Wednesday, October 24, 2012

దసరా నవరాత్రులు - దేవీ అవతారం విశిష్టత -- శ్రీరాజరాజేశ్వరీ దేవి



                                               శ్రీరాజరాజేశ్వరీ దేవి అవతారము తొమ్మిదవ రోజు



అందరికీ హృదయపూర్వక విజయ దశమి శుభాకాంక్షలతో ___/\___


శ్రీరాజరాజేశ్వరీ దేవి అవతారము

దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆశ్వయుజ శుద్ధ దశమి రోజున అమ్మవారిని
శ్రీరాజరాజేశ్వరీదేవిగా అలంకరిస్తారు.
సకల భువన బ్రహ్మాండాలకు అమ్మ ఆరాధ్య దేవత.
మహాత్రిపుర సుందరిగా ఈ దేవత త్రిపురాత్రయములో పూజలందుకుంటుంది.
అధిష్టాన దేవత రాజరాజేశ్వరీదేవి.
దేవీ నవరాత్రుల్లో తొమ్మిది రోజులు ముగిసిన తరువాత జరుపుకొనే విజయదశమి అపరాజితాదేవి పేరు మీద ఏర్పడిందని పండితులంటారు.
ఈమె స్వప్రాకాశ జ్యోతి స్వరూపిణి. పరమేశ్వరుని అంకము అమ్మకు ఆసనము.
ఇఛ్ఛా, ఙ్ఞాన, క్రియా శక్తులను ఈ మూర్తి తన భక్తులకు వరములుగా అనుగ్రహిస్తుంది.
దుర్గాదేవి వివిధ కల్పాలలో నానావిధ దుష్ట దనుజల్ని, వివిధ రూపాలు ధరించి సంహరించి
లోకానికి ఆనందాన్ని కలిగించింది. ఎక్కడా ఆమెకు అపజయం లేదు కాబట్టి అపరాజిత అయ్యింది.
ఎప్పుడూ విజయం సాధించింది కాబట్టి విజయ అని పిలువబడింది.
శ్రీచక్ర అధిష్టాన దేవత అయిన శ్రీలలితాదేవే సాక్షాత్తూ శ్రీరాజరాజేశ్వరి.
పరమశాంత స్వరూపంతో చిరునవ్వులు చిందిస్తూ ఇక్షుఖండాన్ని (చెరుకు) చేతిలో ధరించి
ఒక చేత అభయముద్రను చూపిస్తూ దర్శనమిస్తుంది. అపరాజితాదేవి స్వరూపమైన రాజరాజేశ్వరీదేవిని దర్శిస్తే అపజయమే ఉండదు.
ఆమ్మ యోగమూర్తి. మాయా మోహిత మానవ మనోచైతన్యాన్ని రాజరాజేశ్వరీ దేవి ఉద్దెపితం చేస్తుంది.
అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రమునకు అమ్మ అథిష్టాన దేవత.
శ్రీచక్రార్చన, కుంకుమార్చన చేయవలెను.

అమ్మకు నివాళించే నైవేద్యం::పరమాన్నం
అన్నిరకాల వంటకాలు చేసుకోవచ్చు విజయాలు ఇచ్చే
ఆ చల్లని తల్లికి ఎంత చేసినా తనివితీరదు



శ్రీ రాజరాజేశ్వర్యష్టకమ్

అమ్బా శామ్భవి చన్ద్రమౌళిరబలా పర్ణా ఉమా పార్వతీ
కాళీ హైమవతీ శివా త్రినయనీ కాత్యాయనీ భైరవీ
సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్యలక్ష్మీప్రదా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ
అమ్బా మోహిని దేవతా త్రిభువనీ ఆనన్దదాయినీ
వాణీ పల్లవపాణివేణుమురళీగానప్రియా లోలినీ
కల్యాణీ ఉడురాజబిమ్బ వదనా ధూమ్రాక్షసంహారిణీ
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ

అమ్బా నూపురరత్నకఙ్కణధరీ కేయూరహారావళీ
జాతీచమృకవైజయంతిలహరీ గ్రైవేయకైరాజితా
వీణావేణు వినోదమణ్డితకరా వీరాసనే సంస్థితా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ

అమ్బా రౌద్రిణి భద్రకాళి బగళా జ్వాలాముఖీ వైష్ణవీ
బ్రహ్మణీ త్రిపురాన్తకీ సురనుతా దేదీప్యమానోజ్వలా
చాముణ్డా శ్రితరక్షపోషజననీ దాక్షాయణీ వల్లవీ
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ

అమ్బా శూలధనుః కశాఙ్కశధరీ అర్థేన్దుబిమ్బాధరీ
వారాహీమధుకైటభప్రశమనీ వాణీ రమా సేవితా
మల్లద్యాసురమూకదైత్యమథనీ మహేశ్వరీ చామ్బికా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ

అమ్బా సృష్టవినాశపాలనకరీ ఆర్యా విసంశోభితా
గాయత్రీ ప్రణవాక్షరామృతరసః పూర్ణానుసంధీ కృతా
ఓఙ్కారీ వినతాసుతార్చితపదా ఉద్దణ్డ దైత్యాపహా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ

అమ్బా శాశ్వత ఆగమాదివినుతా ఆర్యా మహాదేవతా
యా బ్రహ్మాదిపిపీలికాన్తజననీ యా వై జగన్మోహినీ
యా పంచప్రణవాదిరేఫజననీ యా చిత్కళా మాలినీ
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ

అమ్బా పాలితభక్తరాజదనిశం అమ్బాష్టకం యః పఠేత్
అమ్బాలోలకటాక్షవీక్ష లలితం చైశ్వర్యమవ్యాహతమ్
అమ్బా పావనమన్త్రరాజపఠనాదన్తే చ మోక్షప్రదా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ

{{ ఇతి శ్రీరాజరాజేశ్వర్యష్టకం సమ్పూర్ణమ్ }}
Sunder Raj Priya

No comments: