Monday, October 22, 2012

దసరా నవరాత్రులు - దేవీ అవతారం విశిష్టత -- దుర్గా దేవి



                                                           ఏడవ రోజు దుర్గా దేవి అవతారము



ఏడవ రోజు దుర్గా దేవి అవతారము
దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపముగా అమ్మవారు నవరాత్రులలో అష్టమి తిథిలో దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారములో అమ్మ దుర్గముడనే రాక్షసుడిని సమ్హరించినట్లు పురాణములు చెబుతున్నాయి.పంచప్రకృతి స్వరూపములలో ప్రధమమైనది దుర్గారూపము.  భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని ఈ మాత అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. కోటి సూర్య ప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రుబాధలు తొలగిపోతాయి. విజయము కలుగుతుంది. సకల గ్రహ దోషములు అమ్మను పూజించినంతమాత్రమునే ఉపశమింపబడతాయి. ఆరాధకులకు అమ్మ శీఘ్ర అనుగ్రహకారిణి.
అమ్మవారి ఇష్టమైన ప్రసాదం..( కదంభం) సాంబర్ అన్నం)

పూజా విధానము::-ఎర్రని బట్టలు పెట్టి, ఎర్రని అక్షతలతో, ఎర్రని పూలతో అమ్మని పూజించాలి.
మంత్రము: “ఓం దుం దుర్గాయైనమః” అనే మంత్రమును  పఠించాలి.

శ్రీ  దుర్గ సూక్తం

ఓం || జాతవే’దసే సునవామ సోమ’ మరాతీయతో నిద’హాతి వేదః’ 
స నః’ పర్-షదతి’ దుర్గాణి విశ్వా’ నావేవ సింధుం’ దురితా‌உత్యగ్నిః 

తామగ్నివ’ర్ణాం తప’సా జ్వలంతీం వై’రోచనీం క’ర్మఫలేషు జుష్టా”మ్ 
దుర్గాం దేవీగ్‍మ్ శర’ణమహం ప్రప’ద్యే సుతర’సి తరసే’ నమః’ 

అగ్నే త్వం పా’రయా నవ్యో’ అస్మాంథ్-స్వస్తిభిరతి’ దుర్గాణి విశ్వా” 
పూశ్చ’ పృథ్వీ బ’హులా న’ ఉర్వీ భవా’ తోకాయ తన’యాయ శంయోః 

విశ్వా’ని నో దుర్గహా’ జాతవేదః సింధున్న నావా దు’రితా‌உతి’పర్-షి 
అగ్నే’ అత్రివన్మన’సా గృణానో”‌உస్మాకం’ బోధ్యవితా తనూనా”మ్ 

పృతనా జితగ్ం సహ’మానముగ్రమగ్నిగ్‍మ్ హు’వేమ పరమాథ్-సధస్థా”త్ 
స నః’ పర్-షదతి’ దుర్గాణి విశ్వా క్షామ’ద్దేవో అతి’ దురితా‌உత్యగ్నిః 

ప్రత్నోషి’ కమీడ్యో’ అధ్వరేషు’ సనాచ్చ హోతా నవ్య’శ్చ సత్సి’ 
స్వాంచా”ఙ్నే తనువం’ పిప్రయ’స్వాస్మభ్యం’ చ సౌభ’గమాయ’జస్వ 

గోభిర్జుష్ట’మయుజో నిషి’క్తం తవేం”ద్ర విష్ణోరనుసంచ’రేమ 
నాక’స్య పృష్ఠమభి సంవసా’నో వైష్ణ’వీం లోక ఇహ మా’దయంతామ్ 

ఓం కాత్యాయనాయ’ విద్మహే’ కన్యకుమారి’ ధీమహి | తన్నో’ దుర్గిః ప్రచోదయా”త్

ఓం శాంతిః శాంతిః శాంతిః’ 




శ్రీదుర్గా అష్టోత్తర శతనామస్తోత్రం

దుర్గా శివా మహాలక్ష్మీ-ర్మహాగౌరీ చ చండికా 
సర్వఙ్ఞా సర్వలోకేశీ సర్వకర్మఫలప్రదా

సర్వతీర్థమయీ పుణ్యా దేవయోని-రయోనిజా 
భూమిజా నిర్గుణాధారశక్తిశ్చానీశ్వరీ తథా

నిర్గుణా నిరహంకారా సర్వగర్వవిమర్దినీ
సర్వలోకప్రియా వాణీ సర్వవిద్యాధిదేవతా 

పార్వతీ దేవమాతా చ వనీశా వింధ్యవాసినీ 
తేజోవతీ మహామాతా కోతిసూర్యసమప్రభా 

దేవతా వహ్నిరూపా చ సరోజా వర్ణరూపిణీ 
గుణాశ్రయా గుణమధ్యా గుణత్రయవివర్జితా 

కర్మఙ్ఞానప్రదా కాంతా సర్వసంహారకారిణీ 
ధర్మఙ్ఞానా ధర్మనిష్టా సర్వకర్మవివర్జితా 

కామాక్షీ కామసంహర్త్రీ కామక్రోధవివర్జితా 
శాంకరీ శాంభవీ శాంతా చంద్రసూర్యాగ్నిలోచనా 

సుజయా జయభూమిష్ఠా జాహ్నవీ జనపూజితా 
శాస్త్రా శాస్త్రమయా నిత్యా శుభా చంద్రార్ధమస్తకా 

భారతీ భ్రామరీ కల్పా కరాళీ కృష్ణపింగళా 
బ్రాహ్మీ నారాయణీ రౌద్రీ చంద్రామృతపరివృతా 

జ్యేష్ఠేందిరా మహామాయా జగత్సృష్ట్యాధికారిణీ
బ్రహ్మాండకోటిసంస్థానా కామినీ కమలాలయా 

కాత్యాయనీ కలాతీతా కాలసంహారకారిణీ 
యోగనిష్ఠా యోగగమ్యా యోగధ్యేయా తపస్వినీ

ఙ్ఞానరూపా నిరాకారా భక్తాభీష్టఫలప్రదా
భూతాత్మికా భూతమాతా భూతేశా భూతధారిణీ

స్వధానారీమధ్యగతా షడాధారాదివర్ధినీ 
మోహితాంశుభవా శుభ్రా సూక్ష్మా మాత్రా నిరాలసా 

నిమ్నగా నీలసంకాశా నిత్యానందా హరా పరా 
సర్వఙ్ఞానప్రదానందా సత్యా దుర్లభరూపిణీ 

సరస్వతీ సర్వగతా సర్వాభీష్టప్రదాయినీ 

 || ఇతి శ్రీదుర్గా అష్టోత్తర శతనామస్తోత్రం సంపూర్ణమ్ 

No comments: