Sunday, May 15, 2011

శ్రీషిర్దీ సాయిబాబాను ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి



శ్రీషిర్దీ సాయిబాబాను ప్రత్యక్షంగా చూసినవాళ్ళలో జీవించి ఉన్న ఏకైక వ్యక్తి గీతాబాయి గధియా



మహారాష్ట్ర అహ్మద్ నగర్ జిల్లా రహతా లో నివసిస్తున్న గీతాబాయి గధియా గారి  వయస్సు ఇప్పుడు 105 సంవత్సరాలు. శ్రీషిర్దీ  సాయిబాబాను స్వయంగా చూసినవాళ్ళలో ఆవిడ ఒక్కరే యిప్పటికీ జీవించి ఉన్నారు.  ఆవిడ  తాను ప్రత్యక్షంగా  షిర్డీ  సాయిబాబాను చూశారు.   ఆవిడ ఆయన పాదాలను స్పృశించారు.  బాబాగారు తమ దివ్య హస్తాలతో యిచ్చిన వాటిని ఆవిడ స్వీకరించారు.  మనం సాయిబాబా  విగ్రహాన్ని చూస్తాము.  గీతాబాయి గారు సాయిబాబాను ప్రత్యక్షంగా చూశారు.  మనము సాయిబాబా పాదాలవద్ద మన కానుకలను సమర్పిస్తాము.  గీతాబాయి గారు నేరుగా సాయిబాబాగారి దివ్యహస్తాలకు అందించారు.  మనం సాయిబాబా గురించి విన్నాము.  గీతాబాయి గారు సాయిబాబా స్వయంగా మాట్లాడటం విన్నారు.  మనకు ఈ మధ్యనే సాయిబాబా గురించి తెలిసింది.  గీతాబాయిగారికి 95 సంవత్సరాల క్రితం నుండే  సాయిబాబా గురించి తెలుసు.  మనకు బాబా సమాధి దర్శన భాగ్యం కలిగింది.  గీతాబాయిగారు సాయిబాబాగారి దివ్య చరణకమలాలను స్వయంగా స్పృశించారు.  మనం సాయి భజనలు చాలా రచించాము.  గీతాబాయిగారు సాయిబాబా పాడటం స్వయంగా విన్నారు.  మనం షిరిడీకి నడచి వెడతాము.  గీతాబాయిగారిని ఆవిడ తండ్రి షిరిడీకి ఎత్తుకొని తీసుకొని వెళ్ళారు.  మనం బాబాకు నైవేద్యం సమర్పిస్తాము.  గీతాబాయి గారి చిన్ని చేతులు బాబాగారిచ్చిన కానుకలతో నిండిపోయాయి.  మనం బాబాను పిలుస్తాము.  కాని, గీతాబాయిగారిని సాయిబాబా తానే స్వయంగా పిలిచారు.  సాయిబాబాగారిని చూసినప్పుడు ఆవిడ వయసు కేవలం 10 సంవత్సరాలు. ఆరోజుల్లో సాయిబాబాతో తన చిన్నతనంలో గడిపిన రోజులు, ప్రతి సంఘటన ఆవిడకి బాగా గుర్తున్నాయి.  ప్రతివిషయం బాగా గుర్తుకు తెచ్చుకోగలరు.  10 సంవత్సరాల క్రితం ఆవిడకు 3 సార్లు హార్ట్ ఎటాక్ వచ్చింది.  గీతాబాయిగారు యిప్పుడు ఏడవతరానికి సంబంధించిన వారసులతో ఉన్నారు.  ఆవిడ డాక్టర్ల మీద గాని, మందుల మీద గాని ఆధారపడకుండా యితకుముందు లాగే మంచి ఆరోగ్యంతో ఉన్నారు.  ఇప్పటికీ ఆవిడ మంచి శరీర సౌష్టవంతో ఆరోగ్యంగా ఉండటం చూసిన పెద్ద పెద్ద డాక్టర్లు కూడా ఆమెను ఎంతో గౌరవిస్తారు.  ఆవిడ దృష్టి యిప్పటికీ చక్కగా ఉంది.  మంచి వినికిడి శక్తి వుంది.  ఆవిడ చక్కగా మాట్లాడగలరు.  తాను స్వయంగా వ్రాసిన సాయి భజనలను పాడగలరు.  ఆమె ప్రతీరోజు ఉదయం 3 గంటలకే లేచి, ఎవరి సహాయం లేకుండా తన పనులను తానే స్వయంగా చేసుకొంటారు.  తేలికపాటి ఆహారం, డ్రై ఫ్రూట్స్, స్వచ్చమైన వెన్న తీసుకుంటారు. ఆమె బాబాగారు వంట చేసే కుండని, గోధుమలను విసిరే తిరగలిని, ఎప్పుడు జ్వలిస్తూ ఉండే ధునిని చూశారు.  బాబా తన దుస్తులను తానే స్వయంగా ఉతుకుకొని వాటిని వాడాలో ఆరవేయడం చూశారు.  ఆవిడ మేనత్త (తండ్రి సోదరి) ద్వారకామాయి కుడిప్రక్కనే షిరిడీలో ఉండేవారు.  గీతాబాయిగారు 10 సంవత్సరాల వయసులో ఆమె మేనత్త యింటికి వెళ్ళి అక్కడ గడుపుతూ ఉండేవారు. ఆరోజుల్లో ఆడపిల్లలను యింటిలోనుండి బయటకు వెళ్లనిచ్చేవారు కాదు.  ఆవిధంగానే గీతాబాయిగారి విషయంలో కూడా.  కాని, ఎప్పుడయినా బయటకు వెళ్ళినపుడు అవిడ ద్వారకామాయికి వెళ్ళి సాయిబాబాతో ఆడుకునేది.  బాబాగారు ఫొటోలో ఉన్నట్లుగానే ఎలా దుస్తులు ధరించేవారో ఆవిడ వర్ణించి చెపుతూ ఉంటారు. ఇంక్కా ఆవిడ వర్ణించి చెప్పిన సంఘటనలు.   బాబా ఆవిడను చూడగానే నీకేమయినా డబ్బు కావాలా అని అడిగేవారు.  బాబా రహతా వెళ్ళేటపుడు కదలుతున్న బస్సులోకి కూడా ఎక్కేవారు.  అలాగే బస్సు వెడుతున్నపుడు కూడా బస్సులోనించి దిగేవారు.  రహతా వెళ్ళినపుడెల్లా అక్కడి దుకాణుదారులు తమంత తామే బాబాకు కానుకలు సమర్పించుకొనేవారు.  బాబా షిరిడీకి తిరిగి వచ్చిన తరువాత వాటినన్నిటినీ పంచిపెట్టేస్తూ ఉండేవారు. అలా పంచిపెట్టబడినవాటిలో బాబానుంచి ఆవిడకు డ్రైఫ్రూట్స్ లభించాయి. బాబాగారినించి స్వయంగా డ్రైఫ్రూట్స్ స్వీకరించిన గీతాబాయి గారు ఎంతో అదృష్టవంతురాలు. ఆరోజుల్లో పిల్లల మీద ఎన్నో ఆంక్షలు ఉండేవి.  పిల్లలను ఎక్కడా బయట తిరగనిచ్చేవారు కాదు.  ఎవరితోనూ కలవనిచ్చేవారు కాదు.  బాబాగారు చేసిన అద్భుతాలేమీ కూడా ఆమెకు చూసే అదృష్టం కలగలేదు.  బాబావారిని దర్శించడానికి ఎంత పెద్ద గుంపు ఉండేదో కూడా ఆమెకు తెలీదు.  కాని, బాబా ఊదీ ఎంత అమోఘమైందో ఆమె ధృవపరుస్తూ చెప్పారు.  దానికి తానే సాక్ష్యమని చెప్పారు.  బాబా చేసే అద్భుతాలకు తాను ఆయనని "అధ్బుతాలను చేసే బాబా" అని అనేదానినని చెప్పారు. చిన్నతనం వల్ల అప్పట్లో ,  బాబా మహాసమాధి చెందేవరకు వాస్తవానికి సాయిబాబాగారి ఔన్నత్యం గురించి తెలియదని చెప్పారు .  ఆతరువాతే అందరూ ఆయన భగవంతుడని తెలుసుకొన్నారు.    

శ్రీ మహా సరస్వతి మూల మంత్రం-- Sri maha Saraswati Moola Mantra




































ఓం హ్రీం హ్ర్సైం హ్రీం ఓం ఐం థీం క్లీం సౌః సరస్వత్య్తే స్వాహాః ||

శ్రీ మహా సరస్వతి యంత్రమును అర్చించు వారు యంత్రమును రాగి రేకు పై కాని కాగితముపై కాని వ్రాసి పటము కట్టించి యథా శక్తి గా ఉదయాస్తమయములందు షోడశోపచార పూజలు చేయుచున్న గొప్ప గద్య పద్య రచన వాక్సుద్ధి , విద్య ప్రాప్తి , మేథా ధారణా శక్తి తప్పక కలుగును.

శ్రద్ధా వంతులు ప్రతి నిత్యము ఆచమ్య , ప్రాణామాయ , గోత్ర దేశ కాల మాన సంకీర్తణాధికముగా త్రి న్యాస పూర్వకముగా , పంచ పూజలొనర్చిన విశేష ఫలము కలుగును.మూల మంత్ర జపముతో పాటు క్రింది తత్ గాయిత్రి ని కూడ జపదశాంశము గావించిన మహోత్కృష్ట ఫలితములు తప్పక కలుగును.

ధ్యానము , మూల మంత్రము , ఏ తత్ గాయిత్రి ఈ మూడింటిని అనునిత్యము అనుసరించు సాధకుడు పొందలేని ఫలితమే లేదు. అనగా తలచినంతనే సాధకుని కృషి యత్నములనుసరించి మంత్ర యంత్రములు పని సాధన లందు అనంత ఫల సాధకము లగును.

-: శ్రీ సరస్వతీ గాయత్రి :-

|| వాగ్దేవ్యైచ విద్మహే బ్రహ్మపత్న్యైచ ధీమహితన్నోవాణీః ప్రచోదయాత్.//

Thursday, May 5, 2011

శ్రీ హనుమన్నమస్కారః
























హనుమన్నమస్కారః

1}గోష్పదీకృతవారీశం మశకీకృతరాక్షసమ్
రామాయణమహామాలారత్నం వందేజ్నిలాత్మజమ్

2}అంజనానందనంవీరం జానకీశోకనాశనమ్
కపీశమక్షహంతారం వందే లంకాభయంకరమ్

3}మహావ్యాకరణాంభోధిమంథమానసమందరమ్
కవయంతం రామకీర్త్యా హనుమంతముపాస్మహే

4}ఉల్లంఘ్య సింధోః సలిలం సలీలం యః శోకవహ్నిం జనకాత్మజాయాః
ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయమ్

5}మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠమ్
వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి

6}ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయవిగ్రహమ్
పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనమ్

7}యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్
బాష్పవారిపరిపూర్ణలోచనం మారుతిర్నమత రాక్షసాంతకమ్

!!!!!!!! hanumannamaskaara@h !!!!!!!

1}gOshpadeekRtavaareeSaM maSakeekRtaraakshasam^
raamaayaNamahaamaalaaratnaM vaMdaejnilaatmajam^

2}aMjanaanaMdanaMveeraM jaanakeeSOkanaaSanam^
kapeeSamakshahaMtaaraM vaMdae laMkaabhayaMkaram^

3}mahaavyaakaraNaaMbhOdhimaMthamaanasamaMdaram^
kavayaMtaM raamakeertyaa hanumaMtamupaasmahae

4}ullaMghya siMdhO@h salilaM saleelaM ya@h SOkavahniM janakaatmajaayaa@h
aadaaya taenaiva dadaaha laMkaaM namaami taM praaMjaliraaMjanaeyam^

5}manOjavaM maarutatulyavaegaM jitaeMdriyaM buddhimataaM varishTham^
vaataatmajaM vaanarayoothamukhyaM SreeraamadootaM Sirasaa namaami

6}aaMjanaeyamatipaaTalaananaM kaaMchanaadrikamaneeyavigraham^
paarijaatatarumoolavaasinaM bhaavayaami pavamaananaMdanam^

7}yatra yatra raghunaathakeertanaM tatra tatra kRtamastakaaMjalim^
baashpavaariparipoorNalOchanaM maarutirnamata raakshasaaMtakam^

Monday, May 2, 2011

శ్రీ సుదర్శనషట్కం
















శ్రీ సుదర్శనషట్కం

1}సహస్రాదిత్యసంకాశం సహస్రవదనం పరమ్
సహస్రదోస్సహస్రారం ప్రపద్యేజ్హం సుదర్శనమ్

2}హసంతం హారకేయూర మకుటాంగదభూషణైః
శోభనైర్భూషితతనుం ప్రపద్యేజ్హం సుదర్శనమ్

3}స్రాకారసహితం మంత్రం వదనం శత్రునిగ్రహమ్
సర్వరోగప్రశమనం ప్రపద్యేజ్హం సుదర్శనమ్

4}రణత్కింకిణిజాలేన రాక్షసఘ్నం మహాద్భుతం
వ్యుప్తకేశం విరూపాక్షం ప్రపద్యేజ్హం సుదర్శనమ్

5}హుంకారభైరవం భీమం ప్రణాతార్తిహరం ప్రభుం
సర్వపాపప్రశమనం ప్రపద్యేజ్హం సుదర్శనమ్

6}ఫట్కారాస్తమనిర్దేశ్య దివ్యమంత్రేణసంయుతం
శివం ప్రసన్నవదనం ప్రపద్యేజ్హం సుదర్శనమ్

7}ఏతైష్షడ్భిః స్తుతో దేవః ప్రసన్నః శ్రీసుదర్శనః
రక్షాం కరోతి సర్వాత్మా సర్వత్ర విజయీ భవేత్

SreesudarSanashaTkaM

1}sahasraadityasaMkaaSaM sahasravadanaM param^
sahasradOssahasraaraM prapadyaejhaM sudarSanam^

2}hasaMtaM haarakaeyoora makuTaaMgadabhooshaNai@h
SObhanairbhooshitatanuM prapadyaejhaM sudarSanam^

3}sraakaarasahitaM maMtraM vadanaM Satrunigraham^
sarvarOgapraSamanaM prapadyaejhaM sudarSanam^

4}raNatkiMkiNijaalaena raakshasaghnaM mahaadbhutaM
vyuptakaeSaM viroopaakshaM prapadyaejhaM sudarSanam^

5}huMkaarabhairavaM bheemaM praNaataartiharaM prabhuM
sarvapaapapraSamanaM prapadyaejhaM sudarSanam^

6}phaTkaaraastamanirdaeSya divyamaMtraeNasaMyutaM
SivaM prasannavadanaM prapadyaejhaM sudarSanam^

7}aetaishshaDbhi@h stutO daeva@h prasanna@h SreesudarSana@h
rakshaaM karOti sarvaatmaa sarvatra vijayee bhavaet^