Monday, November 18, 2013

బిల్వ వృక్షం భూలోకంలో ఉద్భవించడానికి గల కారణం?


బిల్వ వృక్షం భూలోకంలో ఉద్భవించడానికి గల కారణం?
.......................................................................

ఒకరోజు వైకుంఠంలో లక్ష్మీదేవి శ్రీహరికి సేవలు చేస్తుండగా, సంతుష్టుడైన శ్రీహరి, ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. 
అందుకామె "ఏ భార్య అయినా భర్త అనురాగాన్నే కోరుకుంటుంది. 
మీ అనురాగం నాకు పుష్కలంగా లభిస్తున్నప్పుడు, నాకంటే అదృష్టవంతురాలెవరు ఉంటుంది. చెప్పండి?" అని చెప్పింది. 
ఆమె మాటలను విన్న శ్రీహరి, ఆమెకు పరమేశ్వరాను గ్రహం కూడా కావాలని, ఆయనను ప్రసన్నం చేసుకోమని చెబుతాడు. 
తద్వారా, ఓ లోకోపకారం కూడ జరుగనున్నదని శ్రీహరి పలుకుతాడు. 
అలా శ్రీహరి అనుజ్ఞను పొందిన లక్ష్మీదేవి, భూలోకానికి చేరుకుని తపస్సు చేసుకునేందుకు తగిన స్థలాన్ని వెదుకుతుండగా, 
అటుగా వచ్చిన నారదుడు అనువైన చోటును చూపిస్తాడు, 
ఆయన సూచన ప్రకారం, శ్రీశైల క్షేత్ర సమీపంలోని పాతాళగంగను చేరుకుని ఓ అశ్వత్థ వృక్షం నీడన తపస్సు మొదలు పెట్టింది.  అయితే, తపస్సును ప్రారంభించే ముందు గణపతిని ప్రార్థించకుండా పొరపాటు చేసింది. 
అందుకు కోపగించుకున్న వినాయకుడు, 
లక్ష్మీదేవి తపస్సుకు ఆటంకం కలిగించమని సరస్వతీదేవిని ప్రార్థిస్తాడు 
గణనాథుని విన్నపం మేరకు, తన అత్తగారి తపస్సుకు విఘ్నాలు కలుగజేయసాగింది సరస్వతీదేవి. 
లక్ష్మీదేవి ఎంతగా శివపంచాక్షరీ జపం చేద్దామనుకున్నప్పటికీ తపస్సుపై ఆమె మనసు లగ్నం కాకపోవడంతో, దివ్యదృష్టితో అసలు సంగతిని గ్రహించిన లక్ష్మీదేవి, వినాయక వ్రతాన్ని చేసి, ఆయన అనుగ్రహాన్ని పొందుతుంది. 
ఆనాటి నుంచి వాయుభక్షణం చేస్తూ ఘోరతపస్సు చేయసాగింది లక్ష్మీదేవి. 
అయినా పరమేశ్వరుడు ప్రత్యక్షం కాలేదు. ఆమె చుట్టూ పుట్టలు పెరిగి, అనంతరం ఆమె దేహం నుండి దివ్యతేజోమయ అగ్ని బయల్వెడలి సమస్తలోకాలను దహించడానికి బయలుదేరింది. 
ఇది చూసిన ఋషులు, దేవతలు పరమేశ్వరునికి మొరపెట్టుకున్నారు. అప్పుడు పరమశివుడు నందీశ్వరుని భూలోకానికి పంపాడు. 
ఒక బ్రాహ్మణుని వేషంలో లక్ష్మీదేవి వద్దకు వచ్చిన నందీశ్వరుడు, ఆమె మనోభీష్టం నెరవేరాలంటే రుద్రహోమం చేయాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోమని, అయితే స్వామి నివేదనకు ఒక శరీరావయవాన్ని సమర్పించాలని చెప్పి వెళ్ళిపోయాడు.  
వెంటనే లక్ష్మీదేవి సప్తర్షులను ఋత్విక్కులుగా నియమించుకుని ఏకాదశ రుద్ర యాగాన్ని ప్రారంభించింది. యాగం నిర్విఘ్నంగా ముగియడంతో, హోమగుండం నుంచి ఓ వికృత శక్తి స్వరూపం బయటకు వచ్చి 'ఆకలి! ఆకలి!!' అని కేకలు వేయసాగింది. 
అప్పుడు లక్ష్మీదేవి ఖడ్గంతో తన వామభాగపుస్తనాన్ని ఖండించి. శక్తికి సమర్పించబోగా, ఆ శక్తిస్థానంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై, లక్ష్మీదేవిని కరుణించి, ఆమె వక్షభాగంలో ఎలాంటి లోపం లేకుండా చేసి, వరం కోరుకోమన్నాడు. 
అప్పుడామె సర్వవేళలా తనకు శివానుగ్రహం కావాలని ప్రార్థించింది. 
అందుకు ప్రసన్నుడైన పరమశివుడు, "తథాస్తు! నీవు విష్ణు వక్షః స్థలంలో స్థిరంగా ఉంటావు. 
నీ నామాల్లో 'విష్ణు వక్షఃస్థల స్థితాయ నమః' అని స్తుతించిన వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. 
నీ నివేదిత స్థనాన్ని ఈ హోమగుండం నుంచి ఓ వృక్షంగా సృష్టిస్తున్నాను. దీనిని భూలోకవాసులు బిల్వవృక్షమని పిలుస్తారు. 
మూడుదళాలతో ఉండే మారేడు దళాలలో పూజించేవారికి సర్వశుభాలు కలుగతాయి" అని దీవించాడు. 
ఇలా బిల్వవృక్షం పరమశివుని సేవ కొరకై భూలోకంలో సృష్టించబడింది. 

Visraja

భక్త కన్నప్ప--1976

శివ శివ శంకర..భక్తవశంకర
శంభో  హర హర..నమో నమో
శివ శివ శంకర..భక్తవ శంకర
శంభో  హర హర..నమో నమో

పున్నెము పాపము ఎరుగని నేను
పూజలు సేవలు తెలియని నేను
పున్నెము పాపము ఎరుగని నేను
పూజలు సేవలు తెలియని నేను

ఏ పూలు తేవాలి నీ పూజకు
ఏ పూలు తేవాలి నీ పూజకు
ఏ లీల చేయాలి నీ సేవలు

శివ శివ శంకర..భక్తవశంకర
శంభో  హర హర..నమో నమో

మారేడు నీవని ఏరేరి తేనా
మారేడు దళములు నీ పూజకు
మారేడు నీవని ఏరేరి తేనా
మారేడు దళములు నీ పూజకు

గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని
గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని
గంగను తేనా నీ సేవకు

శివ శివ శంకర..భక్తవశంకర 
శంభో  హర హర..నమో నమో 

!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!శ్రీ మంజునాథ--2001

ఓం మహా ప్రాణ దీపం శివం శివం
మహోంకార  రూపం శివం శివం
మహా సూర్య చంద్రాగ్ని నేత్రం పవిత్రం
మహా గాఢ తిమిరాంతకం సౌరగాత్రం

మహా కాంతి భీజం మహా దివ్య తేజం
భవానీ సమేతం భజే మంజునాథం
ఓం ఓం ఓం నమ: శంకరాయచ
మయస్కరాయచ నమ: శివాయచ
శివతరాయచ భవహరాయచ

మహా ప్రాణ దీపం శివం శివం
భజే మంజునాథం శివం శివం

అద్వైత భాస్కరం అర్ఠనారీశ్వరం
త్రిదశ హృదయంగమం చతుర్దతిసంగమం
పంచభూతాత్మకం శత్చత్రునాశకం
సప్త స్వరేశ్వరం అష్ట సిద్దిశ్వరం
నవరస మనోహరం  దశ దిశా సువిమలం

ఏకాదశోజ్వలం ఏకనాదేశ్వరం
ప్రస్తుతివశంకరం ప్రనదగణ కింకరం
దుర్జన భయంకరం సజ్జన శుభంకరం
ప్రాణి భవతారకం ప్రకృతి హిత కారకం
భువన భవ్య భవనాయకం భాగ్యాత్మకం  రక్షకం

ఈశమ్..సురేశం..ఋషేశం..పరేశం
నటేశం..గౌరీశం..గణేశం..భూతేశం
మహామధుర పంచాక్షరీ మంత్రమార్చం
మహా హర్ష వర్ష ప్రవర్షం సుశీర్శమ్

ఓం నమోహరాయచ స్మర హరాయచ 
పుర హరాయచ రుద్రాయచ భద్రాయచ 
ఇంద్రాయచ నిత్యాయచ నిర్నిద్రాయచ

మహా ప్రాణ దీపం శివం శివం
భజే మంజునాథం శివం శివం

డండండ డండండ డండండ డండండ
డక్కానినాధ నవ తాండవాడంబరం
తద్దిమ్మి తకదిమ్మి దిద్దిమ్మి దిమిదిమ్మి
సంగీత సాహిత్య సుమ కమల భంబరం

ఓంకార హ్రీంకార  శ్రీంకార  ఐంకార
మంత్రభీజాక్షరం మంజునాదేశ్వరం
రుగ్వేదమాద్యం యజుర్వేద వేద్యం
సామ ప్రగీతమ్ అధర్మ ప్రగాతం
పురణేతిహాసం ప్రసిద్ధం విశుద్ధం
ప్రపంచైక సూత్రం విబుద్దం సుసిద్దం

నకారం మకారం శికారం వకారం యకారం
నిరాకార సాకార సారం
మహా కాల కాలం మహా నీలకంఠం
మహానందనందం మహాటాట్టహాసం

జటాజూటరంగైకగంగాసుచిత్రం
జ్వలద్వుగ్ర నేత్రం సుమిత్రం సుగోత్రం
మహాకాశ భాసం మహా భానులింగం
మహా వత్రు వర్ణం సువర్ణం ప్రవర్ణం

సౌరష్ట్ర సుందరం సౌమనాదేశ్వరం
శ్రీశైల మందిరం శ్రీ మల్లికార్జునం
ఉజ్జయినిపుర మహాకాళేశ్వరం
బైద్యనాదేశ్వరం మహాభీమేశ్వరమ్
అమరలింగేశ్వరం రామలింగేశ్వరం
కాశి విశ్వేశ్వరం  పరంఘ్రుష్మేశ్వరం
త్ర్యమ్బకాదీశ్వరమ్ నాగలింగేశ్వరం
శ్రీ కేదారలింగేశ్వరం

అగ్నిలింగాత్మకం జ్యోతిలింగాత్మకం
వాయులింగాత్మకం అత్మలింగాత్మకం
అఖిలలింగాత్మకం అగ్నిసోమాత్మకం
అనాదిం అమేయం అజేయం అచింత్యం
అమోఘం అపూర్వం అనంతం అఖండం

అనాదిం అమేయం అజేయం అచింత్యం
అమోఘం అపూర్వం అనంతం అఖండం
ధర్మస్థలక్షేత్ర వరపరంజ్యోతిం
ధర్మస్థలక్షేత్ర వరపరంజ్యోతిం..ధర్మస్థలక్షేత్ర వరపరంజ్యోతిం

ఓం నమ: సోమయచ సౌమ్యయచ
భవ్యాయచ భాగ్యాయచ శాంతాయచ శౌర్యాయచ
యోగాయచ భోగాయచ కాలాయచ కాంతాయచ
రమ్యాయచ  గమ్యాయచ ఈశాయచ శ్రీశాయచ
శర్వాయచ సర్వయచా

!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!


శ్రీ కాళహస్తి మహాత్మ్యం--1954

ఓం నమశ్శివాయా 
నవనీత హృదయా సమప్రకాశా  
కరునేందుభూషా నమో శంకరా దేవ దేవా  

మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా 
నిన్ను నమ్మినాను రావా నీలకంధరా..దేవా
మహేశా పాప వనాశా కైలాసవాసా ఈశా 
నిన్ను నమ్మినాను రావా నీలకంధరా 

భక్తి యేదో పూజ లేవో తెలియనైతినే 
పాపమేదో పుణ్యమేదో కాననైతినే..దేవా
పాపమేదో పుణ్యమేదో కాననైతినే..దేవా

మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా 
నిన్ను నమ్మినాను రావా నీలకంధరా

మంత్రయుక్త పూజచేయ మనసు కరుగునా 
మంత్ర యుక్త పూజచేయ మనసు కరుగునా
మంత్రమో తంత్రమో యెరుగ నైతినే 
మంత్రమో తంత్రమో యెరుగ నైతినే

నాదమేదో వేదమేదో తెలియనైతినే 
నాదమేదో వేదమేదో తెలియనైతినే
వాదమేల పేద బాధా..తీర్చరావయా..స్వామీ
వాదమేల పేద బాధా..తీర్చరావయా..స్వామీ

మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా 
నిన్ను నమ్మినాను రావా నీలకంధరా


!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

భుకైలాస్--1958
సంగీతం::R.సుదర్శనం, R.గోవర్ధనం
రచన::సముద్రాల రాఘవాచార్య
గానం::ఘంటసాల


దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమోనమో
దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమోనమో

దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమోనమో
దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమోనమో

పాలితకింకర భవనా శంకర శంకర పురహర నమోనమో
పాలితకింకర భవనా శంకర శంకర పురహర నమోనమో
హాలాహలధర శూలాయుధకరా శైలసుతావర నమో నమో
హాలాహలధర శూలాయుధకరా శైలసుతావర నమో నమో

దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమోనమో
దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమోనమో

దురిత విమోచనా..ఆఅ..ఆఅ..ఆఆఅ..ఆఅ..అ.అ 
దురిత విమోచన ఫాలవిలోచన పరమదయాకర నమో నమో
కరిచర్మాంబర చంద్రకళాధర సాంబ దిగంబర నమో నమో
కరిచర్మాంబర చంద్రకళాధర సాంబ దిగంబర నమో నమో

దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమోనమో
దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమోనమో

నమో నమో నమో నమో నమో నమో

నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో
నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో
నారద హృదయ విహారి నమో నమో 
నారద హృదయ విహారి నమో నమో
నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో
పంకజ నయనా పన్నగ శయనా..ఆ ఆ ఆఆఆఅ...
పంకజనయనా పన్నగ శయనా
పంకజనయనా పన్నగ శయనా
శంకర వినుతా నమో నమో
శంకర వినుతా నమో నమో

నారాయణ హరి నమో నమో 
నారాయణ హరి నారాయణ హరి
నారా..యణ హరి నమో నమో

!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

తిలంగ్:::రాగం
{హిందుస్తానీ-కర్నాటక


సంగీతం::C.సముద్రాల
రచన::C.రాఘవాచార్య
గానం::ఘంటసాల

జయజయ మహాదేవా శంభో సదాశివా
ఆశ్రిత మందార శృతిశిఖర సంచారా..ఆ ఆఆ

నీలకంధరా దేవా దీన బాంధవా రారా ననుగావరా
నీలకంధరా దేవా దీన బాంధవా రారా ననుగావరా
సత్యసుందరా స్వామి..నిత్య నిర్మల పాహి
సత్యసుందరా స్వామి..నిత్య నిర్మల పాహి
నీలకంధరా దేవా దీన బాంధవా రారా ననుగావరా

చరణం::1

అన్యదైవము గొలువా
ఆఆ ఆఆఆ ఆఆఆ ఆఆ
అన్యదైవము గొలువా
నీదుపాదము విడువా
అన్యదైవము..ఉ ఉ..గొలువా
నీదుపాదము విడువా
దర్శనమ్ము నీరా మంగళాంగ గంగాధరా
దర్శనమ్ము నీరా మంగళాంగ గంగాధరా
నీలకంధరా దేవా దీన బాంధవా రారా ననుగావరా

చరణం::2

దేహి అన వరములిడు దానగుణసీమ
పాహియన్నను మ్రొక్కి నిన్ను పరంధామా
నీమమున నీ దివ్య నామ సంస్మరణ
ఏమరక చేయుదును భవతాప హరణ
నీ దయామయ దృష్టి సురితమ్ములార
వరసుభావృత్తి నా వాంఛ నీవేరా
కరుణించు పరమేశ దరహాస భాసా
హరహర మహాదేవ కైలాసవాసా కైలాసవాసా

చరణం::3

ఫాలలోచన నాదు మొరవిని జాలిని బూనవయా
నాగభూషణ నన్నుకావగ జాగును సేయకయా
ఫాలలోచన నాదు మొరవిని జాలిని బూనవయా
నాగభూషణ నన్నుకావగ జాగును సేయకయా
కన్నులవిందుగా భక్తవత్సల కానగ రావయ్యా
కన్నులవిందుగా భక్తవత్సల కానగ రావయ్యా
ప్రేమమీర నీదు భక్తుని మాటను నిల్పవయా
ప్రేమమీర నీదు భక్తుని మాటను నిల్పవయా
ఫాలలోచన నాదు మొరవిని జాలిని బూనవయా
నాగభూషణ నన్నుకావగ జాగును సేయకయా
శంకర శివశంకరా అభయంకరా విజయంకరా
శంకర శివశంకరా అభయంకరా విజయంకరా
శంకర శివశంకరా అభయంకరా విజయంకరా


!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!No comments: