Song By::Anuradha Krishnamoorti
పాశురము -- 3
ఓంగి యులగళన్ద ఉత్తమన్ పేర్పాడి
నాంగళ్ నమ్బావైక్కు చ్చాట్రి నీరాడినాల్
తీంగన్రి నాడెల్లామ్ తింగళ్ ముమ్మూరి పెయ్ దు
ఓంగు పెరుమ్ శెన్నెల్ ఊడు కయలుగళ
పూంగువళై పోదిల్ పొరివణ్డు కణ్పడుప్ప
తేంగాదే పుక్కిరున్దు శీర్ త్తములై పట్రి
వాంగక్కుడమ్ నిరైక్కుమ్ వళ్ళల్ పెరుమ్బశుక్కళ్
నీంగాదశెల్వమ్ నిరైన్దేలో రెమ్బావాయ్.
Thiruppavai in English::
Ongi ulagalanda uthaman per paadi
Naangal nam paavaiku chaatri neeradinaal
Theenginri nadellaam thingal mummaari peidu
Ongu peru sennal oodu kayal ugala
Poomkuvalai-p-podhil porivandu kannpaduppa
Thengaade pukkirundu seertha mulai patri
Vaanga-k-kudam niraikkum vallal perum pasukkal
Neengade selvam niraindhu-el or em paavaai.
Thiruppavai in Tamil 3 (திருப்பாவை தமிழில்)
3)ஓங்கி உலகளந்த உத்தமன் பேர்பாடி
நாங்கள் நம் பாவைக்குச் சாற்றி நீராடினால்
தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாரி பெய்து
ஓங்கு பெறும்செந் நெல்ஊடு கயலுகளப்
பூங்குவளைப் போதில் பொறி வண்டு கண் படுப்பத்
தேங்காதே புக்கிருந்து சீர்த்த முலைபற்றி
வாங்க* குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள்
நீங்காத செல்வம் நிறைந்தேலோர் எம்பாவாய்.
తాత్పర్యము::బలిచక్రవర్తి ఇచ్చిన దానము నంది ఆకాసమువరకు పెరిగి మూడు లోకములను తన పాదములసు కొలిచిన పురుషోత్తముడగు పరందాముని దివ్యగానమును పాడి మేము మా వ్రతము అను మిషతో స్నానము చేయగానే దేశమంతయు నెలకు మూడు వానలు పడి ఈతి బాధలు లేక సుఖముగా ఉండవలెను. ఆకాశము వరకు పెరిగిన వరిచేలలో చేపలు త్రుళ్ళిపడుచుండగా, కలువపూలులో మనోహరములగు తుమ్మెదలు నిద్రపోతుండగా, సస్యములు సమ్రుద్దిగా ఉండవలెను. పాలు పితుకుటకు కొట్టములొ దూరి స్థిరముగా కూర్చొని పొదుగునంటగానే పాలు కుండలు నిండునట్లు చేపు సమౄద్దిగా గోవులకు ఉండవలెను. లేదు అనే శబ్ధము లేని సంపద దేశమంతా నిండవలెను.
అని మూడవ పాశురము
అర్ధము::అయితే గోపికలు ఈ వ్రతము చేయుట వల్ల ఎటువంటి ఫలితాలు పొందుదురో తెలిపారు . ఈ రోజు మన అమ్మ (ఆండాళ్) శ్రీ పరందాముని వామన అవతారము ను కొలచింధి. ఆ పురుషోత్తముడు ఒకసారి చేపవలే , మరోసారి తాబేలుగా, మరొకమారు వరాహమూర్థిగా, ఇంకోసారి నరసిం హముగా , మరొకమారు పరిపూర్ణ మానవ మూర్థిగా అవతరించి మనలను నిరంతరమూ కాపాడుచున్నడు.
భగవంథుడు సర్వ వ్యాప్థి అని చెప్పుటకు ఈ విధముగా చెప్పినధి అమ్మ. భగవంతుడు ఎంతగా ఎదిగాడంటె బ్రహ్మ కడిగిన మొదటి పాదము , బలిచక్రవర్థి కడిగిన రెండో పాదము ఒకసారె చేరాయి . అంటె ఆయన సర్వ వ్యాప్తము అని తెలిసింధి. ఈ విధముగా వున్న స్వామి బలిచక్రవర్థి తలమీద ముడోపాదాన్ని మోపి బలికి రసా తలమును ప్రసాధించారు. ఇది అంతా నారాయణ తత్వముగా అమ్మ వివరించింధి.
లోకము సుఖముగా వుండుటకు ఈ వ్రతము మంచిదని వివరించింధి. మూడు కాలాలు వానలు కురిసి పంటలు బాగాపండి . గోవులు పాలు చెపుముట్టుకొనగానే పాలతో కుండలు నిండిపోవాలని . మన దేశము సస్య స్యామలముగా వుండాలని గోపికలతో వివరించింధి.
గోపికలు ఏకొరికా లేక దేశము సౌభాగ్యము వంకతో ఈ వ్రతముతో శ్రీ కృష్ణుని సేవ చెసుకొని వారి జీవితము దన్యత
చే కూర్చుకోవలె అని ఫలము కోరుతూ ఈ వ్రతము చెయుటకు నిర్నయించుకొనిరి .
ఈ పాశురములో చెప్పిధి ఎమిటంటే ఈ వ్రతము చెయుట వలన బాహ్యముగా సస్య సమృద్ధి ని కలిగించును. అంతరంగమున ఆత్మ ఙాన పరిపూర్తిని ఆచార్య సమృద్ధిని ప్రసాధించును.
No comments:
Post a Comment