1::నమః కాంతాయ భర్త్రేచ శిరశ్చంద్ర స్వరూపిణే
నమశ్శాంతాయ దాంతాయ సర్వదేవాశ్రయాయచ
2::నమో బ్రహ్మస్వరూపాయ సతీప్రాణపరాయ చ
నమస్యాయచ పూజ్యాయ హృదాధారాయతే నమః
3::పంచప్రాణాధిదేవాయ చక్షుషస్తారకాయ చ
జ్ఞానాధారాయ పత్నీనాం పరమానంద రూపిణే
4::పతిర్బ్రహ్మా పతిర్విష్ణుః పతిరేవమహేశ్వరః
పతిశ్చనిర్గుణాధారో బ్రహ్మరూప..నమోస్తుతే
5::క్షమస్వ భగవాన్..దోషం జ్ఞానాజ్ఞానామృతం చయత్
పత్నిబంధో..దయాసింధో..దాసీదోషం క్షమస్వమే
6::ఇతిస్తోత్రం మహాపుణ్యం సృష్టాదౌ పద్మయాకృతం
సరస్వత్యాచ ధరయా గంగయా చ పురావ్రజ
7::సావిత్ర్యా చ కృతం పూర్వం బ్రహ్మణే చాపి నిత్యశః
పార్వత్యా చ కృతం భక్త్యాకైలాసౌ శంకరాయచ
బ్రహ్మవైవర్త పురాణంలోని ఈ స్తోత్రాన్నిలక్ష్మీ, సరస్వతి, గంగ, భూదేవి, సావిత్రి, పార్వతి మున్నగు దేవతా మూర్తులు పఠించారు
లక్ష్మీదేవికి వాహనం గుడ్లగూబ ?
గొప్ప సంగీత విద్వాంసుడు, మధురమైన గానంతో కౌశికుడు అనే విష్ణుభక్తుడు తన భక్తి, గానమాధుర్యంతో విష్ణువుని మెప్పించి ప్రసన్నం చేసుకున్నాడు. కౌశికుడు మరణించిన తరువాత వైకుంఠం చేరుకున్నాడు. మహావిష్ణువు కౌశికుడిని తన అంతరంగిక సంగీత సభను ఏర్పాటు చేశాడు. త్రిలోకసంచారి నారదునికి ఆ సభలోకి ప్రవేశించడానికి అనుమతి లభించలేదు.
తుంబురుడికి స్వాగత సత్కార్యాలు లభించడం చూసిన నారదుడు తన శత్రువైన తుంబురుడికి లభించిన స్థానం తనకు ఎందుకు దక్కలేదని మండిపడుతూ లక్ష్మీదేవి మందిరంలో నుండి లోనికి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. కానీ లక్ష్మీదేవి చెలికత్తెలు నారదుణ్ణి లోనికి అనుమతించలేదు. కోపగించిన నారదుడు లక్ష్మీదేవిని శపించాడు. ఈ విషయం తెలుసుకున్న లక్ష్మీదేవి, మహావిష్ణువు నారదుడి ఎదుట ప్రత్యక్షమై తన పొరపాటును మన్నించమని వేడుకున్నారు. దాంతో నారదుడు శాంతించాడు.
నారదుడు చల్లబడడం చూసిన మహావిష్ణువు నారదునితో ఇలా అన్నాడు … నారదా నీకోపానికి కారణం నాకు తెలుసు. నిజానికి భక్తిజ్ఞానంలో, శీలవర్తనలో తుంబురుడు నీకన్నా గర్విష్టి కాదు. కపట భక్తిని ప్రదర్శించేవారు ఎన్ని తీర్థాలు సేవించినా అవి వ్యర్థం అవుతాయి. భక్తిశ్రద్ధలతో నన్ను కొలిచేవారికి నేను ఎప్పుడూ దాసుడనే. సంగీతంతో నన్ను చేరవచ్చు అనే సత్యాన్ని చాటిచెప్పడానికే నేను తుంబురుడిని, కౌశికులను సత్కరించాను. నీవు ఇచ్చిన శాపం లోకానికి మేలే జరుగుతుంది అని చెప్పాడు.
దీంతో జ్ఞానోదయమైన నారదుడు … ఓ దేవా నా తప్పులను క్షమించు. అవివేకుడిలా ప్రవర్తించాను. నన్ను కాపాడు. తుంబర, కౌశికుల సంగీత పరిజ్ఞానం నాలో లేదు అందుకే ఇంతకీ విపరీతం జరిగి ఉండేది కాదు అంటూ తీవ్ర దుఃఖభారంతో కన్నీళ్లు కారుతుండగా నారదుడు మహావిష్ణువు పాదాలపై పడ్డాడు.
విష్ణువు నారదుణ్ణి పైకి లేపి ధైర్యం చెప్పాడు. సంగీతం నేర్చుకోవాలనే సంకల్పం నిజంగా నీకు ఉంటే నేను చెప్పినట్లు చేయి. ఉత్తరాన మానస సరొవరానికి అవతలివైపు ఒక పర్వత శిఖరం ఉంది. దానిమీద ఒక ఉలూకపతి ఉన్నాడు. అతనికి శుశ్రుష చేసి సంగీతంలో మేటివి అవమని దీవించాడు. మహావిష్ణువుకి కృతజ్ఞతలు తెలిపి మనోవేగంతో మానస సరోవరం చేరుకున్నాడు నారదుడు.
అక్కడికి చేరుకున్న నారదుడికి కమ్మని సంగీతం అస్పష్టంగా వినిపించింది. గాలిలో తెరలు తెరలుగా వస్తున్న ఆ గానమాదుర్యాన్ని అనుసరించి అవతల ఉన్న శిఖరాన్ని చేరుకున్నాడు. అక్కడ గాంధర్వ, కిన్నెర, కింపురుష, అప్సరసలు ఎందఱో సంగీత అభ్యాసం చేస్తూ కనిపించారు. వారి మధ్యలో దివ్యకాంతులతో ప్రకాశిస్తున్న ‘గానబంధు’ నారదుణ్ణి చూసి ఎదురేగి ఆదరంగా ఆహ్వానించి ఆసనం చూపించి కుశలప్రశ్నలు వేశాడు. వచ్చిన కారణం ఏమిటని అడిగాడు.
నారదుడు ‘గానబందు’ వినయానికి, సంగీత పరిజ్ఞానానికి ఆశ్చర్యపోయి తనకు తెలియని ఈ సంగీత సామ్రాట్టు ఎవరు అని ఆలోచించసాగాడు. అతను ఎవరైతే తనకెందుకు తనకు కావలసింది సంగీత విద్య. నారదుడు ఉలూకపతికి నమస్కరించి తానూ వచ్చిన కారణం తెలుపుతూ తుంబుర, కౌశికులు తమ గానమాధుర్యంతో విష్ణువుని ప్రసన్నం చేసుకున్నారని తనకు కూడా అలాంటి దివ్యగాన విద్యని ప్రసాదించమని వేడుకున్నాడు. నారదుడి ఆంతర్యం కనిపెట్టిన గానబంధు ముందుగా తానూ ఎవరో వివరించసాగాడు.
పూర్వకాలంలో ధర్మవర్తనుడు, జాలిగుండెగల భువనేశుడనే రాజు ఉండేవాడు. అతను సంప్రదాయాలను అనుసరించి ధర్మకార్యాలు అన్నీ క్రమం తప్పకుండా నిర్వహిస్తూ ఉండేవాడు. అటువంటి ఉత్తమపాలకుడు సంగీతాన్ని మాత్రం నిషేధించాడు. తన రాజ్యంలో ఎవరైనా గానం ఆలపిస్తే మరణశిక్ష విధించమని మంత్రులకు ఆజ్ఞ ఇచ్చాడు. భగవంతుణ్ణి కూడా భక్తీ గీతాలతో స్తుతించకూడదని చాటింపు వేయించాడు.
ఒకరోజు హరిమిత్రుడు అనే భక్తుడు రాజు ఆజ్ఞను విస్మరించి భగవంతుణ్ణి కీర్తిస్తూ గానం చేశాడు. ఆ గానమాదుర్యంలో మునిగిపోయిన ప్రజలు కూడా పాడకూడదు అన్న విషయాన్ని మరచిపోయారు. వెంటనే రాజభటులు వచ్చి హరిమిత్రున్ని తీసుకువెళ్ళి రాజు ముందు నిలబెట్టారు. రాజు ఆలోచనలో పడ్డాడు. గానం ఆలపించినవాడు బ్రాహ్మణుడు. అతన్ని చంపితే బ్రాహ్మహత్యా దోషం కలుగుతుంది, అందుకే హరిమిత్రుని సంపదను స్వాధీనం చేసుకుని, మరణశిక్షకు సమానమైన దేశబహిష్కరణ శిక్షను విధించాడు.
కొంతకాలానికి రాజు మరణించాడు. మానవుడిగా మరణించిన రాజు మరుసటి జన్మలో గుడ్లగూబగా జన్మించాడు. గుడ్లగూబ రాత్రిళ్ళు మాత్రమే ఆహారాన్ని సంపాదించుకోవాలి. అందుకు తిండి ఒక సమస్యగా తయారయింది గుడ్లగూబకు. గతజన్మ దోషఫలితం వల్ల ఒకసారి నాలుగు రోజులు అయినా ఆహారం లభించలేదు. ఆకలితో అలమటిస్తూ ఆఖరికి మరణాన్ని ఆహ్వానించాడు. గుడ్లగూబగా జన్మించిన రాజు గతజన్మలో తాను చేసిన కొన్ని పుణ్యకార్యాలవల్ల యమధర్మరాజు వచ్చి ఎదురుగా నిలబడ్డాడు.
యమున్ని చూసి … యమధర్మరాజా ఎందుకు ఈ విధంగా నన్ను బాధపెడుతున్నావు. నేను గతజన్మలో రాజుగా ప్రజలపై ఎంతవరకు దయాదాక్షిణ్యాలు చూపించాలో అంతవరకూ చూపించాను. నీవు ఎందుకు నాపై దయ చూపావు అన్నాడు. భువనేశుడి స్థితికి జాలిపడ్డాడు యమధర్మరాజు. తాము చేసిన తప్పు తెలియకుండా ఎవరైనా శిక్ష అనుభవించడం ధర్మం కాదు, తెలిసినప్పుడే కదా పశ్చాత్తాపం కలిగేది అని ఆలోచించిన యమధర్మరాజు భువనేశుడికి అతను చేసిన తప్పు ఏమిటో చెప్పాడు …
గానబంధు! నీవు రాజుగా ఉన్నప్పుడు అనేక సత్కార్యాలు చేసిన మాట నిజమే. కానీ పరమాత్ముణ్ణి వేదమంత్రాలతో మాత్రమె స్తుతించాలని శాసించడం నీ మూర్ఖత్వం. పరమపావనమైన సన్తేఎతమ్తొ హరికీర్తన చేసిన హరిమిత్రున్ని శిక్షించిన పాపం ఏమైనా తక్కువా. ఆ పాప ఫలితం కొండంత అయి నీకు లభించిన పుణ్యఫలాన్ని మించిపోయింది. అదే నేడు నిన్ను పట్టిపీడిస్తుంది. విష్ణుభక్తులకు చేసిన చేసిన కీడు నీకు ఈ అవస్థ తెచ్చిపెట్టింది. దీనినుండి బయటపడటం ఎవరికీ సాధ్యం కాదు.
యమధర్మరాజు చెప్పింది విన్నాక గాని గుడ్లగూబకు తానూ చేసిన తప్పు ఏమిటో అర్థం కాలేదు. ఏ మార్గంలోనైనా భగవంతుణ్ణి స్తుతించవచ్చు అన్న జ్ఞానం కలిగి తానూ చేసిన తప్పును క్షమించి ఈ సంకటం నుండి ఎలాగైనా బయటపడే మార్గాన్ని చూపించమని యమధర్మరాజు పాదాలపై పడి వేడుకున్నాడు.
యమధర్మరాజు హృదయం ద్రవించి … ఉలూకరాజా చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పాడు. ఈ పాపానికి మించిన శిక్ష అనుభవించినట్లయితే శిక్ష కాస్తంత తగ్గుతుంది. నీవు అంగీకరిస్తే అక్కడ నున్న గుహలోకి వెళ్ళు. అందులో నీ గతజన్మ దేహం ఉంది. అందులోనుండి రోజూ కొంత మాంసాన్ని చీల్చుకుని భుజించు. అది పూర్తి అయిన అనంతరం నీకు శుభం కలుగుతుంది అని దీవించి అంతర్థానం అయ్యాడు.
ఈ వివరాలు నారదుడికి చెప్పిన గుడ్లగూబ ఓ మహర్షీ ఆ దురదృష్టవంతుడిని నేనే. ఆ తరువాత నేను ఒకరోజు నా శవం దగ్గర కూర్చుని ఉండగా, దివ్య తేజస్వి అయిన ఒక బ్రాహ్మణుడు రథంలో వెళ్తూ నా ముందు ఉన్న శవాన్ని చూసి రథాన్ని ఆపి దగ్గరకి వచ్చి చూసి ఇది భువనేశుని శవంలా ఉంది. ఇక్కడెందుకు పడి ఉంది? దీన్ని ఈ పక్షి తినడం ఏమిటి? అంటూ ఆశ్చర్యాన్ని ప్రకటించాడు.
అప్పటికి నేను ఆ బ్రాహ్మణుడిని గుర్తించాను. అతను నా చేత దేశబహిష్కరణకు గురైన హరిమిత్రుడు. వెంటనే అతని పాదాలపై పడి ప్రార్థించాను. తప్పును క్షమించమని వేడుకున్నాను. దుఃఖ అశ్రువులు నేలపై పడుతుండగా యమధర్మరాజు తెలిపిన విషయం అంతా హరిమిత్రుడికి వివరించాను, హరిమిత్రుడు అది విని చలించిపోయి తన అంతరంగం భావాలకు అనుగుణంగా ఇలా పలికాడు …
నీ బాధలు చూస్తుంటే నాకు ఎంతో విచారం కలుగుతుంది. నీవు నాపట్ల చూపిన కాఠిన్యాన్ని నేను ఆరోజే మరచిపోయాను. నీవు అనుభవించిన బాధలు ఇక చాలు. ఈ క్షణం నుండి నీకు బాధ అనేది లేకుండుగాక. గొప్ప సంగీత విద్వాంసుడవై లోకంలో ఉత్తమ సంగీత విద్యను బోధింతువుగాక అంటూ హరిమిత్రుడు నా కృతజ్ఞతను స్వీకరించి వైకుంఠానికి చేరుకున్నాడు. అతని దీవెనలు ఫలించి నేను ఇలా ఉన్నాను అంటూ గానబందు తన కథను వివరించాడు.
ఆపై నారదుడు గానబందు విద్వాంసుని శిష్యుడు అయ్యాడు. తొలిరోజునే సంగీతం ఎలా నేర్చుకోవాలో అనే విషయం మీద పాఠం చెప్పాడు. సంగీతం ఒక దివ్యకళ అన్నాడు. తపంతోగాని, తామసంతో కాని సంగీతం పట్టుబడదు అని చెప్పాడు. కళ కోసం జీవితాన్నే అర్పించాలి అని అన్నాడు. కష్టపడి నిరంతరం సాధనచేస్తే ఎవరైనా అపురూపమయిన ఈ కలలో ఆధిక్యం సాధించవచ్చు అన్నాడు. నారదుడు గానబంధుపై గౌరవభావం మోహంలో ఉట్టిపడుతుండగా వినయంగా తలవంచుకుని విన్నాడు.
వెయ్యేళ్ళు సంగీత సాధనలో గడిచిపోయాయి. కఠోరదీక్షతో నారదుడు 3,60,006 రాగాలలో మంచి ప్రావీణ్యం సంపాదించాడు. సహచరులు పొగుడుతూ ఉంటే సంగీతంలో ఇక తనకు తిరుగులేదని అనే గర్వంతో ఉబ్బిపోయాడు నారదుడు. అమితానందంతో గురువైన గుడ్లగూబను చేరుకొని కృతజ్ఞతలు తెలుపుతూ గురుదక్షిణ చేల్లిస్తాను. ఏం కావాలో సెలవివ్వమన్నాడు. ఎలాంటి కోరికనైనా సంశయం లేకుండా అడగమన్నాడు.
శిష్యుడి మాటలు విన్న గురువు సంతోషంతో ఓ మహర్షీ! దేవరుషులు అయిన మిమ్మల్ని నేను ఏమి కోరిక కోరగలను. గుడ్లగూబకు కావలసిన అవసరాలు ఏమి ఉంటాయి? నీవు శిష్యుడివి కాబాట్టి ఏదో ఒకటి కోరుకోక తప్పాడు. ఈ భూమి నిలిచి ఉన్నంతకాలం సంగీత కళతో పాటు నేను సహితం లోకంలో గుర్తుండిపోయేలా వరం ప్రసాదించు అని మనసులోని మాట బయట పెట్టడు.
నారదుడు నవ్వి గురువర్యా! ఇది మరీ చిన్న కోరిక … ఈ చిన్ని కోరిక మీకు ఉన్న సంగీత పాండిత్యం తీర్చగలదు. శిష్య ప్రశిష్యకోటి వలన భూతలంలో సంగీతకళ నిలిచి ఉన్నంత వరకు మీ కీర్తికి భంగం కలగదు. మీరు చేసిన ఈ మహోపకార్యానికి గురుదక్షిణగా లక్ష్మీనారాయణుల కటాక్షం, వారి సేవాభాగ్యాన్ని, శాశ్వత సన్నిధానాన్ని ప్రసాదిస్తున్నాను. ప్రళయం సంభవించిన వేళ శ్రీమహావిష్ణువుకి గరుత్మంతునిలా శ్రీమహాలక్ష్మీదేవికి నీవు వాహనమై తరించుగాక అంటూ శిష్యునిగా కానుకను, దేవర్షిగా వరాన్ని సమర్పించి గుడ్లగూబ దగ్గర సెలవు తీసుకుని స్వర్గలోకానికి చేరుకున్నాడు. ఈ విధంగా గానబందు అనే గుడ్లగూబ లక్ష్మీదేవికి వాహనం అయింది.
www.telugutarang.com nundi sekarinchinadi
ఓం శ్రీ గురుభ్యోనమః___/\___
బ్రహ్మశ్రీ చాగంటికోటీశ్వర రావుగారికి___/\___
శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి
దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠినాడు దేవసేనతో "శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి" వారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించిన ఈ రోజును "శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి" గా పరిగణిస్తారు. ఈ స్వామివారి జన్మవృత్తాంత విశిష్టత సమీక్షగా తెలుసుకుందాము!
పూర్వం మూడులోకాలను భయభ్రాంతులను చేస్తూ బాధిస్తున్న "తారకా సురుడు" అను రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై! దేవతలు బ్రహ్మదేవుని శరణువేడినారు. దానికి బ్రహ్మ వారికి ఒక సూచన చేసినారు. ఈ తారకాసురుడు అమిత తపోబలసంపన్నుడు, అమితబలశాలి, వీనికి ఈశ్వర తేజాంశ సంభవుని వల్లకాని వానికి మరణములేదు. కావున! మీరు సతివియోగ దుఃఖముతో ఉన్న ఈశ్వరునకు ఆ సతీదేవియే మరుజన్మయందు గిరిరాజు హిమవంతునకు పుత్రికగా అవతరించిన ఆ పార్వతీదేవికి వివాహం జరిపించండి. వారికి కలుగు పుత్రుడే తారకాసురుని సంహరించగల సమర్ధుడు అవుతాడు అని తరుణోపాయం శెలవిచ్చారు.
అప్పటికే తపోదీక్షలో ఉన్న పరమశివునకు సేవలు చేస్తున్న ఆ జగన్మాత పార్వతికి, శివునకు అన్యోన్యత చేకూర్చే వాతావరణాన్ని కల్పించేందుకు! దేవతలు మన్మధుని ఆశ్రయిస్తారు. మొత్తం మీద మన్మధుని పూలబాణాలతో ఈశ్వరుని చలింపచేసి తాను ఈశ్వరుని ఆగ్రహానికి గురు అయినా! పార్వతి పరమేశ్వరుల కళ్యాణానికి మన్మధుడు కారణ భూతుడవుతాడు. కళ్యాణం అనంతరం దేవతల అభ్యర్ధనమేరకు పునర్జీవింపబడతాడు.
ఇలా ఉండగా! పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానందసమయాన అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు. అది గ్రహించిన పరమ శివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రునిలోకి ప్రవేశపెడతాడు. దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగానదిలో విడచి పెడతాడు. ఆ తేజము ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్‌కృత్తికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది. ఆ రుద్రతేజమును వారు భరించలేక రెల్లుపొదలో విసర్జిస్తారు. అంత ఆ ఆరుతేజస్సులు కలసి ఆరుముఖాలతో ఒక దివ్యమైన బాలుడుగా ఉద్భవిస్తాడు. ఇది తెలిసిన పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకుని కైలాసం తీసుకుని వెళతారు.
ఆ బాలుడు గంగాగర్భంలో తేజోరూపంలో ఉన్నందుకు గాంగేయుడని, షట్‌కృత్తికలు వానిని పెంచి పెద్దచేసిన కారణం వల్ల మరియు ఆరుముఖాలు కలవాడు అగుటవల్ల షణ్ముఖుడని, కార్తికేయుడని, అతడు గౌరీశంకరుల పుత్రుడగుటచే కుమారస్వామి అనియు, సుబ్రహ్మణ్యస్వామి అనియు నామాలతో పిలువసాగిరి.
కారణజన్ముడైన ఈ స్వామి పార్వతి పరమేశ్వరులు, దేవతలు కోరిక మేరకు కుమారస్వామిగా చేసి, వానిని దేవతల సర్వసైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు "శూలం" మొదలైన ఆయుధాలను ఇవ్వగా, ఆ జగన్మాత పార్వతి కుమారుని దీవించి "శక్తి" అను ఆయుధాలను ఇచ్చి సర్వశక్తివంతుడ్నిచేసి, తారకాసురునిపై యుద్ధ శంఖారావాన్ని మ్రోగిస్తారు. అంత ఆ స్వామి నెమలి వాహనారూఢుడై ఆరుముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపందాల్చి ఆరు చేతులతో ధనస్సులను మరో ఆరు చేతులతో బాణాలు ధరించి కొన్ని అక్షౌహిణులను సంహరించి, రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి "సర్పరూపం" దాల్చి వారిని ఉక్కిరి బిక్కిరి చేసి, భీకర యుద్ధము చేసి తారకాసురుని సంహరించి విజయుడైనాడు.
సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహము జరిపిన ఈ రోజును "శ్రీ సుబ్రహ్మణ్యషష్ఠి"గా పరిగణిస్తారని, సర్వులకు పూజ్యనీయులైన శ్రీ వేదవ్యాసులవారు దీని విశిష్టతను వివరిస్తారు.
ఈ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వార్కి గ్రామాలు, పట్టణాలు అనుబేధము లేకుండా దేశం నలుమూలలా దేవాలయాలు కలవు. ఈ రోజున "శ్రీవల్లి దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి" వారికి భక్తులు కళ్యాణోత్సవములు, సహస్రనామ పూజలు తీర్ధములు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు.
ఈ స్వామి ఆరాధనవల్ల నేత్రరోగాలు, చర్మవ్యాధులు తగ్గుతాయని; పెళ్లికాని వారికి వివాహం జరిగి సత్‌సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లు తారని ప్రజల విశ్వాసం. అలా సంతానం కలిగినవారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు. ఈ పుణ్యదినాన శ్రీ స్వామికి పాలు, పండ్లు, వెండి, పూలు పడగలు, వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు.
ఇటువంటి పుణ్యప్రదమైన "శ్రీ సుబ్రహ్మణ్యషష్ఠి" నాడు మనమంతా శ్రీ స్వామి విశేష పూజలు గావించి శ్రీ స్వామివారి కృపాకటాక్ష వీక్షణలు పొందుదాము.
నేడే శ్రీ దత్త జయంతి.
శ్రీ గణేషాయ నమః శ్రీ సరస్వత్తై నమః
శ్రీ పాదవల్లభ నారసింహ సరస్వతి
శ్రీగురు దత్తాత్రేయాయ నమః
1::దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం
ప్రపన్నార్తి హరం వందే స్మతృగామి సనోవతు
2::దీనబంధుం కృపాసింధుం సర్వకారణ కారణం
సర్వ రక్షాకరం వందే స్మతృగామి సనోవతు
3::శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణం
నారాయణం విభుం వందే స్మతృగామి సనోవతు
4::సర్వానర్థ హరం దేవం సర్వమంగళ మంగళం
సర్వ క్లేశ హరం వందే స్మతృగామి సనోవతు
5::బ్రహ్మణ్యం ధర్మతత్త్వజ్ఞం భక్త కీర్తి వివర్ధనం
భక్తాభీష్ట ప్రదం వందే స్మతృగామి సనోవతు
6::శొషణం పాప పంకస్య దీపనం జ్ఞానతేజసః
తాప ప్రశమనం వందే స్మతృగామి సనోవతు
7::సర్వరోగ ప్రశమనం సర్వపీడా నివారణం
విపదుద్ధరణం వందే స్మతృగామి సనోవతు
8::జన్మ సంసార బంధఘ్నం స్వరూపానంద దాయకం
నిశ్శ్రేయస పదం వందే స్మతృగామి సనోవతు
9::జయలాభ యశః కామ దాతు ర్దత్తస్య యస్తవం
భోగమోక్ష ప్రదస్యేమం ప్రపఠేత్ సుకృతీ భవేత్ `
SREE DATTA STAVAM
Sri Ganesaya Namah Sri Sarasvatyai Namah
Sri Padavallabha Narasimha Sarasvathi
Sriguru Dattatreyaya Namah
1::Dattatreyam mahatmanam varadam bhakta vatsalam
Prapannarthi haram vande smartrgami Sanovatu
I pray to Lord Dattatreya, great divine spirit, who confers boons and protects
the devotees, who removes afflictions immediately of those who remember Him with
faith.
2::Dinabandum Krpasindhum sarvakarana karanam
Sarva raksakaram vande smartrgami sanovatu
I pray to Lord Dattatreya, who is a friend of the poor, a sea of compassion,
cause of all causes and the protector of all those who remember Him sincerely.
3::Saranagata dinarta paritrana parayanam
Narayanam vibhum vande smartrgami sanovatu
I pray to Lord Dattatreya, who is a shelter for the poor and afflicted and
grants deliverance immediately to those having firm devotion in him and remember
him sincerely.
4::Sarvanartha haram devam sarva mangala mangalam
Sarvaklesa haram vande smartrgami sanovatu
I pray to Lord Dattatreya, who is the destroyer of all useless and harmful
things and giver of all auspicious objects, the remover of all afflictions of
those who remember Him sincerely.
5::Brahmanyam dharma tattvajnam bhakta kirti vivardhanam
Bhaktabhista pradam vande smartrgami sanovatu
I pray to Lord Dattatreya, well versed in the vedas, knower of the essence of
religion, who causes to increase the fame of His devotees who is giver of
whatever is needed by the devotees who remember Him sincerely.
6::Sosanam papapankasya dipanam jnanatejasah
Tapa prasamanam vande smartrgami sanovatu
I pray to Lord Dattatreya who removes the quagmire of sins, lights up the flame
of wisdom, calms down distress and torment of those who remember Him sincerely.
7::Sarvaroga prasamanam sarvapida nivaranam
Vipaduddharanam vande smartrgami sanovatu
I pray to Lord Dattatreya who cures all diseases, heals all pain and removes all
calamities of those who remember Him sincerely.
8::Janmasamsara bandhajnam svarupananda dayakam
Nissreyasa padam vande smartrgami sanovatu
I pray to Lord Dattatreya who is most excellent and liberates from the cycle of
birth and death in this world and who is the giver of bliss to those who
remember Him sincerely.
9::Jaya labha yasah kama datu rdattasya yastavam
Bhogamoksha prada syemam prapathet sakriti bhavet
Those who recite this eulogy of Lord Dattatreya regularly and with faith, become
wise and attain victory, fame, fulfillment of all worldly desires and
achievements and finally get liberation from the bondage of life.
JAI GURU DEVA DATTA!`