Saturday, October 20, 2012

దసరా నవరాత్రులు - దేవీ అవతారం విశిష్టత -- అన్నపూర్ణాదేవి


                                                        మూడవరోజు అవతారం అన్నపూర్ణ దేవీ 

దసరా నవరాత్రి 
అన్నపూర్ణాదేవి అవతారం 3వ రోజు 

ఊర్వీ సర్వజయేశ్వరీ జయకరీ
మాతాకృపాసాగరీ

నారీనీల సమానకుంతలధరీ
నిత్యాన్నదానేశ్వరీ
సాక్షాన్ మోక్షకరీ సదాశుభకరీ
కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ
మాతాన్నపూర్ణేశ్వరీ !!


దసరా ఉత్సవాలలో మూడోరోజు అమ్మవారిని శ్రీఅన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు.
సకలప్రాణకోటికీ జీవనాధారం అన్నం.అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు.
ఈ రూపంలో అమ్మ రసపాత్రనుధరించి దర్శనమిస్తుంది.
ఆదిభిక్షువైన ఈశ్వరుడికి భిక్షపెట్టిన దేవత.అన్నపూర్ణాదేవి.
ఈమెను ధ్యానిస్తే మేధాశక్తి వృద్ధి చెందుతుంది. మధుర భాషణం,సమయ స్ఫుర్తి , వాక్‌సిద్ధి, శుద్ధి,భక్తిశ్రద్ధలు ఐశ్వర్యం కలుగుతాయి.
మానవుణ్ణి సకలసంపూర్ణుడిగా ఈ దేవి అనుగ్రహిస్తుంది .ప్రపంచ సృస్టి పోషకురాలు. " అమ్మ " అనే అంతరార్థం ఈ అవతారంలో కనిపిస్తుంది. అమ్మ ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది.బుద్ధి జ్ఞానాలను ఈ తల్లి వరంగా ఇస్తుంది. పరిపూర్ణ భక్తితో తనను కొలిచే భక్తుల పోషణాభారం ఈ తల్లి వహిస్తుందని ఆర్షవాక్యం. తెల్లని పుష్పాలతో అమ్మను పూజించాలి...హ్రీం..శ్రీం..క్లీం..ఓం నమో భగవత్యన్నపూర్ణేశి మమాభిలషిత మహిదేవ్యన్నం స్వాహా" అనే మంత్రం జపించాలి.అమ్మవారికి కొబ్బర అన్నం , దద్ధోజనం , కట్టెపొంగలి నివేధించాలి అన్నపూర్ణ అష్టోత్తరం , స్తోత్రాలు పారాయణం చేయాలి...అమ్మకు ఏదో ఒక వంటకం నివేదించిననూ.సంటుస్తురాలవుతుంది..మంగళవారం..శుక్రవారం..ధాన్యాలలో విగ్రహం ప్ర్ట్టి ఆ తల్లిని కొలిస్తే..అన్నానికి లోటుండదని పెద్దల నానుడి..ఓం శ్రీఅన్నపూర్ణాదేవి నమో నమహా___/\___


!!! అన్నపూర్ణాష్టకమ్ – శ్రీ అన్నపూర్ణా దేవి అష్టకం !!!

1}
నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ
నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ
ప్రాలేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ


2}
నానా రత్న విచిత్ర భూషణకరి హేమాంబరాడంబరీ
ముక్తాహార విలంబమాన విలసత్-వక్షోజ కుంభాంతరీ
కాశ్మీరాగరు వాసితా రుచికరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ


3}
యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక్య నిష్ఠాకరీ
చంద్రార్కానల భాసమాన లహరీ త్రైలోక్య రక్షాకరీ
సర్వైశ్వర్యకరీ తపః ఫలకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ


4}కైలాసాచల కందరాలయకరీ గౌరీ-హ్యుమాశాంకరీ
కౌమారీ నిగమార్థ-గోచరకరీ-హ్యోంకార-బీజాక్షరీ
మోక్షద్వార-కవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ


5}దృశ్యాదృశ్య-విభూతి-వాహనకరీ బ్రహ్మాండ-భాండోదరీ
లీలా-నాటక-సూత్ర-ఖేలనకరీ విఙ్ఞాన-దీపాంకురీ
శ్రీవిశ్వేశమనః-ప్రసాదనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ


6}ఉర్వీసర్వజయేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ
వేణీ-నీలసమాన-కుంతలధరీ నిత్యాన్న-దానేశ్వరీ
సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

7
}ఆదిక్షాంత-సమస్తవర్ణనకరీ శంభోస్త్రిభావాకరీ
కాశ్మీరా త్రిపురేశ్వరీ త్రినయని విశ్వేశ్వరీ శర్వరీ
స్వర్గద్వార-కపాట-పాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

8
}దేవీ సర్వవిచిత్ర-రత్నరుచితా దాక్షాయిణీ సుందరీ
వామా-స్వాదుపయోధరా ప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ
భక్తాభీష్టకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

9
}చంద్రార్కానల-కోటికోటి-సదృశీ చంద్రాంశు-బింబాధరీ
చంద్రార్కాగ్ని-సమాన-కుండల-ధరీ చంద్రార్క-వర్ణేశ్వరీ
మాలా-పుస్తక-పాశసాంకుశధరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ


10}క్షత్రత్రాణకరీ మహాభయకరీ మాతా కృపాసాగరీ
సర్వానందకరీ సదా శివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ
దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

11
}అన్నపూర్ణే సాదాపూర్ణే శంకర-ప్రాణవల్లభే
ఙ్ఞాన-వైరాగ్య-సిద్ధయర్థం బిక్బిం దేహి చ పార్వతీ

12
}మాతా చ పార్వతీదేవీ పితాదేవో మహేశ్వరః
బాంధవా: శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్

13
}సర్వ-మంగల-మాంగల్యే శివే సర్వార్థ-సాధికే 
శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమో‌உస్తు తే 


{{ ఇతి శ్రీ శంకరాచార్య విరచిత అన్నపూర్ణాష్టకమ్ సంపూర్ణం }}


No comments: