Monday, December 9, 2013

శివుడు పంచావతారమూర్తి












పరమ శివుడు పంచావతారమూర్తి. 
విష్ణుమూర్తి లోక కళ్యాణార్ధం దశావతారాలుగా అవతరించినట్లు, అందరికి విదితమే ! 
కాని పరమశివుడు బ్రహ్మ కోరికపై ఐదు అవతారాలు దాల్చిన విషియం కొందరికి మాత్రమే విదితం.
ఈశ్వరుడు త్రిలోచనుడు , త్రిశూలి, ధవళ శరీరుడని మాత్రమే అందరూ ఎరిగిన విషియము. 
అమృత మధనం సమయంలో గరళ్ళాన్ని త్రాగి కంఠమున నిలుపుకున్నందున గరళకంఠుడూ, 
నీలకంఠుడు అని కంఠము మాత్రమే నీలినలుపు రంగుల్లో ఉంటుందని మన విశ్వాసం.
కాని బ్రహ్మ కోరిక పై ఐదు సందర్భాలలో అయిదే వతారమౌలను ధరించినందున ఆయ్న శరీర ఛాయలు ,
నామములు కూడా పంచావతారమూర్తి పేరును సార్ధకం చేశాయి.

బ్రహ్మదేవుడు శ్వేతవరాహకల్పంలో పరమేశ్వరుని ధ్యానించి,
తన విధులను నిర్వర్తించడానికి తగిన ఙ్ఞానాని ప్రసాదించమని ప్రార్ధించాడు. 




నిస్చల భక్తితో కొలచిన వారిని అనుగ్రహించడం కోసం వెంటనే ప్రత్యక్షమయ్యేవాడే పరమేఅశ్వరుడు.
ఆయన గౌరిదేవితో కూడి సద్యోజాత శివరూపం తో ప్రత్యక్షం కాగా,తనకు పుత్ర ప్రాప్తి కలగాలన్నారు. 
వెంటన్నే నలుగురు కుమారులు కలిగారు, వారే సునందుడు, నందనుడు, విశ్వనందనుడు, ఉపనందుడు. 
మరలా రక్తకల్పంలో బ్రహ్మదేవుడు పరమశివుణ్ణి ధ్యానించగా, ఆయన ఎర్రటి కళ్ళతోనూ,కెంపు రంగు శరీరంతోనూ, 
రక్త వర్ణ వస్త్రభూషణాలను ధరించడమే కాకుండా, అగ్నిగోళాల వంటి ఎర్రని కన్నులతో ప్రసాంత వదనంతో ప్రత్యక్షమై, 
ఙ్ఞానభిక్షతో బాటు, ఎర్రనివస్త్రాలను ధరించిన నలుగురు కుమారులను అనుగ్రహించారు. 
వారే విరజుడు,వివాహుడు, విశోకుడు, విశ్వభావనుడు. దీనితో శివుని రెండవ అవతారమైన వామదేవ అవతారం.   


అటు తరువాత పీతవాసకల్పంలో బ్రహ్మ, శివుని ధ్యానించడం,ఆయన పసుపు వర్ణపు వస్త్రాలను ధరించి,
బంగారు వర్ణంలో,మిలమిల మెరిసే పసిడి తెజస్సుతో,భుజబలశక్తిగల ఆజానుబాహునిలా ప్రత్యక్షమయ్యారు.
అదే మూడవ అవతరామైన తత్పురుషవతారం.

తరువాత వచ్చిన కల్పం శివకల్పం. ఈ కల్పంలో సర్వం జల మయమైపోయింది. 
ఏ దిశ చుచిన జలమయమే .ఇలా సహస్ర వర్షాలు గడిచిపోయాయి. 
సృష్టి కార్యం ఎలా నిర్వర్తించాలన్నది బ్రహ్మకు సమస్యై పోయింది. 
మరలా గడ్డు పరిస్థితి ఏర్పడిందని ,శివుని గూర్చి తపస్సు చేసారు. 



అప్పుడు పరమేశ్వరుడు నల్లటి శరీరధారియై,నళ్ళటి కిరీటాన్ని ధరించడమే కాకుంద, శరీరంపై లేపనాన్ని పూసుకుని, 
ఓ దివ్యమైన,నలుపు లోను కూడా తెజస్సు గల "అఘోరమూర్తి"గా పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. 
సృష్టికార్యానికి సహకారులుగా కొందరిని అనుగ్రహించమని మరీమరీ వేడుకోగా,
నల్లని దేహం, నల్లని ముఖం,నల్లని శిఖ కలిగిన నలుగుర్ని బ్రహ్మ సృష్టికి ఆ నలుగురూ ఎంతగానో తోడ్పద్దారు, 
బ్రహ్మ అంతర్గత మధనాన్ని గ్రహించాడు. 



ఆ ఙ్ఞానన శక్తి వెనుకగల స్తిథిని గ్రహించాడు. బ్రహ్మ అడిగిన ఙ్ఞానప్రసాదమేమిటో గ్రహించారు.
మరలా విశ్వకల్పం వచ్చింది. 
ల్పకల్పానికి జరిగినట్టుగానే ఇక్కడ బ్రహ్మకు మళ్ళి సమస్యలే! 

ఈ సారి బ్రహ్మ శరీరం నుంచే మహానాదం,సరస్వతి రూపావిర్భావం జరిగింది. 
పరమశివుడేఅ అలా అవతరించగా, బ్రహ్మ అది "ఈసానవతారంగా" భావించారు.
ఈ ఐదవ అవతారమే ఈశ్వరుని అన్ని అవతారలకంటే విశిష్టమైనది. 
ఇక్కడ ఆయనకు నలుగురు సహాయకులను కూడా ప్రదానం చేసారు. 
వారే జటి,ముండి, శిఖండి, అర్ధముండీలు.

ఇలాగ ఐదు సందర్భాల్లోని ఐదు అవతారాల్లోనూ బ్రహ్మ సృష్టి నిర్మాణ సౌలభ్యానికి,
ముల్లోకముల హితానికే ముక్కంటి అనుగ్రహించినట్టు శతరుద్రసమ్హిత చెబుతోంది.
హర హర మహా దేవ శంభో శంకర !

No comments: