Thursday, May 10, 2012

నిత్య పూజా విధానము

















ఓమ్ శ్రీమాత్రేనమః

పూజా విధానము

1}:::ధ్యానమ్::

1}మహా దేవ నమస్తుభ్యం
సర్వకామార్థ సిద్దయే
ప్రసాదా త్తవ నిర్విఘ్నం
భవతా దిద మర్చనమ్
ధ్యానం సమర్ఫయామి ||

2}:::ఆవాహనమ్::

2}పరమేశ దయాసింధో
భవసమ్తాప వారక
స్వాగతం తే మహా దేవ
ఇహగచ్ఛ ప్రియంకర
ఆవాహనం సమర్పయామి||

3}:::ఆసనమ్::

3}మణిస్థగిత మాసనమ్
కల్పితం తే మహాదేవ
అధిరోహ స్థిరో భవ
ఆసనం స్మర్పయామి||

4}:::పాద్యమ్::

4}పాద ప్రక్షాళనాయ తే
భక్త్యార్పితం మహాదేవ,
కృపయా ప్రతి గృహ్యతామ్
పాదయోః పాద్యం సమర్పయామి.||

5}:::ఆర్ఘ్యమ్::

5}సర్వతీర్థాంబు దీయతే
ఆర్ఘ్య రూపేణ ద్జేవేశ
స్వికురుష్వ కృపాకర
ఆర్ఘ్య్యం సమర్పయామి||

6}:::ఆచమనమ్::

6}గంగాది సర్వతీర్థే భ్యో
భక్త్యా సంపాదితం పయః
పూర్వ మాచమనం కృత్వా విశుద్దో భవ పావన
ఆచమనీయం సమర్పయామి||

7}:::మధుపర్కమ్::

7}దధ్నా మధు చ సంయుజ్య
అనీతం ప్రీతి దాయకమ్
మధుపర్కం గృహాణేదం,
దేవ సర్వ శుభంకర
మధుపర్కం సమర్పయామి||

8}:::పంచామృత స్నానమ్:::

8}మధ్వాజ్య దధి సంయుక్తం,
శర్కరా క్షీర సంయుతమ్
పంచామృతం సమానీతం,
నారికేళాంబు స్నాయతామ్
పంచాంమృత స్నానం సమర్పయామి||

9}:::శుద్ధోదక స్నానమ్:::

9}గంగాది సర్వ తీర్థే భ్య
స్సమానీతం శుభం జలమ్
స్నానార్థం తవ సద్బక్త్యా:
స్నాతు మర్హసి పావన!
శుద్దోదక స్నానం సమర్పయామి||

10}:::వస్త్రమ్:::

10}వస్త్రద్వయం దశాయుక్తం
స్వర్నతంతు వినిర్మితమ్
అచ్ఛాదనాయ తే దత్తం
దేవ దేవ ప్రగృహ్యతామ్
వస్త్రయుగ్మం సమర్పయామి

11}:::ఉపవీతమ్:::

11}త్రివృతం వేదపాఠస్య
దీక్షాగంభ ప్రసూచకమ్
యజ్ఞసూత్రం గృహాణేదం
వృద్దికృత్తేజ ఆయుషు
యజ్ఞో పవీతం సమర్పయామి||

12}:::సింధూరమ్:::

12}సింధూరం ధాతు నిష్పన్నం
రక్తం శోభా వివర్ధకమ్
గృహ్యతాం దేవదేవేశ
గ్రహారిష్ట నివారకమ్
సింధూర లేపనం సమర్పయామి||

13}:::గంధమ్:::

13}చందనం సీతలం దివ్యం
పాటిరేణ సుగంధితమ్
విలేపనాయ తే దత్తం
దేవ తాప నివాకరమ్
దివ్యశ్రీ చందనం సమర్పయామి||

14}:::అక్షతలు:::

14}గంధస్యోపరి దేవేశ
అలంకారార్థ మర్పితా.
శాలీయా నక్షతాన్ దివ్యాన్
స్వికురుష్య సురోత్తమ
గంధస్యోపరి అలంకరణార్థం
హరిద్రాక్షతా సమర్పయామి||

15}:::పుష్పమ్:::

15}కుందమందార పద్మాని
చంపకా శోక మాలతీ
సువర్ణాని చ పుష్పాణి
ప్రదత్తాని ప్రగృహ్యతామ్
పుష్పం సమర్పయామి||

16}:::దూపం:::

16}వనస్పత్యుద్భవం దివ్యం
నానా గంథైస్సు సంయుతమ్
దాస్యామి గుగ్గులం ధూపం
భక్త్యా తే ప్రతి గృహ్యతామ్
ధూప మా ఘ్రాపయామి||

17}:::దీపమ్:::

17}వర్తి త్రయాత్మకం దీపం
ఘృతం పూరణం స్వలంకృతమ్
వహ్నినా యోజితం దేవ
దీయతే జ్ఞాన నాశకమ్
దీపం దర్శయామి||

18}:::నైవేద్యమ్:::

18}కదళీ నారికేళాది
ఫల యజ్మధురం శుచి
చతుర్విధాన్న సంయుక్తం
నైవేద్యం దేవ భుజ్యతామ్
నైవేద్యం సమర్పయామి||

19}:::శుద్దాచమనియమ్:::

19}పాణీ పాదౌ చప్రక్షాళ్య
సుస్థితాయ శుభాయ తే
ఉత్తరాచమనం దేత్తం
స్వీకురుష్వాఘ నాశన||

20}:::తాంబూలమ్:::

20}నాగవల్లీ దళోపేతా
ముక్తా చూర్ణ సమన్వితా
కర్పూర వీటికా దేవ
దీయతే చర్వనం కురు
తాంబూలం సమర్పయామి||

21}:::నీరాజనమ్:::

21}తిమిర నాశనము
నీరాజనం గృహాణేదం
కర్పూర జ్యోతి సంయుతమ్
ఆనంద మహాదేవ
అజ్ఞాన తిమి రావహమ్
నీరాజనం సమర్పయామి||

{{{ పూజా విధానము సంపూర్ణం }}}

No comments: