Tuesday, October 22, 2013

కార్తీకమాసము

కార్తీకమాసము

మాసాలలో అత్యంత పవిత్రమైనది కార్తిక మాసము..
శివ కేశవులకిద్దరికీ ప్రీతికరమైనది..ఏంతో మహత్యము కలది..

కార్తీక మాసములో సూర్యుడు తులా సంక్రమణములో నుండగా ఆచరించె స్నాన..దాన..జప..పూజాదులు విశేష పలితాలనిస్తాయి..

సూర్యుడు తులారాశిని ప్రవేశించగానే గంగానది ద్రవ రూపము ధరించి సమస్త నదీ జలాలలోనికి చేరుతుంది..
కాబట్టి ఈ నెలలంతా నదీ స్నానము చేస్తే శరీరము..మనసు రెండూ పవిత్రమవుతాయి..
నదులు దగ్గరలేక పోతే చెరువులో..వాగులో..ఏవీ దగ్గర లేకపోతే కనీసము ఇంటిలోనైనా సూర్యోదయానికి ముందే

 ""గంగేచ యమునే చైన గోదావరి సరస్వతి ! నర్మదే సింధు..కావేరీ జలెస్మిన్ సన్నిధిన్ కురు ""అనే శ్లోకాన్ని 
పఠిస్తూ తలస్నానము చేసి నిర్మల హృదయము తో భగవదారాధన చేయాలి.

కార్తీకమాసము ముప్పై రోజులు పర్వదినాలుగా భావించి నదీ స్నానాలు..వుపవాసాలు..సాయంత్రము కాగానే ఇంటి ముందు దీపాలు వెలిగించటము..
స్త్రీలు దీపాలను నదిలో వదలటము..వనభోజనము చేయటము..వివిధ దానాలను..ముఖ్యముగా దీప దానము..సాలంకృత కన్యాదానము చేయటము మొదలైనవి నిర్వహిస్తారు..

ఈ మాసము లో ఉపనయన దానము..కన్యాదానము చాలా పలితమిస్తుంది..
భక్తి తో సాలంకృత కన్యా దానమిచ్చినట్లు ఐతే అన్ని పాపాలు తొలిగిపోయి పితృదేవతల యొక్క స్తానాన్ని..బ్రహ్మ పదాన్ని పొందుతారంటారు..

దశమి..ఏకాదశి..ద్వాదశి తిధులలో శ్రీమహావిష్ణువును తులసిదళాలతోనూ..కమలపూల తోనూ పూజిస్తే జీవించినన్నాళ్ళూ ధనానికి లోటులేకుండా వుండి..సమస్త సౌఖ్యాలు కలగటముతో పాటు అంత్యమున జన్మరాహిత్యము కలుగుతుందట..

అదేవిధముగ ఆరుద్ర నక్షత్రము రోజున..మాస శివరాత్రినాడు..సోమవారమునాడు..కార్తీక పున్నమి నాడు రుద్రాభిషేకం చేసి..బిల్వదళాలతోనూ..రుద్రాక్షల తోనూ పూజించినవారికి అనంతమైన సౌఖ్యాలతోబాటు అంత్యమున శివసాయుజ్యము పొందుతారని కార్తీకపురాణం చెబుతోంది..


కార్తీకమాసము - పర్వదినములు కార్తీకమాసమంతా స్నానాలు..ఉపవాసాలు..దీపదానాలు..పూజలూ..వ్రతాలూనూ..ఏపూజకాపుజే విశిష్టమైనది..

కాని నాకు అన్నిటిలోకి కార్తీక పౌర్ణమి అందరికీ చాలా ఇష్టము..సోమవారనాడు..కార్తీకపుర్ణిమ నాడు ఉపవాసాము చేయటము అందరికీ  అలవాటు..

ఆ రోజు ఉదయమంతా ఉపవాసముండి..సాయంకాలము భోజనము చేసేవాళ్ళు..ఉన్నారు..
అలాగే కార్తీకపౌర్ణమి దుర్గా మాత గుడి కి వెళ్ళి..స్త్రీలు దీపాలు వెలిగించి..దేవిణ్ణి ప్రార్తించుట మన సంప్రదాయం..
ప్రతి రోజు దేవునికి దీపము వెలిగించలేని వారు..

ఈ రోజు 365 వత్తులను ఆవునేయితో ఏఏదైనా దేవాలయములో..వీలుకాకపోతె ఇంటిలో దేవుని వద్ద వెలిగిస్తే రోజూ వెలిగించిన ఫలము వస్తుంది అంటారు..


ఈ మాసములోని పర్వదినాలలో శుక్లపక్ష ద్వాదశి రోజున చేసే క్షీరాభ్ధిద్వాదశి పూజ ప్రధానమైనది..ఈ రోజున కృతయుగములో దేవతలు..రాక్షసులు కలిసి క్షీరసాగరాన్ని మధించిన రోజు కనుక క్షీరాభ్ధిద్వాదశి అని పేరు..క్షీరసాగరము లోనుండి వచ్చిన మహాలక్ష్మిని ఈ రోజు శ్రీమహావిష్ణువు వివాహమాడాడు.. అందుకని ఈ రోజు శ్రీమహావిష్ణువు..శ్రీ మహాలక్ష్మిల కల్యాణము చేస్తారు..ఎప్పుడూ క్షీరసాగరములో శయనించే విష్ణువు ఈ రోజున మహాలక్ష్మి తో పాటు బృందావనానికి వస్తాడని అంటారు..అందుకే ఈ రోజు తులసి మొక్క వద్ద..ఈ కార్తీకమాసములో సమస్త దేవతలూ..మునులుకూడా ఆశ్రయించుకొని వుండే ఉసిరిక కొమ్మని పెట్టి పూజిస్తారు...

కార్తీకమాసములో శనిత్రయోదశి సోమవారముకంటే చాలా ఎక్కువ ఫలితమిస్తుంది..ఆ శనిత్రయోదశి కంటే కార్తీక పౌర్ణమి వందరెట్లు ఫలితమిస్తుంది . పౌర్ణమి కంటే కార్తీక పాడ్యమి నూరురెట్లు అధిక పలమిస్తుంది..ఆ కార్తీక పాడ్యమి కంటే బహుళ ఏకాదశి కోటిరెట్లు ఎక్కువ పలితానిస్తుంది..
ఏకాదశి కంటే కార్తీక ద్వాదశి విస్తారమైన పలితానిస్తుంది అని పెద్దలంటారు... 

కార్తీకపురాణములో ఇలా చెప్పారు...

కార్తీక శు. పాడ్యమి::తెల్లవారు జామునే లేచి..స్నానము చేసి..దేవాలయానికి వెళ్ళి..కార్తీకవ్రతం సంకల్పము చెప్పుకొని..ఆకాశదీపాని దర్షించుకోవాలి 
విదియ::ఈ రోజు సోదరి ఇంటికి వెళ్ళి భోజనము చేసి..కానుకలిచ్చి రావాలి 
తదియ::అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకోవటము వల్ల సౌభాగ్యసిద్ది 
చవితి::ఈ రోజు నాగులచవితి సంధర్భముగా పుట్టలో పాలు పోయాలి 
పంచమి::దీనికి జ్ఞాన పంచమి అని పేరు..ఈ రోజు సుబ్రమణ్యప్రీత్యర్ధము అర్చనలు చేయించుకున్న వారికి జ్ఞాన వృద్ది కలుగుతునది 
షస్టి::నేడు బ్రహ్మచారికి ఎర్రగళ్ళ కండువా దానము చేస్తే సంతానప్రాప్తి కలుగుతుందని ప్రతీతి 
సప్తమి::ఈ రోజు ఎర్రని వస్త్రములో గోధుమలు పోసి దానమివ్వటము వలన ఆయుషు వృద్ది అవుతుంది  
అష్టమి::ఈ గోపాష్టమి నాడు చేసే గోపూజ విశేష ఫలితాలనిస్తుంది 
నవమి::నేటినుంచి మూడు రోజుల పాటు విష్ణుత్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి 
దశమి::ఈ రోజు రాత్రి విష్ణు పూజ చేయాలి 
ఏకాదశి::ఈ ఏకాదశికే బోధనైకాదశి అని పేరు..ఈ రోజు విష్ణుపూజ చేసిన వారికి ఉత్తమగతులు కలుగుతాయి 
ద్వాదశి::ఈ క్షీరాబ్ధి ద్వాదశి రోజు సాయంకాలము ఉసిరిమొక్క..తులసి మొక్కలను పూజించి..దీపాలను వెలిగించటము సర్వపాపాలనూ నశింప చేస్తుంది 
త్రయోదశి::ఈ రోజు సాలగ్రామ దానము చేయటము వలన సర్వకష్టాలు దూరమవుతాయి 
చతుర్దశి::పాషాణ చతుర్దశి వ్రతము చేసుకునేందుకు నేడు మంచిది 
కార్తీక పూర్ణిమ::మహా పవిత్రమైన ఈ రోజు నదీస్నానము చేసి..శివాలయము వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవటము వల్ల సర్వపాపాలు ప్రక్షాళనమవుతాయి..

ఇంకా ఈ మాసములో చేసే ఈశ్వరార్చనా..అభిషేకం అపమృత్యు దోషాలను..గ్రహ బాధలను తొలిగిస్తాయి..

సర్వేజనాః సుఖినోభవస్తు..

లింగాష్టకం:::
బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం
జన్మజదుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివ లింగం

దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకర లింగం
రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివ లింగం

సర్వసుగంధి సులేపితలింగం బుద్దివివర్ధన కారణలింగం
సిద్ధసురాసుర వందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం

కనకమహామణి భూషితలింగం ఫణిపతివేష్టిత శోభిత లింగం
దక్షసుయజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం

కుంకుమచందన లేపితలింగం పంకజహార సుశోభితలింగం
సంచితపాప వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం

దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభి రేవచలింగం
దినకరకోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదాశివలింగం

అష్టదళో పరివేష్టితలింగం సర్వసముద్భవ కారణలింగం
అష్టదరిద్ర వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం

సురగురు సురవరపూజితం లింగం సురవరపుష్ప సదార్చితలింగం
పరమపదపరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం

లింగాష్టక మిదంపుణ్యం యఃపఠేచివసన్నిధౌ
శివలోక మవాపోత్ని శివేన సహమోదతే . 

No comments: