Sree navadurgaa stOtraM
::::Sailaputri::::
vaMdae vaaMchita laabhaaya chaMdraardhakRta Saekharam^
vRshaarooDhaaM SooladharaM SailaputreeM yaSasvineem^
::::brahmachaariNi::::
dadhaana kara padmaabhyaM akshamaalaa kamaMDalaa
daevee pradaatu mayee brahmachaariNya nuttamaa
::::chaMdraghaMTa::::
piMDaja pravaraarooDha chaMDakO paastrakairyutaa |
prasaadaM tamataehyaaM chaMdraghaMTaeti viSrutaa ||
::::kooshmaaMDa::::
suraa saMpoorNa kalaSaM rudhiraaputramaeva cha
dadhaana hasta padmaabhyaM kooshmaaMDaa Subhadaastum^
::::skaMdamaata::::
siMhaasana gataa nityaM padmaaSrita karadva yaa
Subhadaastu sadaa daevi skaMdamaataa yaSasvinee
::::kaatyaayini::::
chaMdarahaasOjvalakaraM Saardoolavaravaahanaa
kaatyaayanee SubhaM daddyaaddaevee daanava ghaatinee
::::kaaLaraatri::::
aekavaeNi japakarNi pooraanagnaa kharaasthitaa
laMbOshThee karnikaakarNee tailaachchyaakta SareeriNee
vaama paadOllisallOhalitaa kaMTakaa bhooshaNaa
varamoordadhvajaa kRshNaa kaaLaraatrirbhayaMkaree
::::mahaagauri::::
Svaetae vRshae samaarooDhaa SvaetaMbara dharaa Suchi@h
mahaagauri SubhaM dadyaat^ mahaadaeva pramOdadaa
::::siddhidhaatri::::
siddha gaMdharva yakshaadyai@h asurai ramarai rapi
saevyamaanaa sadaa bhooyaat^ siddhidaa siddhidaayinee
:::::::iti Sree navadurgaa stOtraM saMpoorNaM:::::::
Friday, October 8, 2010
అందరికీ దసరా ( నవరాత్రి) శుభాకాంక్షలు
దసరా నవరాత్రులు
మన ముఖ్యమైన పండుగలలో దసరా ఒకటి.
ఈ పండుగ నవరాత్రులు( అంటే 9 రాత్రులు అని అర్థం)
అమ్మవారిని పూజించిన తరువాత పదవరోజున పండుగగా జరుపుకుంటాము.
ఐతే తెలుగు తిథుల ప్రకారం ప్రతి ఏడాది ఈ పండుగ రోజులు మారుతూ ఉంటాయి.
అప్పుడప్పుడు రెండు తిథులు ఒకే రోజు రావటం కూడా జరుగును.
అలాంటప్పుడు ఇద్దరు అఅమ్మవారుల నామాలతో పూజ చేసుకోవాలి.
ప్రతి రోజు అమ్మవారి ఒక్కొక్క రూపాన్ని పూజించుకోవాలి.ఇలా 9 రోజులు
9 విధాల అమ్మవారి నామాలతో ఒక్కో అమ్మవారిని పూజించి,
ఆ దేవి కరుణామౄతమును కురిపించమని వేడుకోందాము.
(క్రింద పేర్కొనినట్లు ఒక్కోరోజు ఒక్కొక్క తల్లిని పూజించాలి)
)
మొదటి రోజు------- శ్రీ బాలాత్రిపుర సుందరి దేవి
రెండవ రోజు------- శ్రీ గాయత్రీ దేవి
మూడవ రోజు------- శ్రీ అన్నపూర్ణా మాత
నాలుగవ రోజు--------శ్రీ లలిత దేవి
ఐదవ రోజు----------శ్రీ సరస్వతి దేవి
ఆరవ రోజు----------శ్రీ మహాలక్ష్మి దేవి
ఏడవ రోజు-----------శ్రీ దుర్గా దేవి
ఎనిమిదవ రోజు--------శ్రీ మహిషాసుర మర్ధిని దేవి
తొమ్మిదవ రోజు--------శ్రీ రాజ రాజేశ్వరి దేవి
శ్రీ నవదుర్గా స్తోత్రం
::::శైలపుత్రి::::
వందే వాంచిత లాభాయ చంద్రార్ధకృత శేఖరమ్
వృషారూఢాం శూలధరం శైలపుత్రీం యశస్వినీమ్
::::బ్రహ్మచారిణి::::
దధాన కర పద్మాభ్యం అక్షమాలా కమండలా
దేవీ ప్రదాతు మయీ బ్రహ్మచారిణ్య నుత్తమా
::::చంద్రఘంట::::
పిండజ ప్రవరారూఢ చండకో పాస్త్రకైర్యుతా |
ప్రసాదం తమతేహ్యాం చంద్రఘంటేతి విశ్రుతా ||
::::కూష్మాండ::::
సురా సంపూర్ణ కలశం రుధిరాపుత్రమేవ చ
దధాన హస్త పద్మాభ్యం కూష్మాండా శుభదాస్తుమ్
::::స్కందమాత::::
సింహాసన గతా నిత్యం పద్మాశ్రిత కరద్వ యా
శుభదాస్తు సదా దేవి స్కందమాతా యశస్వినీ
::::కాత్యాయిని::::
చందరహాసోజ్వలకరం శార్దూలవరవాహనా
కాత్యాయనీ శుభం దద్ద్యాద్దేవీ దానవ ఘాతినీ
::::కాళరాత్రి::::
ఏకవేణి జపకర్ణి పూరానగ్నా ఖరాస్థితా
లంబోష్ఠీ కర్నికాకర్ణీ తైలాచ్చ్యాక్త శరీరిణీ
వామ పాదోల్లిసల్లోహలితా కంటకా భూషణా
వరమూర్దధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ
::::మహాగౌరి::::
శ్వేతే వృషే సమారూఢా శ్వేతంబర ధరా శుచిః
మహాగౌరి శుభం దద్యాత్ మహాదేవ ప్రమోదదా
::::సిద్ధిధాత్రి::::
సిద్ధ గంధర్వ యక్షాద్యైః అసురై రమరై రపి
సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ
:::::::ఇతి శ్రీ నవదుర్గా స్తోత్రం సంపూర్ణం:::::::
Tuesday, October 5, 2010
శ్రీదుర్గా నక్షత్రమాలికా స్తుతిః
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
::::: ఓం శ్రీ గణేశాయ నమః ::::::::
1:విరాటనగరం రమ్యం గచ్ఛమానో యుధిష్ఠిరః
అస్తువన్ మనసా దేవీం దుర్గాం త్రిభువనేశ్వరీమ్
2:యశోదాగర్భసంభూతాం నారాయణవరప్రియామ్
నన్దగోపకులేజాతాం మంగళ్యాం కులవర్ధనీమ్
3:కంసవిద్రావణకరీం అసురాణాం క్షయం కరీమ్
శిలాతటవినిక్షిప్తాం ఆకాశం ప్రతిగామినీమ్
4:వాసుదేవస్య భగినీం దివ్యమాల్య విభూషితామ్
దివ్యాంబరధరాం దేవీం ఖద్గఖేటకధారిణీమ్
5:భారావతరణే పుణ్యే యే స్మరన్తి సదాశివామ్
తాన్వై తారయసే పాపాత్ పంకేగామివ దుర్బలామ్
6:స్తోతుం ప్రచక్రమే భూయః వివిధైః స్తోత్రసంభవైః
ఆమన్త్ర్య దర్శనాకాఙ్క్షీ రాజా దేవీం సహానుజః
7:నమోఽస్తు వరదే కృష్ణే కుమారి బ్రమ్హచారిణి
బాలార్క సదృశాకారే పూర్ణచన్ద్రనిభాననే
8:చతుర్భుజే చతుర్వక్త్రే పీనశ్రోణిపయోధరే
మయూరపింఛవలయే కేయూరాంగదధారిణి
9:భాసి దేవి యదా పద్మా నారాయణపరిగ్రహః
స్వరూపం బ్రహ్మచర్యం చ విశదం తవ ఖేచరి
10:కృష్ణచ్ఛవిసమా కృష్ణా సంకర్షణసమాననా
బిభ్రతీ విపులౌ బాహు శక్రధ్వజసముఛ్రయౌ
11:పాత్రీ చ పంకజీ కంఠీ స్త్రీ విశుద్ధా చ యా భువి
పాశం ధనుర్మహాచక్రం వివిధాన్యాయుధాని చ
12:కుండలాభ్యాం సుపూర్ణాభ్యాం కర్ణాభ్యాం చ విభూషితా
చన్ద్రవిస్పార్ధినా దేవి ముకేన త్వం విరాజసే
13:ముకుటేన విచిత్రేణ కేశబన్ధేన శోభినా
భుజంగాఽభోగవాసేన శ్రోణిసూత్రేణ రాజతా
14:విభ్రాజసే చ బద్ధేన భోగేనేవేహ మన్థరః
ధ్వజేన శిఖిపింఛానాం ఉఛ్రితేన విరాజసే
15:కౌమారం వ్రతమాస్థాయ త్రిదివం పావితం త్వయా
తేన త్వం స్తూయసే దేవి త్రిదశైః పూజ్యసేఽపి చ
16:త్రైలోక్య రక్షణార్థాయ మహిషాసుర ఘాతిని
ప్రసన్నా మే సురశ్రేష్ఠే దయాం కురు శివా భవ
17:జయా త్వం విజయా చైవ సంగ్రామే చ జయప్రదా
మమాపి విజయం దేహి వరదా త్వం చ సాంప్రతమ్
18:విన్ధ్యే చైవ నగశ్రేష్టే తవస్థానం హి శాశ్వతమ్
కాలి కాలి మహాకాలి శీధుమాంస పశుప్రియే
19:కృతానుయాత్రా భూతైస్త్వం వరదా కామచారిణి
భారావతారే యే చ త్వాం సంస్మరిష్యన్తి మానవాః
20:ప్రణమన్తి చ యే త్వాం హి ప్రయాణే తు నరా భువి
న తేషాం దుర్లభం కించిత్ పుత్రతో ధనతోఽపి వా
21:దుర్గాత్తారయసే దుర్గే తత్వం దుర్గా స్మృతా జనైః
కాన్తారేష్వవసన్నానాం మగ్నానాం చ మహార్ణవే
(దస్యుభిర్వా నిరుద్ధానాం త్వం గతిః పరమా నృణామ)
22:జలప్రతరణే చైవ కాన్తారేషు అవటేషు చ
యే స్మరన్తి మహాదేవీం న చ సీదన్తి తే నరాః
23:త్వం కీర్తిః శ్రీః ధృతిః సిద్ధిః హ్రీః విద్యా సన్తతిర్మతిః
సన్ధ్యా రాత్రిః ప్రభా నిద్రా జ్యోత్స్నా కాన్తిః క్షమా దయా
24:నృణాం చ బన్ధనం మోహం పుత్రనాశం ధనక్షయమ్
వ్యాధిం మృత్యుం భయం చైవ పూజితా నాశయిష్యసి
25:సోహం రాజ్యాత్పరిభ్రష్టః శరణం త్వాం ప్రపన్నవాన్
ప్రణతశ్చ యథా మూర్ధ్నా తవ దేవి సురేశ్వరి
26:త్రాహి మాం పద్మపత్రాక్షి సత్యే సత్యా భవస్వ నః
శరణం భవ మే దుర్గే శరణ్యే భక్తవత్సలే
27:ఏవం స్తుతా హి సా దేవీ దర్శయామాస పాణ్డవమ్
ఉపగమ్య తు రాజానం ఇదం వచనం అబ్రవీత్
28:శృణు రాజన్ మహాబాహో మదీయం వచనం ప్రభో
భవిష్యతి అచిరాదేవ సంగ్రామే విజయస్తవ
29:మమ ప్రసాదాత్ నిర్జిత్య హత్వా కౌరవ వాహినీమ్
రాజ్యం నిష్కణ్టకం కృత్వా భోక్ష్యసే మేదినీం పునః
30:భ్రాతృభిః సహితో రాజన్ ప్రీతిం యాస్యసి పుష్కలామ్
మత్ప్రసాదాచ్చ తే సౌఖ్యం ఆరోగ్యం చ భవిష్యతి
31:యే చ సంకీర్తయిష్యన్తి లోకే విగతకల్మషాః
తేషాం తుష్టా ప్రదాస్యామి రాజ్యం ఆయుః వపుః సుతమ్
32:ప్రవాసే నగరే వాపి సంగ్రామే శతృసంకటే
అటవ్యాం దుర్గకాన్తారే సాగరే గహనే గిరౌ
33:యే స్మరిష్యన్తి మాం రాజన్ యథాహం భవతా స్మృతా
న తేషాం దుర్లభం కించిత్ అస్మిన్ లోకే భవిష్యతి
34:ఇదం స్తోత్రవరం భక్త్యా శృణుయాత్ వా ఫఠేత వా
తస్య సర్వాణి కార్యాణి సిధ్ధిం యాస్యన్తి పాణ్డవాః
35:మత్ప్రసాదాచ్చ వస్సర్వాన్ విరాటనగరే స్థితాన్
న ప్రజ్ఞాస్యన్తి కురవః నరా వా తన్నివాసినః
36:ఇత్యుక్త్వా వరదా దేవీ యుధిష్ఠిరం అరిన్దమమ్
రక్షాం కృత్వా చ పాణ్డూనాం తత్రైవాన్తరధీయత
:::::::: ఓం తత్సత్ ::::::::::::
నవరాత్రులు ఎప్పుడు ఆర౦భి౦చాలి?
నవరాత్రులు ఎప్పుడు ఆర౦భి౦చాలి?
మనమ౦దరమూ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమిను౦డి నవరాత్రులను ప్రార౦భి౦చుకొ౦టున్నాము కదా! అయితే ఆ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నిర్ణయ౦ అనేది ఎప్పుడు చేయాలి? ఈవిషయ౦పై మనమ౦దర౦ చేస్తున్న నిర్ణయ౦ సశాస్త్రీయమా? అశాస్త్రీయమా?
నవరాత్రార౦భమునకు కావలసిన ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి అనే తిథి రె౦డు రకాలుగా ఉ౦టు౦ది. ౧. శుద్ధ ిథి అనగా సూర్యోదయ౦ ను౦డి మరునాటి సూర్యోదయ౦ వరకు ఉ౦డుట. ౨. విద్ధ తిథి అనగా మొదటి రోజు సూర్యోదయాన౦తర౦ అమావాస్య తరువాత పాడ్యమి ఆర౦భమై ఆరోజు అమావాస్యతోనూ నరునాడు సూర్యోదయాన౦తర౦ కొన్ని ఘడియల వరకు ఉ౦డి తరువాత విదియతోనూ మరునాడు సూర్యోదయాన౦తర౦ కొన్ని ఘడియల వరకు ఉ౦డి తరువాత విదియతోనూ కూడుకుని ఉ౦డట౦.
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి శుద్ధ తిథి అయినట్లైతే ఆరోజును౦డీ నవరాత్రార౦భము నిర్వివాదము. విధ్ధ తిథి అయినట్లయితే సమస్య ఉత్పన్నమవుతో౦ది. కొ౦తమ౦ది ప౦డితులు అమావిద్ధ అయిన పాడ్యమిని గ్రహి౦చరాదని అ౦టు౦టే, కొ౦తమ౦ది దానినే గ్రహి౦చాలి అని నిషర్షగా తెలియజేస్తున్నారు.
సూర్యోదయాన౦తర౦ అమావాస్య కొన్ని ఘడియలు ఉ౦డి, అన౦తర౦ పాడ్యమి ప్రార౦భమై, మరునాటి సూర్యోదయానికి ము౦దే పూర్తగుట. ఇచట పాడ్యమి ఏశయము అయినదని అ౦టారు. ఆవిధ౦గా పాడ్యమి ఏష్య తిథి అయితే అమావాస్యతో కూడుకుని యున్న పాడ్యమి నాటి ను౦డే నవరాత్రార౦భ౦ చేయాలని క్చాలామ౦ది ఏకాభిప్రాయ౦తో చెబుతున్నారు.
శరత్కాలీన నవరాత్ర వ్రత విధానాన్ని గురి౦చి జనమేజయుడు వ్యాసభగవానుని అడుగుతాడు. ఈవిషయ౦ తృతీయ స్క౦దములోని 26వ అధ్యాయయములోనిది. వ్యాస భగవానుడు జనమేజయునికి తెలియజేస్తూ అమావాస్యనాడే స౦బారాలన్నీ సమకూర్చుకోవలనీ, ఆరోజే వేదికా నిర్మాణాన్ని కూడా చేయాలనీ, దేవీ తత్త్వ విశారదులు, ఆచార నిరతులైన బ్రాహ్మణులను రాత్రియ౦దు పిలిపి౦చి, మరునాడు ఋత్విక్ వరణ చేయలని అ౦టూ హస్త నక్షత్ర౦తో కూడిన పాడ్యమినాడు ఆర౦భ౦ శ్రేష్ఠమని నవరాత్రులలో ఉపవాసము గానీ, ఏకభుక్తము గానీ, నక్తము గానీ ఉ౦టామని నియమ౦ ము౦దుగా పెట్టుకొని పూజ ప్రార౦భి౦చాలని, దానికి ము౦దు అమ్మవారిని ఈవిధ౦గా ప్రార్థి౦చాలని తెలియజేశారు.
కరిష్యామి వ్రత౦ మాతర్నవరాత్రమనుత్తమమ్!
సాహాయ్య౦ కురు మే దేవీ జగద౦బ మమాఖిలమ్!!
అమ్మా! ఉత్తమమైన నవరాత్ర వ్రతమును చేస్తున్నాను. జగన్మాతవైన నీవు నాకు అన్ని విధముల సహాయము చేయవలసినది" అని పై శ్లోకార్థ౦.
నవరాత్రులలో ఉపవాసము ఉ౦డదల్చుకున్నవారు ఉదయకాల వ్యాప్తి ఉన్న ఆశ్వయుజ శుద్ధ పాడ్యమిని ఏకభుక్త౦ ఉ౦డదలచుకున్న వారు మధ్యాహ్నవ్యాప్తి ఉన్న పాడ్యమిని, నక్త౦ చేయదలచుకున్న వారు ప్రదోషకాల వ్యాప్తి ఉన్న తిథిని తీసుకోవాలా? అన్న ప్రశ్న ఉదయి౦చడ౦ సహజ౦. నవరాత్ర వ్రత౦ నక్త వ్రతమని పురాణాలన్నీ ఘోషిస్తున్నాయి. కాబట్టి ఏవిధమైన ఉపవాస నియమ౦ పెట్టుకున్నా నక్తవ్రతము కనుక ప్రదోషకాల వ్యాప్తి ఉన్న తిథిని తీసుకోవాలని శాస్త్ర నియమ౦. ఇదేవి్షయాన్ని కాలమాధవమనే గ్ర౦థ౦లో మాధవాచార్యులు "నను ఆశ్వయుజమాసే యో య౦ నవరాత్ర వ్రతోత్సవః తదుపక్రమస్యాపి పూర్వ విద్ధాయా౦ క్రియమాణత్వాత్ సోప్యత్ర వివక్షణీయ ఇతి చేన్న-తస్యనక్తవ్రతత్వాత్! ఏకభుక్త, నక్త, ప్రతి పదీష్టీనా౦ దైవత్వేపి పృధజ్నిర్ణయస్య వక్ష్యమాణత్వాత్!
ఆశ్వయుజమాస౦లో నవరాత్రి ఉత్సవాలు కూడా పూర్వ విద్ధమైన పాడ్యమినాడు చేయాలి కనుక దాని గురి౦చి కూడ ఇచ్చట చెప్పుకోవాలి కదా! అని అనుకోవచ్చు. కానీ. అలాకాదు. ఎ౦దుక౦టే నవరాత్రి వ్రతము నక్తవ్రతము కనుక ఏకభుక్తము, నక్తము, పాడ్యమి మరియు ’ఇష్టి’ అనేవి దైవకర్మలు మరియు వీటికి నిర్ణయము వేరుగా చెప్పబడినది గనుక"
కాలమాధవ౦లో మాధవాచార్యులు ఎ౦త స్పష్ట౦గా చెప్పారో చూశారు కదా! ఈ మాధవాచార్యులే అన౦తర౦ సన్యసి౦చి విద్యారణ్యులు అన్న నామధేయ౦తో వెలుగొ౦ది విజయనగర సామ్రాజ్య స్థాపనకు మూల కారకులయ్యారు. శృ౦గేరీ పీఠాన్ని అధిరోహి౦చి జగద్గురువులయ్యారు. ఆ౦ధ్ర దేశమ౦దున్న క్రమా౦త స్వాధ్యాయులు, ఘనాపాఠీలక౦దరకు కాలమాధవము అనే గ్ర౦థ౦ శిరోధార్యమే. దానిపై పరీక్ష కూడా వారికి ఉ౦టు౦ది. అటువ౦టిది ఈనవరాత్ర వ్రత నిర్ణయ౦లో ద్వితీయా విద్ధతో కూడుకున్న పాడ్యమినే గ్రహి౦చాలనే విషయ౦ ఎ౦త అశాస్త్రీయమైనదో దానినే ప౦చా౦గకర్తలు ఏవిధ౦గా అనుసరిస్తూ వస్తున్నారో గమని౦చ౦డి. వారిక౦దరకూ సవియ౦గా చేసే వినాపమేమ౦టే "ఇకను౦చైనా ప్రదోషకాల వ్యాప్తి ఉన్న పాడ్యమిని గ్రహి౦చి పర్వ నిర్ణయ౦ చేయగలరు".
13వ శతాబ్దివారైన విద్యారణ్యులను, వారి ప్రజ్ఞను, వారి పా౦డిత్యాన్ని ఎవరైననూ ఒప్పుకొని తీరవలసి౦దే. ఆది శ౦కరాచార్యుల తరువాత సర్వజ్ఞునిగా కీర్తి౦పబడినవారు విద్యారణ్యులు ఒక్కరే
అయితే మరి ఈ విదియతో కూడిన పాడ్యమి మరియు పూర్వాహ్నకాల వ్యాప్తి ఉన్న పాడ్యమి అనే పొరపాటు ఎ౦దువలన వచ్చినది అ౦టే-దానికి నా సమాధాన౦ సవినయ౦గా ఒకటే.
శ్లో!! జ్ఞానినామపి చేతా౦సి దేవీ భగవతీ హి సా
బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్ఛతి!!
విద్యారణ్యులు ఇచట ఇ౦కొక మాట కూడా అన్నారు. "ఏకభుక్త నక్తయోః అపి ప్రతిపదోక్త కాల విశేష శాస్త్రేణ సామాన్య రూప౦ పూర్వాహ్న శాస్త్ర౦ బాధ్యతే" - అనగా ఏకభుక్త, నక్తములు దైవికమైనవి కనుక మరియు పాడ్యమికి విశేష౦గా అమావాస్యతో కూడుకుని ఉన్నప్పుడే పవిత్రత అని కాల విశేష శాస్త్రమున౦దు చెప్పబడినది. కనుక వ్రతులు ిథి పూర్వాహ్న కాల వ్యాప్తి ఉ౦డాలి అనే సామాన్య శాస్త్ర౦ బాధి౦పబడుతు౦ది" అని అర్థ౦.
సరే, ఇక పాడ్యమికీ ప్రదోషకాల వ్యాప్తిని బట్టి నవరాత్రార౦భ నిర్ణయ౦ చేయాలి. అది ఎలా? ఇ౦దులో మళ్ళీ 6విధములు ఉ౦టాయి.
౧. ము౦దురోజు ప్రదోష వ్యాప్తి ఉ౦టే
౨. మర్నాడు ప్రదోష వ్యాప్తి ఉ౦టే
౩. రె౦డు రోజులూ(నేడూ, రేపూ) ప్రదోష వ్యాప్తి ఉ౦టే
౪. రె౦డురోజులూ ప్రదోష వ్యాప్తి లేకు౦టే
౫. నేడూ, రేపు కూడా సమకాల వ్యాప్తి ఉ౦టే
౬. రె౦డు రోజులలో ఎక్కువ, తక్కువలతో ఉ౦టే
ఇపుడు ౬ విధముల ప్రదోషవ్యాప్తి నిర్ణయన్ని పరిశీలిద్దాము. ౧,౨ స౦దర్భాలలో ఏరోజు ప్రదోషవ్యాప్తి ఉ౦టే ఆరోజే పాడ్యమిని గ్రహి౦చాలి. ఇక ౩వ స౦దర్బ౦లోనూ, ౪వ స౦దర్భ౦లోనూ రె౦డవరోజునే పాడ్యమి నిర్ణయ౦ చేయాలి. అటులనే ౫,౬ వ స౦దర్భాలలో కూడ రె౦డవ రోజునే పాడ్యమి నిర్ణయ౦ చేయాలి అని ధర్మశాస్త్ర నిర్ణయ౦.
పైన తెలిపిన విధ౦గా నవరాత్రార౦భ నిర్ణయమనేది పాడ్యమి తిథియొక్క ప్రదోషకాల వ్యాప్తిని బట్టే చేయాలి అన్న విషయ౦ స్పష్టమైనది కదా! ఇక స౦కల్ప విషయ౦లో స౦దేహ నివారణ జరగాలి.
భాద్రపద అమావాస్య ఈరోజు మధ్యాహ్న౦ ౩గ౦. వరకు ఉ౦ది అనుకు౦దా౦. తదుపరి పాడ్యమి ప్రార౦భమై మరునాడు సాయ౦కాల౦ సూర్యాస్తమయమునకు ము౦దే పూర్తయినదనుకు౦దా౦. ఇపుడు పై తెల్పిన రీతిలో్ ఈరోజే నవరాత్రార౦భ౦ చేయాలి. ఉదయమే నక్తవ్రత స౦కల్ప౦ చెప్పుకోవాలి కదా, కానీ అమావాస్య ఉన్నది, పైగా భాద్రపద మాసమే ఉన్నది కదా! ఏమి చేయాలి అన్న స౦దేహ౦ వస్తు౦ది. అయినప్పటికీ సూర్యాస్తమానికి పాడ్యమి ఉన్నది కనుక జ్యోతిషశాస్త్ర రీత్యా ప్రదోషకాల వ్యాప్తి పాడ్యమికి ఉన్నది కనుక ఆరోజు ఉదయమే నవరాత్రార౦భ స౦కల్ప౦ చేసితీరాలి అని విద్యారణ్యులు కాలమాధవ౦లో స్పష్టపరచారు. స్మృత్యాపాదిత పాడ్యమి ఉదయము ను౦చే ఉన్నట్లుగా భావి౦చాలని తెలియజేస్తూ ’దెవలుడు’ చెప్పిన ఈ శ్లోకాన్ని విద్యారణ్యులు ఉదహరి౦చారు.
శ్లో!! యా౦ తిథి౦ సమనుప్రప్య అస్త౦ యాతి దివాకరః
తిథిః సా సకలా జ్ఞేయా దానాధ్యయన కర్మసు!!
ఏతిథిని స్పృశిస్తూ సూర్యుడు అస్తమిస్తాడో ఆతిథి దాన, అధ్యయన, వ్రతాది దైవకర్మల య౦దు స౦పూర్ణముగా ఉన్నట్లుగానే భావి౦చాలి.
ఇ౦తవరకు చెప్పిన నియమములన్నీ సార్వజనీకములు. ఇక పూర్ణదీక్ష నొ౦దిన శ్రీ విద్యోపాసకుల విషయ౦లో "స౦క్రా౦తి వ్యతిరిక్త పర్వార్చన౦ సూర్యాస్తమయోత్తర౦ దశ ఘటికాత్మకే రాత్రి పూర్వభాగే కార్యమ్"" అని త౦త్ర వచనాన్ననుసరి౦చి, సూర్యాస్తమయాన౦తర౦ పది ఘడియల రాత్రి పూర్వ భాగ వ్యాప్తిని గ్రహి౦చాలి. ఏరోజు ఎక్కువ వ్యాప్తి ఉ౦టే ఆరోజు గ్రహి౦చాలి.
శ్రీ విద్యార్ణవ త౦త్రమున౦దు విద్యారణ్యులు "ఆశ్వయుజే మాసి ప్రతిపత్తిథి మారభ్య నవమ్య౦తాసు నవసు రాత్రిషు విశేష పూజా౦ కృత్వా, ఏకాది వృద్ధ్యా, జపాదిక౦ చ విధాయ కుమారీ పూజాన౦చ ఏకాది వృద్ధ్యా కుర్యాత్" అని పేర్కొన్నారు. అనగా ఆశ్వయుజ మాసమ౦దు పాడ్యమి మొదలు 9రాత్రుల య౦దు విశేష పూజ చేసి, ఏకాది వృద్ధి రీత్యా జపము, కుమారీ పూజ చేయవలెను అని అర్థ౦. మిగిలిన రహస్యములు గురుముఖతః గ్రహి౦చవలసినది.
కనుక అమావాస్యతో కూడుకొని యున్ననూ ప్రదోషకాల వ్యాప్తిని బట్టి నవరాత్రార౦భము చేయవలెను. విషయ౦ స్పష్టము. నవరాత్రార౦భ కలశస్థాపన కూడ మొదటిరోజునే మధ్యాహ్న కాలమ౦దు చేయవలెనని ధర్మశాస్త్ర నిర్ణయ౦.
చివరగా అమావాస్య ప్రాముఖ్యతను తెలుసుకు౦దా౦. అమావాస్య అనగానే జ్యోతిష శాస్త్ర రీత్య ఏ ముహూర్తమునకు పనికి క్రాదు అనే ఉద్దేశ౦తో మన౦ దానిని పూర్తిగా పక్కన పెట్టేస్తాము.కాని వ్రత, ఉపవాస, పూజాదులలో దానికి ఎ౦తో ప్రాముఖ్యమున్నది. అమావాస్య అనేది సాక్షాత్తూ దేవీ స్వరూపము.
శ్లో!! అమా షోడశభాగేన దేవీ ప్రోక్తా మహాకలా
స౦స్థితా పరమా మాయా దేహినా౦ దేహధారిణీ!
అమాది పౌర్ణమాస్య౦తా యా ఏ శశినః కలాః
తిథయస్తాః సమాఖ్యాతాః షోడశైవ వరాననే!! - స్కా౦ద పురాణము
అనగా ఆధార శక్తి స్వరూపిణియై, దేహధారుల౦దలి దేహధారిణిగా ఏ మహామాయ వెలుగొ౦దుతున్నదో, ఆమెయే చ౦ద్రునియ౦దలి ౧౬వ కళగా చ౦ద్ర దేహధారిణియై వెలుగొ౦దుతున్నది. ఆమెనే”అమా’ అనే మహాకళగా శాస్త్రములు చెప్పాయి. ఆ మహాకళ క్షయ, వృద్ధి రహితమై నిత్య స్వరూపిణియై ’తిథి’ రూమున కీర్తి౦పబడుతున్నది. మిగిలిన ౧౫ కళలు తిథివృద్ధి, క్షయములతో కూడుకుని వ్యవహార యోగ్యమవుతున్నవి.
తిథి, వృద్ధి, క్షయ రహితమైన ఆ కళయే అమావాస్యగా వెలుగొ౦దుతున్నది. అ౦దుకే అమావాస్యతో కూడుకున్న పాడ్యమికివ్రతోపవాసాదుల౦దు పూజ్యత్వ౦ సిద్ధి౦చి౦దనే విషయ౦ స్పష్ట౦.
నవ నైవేద్యాలు!
సర్వమంగళ మాంగల్యే
శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్రయంబకే దేవీ
నారాయణీ నమోస్తుతే!!
అంటూ జగన్మాతను నవరాత్రులు భక్తిశ్రద్ధలతో కొలిచే దసరా మొదలుకానుంది.. రోజూ చేసే పూజలు సరే.. మరి నైవేద్యాల మాటో..? అవీ ఉండాల్సిందే కాబట్టి అన్నంతో చేసే ఈ తొమ్మిది రకాల పదార్థాలను ఓ సారి చూడండి.. మీకు అనువైనవాటిని చేసి నివేదించండి.
1
చక్కెర పొంగలి
కావల్సినవి: బియ్యం - కప్పు, పెసరపప్పు - అరకప్పు, బెల్లం - ఒకటింబావు కప్పు, నెయ్యి - అరకప్పు, కిస్‌మిస్, జీడిపప్పు - రెండూ కలిపి అరకప్పు, ఎండుకొబ్బరిముక్కలు - పావుకప్పు, యాలకులపొడి - అరచెంచా.
తయారీ: పొయ్యిమీద బాణలి పెట్టి పెసరపప్పును దోరగా వేయించి తీసుకోవాలి. అందులో కడిగిన బియ్యం వేసి నాలుగు కప్పుల నీళ్లు పోసి నాలుగు కూతలు వచ్చేవరకూ ఉడికించుకుని తీసుకోవాలి. ఇంతలో బెల్లంలో అరకప్పు నీళ్లు పోసి పొయ్యిమీద పెట్టాలి. అది కరిగాక దింపేయాలి. ఇప్పుడు పొయ్యిమీద ఉడికించి పెట్టుకున్న అన్నం ఉంచి.. అందులో కరిగిన బెల్లం పాకం కలిపి మంట తగ్గించాలి. మరో పొయ్యిమీద బాణలి పెట్టి.. సగం నెయ్యి వేసి జీడిపప్పు, కిస్‌మిస్, కొబ్బరిముక్కలు వేసి వేయించుకుని అన్నంలో వేయాలి. చివరగా యాలకులపొడీ, మిగిలిన నెయ్యి వేసి దగ్గరకు అయ్యేవరకూ ఉడకనిచ్చి దింపేయాలి.
2
మిరియాల అన్నం
కావల్సినవి: అన్నం - కప్పు, నెయ్యి - మూడు చెంచాలు, జీలకర్ర - చెంచా, ఉప్పు - తగినంత, మిరియాలు - ఒకటిన్నర టేబుల్‌స్పూను, కరివేపాకు రెబ్బలు - నాలుగు.
తయారీ: పొయ్యిమీద బాణలి పెట్టి మిరియాలను వేయించి తీసుకోవాలి. తరవాత మెత్తగా పొడిలా చేసుకోవాలి. అదే బాణలిలో నెయ్యి వేసి జీలకర్రా, కరివేపాకు రెబ్బలూ, మిరియాలపొడి వేయాలి. తరవాత అందులో అన్నం, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి దింపేయాలి.
3
పాల పరమాన్నం
కావల్సినవి: బియ్యం - అరకప్పు, పాలు - రెండు కప్పులు, బెల్లం తరుగు - ఒకటిన్నర కప్పు, యాలకులపొడి - అరచెంచా, నెయ్యి - పావుకప్పు, జీడిపప్పు, కిస్‌మిస్ - రెండూ కలిపి పావుకప్పు.
తయారీ: పాలు ఓ గిన్నెలోకి తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. అవి మరిగాక కడిగిన బియ్యం వేసి మంట తగ్గించాలి. అన్నం మెత్తగా అయ్యాక బెల్లం వేసి బాగా కలపాలి. అది దగ్గరకు అయ్యాక యాలకులపొడివేసి దింపేయాలి. ఇప్పుడు పొయ్యిమీద బాణలి పెట్టి నెయ్యి వేయాలి. అది కరిగాక జీడిపప్పు, కిస్‌మిస్ వేసి వేయించి.. దీన్ని పరమాన్నంలో వేసి ఒకసారి కలపాలి.
4
కొబ్బరి అన్నం
కావల్సినవి: బియ్యం - కప్పు, కొబ్బరి తురుము - ఒకటిన్నర కప్పు, కొత్తిమీర - కట్ట, జీడిపప్పు - పది, ఎండుమిర్చి - మూడు, పచ్చిమిర్చి - నాలుగు, కరివేపాకు - రెండు రెబ్బలు, సెనగపప్పు - టేబుల్‌స్పూను, మినప్పప్పు - చెంచా, జీలకర్ర - చెంచా, ఆవాలు - అరచెంచా, నెయ్యి - టేబుల్‌స్పూను, నూనె - చెంచా, ఉప్పు - తగినంత.
తయారీ: బియ్యం కడిగి రెండు గ్లాసుల నీళ్లు పోసి పొడిపొడిగా వండి వెడల్పాటి గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు పొయ్యిమీద బాణలి పెట్టి... నెయ్యి, నూనె వేయాలి. నెయ్యి కరిగాక ఎండుమిర్చీ, సెనగపప్పూ, మినప్పప్పూ, జీలకర్రా, ఆవాలు, జీడిపప్పు వేసి వేయించాలి. అవి వేగాక నిలువుగా తరిగిన పచ్చిమిర్చీ, కరివేపాకు వేయాలి. రెండు నిమిషాలయ్యాక కొబ్బరితురుమూ, తగినంత ఉప్పు వేసి పచ్చివాసన పోయాక దింపేయాలి. దీన్ని అన్నంలో వేసి బాగా కలిపి కొత్తిమీర తరుగు వేయాలి.
5
పులిహోర
కావల్సినవి: అన్నం - కప్పు, నూనె - టేబుల్ స్పూను, పల్లీలు - టేబుల్ స్పూను, మినప్పప్పు, సెనగపప్పు - ఒకటిన్నర చెంచా చొప్పున, పచ్చిమిర్చి - మూడు, ఆవాలు - చెంచా, ఎండుమిర్చి - నాలుగు, కరివేపాకు రెబ్బలు - రెండు, పసుపు - అరచెంచా, ఉప్పు - తగినంత, చింతపండు గుజ్జు - ఒకటిన్నర టేబుల్‌స్పూను, బెల్లం ముక్క - చిన్నది.
తయారీ: అన్నాన్ని ఓ పళ్లెంలో పరిచి పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యిమీద బాణలి పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక పల్లీలు వేయాలి. అవి కాస్త వేగుతున్నప్పుడు సెనగపప్పూ, మినప్పప్పూ, ఆవాలూ, ఎండుమిర్చి వేయాలి. ఈ తాలింపు వేగాక కరివేపాకూ, పచ్చిమిర్చి వేయాలి. నిమిషం తరవాత చింతపండు గుజ్జూ, పసుపూ, తగినంత ఉప్పూ, బెల్లంముక్క వేసి మంట తగ్గించాలి. చింతపండు ఉడికాక అన్నంలో ఈ పులుసు వేసి బాగా కలిపితే చాలు.
6
కేసరీ బాత్
కావల్సినవి: అన్నం - కప్పు, చక్కెర - ముప్పావుకప్పు, జీడిపప్పు, కిస్‌మిస్ పలుకులు - రెండూ కలిపి పావు కప్పు, నెయ్యి - అరకప్పు, యాలకులపొడి - చెంచా.
తయారీ: అడుగు మందంగా ఉన్న గిన్నెలో నెయ్యీ, నాలుగుకప్పుల నీళ్లు తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. రెండు నిమిషాలయ్యాక అందులో కడిగిన బియ్యం వేసి కలిపి మూత పెట్టేయాలి. అన్నం ఉడికాక చక్కెర వేసి మధ్య మధ్య కలుపుతూ ఉండాలి. అది పూర్తిగా దగ్గరకు అయ్యాక యాలకులపొడీ, జీడిపప్పు, కిస్‌మిస్ పలుకులు వేసి ఓసారి కలిపి దింపేయాలి. కావాలనుకుంటే ఇందులో రంగు వేసుకోవచ్చు.
7
దద్ధ్యోదనం
కావల్సినవి: అన్నం - కప్పు, పెరుగు - ఒకటిన్నర కప్పు, ఉప్పు - తగినంత, ఆవాలు - చెంచా, జీలకర్ర - చెంచా, కరివేపాకు - రెండు రెబ్బలు, అల్లం తరుగు - చెంచా, పచ్చిమిర్చి ముక్కలు - రెండు చెంచాలు, నెయ్యి - రెండు చెంచాలు, కొత్తిమీర - కట్ట.
తయారీ: అన్నాన్ని ఓ గిన్నెలోకి తీసుకుని పెరుగు వేసి బాగా కలపాలి. ఇప్పుడు పొయ్యిమీద బాణలి పెట్టి నెయ్యి వేయాలి. అది కరిగాక ఆవాలూ, జీలకర్ర వేయాలి. అవి వేగాక కరివేపాకూ, పచ్చిమిర్చి ముక్కలూ, అల్లం తరుగు వేసి దింపేయాలి. ఈ తాలింపును పెరుగున్నంలో వేయాలి. తరవాత తగినంత ఉప్పూ, కొత్తిమీర తరుగు వేసి కలపాలి. కావాలనుకుంటే ఇందులో దానిమ్మ గింజలు కూడా వేసుకోవచ్చు.
8
కట్టు పొంగలి
కావల్సినవి: పెసరపప్పు - కప్పు, బియ్యం - రెండు కప్పులు, జీలకర్ర - టేబుల్‌స్పూను, మిరియాలు - రెండు చెంచాలు, జీడిపప్పు - అరకప్పు, ఉప్పు - తగినంత, నెయ్యి - పావుకప్పు.
తయారీ: పెసరపప్పూ, బియ్యాన్ని కలిపి కడిగి ఆరున్నర గ్లాసుల నీళ్లు పోసి కుక్కర్‌లో మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు పొయ్యిమీద బాణలి పెట్టి నెయ్యి వేయాలి. అది కరిగాక జీలకర్రా, మిరియాలూ, జీడిపప్పు వేసి వేయించి దింపేయాలి. ఈ తాలింపును ఉప్పు కలిపిన పెసరపప్పు అన్నంలో వేసి కలపాలి.
9
కదంబం
కావల్సినవి: బియ్యం - కప్పు, కందిపప్పు - కప్పు, చింతపండు రసం - పెద్ద చెంచా, బెండకాయ, క్యారెట్, చిలగడదుంప, బంగాళాదుంప, వంకాయ, క్యాప్సికం, బఠాణీ, తీపి గుమ్మడికాయ, చిక్కుడుకాయ ముక్కలు - అన్నీ కలిపి మూడున్నర కప్పులు, సాంబారుపొడి - పెద్ద చెంచా, ఉప్పు - తగినంత, నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు, జీలకర్ర - చెంచా, కొత్తిమీర - కట్ట, కరివేపాకు రెబ్బలు - రెండు.
తయారీ: బియ్యంలో మూడుకప్పుల నీళ్లు పోసి పొయ్యిమీద పెట్టాలి. నాలుగు కూతలు వచ్చాక దింపేయాలి. అదేవిధంగా కందిపప్పూ, కూరగాయ ముక్కల్ని విడివిడిగా ఉడికించుకుని తీసుకోవాలి. ఇప్పుడు పొయ్యిమీద బాణలి పెట్టి... నెయ్యి వేయాలి. అది కరిగాక జీలకర్రా, కరివేపాకు వేయించి ఉడికించి పెట్టుకున్న కూరగాయముక్కలు వేయాలి. తరవాత సాంబారుపొడీ, తగినంత ఉప్పూ, చింతపండు రసం వేయాలి. ఐదు నిమిషాలయ్యాక ఉడికించి పెట్టుకున్న కందిపప్పు వేసి కాసిని నీళ్లు పోసి ఒకసారి ఉడకనివ్వాలి. తరవాత అందులో అన్నం, కొత్తిమీర వేసి కలిపితే చాలు.
సర్వ పాపహారిణి
సర్వ పాపహారిణి
వరుణశ్చైవ గోమూత్రే గోమయే హవ్యవాహనః
దధే వాయుః సముద్దిష్టః సోమః క్షీరే ఘ్రుతే రవిః!!
గోమూత్రంలో వరుణుడు, గోమయంలో అగ్ని, ఆవు పెరుగులో వాయుదేవుడు,
ఆవుపాలలో చంద్రుడు, ఆవు నెయ్యిలో సూర్యుడు, ఆవు ముఖంలో-యోని వద్ద ఇష్టార్ధ దేవతలు కొలువైయున్నారు.
పూర్వ కాలంలో గోవులెన్ని ఎక్కువ ఉంటే వారే శ్రీమంతులుగా ఉండేవారు.
గోధనమే నిజధనంగా భావించేవారు. గోధనంలేని రాజ్యం క్షీణిస్తుందనే భావనయుండేది.
అందుకనే పాండవులకి అరిష్టం కలిగించాలని ఉత్తర గోగ్రహణ(విరాట పర్వం) జరిపిస్తాడు దుర్యోధనుడు.
గో సంతానంలో కొన్ని పొలం దున్ని ఆహారోత్పత్తికై సహాయపడితే మరికొన్ని పాలను ప్రసాదించి మానవాళికి వాటి ద్వారా రోగనిరోధక శక్తి ప్రసాదిస్తాయి.
గోవును పూజించి ముమ్మారు ప్రదక్షిణ చేస్తే సర్వ పాపాలు హరిస్తాయి.
శ్రీ గోమహిమ (స్కాందపురాణామ్తర్గతమ్)
గోమాత గాయత్రి
ఓం లోక మాతాయ విద్మహే
సర్వ సిద్ధై చ ధీమహి
తన్నో గావో ప్రచోదయాత్
శ్రీ గోమహిమ (స్కాందపురాణామ్తర్గతమ్)
1::సృష్టి స్థితి వినాశానాం కర్త్రై మాత్రే నమోనమః
యాత్వం రసమయే ర్భావైరాప్యాయయసి భూతలం
2::దేవానాంచ తథా సంధాన్ పిత్రాణమపి వైగణాన్
సర్వేజ్ఞాతా రసభిజ్నే ర్మధుర స్వాదు దాయినీ
3::త్వయా విశ్వమిదం సర్వం బలం స్నేహ సమన్వితం
త్వం మాతా సర్వ రుద్రాణామ్ వసూనాం దుహితా తథా
4::ఆదిత్యానాం స్వసాచైవ తుష్టా వాంఛిత సిద్ధిదా
త్వం ద్రుతిస్త్వంత తథా పుష్టి స్త్వం స్వాహాత్వం స్వధా తథా
5::బుద్ధి: సిద్ధిస్తదా లక్ష్మీ ర్ధ్రుతి: కీర్తిస్తథా మతి:
కాంతిర్లజ్జా మహామాయా శ్రద్ధా సర్వార్ధ సాధినీ
6::త్వం మాతా సర్వదేవానాం త్వంచ సర్వస్య కారణం
త్వం తీర్ధం సర్వతీర్థానామ్ నమస్తేస్తు సదా౨నఘే
7::శశి సూర్యారుణా యస్యా లలాటే వృషభధ్వజః
సరస్వతీ చ హుంకారే సర్వే నాగాశ్చ కంబవే
8::ఉర పృష్ఠేచ గంధర్వా వేదాశ్చత్వార ఏవచ
ముఖాగ్రే సర్వ తీర్ధాని స్థావరాణి చ రాణిచ
9::గావః పవిత్రా మాంగల్యా గోషు లోకాః ప్రతిష్ఠితా
యద్గ్రుహే దుహ్ఖితాగావః సయాతి నరకం నరః
(ఇతి స్కాంద పురాణామ్తర్గత గోమహిమ సంపూర్ణం)
Subscribe to:
Posts (Atom)