Tuesday, October 23, 2012

దసరా నవరాత్రులు - దేవీ అవతారం విశిష్టత -- శ్రీ మహిషాసురమర్ధిని దేవి
                                                         శ్రీ మహిషాసురమర్ధిని దేవి 8వ రోజు 
శ్రీ మహిషాసురమర్ధిని దేవి 8వ రోజు 
    
దేవీ నవరాత్రులలో అత్యుగ్ర రూపముదాల్చి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసినది మహిషాసుర మర్ధినీ దేవి.
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆశ్వయుజశుద్ధ నవమినాడు అమ్మవారిని శ్రీమహిషాసురమర్దినీదేవిగా అలంకరిస్తారు. దీన్నే మహర్నవమి అని కూడా అంటారు. 
ధర్మ విజయమునకు సంకేతముగా ఆశ్వయుజ శుధ్ధ నవమి రోజును మహర్నవమిగా భక్తులు ఉత్సవము జరుపుకుంటారు. 
మహిషాసురుడి వల్ల తీవ్రమైన కష్టాలు పడుతున్న ఇంద్రాది దేవతలు తమతమ శరీరాల్లోంచి దివ్య తేజసును బయటకు ప్రసరించారు. ఆ తేజస్సు నుంచి దివ్య తేజోమూర్తి ఉద్భవించింది.ఆ తేజోమూర్తికి దేవతలంతా తమతమ ఆయుధాల్ని సమర్పించారు. హిమవంతుడు సింహాన్ని సమర్పిస్తాడు హిమవంతుడు సింహాన్ని సమర్పిస్తాడు. సింహవాహినిగా ఆ శక్తి వికటాట్టహాసం చేసి, మహిషాసురుడి సేనాపతులైన రాక్షసులందరినీ సంహరిస్తుంది. అనంతరం మహిషాసురుడిని చంపి  
అదే స్వరూపంతో ఇంద్రకీలాద్రిపై వెలిసింది. కాలక్రమంలో కనకదుర్గగా కీర్తి పొందింది. సింహవాహనం మీద ఆలీఢ పాద పద్ధతిలో ఒక చేత త్రిశూలాన్ని ధరించి, మహిషాసురుణ్ణి సంహరిస్తున్న రూపంతో దుర్గమ్మ దర్శనమిస్తుంది  
అహిషాసురుడనే రాక్షసుడను సంహరించిన అమ్మను మహిషాసురమర్ధినీ దేవిగా పూజిస్తే శత్రుభయములు తొలగిపోయి సకల విజయములు కలుగుతాయి. 
ఈ అమ్మను పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితము లభిస్తుంది.

ఈ తల్లికి ఇష్టమైన రంగు::ముదురు నీలం 

నైవేద్యం::బెల్లం పాయసం  

Sunder Raj Priya 

మహిషాసురమర్ధిని స్తోత్రం 

1::అయిగిరి నందిని, నందిత మేదిని, విశ్వ వినోదిని నందనుతె
గిరి వర వింధ్య శిరోధిని వాసిని విష్ణువిలాసిని జిష్ణునుతె
భగవతి హె శితికంఠకుటుమ్భిని భూరికుటుంభిని భూరికృతె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె

2::సురవరవర్షిని దుర్ధరదర్షిణి దుర్ముఖమర్షిని హర్షరతె
త్రిభువనపోషిణి శంకరతోషిణి కిల్మశమోషిణి ఘోషరతె
దనుజనిరోషిణి దితిసుతరోషిణి దుర్మదశోషిణి సింధుసుతె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె

3::అయి జగదంబ మదంబ కదంబ వనప్రియవాసిని హాసరతె
శిఖర శిరోమణి తుంగహిమాలయ శృంగనిజాలయ మధ్యగతె
మధుమధురె మధుకైటభభంజిని కైటభభంజిని రాసరతె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె

4::అయి శతఖండ విఖండితరుండ వితుండితశుండ గజాధిపతె
రిపుగజగండ విదారణచండ పరాక్రమశుండ మృగాధిపతె
నిజభుజదండ నిపాతితఖండ విపాతితముండ భఠాధిపతె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె

5::అయి రణదుర్మదశత్రువధోదిత దుర్ధరనిర్జర శక్తిభృతె
చతురవిచారధురీణమహాశివ దూతక్రిత ప్రమథాధిపతె
దురితదురీహదురాశయదుర్మతి దానవదూత కృతాంతమతె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె

6::అయి శరణాగత వైరివధూవర వీరవరాభయదాయకరె
త్రిభువనమస్తక శూలవిరోధిశిరోధికృతామల శూలకరె
దుమిదుమితామర దుందుభినాద మహోముఖరీకృత తిగ్మకరె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె

7::అయి నిజహుంక్రితి మాత్రనిరాక్రిత ధూమ్రవిలోచన ధూమ్రశతె
సమరవిశోషిత శోణితబీజ సముద్భవశోణిత బీజలతె
శివశివశుంభని శుంభమహాహవతర్పిత భూతపిశాచరతె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె

8::ధనురనుసంగరణక్షణసంగ పరిశ్ఫురదంగ నటత్కటకె
కనకపిశంగ ప్రిశత్కనిశంగ రసాద్భటశృంగ హతాబటుకె
క్రుతచతురంగ బలక్షితిరంగ ఘటద్బహురంగ రటద్బటుకె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె

9::జయ జయ జప్యజయె జయశబ్ద పరస్తుతిటతత్పర విశ్వనుతె
ఝణ ఝణ ఝింఝిమిఝింక్రితనూపుర సింజితమోహిత భూతపతె
నటిత నటార్ధనటీనటనాయక నాటితనాట్యసుగానరతె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె

10::అయి సుమనః సుమనః సుమనః సుమనోహరకాంతియుతె
శ్రిత రజనీ రజనీ రజనీ రజనీ రజనీకరవక్రవృతె
సునయనవిభ్ర మరభ్ర మరభ్ర మరభ్ర మరభ్ర మరాధిపతె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె


11::సహితమహాహవ మల్లమతల్లిక మల్లితరల్లిక మల్లరతె
విరచిత వల్లిక పల్లిక మల్లిక భిల్లికభిల్లిక వర్గవృతె
సిత క్రుత ఫుల్లిసముల్లసితారుణతల్లజ పల్లవసల్లలితె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె

12:అవిరలగండ గలంమదమేదుర మత్తమతంగజరాజపతె
త్రిభువన భూషణ భూతకలానిధి రూపపయోనిధిరాజసుతె
అయి సుదతీజనలాలసమానస మోహనమన్మథరాజసుతె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె

13:కమలదలామలకోమల కాంతికలాకలితామల బాలలతె
సకలవిలాసకలానిలయక్రమ కెలిచలత్కల హంసకులె
అలికులసంకుల కువలయమండల మౌలిమిలద్భకులాలికులె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె

14:కరమురలీరవ వీజిత కూజిత లజ్జిత కోకిల మంజుమతె
మిలితపులింద మనోహరగుంజిత రంజితశైలనికుంజగతె
నిజగుణభూత మహాశబరీగణ సద్గుణసమ్భ్రుత కేలితలె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె

15:కటితటపీతదుకూలవిచిత్ర మయూఖతిరస్క్రిత చంద్రరుచె
ప్రణత సురాసుర మౌలిమణిస్ఫురదంశులసన్నఖ చంద్రరుచె
జితకనకాచల మౌలిపదోర్జిత నిర్భరకుంజర కుంభకుచె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె

16:విజితసహస్ర కరైకసహస్ర కరైకసహస్ర కరైకనుతె
క్రుతసురతారక సంగరతారక సంగరతారక సూనుసుతె
సురథసమాధి సమానసమాధి సమాధి సమాధి సుజాతరతె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె

17:పదకమలం కరుణానిలయె వరివస్యతి యోనుదినం సశివె
అయి కమలె కమలానిలయె కమలానిలయః సకథం న భవెత్
తవ పదమెవ పరం పదమిత్యనుశీలయతొ మమ కిం న శివె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె

18::కనకలసత్కల సింధుజలైరనుసించినుతె గుణరంగభువం
భజతి స కిం న శచికుచకుంభ తటీపరిరంభ సుఖానుభవం
తవ చరణమ్ శరణమ్ కరవాణి నతామరవాణి నివాసిశివమ్
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె

19::తవ విమలేందుకులం వదనెందుం అలం సకలం నను కూలయతె
కిము పురుహూత పురీందుముఖీసుముఖీభిరసౌ విముఖీక్రియతె
మమ తు మతం శివనామధనె భవతీ క్రిపయా కిముత క్రియతె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె

20::అయి మయి దీనదయాలుతయా కృపయైవ త్వయా భవితవ్యముమె
అయి జగతో జననీ కృపయాసి యథాసి తథనుమితాసిరతె
టదుచితమత్ర భవత్యురరీకురుతాదురుతాప మపాకురుతె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె.

1 comment:

A.V.Naga Sandeep Kumar said...

ammavari stotralu copy chesi print chesukovadaniki kudaradm ledu andi