Sunday, August 15, 2010

సుబ్రహ్మణ్య కరావాలంబ స్తోత్రం--Sri Subramanya karaavalamba Stotram,







































సుబ్రహ్మణ్య కరావాలంబ స్తోత్రం


1::
హే స్వామినాథ కరుణాకర దీనబంధో
శ్రీపార్వతీశముఖపంకజ పద్మబంధో 
శ్రీశాదిదేవగణపూజితపాదపద్మ
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ 


2::
దేవాదిదేవనుత దేవగణాధినాథ
దేవేంద్రవంద్య మృదుపంకజమంజుపాద 
దేవర్షినారదమునీంద్రసుగీతకీర్తే
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్

3::
నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్
తస్మాత్ప్రదాన పరిపూరితభక్తకామ 
శృత్యాగమప్రణవవాచ్యనిజస్వరూప
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్

4::
క్రౌంచాసురేంద్ర పరిఖండన శక్తిశూల
పాశాదిశస్త్రపరిమండితదివ్యపాణే 
శ్రీకుండలీశ ధృతతుండ శిఖీంద్రవాహ
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్

5::
దేవాదిదేవ రథమండల మధ్య వేద్య
దేవేంద్ర పీఠనగరం దృఢచాపహస్తమ్ 
శూరం నిహత్య సురకోటిభిరీడ్యమాన
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్

6::
హారాదిరత్నమణియుక్తకిరీటహార
కేయూరకుండలలసత్కవచాభిరామ 
హే వీర తారక జయాౙ్మరబృందవంద్య
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్

7::
పంచాక్షరాదిమనుమంత్రిత గాంగతోయైః
పంచామృతైః ప్రముదితేంద్రముఖైర్మునీంద్రైః 
పట్టాభిషిక్త హరియుక్త పరాసనాథ
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్

8::
శ్రీకార్తికేయ కరుణామృతపూర్ణదృష్ట్యా
కామాదిరోగకలుషీకృతదుష్టచిత్తమ్ |
భక్త్వా తు మామవకళాధర కాంతికాంత్యా
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్

9::సుబ్రహ్మణ్య కరావలంబం పుణ్యం యే పఠంతి ద్విజోత్తమాః 
తే సర్వే ముక్తి మాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః 
సుబ్రహ్మణ్య కరావలంబమిదం ప్రాతరుత్థాయ యః పఠేత్ 

కోటిజన్మకృతం పాపం తత్‍క్షణాదేవ నశ్యతి 






















SubrahmaNya KaraavaalaMba StOtraM 

hae svaaminaatha karuNaakara deenabaMdhO
SreepaarvateeSamukhapaMkaja padmabaMdhO 
SreeSaadidaevagaNapoojitapaadapadma
valleesanaatha mama daehi karaavalaMbam^ 

daevaadidaevanuta daevagaNaadhinaatha
daevaeMdravaMdya mRdupaMkajamaMjupaada 
daevarshinaaradamuneeMdrasugeetakeertae
valleesanaatha mama daehi karaavalaMbam^ 

nityaannadaana nirataakhila rOgahaarin^
tasmaatpradaana paripooritabhaktakaama 
SRtyaagamapraNavavaachyanijasvaroopa
valleesanaatha mama daehi karaavalaMbam^ 

krauMchaasuraeMdra parikhaMDana SaktiSoola
paaSaadiSastraparimaMDitadivyapaaNae 
SreekuMDaleeSa dhRtatuMDa SikheeMdravaaha
valleesanaatha mama daehi karaavalaMbam^ 

daevaadidaeva rathamaMDala madhya vaedya
daevaeMdra peeThanagaraM dRDhachaapahastam^ 
SooraM nihatya surakOTibhireeDyamaana
valleesanaatha mama daehi karaavalaMbam^ 

haaraadiratnamaNiyuktakireeTahaara
kaeyoorakuMDalalasatkavachaabhiraama 
hae veera taaraka jayaa~jmarabRMdavaMdya
valleesanaatha mama daehi karaavalaMbam^ 

paMchaaksharaadimanumaMtrita gaaMgatOyai@h
paMchaamRtai@h pramuditaeMdramukhairmuneeMdrai@h 
paTTaabhishikta hariyukta paraasanaatha
valleesanaatha mama daehi karaavalaMbam 

Sreekaartikaeya karuNaamRtapoorNadRshTyaa
kaamaadirOgakalusheekRtadushTachittam |
bhaktvaa tu maamavakaLaadhara kaaMtikaaMtyaa
valleesanaatha mama daehi karaavalaMbam^ 

subrahmaNya karaavalaMbaM puNyaM yae paThaMti dvijOttamaa@h 
tae sarvae mukti maayaaMti subrahmaNya prasaadata@h 
subrahmaNya karaavalaMbamidaM praatarutthaaya ya@h paThaet 
kOTijanmakRtaM paapaM tatkshaNaadaeva naSyati  

శ్రీ సుబ్రహ్మణ్యస్వామి--Sri SubramanyaSwami








గౌరీ శంకరుల మంగళకర ప్రేమకు,అనుగ్రహానికి ఐక్య రూపంసుబ్రహ్మణ్యస్వామి. షణ్ముఖుడు,కార్తీకేయుడు, వేలాయుధుడు,కుమారస్వామి గా పేరు గడించినస్వామి కారణజన్ముడు.తారకాసురుడు, సురావణుడుమరికొందరు రాక్షసులు ప్రజలను,దేవతలను హింసిస్తూ ఉండేవారు. ఈఅసురల బారి నుండి కాపాడమనిబ్రహ్మను కోరగా, శివ పార్వతులకుజన్మించిన పుత్రుడు వారిని వధిస్తాడనిచెప్పాడు. ఆ రకంగా పార్వతిపరమేశ్వరుల అనుగ్రహం తోకుమారస్వామి పుట్టుక విలక్షనమైనది.

శివాంశతో జన్మించినసుబ్రహ్మణ్యస్వామి గంగాదేవి గర్భంలోపెరుగుతాడు.గంగాదేవి ఆ పుత్రునిభారం మోయలేక రెల్లు పొదల్లోకి జారవిడుస్తుంది. అప్పుడు కృత్తికా దేవతలు ఆరుగురు తమస్తన్యమిచ్చి పెంచుతారు. రెల్లు పొదల్లో పెరిగినందువల్ల శరవణుడు అని, కృత్తికా దేవతలుపెంచినందు వల్ల కార్తికేయుడని పేరు వచ్చినది అని పురాణాలు చెబుతున్నాయి. ఆరుముఖాలు కలిగినందు వల్లనా షణ్ముఖుడు అని అంటారు. నెమలి వాహనం కలిగిన స్వామిగణేశునికి సోదరుడు. ఆరు ముఖాలలో ఐదు పంచేంద్రియాలకు, ఒకటి మనసుకు ప్రతీక.

స్వామి అనే నామధేయం సుబ్రహ్మణ్య స్వామి కి మాత్రమే సొంతం. సేనాపతిగా సకల దేవగణాలచేత పూజలు అందుకొనే సుబ్రహ్మణ్యుని అనుగ్రహం పొందితే గౌరిశంకరుల కటాక్షం లభిస్తుందనిప్రతీతి. తారాకాసురుడిని సంహరించిన కుమార స్వామి మార్గశిర మాసం శుక్లపక్ష షష్టినాడుజన్మించాడు. ఆరు ముఖాలు, పన్నెండు చేతులు సూర్య తేజస్సుతో జన్మించిన షణ్ముఖునిఆరాధించడం వలన సమస్తదోషాలు తొలగి, శుభాలు కల్గుతాయని భక్తుల నమ్మకం.ఆషాడమాస శుక్ల పక్ష పంచమి, షష్టిని పర్వదినాలుగా జరుపుకొంటారు. శుక్ల పక్ష పంచమినిస్కంద పంచమని, షష్టిని కుమార షష్టి అని భావించి భక్తులు ఆ రెండు రోజుల విశేష పూజలుచేస్తారు.
పంచమి నాడు ఉపవాసం ఉంది, షష్టి నాడు కుమారస్వామి ని పూజించినట్లైతే నాగ దోషాలుతొలగుతాయని, జ్గ్యానం వృద్ధి కలుగుతుందని, కుజదోషాలు తొలగుతాయని, సంతానంకలుగుతుందని నమ్మకం.

హే స్వామినాధ కరుణాకర దీనబంధో
శ్రీ పార్వతి సుముఖ పంకజ పద్మబందో
శ్రీ శాది దేవగణాధిత పాదపద్మ
వల్లీ సనాధ దేహి కరావలంభం

నేను casual గా నాగేద్రుని చిత్రాన్ని

webలో వెతుకుతున్నప్పుడు ఈ సుబ్రమణ్యంస్వామి కథ

simpleగా చాలా అర్థమయ్యెట్లుగా వుండెది

చదివి అది నాకు నచ్చి

నా Blogలో వేసుకొన్నాను ఇది నాసొంతం కాదు నాకు నచ్చినదీ మీకూ

నచ్చవచ్చుననీ ఈ పురాణం వేసాను :)

Friday, August 13, 2010

అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు



అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు



దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని
నాగుల చవితి పండుగ అంటారు.
కొందరు శ్రావణ శుద్ధ చతుర్థినాడు జరుపుకుంటారు

ఈరోజు నాగుల చవితి రేపు నాగపంచమి..నాగేద్రునికి పాలు పోస్తూ
ఈ శ్లోకాన్ని చెప్పుకోవడం మన ఆనవాయితి

నమస్తే దేవదేవేశ..నమస్తే ధరణీధర
నమస్తే సర్వ నాగేంద్ర..ఆదిశేష నమో స్తుతే

ఆ నాగేంద్రునికి చలిమిడి,చిమిలి,చేసి,విగ్రహానికి పాలుపోసి
నానబెట్టిన పెసరపప్పు పెట్టి గన్నెరు,జాజి,మొగలి పూలతో
పూజచేయాలి.

సాయంత్రం మతాబులు,కాకరపువ్వొత్తులు,టపాసులు
అందరం కలిసి సరదాగా కాలుస్తాము.

పాముకు పాలు పోసేటప్పుడు మా నానమ్మ
మాకు ఇలా పాట నేర్పించింది.

నడుము తొక్కితే నావాడు అనుకో..పడగ తొక్కితే పగవాడు కాదు అనుకో
తోక తొక్కితే తోటి వాడు అనుకో..నా కంట నువ్వుపడకు
నీకంట నేను పడకుండా చూడు తండ్రీ..అని నేర్పింది.

ఇది ఏమి టి అని అమ్మమ్మను అడిగితే
ప్రకృతి ని పూజిచటం మన సంస్కృతి అన్నది.
మనం విషసర్పమును కూడా పూజించి మన
శత్రువును కూడా ఆదరిస్తాము అని అర్ధము
.