Sunday, May 13, 2012

సహస్ర రామ నామ పారాయణం























సహస్ర రామ నామ పారాయణం

శ్రీరామరామరామ శ్రీరామరామరామ శ్రీరామరామరామ శ్రీరామరామరామ!!శ్రీ!!
శ్రీరామరామరామ శ్రీరామరామరామ శ్రీరామరామరామ శ్రీరామరామరామ!!శ్రీ!!

౧. పార్వతిదేవికి పరమేశ్వరుడిటు పల్కెను నామసహస్రతుల్యమని
ఉర్విని శ్రీరామరామయన సర్వులు ముక్తులె సత్యము సుమ్మని!!శ్రీ!!

౨.కలియుగమందున ఖలులందరకును కామధేనువే రామనామం
సులలితంబగు మోక్షసాధనకు సూక్ష్మమార్గమీ రామనామం!!శ్రీ!!

౩.అండపిండ బ్రహ్మాండములన్నిటి కాధారము శ్రీరామనామం
అండజవాహన హరగుగేశమార్తాండాంబికలు రామనామం !!శ్రీ!!

౪.పరమాత్ముండని భగవంతుడని బహురూపుండని ప్రాకృతుడనియును
పరిపూర్ణుండని పరమేశ్వరుడని పలుకబడునుశ్రీరామనామం!!శ్రీ!!

౫.నిర్గుణుడని మరి నీరూపుండని నిత్యసత్యుడని నిర్మలుడనియును
సద్గుణుడనియును సర్వమాతడని సర్వులనిడిదే రామనామం!!శ్రీ!!

౬.పుంస్త్రీక్లీ బాద్యఖిలలింగముల పూరించినదీ రామనామం
శాస్త్రములన్నియు సాధించిన సద్వస్తువు శ్రీరామనామం!!శ్రీ!!

౭.బ్రహ్మాదులు భూభారము బాపగ ప్రార్ధించినదీ రామనామం
అంహోంతకుడౌ దశరధసుతుడై యవతరించినది రామనామం!!శ్రీ!!

౮.భరతాదులతో బాలక్రీడల పాటించినదీ రామనామం
గురుసన్నిది వేదాదుల నేర్చిన పరమాత్మయే శ్రీరామనామం!!శ్రీ!!

౯.కౌశికమధుపాలనకైతాటక కావరమణచిన రామనామం
పిశితాశుల మారీచ సుబాహుల పీచమడంచిన రామనామం!!శ్రీ!!

౧౦.రాతిని పదమున నాతినిజేసిన రమ్యమైన శ్రీరామనామం
ఆతీరున గుహునాదరించి మొర యాలించినదీ రామనామం!!శ్రీ!!

౧౧.జనకసభను హరుధనువును విరచిన శౌర్యయే ఈ శ్రీరామనామం
జానకివైచిన మాలధరించిన జగన్మోహనము రామనామం!!శ్రీ!!

౧౨.సీతాకళ్యాణముచే జగతికి ప్రీతికి ప్రీతిని జేసిన రామనామం
నాతితో సాకేతంబున భక్తుల నాదరించినదీ రామనామం!!శ్రీ!!

౧౩.దుష్టరావణాదులగూల్చిన మన ఇష్టదైవమీ రామనామం
శిష్టరక్షణముజేయుచు భూమికి తుష్టి గూర్చినదీ రామనామం!!శ్రీ!!

౧౪.కృష్ణలంకలో చిత్రకూటమున కూర్చున్నది శ్రీరామనామం
కృష్ణాదుర్గా రామనామముల నిష్ణాతము శ్రీరామనామం!!శ్రీ!!

౧౬.నమ్మిన శ్రీములుకుట్ల నరసింహునిలో నాట్యము చేసిన రామనామం
కమ్మగ శ్రీరామరామరామయన కరుణించును శ్రీరామనామం!!శ్రీ!!

(*)(*)(*)(*)(*)(*)(*)(*)(*)(*)(*)(*)(*)(*)(*)(*)(*)(*)(*)(*)(*)(*)(*)(*)

*****sahasra raama naama paaraayaNaM*****

Sreeraamaraamaraama Sreeraamaraamaraama Sreeraamaraamaraama Sreeraamaraamaraama!!Sree!!
Sreeraamaraamaraama Sreeraamaraamaraama Sreeraamaraamaraama Sreeraamaraamaraama!!Sree!!

~1. paarvatidaeviki paramaeSvaruDiTu palkenu naamasahasratulyamani
urvini Sreeraamaraamayana sarvulu muktule satyamu summani!!Sree!!

~2.kaliyugamaMduna khalulaMdarakunu kaamadhaenuvae raamanaamaM
sulalitaMbagu mOkshasaadhanaku sookshmamaargamee raamanaamaM!!Sree!!

~3.aMDapiMDa brahmaaMDamulanniTi kaadhaaramu SreeraamanaamaM
aMDajavaahana haragugaeSamaartaaMDaaMbikalu raamanaamaM !!Sree!!

~4.paramaatmuMDani bhagavaMtuDani bahuroopuMDani praakRtuDaniyunu
paripoorNuMDani paramaeSvaruDani palukabaDunuSreeraamanaamaM!!Sree!!

~5.nirguNuDani mari neeroopuMDani nityasatyuDani nirmaluDaniyunu
sadguNuDaniyunu sarvamaataDani sarvulaniDidae raamanaamaM!!Sree!!

~6.puMstreeklee baadyakhilaliMgamula pooriMchinadee raamanaamaM
Saastramulanniyu saadhiMchina sadvastuvu SreeraamanaamaM!!Sree!!

~7.brahmaadulu bhoobhaaramu baapaga praardhiMchinadee raamanaamaM
aMhOMtakuDau daSaradhasutuDai yavatariMchinadi raamanaamaM!!Sree!!

~8.bharataadulatO baalakreeDala paaTiMchinadee raamanaamaM
gurusannidi vaedaadula naerchina paramaatmayae SreeraamanaamaM!!Sree!!

~9.kauSikamadhupaalanakaitaaTaka kaavaramaNachina raamanaamaM
piSitaaSula maareecha subaahula peechamaDaMchina raamanaamaM!!Sree!!

~1~0.raatini padamuna naatinijaesina ramyamaina SreeraamanaamaM
aateeruna guhunaadariMchi mora yaaliMchinadee raamanaamaM!!Sree!!

~1~1.janakasabhanu harudhanuvunu virachina Sauryayae ee SreeraamanaamaM
jaanakivaichina maaladhariMchina jaganmOhanamu raamanaamaM!!Sree!!

~1~2.seetaakaLyaaNamuchae jagatiki preetiki preetini jaesina raamanaamaM
naatitO saakaetaMbuna bhaktula naadariMchinadee raamanaamaM!!Sree!!

~1~3.dushTaraavaNaadulagoolchina mana ishTadaivamee raamanaamaM
SishTarakshaNamujaeyuchu bhoomiki tushTi goorchinadee raamanaamaM!!Sree!!

~1~4.kRshNalaMkalO chitrakooTamuna koorchunnadi SreeraamanaamaM
kRshNaadurgaa raamanaamamula nishNaatamu SreeraamanaamaM!!Sree!!

~1~6.nammina SreemulukuTla narasiMhunilO naaTyamu chaesina raamanaamaM
kammaga Sreeraamaraamaraamayana karuNiMchunu SreeraamanaamaM!!Sree!!

No comments: