Monday, December 19, 2011

తిరుప్పావై--5



















5)మాయనై మన్ను వడమదురై మైందనై
తూయ పెరునీర్ యమునైత్తుఱైవనై
ఆయర్ కులత్తినిల్ తోంఱుం అణి విళక్కై
తాయై క్కుడల్ విళక్కం శెయ్ద దామోదరనై
తూయోమాయ్ వందు నాం తూమలర్ తూవి త్తొళుదు
వాయినాల్ పాడి మనత్తినాల్ శిందిక్క
పోయ పిళైయుం పుగుదురువాన్ నిన్ఱనవుం
తీయనిల్ తూశాగుం శేప్పేలోర్ ఎమ్బావాయ్

hiruppavai in English
Pasuram 5.


5)Maayanai mannu vada Madhurai maindhanai
Thuyao-peruneer Yamunai-t-thuraivanai
Aayar kulathinil thonrum mani vilakkai
Thaayai kudal vilakkam seida Dhamodharanai
Thooyomaai vandhu naam thoomalar thoovi-t-thozhudhu
Vaayinaal paadi manatthinaal sendhikka
Poya pizhayum pugutharuvaan ninranavum
Theeyinil thoosaakum seppu-el or empaavaai

Thiruppavai in Tamil (திருப்பாவை தமிழில்)

5)திருப்பாவை பாசுரம் 5. மாயனை
மாயனை மன்னு வடமதுரை மைந்தனைத்
தூய பெருநீர் யமுனைத் துறைவனை
ஆயர் குலத்தினில் தோன்றும் அணிவிளக்கைத்
தாயைக் குடல் விளக்கம் செய்த தாமோதரனைத்
தூயோமாய் வந்துநாம் தூமலர் தூவித் தொழுது
வாயினால் பாடி மனத்தினால் சிந்திக்கப்
போய பிழையும் புகுதருவான் நின்றனவும்
தீயினில் தூசாகும் செப்பேலோர் எம்பாவாய்.

శ్రీకృష్ణ నామ గానంతో సర్వపాపహరణం

మాయగాడై తిరుగుతూ ఉత్తరమధురను కాచునట్టి వాడూ, గోపికలతోగూడి యమునాతీరంలో విహరించేవాడూ, గోకులంలో జన్మించి తల్లి కడుపును పండించినవాడూ, అయిన గోపాలకృష్ణుని మనమందరం మంచి మనస్సుతో సమీపించి, దాసానుదాసులమై పూలతో పూజించుదాం. నోరారా గానంచేస్తూ భక్తిభావంతో ధ్యానిస్తే, ఇటు గతంలో చేసిన పాపాలూ అటు భవిష్యత్తులో రాగల పాపాలు అన్నీ అగ్నికి తగిలిన దూదివలె కాలిపోతాయి. కనుక గోవిందుని కల్యాణ గుణ లీలా విశేషాలను, శ్రీనామాలను గానం చేయటమే ఉత్తమం. ఇదే కదా మన వ్రతం అంటు గోపికలకు ఆండాళ్ విన్నవించుకొంటున్నది .

తాత్పర్యము::ఆశ్చర్యమగు చేష్టలు కలిగిన వాడు, నిత్యము భగవద్ సంబందము గల ఉత్తర దేసమందలి మధురా నగరికి నిర్వాకుడును, పవిత్రమైన జలముగల యమునా నది రేవు తనకు గుర్తుగా కలవాడును, గోపవంసమున ప్రకాశించిన మంగళ దీపము అయిన వాడును, యశోదా మాత చె తాడు తో బంధింపబడిన శ్రీ కృష్ణునికి పవిత్రమైన పుష్పాలతో నమస్కరించి మనసారా కీర్తించి ధ్యానించి మన పూర్వ సంచిత పాపరాసియు . ఆగామి పాపరాసియు , అగ్నిలో పడిన దూది వలె భాస్మమైపోవును. కావున భగవానుని నామాలు పాడుడు.

No comments: