!! హయగ్రీవ స్వామి !!
శ్రావణ శుద్ధ పౌర్ణమి నాడు హయగ్రీవుడు ఆవిర్భవించాడు . హయగ్రీవుడు విష్ణువు యొక్క అవతారము , ఈయన అశ్వము వంటి తల కలిగినవాడు . హయ అంటే గుర్రము గ్రీవ అంటే మెడ అని అర్ధం . హయగ్రీవుడు ని పూజించినచో విద్య, తెలివి ప్రసాదింపబడతాయి . హయగ్రీవుడు మనిషి యొక్క శరీరము మరియు అశ్వము వంటి తల,తెల్లని రంగు ,తెల్లని దుస్తులు దరించి కమలం మీద కూర్చిని దర్శనమిస్తాడు .
హయగ్రీవుని స్తుతి :
జ్ఞానానంద మయం దేవం నిర్మల స్ఫటికాకృతిం !
ఆధారం సర్వవిధ్యానం హయగ్రీవమ్ ఉపాస్మహే !!
పూర్వము శ్రీవదిరాజతీర్థ అనే భక్తుడు ఉడిపి శ్రీకృష్ణ మటము లో రోజు ఉలవలు (నవ ధాన్యాలలో ఒకటి) వండి హయగ్రీవునకు నైవేద్యం పెట్టేవాడు హయగ్రీవుడు స్వయంగా తెల్లని అశ్వము వంటి రూపముతో వచ్చి తినేవాడు అని ప్రసిద్ది . శ్రీవదిరాజతీర్థ 1480-1600 మధ్య కాలములో జీవించి ఉన్నట్టు తెలుస్తుంది . ఈయన కుమ్బాక్షి అనే గ్రామము ఉడిపి జిల్లా ,కర్నాటక రాష్రములో రామాచార్య ,గౌరి అనే దంపతులకు జన్మించారు .
శ్రీవదిరాజతీర్థ ఈ విధముగా కవితా గానము చేసేవారు .
న హయగ్రీవాత్ పరం అస్థి మంగలమ్
న హయగ్రీవత్ పరమ్ అస్థి పావనమ్
న హయగ్రీవమ్ పరమ్ అస్థి ధైవథమ్
న హయగ్రీవమ్ ప్రనిపథ్య సీధాతి !
హయగ్రీవునికన్నా మంగలప్రదమైనది మరొకటి లేదు . హయగ్రీవ ఉపాసన జన్మజన్మల పాపనాసనం . హయగ్రీవుడు అందరి దేవుల్లలోకి మొదటి వాడు . హయగ్రీవుని శరనానుగతి చేస్తే దుః ఖాలన్నీ తొలగిపోతాయి .
500 సంవత్సరములకు ముందు దైవజ్ఞ బ్రాహ్మణ కుటుంబములో జన్మించిన భక్తుడు విఘ్నేశ్వరుడిని పోత పోశాడు అయితే అది దానికదే హయగ్రీవునిగా మార్పు చెందింది . సార్వభౌమ శ్రీ వదిరాజ గురు స్వామీజీ కి స్వప్నములో హయగ్రీవుడు కనిపించి ఆ విగ్రహాన్ని తీసుకోమని చెప్పారు . తరువాత ఈయన దానిని శ్రీ సోదే వదిరాజ మటంలో ప్రతిష్టించారు . అప్పటి నుంచి దీనిని దైవజ్ఞ బ్రాహ్మణ కుటుంబీకులు పూజిస్తారు .