ఐదవరోజు అవతారం సరస్వతీ దేవీ
శ్రీ సరస్వతి దేవి అవతారము 5వ రోజు
శరన్నవరాత్రులలో మూలా నక్షత్రానికి ప్రత్యేక విశిష్టత ఉన్నది.
చదువుల తల్లి సరస్వతీదేవి రూపములో దుర్గాదేవి దర్శనమిచ్చే పవిత్రమైన రోజు.
బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతీ దేవిని పురాణములు వర్ణిస్తున్నాయి.
"సరస్వతి వాహనము హంస. హంస అంటే శ్వాసశక్తి.
రెండు రెక్కల పై విహరించే హంసలా ఇడ పింగళ నాడుల ఆధారంగా
సుషుమ్న నాడిపై ప్రవహించే ప్రాణశక్తి అదే. ప్రవహించడమే సరస్వతి..
సరస్వతి అంటే జ్ఞానం.. గురువునుంచి శిష్యునికి పరంపరాగతంగా ప్రవహిస్తుంది జ్ఞానం..
హంసపై చరిస్తుంది. శ్వాసననుసరించి చరిస్తుందని అర్థం.
అంతేగాక క్షీరనీరములను విడదీసి క్షీరమునే గ్రోలుతుంది అని నానుడి ఉంది.
అలాగే ప్రపంచమందలి సత్ - అసత్తులను విడదీసి అసత్తును వర్జించి, సద్వస్తువును అన్వేషించడమే జ్ఞానము అని చెప్పబడుతున్నది.
అటువంటి వివేక జ్ఞానానికి అధినేత్రి సరస్వతి. ఆ జ్ఞానము భక్తులకు ప్రసాదించు శక్తియే సరస్వతీ దేవి హంసవాహన పరమార్థం.
ఆమె నాదస్వరూపిణి అనడానికి సూచనగా వీణాపాణియైనది. మూర్తి శ్వేతం అది పరిపూర్ణ శుద్ధ తత్వంగా గ్రహింపదగినది.
ప్రశాంతి చిహ్నం శ్వేతత్వం. శ్వేతవర్ణం ప్రత్యేక వర్ణం కాదు.
సర్వవర్ణ సమష్టి రూపమవడం (వీభ్ఘ్Yఓఋ) వలన సరస్వతీ దేవి సర్వవిద్యా సమష్టి మూర్తి అని తెలియవచ్చు.... "
రాసినవారు (Dinavahi Vekata Hanumantharao) నుండి సేకరణ
శరన్నవరాత్రులలో మూలా నక్షత్రానికి ప్రత్యేక విశిష్టత ఉన్నది.
చదువుల తల్లి సరస్వతీదేవి రూపములో దుర్గాదేవి దర్శనమిచ్చే పవిత్రమైన రోజు.
బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతీ దేవిని పురాణములు వర్ణిస్తున్నాయి.
శ్వేత పద్మాన్ని ఆసనముగా అధీష్ఠించి వీణ, దండ, కమండలము, అక్షమాల ధరించి
అభయ ముద్రతో భక్తుల అఙ్ఞాన తిమిరాలను ఈ దేవి సంహరిస్తుంది.
వ్యాసభగవానుడు, వాల్మీకిమహర్షి, కాళిదాసు మున్నగు లోకోత్తర కవులకు,
పురాణ పురుషులకు అమ్మ వాగ్వైభవమును వరముగా అందచేసింది.
అమ్మను కొలిస్తే విద్యార్ధులకు చక్కని బుధ్ధిని వికాసము కలుగుతుంది.
త్రిశక్తి స్వరూపములలో సరస్వతీదేవి మూడొవ శక్తిరూపము.
సంగీత సాహిత్యములకు అమ్మ అథిష్టాన దేవత.
సకల జీవుల జిహ్మాగ్రముపై అమ్మ నివాసము ఉంటుంది.
"సరస్వతి వాహనము హంస. హంస అంటే శ్వాసశక్తి.
రెండు రెక్కల పై విహరించే హంసలా ఇడ పింగళ నాడుల ఆధారంగా
సుషుమ్న నాడిపై ప్రవహించే ప్రాణశక్తి అదే. ప్రవహించడమే సరస్వతి..
సరస్వతి అంటే జ్ఞానం.. గురువునుంచి శిష్యునికి పరంపరాగతంగా ప్రవహిస్తుంది జ్ఞానం..
హంసపై చరిస్తుంది. శ్వాసననుసరించి చరిస్తుందని అర్థం.
అంతేగాక క్షీరనీరములను విడదీసి క్షీరమునే గ్రోలుతుంది అని నానుడి ఉంది.
అలాగే ప్రపంచమందలి సత్ - అసత్తులను విడదీసి అసత్తును వర్జించి, సద్వస్తువును అన్వేషించడమే జ్ఞానము అని చెప్పబడుతున్నది.
అటువంటి వివేక జ్ఞానానికి అధినేత్రి సరస్వతి. ఆ జ్ఞానము భక్తులకు ప్రసాదించు శక్తియే సరస్వతీ దేవి హంసవాహన పరమార్థం.
ఆమె నాదస్వరూపిణి అనడానికి సూచనగా వీణాపాణియైనది. మూర్తి శ్వేతం అది పరిపూర్ణ శుద్ధ తత్వంగా గ్రహింపదగినది.
ప్రశాంతి చిహ్నం శ్వేతత్వం. శ్వేతవర్ణం ప్రత్యేక వర్ణం కాదు.
సర్వవర్ణ సమష్టి రూపమవడం (వీభ్ఘ్Yఓఋ) వలన సరస్వతీ దేవి సర్వవిద్యా సమష్టి మూర్తి అని తెలియవచ్చు.... "
రాసినవారు (Dinavahi Vekata Hanumantharao) నుండి సేకరణ
శ్రీ సరస్వతి స్తోత్రం
1::
యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా
యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా
యా బ్రహ్మాచ్యుత శంకరప్రభృతిభిర్దేవైస్సదా పూజితా
సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా
2::
దోర్భిర్యుక్తా చతుర్భిః స్ఫటికమణినిభై రక్షమాలాందధానా
హస్తేనైకేన పద్మం సితమపిచ శుకం పుస్తకం చాపరేణ
భాసా కుందేందుశంఖస్ఫటికమణినిభా భాసమానాౙ్సమానా
సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా
3::
సురాసురైస్సేవితపాదపంకజా కరే విరాజత్కమనీయపుస్తకా
విరించిపత్నీ కమలాసనస్థితా సరస్వతీ నృత్యతు వాచి మే సదా
4::
సరస్వతీ సరసిజకేసరప్రభా తపస్వినీ సితకమలాసనప్రియా
ఘనస్తనీ కమలవిలోలలోచనా మనస్వినీ భవతు వరప్రసాదినీ
5::
సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా
6::
సరస్వతి నమస్తుభ్యం సర్వదేవి నమో నమః
శాంతరూపే శశిధరే సర్వయోగే నమో నమః
7::
నిత్యానందే నిరాధారే నిష్కళాయై నమో నమః
విద్యాధరే విశాలాక్షి శుద్ధఙ్ఞానే నమో నమః
8::
శుద్ధస్ఫటికరూపాయై సూక్ష్మరూపే నమో నమః
శబ్దబ్రహ్మి చతుర్హస్తే సర్వసిద్ధ్యై నమో నమః
9::
ముక్తాలంకృత సర్వాంగ్యై మూలాధారే నమో నమః
మూలమంత్రస్వరూపాయై మూలశక్త్యై నమో నమః
10::
మనోన్మని మహాభోగే వాగీశ్వరి నమో నమః
వాగ్మ్యై వరదహస్తాయై వరదాయై నమో నమః
11::
వేదాయై వేదరూపాయై వేదాంతాయై నమో నమః
గుణదోషవివర్జిన్యై గుణదీప్త్యై నమో నమః
12::
సర్వఙ్ఞానే సదానందే సర్వరూపే నమో నమః
సంపన్నాయై కుమార్యై చ సర్వఙ్ఞే తే నమో నమః
13::
యోగానార్య ఉమాదేవ్యై యోగానందే నమో నమః
దివ్యఙ్ఞాన త్రినేత్రాయై దివ్యమూర్త్యై నమో నమః
14::
అర్ధచంద్రజటాధారి చంద్రబింబే నమో నమః
చంద్రాదిత్యజటాధారి చంద్రబింబే నమో నమః
15::
అణురూపే మహారూపే విశ్వరూపే నమో నమః
అణిమాద్యష్టసిద్ధాయై ఆనందాయై నమో నమః
16::
ఙ్ఞాన విఙ్ఞాన రూపాయై ఙ్ఞానమూర్తే నమో నమః
నానాశాస్త్ర స్వరూపాయై నానారూపే నమో నమః
17::
పద్మజా పద్మవంశా చ పద్మరూపే నమో నమః
పరమేష్ఠ్యై పరామూర్త్యై నమస్తే పాపనాశినీ
18::
మహాదేవ్యై మహాకాళ్యై మహాలక్ష్మ్యై నమో నమః
బ్రహ్మవిష్ణుశివాయై చ బ్రహ్మనార్యై నమో నమః
19::
కమలాకరపుష్పా చ కామరూపే నమో నమః
కపాలికర్మదీప్తాయై కర్మదాయై నమో నమః
20::
సాయం ప్రాతః పఠేన్నిత్యం షణ్మాసాత్సిద్ధిరుచ్యతే
చోరవ్యాఘ్రభయం నాస్తి పఠతాం శృణ్వతామపి
21::
ఇత్థం సరస్వతీ స్తోత్రమగస్త్యముని వాచకమ్
సర్వసిద్ధికరం నౄణాం సర్వపాపప్రణాశనమ్
నేటి నైవేద్యం: దద్ధ్యోదనం (పెరుగన్నం)
No comments:
Post a Comment