Saturday, October 13, 2007

శ్రీ కనకధార స్తోత్రంKanakadhara Stotram
!! లక్ష్మీ కటాక్ష రహాస్యం!!

ఆదిశంకర భగవత్పాదులు ఎనిమిదేళ్ళవయసులో
వటువుగా భిక్షాటనకు వెళ్ళినప్పుడు,ఒక పేదరాలైన సాధ్వి
వాత్సల్యభావంతో ఆయనకు భిక్ష వేయాలనుకొండి. కాని,అతి
పేదరికంలో వున్న ఆమె వద్ద ఏ వస్తువులేకపోవడంతో,
ఇల్లంతా వెతికి ఒక ఉసిరిక లభిస్తే దానిని తీసుకొనివచ్చి,
వాత్సల్యముతో ఆ మహాత్ముని భిక్షపాత్రలో వేసింది.
ఆమె వితరణ దౄష్టికి సంతోషించి,ఆ వాత్సల్య భావానికి
ముగ్ధులై ఆదిశంకరులు ఆ తల్లికి లక్ష్మీ అనుగ్రహం కలగాలని కోరుతూ
ఈ " కనకధారాస్తోత్రాన్ని " పలికారు.శంకరాచార్యుల కారుణ్యానికి
ఇది నిదర్శనం.ఈ శ్లోకాలలో లక్ష్మీశక్తి అవిష్కరించే అక్షరశక్తి వుంది.
దీనిని శ్రధాభక్తులతో పారాయణం చేస్తే తప్పకుండా ఐశ్వర్యం లభిస్తుంది.
ఆదిశంకరులు ఈ స్తోత్రాన్ని చేసిన వేంటనే మహాలక్ష్మీ ప్రత్యక్షమై,ఆ
పేదరాలి ఇంట కనకవర్షాన్ని కురిపించింది. ఇదే లక్ష్మీ కటాక్ష రహాస్యం.


రచించిన వారు ::పురాణపండ రాధాక్రిష్ణమూర్తి !!

One day in the sacred Rishi tradition Bhagvadpada Sri Adi Sankarachrya went to one old woman's house for alms (biksha).
She was so poor, she was not having a proper dress and anything worth the name to give as biksha. So with the entrance door of her house slightly ajar, she reached out swamiji with her hand stretched and dropped one amlaka fruit (which was the only thing available in her house) into the hands of Sri Sankaracharya.
Sri Sankaracharya was deeply touched at the plight and haplessness of the woman - So he chanted Kanakadharaa stotram and prayed Goddess Lakshmi to extend Her Grace on the woman. The giver of wealth Goddess Lakshmi showered as rain - Golden Amlaka fruits in the house of the old woman.
This Stotram has been acclaimed as Kanaka Dharaa Stavam - and it is sure to bless all devotees who extol Sri Devi with all unflinching devotion


1)అంగం హరేః పులక భూషణమాశ్రయంతీ
భృంగాంగనేన్వ మకులాభరణం తమాలమ్
అంగీకృతాఖిలవిభూతి రపాంగలీలా
మాంగల్యదాస్తు మమ మంగళదేవతాయాః

2)ముగ్ధా మహుర్విదధతీ వదనే మురారేః
ప్రేమత్రపాప్రణిహితాని గతాగతాని
మాలా దృశోర్మధికరీవ మహోత్పలేయా
సామే శ్రితం దిశతు సాగరసంభవాయా

3)విశ్వామరేంద్రపదవిభ్రమదానదక్ష
మానందహేతురధికం మురవిద్విషోపి
ఈషన్ని షీదతు మయి క్షణమీక్షణార్థం
ఇందివరోదర సహోదర మిందిరాయాః

4)అమీలితాక్షమధీగమ్య ముదా ముకుంద
మానందకంమనిమేషమనంగతంత్రం
అకేకర్స్థికకనీనిక పక్ష్మనేత్రం
భూత్యీభవేన్మ భుజంగశయాంగనాయాః

5)కాలాంబుదాలిలతిరసి కైటభారేః
ధారాధరే స్పురతి యా తటిదంగనేవ
మాతుః సమస్తజగతాం మహనీయ మూర్తిః
భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః

6)బాహ్వాంతరే మురజితః శ్రితకౌస్తుభేయా
హారావలీవ హరినీలమయీ విభాతి..
కామప్రదా భగవతో పి కటాక్షమాలా
కల్యాణమావహతు మే కమలాలయాయాః

7)ప్రాప్తం పదం ప్రథమతః కిల యత్ప్రభావాత్
మాంగల్యభాజి మధి మాథిని మన్మదేన
మయ్యాపత్తేతదీహ మంథరమీక్షణార్దం
మందాలసంచ మకరాలయ కన్యకాయాః

8)దద్యాద్దయనుపవనో ద్రవిణాంబుధారా
మస్మిన్నకించన విహంగశిశౌ విషణ్ణే
దుష్కర్మమపనీయ చీరాయ దూరం
నారాయణ ప్రణయినీనయనాం బువాహః

9)ఇష్టా విశిష్టమతయో పి యయా దయార్ద్ర
దృష్టా త్రివిష్ట పపదం సులభం లభంతే
దృష్టః ప్రహృష్టకమలో దర దిప్తీ రిష్టాం
పుష్టిం కృపీష్ట మమ పుష్కరవిష్టరాయాః

10)గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి
శాకంభరీతి శశిశేఖర వలల్భేతి
సృష్టి స్థితి ప్రళయ కేళిషు సంస్థితా యా
తస్యై నమస్త్రి భువనైక గురోస్తరుణ్యై

11)శ్రుత్యై నమోస్తు శుభ కర్మ ఫలప్రసూత్యై
రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై
శక్యై నమోస్తు శతపత్రనికేతనాయై
పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై

12)నమోస్తు నాళీక నిభాననాయై
నమోస్తు దుగ్దోదధిజన్మభూమ్యై
నమోస్తు సోమామృతసోదరాయై
నమోస్తు నారాయణవల్లభాయై

13)సంతర్కాణి సక్లేంద్రీయనందనాని
సామ్రాజ్యదాన విభవాని సరోరుహాక్షి
త్వద్వనాని దురితాహరణోద్యతాని
మామేవ మాతరనిశ్మ్ కలయంతు మాన్యే

14)యత్కాటాక్షసముపాసనా విధిః
సేవకస్య సకలార్థ సంపదః
సంతనోతి వచనాంగమానసై
స్త్వాం మురారి హృదయేశ్వరీం భజే

15)సరసిజనిలయే సరోజ హస్తే
ధవళతమాంకుశ గంధమాల్యశోభే
భగవతి హరి వల్లభే మనోజ్ఞే
త్రిభువనభూతికరి ప్రసీద మహ్యమ్

16)దిగ్ఘస్తిభిః కనకకుంభ ముఖావసృష్ట
స్వర్వాహినీ విమలచారు ప్లుతాంగీమ్
ప్రాతర్నమామి జగతాం జననీ మశేష
లోకాధినాథ గృహిణీ మమఋతాబ్ధిపుత్రీమ్

17)కమలే కమలాక్ష వల్లభ్యే త్వం
కరుణా పూరతరంగితైరపాంగైః
అవలోకయ మామకించనానాం
ప్రథమం పాత్రమకృతిం దయాయాః

18)స్తువంతి యే స్తుతిభిరమూభిర న్వహం
త్ర్యీమయీం త్రభువనమాతరం రమాం
గుణాధికా గురుతరభాగ్యభాగినో
భవంతి భువి భుధభావితాశయాః!!!

శ్రీ శంకరభగవత్పాదవిరచితం కనకధార స్తోత్రం !!!!

No comments: