ
కీర్తయన్‌ పురుష: కశ్చి న్నా
వసీదతి రాఘవ!  25

పూజయ స్వైన మేకాగ్రో
 దేవదేవం జగత్పతిమ్‌
ఏతత్ త్రిగుణితం జప్త్వా 
యుద్ధేషు విజయిష్యసి.  26

అస్మిన్‌ క్షణే మహాబాహో
రావణం త్వం వధిష్యసి
ఏవ ముక్త్వ  తతో గస్త్యో 
జగామ చ యథాగతమ్‌.  27

ఏతచ్చు త్వా మహాతేజా 
నష్టశోకో భవత్తదా
ధారయామాస సుప్రీతో 
రాఘవ: ప్రయతాత్మవాన్‌. 28

ఆదిత్యం ప్రేక్ష్యం జప్త్వేదం 
పరం హర్ష మవాప్తవాన్‌
త్రిరాచమ్య శుచి ర్భూత్మా 
ధను రాదాయ వీర్యవాన్‌. 29

రావణం ప్రేక్ష్య హృష్టాత్మా 
యుద్ధయ సముపాగ మత్ 
సర్వయత్నేన మహతా 
వధే తస్య ధృతో భవత్. 30

అథ రవి రవద న్నిరీక్ష్య రామం 
ముదితమనా:పరమం ప్రహృష్యమాణ:
నిశి చరపతి సంక్షయం విదిత్వా
సురగణ మధ్యగతో వచ స్త్వ రేతి. 31

ఓం తత్ సత్

:+:!:+:!:+:!:+:!:+:!::+:!:+:!:+:!:+:!:

సూర్య:: praathana

ఓం భాస్కరాయ విద్మహే
మహాధ్యుతికరాయ ధీమహే 
తన్నో ఆదిత్య: ప్రచోదయాత్

Bhaskaraaya vidmahe
Aditya ya dhimahi 
TannO soorya prachodayaath

* * *
ఓం ఆకృష్ణేన  రజసార్తమానో
నివేశయన్నఘృతం మర్త్వంచ హిరణ్యయేన
సవితారధేనా దేవోయాత భువనాని పశ్యస్
Om AkRshNEna  rajasaartamaanO
nivESayannaghRtam martwancha hiraNyayEna
savitaaradhaenaa dEvOyaata bhuvanaani paSyas


Tuesday, January 20, 2015

మంగళసూత్రంలో నల్లపూసల ప్రాదాన్యత


మంగళసూత్రంలో నల్లపూసల ప్రాదాన్యత
స్త్రీ ఒక సంవత్సర కాలం సంతానాన్ని తన గర్బంలో మోసి మరిక ప్రాణికి జన్మనిస్తుంది. అందువల్ల స్త్రీ నాడులకు అనుకూలమైన పధార్ధాలను ఆమెకు ఆభరణాలుగా ఏర్పాటు చేసారు.వాటిల్లో నల్లపూసలు ఒకటి.ముతైదువులు ధరించే ఆభరణాలు వారి దేహం పై ఆధ్యాత్మికంగాను, వైజ్ఞానికంగానూ ఉత్తమ పరిణామాల్ని కలిగిస్తాయి.సకలదేవతల సన్నిధానయుల్తమైన, సకలతీర్థాల సన్నిధానం కలిగిన, సౌభాగ్యాలనొసగే తాళి మాంగల్యం మతైదువకు ముఖ్యమైనది.
వెనకటి కాలంలో నల్లపూసలను నల్లమట్టితో తయారు చేసేవారు. ఈ నల్లపూసలు ఛాతీమీద ఉత్పన్నమయ్యే ఉష్ణాన్ని పీల్చుకునేవి. అదికాక పిల్లలకు పాలిచ్చే తల్లులలో పాలను కాపాడుతాయని నమ్మకం. ఇప్పుడు నల్లపూసలు వేసుకోవడమే తక్కువ. మనదేహంలోని ఉష్ణంతో బాటు బంగారు గొలుసు వేసుకోవడం వల్ల ఇంకా వేడిపెరిగి శరీరం వివిధ రుగ్మతలకు నిలయమౌతోంది. ఇక ఆధ్యాత్మిక దృష్టితో చూసినప్పుడు హృదయమధ్య భాగంలో అనాహత చక్రం ఉంది. గొంతుభాగంలో సుషుమ్న, మరియు మెడ భాగంలో విశుద్ధ చక్రం ఉంది. ఈ చక్రాలపై నల్లపూసలు ఉన్నందువల్ల హృదయం, గొంతుభాగంలో ఉష్ణం సమతులనమై రోగాలు పరిహారమౌతాయి. ఇటువంటి పవిత్రమైన మంగళసూత్రాన్ని భర్తకు తప్ప అన్యులకు కనిపించేలా పైన వేసుకోరాదు. వేరొకరి దృష్టి పడితే మంచిదికాదు.
స్త్రీలు నల్లపూసలతాడుకి అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడమనేది ప్రాచీనకాలం నుంచి వస్తోంది.
నల్లపూసలు ఎంతో విశిష్టమైనవిగా ... పవిత్రమైనవిగా భావించడమనేది మన ఆచార వ్యవహారాలలో ఒక భాగమై పోయింది. ఇటీవల కాలంలో నల్లపూసలతాడును ప్రత్యేకంగా చేయించుకుని ధరించడం జరుగుతుందిగానీ, పూర్వం మంగళ సూత్రానికే నల్లపూసలను అమర్చేవారు. వివాహానికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ 'నలుపు రంగు' ను పక్కన పెడుతూ వచ్చిన వారు, సరాసరి నల్లపూసలను మంగళ సూత్రానికి అమర్చడం పట్ల కొంతమంది అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటారు.
అయితే నల్లపూసల ధారణ అనే మన ఆచారం వెనుక శాస్త్ర సంబంధమైన కారణం లేకపోలేదు. వివాహ సమయంలోనే వధువు అత్తింటివారు, ఓ కన్యతో మంగళ సూత్రానికి నల్లపూసలు చుట్టిస్తారు. ఆ మంగళ సూత్రానికి వధూ వరులచే 'నీలలోహిత గౌరి' కి పూజలు చేయిస్తారు. ఈ విధంగా చేయడం వలన నీలలోహిత గౌరీ అనుగ్రహంతో, వధువు యొక్క సౌభాగ్యం జీవితకాలంపాటు స్థిరంగా ఉంటుందని శాస్త్రం చెబుతోంది.
నాకు వివాహమును ,భాగ్యమును, ఆరోగ్యమునూ, పుత్రలాభామును, ప్రసాదించెదవు గాక! అని ప్రార్ధించి నీలలోహిత పూజను చేసి నీలలోహితే...బధ్యతే అనే మంత్రాన్ని చెప్పి ముత్యముల చేతనూ, పగడముల చేతనూ, కూర్చబడిన సూత్రమును కట్టాలి.నీలలోహిత గౌరిని పూజించడం వలన ... ఆమె సన్నిధిలో ఉంచిన నల్లపూసలను ధరించడం వలన వధూవరులకి సంబంధించిన సర్పదోషాలు తొలగిపోతాయని శాస్త్రం అంటోంది. అందువలన నల్లపూసలను ఓ ప్రత్యేక ఆభరణంగా భావించి ధరించకుండా, అవి మంగళ సూత్రంతో కూడి ఉండాలని స్పష్టం చేస్తోంది.
rachana::Nerella Raja Sekhar

Wednesday, January 14, 2015

మకర సంక్రాంతి శుభాకాంక్షలు___/\___

బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు___/\___




Brahmasri Chaganti Koteswara Rao Garu.

శ్రీ గోదా కళ్యాణము
భోగిపండగనాడే శ్రీ గోదారంగనాథుల కళ్యాణము జరుపటం ఆనవాయితీగా వస్తున్న ఆచారము. ధనుర్మాసం నెలరోజులూ వ్రతంలో భాగముగా అమ్మ అనుగ్రహించిన "తిరుప్పావై " ని అనుసంధించి ఆఖరున కల్యాణంతో ముగించి శ్రీ గోదారంగనాథుల కృపకు పాత్రులుకావటం మనందరకూ అత్యంత ఆవశ్యకం. శ్రీ విల్లి పుత్తూరంలో వేంచేసియున్న వటపత్ర శాయికి తులసీ దమనకాది పాత్రలను వివిధ రకాల పుష్పాలను మాలాలుగా కూర్చి స్వామికి సమర్పిస్తున్న శ్రీవిష్ణుచిత్తులకు శ్రీ భూదేవి అంశమున లభించిన గోదాదేవి దినదిన ప్రవర్డమానముగా పెరుగుతూ తండ్రియొక్క భక్తి జ్ఞాన తత్సార్యాలకు వారసురాలైనది. తండ్రిచే కూర్చబడిన తోమాలలను ముందుగా తానే ధరించి "స్వామికి తానెంతయు తగుదును" అని తన సౌందర్యమును నీటి బావిలో చూసుకుని మరల అ మాలలను బుట్టలో పెడుతూ ఉండేడిది. ఇది గమనించిన విష్ణుచిత్తులు ఆమెను మందలించి స్వామికి ఇట్టిమాలలు కై౦కర్యము చేయుట అపరాధమని తలచి మానివేసిరి . శ్రీస్వామి విష్ణుచిత్తులకు, స్వప్నమున సాక్షాత్కరించి ఆమె ధరించిన మాలలే మాకత్యంతప్రీతి __ అవియే మాకు సమర్పింపుడు అని ఆజ్ఞ చేసిరి . ఈమె సామాన్య మనవకాంత కాదనియు తన్నుద్దరించుటకు ఉద్భవించిన యే దేవకాంతయో భూదేవియో అని తలుస్తూ స్వామి ఆజ్ఞ మేరకు మాలా కై౦కర్యమును చేయసాగిరి.
యుక్త వయస్సు రాలైన గోదాదేవిని చూసిన విష్ణు చిత్తులు ఆమెకు వివాహము చేయనెంచి అమ్మా! నీకు పెండ్లీడు వచ్చినది నీ వేవరిని వరింతువో చెప్పుము నీ కోరిక మేరకే వివాహము చేతును అనిరి. తండ్రి మాటలు వినిన గోదాదేవి లఙ్ఞావదనయై తమరు సర్వజ్ఞులు తమకు తెలియనిదేమున్నది అపురుషోత్తముని తప్ప నేనింకెవరినీ వరింపను ఇతరుల గూర్చి యోచింపను అని తన మనోభీష్టాన్ని తెలియజేసెను. అప్పుడు విష్ణుచిత్తులు "కొమడల్" అను లోకప్రసిద్ద గ్రంధము ననుసరించి ఆ వటపత్రశాయి వైభవముతో ప్రారంభించింది నూట ఎనిమిది దివ్య తిరుపతిలలో అర్చామూర్తులైయున్న పెరుమాళ్ళ వైభవాతిశయయులను వర్ణింపసాగిరి అ క్రమములో చివరకు "అజికియ మనవాళన్ అను శ్రీరంగనాథుల రూపరేఖా విలాసములను వర్ణింపగనే "జితాస్మి" అని, ఆమె హృదయమందంతటను అరంగనాథుని దివ్య మంగళ స్వరూపమే నింపి యుంచుకొనినదై గగుర్పాటు పొందుచుండెను. ఆ స్థితిని గమనించిన విష్ణుచిత్తులు "అదెట్లు సాధ్యము" అని చింతాక్రాంతులై నిదురింప __ ఆ శ్రీరంగనాధులు స్వప్నమున శాక్షాత్కరించి నీ పుత్రిక భూజిత గోదను మాకు సమర్పింపుడు ఆమెను పాణిగ్రహణము చేసికొందును. వివాహ మహొత్సావానికి నా అజ్ఞమేరకు తగిన సామగ్రులు తీసుకుని పాండ్యమహారాజు ఛత్రధ్వజ చామరాదులతో మరియు రత్నాదులచే అలంకరించబడిన దంతపు పల్లకిలో మిమ్ముల స్వాగతి౦చెదడు అని పలుకగా __ విష్ణుచిత్తులు మేల్కోంచి అత్యంత ఆనందోత్సాహములతో తనజన్మ సార్ధకమైనదని పొంగి పోవుచూ _ సకల మంగళ వాయిద్యములు మ్రోగుచుండగా గోదాదేవిని శ్రీ రంగమునకు తోడ్కొని పోయిరి. అచట సమస్త జనులున్నా పాండ్యమహీభూపాలుడున్నా విష్ణు చిత్తులను _ ఆ సన్నివేశము దర్శించి ధనుల్వైరి.
ఇట్లు అండాళ్ తల్లి తాను చేసిన ధనుర్మాసు వ్రత కారణమున పరమాత్మను తానుపొంది మనలను ఉద్దరించుటకు మార్గదర్శినియై నిలచినది. శ్రీరంగనాధుడు, స్వయముగా అమెనే వరించి _ పాణిగ్రహణము చేసివాడు దీనినే మనము భోగిపండుగనాడు భోగ్యముగా జరుపుకొనుచున్నాము. శ్రీ గదా రంగనాథుల కళ్యాణము చూచినను చేయించినను, ఈ కథ వినినను __చదివిననూ సకల శుభములు చేకూరుననుటలో సందేహములేదు


Brahmasri Chaganti Koteswara Rao Garu.

 భోగి పండుగ
దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలను, బాధలను అగ్ని దేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలు - భోగిమంటలు.భోగి రోజు సాయంత్రం పిల్లలకు పోసే భోగి పళ్ళు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి దివ్యమైన ఆశీస్సులు.
ఈ పండుగనాడు సంక్రాంతి సంబరమంతా పిల్లలదే. తెల్లవారు ఝామునే లేచి భోగిమంటలు వేయటం, సాయంత్రం భోగి పండ్లు పోయించుకోవడంతో హుషారుగా ఉంటారు.
"భగ" అనే పదం నుండి "భోగి" అన్నమాట పుట్టిందని చెబుతారు. భగ అంటే మంటలు లేదా వేడిని పుట్టించడం అని అర్ధం. దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలను, బాధలను అగ్ని దేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలు - భోగిమంటలు.
కుప్పలు నూ ర్పిడి అవగానే మిగిలిన పదార్ధాలను మంటగా వేయటం వలన పుష్యమాస లక్షణమైన చలి తగ్గి వాతావరణం కొంచెము వేడెక్కుతుంది.
భోగి పళ్ళు
భోగి పండుగ అంటే సూర్యభగవానునికి ఎంతో ఇష్టమైన పండుగ. భోగి పండ్లు అంటే రేగుపండ్లు. ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన ఫలం. సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన రేగుపళ్ళతో నాణేలను కలిపి పిల్లల తలపై పోస్తారు. దీనినే భోగి పళ్ళు పోయడం అంటారు. సూర్యభగవానుని అనుగ్రహం పిల్లలపై ప్రసరించి ఆరోగ్యం కలగాలనే సంకేతంతో భోగిపళ్ళు పోస్తారు. అమ్మమ్మలు, తాతయ్యలు, తల్లిదండ్రులు, పెద్దమ్మ, పెద్దనాన్న, అత్తా, మామ ఇలా ఇంటిల్లిపాది అంతా కలిసి భోగిపళ్ళుతో చిన్నారులను దీవిస్తారు. సకల సౌభాగ్యాలతో, నిండు నూరేళ్ళూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని భోగి పళ్ళు పోస్తూ పాటలు పాడతారు.