Wednesday, May 23, 2012

ఓం నమః శివాయ




















బ్రహ్మ దేవుడు సృష్టిని చేయడానికి ప్రారంభించే ముందు శివుని గురించి తపస్సు చేసారు.
అప్పుడు ప్రత్యక్షమైన శివ రూపాన్ని చూసి బ్రహ్మ దేవుడు ఆశ్చర్య చికుతుడు అయ్యారు.
ఈశ్వరునిలో సగ భాగం పురుష రూపంతో,
సగ భాగం స్త్రీ రూపంతో దర్శనమిస్తూ,
ఒకే రూపంలో రెండు వేరు వేరు తత్త్వాలు గోచరించాయి.
అదే అర్ధనారేశ్వర తత్త్వం.
అప్పుడు బ్రహ్మదేవునికి విషయం బోధ పడింది.
తాను చేయుబోతున్న సృష్టికి స్త్రీ, పురుషులుగా విడి పొమ్మని, జగతః పితరులను ప్రార్ధించారు.
బ్రహ్మ ప్రార్ధనని మన్నించిన శివుడు తనలోని పురుషతత్వాన్ని నరునిగా,
స్త్రీ తత్వాన్ని ప్రకృతిగా అనుగ్రహించారు.
అలా దర్శనమిచ్చిన ఆది దంపతులైన శివ పార్వతులే, ఈ సృష్టికి కారకులు.
ఓం నమః శివాయ...పార్వతి పతయే హర హర మహా దేవ!!

No comments: