Sunday, December 1, 2013

గోపూజతో నవగ్రహశాంతి
గోపూజతో నవగ్రహశాంతి 
................................

జాతకరీత్యాగానీ, గోచారరీత్యాగానీ గ్రహ దోషాలు గల వారు 
నవధాన్యాలు గోవులకు పెట్టడం వలన ఆ దోషాలన్నీ పటాపంచలవుతాయి. 

ధాన్యాన్ని నానపెట్టి ఆయా వారాల్లో పెట్టిన ఆ గ్రహదోషాలు తొలుగుతాయి.

సూర్యునికి గోధుమలు, చంద్రునికి బియ్యం, కుజునికి కందులు, బుధునికి పెసలు , 
గురువుకి సెనగలు, శుక్రునికి బొబ్బర్లు, శనికి నువ్వులు, 
రాహువుకు మినుములు, కేతువుకు ఉలవలు ప్రీతికరమైన ధాన్యాలుగా గుర్తెరగాలి

నానపెట్టబడిన ధాన్యాలు గోవుకు సమర్పించినందున 
ఆయా గ్రహాల అనుకూలత,అనుగ్రహం మనకు నిస్సందేహంగా కలిగి తీరుతాయి.

పూర్వాకాలంలో మనకు గోవులే ధనం. మన జీవితాలన్నీ గోవుతోనే ముడిపడి ఉండేవి. 

దక్షిణలు, అరణాలు, కానుకలు, గోవురూపంలోనే నాడు ఇవ్వబడేవి. 

గోవు ప్రత్యక్ష దైవం. గోసేవా వ్రతాన్ని చేసి అభీష్ట సిద్ధిని పొందేవారు. 

ప్రాచీనాచార్యులు గోసంరక్షణలో చూపిన శ్రద్ధా భక్తులు అపారం. 

ఆవు నెయ్యి పవిత్రమైన హోమద్రవ్యం. 
యాగాలు చెయ్యటానికి ఆవు నెయ్యి, ఆవు పెరుగు, ఆవు పాలు, ఎంతో అవసరం. 

దానికి వారు ఆవులను ఎంతో శ్రద్ధగా పెంచేవారు. 

గోమూత్రం, పేడ, గోఘృతం, పెరుగు, పాలు "పంచగవ్యాలు"గా ప్రసిద్ధం.

"యత్త్వగస్ధి గతం పాపం దేహే తిష్టతి మామకే!
ప్రాశనం పంచగవ్యస్య దంహాత్యగ్నిరివేంధనమ్!!

అంటే, మన శరీరాన్ని ఎముకలను, అంటి పెట్టుకొని ఉన్న ఏ దోషమైనా , 
పంచగవ్యాలను ఆస్వాదించుట వల్ల అగ్నిచే కట్టెలు దహింపబడినట్లు నశించి పోతుందని అర్థం. 
పంచగవ్య ప్రాశస్త్యం , గోపవిత్రత దీని ద్వారా మనకు తెలుస్తుంది. 
సర్వ దేవతలు గోవు శరీరంలో కలవు. అందుకే మనకు గోవు ఆరాధ్య దేవత.
SunderPriya


No comments: