Tuesday, July 30, 2013

దుర్గాసప్తశ్లోకీ






















దుర్గాసప్తశ్లోకీ

శివ ఉవాచ::
దేవీ త్వం భక్తసులభే సర్వకార్యవిధాయిని
కలౌ హి కార్యసిద్ధ్యర్థముపాయం బ్రూహి యత్నతః

దేవ్యువాచ::
శృణు దేవ ప్రవక్ష్యామి కలౌ సర్వేష్టసాధనమ్
మయా తవైవ స్నేహేనాప్యంబాస్తుతిః ప్రకాశ్యతే

ఓం అస్య శ్రీ దుర్గా సప్తశ్లోకీ స్తోత్రమంత్రస్య
నారాయణ ఋషిః అనుష్టుప్ ఛందః

శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వత్యో దేవతాః
శ్రీ దుర్గా ప్రీత్యర్థం సప్తశ్లోకీ దుర్గాపాఠే వినియోగః

1::ఓం జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ హి సా
బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్ఛతి

2::దుర్గే స్మృతా హరసిభీతిమశేషజంతోః
స్వస్థైః స్మృతామతిమతీవ శుభాం దదాసి
దారిద్ర్యదుఃఖ భయహారిణి కా త్వదన్యా
సర్వోపకారకరణాయ సదార్ద్ర చిత్తా

3::సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే
శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోజ్స్తు తే

4::శరణాగతదీనార్త పరిత్రాణపరాయణే
సర్వస్యార్తిహరే దేవి నారాయణి నమోజ్స్తు తే

5::సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తిసమన్వితే
భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గే దేవి నమోజ్స్తు తే

6::రోగానశేషానపహంసి తుష్టారుష్టా తు కామాన్ సకలానభీష్టాన్
త్వామాశ్రితానాం న విపన్నరాణాం త్వామాశ్రితాహ్యాశ్రయతాం ప్రయాంతి

7::సర్వబాధాప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి
ఏవమేవ త్వయా కార్యమస్మద్వైరి వినాశనమ్

:::ఇతి శ్రీ దుర్గా సప్తశ్లోకీ సంపూర్ణా:::


Durga Sapta Sloki 

Siva uvaacha::
daevee tvaM bhaktasulabhae sarvakaaryavidhaayini
kalau hi kaaryasiddhyarthamupaayaM broohi yatnata@h

daevyuvaacha::
SRNu daeva pravakshyaami kalau sarvaeshTasaadhanam^
mayaa tavaiva snaehaenaapyaMbaastuti@h prakaaSyatae

OM asya Sree durgaa saptaSlOkee stOtramaMtrasya
naaraayaNa Rshi@h anushTup^ ChaMda@h

Sree mahaakaaLee mahaalakshmee mahaasarasvatyO daevataa@h
Sree durgaa preetyarthaM saptaSlOkee durgaapaaThae viniyOga@h

1::OM j~naaninaamapi chaetaaMsi daevee bhagavatee hi saa
balaadaakRshya mOhaaya mahaamaayaa prayachChati

2::durgae smRtaa harasibheetimaSaeshajaMtO@h
svasthai@h smRtaamatimateeva SubhaaM dadaasi
daaridryadu@hkha bhayahaariNi kaa tvadanyaa
sarvOpakaarakaraNaaya sadaardra chittaa

3::sarvamaMgaLa maaMgaLyae Sivae sarvaarthasaadhikae
SaraNyae tryaMbakae gauree naaraayaNee namOjstu tae

4::SaraNaagatadeenaarta paritraaNaparaayaNae
sarvasyaartiharae daevi naaraayaNi namOjstu tae

5::sarvasvaroopae sarvaeSae sarvaSaktisamanvitae
bhayaebhyastraahi nO daevi durgae daevi namOjstu tae

6::rOgaanaSaeshaanapahaMsi tushTaarushTaa tu kaamaan^ sakalaanabheeshTaan^
tvaamaaSritaanaaM na vipannaraaNaaM tvaamaaSritaahyaaSrayataaM prayaaMti

7::sarvabaadhaapraSamanaM trailOkyasyaakhilaeSvari
aevamaeva tvayaa kaaryamasmadvairi vinaaSanam^

:::iti Sree durgaa saptaSlOkee saMpoorNaa:::

Monday, July 22, 2013

అందరికి గురుపౌర్ణమి శుభాకాంక్షలు

























అందరికి గురుపౌర్ణమి శుభాకాంక్షలు !!

ఈరోజు గురుపౌర్ణమి వ్యాసుల వారి జన్మదినం , మన గురువు గారు ఏ ప్రవచనం మొదలు పెట్టిన వ్యాసుల వారిని ఈ విధముగా సృతిస్తారు . 

వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే !
నమో వై బ్రహ్మనిథయే వాసిష్టాయ నమో నమః !

వ్యాస మహర్షి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం .

వేదవ్యాసుడు జన్మ వృత్తాంతం అష్టాదశ పురాణాలలొ పెక్కు మార్పు మార్లు చెప్పబడింది. ఈ దిగువ నున్న వృత్తాంతం మహాభారతము ఆది పర్వం తృతీయా ఆశ్వాసము నండి గ్రహించబడింది.

పూర్వకాలములో చేది రాజ్యాన్ని వసువు అనే మహారాజు పరిపాలన చేస్తుండేవాడు, ఒకరోజు వేటకు అడవికి వెళ్ళిన రాజు ఆ అడవి లో మునులు తపస్సు చేయడము చూసి తాను తపస్సు చేయడం ఆరంభించాడు. అప్పుడు ఇంద్రుడు అది గ్రహించి ఆ మహారాజు వద్దకు వెళ్ళి దైవత్వము ప్రసాదిస్తున్నాని చెప్పి ఒక విమానాన్ని ఇచ్చి, భూలోకములో రాజ్యం చేస్తూ, అప్పుడప్పుడు స్వర్గానికి రమ్మని చెబుతాడు. ఇంద్రుడు వేణుదుస్టి అనే అతి పరాక్రమ వంతమైన ఆయుధాన్ని కుడా ప్రసాదిస్తాడు. వసువు నివసిస్తున్న నగరానికి ప్రక్కగా శుక్తిమతి అనే నది ఉన్నది. శుక్తిమతి అనే నది ప్రక్కన ఉన్న కోలహలుడు అనే పర్వతము శుక్తిమతి మీద మోజుపడి ఆ నదిలో పడతాడు. అప్పుడు ఆ నది మార్గములో వెళ్తున్న వసువు తన ఆయుధంతో కోలహలుడిని ప్రక్కన పాడేస్తాడు. శుక్తిమతికి మరియు కోలహలుడికి మధ్య జరిగిన సంపర్కము వలన గిరిక అనే కుమార్తె వసుపదుడు అనే కుమారుడు జన్మిస్తారు. శుక్తిమతి వారివురిని వసువు కి కానుక గా ఇస్తుంది. వసువు గిరికని వివాహం చేసుకొంటాడు. వసువు వసుపదుడు ని సైన్యాధిపతిగా చేస్తాడు. ఒకరోజు వసువు వేటకు వెళ్తాడు అప్పుడు తన భార్య గిరిక గుర్తు రావడం తో రేతస్సు పడుతుంది. ఆ పడిన రేతస్సుని ఒక దొన్నెలో చేర్చి , ఆ దొన్నెని డేగకి ఇచ్చి తన భార్యకి ఇవ్వమంటాడు. ఆ డేగ ఆ దొన్నెను తీసుకొని పోవుతుండగా మరో డేగ చూసి అది ఏదో తినే పదార్థం అని ఆలోచించి, ఆ డేగతో పోట్లాడూతుంది అప్పుడూ ఆ రేతస్సు యమునా నదిలో పడుతుంది. ఆ యమునా నదిలో ఉన్న ఒక చేప ఆ రేతస్సు అని భక్షిస్తుంది ఆ భక్షించడం వల్ల అది అండంతో కూడి పిండం గా మారుతుంది. ఒకరోజు బెస్తవారు చేపలు పట్టు తుండగా ఈ చేప చిక్కుతుంది. ఆ చేపను బెస్తవారు వారి రాజైన దాశరాజు వద్దకు తీసుకొని పోతారు.

దాశరాజు ఆ చేపని చీల్చి చూడగా ఆ చేపలొ ఒక మగ శిశువు మరియు మరో ఆడ శిశువు ఉంటారు. బ్రహ్మ శాపం వల్ల ఒక అద్రిక అనే అప్సరస చేప క్రింద మారి యమునా నదిలో ఉంది. చేపని చీల్చిన వేంటనే అ చేప అక్కడ నుండి అంతర్థానమై పోయింది. ఆ మగ బిడ్డ పెద్దవాడై ఆ రాజ్యానికి రాజయ్యాడు. ఆ బాలిక మత్స్యగంధి పేరుతో పెద్దదయ్యింది. మత్స్యగంధి తండ్రి లేనప్పుడు యమునా నది పై నావ నడుపుతుండేది. ఇలా జరుగుతుండగా ఒక రోజు వశిష్ట మహర్షి మనమడు, శక్తి మహర్షి కుమారుడాయిన పరాశరుడు ఆ నది దాటడానికి అక్కడ కు వస్తాడు.

అక్కడ కనిపించిన మత్స్యగంధిని చూసి మోహించే రతి సుఖాన్ని ఇవ్వమంటాడు, అప్పుడు మత్స్యగంధి తన శరీరం అంతా చేపల వాసనతో ఉంటుందని, కన్యత్వం చెడిన తాను తన తండ్రికి ఏవిధంగా మొగము చూపగలని ప్రశ్నిస్తుంది. అప్పుడు పరాశరుడు మత్స్యగంధి వసువు వీర్యానికి అద్రిక నే అప్సరసకి జన్మించినది అనిజన్మ వృత్తాంతం చెబుతాడు. చేపల వాసన పోయేటట్లుగా ఒక యోజన దూరము వరకు సుగంధం వెదజల్లేటట్లు వరాన్ని ఇస్తాడు. అప్పటి నుండి యోజన గంధిగా పేరు పొందింది. అప్పటి రతి గరపడానికి సంకోచిస్తున్న మత్స్యగంధి తో పరాశరుడు ఆమె కన్యత్వం చెడకుండా ఉండే వరాన్ని ఇస్తాడు. పగటి పూట రతి సలపడం అనే విషయం వ్యక్తపరిస్తే , అక్కడా ఉన్న ప్రదేశాన్ని మేఘాలతో కప్పేస్తాడు. ఆ విధంగా రతి జరపగా ఒక తేజోవంతుడైన శిశువు జన్మిస్తాడు. ఆ శిశువు పుట్టిన వెంటనే తల్లికి తండ్రికి నమస్కరించి తపస్సుకి వెళ్ళి పోతాడు. తల్లికి ఎప్పుడైన మననం చేసుకొంటే ప్రత్యక్షమయ్యే వరాన్ని ఇస్తాడు.

వ్యాసుడు జన్మించిన వెంటనే తల్లి అనుమతితో తపోవనానికి వెళతాడు. ఆ తరువాత సత్యవతీ శంతనుల వివాహం జరిగింది. వివాహకాలంలో దాశరాజు విధించిన షరతుకారణంగా భీష్ముడు ఆమరణాంతం బ్రహ్మచర్య వ్రతం అవలంబిస్తానని భీషణ ప్రతిజ్ఞ చేశాడు. శంతనుని మరణం తరువాత వారి కుమారులైన చిత్రాంగధుడు బలగర్వంతో గంధర్వుని చేతిలో మరణం చెందాడు. విచిత్రవీరుడు సుఖలాలసతో అకాలమరణం చెందాడు. భరతవంశం వారసులను కోల్పోయిన తరుణంలో సత్యవతి భరతవంశ పునరుద్ధరణ కొరకు తన పుత్రుడైన వ్యాసుని మనన మాత్రంచే తన వద్దకు రప్పించింది. భరతవంశాన్ని నిలపమని వ్యాసునికి ఆదేశించింది. తల్లి ఆదేశాన్ననుసరించి వ్యాసుడు అంబికకు దృతరాష్ట్రుని, అంబాలికకు పాండురాజుని మరియు దాశీకు విదురుని ప్రసాదించి తిరిగి తపోవనానికి వెళతాడు. ఆతరువాత వ్యాసుడు గాంధారి గర్భస్రావం సమయంలో ప్రవేశించి గాంధారి మృత పిండం నూట ఒక్క నేతికుండలలో పెట్టి వాటిని పరిరక్షించే విధానాన్ని చెప్పి తిరిగి తనదారిన తాను వెళతాడు. ఆతరువాత దుర్యోధనుడు భీమునిపై మూడుమార్లు హత్యాప్రయత్నం జరిపిన పిమ్మట తన తల్లికి కురువంశంలో రానున్న పెను దుష్పరిణామాలు సూచించి వాటిని ఆమె తట్టుకోవడం కష్టమని తపోవనానికి వెళ్ళి ప్రశాంత జీవితం గడపమని సూచించి తిరిగి తనదారిన తాను వెళతాడు. ఆ తరువాత లక్క ఇంటి దహనం తరువాత హిడింబాసురుని మరనానంతరం హిడింబి భవిష్య సూచనపై శాలిహోత్రుడు నివశించిన ఆశ్రమప్రాంతంలో పాడవులు నివసించే సమయంలో వ్యాసుడు పాండవుల చెంతకు వచ్చి వారికి ఊరట కలిగించాడు. ఆ ఆశ్రమ మహత్యం చెప్పి అక్కడ సరస్సులో జలము త్రాగిన వారికి ఆకలి దప్పులు ఉండవని, అక్కడి వృక్షముకింద నివసించే వారికి శైత్య, వాత, వర్ష, ఆతప భయములుండవని సలహా అందించాడు. భీముని వివాహమాడ కోరిన హిడింబను కోడలిగా చేసుకోవడానికి సంశయిస్తున్న కుంతీదేవికి హిడింబ పతివ్రత అని ఆమెను కోడలిగా చేసుకోవడం శుభప్రథమని ఆమె సంతానం ద్వారా పాండవులకు సహాయమందగలరచి సూచించి తనదారిని తాను వెళతాడు. ఆ తరువాత కాలంలో ద్రౌపతీ స్వయంవరానికి ముందుగా పాందవులకు దర్శనమిచ్చి వారికి ద్రౌపతి పూర్వజన్మ వృత్తాంతం వివరించి స్వయంవరానికి వెళ్ళమని వారికి శుభంకలుగుతందని చెప్పి ద్రౌపతీ వివాహం తీరు ముందుగానే సూచించి అంతర్ధాన మయ్యాడు.
రచన:: చాగంటి కోటేశ్వర రావు గారు 

Sunday, July 21, 2013

వైద్యనాథాష్టకము:::Vaidhyanaadhaashtakam

















పరమశివుడు వైద్యులకు అధిపతిగా కూడా పేరొందాడు. 
శ్రీ రుద్రాభిషేచనంలో చాలా భాగం దీన్ని వక్కాణిస్తుంది.  
నమకం, చమకంలో పూర్తి ప్రార్థన, ఫలితం కూడా రోగ నివారణ, 
ఆరోగ్యము, దీర్ఘాయుష్షు గురించి చెపుతాయి. 
అందుకనే శివుని వైద్యనాథుడిగా కొలుస్తారు. 
దీనికి జ్యోతిర్లింగ స్వరూపమే మహారాష్ట్ర అంబజోగై సమీపం లోని వైద్యనాథ దేవాలయం. 
అలాగే, తమిళనాట చిదంబరం దగ్గర వైదీశ్వరన్ కోవిల్ ఈ స్వామి మహాత్మ్యాన్ని తెలిపేదే.


జటాయు అంత్యక్రియలు, కుష్ఠు వ్యాధితో బాధపడుతున్న అంగారకునికి (కుజ గ్రహం) రోగ నివారణ ఇక్కడే జరిగాయని గాథ. సుబ్రహ్మణ్యునికి శూలము కూడా ఇక్కడ శివుని ప్రార్థించిన తర్వాతే లభించిందని ఇక్కడి ప్రజల విశ్వాసం. ఇక్కడి సిద్ధామృత తీర్థం (పుష్కరిణిలో నీరు), అంగసనాతన తీర్థంలో స్నానం చేసి,  వేప చెట్టు క్రింద మట్టి తీసుకుని పవిత్ర భస్మముతో కలిపి దేవునికి సమర్పించి ఆ సిద్ధామృత తీర్థంతో తీసుకుంటే సర్వ రోగ నివారణ అవుతుందని గట్టి విశ్వాసం. అలాగే ఆ వైద్యనాథుని ఈ క్రింది స్తోత్రము రోజుకు మూడు సార్లు చదివితే ఆరోగ్యం కలుగుతుందట. అంతటి మహిమాన్వితమైన వైద్యనాథ అష్టకం

వైద్యనాథాష్టకము

1::శ్రీ రామ సౌమిత్రి జటాయు వేద
షడాననాదిత్య కుజార్చితయ
శ్రీ నీలకంఠాయ దయామయాయ
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ

2::గంగా ప్రవాహేందు జటాధరయ
త్రిలోచనాయ స్మర కాల హంత్రే
సమస్త దేవైరపి పూజితాయ
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ

3::భక్త ప్రియాయ త్రిపురాంతకాయ
పినాకినీ దుష్ట హరాయ నిత్యమ్
ప్రత్యక్ష లీలాయ మనుష్య లోకే
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ

4::ప్రభూత వాతాది సమస్త రోగ
ప్రణాశ కర్త్రే ముని వందితాయ
ప్రభాకరేంద్ర్వగ్ని విలోచనాయ
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ

5::వాక్శ్రోత్ర నేత్రాంఘ్రి విహీన జంతోః
వాక్శ్రోత్ర నేత్రాంఘ్రి సుఖ ప్రదాయ
కుష్ఠాది సర్వోన్నత రోగ హంత్రే
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ

6:వేదాంత వేద్యాయ జగన్మయాయ
యోగీశ్వర ధ్యేయ పదాంబుజాయ
త్రిమూర్తి రూపాయ సహస్ర నామ్నే
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ

7::స్వతీర్థ మృడ్భస్మ భృతాంగ భాజాం
పిశాచ దుఃఖార్తి భయాపహాయ
ఆత్మ స్వరూపయ శరీర భాజాం
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ

8::శ్రీ నీలకంఠాయ వృష ధ్వజాయ
స్రక్గంధ  భస్మాద్యభి శోభితాయ
సుపుత్రదారాది సుభాగ్యదాయ
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ


ఫల శ్రుతిః

బాలాంబికేశ వైద్యేశ భవ రోగ హరేతి చ
జపేన్నామ త్రయం నిత్యం మహారోగ నివారణం



Vaidhyanaadhaashtakam  

1:Sree rama soumithri jatayu veda,
Shadanadithya kujarchithya,
Sree neelakandaya daya mayaya,
Sree Vaidyanathaya namasivaya.

I salute that God Shiva,
Who is the king among physicians,
Who is worshipped by Rama and Lakshmana,
Who is worshipped by Jatayu,
Who is worshipped by the Vedas,
Who is worshipped by Lord Subrahmanya,
Who is worshipped by the Sun God,
Who is worshipped by the Mars God,
Who is having a blue neck,
And who is the personification of mercy.

2:Ganga pravahendu jada dharaya,
Trilochanaya smara kala hanthre,
Samstha devairapi poojithaya,
Sree Vaidyanathaya namasivaya.

I salute that God Shiva,
Who is the king among physicians,
Who wears the flow of Ganges and the moon,
On his head,
Who has three eyes,
Who had killed the God of love and death,
And who is worshipped by all Devas.

3:Bhaktha priyaya, tripuranthakaya,
Pinakine dushta haraya nithyam,
Prathyaksha leelaya manushya loke,
Sree Vaidyanathaya namasivaya.

I salute that God Shiva,
Who is the king among physicians,
Who is the lover his devotees,
Who has destroyed the three cities,
Who holds the bow called Pinaka,
Who destroys bad people daily,
And who plays in the world of humans.

4:Prabhootha vadadhi samastha roga,
Pranasa karthre muni vandhthithaya,
Prabhakarennd wagni vilochanaya,
Sri Vaidyanathaya namasivaya.

I salute that God Shiva,
Who is the king among physicians,
Who cures all great diseases,
Like rheumatism and arthritis,
Who is saluted by great sages,
And to whom, the sun god,
Moon and God of fire are eyes.

5:Vakchrothra nethrangiri viheena jantho,
Vakchrothra nethrangiri sukha pradaya,
Kushtadhi sarvonnatha roga hanthre,
Sri Vaidyanathaya nama sivaya.

I salute that God Shiva,
Who is the king among physicians,
Who blesses those beings,
Who have lost their speech, hearing, sight and ability to walk,
With these abilities,
And who provides cure,
For devastating diseases like leprosy.

6:Vedantha vedhyaya jagan mayaya,
Yogiswara dhyeya Padambujaya,
Trimurthy roopaya sahasra namne,
Sri Vaidyanathaya namasivaya.

I salute that God Shiva,
Who is the king among physicians,
Who can be known through vedanta,
Who is spread throughout the universe,
Who has lotus feet,
That is meditated upon by great sages,
Who is of the form of the holy trinity,
And who has thousand names.

7:Swatheertha mrudbasma brudanga bajam,
Pisacha dukha arthi bhayapahaya,
Athma swaroopaya sareera bajaam,
Sri Vaidyanaathaya namasivaya.

I salute that God Shiva,
Who is the king among physicians,
Who removes all sufferings,
Caused by bad spirits, sorrows and fears,
By dip in his holy tank,
By the holy ash in the temple,
And by the mud below the neem tree of the temple,
And who is the personification of soul,
Occupying human body.

8:Sree neelakandaya vrushaba dwajaya,
Sarakkanda basmadhya abhi shobithaya,
Suputhradarathi subagyathaya,
Sri Vaidyanathaya namasivaya.

I salute that God Shiva,
Who is the king among physicians,
Who has a blue neck,
Who has the bull on his flag,
Who shines by flowers, sacred ash and sandal,
Who grants good children and good wife,

And who blesses us with all good luck.


Vaidhyanaadhaashtakam  

Sree rama soumithri jatayu veda,
Shadanadithya kujarchithya,
Sree neelakandaya daya mayaya,
Sree vaidyanathaya namasivaya. 

Ganga pravahendu jada dharaya,
Trilochanaya smara kala hanthre,
Samstha devairapi poojithaya,
Sree vaidyanathata namasivaya.

Bhaktha priyaya, tripuranthakaya,
Pinakine dushta haraya nithyam,
Prathyaksha leelaya manushya loke,
Sree vaidyanathaya namasivaya.

Prabhootha vadadhi samastha roga,
Pranasa karthre muni vandhthithaya,
Prabhakarennd wagni vilochanaya,
Sri vaidyanathaya nama sivaya.

Vakchrothra nethrangiri viheena jantho,
Vakchrothra nethrangiri sukha pradaya,
Kushtadhi sarvonnatha roga hanthre,
Sri Vaidyanathaya nama sivaya.

Vedantha vedhyaya jagan mayaya,
Yogiswara dhyeya Padambujaya,
Trimurthy roopaya sahasra namne,
Sri vaidyanathaya nama sivaya.

Swatheertha mrudbasma brudanga bajam,
Pisacha dukha arthi bhayapahaya,
Athma swaroopaya sareera bajaam,
Sri Vaidyanaathaya namasivaya.

Sree neelakandaya vrushaba dwajaya,
Sarakkanda basmadhya abhi shobithaya,
Suputhradarathi subagyathaya,
Sri vaidyanathaya nama sivaya.
Balambikesa vaidyesa bava roga haredisa,

Japen nama thrayam nithyam maha roga nivaranam.



తాత్పర్యము::

శ్రీ రాముడు, లక్ష్మణుడు, జటాయువు, వేదములు, సుబ్రహ్మణ్య స్వామి, సూర్యుడు, అంగారకుడిచే 
పూజించబడిన, నీలకంఠము కలవాడు, దయామయుడు, వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములు.

ప్రవహించే గంగను,చంద్రుని జటా ఝూటములో ధరించిన,మూడు కన్నులు కలవాడు,మన్మథుని,యముని 
సంహరించిన వాడు,దేవతలందరి చేత పూజించ బడినవాడు,వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములు.

భక్త ప్రియుడు, త్రిపురములను నాశనము చేసిన వాడు,పినాకమును(త్రిశూలమును)చేతిలో ధరించిన వాడు, 
నిత్యము దుష్టులను సంహరించే వాడు,వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములు.

వాతము, కీళ్ళనొప్పులు మొదలగు రోగములను నాశనము చేసే వాడు, మునులచే పూజించబడిన వాడు, 
సూర్యుడు, చంద్రుడు, అగ్ని నేత్రములుగా కలవాడు, వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములు.


వాక్కు, వినికిడి శక్తి, కాంతి చూపు, నడిచే శక్తి కోల్పోయిన జీవ రాశులకు ఆ శక్తులను తిరిగి కలిపించే వాడు,  కుష్ఠు మొదలగు భయంకరమైన రోగములను నిర్మూలము చేసి ఆరోగ్యాన్ని ప్రసాదించే వాడు, వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములు.

వేదముల ద్వారా తెలుసుకొనే దైవము, విశ్వమంతా వ్యాపించి యున్నవాడు, యోగులచే ధ్యానింపబడిన పాద పద్మములు 
కలిగిన వాడు,త్రిమూర్తుల రూపమైన వాడు,సహస్ర నామములు కలవాడు,వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములు.

ఆయన దేవాలయమున ఉన్న పుణ్య పుష్కరిణీ స్నానము వలన, వేపచెట్టు క్రింద మట్టి మరియు భస్మము వలన భూత ప్రేతముల బాధ, దుఃఖములు, కష్టములు, భయములు, రోగములు తొలగించే, ఆత్మ స్వరూపుడై దేహము నందు నివసిస్తున్న,వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములు.

నీలకంఠుడు, వృషభమును (ఎద్దును) పతాకమందు చిహ్నముగా కలవాడు,  పుష్పములు, గంధము, భస్మముచే అలంకరించబడి శోభిల్లే వాడు, సుపుత్రులు, మంచి ధర్మపత్ని, సత్సంపదలు, అదృష్టములు ఇచ్చే వాడు,  వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములు.

ఫల శృతి: 

బాలాంబిక పతి, జరామరణముల భయమును పోగొట్టేవాడు అయిన వైద్యనాథుని ఈ వైద్యనాథాష్టకం ప్రతి దినము మూడు సార్లు పఠించే వారికి సకల రోగ నివారణ కలుగును.

వీరిచే పోస్ట్ చెయ్యబడింది Prasad Akkiraju

శివ సువర్ణమాలాస్తుతి::Siva Suvarnamaalaa Stuti
























1}అథ కథమపి మద్రసనాం త్వద్గుణలేశైర్విశోధయామి విభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం 

2}అఖండమదఖండన పండిత తండు ప్రియ చండీశ విభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం 

3}ఇభచర్మాంబర శంబరరిపువపురపహరణోజ్జ్వలనయన విభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం 

4}ఈశ గిరీశ నరేశ పరేశ మహేశ బిలేశయ భూషణ భో 
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం 

5}ఉమయా దివ్య సుమంగళ విగ్రహ యాలింగిత వామాంగ విభో 
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం 

6}ఊరీ కురు మామజ్ఞమనాథం దూరీ కురు మే దురితం భో 
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం 

7}ఋషివర మానస హంస చరాచర జనన స్థితి లయ కారణ భో 
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం 

8}ఋక్షాధీశకిరీటమహోక్షారూఢ విధృత రుద్రాక్ష విభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం 

9}లువర్ణ ద్వంద్వమవృంతకుసుమమివాంఘ్రౌ తవార్పయామి విభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం 

10}ఏకం సదితిశ్రుత్యా త్వమేవ సదసీత్యుపాస్మహే మృడభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం 

11}ఐక్యంనిజభక్తేభ్యో వితరసి విశ్వంభరోఽత్ర సాక్షి విభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం 

12}ఓమితి తవ నిర్దేష్ట్రీ మాయాస్మాకం మృడోపకర్త్రీ భో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం 

13}ఔదాసీన్యం స్ఫుటయతి విషయేషు దిగంబరత్వం తవైవ విభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం 

14}అంతఃకరణ విశుద్దిం భక్తిం చ త్వయి సతీం ప్రదేహి విభో 
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం 

15}అస్తోపాధి సమస్తవ్యస్తై రూపై జగన్మయోఽసి విభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం 

16}కరుణా వరుణాలయ మయిదాస ఉదాసస్తవోచితో న హి భో 
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం 

17}ఖలసహవాసం విఘటయ ఘటయ సతామేవసంగ మనిశం భో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం 

18}గరళం జగదుపకృతయే గిళితం భవతాసమోఽస్తికోఽత్ర విభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం 

19}ఘనసారగౌరగాత్ర ప్రచుర జటాజూటబద్ధగంగ విభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం 

20}జ్ఞప్తి స్సర్వశరీరే ష్వఖండితా యా విభాతి సా త్వం భో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం 

21}చపలం మమహృదయకపిం విషయద్రుచరం దృఢంబధాన విభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం 

22}ఛాయా స్థాణోరపి తవతాపం నమతాం హర త్వహో శివభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం 

23}జయ కైలాశ నివాస ప్రమథ గణాధీశ భూ సురార్చిత భో 
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం 

24}ఝనుతక జంకిణు ఝనుతత్కిట తక శబ్దైర్నటసి మహానట భో 
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం 

25}జ్ఞానం విక్షేపావృతిరహితం కురు మే గురు స్త్వమేవ విభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం 

26}టంకార స్తవధనుషో దళయతి హృది ద్విషామశనిరివభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం 

27}ఠాకృతిరివ తవమాయా బహిరంతశ్శూన్యరూపిణీ ఖలు భో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం 

28}డంబరమంబురుహామపి దళయ త్యఘానాం త్వదంఘ్రియుగం భో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం 

29}ఢక్కాక్షసూత్రశూలద్రుహిణకరోటీసముల్లసత్కరభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం 

30}ణాకారగర్భిణీచే చ్ఛుభదాతేశరగతి ర్నృణామిహ భో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం 

31}తవ మనుమితిసంజపత స్సద్యస్తరంతిమనుజా భవాబ్ధిం భో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం 

32}థూత్కార స్తస్యముఖే భవన్నామ యత్ర నాస్తి విభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం 

33}దయనీయశ్చ దయాళుః కోఽస్తిమదన్య స్త్వదన్య ఇహవదభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం 

34}ధర్మస్థాపన దక్ష త్ర్యక్ష గురో దక్ష యజ్ఞశిక్షక భో 
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం 

35}ననుతాడితోఽసి ధనుషా లుబ్ధతయాత్వం పురా నరేణా విభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం 

36}పరిమాతుం తవమూర్తింనాలమజ స్తత్పరాత్పరోఽసి విభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం 

37}ఫలమిహ నృతయా జనుష స్త్వత్పదసేవా సనాతనేశ విభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం 

38}బలమారోగ్యం చాయుస్త్వద్గుణ రుచితాం చిరం ప్రదేహి విభో 
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం 

39}భగవన్ భర్గ భయాపహ భూత పతే భూతిభూషితాంగ విభో 
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం 

40}మహిమా తవ నహి మాతి శ్రుతిషు హిమానీధరాత్మజాధవ భో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం 

41}యమనియమాదిరభిరంగై ర్యమినో హృది యం భజంతి స త్వం భో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం 

42}రజ్జావహిరివ శుక్తౌ రజతమివ త్వయి జగంతి భాంతి విభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం 

43}లబ్ధ్వా భవత్ప్రసాదా చ్చక్రమఖిలం విధురవతి లోకమఖిలం భో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం 

44}వసుధా తద్ధరతచ్చయరథమౌర్వీశరపరాకృతాసుర భో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం 

45}శర్వ దేవ సర్వోత్తమ సర్వద దుర్వృత్త గర్వహరణ విభో 
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం 

46}షడ్రిపు షడూర్మి షడ్వికార హర సన్ముఖ షణ్ముఖ జనక విభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం 

47}సత్యం జ్ఞానమనంతం బ్రహ్మే త్యేతల్లక్షణ లక్షిత భో 
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం 

48}హాఽహాఽహూఽహూ ముఖ సురగాయక గీతా పదాన పద్య విభో 
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం 

49}ళాదిర్నహిప్రయోగ స్తదంతమిహ మంగళం సదాస్తు విభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం 

50}క్షణమివదివసాన్నేష్యతి త్వత్పదసేవాక్షణోత్సుకశ్శివవిభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం 

ఈశాయ వాసుదేవాయ శ్రీపాదైరర్పితా సువర్ణమయీ
మాలేయం కంఠే విధృతా దదాతి పురుషార్థాన్

::: ఇతి శ్రీ శంకరాచార్య కృత సువర్ణమాలాస్తుతిః :::

Siva Suvarnamaalaa Stuti

1::atha kathamapi madrasanaam tvadgunalesairvisodhayaami vibho
saamba sadaasiva sambho sankara saranam me tava charanayugam

2::akhanDamadakhanDana panDita tanDu priya chanDeeSa vibho
saamba sadaasiva sambho sankara saranam me tava charanayugam 

3::ibhacharmaambara Sambararipuvapurapaharanojjvalanayana vibho
saamba sadaasiva sambho sankara saranam me tava charanayugam 

4::eeSaa gireeSaa nareSaa pareSaa maheSaa bileSaya bhooshana bho 
saamba sadaasiva sambho sankara saranam me tava charanayugam

5::umayaa divya sumangala vigraha yaalingita vaamaanga vibho 
saamba sadaasiva sambho sankara saranam me tava charanayugam

6::ooree kuru maamajnamanaatham dooree kuru me duritam bho 
saamba sadaasiva sambho sankara saranam me tava charanayugam

7::Rushivara maanasa hamsa charaachara janana sthiti laya kaarana bho 
saamba sadaasiva sambho sankara saranam me tava charanayugam 

8::RukshaadheeSakireetamahOkshaaroodha vidhruta rudraaksha vibho
saamba sadaasiva sambho sankara saranam me tava charanayugam

9::luvarna dvandvamavruntakusumamivaanghrau tavaarpayaami vibho
saamba sadaasiva sambho sankara saranam me tava charanayugam

10:Ekam saditiSrutyaa tvameva sadaseetyupaasmahe mrudabho
saamba sadaasiva sambho sankara saranam me tava charanayugam

11:aikyamnijabhaktaebhyo vitarasi viSvambharotra saakshi vibho
saamba sadaasiva sambho sankara saranam me tava charanayugam

12:Omiti tava nirdeshtree maayaasmaakam mudopakartree bho
saamba sadaasiva sambho sankara saranam me tava charanayugam

13:audaaseenyam sphutayati vishayeshu digambaratvam tavaiva vibho
saamba sadaasiva sambho sankara saranam me tava charanayugam

14:aMta:karana viSuddim bhaktim cha tvayi sateem pradehi vibho
saamba sadaasiva sambho sankara saranam me tava charanayugam

15:astopaadhi samastavyastai roopai jaganmayosi vibho
saamba sadaasiva sambho sankara saranam me tava charanayugam

16:karunaa varunaalaya mayidaasa udaasastavochito na hi bho 
saamba sadaasiva sambho sankara saranam me tava charanayugam

17:khalasahavaasam vighataya ghataya sataamevasanga maniSam bho
saamba sadaasiva sambho sankara saranam me tava charanayugam

18:garalam jagadupakrutaye gilitam bhavataasamostikOtra vibho
saamba sadaasiva sambho sankara saranam me tava charanayugam

19:ghanasaaragauragaatra prachura jataajootabaddhaganga vibho
saamba sadaasiva sambho sankara saranam me tava charanayugam

20:jnapti ssarvaSareere shvakhanditaa yaa vibhaati saa tvam bho
saamba sadaasiva sambho sankara saranam me tava charanayugam

21:chapalam mamahrudayakapim vishayadrucharam drudhambadhaana vibho
saamba sadaasiva sambho sankara saranam me tava charanayugam 

22:Chaayaa sthaanorapi tavataapam namataam hara tvaho Sivabho
saamba sadaasiva sambho sankara saranam me tava charanayugam 

23:jaya kailaaSa nivaasa pramatha ganaadheeSa bhoo suraarchita bho 
saamba sadaasiva sambho sankara saranam me tava charanayugam

24:jhanutaka jankinu jhanutatkita taka Sabdairnatasi mahaanata bho
saamba sadaasiva sambho sankara saranam me tava charanayugam 

25:jnaanam vikshepaavrutirahitam kuru me guru stvameva vibho
saamba sadaasiva sambho sankara saranam me tava charanayugam 

26:Tankaara stavadhanusho dalayati hrudi dvishaamaSanirivabho
saamba sadaasiva sambho sankara saranam me tava charanayugam 

27:Thaakrutiriva tavamaayaa bahiramtassoonyaroopinee khalu bho
saamba sadaasiva sambho sankara saranam me tava charanayugam 

28:Dambaramamburuhaamapi dalaya tyaghaanaam tvadaMghriyugam bho
saamba sadaasiva sambho sankara saranam me tava charanayugam

29:DhakkaakshasootraSooladruhinakaroteesamullasatkarabho
saamba sadaasiva sambho sankara saranam me tava charanayugam

30:Naakaaragarbhineeche chChubhadaateSaragati rnrnaamiha bho
saamba sadaasiva sambho sankara saranam me tava charanayugam

31:tava manumitisamjapata ssadyastaramtimanujaa bhavaabdhim bho
saamba sadaasiva sambho sankara saranam me tava charanayugam 

32:thootkaara stasyamukhe bhavannaama yatra naasti vibho
saamba sadaasiva sambho sankara saranam me tava charanayugam

33:dayaneeyaScha dayaalu: kostimadanya stvadanya ihavadabho
saamba sadaasiva sambho sankara saranam me tava charanayugam

34:dharmasthaapana daksha tryaksha guro daksha yajnaSikshaka bho 
saamba sadaasiva sambho sankara saranam me tava charanayugam

35:nanutaaditosi dhanushaa lubdhatayaatvam puraa narenaa vibho
saamba sadaasiva sambho sankara saranam me tava charanayugam 

36:parimaatum tavamoortimnaalamaja statparaatparosi vibho
saamba sadaasiva sambho sankara saranam me tava charanayugam

37:phalamiha nrutayaa janusha stvatpadasevaa sanaatanesa vibho
saamba sadaasiva sambho sankara saranam me tava charanayugam

38:balamaarogyam chaayustvadguNa ruchitaam chiram pradehi vibho 
saamba sadaasiva sambho sankara saranam me tava charanayugam

39:bhagavan bharga bhayaapaha bhoota pate bhootibhooshitaanga vibho 
saamba sadaasiva sambho sankara saranam me tava charanayugam

40:mahimaa tava nahi maati Srutishu himaaneedharaatmajaadhava bho
saamba sadaasiva sambho sankara saranam me tava charanayugam

41:yamaniyamaadirabhirangai ryamino hrudi yam bhajanti sa tvam bho
saamba sadaasiva sambho sankara saranam me tava charanayugam

42:rajjaavahiriva Suktau rajatamiva tvayi jaganti bhaamti vibho
saamba sadaasiva sambho sankara saranam me tava charanayugam 

43:labdhvaa bhavatprasaadaa chchakramakhilam vidhuravati lokamakhilam bho
saamba sadaasiva sambho sankara saranam me tava charanayugam

44:vasudhaa taddharatachchayarathamaurveeSaraparaakrutaasura bho
saamba sadaasiva sambho sankara saranam me tava charanayugam

45:Sarva deva sarvottama sarvada durvrtta garvaharana vibho 
saamba sadaasiva sambho sankara saranam me tava charanayugam

46:shadripu shadoormi shadvikaara hara sanmukha shanmukha janaka vibho
saamba sadaasiva sambho sankara saranam me tava charanayugam

47:satyam jnaana manantam brahme tyetallakshana lakshita bho 
saamba sadaasiva sambho sankara saranam me tava charanayugam 

48:haaఽhaaఽhooఽhoo mukha suragaayaka geetaa padaana padya vibho 
saamba sadaasiva sambho sankara saranam me tava charanayugam

49:Laadirnahi prayoga stadantamiha mangalam sadaastu vibho
saamba sadaasiva sambho sankara saranam me tava charanayugam 

50:Kshanamivadivasaanneshyati tvatpadasevaakshnotsukassivavibho
saamba sadaasiva sambho sankara saranam me tava charanayugam

eeSaaya vaasudevaaya Sreepaadairarpitaa suvarnamayee
maaleyam kanthe vidhrtaa dadaati purushaarthaan


!!! iti Sree Sankaraachaarya Kruta Snamaalaastuti: !!!

పార్వతీ వల్లభ నీలకంఠాష్టకమ్





















1::నమో భూతనాథం నమో దేవ దేవం నమః కాలకాలం నమో దివ్యతేజం
నమః కామభస్మం నమశ్శాంతశీలం భజే పార్వతీ వల్లభం నీలకఠం

2::సదా తీర్థసిద్ధం సదా భక్తరక్షం సదా శైఅవపూజ్యం సదా శుద్ధ భస్మం
సదా ధ్యానయుక్తం సదాజ్ఞానతల్పం భజే పార్వతీ వల్లభం నీలకంఠం

3::శ్మశానం శయానం మహాస్థానవాసం శరీరం గజానాం సదాచర్మ వేష్టమ్
పిశాచం నిశొచం పశూనాం ప్రతిష్టం భజే పార్వతీ వల్లభం నీలకంఠం

4::ఫణీ నాగకంఠే భుజంగాద్యనేకం గళేరుండమాలం మహావీరశూరం
కటిం వ్యాఘ్రచర్మం చితాభస్మ లేపం భజే పార్వతీ వల్లభం నీలకంఠం

5::శిరశ్సుద్ధ గంగా శివా వామభాగం బృహద్దీర్ఘ కేశం సదామాం త్రినేత్రం
ఫణీనాగకఋనం సదా బాలచంద్రం భజే పార్వతీ వల్లభం నీలకంఠం

6::కరే శూలధారం మహాకష్టనాశం సురేశం పరేశం మహేశం జనేశం
ధనేశస్తుతేశం ధ్వజేశం గిరీశం భజే పార్వతీ వల్లభం నీలకంఠం

7::ఉదాసం సుదాసం సుకైలాస వాసం ధరానిర్ధరం సంస్థితం హ్యదిదేవం
అజ హేమకల్పద్రుమం కల్పసేవ్యం భజే పార్వతీ వల్లభం నీలకంఠం

8::మునీనాం వరేణ్యం గుణం రూపవర్ణం ద్విజా నాం పఠంతం శివం వేదశాస్త్రం
అహో దీనవత్సం కృపాలం శివం హి భజే పార్వతీ వల్లభం నీలకంఠం

9::సదా భావనఠ స్సదా సెవ్యమానం సదా భక్తి దేవం సదా పూజ్యమానం
సదాతీర్థవాసం సదా సేవ్యమేకం భజే పార్వతీ వల్లభం నీలకంఠం 

:::ఫలం:ఇష్టకామ్యర్ధసిద్ధి, ఆధ్యాత్మికాభివృద్ధి.:::

Friday, July 19, 2013

చంద్రశేఖరేంద్ర స్తుతి

















1::కరుణా పర పర్యాయ కటాక్ష ప్రసృతి ప్రభః 
చిత్తస్య శాంతి దాతా మే హృది స్యాత్ చంద్రశేఖరః 

అర్థం::ఆయన కొనకంటి చూపు నుంచీ ప్రసరంచే కాంతి కరుణాపరత్వానికి మరో రూపం అనేలా ఉంటుంది. అలా మనస్సుకు శాంతి నిచ్చే వారయిన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి నా హృదయములో నిలచి యుందురు గాక.   

2::కామేశ తత్త్వ సర్వస్వ కలనామల మానసః 
అమృతాత్మా సమాత్మా మే హృది స్యాత్ చంద్రశేఖరః 

అర్థం: తంత్ర శాస్త్రంలోని 'కామేశ్వర' అనే తత్త్వమంతా నిండిన స్వచ్ఛమయిన మనసు వారిది. ఉపనిషత్తులలోని 'అమృతాత్మ' తత్త్వం తో సమానమయిన తత్త్వం (స్వభావం) గలవారయిన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి నా హృదయములో నిలచి యుందురు గాక.   

3::దక్షిణా చిన్మయీ మూర్తిః యస్య విశ్వాతిశాయినీ 
దక్షిణామూర్తి రూపో మే హృది స్యాత్ చంద్రశేఖరః 

అర్థం: ఎవరి దక్షిణమయిన (దక్షిణాభిముఖమయిన/ప్రసన్నమయిన) చిన్మయం (జ్ఞానమయం) అయిన రూపం విశ్వాన్నే దాటి వెళ్లేంత విస్తృతమైనదో అటువంటివారూ అలా దక్షిణామూర్తి దేవుని రూపమే అయిన వారూ అయిన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి నా హృదయములో నిలచి యుందురు గాక.   

4::నిరంతర నిరాలంబ నిరంజన మహోమయః 
మాయావృతి మతీతో మే హృది స్యాత్ చంద్రశేఖరః 

అర్థం: ముక్కలుగా, దశలుగా తెగనిదీ ఆధారం అవసరం లేనిదీ అత్యంత స్వచ్ఛమయినదీ అతిపెద్ద తనముతో నిండినదీ అయిన పరమాత్మ తత్త్వమే వారు. మాయ చేత కప్పబడటమనే (సామాన్య జీవులన్నింటి/లోకమంతటి) స్వభావానికి అతీతమయిన వారయిన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి నా హృదయములో నిలచి యుందురు గాక.   

5::ఏకామ్రేశేన కామాక్ష్యా శ్రుతిమాత్రా సతా చితా 
పరేణాభిన్న రూపో మే హృది స్యాత్ చంద్రశేఖరః 

అర్థం: కాంచీ పురంలోఉన్న ఏకామ్రేశ్వరుడనే శివుడూ వారూ వేరు వేరు కారు. కాంచీ పురంలోఉన్న కామాక్షీ అమ్మవారూ వారూ వేరు వేరు కారు. వేదమాత అయిన గాయత్రీ అమ్మవారూ వారూ వేరు వేరు కారు.

శని దోష నివారణకు ఏం చేయాలి






















మనలో చాలామంది కళ్యాణ దోషం, కాలసర్ప దోషం, దుష్టమానవుల దృష్టి దోషాలు, వాస్తుదోషాలు, నవగ్రహ దోషాలు 
ఇలా అనేక రకాల దోషాలతో బాధపడుతుంటారు. 
గ్రహల్లో శని ప్రభావం చాలా ఎక్కువ, శని దోషం ఉన్నవారు సుఖశాంతులు లేకుండా బాధపడుతుంటారు. 
శని దోషం వల్ల ఏవో కష్టనష్టాలు పట్టి పీడిస్తుంటాయి. శని దోషం నుండి బయట పడేందుకు దేవాలయాల్లో అర్చకులు ఉపశాంతి చేస్తుంటారు. 
నవగ్రహారాధన, ప్రత్యేకంగా శని గ్రహారాధన సూచిస్తుంటారు. శని గ్రహ పూజలతో పాటు, శని ధ్యానం చేసినా దోష నివారణ అవుతుంది. శనిధ్యానం శ్లోకాలు ఆరు. ఈ శ్లోకాలను మనసారా స్మరించుకోవాలి. 

సూర్యపుత్రో దీర్ఘదేహః
విశాలక్ష శ్శివప్రియ:
మందచార: ప్రసన్నాత్మా
పీడాం దహతు మే శని:

శన్యారిష్టే తు సంప్రాప్తే
శనిపూజాంచ కారయేత్
శనిధ్యానం ప్రవక్ష్యామి
ప్రాణి పీడోపశాంతయే

నీలాంజన సమాభాసం
రవిపుత్రం యమాగ్రజం
చాయా మార్తాండ సంభూతం
తన్నమామి శనైశ్చరం

నమస్తే కోణ సంస్థాయ
పింగళాయ నమోస్తుతే
నమస్తే బభ్రు రూపాయ
కృష్ణాయచ నమోస్తుతే

మనస్తే రౌద్ర దేహాయ
నమస్తే చాంతకాయచ
నమస్తే యమ సంజ్ఞాయ
నమస్తే సౌరాయే విభో

నమస్తే మంద సంజ్ఞాయ
శనైశ్చర నమోస్తు
ప్రసాదం మమదేవేశ
దీనస్య ప్ర్రణతస్యచ.

ఓం, ఐం, హ్రీం, శ్రీం శనైశ్చరాయనమః 

ఈ శని ధ్యాన శ్లోకాలను 19 వేలసార్లు పఠించినట్లయితే ఎలాంటి శని దోషాలైనా నివారణ అవుతాయి.
భక్తి శ్రధలతో 28 సార్లు పఠించినా శనిదోష నివారణ మవుతుంది 

Wednesday, July 17, 2013

నవగ్రహ పీడాహర స్తోత్రం












గ్రహాణామాది రాదిత్యోలోక రక్షణ కారకః
విషయ స్థాన సంభూతాం పీడాం హరతుమే రవి:
రోహిణీ శస్సుధామూర్తి స్సుధాగాత్రస్సురాళనః

భూమిపుత్రో మహాతేజా జగతాం భయకృత్నదా
వృష్టికృదృష్టి హర్తాచ పీడాం హరతు మేకుజః

ఉత్పాత్రూపోజగతాం చంద్రపుత్రో మహాద్యుతిః
సూర్యప్రియకరో విద్వాన్ పీడాం హరతుమే బుధః

దేవమంత్రీ విశాలాక్షః సదాలోకహితేరహః
అనేక శిష్య సంపూర్ణః పీడాం హరతుమే గురుః

దైత్యమంత్రీ గురుస్తేషాం ప్రాణదశ్చమహామతిః
ప్రభుస్తారాగ్రహాణాంచ పీడాం హరతుమే భ్రుగుః

సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్ష శివప్రియః
మందచారః ప్రసన్నాత్మా పీడాం హరతుమే శనిః

మహాశ్రీరామ మహావక్త్రో దీర్ఘదంస్త్రో మహాబలః
అతనుశ్చోర్ధ్వకేశశ్చ పీడాం హరతుమే శిఖీ

అనేక రూప్వర్వైశ్చ శతశో ధసహస్రశః
ఉత్పాతరుజోజగతాం పీడాం హరతుమే తమః

ప్రతిరోజూ ఈ నవగ్రహ పీడా పరిహార స్తోత్రాన్ని ఉదయాన్నే తొమ్మిదిసార్లు పఠిస్తే గ్రహపీడ తొలగి, కార్యసిద్ధి కలుగుతుంది.

Sunday, July 14, 2013

నవగ్రహ కరావలమ్బ స్తోత్రమ్




 










1::జ్యోతీశ దేవ భువనత్రయ మూలశక్తే
గోనాథ భాసుర సురాదిభిరీద్యమాన
నౄణాంశ్చ వీర్య వర దాయక ఆదిదేవ
ఆదిత్య వేద్య మమ దేహి కరావలమ్బమ్

2::నక్షత్రనాథ సుమనోహర శీతలాంశో
శ్రీ భార్గవీ ప్రియ సహోదర శ్వేతమూర్తే
క్షీరాబ్ధిజాత రజనీకర చారుశీల
శ్రీమచ్ఛశాంక మమ దేహి కరావలమ్బమ్

3::రుద్రాత్మజాత బుధపూజిత రోద్రమూర్తే
బ్రహ్మణ్య మంగల ధరాత్మజ బుద్ధిశాలిన్
రోగార్తిహార ఋణమోచక బుద్ధిదాయిన్
శ్రీ భూమిజాత మమ దేహి కరావలమ్బమ్

4::సోమాత్మజాత సురసేవిత సోమ్యమూర్తే
నారాయణప్రియ మనోహర దివ్యకీర్తే
ధీపాటవప్రద సుపండిత చారుభాషిన్
శ్రీ సోమ్యదేవ మమ దేహి కరావలమ్బమ్

5::వేదాన్తజ్ఞాన శ్రుతివాచ్య విభాసితాత్మన్
బ్రహ్మాది వన్దిత గురో సుర సేవితాంఘ్రే
యోగీశ బ్రహ్మ గుణ భూషిత విశ్వ యోనే
వాగీశ దేవ మమ దేహి కరావలమ్బమ్

6::ఉల్హాస దాయక కవే భృగువంశజాత
లక్ష్మీ సహోదర కలాత్మక భాగ్యదాయిన్
కామాదిరాగకర దైత్యగురో సుశీల
శ్రీ శుక్రదేవ మమ దేహి కరావలమ్బమ్

7::శుద్ధాత్మ జ్ఞాన పరిశోభిత కాలరూప
ఛాయాసునన్దన యమాగ్రజ క్రూరచేష్ట
కష్టాద్యనిష్ఠకర ధీవర మన్దగామిన్
మార్తండజాత మమ దేహి కరావలమ్బమ్

8::మార్తండ పూర్ణ శశి మర్దక రోద్రవేశ
సర్పాధినాథ సురభీకర దైత్యజన్మ
గోమేధికాభరణ భాసిత భక్తిదాయిన్
శ్రీ రాహుదేవ మమ దేహి కరావలమ్బమ్

9::ఆదిత్య సోమ పరిపీడక చిత్రవర్ణ
హే సింహికాతనయ వీర భుజంగ నాథ
మన్దస్య ముఖ్య సఖ ధీవర ముక్తిదాయిన్
శ్రీ కేతు దేవ మమ దేహి కరావలమ్బమ్

10::మార్తండ చన్ద్ర కుజ సౌమ్య బృహస్పతీనామ్
శుక్రస్య భాస్కర సుతస్య చ రాహు మూర్తేః
కేతోశ్చ యః పఠతి భూరి కరావలమ్బ
స్తోత్రమ్ స యాతు సకలాంశ్చ మనోరథారాన్

ఓమ్ శాంతిః శాంతిః శాంతిః
  :::: ఓమ్ తత్ సత్ ::::

Sunday, July 7, 2013