Thursday, December 16, 2010

శ్రీ శివ మానసపూజా స్తోత్రం--Siva manasapuja stotram









శ్రీ శివ మానసపూజా స్తోత్రం 

1:రత్నైః కల్పిత మాసనం హిమజలైః స్నానం చ దివ్యాంబరం
నానారత్న విభూషితం మృగమదా మోదాంకితం చందనం

2:జాతీ చంపక బిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తథా
దీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం

3:సౌవర్ణే నవరత్నఖండరచితే పాత్రే ఘృతం పాయసం
భక్ష్యం పంచవిధం పయో దధియుతం రంభాఫలం పానకం

4:శాకానా మయుతం జలం రుచికరం కర్పూరఖండోజ్జ్వలం
తాంబూలం మనసా మయా విరచితం భక్త్యాప్రభో స్వీకురు

5:ఛత్రం చామరయోర్యుగం వ్యంజనకం చాదర్శకం నిర్మలం
వీణాభేరి మృదంగ కాహళకలా గీతం చ నృత్యం తథా

6:సాష్టాంగం ప్రణతిః స్తుతిర్బహువిధా హ్యేత త్సమస్తం మయా
సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో

7:ఆత్మాత్వం గిరిజామతిః స్సహచరాః ప్రాణా శ్శరీరం గృహం
పూజాతే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితిః

8:సంచారః పదయోః ప్రదక్షిణవిధిః స్త్రోత్రాణి సర్వా గిరో
యద్యత్కర్మ కరోమి తత్త దఖిలం శంభో తవారాధనం.

9:కరచరణకృతం వా కర్మవాక్కాయజయం వా 
శ్రవణ నయనజం వా మానసం వాపరాధం

10:విహిత మవిహితం వా సర్వ మేతత్ క్షమస్వ
జయ జయ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో.
జయ జయ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో.
జయ జయ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో.

ఇతి శివమానస పూజా స్త్రోత్రం 





Siva maanasapoojaa stotram 


1:ratnai@h kalpita maasanaM himajalai@h snaanaM cha divyaaMbaraM
naanaaratna vibhooshitaM mRgamadaa mOdaaMkitaM chaMdanam^

2:jaatee chaMpaka bilvapatra rachitaM pushpaM cha dhoopaM tathaa
deepaM daeva dayaanidhae paSupatae hRtkalpitaM gRhyataam^

3:sauvarNae navaratnakhaMDarachitae paatrae ghRtaM paayasaM
bhakshyaM paMchavidhaM payO dadhiyutaM raMbhaaphalaM paanakam^

4:Saakaanaa mayutaM jalaM ruchikaraM karpoorakhaMDOjjvalaM
taaMboolaM manasaa mayaa virachitaM bhaktyaaprabhO sveekuru

5:ChatraM chaamarayOryugaM vyaMjanakaM chaadarSakaM nirmalaM
veeNaabhaeri mRdaMga kaahaLakalaa geetaM cha nRtyaM tathaa

6:saashTaaMgaM praNati@h stutirbahuvidhaa hyaeta tsamastaM mayaa
saMkalpaena samarpitaM tava vibhO poojaaM gRhaaNa prabhO

7:aatmaatvaM girijaamati@h ssahacharaa@h praaNaa SSareeraM gRhaM
poojaatae vishayOpabhOgarachanaa nidraa samaadhisthiti@h

8:saMchaara@h padayO@h pradakshiNavidhi@h strOtraaNi sarvaa girO
yadyatkarma karOmi tatta dakhilaM SaMbhO tavaaraadhanam^.

9:karacharaNakRtaM vaa karmavaakkaayajayaM vaa 
SravaNa nayanajaM vaa maanasaM vaaparaadhaM

10:vihita mavihitaM vaa sarva maetat^ kshamasva
jaya jaya karuNaabdae Sree mahaadaeva SaMbhO.
jaya jaya karuNaabdae Sree mahaadaeva SaMbhO.
jaya jaya karuNaabdae Sree mahaadaeva SaMbhO.

iti Sivamaanasa poojaa strOtraM 

మృతసంజీవన స్తోత్రం










మృతసంజీవన స్తోత్రం

1}ఏవమారాధ్య గౌరీశం దేవం మృత్యుంజయేశ్వరమ్ 
మృతసంజీవనం నామ్నా కవచం ప్రజపేత్సదా 

2}సారాత్సారతరం పుణ్యం గుహ్యాద్గుహ్యతరం శుభమ్ 
మహాదేవస్య కవచం మృతసంజీవనామకం 

3}సమాహితమనా భూత్వా శృణుష్వ కవచం శుభమ్ 
శృత్వైతద్దివ్య కవచం రహస్యం కురు సర్వదా 

4}వరాభయకరో యజ్వా సర్వదేవనిషేవితః 
మృత్యుంజయో మహాదేవః ప్రాచ్యాం మాం పాతు సర్వదా

5}దధానః శక్తిమభయాం త్రిముఖం షడ్భుజః ప్రభుః 
సదాశివోగ్నిరూపీమాం ఆగ్నేయ్యాం పాతు సర్వదా  

6}అష్టాదశభుజోపేతో దండాభయకరో విభుః 
యమరూపీ మహాదేవో దక్షిణస్యాం సదావతు  

7}ఖడ్గాభయకరో ధీరో రక్షోగణనిషేవితః 
రక్షోరూపీ మహేశో మాం నైరృత్యాం సర్వదావతు 

8}పాశాభయభుజః సర్వరత్నాకరనిషేవితః 
వరూణాత్మా మహాదేవః పశ్చిమే మాం సదావతు

9}గదాభయకరః ప్రాణ నాయకః సర్వదాగతిః 
వాయవ్యాం మారుతాత్మామాం శంకరః పాతు సర్వదా

10}శంఖాభయకరస్థో మాం నాయకః పరమేశ్వరః
సర్వాత్మాంతరదిగ్భాగే పాతు మాం శంకరః ప్రభుః 

11}శూలాభయకరః సర్వ విద్యానామధినాయకః 
ఈశానాత్మా తథైశాన్యాం పాతుమాం పరమేశ్వరః 

12}ఊర్ధ్వభాగే బ్రహ్మరూపీ విశ్వాత్మాధః సదావతు 
శిరో మే శంకరః పాతు లలాటం చంద్రశేఖరః 

13}భ్రూమధ్యం సర్వలోకేశస్త్రినేత్రో లోచనేవతు 
భ్రూయుగ్మం గిరిశః పాతు కర్ణౌ పాతు మహేశ్వరః 

14}నాసికాం మే మహాదేవ ఓష్ఠౌ పాతు వృషధ్వజః 
జిహ్వాం మే దక్షిణామూర్తిర్దంతాన్మే గిరిశోవతు 

15}మృత్యుంజయో ముఖం పాతు కంఠం మే నాగభూషణః 
పినాకీ మత్కరౌ పాతు త్రిశూలీ హృదయం మమ

16}పంచవక్త్రః స్తనౌ పాతు ఉదరం జగదీశ్వరః 
నాభిం పాతు విరూపాక్షః పార్శ్వౌ మే పార్వతీపతిః  

17}కటిద్వయం గిరీశో మే పృష్ఠం మే ప్రమథాధిపః 
గుహ్యం మహేశ్వరః పాతు మమోరూ పాతు భైరవః 

18}జానునీ మే జగద్ధర్తా జంఘే మే జగదంబికా 
పాదౌ మే సతతం పాతు లోకవంద్యః సదాశివః 

19}గిరిశః పాతు మే భార్యాం భవః పాతు సుతాన్మమ 
మృత్యుంజయో మమాయుష్యం చిత్తం మే గణనాయకః 

20}సర్వాంగం మే సదా పాతు కాలకాలః సదాశివః 
ఏతత్తే కవచం పుణ్యం దేవతానాం చ దుర్లభమ్  

21}మృతసంజీవనం నామ్నా మహాదేవేన కీర్తితమ్ 
సహస్రావర్తనం చాస్య పురశ్చరణమీరితమ్ 

22}యః పఠేచ్ఛృణుయాన్నిత్యం శ్రావయేత్సుసమాహితః 
స కాలమృత్యుం నిర్జిత్య సదాయుష్యం సమశ్నుతే 

23}హస్తేన వాయదా స్పృష్ట్వా మృతం సంజీవయత్యసౌ 
ఆధయో వ్యాధయస్తస్య న భవంతి కదాచన  

24}కాలమృత్యుమపి ప్రాప్తమసౌ జయతి సర్వదా 
అణిమాదిగుణైశ్వర్యం లభతే మానవోత్తమః 

25}యుద్ధారంభే పఠిత్వేదమష్టావింశతివారకమ్ 
యుద్ధమధ్యే స్థితః శత్రుః సద్యః సర్వైర్న దృశ్యతే 

26}న బ్రహ్మాదీని చాస్త్రాణి క్షయం కుర్వంతి తస్య వై 
విజయం లభతే దేవయుద్ధమధ్యేపి సర్వదా 

27}ప్రాతరుత్థాయ సతతం యః పఠేత్కవచం శుభమ్ 
అక్షయ్యం లభతే సౌఖ్యమిహలోకే పరత్ర చ  

28}సర్వవ్యాధివినిర్మృక్తః సర్వరోగవివర్జితః 
అజరామరణోభూత్వా సదా షోడశవార్షికః  

29}విచరత్యఖిలాన్లోకాన్ప్రాప్య భోగాంశ్చ దుర్లభాన్ 
తస్మాదిదం మహాగోప్యం కవచం సముదాహృతమ్  

30}మృతసంజీవనం నామ్నా దేవతైరపి దుర్లభమ్ 
మృతసంజీవనం నామ్నా దేవతైరపి దుర్లభమ్  




mRtasaMjeevana stOtraM

1}aevamaaraadhya gaureeSaM daevaM mRtyuMjayaeSvaram^ 
mRtasaMjeevanaM naamnaa kavachaM prajapaetsadaa 

2}saaraatsaarataraM puNyaM guhyaadguhyataraM Subham^ 
mahaadaevasya kavachaM mRtasaMjeevanaamakaM 

3}samaahitamanaa bhootvaa SRNushva kavachaM Subham^ 
SRtvaitaddivya kavachaM rahasyaM kuru sarvadaa 

4}varaabhayakarO yajvaa sarvadaevanishaevita@h 
mRtyuMjayO mahaadaeva@h praachyaaM maaM paatu sarvadaa

5}dadhaana@h SaktimabhayaaM trimukhaM shaDbhuja@h prabhu@h 
sadaaSivOgniroopeemaaM aagnaeyyaaM paatu sarvadaa  

6}ashTaadaSabhujOpaetO daMDaabhayakarO vibhu@h 
yamaroopee mahaadaevO dakshiNasyaaM sadaavatu  

7}khaDgaabhayakarO dheerO rakshOgaNanishaevita@h 
rakshOroopee mahaeSO maaM nairRtyaaM sarvadaavatu 

8}paaSaabhayabhuja@h sarvaratnaakaranishaevita@h 
varooNaatmaa mahaadaeva@h paSchimae maaM sadaavatu

9}gadaabhayakara@h praaNa naayaka@h sarvadaagati@h 
vaayavyaaM maarutaatmaamaaM SaMkara@h paatu sarvadaa

10}SaMkhaabhayakarasthO maaM naayaka@h paramaeSvara@h
sarvaatmaaMtaradigbhaagae paatu maaM SaMkara@h prabhu@h 

11}Soolaabhayakara@h sarva vidyaanaamadhinaayaka@h 
eeSaanaatmaa tathaiSaanyaaM paatumaaM paramaeSvara@h 

12}oordhvabhaagae brahmaroopee viSvaatmaadha@h sadaavatu 
SirO mae SaMkara@h paatu lalaaTaM chaMdraSaekhara@h 

13}bhroomadhyaM sarvalOkaeSastrinaetrO lOchanaevatu 
bhrooyugmaM giriSa@h paatu karNau paatu mahaeSvara@h 

14}naasikaaM mae mahaadaeva OshThau paatu vRshadhvaja@h 
jihvaaM mae dakshiNaamoortirdaMtaanmae giriSOvatu 

15}mRtyuMjayO mukhaM paatu kaMThaM mae naagabhooshaNa@h 
pinaakee matkarau paatu triSoolee hRdayaM mama

16}paMchavaktra@h stanau paatu udaraM jagadeeSvara@h 
naabhiM paatu viroopaaksha@h paarSvau mae paarvateepati@h  

17}kaTidvayaM gireeSO mae pRshThaM mae pramathaadhipa@h 
guhyaM mahaeSvara@h paatu mamOroo paatu bhairava@h 

18}jaanunee mae jagaddhartaa jaMghae mae jagadaMbikaa 
paadau mae satataM paatu lOkavaMdya@h sadaaSiva@h 

19}giriSa@h paatu mae bhaaryaaM bhava@h paatu sutaanmama 
mRtyuMjayO mamaayushyaM chittaM mae gaNanaayaka@h 

20}sarvaaMgaM mae sadaa paatu kaalakaala@h sadaaSiva@h 
aetattae kavachaM puNyaM daevataanaaM cha durlabham^  

21}mRtasaMjeevanaM naamnaa mahaadaevaena keertitam^ 
sahasraavartanaM chaasya puraScharaNameeritam^ 

22}ya@h paThaechChRNuyaannityaM Sraavayaetsusamaahita@h 
sa kaalamRtyuM nirjitya sadaayushyaM samaSnutae 

23}hastaena vaayadaa spRshTvaa mRtaM saMjeevayatyasau 
aadhayO vyaadhayastasya na bhavaMti kadaachana  

24}kaalamRtyumapi praaptamasau jayati sarvadaa 
aNimaadiguNaiSvaryaM labhatae maanavOttama@h 

25}yuddhaaraMbhae paThitvaedamashTaaviMSativaarakam^ 
yuddhamadhyae sthita@h Satru@h sadya@h sarvairna dRSyatae 

26}na brahmaadeeni chaastraaNi kshayaM kurvaMti tasya vai 
vijayaM labhatae daevayuddhamadhyaepi sarvadaa 

27}praatarutthaaya satataM ya@h paThaetkavachaM Subham^ 
akshayyaM labhatae saukhyamihalOkae paratra cha  

28}sarvavyaadhivinirmRkta@h sarvarOgavivarjita@h 
ajaraamaraNObhootvaa sadaa shODaSavaarshika@h  

29}vicharatyakhilaanlOkaanpraapya bhOgaaMScha durlabhaan
tasmaadidaM mahaagOpyaM kavachaM samudaahRtam

30}mRtasaMjeevanaM naamnaa daevatairapi durlabham
mRtasaMjeevanaM naamnaa daevatairapi durlabham  

శ్రీమహా మృత్యుంజయస్తోత్రం











శ్రీమహా మృత్యుంజయస్తోత్రం

1)ఓం రుద్రం పశుపతిం స్థాణుం నీలకంఠ ముమాపతిమ్
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి 

2)కాలకంఠం కాలమూర్తిం కాలాగ్నిం కాలనాశనం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి 

3)నీలకంఠం విరూపాక్షం నిర్మలం నిలయప్రభుం 
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి 

4)వామదేవం మహాదేవం లోకనాథం జగద్గురుం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి 

5)దేవదేవం జగన్నాథం దేవేశం వృషభధ్వజం 
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి 

6)గంగాధరం మహాదేవం సర్పాభరణ భూషితం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి 

7)అనాధ పరమానందం కైవల్యపద గామినం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి 

8)స్వర్గాపవర్గ దాతారం సృష్టి స్థితి వినాశనం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి 

9)ఉత్పత్తి స్థితి సంహార కర్తారం గురుమీశ్వరం 
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి 

10)మార్కండేయకృతం స్తోత్రం యః పఠేచ్ఛివ సన్నిధౌ
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి 

11)తస్య మృత్యు భయం నాస్తి- నాగ్నిచోరభయం క్వచిత్
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి 

12)శతావర్తం ప్రవర్తవ్యం సంకటే కష్ట నాశనం 
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి 

13)శుచిర్భూత్వా పఠేత్ స్తోత్రం సర్వసిద్ధి ప్రదాయకం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి 

14)మృత్యుంజయ మహాదేవ త్రాహి మాం శరణాగతం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి 

15)జన్మ మృత్యు జరారోగైః పీడితం కర్మ బంధనైః
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి 

16)తావతస్త్వద్గత ప్రాణః త్వచ్చిత్తోహం సదామృడ 
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి 

17)ఇతి విజ్ఞాప్య దేవేశం త్ర్యంబకాఖ్యం మనుం జపేత్
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి 

18)నమశ్శివాయ సాంబాయ  హరయే పరమాత్మనే
ప్రణత క్లేశనాశాయ  యోగినాం పతయే నమః 

మృకండు సూను మార్కండేయ కృత
మృత్యుంజయ స్తోత్రం సంపూర్ణమ్.






Sreemahaa mrtyunjaya stotram

1)OM rudraM paSupatiM sthaaNuM neelakaMTha mumaapatim^
namaami Sirasaa dEvam kim no mrtyuh: karishyati 

2)kaalakaMThaM kaalamoortiM kaalaagniM kaalanaaSanaM
namaami Sirasaa dEvam kim no mrtyuh: karishyati 

3)neelakaMThaM viroopaakshaM nirmalaM nilayaprabhuM 
namaami Sirasaa dEvam kim no mrtyuh: karishyati 

4)vaamadaevaM mahaadaevaM lOkanaathaM jagadguruM
namaami Sirasaa dEvam kim no mrtyuh: karishyati 

5)daevadaevaM jagannaathaM daevaeSaM vRshabhadhvajaM 
namaami Sirasaa dEvam kim no mrtyuh: karishyati 

6)gaMgaadharaM mahaadaevaM sarpaabharaNa bhooshitaM
namaami Sirasaa dEvam kim no mrtyuh: karishyati 

7)anaadha paramaanaMdaM kaivalyapada gaaminaM
namaami Sirasaa dEvam kim no mrtyuh: karishyati 

8)svargaapavarga daataaraM sRshTi sthiti vinaaSanaM
namaami Sirasaa dEvam kim no mrtyuh: karishyati 

9)utpatti sthiti saMhaara kartaaraM gurumeeSvaraM 
namaami Sirasaa dEvam kim no mrtyuh: karishyati 

10)maarkaMDaeyakRtaM stOtraM ya@h paThaechChiva sannidhau
namaami Sirasaa dEvam kim no mrtyuh: karishyati 

11)tasya mRtyu bhayaM naasti- naagnichOrabhayaM kvachit^
namaami Sirasaa dEvam kim no mrtyuh: karishyati 

12)SataavartaM pravartavyaM saMkaTae kashTa naaSanaM 
namaami Sirasaa dEvam kim no mrtyuh: karishyati 

13)Suchirbhootvaa paThaet^ stOtraM sarvasiddhi pradaayakaM
namaami Sirasaa dEvam kim no mrtyuh: karishyati 

14)mRtyuMjaya mahaadaeva traahi maaM SaraNaagataM
namaami Sirasaa dEvam kim no mrtyuh: karishyati 

15)janma mRtyu jaraarOgai@h peeDitaM karma baMdhanai@h
namaami Sirasaa dEvam kim no mrtyuh: karishyati 

16)taavatastvadgata praaNa@h tvachchittOhaM sadaamRDa 
namaami Sirasaa dEvam kim no mrtyuh: karishyati 

17)iti vij~naapya daevaeSaM tryaMbakaakhyaM manuM japaet^
namaami Sirasaa dEvam kim no mrtyuh: karishyati 

18)namaSSivaaya saaMbaaya  harayae paramaatmanae
namaami Sirasaa dEvam kim no mrtyuh: karishyati 


mRkaMDu soonu maarkaMDaeya kRta
mRtyuMjaya stOtraM saMpoorNam










అర్ధ నారీశ్వర స్తోత్రం






అర్ధ నారీశ్వర స్తోత్రం

1::చాంపేయగౌరార్ధశరీరకాయై
కర్పూరగౌరార్ధశరీరకాయ
ధమ్మిల్లకాయై చ జటాధరాయ
నమః శివాయై చ నమః శివాయ

2::కస్తూరికాకుంకుమచర్చితాయై
చితారజఃపుంజ విచర్చితాయ
కృతస్మరాయై వికృతస్మరాయ
నమః శివాయై చ నమః శివాయ

3::ఝణత్క్వణత్కంకణనూపురాయై
పాదాబ్జరాజత్ఫణినూపురాయ
హేమాంగదాయై భుజగాంగదాయ
నమః శివాయై చ నమః శివాయ

4::విశాలనీలోత్పలలోచనాయై
వికాసిపంకేరుహలోచనాయ
సమేక్షణాయై విషమేక్షణాయ
నమః శివాయై చ నమః శివాయ

5::మందారమాలాకలితాలకాయై
కపాలమాలాంకితకంధరాయ
దివ్యాంబరాయై చ దిగంబరాయ
నమః శివాయై చ నమః శివాయ

6::అంభోధరశ్యామలకుంతలాయై
తటిత్ప్రభాతామ్రజటాధరాయ
నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ
నమః శివాయై చ నమః శివాయ

7::ప్రపంచసృష్ట్యున్ముఖలాస్యకాయై
సమస్తసంహారకతాండవాయ
జగజ్జనన్యై జగదేకపిత్రే
నమః శివాయై చ నమః శివాయ

8::ప్రదీప్తరత్నోజ్జ్వలకుండలాయై
స్ఫురన్మహాపన్నగభూషణాయ
శివాన్వితాయై చ శివాన్వితాయ
నమః శివాయై చ నమః శివాయ

9::ఏతత్పఠేదష్టకమిష్టదం యో
భక్త్యా స మాన్యో భువి దీర్ఘజీవీ
ప్రాప్నోతి సౌభాగ్యమనంతకాలం
భూయాత్సదా తస్య సమస్తసిద్ధిః


ardha naareeSwara stOtraM

1::chaaMpaeyagauraardhaSareerakaayai
karpooragauraardhaSareerakaaya
dhammillakaayai cha jaTaadharaaya
namah: Sivaayai cha namah: Sivaaya

2::kastoorikaakuMkumacharchitaayai
chitaarajah:puMja vicharchitaaya
kRtasmaraayai vikRtasmaraaya
namah: Sivaayai cha namah: Sivaaya

3::jhaNatkvaNatkaMkaNanoopuraayai
paadaabjaraajatphaNinoopuraaya
haemaaMgadaayai bhujagaaMgadaaya
namah: Sivaayai cha namah: Sivaaya

4::viSaalaneelOtpalalOchanaayai
vikaasipaMkaeruhalOchanaaya
samaekshaNaayai vishamaekshaNaaya
namah: Sivaayai cha namah: Sivaaya

5::maMdaaramaalaakalitaalakaayai
kapaalamaalaaMkitakaMdharaaya
divyaaMbaraayai cha digaMbaraaya
namah: Sivaayai cha namah: Sivaaya

6::ambhOdharaSyaamalakuMtalaayai
taTitprabhaataamrajaTaadharaaya
nireeSvaraayai nikhilaeSvaraaya
namah: Sivaayai cha namah: Sivaaya

7::prapaMchasRshTyunmukhalaasyakaayai
samastasaMhaarakataaMDavaaya
jagajjananyai jagadaekapitrae
namah: Sivaayai cha namah: Sivaaya

8::pradeeptaratnOjjvalakuMDalaayai
sphuranmahaapannagabhooshaNaaya
Sivaanvitaayai cha Sivaanvitaaya
namah: Sivaayai cha namah: Sivaaya

9::aetatpaThaedashTakamishTadaM yO
bhaktyaa sa maanyO bhuvi deerghajeevee
praapnOti saubhaagyamanaMtakaalaM
namah: Sivaayai cha namah: Sivaaya



Sunday, November 28, 2010

మల్లికార్జునుడనే పేరు ఎలా వచ్చింది?





















శ్రీశైలక్షేత్రంలో స్వామి వారిని 'మల్లికార్జున భ్రమరాంబగా' ఎందుకు పిలుస్తారు?
క్షేత్రస్వామి మల్లికార్జునుడనే పేరు రావడానికి గల కారణాలు గూర్చి చెప్పే కథ-
.............................
యుగాల పూర్వము చంద్రవంశపురాజు చంద్రగుప్తుడనే వాని కుమార్తె చంద్రవతి ఈ స్వామిని సేవిస్తున్న తరుణంలో పార్వతీపరమేశ్వరులు ఆనంద సముద్రంలో తేలియాడుచూ చంద్రవతి భక్తికి మెచ్చి వరమడుగగా ఆమె స్వామి వారి శిరస్సుపై నుంచిన మల్లెపూల దండ ఎన్నడూ వాడకూడదని కోరగా, స్వామివారు తధాస్తు అని అనెను. నాటి నుండి మల్లె పూలతో పూజించబడిన స్వామి గనుక మల్లికార్జునుడైనాడు. పార్వతి అమ్మ వారిని ఈ ప్రాంతంలో భ్రమరరూపాన్ని ధరించి 'అరుణ' డనే రాక్షసుని సంహరించినందున భ్రమరాంబగా పిలుస్తారు

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చరిత్ర






శ్రీవల్లీ, దేవశేన, సహిత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చరిత్ర

మోపిదేవి

'వ్యాఘ్రస్య పూర్వ దిగ్భాగే కుమార క్షేత్ర ముత్తమం '

'సుబ్రహ్మన్యోవ సత్యత్ర భుక్తి ముక్తి ఫలప్రదః '

అని స్కాంద పురాణములోని సహ్యాద్రి ఖండమున కృష్ణానదీ మహాత్మ్యము తత్తీరస్థ క్షేత్రములు నిరూపించు వరుసలో పేర్కొనబడినది. ఈ విషయము సూచించిన వారు అగస్థ్య మహర్షి. ఆ మహర్షి అవిముక్త క్షేత్రమగు ఉత్తరకాశి యందు గాడ తపోనిష్టాగరిష్ఠుడై యున్నారు. ఆ ప్రదేశము నేటికిని 'అగస్థ్యకాశి' అనియే వ్యవహరింపబడుచున్నది. ఆ తపోధనుడు లోక క్షేమమున కైయీవలకు రావలసి వచ్చినది. ఆ హేతువు ముందొకించుక వచించుట ధర్మమగును. మున్నొకప్పుడు వింధ్యగిరి పర్వతము తామసంతో విజ్రుంభించి సూర్య మండలమును దాటి నిలచినది. అందుచే సూర్యగతి ఆగిపోయి ప్రకృతి స్తంభించినది. గ్రహ సంచారము నిల్చిపోయినది. ప్రజలు పీడితులైనారు. భూమి చలించినది. ఈ విప్లవము చూచి వేల్పులును గడగడలారిరి. ఈ ప్రమాదమును బాపుటకై బ్రహ్మాదులు తరలివచ్చి కాశికానగరు చేరి అగస్త్యుని మ్రోల నిలిచి ప్రార్ధించి విషయములు తెలుపుతారు. దైన్యం ప్రకటించారు. బ్రతిమాలు కొనినారు. అమరుల అభ్యర్ధనలను ఆలకించిన మహర్షి వారణాశిని విడుచుటకు సంధిగ్దులైనారు. యోగ దృష్టితో సర్వము తికకించితుదకు తోక శ్రేయస్సు ముఖ్యమని తలంచి నిర్ణయము తీసుకొనినారు. ఆ పవిత్ర స్థలము వీడితే కల్పాంతమైనను తిరిగి కాశీపురం చేరుట పడదని తెలుసు. అయినను అమర కార్యము తప్పదు. తన మనో దర్పణంలో విశాలాక్షి, విశ్వేశ్వరుల మూర్తులు నిల్పుకొని లోపాముద్రా ద్వితీయుడై అచట నుండి ప్రయాణము సాగించినారు. త్రోవలో నుండి వింధ్య పర్వతం ద్రోణజుని రాక నెరింగి సాష్టాంగ పడినట్లు పరుండి త్రోవనిచ్చాడు వింధ్యుడు. అది ఎరింగి నేను తిరిగి వచ్చువరకు ఇట్లే వుండమని శాసించాడు తపస్వి తానీ కల్పంలో వచ్చేది లేదు. వింధ్యుడు పైకి లేచేది లేదు. 

తదుపరి లోపాముద్రయు తానును పయనమై దక్షిణ దిశగా ప్రయానించుచూ కనుపించిన నదీజలములలో స్నానమాచరించుచు కొన్ని నాళ్ళు అందు తపించు హృదయ బింబితులైన విశ్వేశ్వరుల నందందు నిల్పి ఆరాధింపుచూ పయనించిరి నారా తాపస దంపతులు. ఎప్పుడు ఎక్కడ ఏరీతిగా తన్నాముని స్మరించినాడో తానా తావుల లింగ రూపుడై నిలిచినాడు. ఈ పుడిది నేటికి నేనాటికి చెరగని ప్రఖ్యాతితో జగరారాధ్యులైనారు. పార్వతీ పరమేశ్వరులు అవియే దివ్య క్షేత్రములు, పుణ్య తీర్ధములు. విన్నను,  కన్నను, పున్నెంబనెడి నెన్నిక వాసి నున్నవి.

సుబ్రహ్మణ్య శబ్ద నిరుక్తి : 


సుబ్రహ్మణ్యుడిందు నివసింపుచుండుననిన మాటకు కుమార క్షేత్రమునకు పొంతన విషయం మాండవ్యునకు సందేహం కలిగి గురువుతో అది వ్యక్త మొనర్చినాడు. అపుడు లోపాముద్రాధిపతి శిష్యులతో విశదీకరించినాడు. మాండవ్యా! నీ సందేహము సరియైనదే సుమా! ఈ ప్రదేశము సుబ్రహ్మణ్యక్షేత్రమనిపించు కొనవలె. కాని యట్లు ప్రతీతి కొనలేదు కారణం సాక్షాత్తు పరమేశ్వర నిర్దేశిత మనుకొనుడు. కుమారమూర్తి కే సుబ్రహ్మణ్యమనెడి పేరు. ఇర్వురు వేరు కాదు.   

శృతి ' నమో జ్యేష్టాయ చ కనిష్టాయ చ ' అనుచు ఏ వస్తువును బేర్కొన్నదో  యది బ్రహ్మము. నిర్గుణము, నిర్వికారము, నిరామయము, అపర బ్రహ్మము. కారణాంతరమున లోకోపరార్ధం గిరిజాగిరీశులకు నౌరసత్వం జెంది కుమార మూర్తిగ విరాజిల్లినది. పురాణ దంపతులను శివులామూర్తి ని విడలేని అనుబందముతో వామాంకమున నిల్పుకొనినారు. ఒకపరి చతుర్ముఖుడు వెలికొండగు చేరినాడు. ఆ సమయములో భవుడు కనులు మూసి ధ్యానస్థితిలో నున్నాడు. నాలుగు ముఖములు గల యా విధాతనుగని ముక్కంటి పట్టి బాలకన్యాయంగా 'కస్త్వం! " నీ వెవరివి అనినాడు నలువ ' అహం బ్రహ్మ' అని సమాధానము ఇచ్చినాడు. వెంటనే యా కొమరుసామి నవ్వుచు ఏమి? బ్రహ్మ నిర్గుణము. రూపులేదు నీవు రూపముతో తిలకింపబడుచుంటివి. బ్రహ్మ అక్షరుడు. నీ రూపము నశించును బ్రహ్మము నిశ్చలము. నీవు చలించుచుంటివి నీవా శబ్దమునకు తగినవని వాదించినాడు. వాణీపతియే మనుటకు శక్తి చాలమితూష్ణీంభూతుడైనాడు. ఆ స్థితిలో శంకరుడు బాహ్యద్రుష్ణుడై 'సుష్టు బ్రహ్మణ్య ' యనుట జర్గింది. నలువ తలు వాల్చినాడు. కుమారుడు తండ్రికి సాగిలినాడు. శూలి సుబ్రహ్మణ్య పదము నీకు జగాద్విశదమౌ గాత' అని దీవించినాడు. ఆభావుని నుడి యౌట సుబ్రహ్మణ్య శబ్దము సుస్థిరమై కుమార పదము నామాంతరమైనది.

సుబ్రహ్మణ్య మహిమ:

మాండ్యవుడు ఈ స్థలమున చూపబడిన ప్రకృతి వైరుధ్యములను మరి యంతటి శ్రీస్వామినాథునకు ఫణి రూపముతో నుండు కారణము కలశభవుని ప్రశ్నించినాడు. అపుడా మహామహుడు దివ్యదృష్టితో అంతయు తిలకించి యంతే వాసులతో పలికినాడు. నాయనలారా! కారణము లేకుండా కార్య మెప్పుడు ఉండదు. అది భగవంతుని పరమైనచో లోక క్షేమమున కేర్పడును, అది వినుడు. సనక సనందన, సనత్కుమార, సనత్సుజాతులనెడి దేవర్షులు సర్వదా అయిదేండ్ల ప్రాయులవలె నుంటారు. పైగా దిగంబరులు నిరంతరము వారి మనస్సులు హర్నిశము. భగవదవలోకనానంద నిమగ్నమై యుంటాయి. అట్టిడు లొక్కమారు కైలాసానికి వచ్చినారు. చతుర్ముఖుని తొలుతటి సృష్టియానల్వురే. సరియే అది యప్రస్తుతము. ప్రస్తుతమాలకింపుడు. వారు వెలి కొండకువచ్చు వేళ ముక్కంటి లేడు. లోకమాత యగు పార్వతియు, కుమార స్వామి యున్నారు. ప్రశాంత స్వభావులైన జడదారులను వారి యాకారాలు కుమారునకు వింత గొల్పుటచే తదేక దృష్టితో వారి వంక చూస్తుండినాడు. అదే నేడు శచి, స్వాహా మొదలగు వేల్పు పడుచులు. లక్ష్మీ, సరస్వతులు, గిరిజా దర్శనానికి వచ్చుట తటస్థ పడినది.  


ఆ స్త్రీలు వింత వింతల ఆభరణములు రంగు రంగుల చీరలు ధరించినారు. ఒకొక్కని రూపు ఒకొక్క టీరుగా కన్పించినది. గౌరి బిడ్డకు అటు జడదారులు, ఇటు సుందరీమణులు, ఈ ప్రకృతిని చూచి ఫక్కున నవ్వినాడు?. 'శివకుమారుడు' ఆ నగవు విని భావాన్ని కుమారా ఏల నవ్వుదువు? వారు నేనుగా కనుపింప కున్నారో : ఆ తాపసులు మీ తండ్రి వలె లేరా: భేదమేమైనా కనపడద్దా అన్నది. ఆ మాత్రు వాక్కు విని లోలోన కించ నొందినాడు. జగన్మాతకు నమస్కరించి ఎవరి త్రోవన వారు వెళ్ళినారు. ఈ నవ్వినా వైనం పార్వతి మాటలు వారికి తెలియవు కాని మాత్రుపాదాలు బట్టి స్కందుడు తెలియక చేసిన పాపము పామమే గదా! తత్పరిహారార్ధమై తపస్సు సల్పుడు అనుమతి ప్రసాదించమని వేడుకొన్నాడు. ఆపై కాదన్నను పట్టు విడవక తపస్సుకు తరలినాడు తన రూపము పరులు కానుకుండా నుండుటకై యురగ రూపముతో నిందనాకువు నేర్పరుచుకొని తపిస్తున్నాడు. ఒకే పుట్ట యున్నచో నెవరికైనా సందేహం వచ్చునని ఈ తావంతయు కోవలతో నింపినాడు. ఆ మహామహుని ప్రభావ గరిమచే సహజవైరములు గల జంతువులు సహితము చెలిమితో సమాన భావముతో ఉన్నాయి. కుమారుని రక్షణము ప్రేమాబంధము వీడలేక అవతరించినాడా? మహేశుడనునట్లు ఈశ్వరుడు సకలేశ్వరాభిదముతో ఇందు ఉద్భవించినాడు. అందుకే అది స్వాయంభువలింగ మగునను కొన్న తప్పుకాదు: ' భవనత్ప్రతిపత్తి 'ఏక క్రియాద్రుర్ద కరీ భవేత్ అన్నట్లుంటుంది. ఇక్కడ బాహులేయునకు శాప విమోచనము నింబత్తి మాత్రము భక్త రక్షణము ముఖ్యమైనది. ఇది పార్వతిపాప పాపయగు తేరగు. ఇక దృశ్య సాదృశ్యం వినుడు. భగవంతుడు తన వైనం పరోక్షంగా ప్రజలకు తెలుపుచు నుంటాడు. నెమలి ఈక ఎట్లుండును? రంగు రంగులుగా చూడముచ్చటగా నుండును గదా ఎగయు స్వభావము కూడా నున్నది. ప్రకృతి రూపు చిత్ర విచిత్రమై యుండును. గంతులు వేయుట కూడా సహజము. స్వేచ్చా మనము ప్రకృతికి సాగనిచ్చినచో ప్రజలు ప్రళయములే చూతురు. దానిని బంధించినచో కట్టుబాటులో నుంటుంది. కాబట్టి తానూ బ్రహ్మవస్తువు కాన ప్రకృతి తన కైవసమై యుండును. అనెడి భావం మనకు వ్యక్త మొనర్చుట యాద్రుశ్య సాదృశ్యం. ఫణి కుండలముపై నిలబడుతున్నదే యది ప్రకృతికి తానాయె ఆధారమని తెలుపుటయే--- సకల జీవరాసులలో కుండలినీ శక్తి యొకటుంటుంది. అది పాముచుట్ట నొప్పియపాన స్థానము నుండి షట్చక్రముల కాధారముగా నుండును. ఆ కుండిలినియే బ్రహ్మమనుట తధారము మీద చక్ర స్వరూపిణి యైన శక్తి ప్రకృతి యున్నదనుట లోకమున కెరుక పరుచుటయే మయూరి పాముచుట్ట పై యున్న విధము. ఇంకొక్క తావున నేమలిమీద నున్న పామును జూచితియే ! యది ప్రకృతి పురుష సంయోగానుబంధ జన్యమీజగత్తు -- శక్తి పురుషులలోని యవినాభావమును నిరూపించుటయే  యందలి పరమార్ధం. ముంగులు, పాములు మూచూచుట యున్నదే అది విముక్తి నందించు ముఖ్య సోపానమైన సమానతా సౌజన్యమునకు ప్రతీక అంతటి శక్తిమంతులకు కలుగవచ్చును. కాని భగవానుని ప్రవర్తన ఎప్పుడు ధర్మా ధర్మంగా నుంటుంది. అందుకే 'యద్యదాచ రీతి శ్రేష్ఠః తత్త దేవే తరోజనః 'అనుట కలదు. తానొనర్చిన పనులు ప్రపంచమునకు సమాచారణీయములు కాగలవు -- కాన తానూ తపించుట యాచరించి మనకు చూపించి యాధర్ముడు భావ్యారాధ్యుడైనాడు. 


సుబ్రహ్మణ్యుడు సర్పమైయున్న తెరుగు తెల్పితివి. కుమార క్షేత్రమనుట వినిచితి. ఈ క్షేత్రమునంటి కృష్ణానది ప్రవహించు చున్నది కాబట్టి అత్రస్నానంతు కుర్యాచ్చేత్కోటి జన్మాఖ నాశనమ్ : అనెడి నానుడి వచ్చింది. ఆ మహాతేజస్సు వచ్చెడి కొనయే యాస్వామినాధుడు వసించుతావు. మన పూర్వజన్మ సుకృతమున నీ తలమునకు వచ్చితిమి. ఈ విషయమెరిగెడి భాగ్యం లభించింది. అనుచు సతీయుతుడై అగస్త్యముని సాష్టాంగ పడినాడు. శిష్యులు సైతం ప్రణామములిచ్చినారు. తదుపరి ప్రజాపాళిని తరింపచేయ తలచి సామాన్యులను గూడ అర్చించు భాగ్యం కల్పింపనెంచి పడగవలె నున్న లింగమెందు ప్రతిష్టించి యావల్మీక మాకల్పమొనర్చి వందితుడైనాడు. అందుకే 'మార్గదర్శి మహర్షి' అన్నారు పెద్దలు. 

అగస్త్యుడంతటి తపస్విచే నిరూపింపబడినది. కావుననే ఈ ప్రదేశము కుమార క్షేత్రముగా ప్రతీతి చెందినది. ఆ కాలంలో మహర్షులెందరో ఈ మూర్తి నారాదించి యుందురనుట నిర్వివాదము. ఈ విషయమేనాటిదో యేయుగమో అప్పటి ఈ ప్రదేశ మేరూపు నున్నదో యవర్ణ్యము. కృష్ణాది మాత్రమిందు కలదనుట: పూర్వికులెరింగినది వినిచినది కూడనగును. కుమారుడనగా చిన్నవాడు ఆయన రూపమెప్పుడు పంచవర్ష ప్రాయము. అట్టి సుబ్రహ్మణ్యమూర్తి వసించుటచే కుమార క్షేత్ర మైనది.

గ్రామ నిరూపణ:

కాలచక్ర భ్రమణములో వల్మీకములన్నియు నమ్తరించి గ్రామము ఏర్పడినవి. ఈ గ్రామమునకు మున్ను 'మోహినీ పుర' మానబడేడి దను పెద్దలందురు. అదియు నిజమై ఉండవచ్చు. 'మహాయతీతి మోహినీ, మోహింపచేయునది మోహిని ' యనబడు గదా! భక్తి భావమును కలిగించి దూరపువారిని కూడా నాకర్షించి దరికి రప్పించుకొనునది. రప్పించు కొనుచున్నది.  అందువల్ల మోహినీ పురమనెడి నుడి సత్యమే యగును. ఎన్ని తావుల నెన్నూళ్ళకు పేర్లు మారలేదు ---- అట్లే నేటికి 'మోపిదేవి' గా ఖ్యాతిల్లినది.

సుబ్రహ్మణ్య సేవా ఫలములు----

1 . సంతతి లేనివారికి సంతతి నొసంగుట
2 . నేత్ర దృష్టి లోపించిన చూపు నొసంగుట
3 . చెవులలో పోటు కలిగి చీము కారినచో తద్భాద నివారించుట
4 . స్త్రీలకు దుర్భలత్వమున వచ్చు కుసుమ వ్యాధులునాపుట
5 . శరీరమున  చర్మము పైపోడలు, పుట్టి యరోచకమైనచో బాగొనర్చుట

ఈ మధ్య గుడి ముఖమంటపం పడగొట్టి బాగుచేసినప్పుడు మహర్షులు బొమ్మలు పగిలిపోయినవి. (కోడి) కుక్కుటము, నెమలియు తలలు పోవుటచే ప్రక్కకు తొలగించిరి. ఆలయం బాగుచేత సుమారు ముప్పైఅయిదేండ్ల క్రిందట జరిగింది.ఆ పర్వతాలు నేర్పుకు భక్తికి ప్రతీకగా ఇపుడు గుఱ్ఱము, నందియు, గణపతి, గరుత్మంతుడు నేటికిని నిల్చినవి వాటి యెడలందు సర్వప్రకృతి చిత్రణము నగుపించు కాల్పులో కూడా చిత్రణ మార్పురాలేదు. అది దైవానుగ్రహము గాక మరేమగును. ఏ విధముగా సుబ్రహ్మణ్యుడు తన కృపను ఫణమొనర్చి యాలయ మేర్పరచుకొన్నాడు. సుబ్రహ్మణ్యార్పణకు సంకల్పించి తయారొనర్చిన యా బొమ్మలు కుమ్మరి కాల్చినాడు గాన వంకర తిమకరులు రాలేదనిన తప్పుకాదు. దానకారణం 'అగ్నిభూ:' అని యామూర్తికి పేరున్నది. కుమారుని కైవసంబగు వానిని తండ్రి తప్పొనర్చడు గదా! 

సుబ్రహ్మణ్యుని మహిమలన్నియు వర్ణనాతీతము సుబ్రహ్మణ్యుని గరిమ చే మోపిదేవి పురోగమిస్తోంది. ఈ క్షేత్రములో ఆలయమును సందర్శించి శ్రీస్వామివారికి మ్రొక్కుబడులు అర్పించి కోర్కెలు సడసి యానందించు వారెందరో కలరు. నమ్మికతో తన దరికి వచ్చిన వారిని కరుణించి కాపాడి చల్లని కరుణామృతము వర్షించి ఈ హరసుతుడు పరిజనులకు పొరుగువారిపై సైతము పెరటిలో నున్న హరిచందనమై కీర్తిల్లినాడు. మోపిదేవి చిన్నపల్లెటూరు మాత్రము అయినను శ్రీశరజన్మునిదయ చేత వాడవాడలా పదిగురినోట విస్తరించింది. ఎక్కడెక్కడి వారలో వచ్చి మ్రొక్కులు తీర్చుకొనుట పరిపాటి అయినది. శ్రీ స్వామివారి మహిమలు వినుటయేగాక స్వానుభవమును కూడా తోడై దేవరకోట ఎస్టేట్ చల్లపల్లి నుండి శ్రీమత్ రాజావారి వంశీయులు వచ్చి పౌరుల సంప్రదింపులతో నీ ఆలయమును తమ యాజమాన్యమునకు తీసుకొనినారు. వారికి ఈ మూర్తి యిలవేల్పయి బ్రహ్మొత్సవములు సైతము మహావైభవో పేతముగా రాజలాంచనములతో షుమారు రెండువందలయేండ్ల నుండి జరిపించుకొనుట సర్వజన విదితము.


శ్రీ సుబ్రహ్మణ్య పూజ 


ఓం ఆచమ్య,  "ఓం కేశవాయ స్వాహా" "ఓం నారాయణాయ స్వాహా"  "ఓం మాధవాయ స్వాహా"  "ఓం గోవిందాయ నమః" "విష్ణవే నమః" " ఓం మధుసూదనాయ నమః "  "ఓం త్రివిక్రమాయ నమః " " ఓం వామనాయ నమః " " ఓం శ్రీధరాయ నమః "  ఓం హృషీ కేశాయ నమః  ఓం పద్మనాభాయ నమః  ఓం దామోదరాయ నమః ఓం సంకర్షణాయ నమః  ఓం వాసుదేవాయ నమః  ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్దాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమః  ఓం నార సింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్ధనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే నమః ఓం శ్రీ కృష్ణాయ నమః

మమోపాత్త ...... శుభే ....... శుభతిథౌ, శ్రీమాన్ ..... గోత్ర : నామదేయః శ్రీమతః ............ గోత్రస్య నామధేయస్య మమ సర్వాపమృత్యు పరిహారార్ధం సర్వదోషనివారణార్ధం మనోవాంచాఫల సిద్ద్యర్ధం ధర్మార్ధ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్ధ

సిద్ద్యర్ధం చ ఇహ జన్మని జన్మాంత రేషు కృత పీడాపరిహారార్ధం పుత్రా పౌత్రాభి వృద్ద్యర్ధం శ్రీవల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర దేవతా ముద్దిశ్య ...... ప్రీత్యర్ధం యావచ్చక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే త్దంగా కలశారాధనం కరిష్యే కలశం గంధ పుష్పాక్షతై రభ్యర్చ్య కలశస్యముఖే విష్ణు: కంటే రుద్రా స్సమాశ్రితః ! మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాత్రు గణాస్మ్రుతా: ! కుక్షౌతు సాగరా స్సర్వే సప్త ద్వీపావ సుంధరాః రుగ్వేదో యజుర్వేదో స్సామవేదో హ్యధర్మణః ! అంగైశ్చ సహితాసర్వే కలశాంబు సమాశ్రితాః గంగైచ యమునేచైవ కృష్ణే , గోదావరి , సరస్వతి , నర్మదా సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధం కురు ఆయాంతు శ్రీవల్లీ..... దేవతా కలశ పూజార్ధం దురితక్షయ  కారకాః కలశోదకేన ఓం దేవం సంప్రోక్ష్య (కలశ మందలి ఉదకమును దేవునిపై చల్లాలి ), ఓం ఆత్మానం సంప్రోక్ష్య అని (ఆ నీటిని తనపై చల్లుకోవాలి ) ఓం పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య  (పూజా ద్రవ్యములపై కూడా చల్లాలి ).

                                                                         
                                                                               ధ్యానమ్:    


పార్వతీ హృదయాంభోజ చిత్ర భానో మహాతనో
బ్రహ్మణ్య! బ్రహ్మవిద్గణ్య ! సుబ్రహ్మణ్య సురప్రభో
ప్రారబ్ద వార సంహార షాన్మాతుర శివంకర
నమః శ్శరవణో ద్భూత ధ్యాయేత్వాం సతతం హృది
శ్రీవల్లీ  దేవసేనా సామెత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః -- ధ్యానం సమర్పయామి
శివాత్మజ మహాతేజః శివాంకాసన సువ్రజ
దదామ్యావాహనం తుభ్యం భవానీ సుముఖప్రజ.
శ్రీ వల్లీ దేవసేనా ....... ఆవాహనం సమర్పయామి
గుహదేవ సహృద్భావా దేవ సేనా సతీధవ
రత్నపీటం మయాదత్తం వీతిహొత్ర సముద్భవ !
శ్రీవల్లీ .................. నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి
వందారు జన సందోహ బృందాకర మహీరూహ
బాలఘాస సమాయుక్తం పాద్యంశక్తి శరావహ
శ్రీవల్లీ ............... నమః పాదయో: పాద్యం సమర్పయామి
దేవాపగా సముద్భూత గీర్వాణ జనవేష్టితః
అర్ఘ్యం కాశాగ్ర సంకీర్ణం వరముద్రా సమంచిత
శ్రీవల్లీ............... నమః హస్తయో రర్ఘ్యం సమర్పయామి
కృత్తికా హృదయానంద భక్తలోక సుఖప్రద
జాతీ సుగంధ సంబంధ వారి మాచ మనందదే
శ్రీవల్లీ................నమః మధుపర్కం సపర్పయామి
గంగాపుత్ర  జగత్పాత్ర  హేతుమాత్ర పవిత్రభో
స్నానం పంచామృతో దైస్చస్వామినాధ ! మహాప్రభో !

శ్రీవల్లీ................ నమః పంచామృత స్నానం సమర్పయామి తతః శుద్దోదక స్నానం సమర్పయామి స్నానంతరం మాచమనీయం సమర్పయామి.

శక్తిబాణ మహాసేన బర్హి యాన మహాఘన
క్రౌంచ ధారణా వస్త్రంతే కాంచనం పూజనోదితమ్.
శ్రీవల్లీ...... నమః వస్త్రయుగ్మం సమర్పయామి
బ్రహ్మారాధ్య పదాంభోజ బ్రహ్మవిద్యా దురంధర
యజ్ఞ సూత్రం శ్రుతి ప్రోక్తం బ్రాహ్మన్ బ్రహ్మవినిర్మితమ్
శ్రీవల్లీ.......... నమః సువర్ణ దివ్య యజ్ఞోపవీతం సమర్పయామి
వల్లీనాధ జగన్నాధ శూరా పద్మా సురోద్భిద
చందనం శీత సౌగంధ మర్పయామి వరప్రద
శ్రీవల్లీ...........నమః శ్రీగందాన్ ధారయామి
షడానన శ్రుతిప్రాణ ప్రణతార్తి వినాశన
నా నావల్యంత సౌరభ్యాం స్రజంభక్త్యా సమర్పయే
శ్రీవల్లీ ......... నమః అనేక పుష్పమాలికా సమర్పయామి

అధాంగ పూజ

స్కందాయ నమః పాదౌ పూజయామి
కుమారమూర్తయే నమః గుల్ఫౌ పూజయామి
పార్వతీసుతాయ నమః జంఘే పూజయామి
అగ్నిగర్భాయ నమః  జానూ పూజయామి
శిఖివాహనాయ  ఊరూ పూజయామి
గుహాయ నమః హృదయం పూజయామి
శరజన్మనే నమః ఉదరం పూజయామి
సేనాధవాయ నమః బాహూన్ పూజయామి
కార్తికేయాయ నమః కక్షౌ పూజయామి
క్రౌంచధారణాయ కంటం పూజయామి
షణ్ముఖాయ నమః ముఖం పూజయామి
విశాఖాయనమః కర్ణౌ పూజయామి
శక్తిధరాయనమః హస్తాన్ పూజయామి
ద్విషిణ్నేత్రాయ నమః నేత్రాణి పూజయామి
షాన్ముతురాయ నమః శిరాంసి పూజయామి
సుబ్రహ్మణ్యాయ నమః సర్వాణ్యంగాని పూజయామి 

ఇక్కడ అష్టోత్తరములు లేక సహస్రములు చెప్పవలెను.  

ద్విషడ్భుజ షడ్బాహొ శరజన్మన్ శివప్రద
దూపమాఘ్రాపాయే దేవ గుగ్గులంచ పరీమళమ్
శ్రీవల్లీ.......నమః ధూపమాఘ్రాపయామి.         
వృజినద్రజ సంహార గజానన సహొదర
గోఘ్రుతాక్తం వర్తి దీపం విశాఖాన జ్ఞానవాపకమ్
శ్రీవల్లీ............నమః దీపం దర్శయామి
పదార్దై ర్భహుళై ర్యుక్తం స్నాన మాపన్నరక్షక
నివేదయే మహానంద చరనాయుధ కేతన
శ్రీవల్లీ........నమః నైవేద్యం సమర్పయామి ఉత్తరాపోశనం సమర్పయామి.
హస్తాన్ ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి శుద్ధాచమనీయం సమర్పయామి.
సంసార వార్ధి సంతార సాధుసౌహార్ద భాసుర
తాంబూలం ముక్త చూర్ణక్తం పూగీఫల సమన్వితమ్
శ్రీవల్లీ........నమః తాంబూలం సమర్పయామి
జ్ఞాన స్వరూప సందీప ప్రాజ్ఞ ప్రజ్ఞానదాయక
నీరాజనం సకర్పూరం తారకూసుర మారక!
శ్రీవల్లీ...... నమః కర్పూరా నంద నీరాజనం సమర్పయామి.
వేదసార మహొదార వేదవాక్యాను గోచర
మంత్రోక్త విధి నాతుభ్యం దక్షిణాం కుసుమాంజలిం
శ్రీవల్లీ.......నమః మంత్రపుష్పం సమర్పయామి.
కేకివాహ నమస్తుభ్యం నమస్తే కుక్కుట ధ్వజ
నమోనమస్తే సేనాని పాపానివినివారాయ
శ్రీవల్లీ.........నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.
చామరం వ్యజనం ఛత్రం నృత్త గీతం ప్రదర్శయే
సర్వోపచార పూజాంశ్చ గృహాణ శర సంభవ

అన్యా సుబ్రహ్మణ్యే శ్వర  దేవ స్సుప్రీతి స్సుప్రసన్నో వరదో భవతు మమ ఇష్ట  కామ్యార్ధ సిద్ధిరస్తు  ఏతత్ఫలం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.

శ్రీ సుబ్రహ్మణ్య దండకము    


శ్రీమన్మహా దేవ పుత్రా వచోధీశ పౌత్రా, భవానీ హృదంభోజమిత్రా, పరేషాన  గోత్రా, వీతిహొత్రాంగ  నాగర్భ శుక్త్యంబు దత్యక్త సుస్వాతికార్త్యంబు మాత్రా మహాజ్ఞాన పాత్రా, పవిత్రాచ్చ గంగాజలోత్తుంగ రంగత్త  రంగానుషంగాంగ పాత్రా, పవిత్రా, విశేషాచ్చ కాశాటవీ జన్య సౌజన్య గాత్రా, సుగాత్రా, మునీంద్రాంగ నాభవ్య  వక్షోరుహస్తన్య  సంపుష్ట చిత్రా, కృపాపూర్ణ నేత్రా, సురాధీశ గోత్రారి పుత్రీ గళానంద బద్దార్హ మాంగల్య సూత్రా సుపర్వాణమిత్రా, కృతానేక పాపాతవీ జన్య దుష్పాద పొద్దాహ కృద్వీతి హోత్రా, లసత్ప్రుష్టి  పాత్రా, దురాచార వల్లీలవిత్రా, విచిత్రా శుభావాస్త వల్ల్లీ కళత్రా మహాసచ్చరిత్రా, నినున్ తెల్పగా శక్యమే? తొల్లిటన్  సర్గకాధార మై పారామి సర్వసంపూర్ణ మై  మీరి యోంకారమై వేదవాక్సారమై, మారి, దిక్పాలక వ్రాత మర్దింప, లోకాలు కాపాడు సంకల్పముం జేసి, శర్వత్రికూటంబు కూటంబు కాగా, భవానీ మనోమోదముం గూర్చి స్కందత్వమింపొంద నగ్నిన్ని నిమిత్తంబుగా నూని స్వాహాంగనా గర్భసందర్భముం  గాంచి యల్లంత మిన్నేటిలో ముద్దయై

యెడ్డునుంబట్టి  యచ్చోటునన్ రేల్లులో పిల్లడై మించి కెవ్వంచు విన్పించి ప్రాంత ప్రయాణస్థులన్ చెంతకుంజేర్చి  కవ్వించి లే నవ్వులొల్లించి తన్నేత్ర పర్వంబు గావించి వాత్సల్యము బెంచి లీలల్ ప్రపంచించి యా పుణ్య సీమంతినీ కక్షలన్ జేరి పొత్తిళ్ళల్లో  బిడ్డడై యడ్డమై యారుమోముల్ విడంబించి తట్ స్తన్యముంగ్రోలి  యల్లారు ముద్దౌచు రాణించు నిన్నెన్న సామాన్యమెట్లౌనయా, కార్తికేయా జగన్మాతకున్ ముద్దునై దివ్య కైలాసముంజేరి టీవిన్ శివోత్సంగమన్ దగ్గేపై ముద్దులున్ బెద్దగా జూపుచున్ సుద్దులన్ గొల్పుచున్ పెర్గి ఫాలాక్షుడాచార్యుడై విద్ధియల్ నేర్ప, పాండిత్య మార్జించి శౌర్యంబు జూపించి క్రౌంచాద్రి  భేదించి శక్తీషు వుందాల్చి బృందారకుల్ వచ్చి వందారులై కొల్వ సేనాధి పత్యంబుచేబట్టి తత్తార కామర్త్య వైరిన్  తలంగొట్టి సింహాస్యక్రవ్యాదునింగూల్చి  యాశూర పద్మాసురుం జీల్చి చెండాడి వైవ స్వంతాంతః పురాతిథ్య మొందించి జేజేతులు రాబట్టి జేజేల రప్తి కంటాన మాగళ్య సూత్రంబునుంగట్టి  , వేజెట్టి వైయుంటి విట్లంచు రూపించ గా సాధ్య మెలాగయా ! బాహులేయా ! సరోజాత జాతుం 'డహం బ్రహ్మ ' నాబల్క కాదంచు వాదించి బ్రహ్మ స్వరూపంబు బోధించి మెప్పించి యానంద మొందించి యవ్వానిచె ' సుష్టు బ్రహ్మణ్యభ్యో ' యందు  బిల్పించు కొన్నట్టి బల్ మేటి వేపాటి నౌ విప్పనో పార్వతీ నందనా! కేకిరాట్స్యందనా! కల్కి మా పాపముల్ వాపగా పెక్కులౌ యిక్కలన్ కోవలన్ బోయుచున్ కాపురంబుండి డెందంబులన్ గూర్చుచున్ కౌతుకాలిచ్చుచున్ దొడ్డిలో వేల్పుగిడెన పున్యాత్మునేరే నిరూపించువారే    కుమారా, ధర న్నీనివాసంబు లెందెందునందున్న కృష్ణాసరిత్తీర మందున్న 'శ్రీ మోపిదేవి' పురంబిడ్డ యన్నింటిలో మిన్నయౌకా, విశాఖ, యిటన్నీవు

చూపించు మహాత్మ్యముల్ విప్పి యెట్లుందు నో స్కందకాంతాళిలో దోషముల్ వాపగా చీ కులల్లార్పగా సంతవుల్ కూర్పగా కోరికల్ తీర్పగా నేర్పులన్ కొంటివె, బాలికా బాల సంఘాలకినీ కృపాదృష్టి దివ్యౌషద  ప్రాప్తియై కంటిలో  కాయలన్ గెంటెడిన్ వీనులన్ పోటు లన్ దూటెడిన్ మేను పై మచ్చలన్ వాపెడిన్ నెత్తిపై కుర్పులన్ గోటితో గిల్లెడిన్ నిత్యమోయన్న సుబ్బన్న, ఈ యెన్ని కంగొన్న మిన్నాగువై యిందు కన్నాకువై కీర్తి నార్జించి ఈ యూరి నన్వర్ధ  యాత్రాస్థలంబిద్ద  కైలాసరంగంబుగా  జేసి యందందు నందుడు స్త్రీ పురుషుల్ వచ్చి వె మ్రొక్కు లందించి డెందంబులున్  విచ్చి పోజేయుచున్నావు   కాదా, యభీష్టప్రదా  నీదు సార్ర్దాత్వమే  మాదు భాగ్యాప్తి  నీ వీక్షనంబే సదా రక్ష, యోస్వామినాధా, యపాస్తవ్యధా దేవ,  దేవాదిదేవా, యనంత ప్రభావ దయార్ద్ర స్వభావా , కుమారేశ దేవా, నమస్తే నమస్తే నమః

శ్రీ శాండిల్య గోత్ర జో భమిడి పాట్య న్వర్ధ వంశోద్భవః 
సుబ్రహ్మణ్య తనూభవో రచితవాన్ లక్ష్మీ నృశింహభిదః
క్రుష్ణాతీరగ మోపిదేవి పురవాస శ్రీ బుదారాధకః
సుబ్రహ్మణ్య క్రుపావిశేష కలితః పూజావిధిం దండకమ్.

హరి: ఓమ్ తత్సత్




Monday, November 8, 2010

గణేశాష్టకమ్ వ్యాసరచితమ్
























!!!!!! శ్రీగణేశాయ నమః !!!!!!

1)గణపతిపరివారం చారూకేయూరహారం
గిరిధరవరసారం యోగినీచక్రచారమ్
భవభయపరిహారం దుఃఖ దారిద్రయదూరం
గణపతిమభివన్దే వక్రతుణ్డావతారమ్

2)అఖిలమలవినాశం పాణినా హస్తపాశం
కనకగిరినికాశం సూర్యకోటిప్రకాశమ్
భజ భవగిరినాశం మాలతీతీరవాసం
గణపతిమభివన్దే మానసే రాజహంసమ్

3)వివిధ మణి మయూఖైః శోభమానం విదూరైః
కనకరచితచిత్రం కణ్ఠదేశేవిచిత్రం
దధతి విమలహారం సర్వదా యత్నసారం
గణపతిమభివన్దే వక్రతుణ్డావతారమ్

4)దురితగజమమన్దం వారణీం చైవ వేదం
విదితమఖిలనాదం నృత్యమానన్దకన్దమ్
దధతి శశిసువక్త్రం చాఙ్కుశం యో విశేషం
గణపతిమభివన్దే సర్వదానన్దకన్దమ్

5)త్రినయనయుతభాలే శోభమానే విశాలే
ముకుటమణిసుఢాలే మౌక్తికానాం చ జాలే
ధవలకుసుమమాలే యస్య శీర్ష్ణః సతాలే
గణపతిమభివన్దే సర్వదా చక్రపాణిమ్

6)వపుషి మహతి రూపం పీఠమాదౌ సుదీపం
తదుపరి రసకోణం యస్య చోర్ధ్వం త్రికోణమ్
గజమితదలపద్మం సంస్థితం చారుఛద్మం
గణపతిమభివన్దే కల్పవృక్షస్య వృన్దే

7)వరదవిశదశస్తం దక్షిణం యస్య హస్తం
సదయమభయదం తం చిన్తయే చిత్తసంస్థమ్
శబలకుటిలశుణ్డం చైకతుణ్డం ద్వితుణ్డం
గణపతిమభివన్దే సర్వదా వక్రతుణ్డమ్

8)మాధఃస్థితేకామధేనుం
చిన్తామణిం దక్షిణపాణిశుణ్డమ్
బిభ్రాణమత్యద్భుతచిత్తరూపం
యఃపూజయేత్ తస్య సమస్తసిద్ధిః

9)వ్యాసాష్టకమిదం పుణ్యం గణేశస్తవనం నృణామ్
పఠతాం దుఃఖనాశాయ విద్యాం సంశ్రియమశ్నుతే

ఇతి శ్రీపద్మపురాణే ఉత్తరఖణ్డే వ్యాసవిరచితం గణేశాష్టకం సమ్పూర్ణమ్!!

Thursday, November 4, 2010

దీపావళి










దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ |
దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమ్మోస్తుతే ||

దీపావళి పండుగ ప్రతి సంవత్సరము అశ్వీజమాసము లో వచ్చే ముఖ్యమైన పండుగ.ఈ పండుగను ప్రజలంతా ఎంతో సంతోషంగా జరుపుకుంటారు

దీపావళి అంటే దీపోత్సవం. ఆ రోజు దీప లక్ష్మి తన కిరణాలతో అమావాస్య చీకట్లను పాలద్రోలి జగత్తును తేజోవంతం

చేస్తుంది. ఆ వేళ సర్వశుభాలు, సంపదలు ప్రసాదించే లక్ష్మీదేవిని పూజించడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం.

సిరులు కురిపించే ఆ చల్లని తల్లి ఆశీస్సులు ఎల్లవేళలా మనకందరికీ లభించాలనీ కోరుతూ...

నరకుడు చనిపోయిన రోజుని నరకచతుర్దశి అంటారు.ఇది ప్రతి సంవత్సరము ఆశ్వీజమాసము కృష్ణ చతుర్దశి రోజు వస్తుంది

,ఆరోజు నరకాసురుని బొమ్మలు తయారు చేసి కాల్చివేస్తారు.ఆ తరువాత రోజు , అంటే ఆశ్వీజమాస అమావాస్య నాడు దీపావళి పండుగగా జరుపుకుంటారు

దీపావళి అంటే దీపాలవరుస. అజ్ఞానంధకారాన్ని పారదోలి, జ్ఞానకాంతులను విరజిమ్మే ఉత్తమోత్తమ పండుగ

నరకుని మరణం ప్రపంచానికంతటికీ ఆనందాన్ని ఇస్తూ ,

ముంగిట ముత్యాల ముగ్గులతో , మామిడి తోరణాలతో , ముంగిట దీపాల వరసతో కళకళలాడే ,

దేదీప్యమానంగా వెలిగే దీపాలశోభతో మన అందరి జీవితాలు ఆ ధనలక్ష్మి చల్లని చూపులతో
దేదీప్యమానంగ వెలగాలని టపాసుల సందడిలో మన బాధలన్ని తొలిగి మన బ్రతుకులులు
కోలాహలంగా వుండాలని ,

ఈ దీపావళి రోజున మనకందరికీ జ్ఞాన~ జ్యోతిని వెలిగించమని కోరుతూ

మీ శక్తి........

Friday, October 8, 2010

Sree navadurgaa stOtraM

Sree navadurgaa stOtraM

::::Sailaputri::::

vaMdae vaaMchita laabhaaya chaMdraardhakRta Saekharam^
vRshaarooDhaaM SooladharaM SailaputreeM yaSasvineem^

::::brahmachaariNi::::

dadhaana kara padmaabhyaM akshamaalaa kamaMDalaa
daevee pradaatu mayee brahmachaariNya nuttamaa

::::chaMdraghaMTa::::

piMDaja pravaraarooDha chaMDakO paastrakairyutaa |
prasaadaM tamataehyaaM chaMdraghaMTaeti viSrutaa ||

::::kooshmaaMDa::::

suraa saMpoorNa kalaSaM rudhiraaputramaeva cha
dadhaana hasta padmaabhyaM kooshmaaMDaa Subhadaastum^

::::skaMdamaata::::

siMhaasana gataa nityaM padmaaSrita karadva yaa
Subhadaastu sadaa daevi skaMdamaataa yaSasvinee

::::kaatyaayini::::

chaMdarahaasOjvalakaraM Saardoolavaravaahanaa
kaatyaayanee SubhaM daddyaaddaevee daanava ghaatinee

::::kaaLaraatri::::

aekavaeNi japakarNi pooraanagnaa kharaasthitaa
laMbOshThee karnikaakarNee tailaachchyaakta SareeriNee
vaama paadOllisallOhalitaa kaMTakaa bhooshaNaa
varamoordadhvajaa kRshNaa kaaLaraatrirbhayaMkaree

::::mahaagauri::::

Svaetae vRshae samaarooDhaa SvaetaMbara dharaa Suchi@h
mahaagauri SubhaM dadyaat^ mahaadaeva pramOdadaa

::::siddhidhaatri::::

siddha gaMdharva yakshaadyai@h asurai ramarai rapi
saevyamaanaa sadaa bhooyaat^ siddhidaa siddhidaayinee

:::::::iti Sree navadurgaa stOtraM saMpoorNaM:::::::

అందరికీ దసరా ( నవరాత్రి) శుభాకాంక్షలు




దసరా నవరాత్రులు

మన ముఖ్యమైన పండుగలలో దసరా ఒకటి.
ఈ పండుగ నవరాత్రులు( అంటే 9 రాత్రులు అని అర్థం)
అమ్మవారిని పూజించిన తరువాత పదవరోజున పండుగగా జరుపుకుంటాము.
ఐతే తెలుగు తిథుల ప్రకారం ప్రతి ఏడాది ఈ పండుగ రోజులు మారుతూ ఉంటాయి.
అప్పుడప్పుడు రెండు తిథులు ఒకే రోజు రావటం కూడా జరుగును.
అలాంటప్పుడు ఇద్దరు అఅమ్మవారుల నామాలతో పూజ చేసుకోవాలి.

ప్రతి రోజు అమ్మవారి ఒక్కొక్క రూపాన్ని పూజించుకోవాలి.ఇలా 9 రోజులు
9 విధాల అమ్మవారి నామాలతో ఒక్కో అమ్మవారిని పూజించి,
ఆ దేవి కరుణామౄతమును కురిపించమని వేడుకోందాము.
(క్రింద పేర్కొనినట్లు ఒక్కోరోజు ఒక్కొక్క తల్లిని పూజించాలి)
)
మొదటి రోజు------- శ్రీ బాలాత్రిపుర సుందరి దేవి

రెండవ రోజు------- శ్రీ గాయత్రీ దేవి

మూడవ రోజు------- శ్రీ అన్నపూర్ణా మాత

నాలుగవ రోజు--------శ్రీ లలిత దేవి

ఐదవ రోజు----------శ్రీ సరస్వతి దేవి

ఆరవ రోజు----------శ్రీ మహాలక్ష్మి దేవి

ఏడవ రోజు-----------శ్రీ దుర్గా దేవి

ఎనిమిదవ రోజు--------శ్రీ మహిషాసుర మర్ధిని దేవి

తొమ్మిదవ రోజు--------శ్రీ రాజ రాజేశ్వరి దేవి

శ్రీ నవదుర్గా స్తోత్రం


::::శైలపుత్రి::::

వందే వాంచిత లాభాయ చంద్రార్ధకృత శేఖరమ్
వృషారూఢాం శూలధరం శైలపుత్రీం యశస్వినీమ్

::::బ్రహ్మచారిణి::::

దధాన కర పద్మాభ్యం అక్షమాలా కమండలా
దేవీ ప్రదాతు మయీ బ్రహ్మచారిణ్య నుత్తమా

::::చంద్రఘంట::::

పిండజ ప్రవరారూఢ చండకో పాస్త్రకైర్యుతా |
ప్రసాదం తమతేహ్యాం చంద్రఘంటేతి విశ్రుతా ||

::::కూష్మాండ::::

సురా సంపూర్ణ కలశం రుధిరాపుత్రమేవ చ
దధాన హస్త పద్మాభ్యం కూష్మాండా శుభదాస్తుమ్

::::స్కందమాత::::

సింహాసన గతా నిత్యం పద్మాశ్రిత కరద్వ యా
శుభదాస్తు సదా దేవి స్కందమాతా యశస్వినీ

::::కాత్యాయిని::::

చందరహాసోజ్వలకరం శార్దూలవరవాహనా
కాత్యాయనీ శుభం దద్ద్యాద్దేవీ దానవ ఘాతినీ

::::కాళరాత్రి::::

ఏకవేణి జపకర్ణి పూరానగ్నా ఖరాస్థితా
లంబోష్ఠీ కర్నికాకర్ణీ తైలాచ్చ్యాక్త శరీరిణీ
వామ పాదోల్లిసల్లోహలితా కంటకా భూషణా
వరమూర్దధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ

::::మహాగౌరి::::

శ్వేతే వృషే సమారూఢా శ్వేతంబర ధరా శుచిః
మహాగౌరి శుభం దద్యాత్ మహాదేవ ప్రమోదదా

::::సిద్ధిధాత్రి::::

సిద్ధ గంధర్వ యక్షాద్యైః అసురై రమరై రపి
సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ

:::::::ఇతి శ్రీ నవదుర్గా స్తోత్రం సంపూర్ణం:::::::

Tuesday, October 5, 2010

శ్రీదుర్గా నక్షత్రమాలికా స్తుతిః






!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
::::: ఓం శ్రీ గణేశాయ నమః ::::::::

1:విరాటనగరం రమ్యం గచ్ఛమానో యుధిష్ఠిరః
అస్తువన్ మనసా దేవీం దుర్గాం త్రిభువనేశ్వరీమ్

2:యశోదాగర్భసంభూతాం నారాయణవరప్రియామ్
నన్దగోపకులేజాతాం మంగళ్యాం కులవర్ధనీమ్

3:కంసవిద్రావణకరీం అసురాణాం క్షయం కరీమ్
శిలాతటవినిక్షిప్తాం ఆకాశం ప్రతిగామినీమ్

4:వాసుదేవస్య భగినీం దివ్యమాల్య విభూషితామ్
దివ్యాంబరధరాం దేవీం ఖద్గఖేటకధారిణీమ్

5:భారావతరణే పుణ్యే యే స్మరన్తి సదాశివామ్
తాన్వై తారయసే పాపాత్ పంకేగామివ దుర్బలామ్

6:స్తోతుం ప్రచక్రమే భూయః వివిధైః స్తోత్రసంభవైః
ఆమన్త్ర్య దర్శనాకాఙ్క్షీ రాజా దేవీం సహానుజః

7:నమోఽస్తు వరదే కృష్ణే కుమారి బ్రమ్హచారిణి
బాలార్క సదృశాకారే పూర్ణచన్ద్రనిభాననే

8:చతుర్భుజే చతుర్వక్త్రే పీనశ్రోణిపయోధరే
మయూరపింఛవలయే కేయూరాంగదధారిణి

9:భాసి దేవి యదా పద్మా నారాయణపరిగ్రహః
స్వరూపం బ్రహ్మచర్యం చ విశదం తవ ఖేచరి

10:కృష్ణచ్ఛవిసమా కృష్ణా సంకర్షణసమాననా
బిభ్రతీ విపులౌ బాహు శక్రధ్వజసముఛ్రయౌ

11:పాత్రీ చ పంకజీ కంఠీ స్త్రీ విశుద్ధా చ యా భువి
పాశం ధనుర్మహాచక్రం వివిధాన్యాయుధాని చ

12:కుండలాభ్యాం సుపూర్ణాభ్యాం కర్ణాభ్యాం చ విభూషితా
చన్ద్రవిస్పార్ధినా దేవి ముకేన త్వం విరాజసే

13:ముకుటేన విచిత్రేణ కేశబన్ధేన శోభినా
భుజంగాఽభోగవాసేన శ్రోణిసూత్రేణ రాజతా

14:విభ్రాజసే చ బద్ధేన భోగేనేవేహ మన్థరః
ధ్వజేన శిఖిపింఛానాం ఉఛ్రితేన విరాజసే

15:కౌమారం వ్రతమాస్థాయ త్రిదివం పావితం త్వయా
తేన త్వం స్తూయసే దేవి త్రిదశైః పూజ్యసేఽపి చ

16:త్రైలోక్య రక్షణార్థాయ మహిషాసుర ఘాతిని
ప్రసన్నా మే సురశ్రేష్ఠే దయాం కురు శివా భవ

17:జయా త్వం విజయా చైవ సంగ్రామే చ జయప్రదా
మమాపి విజయం దేహి వరదా త్వం చ సాంప్రతమ్

18:విన్ధ్యే చైవ నగశ్రేష్టే తవస్థానం హి శాశ్వతమ్
కాలి కాలి మహాకాలి శీధుమాంస పశుప్రియే

19:కృతానుయాత్రా భూతైస్త్వం వరదా కామచారిణి
భారావతారే యే చ త్వాం సంస్మరిష్యన్తి మానవాః

20:ప్రణమన్తి చ యే త్వాం హి ప్రయాణే తు నరా భువి
న తేషాం దుర్లభం కించిత్ పుత్రతో ధనతోఽపి వా

21:దుర్గాత్తారయసే దుర్గే తత్వం దుర్గా స్మృతా జనైః
కాన్తారేష్వవసన్నానాం మగ్నానాం చ మహార్ణవే

(దస్యుభిర్వా నిరుద్ధానాం త్వం గతిః పరమా నృణామ)

22:జలప్రతరణే చైవ కాన్తారేషు అవటేషు చ
యే స్మరన్తి మహాదేవీం న చ సీదన్తి తే నరాః

23:త్వం కీర్తిః శ్రీః ధృతిః సిద్ధిః హ్రీః విద్యా సన్తతిర్మతిః
సన్ధ్యా రాత్రిః ప్రభా నిద్రా జ్యోత్స్నా కాన్తిః క్షమా దయా

24:నృణాం చ బన్ధనం మోహం పుత్రనాశం ధనక్షయమ్
వ్యాధిం మృత్యుం భయం చైవ పూజితా నాశయిష్యసి

25:సోహం రాజ్యాత్పరిభ్రష్టః శరణం త్వాం ప్రపన్నవాన్
ప్రణతశ్చ యథా మూర్ధ్నా తవ దేవి సురేశ్వరి

26:త్రాహి మాం పద్మపత్రాక్షి సత్యే సత్యా భవస్వ నః
శరణం భవ మే దుర్గే శరణ్యే భక్తవత్సలే

27:ఏవం స్తుతా హి సా దేవీ దర్శయామాస పాణ్డవమ్
ఉపగమ్య తు రాజానం ఇదం వచనం అబ్రవీత్

28:శృణు రాజన్ మహాబాహో మదీయం వచనం ప్రభో
భవిష్యతి అచిరాదేవ సంగ్రామే విజయస్తవ

29:మమ ప్రసాదాత్ నిర్జిత్య హత్వా కౌరవ వాహినీమ్
రాజ్యం నిష్కణ్టకం కృత్వా భోక్ష్యసే మేదినీం పునః

30:భ్రాతృభిః సహితో రాజన్ ప్రీతిం యాస్యసి పుష్కలామ్
మత్ప్రసాదాచ్చ తే సౌఖ్యం ఆరోగ్యం చ భవిష్యతి

31:యే చ సంకీర్తయిష్యన్తి లోకే విగతకల్మషాః
తేషాం తుష్టా ప్రదాస్యామి రాజ్యం ఆయుః వపుః సుతమ్

32:ప్రవాసే నగరే వాపి సంగ్రామే శతృసంకటే
అటవ్యాం దుర్గకాన్తారే సాగరే గహనే గిరౌ

33:యే స్మరిష్యన్తి మాం రాజన్ యథాహం భవతా స్మృతా
న తేషాం దుర్లభం కించిత్ అస్మిన్ లోకే భవిష్యతి

34:ఇదం స్తోత్రవరం భక్త్యా శృణుయాత్ వా ఫఠేత వా
తస్య సర్వాణి కార్యాణి సిధ్ధిం యాస్యన్తి పాణ్డవాః

35:మత్ప్రసాదాచ్చ వస్సర్వాన్ విరాటనగరే స్థితాన్
న ప్రజ్ఞాస్యన్తి కురవః నరా వా తన్నివాసినః

36:ఇత్యుక్త్వా వరదా దేవీ యుధిష్ఠిరం అరిన్దమమ్
రక్షాం కృత్వా చ పాణ్డూనాం తత్రైవాన్తరధీయత

:::::::: ఓం తత్సత్ ::::::::::::

నవరాత్రులు ఎప్పుడు ఆర౦భి౦చాలి?




























నవరాత్రులు ఎప్పుడు ఆర౦భి౦చాలి?

మనమ౦దరమూ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమిను౦డి నవరాత్రులను ప్రార౦భి౦చుకొ౦టున్నాము కదా! అయితే ఆ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నిర్ణయ౦ అనేది ఎప్పుడు చేయాలి? ఈవిషయ౦పై మనమ౦దర౦ చేస్తున్న నిర్ణయ౦ సశాస్త్రీయమా? అశాస్త్రీయమా?
నవరాత్రార౦భమునకు కావలసిన ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి అనే తిథి రె౦డు రకాలుగా ఉ౦టు౦ది. ౧. శుద్ధ ిథి అనగా సూర్యోదయ౦ ను౦డి మరునాటి సూర్యోదయ౦ వరకు ఉ౦డుట. ౨. విద్ధ తిథి అనగా మొదటి రోజు సూర్యోదయాన౦తర౦ అమావాస్య తరువాత పాడ్యమి ఆర౦భమై ఆరోజు అమావాస్యతోనూ నరునాడు సూర్యోదయాన౦తర౦ కొన్ని ఘడియల వరకు ఉ౦డి తరువాత విదియతోనూ మరునాడు సూర్యోదయాన౦తర౦ కొన్ని ఘడియల వరకు ఉ౦డి తరువాత విదియతోనూ కూడుకుని ఉ౦డట౦.
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి శుద్ధ తిథి అయినట్లైతే ఆరోజును౦డీ నవరాత్రార౦భము నిర్వివాదము. విధ్ధ తిథి అయినట్లయితే సమస్య ఉత్పన్నమవుతో౦ది. కొ౦తమ౦ది ప౦డితులు అమావిద్ధ అయిన పాడ్యమిని గ్రహి౦చరాదని అ౦టు౦టే, కొ౦తమ౦ది దానినే గ్రహి౦చాలి అని నిషర్షగా తెలియజేస్తున్నారు.
సూర్యోదయాన౦తర౦ అమావాస్య కొన్ని ఘడియలు ఉ౦డి, అన౦తర౦ పాడ్యమి ప్రార౦భమై, మరునాటి సూర్యోదయానికి ము౦దే పూర్తగుట. ఇచట పాడ్యమి ఏశయము అయినదని అ౦టారు. ఆవిధ౦గా పాడ్యమి ఏష్య తిథి అయితే అమావాస్యతో కూడుకుని యున్న పాడ్యమి నాటి ను౦డే నవరాత్రార౦భ౦ చేయాలని క్చాలామ౦ది ఏకాభిప్రాయ౦తో చెబుతున్నారు.
శరత్కాలీన నవరాత్ర వ్రత విధానాన్ని గురి౦చి జనమేజయుడు వ్యాసభగవానుని అడుగుతాడు. ఈవిషయ౦ తృతీయ స్క౦దములోని 26వ అధ్యాయయములోనిది. వ్యాస భగవానుడు జనమేజయునికి తెలియజేస్తూ అమావాస్యనాడే స౦బారాలన్నీ సమకూర్చుకోవలనీ, ఆరోజే వేదికా నిర్మాణాన్ని కూడా చేయాలనీ, దేవీ తత్త్వ విశారదులు, ఆచార నిరతులైన బ్రాహ్మణులను రాత్రియ౦దు పిలిపి౦చి, మరునాడు ఋత్విక్ వరణ చేయలని అ౦టూ హస్త నక్షత్ర౦తో కూడిన పాడ్యమినాడు ఆర౦భ౦ శ్రేష్ఠమని నవరాత్రులలో ఉపవాసము గానీ, ఏకభుక్తము గానీ, నక్తము గానీ ఉ౦టామని నియమ౦ ము౦దుగా పెట్టుకొని పూజ ప్రార౦భి౦చాలని, దానికి ము౦దు అమ్మవారిని ఈవిధ౦గా ప్రార్థి౦చాలని తెలియజేశారు.

కరిష్యామి వ్రత౦ మాతర్నవరాత్రమనుత్తమమ్!
సాహాయ్య౦ కురు మే దేవీ జగద౦బ మమాఖిలమ్!!

అమ్మా! ఉత్తమమైన నవరాత్ర వ్రతమును చేస్తున్నాను. జగన్మాతవైన నీవు నాకు అన్ని విధముల సహాయము చేయవలసినది" అని పై శ్లోకార్థ౦.

నవరాత్రులలో ఉపవాసము ఉ౦డదల్చుకున్నవారు ఉదయకాల వ్యాప్తి ఉన్న ఆశ్వయుజ శుద్ధ పాడ్యమిని ఏకభుక్త౦ ఉ౦డదలచుకున్న వారు మధ్యాహ్నవ్యాప్తి ఉన్న పాడ్యమిని, నక్త౦ చేయదలచుకున్న వారు ప్రదోషకాల వ్యాప్తి ఉన్న తిథిని తీసుకోవాలా? అన్న ప్రశ్న ఉదయి౦చడ౦ సహజ౦. నవరాత్ర వ్రత౦ నక్త వ్రతమని పురాణాలన్నీ ఘోషిస్తున్నాయి. కాబట్టి ఏవిధమైన ఉపవాస నియమ౦ పెట్టుకున్నా నక్తవ్రతము కనుక ప్రదోషకాల వ్యాప్తి ఉన్న తిథిని తీసుకోవాలని శాస్త్ర నియమ౦. ఇదేవి్షయాన్ని కాలమాధవమనే గ్ర౦థ౦లో మాధవాచార్యులు "నను ఆశ్వయుజమాసే యో య౦ నవరాత్ర వ్రతోత్సవః తదుపక్రమస్యాపి పూర్వ విద్ధాయా౦ క్రియమాణత్వాత్ సోప్యత్ర వివక్షణీయ ఇతి చేన్న-తస్యనక్తవ్రతత్వాత్! ఏకభుక్త, నక్త, ప్రతి పదీష్టీనా౦ దైవత్వేపి పృధజ్నిర్ణయస్య వక్ష్యమాణత్వాత్!
ఆశ్వయుజమాస౦లో నవరాత్రి ఉత్సవాలు కూడా పూర్వ విద్ధమైన పాడ్యమినాడు చేయాలి కనుక దాని గురి౦చి కూడ ఇచ్చట చెప్పుకోవాలి కదా! అని అనుకోవచ్చు. కానీ. అలాకాదు. ఎ౦దుక౦టే నవరాత్రి వ్రతము నక్తవ్రతము కనుక ఏకభుక్తము, నక్తము, పాడ్యమి మరియు ’ఇష్టి’ అనేవి దైవకర్మలు మరియు వీటికి నిర్ణయము వేరుగా చెప్పబడినది గనుక"

కాలమాధవ౦లో మాధవాచార్యులు ఎ౦త స్పష్ట౦గా చెప్పారో చూశారు కదా! ఈ మాధవాచార్యులే అన౦తర౦ సన్యసి౦చి విద్యారణ్యులు అన్న నామధేయ౦తో వెలుగొ౦ది విజయనగర సామ్రాజ్య స్థాపనకు మూల కారకులయ్యారు. శృ౦గేరీ పీఠాన్ని అధిరోహి౦చి జగద్గురువులయ్యారు. ఆ౦ధ్ర దేశమ౦దున్న క్రమా౦త స్వాధ్యాయులు, ఘనాపాఠీలక౦దరకు కాలమాధవము అనే గ్ర౦థ౦ శిరోధార్యమే. దానిపై పరీక్ష కూడా వారికి ఉ౦టు౦ది. అటువ౦టిది ఈనవరాత్ర వ్రత నిర్ణయ౦లో ద్వితీయా విద్ధతో కూడుకున్న పాడ్యమినే గ్రహి౦చాలనే విషయ౦ ఎ౦త అశాస్త్రీయమైనదో దానినే ప౦చా౦గకర్తలు ఏవిధ౦గా అనుసరిస్తూ వస్తున్నారో గమని౦చ౦డి. వారిక౦దరకూ సవియ౦గా చేసే వినాపమేమ౦టే "ఇకను౦చైనా ప్రదోషకాల వ్యాప్తి ఉన్న పాడ్యమిని గ్రహి౦చి పర్వ నిర్ణయ౦ చేయగలరు".
13వ శతాబ్దివారైన విద్యారణ్యులను, వారి ప్రజ్ఞను, వారి పా౦డిత్యాన్ని ఎవరైననూ ఒప్పుకొని తీరవలసి౦దే. ఆది శ౦కరాచార్యుల తరువాత సర్వజ్ఞునిగా కీర్తి౦పబడినవారు విద్యారణ్యులు ఒక్కరే
అయితే మరి ఈ విదియతో కూడిన పాడ్యమి మరియు పూర్వాహ్నకాల వ్యాప్తి ఉన్న పాడ్యమి అనే పొరపాటు ఎ౦దువలన వచ్చినది అ౦టే-దానికి నా సమాధాన౦ సవినయ౦గా ఒకటే.

శ్లో!! జ్ఞానినామపి చేతా౦సి దేవీ భగవతీ హి సా
బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్ఛతి!!

విద్యారణ్యులు ఇచట ఇ౦కొక మాట కూడా అన్నారు. "ఏకభుక్త నక్తయోః అపి ప్రతిపదోక్త కాల విశేష శాస్త్రేణ సామాన్య రూప౦ పూర్వాహ్న శాస్త్ర౦ బాధ్యతే" - అనగా ఏకభుక్త, నక్తములు దైవికమైనవి కనుక మరియు పాడ్యమికి విశేష౦గా అమావాస్యతో కూడుకుని ఉన్నప్పుడే పవిత్రత అని కాల విశేష శాస్త్రమున౦దు చెప్పబడినది. కనుక వ్రతులు ిథి పూర్వాహ్న కాల వ్యాప్తి ఉ౦డాలి అనే సామాన్య శాస్త్ర౦ బాధి౦పబడుతు౦ది" అని అర్థ౦.
సరే, ఇక పాడ్యమికీ ప్రదోషకాల వ్యాప్తిని బట్టి నవరాత్రార౦భ నిర్ణయ౦ చేయాలి. అది ఎలా? ఇ౦దులో మళ్ళీ 6విధములు ఉ౦టాయి.
౧. ము౦దురోజు ప్రదోష వ్యాప్తి ఉ౦టే
౨. మర్నాడు ప్రదోష వ్యాప్తి ఉ౦టే
౩. రె౦డు రోజులూ(నేడూ, రేపూ) ప్రదోష వ్యాప్తి ఉ౦టే
౪. రె౦డురోజులూ ప్రదోష వ్యాప్తి లేకు౦టే
౫. నేడూ, రేపు కూడా సమకాల వ్యాప్తి ఉ౦టే
౬. రె౦డు రోజులలో ఎక్కువ, తక్కువలతో ఉ౦టే

ఇపుడు ౬ విధముల ప్రదోషవ్యాప్తి నిర్ణయన్ని పరిశీలిద్దాము. ౧,౨ స౦దర్భాలలో ఏరోజు ప్రదోషవ్యాప్తి ఉ౦టే ఆరోజే పాడ్యమిని గ్రహి౦చాలి. ఇక ౩వ స౦దర్బ౦లోనూ, ౪వ స౦దర్భ౦లోనూ రె౦డవరోజునే పాడ్యమి నిర్ణయ౦ చేయాలి. అటులనే ౫,౬ వ స౦దర్భాలలో కూడ రె౦డవ రోజునే పాడ్యమి నిర్ణయ౦ చేయాలి అని ధర్మశాస్త్ర నిర్ణయ౦.
పైన తెలిపిన విధ౦గా నవరాత్రార౦భ నిర్ణయమనేది పాడ్యమి తిథియొక్క ప్రదోషకాల వ్యాప్తిని బట్టే చేయాలి అన్న విషయ౦ స్పష్టమైనది కదా! ఇక స౦కల్ప విషయ౦లో స౦దేహ నివారణ జరగాలి.
భాద్రపద అమావాస్య ఈరోజు మధ్యాహ్న౦ ౩గ౦. వరకు ఉ౦ది అనుకు౦దా౦. తదుపరి పాడ్యమి ప్రార౦భమై మరునాడు సాయ౦కాల౦ సూర్యాస్తమయమునకు ము౦దే పూర్తయినదనుకు౦దా౦. ఇపుడు పై తెల్పిన రీతిలో్ ఈరోజే నవరాత్రార౦భ౦ చేయాలి. ఉదయమే నక్తవ్రత స౦కల్ప౦ చెప్పుకోవాలి కదా, కానీ అమావాస్య ఉన్నది, పైగా భాద్రపద మాసమే ఉన్నది కదా! ఏమి చేయాలి అన్న స౦దేహ౦ వస్తు౦ది. అయినప్పటికీ సూర్యాస్తమానికి పాడ్యమి ఉన్నది కనుక జ్యోతిషశాస్త్ర రీత్యా ప్రదోషకాల వ్యాప్తి పాడ్యమికి ఉన్నది కనుక ఆరోజు ఉదయమే నవరాత్రార౦భ స౦కల్ప౦ చేసితీరాలి అని విద్యారణ్యులు కాలమాధవ౦లో స్పష్టపరచారు. స్మృత్యాపాదిత పాడ్యమి ఉదయము ను౦చే ఉన్నట్లుగా భావి౦చాలని తెలియజేస్తూ ’దెవలుడు’ చెప్పిన ఈ శ్లోకాన్ని విద్యారణ్యులు ఉదహరి౦చారు.

శ్లో!! యా౦ తిథి౦ సమనుప్రప్య అస్త౦ యాతి దివాకరః
తిథిః సా సకలా జ్ఞేయా దానాధ్యయన కర్మసు!!

ఏతిథిని స్పృశిస్తూ సూర్యుడు అస్తమిస్తాడో ఆతిథి దాన, అధ్యయన, వ్రతాది దైవకర్మల య౦దు స౦పూర్ణముగా ఉన్నట్లుగానే భావి౦చాలి.
ఇ౦తవరకు చెప్పిన నియమములన్నీ సార్వజనీకములు. ఇక పూర్ణదీక్ష నొ౦దిన శ్రీ విద్యోపాసకుల విషయ౦లో "స౦క్రా౦తి వ్యతిరిక్త పర్వార్చన౦ సూర్యాస్తమయోత్తర౦ దశ ఘటికాత్మకే రాత్రి పూర్వభాగే కార్యమ్"" అని త౦త్ర వచనాన్ననుసరి౦చి, సూర్యాస్తమయాన౦తర౦ పది ఘడియల రాత్రి పూర్వ భాగ వ్యాప్తిని గ్రహి౦చాలి. ఏరోజు ఎక్కువ వ్యాప్తి ఉ౦టే ఆరోజు గ్రహి౦చాలి.
శ్రీ విద్యార్ణవ త౦త్రమున౦దు విద్యారణ్యులు "ఆశ్వయుజే మాసి ప్రతిపత్తిథి మారభ్య నవమ్య౦తాసు నవసు రాత్రిషు విశేష పూజా౦ కృత్వా, ఏకాది వృద్ధ్యా, జపాదిక౦ చ విధాయ కుమారీ పూజాన౦చ ఏకాది వృద్ధ్యా కుర్యాత్" అని పేర్కొన్నారు. అనగా ఆశ్వయుజ మాసమ౦దు పాడ్యమి మొదలు 9రాత్రుల య౦దు విశేష పూజ చేసి, ఏకాది వృద్ధి రీత్యా జపము, కుమారీ పూజ చేయవలెను అని అర్థ౦. మిగిలిన రహస్యములు గురుముఖతః గ్రహి౦చవలసినది.
కనుక అమావాస్యతో కూడుకొని యున్ననూ ప్రదోషకాల వ్యాప్తిని బట్టి నవరాత్రార౦భము చేయవలెను. విషయ౦ స్పష్టము. నవరాత్రార౦భ కలశస్థాపన కూడ మొదటిరోజునే మధ్యాహ్న కాలమ౦దు చేయవలెనని ధర్మశాస్త్ర నిర్ణయ౦.
చివరగా అమావాస్య ప్రాముఖ్యతను తెలుసుకు౦దా౦. అమావాస్య అనగానే జ్యోతిష శాస్త్ర రీత్య ఏ ముహూర్తమునకు పనికి క్రాదు అనే ఉద్దేశ౦తో మన౦ దానిని పూర్తిగా పక్కన పెట్టేస్తాము.కాని వ్రత, ఉపవాస, పూజాదులలో దానికి ఎ౦తో ప్రాముఖ్యమున్నది. అమావాస్య అనేది సాక్షాత్తూ దేవీ స్వరూపము.

శ్లో!! అమా షోడశభాగేన దేవీ ప్రోక్తా మహాకలా
స౦స్థితా పరమా మాయా దేహినా౦ దేహధారిణీ!
అమాది పౌర్ణమాస్య౦తా యా ఏ శశినః కలాః
తిథయస్తాః సమాఖ్యాతాః షోడశైవ వరాననే!! - స్కా౦ద పురాణము

అనగా ఆధార శక్తి స్వరూపిణియై, దేహధారుల౦దలి దేహధారిణిగా ఏ మహామాయ వెలుగొ౦దుతున్నదో, ఆమెయే చ౦ద్రునియ౦దలి ౧౬వ కళగా చ౦ద్ర దేహధారిణియై వెలుగొ౦దుతున్నది. ఆమెనే”అమా’ అనే మహాకళగా శాస్త్రములు చెప్పాయి. ఆ మహాకళ క్షయ, వృద్ధి రహితమై నిత్య స్వరూపిణియై ’తిథి’ రూమున కీర్తి౦పబడుతున్నది. మిగిలిన ౧౫ కళలు తిథివృద్ధి, క్షయములతో కూడుకుని వ్యవహార యోగ్యమవుతున్నవి.
తిథి, వృద్ధి, క్షయ రహితమైన ఆ కళయే అమావాస్యగా వెలుగొ౦దుతున్నది. అ౦దుకే అమావాస్యతో కూడుకున్న పాడ్యమికివ్రతోపవాసాదుల౦దు పూజ్యత్వ౦ సిద్ధి౦చి౦దనే విషయ౦ స్పష్ట౦.



నవ నైవేద్యాలు!
సర్వమంగళ మాంగల్యే 
శివే సర్వార్థ సాధికే 
శరణ్యే త్రయంబకే దేవీ 
నారాయణీ నమోస్తుతే!!

అంటూ జగన్మాతను నవరాత్రులు భక్తిశ్రద్ధలతో కొలిచే దసరా మొదలుకానుంది.. రోజూ చేసే పూజలు సరే.. మరి నైవేద్యాల మాటో..? అవీ ఉండాల్సిందే కాబట్టి అన్నంతో చేసే ఈ తొమ్మిది రకాల పదార్థాలను ఓ సారి చూడండి.. మీకు అనువైనవాటిని చేసి నివేదించండి.

1
చక్కెర పొంగలి
కావల్సినవి: బియ్యం - కప్పు, పెసరపప్పు - అరకప్పు, బెల్లం - ఒకటింబావు కప్పు, నెయ్యి - అరకప్పు, కిస్‌మిస్‌, జీడిపప్పు - రెండూ కలిపి అరకప్పు, ఎండుకొబ్బరిముక్కలు - పావుకప్పు, యాలకులపొడి - అరచెంచా. 
తయారీ: పొయ్యిమీద బాణలి పెట్టి పెసరపప్పును దోరగా వేయించి తీసుకోవాలి. అందులో కడిగిన బియ్యం వేసి నాలుగు కప్పుల నీళ్లు పోసి నాలుగు కూతలు వచ్చేవరకూ ఉడికించుకుని తీసుకోవాలి. ఇంతలో బెల్లంలో అరకప్పు నీళ్లు పోసి పొయ్యిమీద పెట్టాలి. అది కరిగాక దింపేయాలి. ఇప్పుడు పొయ్యిమీద ఉడికించి పెట్టుకున్న అన్నం ఉంచి.. అందులో కరిగిన బెల్లం పాకం కలిపి మంట తగ్గించాలి. మరో పొయ్యిమీద బాణలి పెట్టి.. సగం నెయ్యి వేసి జీడిపప్పు, కిస్‌మిస్‌, కొబ్బరిముక్కలు వేసి వేయించుకుని అన్నంలో వేయాలి. చివరగా యాలకులపొడీ, మిగిలిన నెయ్యి వేసి దగ్గరకు అయ్యేవరకూ ఉడకనిచ్చి దింపేయాలి. 
2
మిరియాల అన్నం
కావల్సినవి: అన్నం - కప్పు, నెయ్యి - మూడు చెంచాలు, జీలకర్ర - చెంచా, ఉప్పు - తగినంత, మిరియాలు - ఒకటిన్నర టేబుల్‌స్పూను, కరివేపాకు రెబ్బలు - నాలుగు. 
తయారీ: పొయ్యిమీద బాణలి పెట్టి మిరియాలను వేయించి తీసుకోవాలి. తరవాత మెత్తగా పొడిలా చేసుకోవాలి. అదే బాణలిలో నెయ్యి వేసి జీలకర్రా, కరివేపాకు రెబ్బలూ, మిరియాలపొడి వేయాలి. తరవాత అందులో అన్నం, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి దింపేయాలి.

3
పాల పరమాన్నం
కావల్సినవి: బియ్యం - అరకప్పు, పాలు - రెండు కప్పులు, బెల్లం తరుగు - ఒకటిన్నర కప్పు, యాలకులపొడి - అరచెంచా, నెయ్యి - పావుకప్పు, జీడిపప్పు, కిస్‌మిస్‌ - రెండూ కలిపి పావుకప్పు.
తయారీ: పాలు ఓ గిన్నెలోకి తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. అవి మరిగాక కడిగిన బియ్యం వేసి మంట తగ్గించాలి. అన్నం మెత్తగా అయ్యాక బెల్లం వేసి బాగా కలపాలి. అది దగ్గరకు అయ్యాక యాలకులపొడివేసి దింపేయాలి. ఇప్పుడు పొయ్యిమీద బాణలి పెట్టి నెయ్యి వేయాలి. అది కరిగాక జీడిపప్పు, కిస్‌మిస్‌ వేసి వేయించి.. దీన్ని పరమాన్నంలో వేసి ఒకసారి కలపాలి.

4
కొబ్బరి అన్నం
కావల్సినవి: బియ్యం - కప్పు, కొబ్బరి తురుము - ఒకటిన్నర కప్పు, కొత్తిమీర - కట్ట, జీడిపప్పు - పది, ఎండుమిర్చి - మూడు, పచ్చిమిర్చి - నాలుగు, కరివేపాకు - రెండు రెబ్బలు, సెనగపప్పు - టేబుల్‌స్పూను, మినప్పప్పు - చెంచా, జీలకర్ర - చెంచా, ఆవాలు - అరచెంచా, నెయ్యి - టేబుల్‌స్పూను, నూనె - చెంచా, ఉప్పు - తగినంత. 
తయారీ: బియ్యం కడిగి రెండు గ్లాసుల నీళ్లు పోసి పొడిపొడిగా వండి వెడల్పాటి గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు పొయ్యిమీద బాణలి పెట్టి... నెయ్యి, నూనె వేయాలి. నెయ్యి కరిగాక ఎండుమిర్చీ, సెనగపప్పూ, మినప్పప్పూ, జీలకర్రా, ఆవాలు, జీడిపప్పు వేసి వేయించాలి. అవి వేగాక నిలువుగా తరిగిన పచ్చిమిర్చీ, కరివేపాకు వేయాలి. రెండు నిమిషాలయ్యాక కొబ్బరితురుమూ, తగినంత ఉప్పు వేసి పచ్చివాసన పోయాక దింపేయాలి. దీన్ని అన్నంలో వేసి బాగా కలిపి కొత్తిమీర తరుగు వేయాలి.

5
పులిహోర
కావల్సినవి: అన్నం - కప్పు, నూనె - టేబుల్‌ స్పూను, పల్లీలు - టేబుల్‌ స్పూను, మినప్పప్పు, సెనగపప్పు - ఒకటిన్నర చెంచా చొప్పున, పచ్చిమిర్చి - మూడు, ఆవాలు - చెంచా, ఎండుమిర్చి - నాలుగు, కరివేపాకు రెబ్బలు - రెండు, పసుపు - అరచెంచా, ఉప్పు - తగినంత, చింతపండు గుజ్జు - ఒకటిన్నర టేబుల్‌స్పూను, బెల్లం ముక్క - చిన్నది. 
తయారీ: అన్నాన్ని ఓ పళ్లెంలో పరిచి పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యిమీద బాణలి పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక పల్లీలు వేయాలి. అవి కాస్త వేగుతున్నప్పుడు సెనగపప్పూ, మినప్పప్పూ, ఆవాలూ, ఎండుమిర్చి వేయాలి. ఈ తాలింపు వేగాక కరివేపాకూ, పచ్చిమిర్చి వేయాలి. నిమిషం తరవాత చింతపండు గుజ్జూ, పసుపూ, తగినంత ఉప్పూ, బెల్లంముక్క వేసి మంట తగ్గించాలి. చింతపండు ఉడికాక అన్నంలో ఈ పులుసు వేసి బాగా కలిపితే చాలు.

6
కేసరీ బాత్‌
కావల్సినవి: అన్నం - కప్పు, చక్కెర - ముప్పావుకప్పు, జీడిపప్పు, కిస్‌మిస్‌ పలుకులు - రెండూ కలిపి పావు కప్పు, నెయ్యి - అరకప్పు, యాలకులపొడి - చెంచా.
తయారీ: అడుగు మందంగా ఉన్న గిన్నెలో నెయ్యీ, నాలుగుకప్పుల నీళ్లు తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. రెండు నిమిషాలయ్యాక అందులో కడిగిన బియ్యం వేసి కలిపి మూత పెట్టేయాలి. అన్నం ఉడికాక చక్కెర వేసి మధ్య మధ్య కలుపుతూ ఉండాలి. అది పూర్తిగా దగ్గరకు అయ్యాక యాలకులపొడీ, జీడిపప్పు, కిస్‌మిస్‌ పలుకులు వేసి ఓసారి కలిపి దింపేయాలి. కావాలనుకుంటే ఇందులో రంగు వేసుకోవచ్చు.

7
దద్ధ్యోదనం
కావల్సినవి: అన్నం - కప్పు, పెరుగు - ఒకటిన్నర కప్పు, ఉప్పు - తగినంత, ఆవాలు - చెంచా, జీలకర్ర - చెంచా, కరివేపాకు - రెండు రెబ్బలు, అల్లం తరుగు - చెంచా, పచ్చిమిర్చి ముక్కలు - రెండు చెంచాలు, నెయ్యి - రెండు చెంచాలు, కొత్తిమీర - కట్ట. 
తయారీ: అన్నాన్ని ఓ గిన్నెలోకి తీసుకుని పెరుగు వేసి బాగా కలపాలి. ఇప్పుడు పొయ్యిమీద బాణలి పెట్టి నెయ్యి వేయాలి. అది కరిగాక ఆవాలూ, జీలకర్ర వేయాలి. అవి వేగాక కరివేపాకూ, పచ్చిమిర్చి ముక్కలూ, అల్లం తరుగు వేసి దింపేయాలి. ఈ తాలింపును పెరుగున్నంలో వేయాలి. తరవాత తగినంత ఉప్పూ, కొత్తిమీర తరుగు వేసి కలపాలి. కావాలనుకుంటే ఇందులో దానిమ్మ గింజలు కూడా వేసుకోవచ్చు.

8
కట్టు పొంగలి
కావల్సినవి: పెసరపప్పు - కప్పు, బియ్యం - రెండు కప్పులు, జీలకర్ర - టేబుల్‌స్పూను, మిరియాలు - రెండు చెంచాలు, జీడిపప్పు - అరకప్పు, ఉప్పు - తగినంత, నెయ్యి - పావుకప్పు.
తయారీ: పెసరపప్పూ, బియ్యాన్ని కలిపి కడిగి ఆరున్నర గ్లాసుల నీళ్లు పోసి కుక్కర్‌లో మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు పొయ్యిమీద బాణలి పెట్టి నెయ్యి వేయాలి. అది కరిగాక జీలకర్రా, మిరియాలూ, జీడిపప్పు వేసి వేయించి దింపేయాలి. ఈ తాలింపును ఉప్పు కలిపిన పెసరపప్పు అన్నంలో వేసి కలపాలి.

9
కదంబం
కావల్సినవి: బియ్యం - కప్పు, కందిపప్పు - కప్పు, చింతపండు రసం - పెద్ద చెంచా, బెండకాయ, క్యారెట్‌, చిలగడదుంప, బంగాళాదుంప, వంకాయ, క్యాప్సికం, బఠాణీ, తీపి గుమ్మడికాయ, చిక్కుడుకాయ ముక్కలు - అన్నీ కలిపి మూడున్నర కప్పులు, సాంబారుపొడి - పెద్ద చెంచా, ఉప్పు - తగినంత, నెయ్యి - రెండు టేబుల్‌ స్పూన్లు, జీలకర్ర - చెంచా, కొత్తిమీర - కట్ట, కరివేపాకు రెబ్బలు - రెండు. 

తయారీ: బియ్యంలో మూడుకప్పుల నీళ్లు పోసి పొయ్యిమీద పెట్టాలి. నాలుగు కూతలు వచ్చాక దింపేయాలి. అదేవిధంగా కందిపప్పూ, కూరగాయ ముక్కల్ని విడివిడిగా ఉడికించుకుని తీసుకోవాలి. ఇప్పుడు పొయ్యిమీద బాణలి పెట్టి... నెయ్యి వేయాలి. అది కరిగాక జీలకర్రా, కరివేపాకు వేయించి ఉడికించి పెట్టుకున్న కూరగాయముక్కలు వేయాలి. తరవాత సాంబారుపొడీ, తగినంత ఉప్పూ, చింతపండు రసం వేయాలి. ఐదు నిమిషాలయ్యాక ఉడికించి పెట్టుకున్న కందిపప్పు వేసి కాసిని నీళ్లు పోసి ఒకసారి ఉడకనివ్వాలి. తరవాత అందులో అన్నం, కొత్తిమీర వేసి కలిపితే చాలు.

సర్వ పాపహారిణి


















సర్వ పాపహారిణి

వరుణశ్చైవ గోమూత్రే గోమయే హవ్యవాహనః
దధే వాయుః సముద్దిష్టః సోమః క్షీరే ఘ్రుతే రవిః!!

గోమూత్రంలో వరుణుడు, గోమయంలో అగ్ని, ఆవు పెరుగులో వాయుదేవుడు, 
ఆవుపాలలో చంద్రుడు, ఆవు నెయ్యిలో సూర్యుడు, ఆవు ముఖంలో-యోని వద్ద ఇష్టార్ధ దేవతలు కొలువైయున్నారు.
పూర్వ కాలంలో గోవులెన్ని ఎక్కువ ఉంటే వారే శ్రీమంతులుగా ఉండేవారు. 
గోధనమే నిజధనంగా భావించేవారు. గోధనంలేని రాజ్యం క్షీణిస్తుందనే భావనయుండేది. 
అందుకనే పాండవులకి అరిష్టం కలిగించాలని ఉత్తర గోగ్రహణ(విరాట పర్వం) జరిపిస్తాడు దుర్యోధనుడు. 
గో సంతానంలో కొన్ని పొలం దున్ని ఆహారోత్పత్తికై సహాయపడితే మరికొన్ని పాలను ప్రసాదించి మానవాళికి వాటి ద్వారా రోగనిరోధక శక్తి ప్రసాదిస్తాయి. 
గోవును పూజించి ముమ్మారు ప్రదక్షిణ చేస్తే సర్వ పాపాలు హరిస్తాయి.

శ్రీ గోమహిమ (స్కాందపురాణామ్తర్గతమ్)






















గోమాత గాయత్రి  

ఓం లోక మాతాయ విద్మహే
సర్వ సిద్ధై చ ధీమహి
తన్నో గావో ప్రచోదయాత్ 


శ్రీ గోమహిమ (స్కాందపురాణామ్తర్గతమ్)

1::సృష్టి స్థితి వినాశానాం కర్త్రై మాత్రే నమోనమః
యాత్వం రసమయే ర్భావైరాప్యాయయసి భూతలం

2::దేవానాంచ తథా సంధాన్ పిత్రాణమపి వైగణాన్
సర్వేజ్ఞాతా రసభిజ్నే ర్మధుర స్వాదు దాయినీ

3::త్వయా విశ్వమిదం సర్వం బలం స్నేహ సమన్వితం
త్వం మాతా సర్వ రుద్రాణామ్ వసూనాం దుహితా తథా

4::ఆదిత్యానాం స్వసాచైవ తుష్టా వాంఛిత సిద్ధిదా
త్వం ద్రుతిస్త్వంత తథా పుష్టి స్త్వం స్వాహాత్వం స్వధా తథా

5::బుద్ధి: సిద్ధిస్తదా లక్ష్మీ ర్ధ్రుతి: కీర్తిస్తథా మతి:
కాంతిర్లజ్జా మహామాయా శ్రద్ధా సర్వార్ధ సాధినీ

6::త్వం మాతా సర్వదేవానాం త్వంచ సర్వస్య కారణం
త్వం తీర్ధం సర్వతీర్థానామ్ నమస్తేస్తు సదా౨నఘే

7::శశి సూర్యారుణా యస్యా లలాటే వృషభధ్వజః
సరస్వతీ చ హుంకారే సర్వే నాగాశ్చ కంబవే

8::ఉర పృష్ఠేచ గంధర్వా వేదాశ్చత్వార ఏవచ
ముఖాగ్రే సర్వ తీర్ధాని స్థావరాణి చ రాణిచ

9::గావః పవిత్రా మాంగల్యా గోషు లోకాః ప్రతిష్ఠితా
యద్గ్రుహే దుహ్ఖితాగావః సయాతి నరకం నరః

(ఇతి స్కాంద పురాణామ్తర్గత గోమహిమ సంపూర్ణం)

Saturday, September 11, 2010

శ్రీ విఘ్నేశ్వర చవితి పద్యములు




ప్రార్థన ::--

తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్.
కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిపా నీకు మ్రొక్కెద
న్.

తలచెదనే గణనాథుని
తలచెదనే విఘ్నపతిని దలచినపనిగా
దలచెదనే హేరంబుని
దలచెద నా విఘ్నములను తొలగుట కొరకున్


అటుకులు కొబ్బరి పలుకులు
చిటిబెల్లము నానుబ్రాలు చెరకురసంబున్
నిటలాక్షు నగ్రసుతునకు
బటుతరముగ విందుచేసి ప్రార్థింతు మదిన్.

వినాయక మంగళాచరణము

ఓ బొజ్జగణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ళ మీదికి దండు పంపు
కమ్మనినేయుయు కడుముద్దపప్పును బొజ్జవిరగ గదినుచు పొరలుకొనుచు
జయమంగళం నిత్య శుభమంగళం...........

వెండి పళ్ళెములో వేయివేల ముత్యాలు కొండలుగ నీలములు కలయబోసి
మెండుగను హారములు మెడనిండ వేసుకొని దండిగా నీకిత్తుఘనహారతి
జయమంగళం నిత్య శుభమంగళం...........

శ్రీ మూర్తి వ్యందునకు చిన్మయానందునకు భాసురోతునకు శాశతునకు
సోమార్కనేత్రునకు సుందరాకారునకు కామరూపునకు శ్రీగణనాథునకు
జయమంగళం నిత్య శుభమంగళం...........

ఏకదంతమును ఎల్లగజవదనంబు బాగైన తొండంబు కడుపుగలుగు
బోడైన మూషికము సొరదినెక్కాడుచు భవ్యముగ దేవగణపతికినిపుడు
జయమంగళం నిత్య శుభమంగళం...........

చెంగల్వ చామంతి చెలరేగి గన్నేరు తామర తంగేడు తరచుగాను
పుష్పజాతూ దెచ్చి పూజింతు నేనిపుడు బహుబుద్ధీ గణపతికి బాగుగాన
జయమంగళం నిత్య శుభమంగళం...........

Monday, September 6, 2010

వరలక్ష్మీ వ్రతం -- 2010








వరలక్ష్మీ వ్రతం 2010

వరలక్ష్మీ దేవిని వరాల తల్లిగా పూజించడం సర్వ సహజం.
ఐశ్వర్యాలకు అధిష్టాన దేవతైన లక్ష్మీదేవిని ప్రత్యేకించి శ్రావణమాసంలో పూజిస్తారు.
శ్రావణమాసంలో పౌర్ణమికి ముందువచ్చే శుక్రవారంనాడు వరలక్ష్మీవ్రతం జరుపుకొంటారు.
లక్ష్మీదేవి ఆసనం కమలం. అందుకే ఆ తల్లిని "కమలాసని" అనికూడ పిలుస్తారు.
విష్ణుమూర్తికి వామాంగంలో స్థానం పొందిన లక్ష్మీదేవి వ్రతం ఎంతో ప్రాముఖ్యమైనది.
ఈ వ్రతంలో తోరపూజ ప్రధానమైనది.తోరాన్ని కుడిచేతి మణికట్టు వద్ద
కట్టుకొని ఆ వరాల తల్లిని పూజిస్తారు.

ఈ తల్లికి అష్టలక్ష్ములు :-- అని పేర్లు కలవు.

ఆదిలక్ష్మీ--ధాన్యలక్ష్మీ--గజలక్ష్మీ--సంతానలక్ష్మీ--

ధనలక్ష్మీ--ధైర్యలక్ష్మీ--విద్యాలక్ష్మీ--విజయలక్ష్మీ ....

లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం

శ్రీమన్మందకటాక్ష లబ్ధ విభవబ్రహ్మేద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం


శుద్ధ లక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీస్సరస్వతీ
శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ పసన్నా మమ సర్వదా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

శ్రీ మహాలక్ష్మీ స్తోత్రం:

జయ పద్మ విశాలాక్షి జయత్వం శ్రీపతిప్రియే
జయ మాత ర్మహలక్ష్మి సంసారార్ణవ తారిణీ

మహాలక్ష్మీ నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వరీ
హరిప్రియే నమస్తుభ్యం దయానిధే

పద్మాలయే నమస్తుభ్యం నమస్తుభ్యం చ సర్వదే
సర్వభూత హితార్థాయ వసువృష్టిం సదాకురు

జగన్నాత ర్నమస్తుభ్యం నమస్తుభ్యం దయానిధే
దయావతి నమస్తుభ్యం విశ్వేశ్వరి నమోస్తుతే

నమః క్షీరార్ణవసుతే నమ స్తైలోక్యధారిణీ
వసువృష్టే నమస్తుభ్యం రక్ష మాం శరణాగతమ్

రక్ష త్వం దేవదేవేశి దేవదేవస్య వల్లభే
దరిద్రం త్రామిహం లక్ష్మీ కృపాం కురు మయోపరి

సమస్త్రైలోక్య జననీ నమ స్తుభ్యం జగద్దితే
అర్తిహంత్రి నమ స్తుభ్యం సమృద్దిం కురు మే సదా

అబ్జవాసే నమ స్తుభ్యం చపలాయై నమో నమః
చంచలాయై నమ స్తుభ్యం లలితాయై నమో నమః

నమః ప్రద్యుమ్న జననీ మాతస్తుభ్యం నమో నమః
పరిపాలయ మాం మాతః మాం తుభ్యం శరణాగతమ్

శరణ్యే త్వాం ప్రసన్నో 2 స్మి కమలే కమలాలయే
త్రాహి త్రాహి మహాలక్ష్మి పరిత్రాణ పరాయణే

పాండిత్యం శోభతే నైవ నశోభంతి గుణా కరే
శీలత్వం నైవ శోభతే మహాలక్ష్మీ త్వయా వినా

తావ ద్విరాజతే రూపం తావ చ్చీలం విరాజతే
తావద్గుణా నరణాం చ యావ ల్లక్ష్మీః ప్రసీదతి

లక్ష్మిత్వయాలంకృత మానవా యే
పాపై ర్విముక్తా నృపలోక మాన్యాః

గుణై ర్విహీనా గుణినో భవంతి
దుశ్శీలనః శీలవతాం పఠిష్టః

లక్ష్మీ ర్భూషయతే రూపం లక్ష్మీ ర్భూషయతే కులమ్
లక్ష్మీ ర్భూషయతే విద్యాం సర్వా లక్ష్మీ ర్విశిష్యతే

లక్ష్మీ త్వద్గుణ కీర్తనేన కమలా భూర్గ్యాత్యలం జిహ్మాతాం
రుద్రాద్యా రవిచంద్ర దేవపతయా వక్తుంచ నైవ క్ష్మాః

అస్మాభి స్తవ రూప లక్షణ గుణాన్వక్తుం కథం శకృతే
మాత ర్మాం పరిపాహి విశ్వజననీ కృత్వా మహేష్టం ధ్రువమ్

దీనార్తి భీతం భ్వతాప పీడితాం ధనై ర్విహీనం తవ పార్శ్వ మాగతమ్
కృపానిధిత్వా న్మను లక్శ్మి నత్వరం ధనప్రదానాద్దననాయకం కురు

మాం విలోక్య జననీ హరిప్రియే నిర్దనం తవ సమీప మాగతమ్
దేహి మే ఝుడతి లక్ష్మీ కరాంబుజం వస్త్ర కాంచన వరాన్న మద్బుతమ్

త్వమేవ జననీ లక్ష్మీ పితా లక్ష్మీ త్వమేవ చ
భ్రాతా త్వం చ సభా లక్ష్మీ విద్యా లక్ష్మీ త్వమేవచ

త్రాహి త్రాహి మహాలక్ష్మి త్రాహి త్రాహి సురేశ్వరి
త్రాహి త్రాహి జగన్మాతః దారిద్ర్యా త్యాపి వేగతః

నమస్తుభ్యం జగద్దాత్రి నమ స్తుభ్యం నమో నమః
ధర్మాధారే నమ స్తుభ్యం నమ సాంపత్తి దాయినీ

దారిద్ర్యార్ణవ మగ్నో - హం నిమగ్నో -హం రసాతలే
మజ్జంతం మాం కరే ధృత్వా తూద్దర త్వం రమే ద్రుతమ్

కిం లక్ష్మి బహునోక్తేన జల్పితేన పునః పునః
అనన్యే శరణం నాస్తి సత్యం సత్యం హరిప్రియే

ఏత చ్చ్రుత్వాగస్థ్యైవాక్యం హృష్యమాణా హరిప్రియా
ఉవా చ మధురాం వాణీం తుష్టాహం తవ సర్వదా

య త్త్వ యోక్త మిదం స్తోత్రం యః పఠిష్యతి మానవః
శృణోతి చ మహాభాగః తస్యాహం పశవర్తినీ

నిత్యం పఠతి యో భక్త్యా త్వలక్ష్మీ స్తస్య నశ్యతి
ఋణం చ నశ్యతే తీవ్రం వియోగం నైవ పశ్యతి

యః పఠే త్ప్రాత రుత్థాయ శ్రద్దా భక్తి సమన్వితః
గృహే త్స్య సదా తుష్టా నిత్యం శ్రీః పతినా సహ

పుత్త్రవాన్ గుణవాన్ శ్రేష్ఠో భోగభక్తా చ మానవః
ఇదం స్తోత్రం మహా పుణ్యం లక్ష్మ్యాగస్థ్య ప్రకీర్తితమ్
విష్ణు ప్రసాద జననం చతుర్వర్గ ఫలప్రదమ్

రాజద్వారే జయశ్చైవ శత్రో పరాజయః
భూత ప్రేత పిశాచినాం వ్యాఘ్రాణాం న భయం తథా

న శస్త్రానల తోయౌఘా ద్బయం తస్య ప్రజాయతే
దుర్వృత్తానాం చ పాపానం బహు హానికరం పరమ్

మందురా కరిశలాసు గవాం గోష్ఠే సమాహితః
పఠే త్తద్దోష శాంత్యర్థం మహా పాతక నాశనమ్

సర్వ సౌఖ్యకరం నౄణా మాయు రారోగ్యదం తథా
అగస్త్య మునిన ప్రోక్తం ప్రజానాం హిత కామ్యయా