శ్రీశైలక్షేత్రంలో స్వామి వారిని 'మల్లికార్జున భ్రమరాంబగా' ఎందుకు పిలుస్తారు?
క్షేత్రస్వామి మల్లికార్జునుడనే పేరు రావడానికి గల కారణాలు గూర్చి చెప్పే కథ-
.............................
యుగాల పూర్వము చంద్రవంశపురాజు చంద్రగుప్తుడనే వాని కుమార్తె చంద్రవతి ఈ స్వామిని సేవిస్తున్న తరుణంలో పార్వతీపరమేశ్వరులు ఆనంద సముద్రంలో తేలియాడుచూ చంద్రవతి భక్తికి మెచ్చి వరమడుగగా ఆమె స్వామి వారి శిరస్సుపై నుంచిన మల్లెపూల దండ ఎన్నడూ వాడకూడదని కోరగా, స్వామివారు తధాస్తు అని అనెను. నాటి నుండి మల్లె పూలతో పూజించబడిన స్వామి గనుక మల్లికార్జునుడైనాడు. పార్వతి అమ్మ వారిని ఈ ప్రాంతంలో భ్రమరరూపాన్ని ధరించి 'అరుణ' డనే రాక్షసుని సంహరించినందున భ్రమరాంబగా పిలుస్తారు