క్షీరాబ్ధి ద్వాదశి వ్రత కథ
పూర్వము దర్మరాజు రాజ్యము పోగొట్టుకొని తమ్ములతో గూడి ద్వైతవనమందుండగా, నచ్చటికి అనేక ఋషులతోఁ గూడి వ్యాసులవారు వచ్చిరి. అట్లు వచ్చిన వ్యాసుని గని ధర్మరాజు తగుపూజలు సలిపి కూర్చొండబెట్టి తానును వారి యనుజ్ఞ బొంది కూరుచుడి కొంతతడువు మాటలాడి యాయనతో 'స్వామీ! మీరు ఎల్లధర్మములను ఉపదేశించదగిన మహానుభావులు. మీకు దెలియని దర్మసూక్ష్మములు లేవు. మనుష్యులకు సర్వకామములను ఏ యుపాయము చేత సిద్దించునో సెలవిండు, అని యడుగగా వ్యాసుడు 'నాయనా! మంచి ప్రశ్న చేసినావు. ఈ విషయమునే పూర్వం నారదమహాముని బ్రహ్మనడుగగా నాతడు సర్వకామప్రదములగు రెండు వ్రతములు చెప్పినాడు.క్షీరాబ్ధి ద్వాదశి వ్రతము, క్షీరాబ్ధి శయన వ్రతము అను నా రెండు వ్రతములలో క్షీరాబ్ధి ద్వాదశీవ్రతమును నీకు జెప్పెదను వినుము. కార్తిక శుక్ల ద్వాదశి నాడు ప్రొద్దుకూఁకిన తర్వాత పాలసముద్రము నుండి లేచి మహావిష్ణువు సమస్త దేవతల తోడును, మునులతోడును, లక్ష్మీ తోడును గూడి బృందావనమునకు వచ్చి యుండి, యొక ప్రతిజ్ఞ చేసినాడు. ఏమనగా - ఏ మానవుడైనను ఈ కార్తిక శుద్ద ద్వాదశి నాటి కాలమున సర్వమునులతో, దేవతలతో గూడి బృందావనమున వేంచేసియున్న నన్ను లక్ష్మీదేవితో గూడ పూజించి తులసిపూజచేసి తులసికథను విని భక్తితో దీపదానము చేయునోవాడు సర్వపాపములు వీడి నా సాయుజ్యమును బొందును. అని శపథము చేసినాడు గాన నీవును పుణ్యకరమైన ఆ వ్రతమును చేయుము, అని వ్యాసుడు చెప్పగా విని ధర్మరాజు అయ్యా ఈ వ్రతము చేయవలసిన విధాన మెట్టిదో నాకు జెప్పమని యడుగగా వ్యాసిడిట్లు చెప్పదొండగెను. ' దర్మరాజా! ఏకాదశి నాడు ఉపవాసము చేసి ద్వాదశి పారణ చేసికొని సాయంకాలమున మరల స్నానము చేసి శుచియై తులసికోట దగ్గర చక్కగా శుద్ది చేసి ఐదు వన్నెల మ్రుగ్గుల పెట్టి పలువిధముల నలంకరించి తులసీ మాలమందు లక్ష్మీసహితుడైన విష్ణువును తులసిని భక్తితో సర్వోపచారములతోను బూజించి నైవేద్యమైన తర్వాత కొబ్బెర, బెల్లము, ఖర్జూరము, అరటిపండ్లు, చెఱుకుముక్కలు సమర్పించి తాంబూలనీరాజనములొసగి మంత్రపుష్పము పెట్టి పూర్తి చేసి తులసీసహిత లక్ష్మీనారాయణ మహత్మ్యమును దీపదాన ఫలమును విని యనంతరము బ్రాహ్మణునకు గంధపుష్ప ఫలాదులొసగి తృప్తిపరచి వ్రతము పూర్తిచేయవలెను. ఇట్లే మానవుడు చేసినను ఇష్టముంగాంచును. ధర్మరాజది విని దీపదాన మహిమను జెప్పుమని యడుగగా వ్యాసుడు చెప్పుచున్నాడు. 'యుధిష్టిరా! దీపదానమహిమనెవడు చెప్పగల్గును ? కార్తిక శుద్ద ద్వాదశి దినమున బృందావన సమీపమున దీపదానము చేయవలెను. ఒక దీపదానముచే ఉప పాతకములు పోవును. నూఱు చేసిన విష్ణు సారూప్యము గలుగును. అంతకెక్కువగాఁ జేసిన నా ఫలములు నేను జెప్పలేను. భక్తితో నొకవత్తితో దీపము బెట్టిన బుద్దిశాలి యగును. నాలుగు వత్తులు వేసి వెలిగించిన రాజగును. పదివేసిన విష్ణుసాయుజ్యము నొందును. వేయివత్తులు వేసినచో విష్ణురూపుడగును. ఇది బృందావనములో చేసిన యెడల కురుక్షేత్రమందు జేసినంత ఫలము గలుగును. దీనికి ఆవునేయి మంచిది. నూవులనూనె మధ్యమము. తేనె యదమము. ఇతరములైన అడవినూనెలు కనీసము, ఆవునేయి జ్ఞానమోక్షముల నొసగును. నువ్వుల నూనె సంపదను కీర్తినిచ్చును. ఇప్పనూనె భోగప్రదము, అడవినూనె కామ్యార్థప్రదము, అందులో ఆవనూనె మిగుల కోరికలనిచ్చును. అవిసెనూనె శత్రుక్షయకారి. ఆముదము ఆయుష్షును నాశనము చేయును. బఱ్ఱె నేయి పూర్వపుణ్యమును దొలగించును. వీనిలో కొంచమైన ఆవునేయి కలిసిన దోషపరిహారమగును. ఈ దీపదానములవలననే యింద్రాదులకు వారివారి పదవులు దొరకినవి. దీనివలన ననేక మహిమలు కలుగును. ద్వాదశి నాడు దీపదానము చేసిన శూద్రాదులను ముక్తిగాంతురు. బృందావనమందొక మంటపము గట్టి వరుసగా దీపపంక్తులు పెట్టి యున్న నెవడు చూచి యానందపడునో వాని పాపములన్నియు నశించును. ఈ దీపదాన మహిమను విన్నవారు చదివినవారు మోక్షప్రాప్తులగుదురు.' అని చెప్పగా విని ధర్మరాజు మహానందమును జెంది తులసీ మహత్మ్యమును జెప్పమని కోరగా వ్యాసుడు చెప్పుచున్నాడు. తులసీ మహిమ పూర్తిగా బ్రహ్మ కూడా చెప్పలేడు. అయినను ఆ బ్రహ్మ నారదునకు జెప్పినట్లు చెప్పుచున్నాను. కార్తికమాసమందు తులసిపూజ చేయువారుత్తమలోకమును బొందుదురు. తుదకు ఉత్థానద్వాదశినాడైనను తులసిపూజ చేయనివారు కోటిజన్మలు చండాలులై పుట్టుదురు. తులసిమొక్క వేసి పెంచినవారు దానికెన్ని వేళ్ళు పారునో అన్ని మహాయుగములు విష్ణులోకమందుందురు. తులసీదళములు కలిసిన నీట స్నానమాడినవారు పాపము వదలి వైకుంఠమునకు బోవుదురు. బృందావనము వేసినవారు బ్రహ్మత్వము బొందుదురు. తులసి యున్న ఇంటిలో గాపురము చేయుట, తులసితోట వేసి పెంచుట, తులసిపేరులు దాల్చుట, తులసిదళము భక్షించుట, పాపహరములు. తులసి యున్న చోటునకు యమకింకరులు రారు. 'యాన్ములే....' అను మంత్రమును బఠించు వారికి నే బాధయు నంటదు. యమకింకరులు దగ్గరకు రారు. ఈ తులసి సేవయందే ఒక పూర్వకథను జెప్పెద వినుము. కాశ్మీరదేశ వాసులగు హరిమేధసుమేదులను నిద్దఱు బ్రాహ్మణులు తీర్థయాత్ర చేయుచుండి యొక స్థలములో నొక తులసితోటను జూచిరి. చూచినతోడనే వారిలో సుమేధుడు భక్తితో బ్రదక్షిణ నమస్కారములు చేసెను. అది చూచి హరిమేధుడిదియే మని యడిగెను. సుమేధుడు ఇక్కడ నెండబాధగా నున్నదని యొక మఱ్ఱిచెట్టునండకుజేరి తులసికథ నిట్లు చెప్ప దొడఁగెను. పూర్వము దేవాసురులు సముద్రము చిలికినప్పుడు దానియందు ఐరావతము కల్పవృక్షము మొదలుగా నెన్నియో యుత్తమ వస్తువులు పుట్టెను. తర్వాత లక్ష్మీదేవి పుట్టెను. తర్వాత అమృతకలశము పుట్టెను. ఆ యమృతకలశమును జేత బూని మహానందము నొంది విష్ణువు ఆ కలశముపై నానందబాష్పములు విడువగా నందు ఈ తులసి పుట్టినది. ఇట్లు పుట్టిన తులసిని, లక్ష్మిని విష్ణువు పరిగ్రహించెను. ఇట్లు పరిగ్రహించి వేడుకతో తులసిని తొడమీద నుంచుకొని నీవు లోకముల పావనము జేయగలదానవగు మని ప్రేమ మీఱ బలికెను. అందువలన నారాయణునకు తులసియందు ఎక్కువ ప్రీతి కలిగియుండును. అందువలన నేను తులసికి మ్రొక్కినాను. అని యా బ్రాహ్మణుండు పలుకుచుండగానే యామఱ్ఱి ఫెళ్ళుమని విరిగి కూలెను. ఆ చెట్టు తొఱ్ఱలోనుండి ఇద్దరు పురుషులు వెలుపలకు వచ్చి దివ్యతేజముతో నిలిచియుండగా హరిమేధ సుమేధులు చూచి దివ్యమంగళ విగ్రహధారులైన మీ రెవరిని యడిగిరి. ఆ పురుషులను మీరే మాకు తండ్రులు గురువులు నని చెప్పి వారిలో జ్యేష్ఠుడిట్లనియెను. ' నేను దేవలోకవాసిని, నాపేరు ఆస్తికుడందురు. నేనొకనాడు అప్సరసలతోగూడి నందనవనమున గామవికారముచే మైమరచి క్రీడించుచుండగా మేము ధరించిన పుష్పమాలికలు పైనిబడి మా సందడివలన సమాధి చలించి యచ్చట తపస్సు చేయుచున్న రోమశమహాముని నన్ను చూచి నీవు మదోన్మత్తుడవై యిట్లు నాకలజడి కలిగించితివి గావున బ్రహ్మ రాక్షసుడవగు మని శపించి తప్పిదము పురుషునిది గాని స్త్రీలు పరతంత్రలు గనుక వారివలన తప్పు లేదని వారిని క్షమించి విడిచెను. అంతట నేను శాపమునకు వెఱచి యా మునిని వేడి ప్రసన్నునిజేయగా నాయన యనుగ్రహము గలిగి నీవెప్పుడు తులసిమహిమను, విష్ణుప్రభావమును విందువో అప్పుడు శాపవిముక్తుడవుగుదువని అనిగ్రహించెను. నేనును బ్రహ్మరాక్షసునై యీ చెట్టు తొఱ్ఱలో జేరి మీ దయవలన నేడు శాపమోక్షణము నొందితిని' అని జెప్పి , రెండవవాని వృత్తాంతము చెప్పసాగెను. ' ఈయన పూర్వమొక మునికుమారుడిగానుండి గురుస్కులవాసము జేయుచుండి ఒక యపరాధము వలన బ్రహ్మరాక్షస్సువగు మని గురువు వలన శాపము బొంది యిట్లు నాతో గలసియుండెను. మేమిద్దఱమును మీదయ వలన బవిత్రులమైతిమి. ఇట్లు మమ్మనుగ్రహించినారు గాన మీతీర్థయాత్రాఫలము సిద్దించినది.' అని చెప్పి వారిరువురు వారిత్రోవను బోవగానే బ్రాహ్మణులిద్దఱు ఆశ్చర్యానందములతో మునిగి తులసి మహిమను బొగడుచు యాత్రముగించుకొని యిండ్లకేగిరి. ఈ కథను ఎవరు విన్నను వారు సర్వపాపములు వదలి యుత్తమగతిని జెందుదురని బ్రహ్మ నారదునకు జెప్పెను.' అని వ్యాసుడు చెప్పి ధర్మరాజా ! ఇట్లు క్షీరాబ్ధివ్రతము జేసి తులసికథ విన్నవారుత్తములగుదురు.
Dharmaraja and his brothers lost their kingdom and went to reside in Dwaitavanam. At this time, the Sage Vyasa came to visit him. Dharmaraja cordially invited Vyasa, made him seat on a pedestal, spoke to him on various issues and then said as follows, “Swami! You know all Dharmas. There is no knowledge or wisdom that you donot know. Please tell me a way, by which all desires can be fulfilled”. To this Vyasa replied, “Son! This is a good question. Once upon a time Sage Narada posed the same question to Brahma deva, and the deva narrated him two desire fulfilling penances. Those are Ksheerabdi Dwadasi Vratam and Ksheerabdi Sayana Vrata. Let me narrate you the details of Ksheerabdi Dwadasi Vratam. Lord Vishnu vowed that on karthika sukla dwadasi , after sunset, He, along with Devi lakshmi will raise from the Ocean of Milk (Pala Samudram), and reside in Tulasi Pot (Brindavanam). With him, will reside all gods and sages. On that day, anyone who comes to Brindavanam, does pooja wholeheartedly to Laksmi, Tulasi and Shree Vishnu, read or listen to Tualsi’s story and give deepadanam will get rid of "all previous birth wrong doings, and wards off any ill luck and attain the Lords sanctity forever. Hence to get your desires fulfilled, you should perform this vratam”. Hearing this, Dharmaraja said to vyasa, “O Sage! Please let me know the way to do it”, to this vyasa replied, “Dharmaraja! On Ekadasi, one must keep fasting and then read dwadasi parayanam, and in the evening, take bath, clean the area of tulasi pot, decorate with colorful rangavallis, do pooja with utmost reverence to the Lord residing at the root of the brindavanam – Tulasi plant, offer coconut, jaggery, dates, sugarcane and bananas as prasadam. Then offer tamboolams and neerajanam, along with mantra pushpam, then read or listen to the effectiveness of Deepadanam, offer deepadanam to a Brahmin along with sandalwood, flowers and fruits. Thus if one performs the pooja, one can get the result of their wishes. Hearing this, Dharmaraja, requested Vyasa to tel him the effectiveness of deepadanam, to which he replied, “O Yudhishtir! Who can ever explain completely the greatness and effectiveness of deepadanam?On karthika Suddha dwadasi one must give deepadanam at the Brindavan. One such danam will clear away all the evils. If one does 100, they will reach the Lord himself. Nothing less than this. When one light one wick, he will become knowledgeable, 2 wicks – he will become a king, 10 wicks will witness the Lord himself, 1000 wicks, he will be absorbed into the great divinity. If this is done at the bridavan, it will be as effective as doing it in Kurukshetra. Cow ghee is the best to use, sesame oil comes second, honey will be the least choice, other oils are not preferable. Cow ghee will grant wisdom and deliverance, sesame oil will give fame and wealth, mahua oil (Ippa nooney) will give physical comforts, wild tree oils will fulfil all desires, especially mustard oil, Avisa oil gets rid of enemies, castor oil will decrease longevity, buffalo ghee will decrease the goodness one acquired previously, If even a little of Cow ghee is mixed to any of the above, then the negative effect can be removed. Indra and others got their positions by doing these deepadanam. It is very effective. If Sudras do deepadanam on dwadasi, they will attain deliverance. If one witnesses and enjoys the sight of deepams lit on a bridavan mantapam, even all evils will be rid for him. Those, who listen to the story of the effectiveness of deepadanam, will also attain deliverance”. Dharmaraja was overjoyed hearing this and requested Vyasa to tell him the greatness of Tulasi. Vyasa continued, “Even Brahma cannot completely explain the greatness of Tulasi. But listen to what he told Narada about the greatness of Tulasi. Whoever performs pooja to Tulasi during the month of Kartika will gain their place in heaven. If anyone doesnot do this pooja atleast on Utthaanadwadasi, they will be born as untouchables for the next crore birth. Those who grow a tulasi in their house will live in Vishnu loka – the count of the years equivalent to the number of roots of the plant. Those who bath with the water with tulasi leaves will reach vaikuntam,the abode of lord vishuni, at the end. Whoever grows many tulasi plants as a brindavanam will attain brahmatvam. Living in a house with a tulasi plant, growing a tulasi plant, weaing tulasi beads, eating tulasi leaves will get rid of all evils. The yama kinkaras (the soldiers of God of death, Yama) will never come near a tulasi plant. Reading the mantra, “yanmulae…” will get rid of any trouble or misery; will prevent untimely death. There is a story about the pooja of tulasi, listen. Once, two Brahmins from Kashmir, named harimedha and sumedha, were on pilgrimage. On their way, they saw a garden of Tulasi plants. Atonce, sumedha folded his hands and circumbulated around the plants. Seeing this, Harimedha asked the reason for his action. SUmedha took him to the shelter of a Banyan tree and told him Tulaso story as follows, “During the churning of the ocean of milk, many valuable things have originated from the ocean, like the kalpavriksha, Airawat and kamadhenu. Then Goddess Laxmi originated. Finally came out the nectar of immortality – Amrut. Holding the pitcher of amrut, Lord Vishnu shed tears of joy, from which was born Tulasi. Lord Vhsnu accepted her as his consort. He made her sit in his lap and told her that she has the capability to purify the world. Tulasi is the favorite of the Lord Vishnu. Hence I bowed to her”. While the Brahmin was narrating the story, the Banyan tree suddenly split into two and from it evolved two divine looking men. Those two men bowed to the Brahmins saying, you are our fathers and our gods. Then the elder of them narrated their story as follows, “I am a resident of deva loka. My name is Asthika. Once when I was in a playful mood with beautiful apsaras in nandavanam, the garland from our bodies fell over a sage called Romasa, who was in deep meditation. This and the noise we made disturbed his meditation, so he cursed me, “You disturbed my mediation having lost your sense, so may you turn into a Brahmarakshasa (demon)”. Since the women were in my control there, he forgave them. Frightened at such a baneful curse, I pleaded mercy to the Sage, for which he conceded and said, “The moment to you hear the greatness of Tulasi and Lord Vishnu, the curse will become ineffective”. I was residing in this tree, as a demon all these days. With your sympathy, today I am freed of the curse”. Then he also told the story of the other man, “Once upon a time, I was a Brahmin boy, studying at a gurukul. I committed a grave mistake for which my guru, teacher cursed me to be born as a brahmarakshasa. Since then we both were residing in this tree. On hearing the story of Tulasi, we are liberated”. Saying this, both of them left. Surprised at the events, the Brahmins completed their pilgrimage, paising the greatness of Tualsi, on theoir way. Brahma narrated this story to Narada saying, anyone who listens to this story will be liberated from all evil”, So, Dharmaraja! Whoever performs Ksheerabdi Vratam and listens to the story of Tulasi, will attain good positions”.
No comments:
Post a Comment