కార్తీకమాసము మాసాలలో అత్యంత పవిత్రమైనది కార్తిక మాసము.. శివ కేశవులకిద్దరికీ ప్రీతికరమైనది..ఏంతో మహత్యము కలది.. కార్తీక మాసములో సూర్యుడు తులా సంక్రమణములో నుండగా ఆచరించె స్నాన..దాన..జప..పూజాదులు విశేష పలితాలనిస్తాయి.. సూర్యుడు తులారాశిని ప్రవేశించగానే గంగానది ద్రవ రూపము ధరించి సమస్త నదీ జలాలలోనికి చేరుతుంది.. కాబట్టి ఈ నెలలంతా నదీ స్నానము చేస్తే శరీరము..మనసు రెండూ పవిత్రమవుతాయి.. నదులు దగ్గరలేక పోతే చెరువులో..వాగులో..ఏవీ దగ్గర లేకపోతే కనీసము ఇంటిలోనైనా సూర్యోదయానికి ముందే ""గంగేచ యమునే చైన గోదావరి సరస్వతి ! నర్మదే సింధు..కావేరీ జలెస్మిన్ సన్నిధిన్ కురు ""అనే శ్లోకాన్ని పఠిస్తూ తలస్నానము చేసి నిర్మల హృదయము తో భగవదారాధన చేయాలి. కార్తీకమాసము ముప్పై రోజులు పర్వదినాలుగా భావించి నదీ స్నానాలు..వుపవాసాలు..సాయంత్రము కాగానే ఇంటి ముందు దీపాలు వెలిగించటము.. స్త్రీలు దీపాలను నదిలో వదలటము..వనభోజనము చేయటము..వివిధ దానాలను..ముఖ్యముగా దీప దానము..సాలంకృత కన్యాదానము చేయటము మొదలైనవి నిర్వహిస్తారు.. ఈ మాసము లో ఉపనయన దానము..కన్యాదానము చాలా పలితమిస్తుంది.. భక్తి తో సాలంకృత కన్యా దానమిచ్చినట్లు ఐతే అన్ని పాపాలు తొలిగిపోయి పితృదేవతల యొక్క స్తానాన్ని..బ్రహ్మ పదాన్ని పొందుతారంటారు.. దశమి..ఏకాదశి..ద్వాదశి తిధులలో శ్రీమహావిష్ణువును తులసిదళాలతోనూ..కమలపూల తోనూ పూజిస్తే జీవించినన్నాళ్ళూ ధనానికి లోటులేకుండా వుండి..సమస్త సౌఖ్యాలు కలగటముతో పాటు అంత్యమున జన్మరాహిత్యము కలుగుతుందట.. అదేవిధముగ ఆరుద్ర నక్షత్రము రోజున..మాస శివరాత్రినాడు..సోమవారమునాడు..కార్తీక పున్నమి నాడు రుద్రాభిషేకం చేసి..బిల్వదళాలతోనూ..రుద్రాక్షల తోనూ పూజించినవారికి అనంతమైన సౌఖ్యాలతోబాటు అంత్యమున శివసాయుజ్యము పొందుతారని కార్తీకపురాణం చెబుతోంది.. కార్తీకమాసము - పర్వదినములు
కార్తీకమాసమంతా స్నానాలు..ఉపవాసాలు..దీపదానాలు..పూజలూ..వ్రతాలూనూ..ఏపూజకాపుజే విశిష్టమైనది.. కాని నాకు అన్నిటిలోకి కార్తీక పౌర్ణమి అందరికీ చాలా ఇష్టము..సోమవారనాడు..కార్తీకపుర్ణిమ నాడు ఉపవాసాము చేయటము అందరికీ అలవాటు.. ఆ రోజు ఉదయమంతా ఉపవాసముండి..సాయంకాలము భోజనము చేసేవాళ్ళు..ఉన్నారు.. అలాగే కార్తీకపౌర్ణమి దుర్గా మాత గుడి కి వెళ్ళి..స్త్రీలు దీపాలు వెలిగించి..దేవిణ్ణి ప్రార్తించుట మన సంప్రదాయం.. ప్రతి రోజు దేవునికి దీపము వెలిగించలేని వారు.. ఈ రోజు 365 వత్తులను ఆవునేయితో ఏఏదైనా దేవాలయములో..వీలుకాకపోతె ఇంటిలో దేవుని వద్ద వెలిగిస్తే రోజూ వెలిగించిన ఫలము వస్తుంది అంటారు.. ఈ మాసములోని పర్వదినాలలో శుక్లపక్ష ద్వాదశి రోజున చేసే క్షీరాభ్ధిద్వాదశి పూజ ప్రధానమైనది..ఈ రోజున కృతయుగములో దేవతలు..రాక్షసులు కలిసి క్షీరసాగరాన్ని మధించిన రోజు కనుక క్షీరాభ్ధిద్వాదశి అని పేరు..క్షీరసాగరము లోనుండి వచ్చిన మహాలక్ష్మిని ఈ రోజు శ్రీమహావిష్ణువు వివాహమాడాడు.. అందుకని ఈ రోజు శ్రీమహావిష్ణువు..శ్రీ మహాలక్ష్మిల కల్యాణము చేస్తారు..ఎప్పుడూ క్షీరసాగరములో శయనించే విష్ణువు ఈ రోజున మహాలక్ష్మి తో పాటు బృందావనానికి వస్తాడని అంటారు..అందుకే ఈ రోజు తులసి మొక్క వద్ద..ఈ కార్తీకమాసములో సమస్త దేవతలూ..మునులుకూడా ఆశ్రయించుకొని వుండే ఉసిరిక కొమ్మని పెట్టి పూజిస్తారు... కార్తీకమాసములో శనిత్రయోదశి సోమవారముకంటే చాలా ఎక్కువ ఫలితమిస్తుంది..ఆ శనిత్రయోదశి కంటే కార్తీక పౌర్ణమి వందరెట్లు ఫలితమిస్తుంది . పౌర్ణమి కంటే కార్తీక పాడ్యమి నూరురెట్లు అధిక పలమిస్తుంది..ఆ కార్తీక పాడ్యమి కంటే బహుళ ఏకాదశి కోటిరెట్లు ఎక్కువ పలితానిస్తుంది.. ఏకాదశి కంటే కార్తీక ద్వాదశి విస్తారమైన పలితానిస్తుంది అని పెద్దలంటారు... కార్తీకపురాణములో ఇలా చెప్పారు... కార్తీక శు. పాడ్యమి::తెల్లవారు జామునే లేచి..స్నానము చేసి..దేవాలయానికి వెళ్ళి..కార్తీకవ్రతం సంకల్పము చెప్పుకొని..ఆకాశదీపాని దర్షించుకోవాలి విదియ::ఈ రోజు సోదరి ఇంటికి వెళ్ళి భోజనము చేసి..కానుకలిచ్చి రావాలి తదియ::అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకోవటము వల్ల సౌభాగ్యసిద్ది చవితి::ఈ రోజు నాగులచవితి సంధర్భముగా పుట్టలో పాలు పోయాలి పంచమి::దీనికి జ్ఞాన పంచమి అని పేరు..ఈ రోజు సుబ్రమణ్యప్రీత్యర్ధము అర్చనలు చేయించుకున్న వారికి జ్ఞాన వృద్ది కలుగుతునది షస్టి::నేడు బ్రహ్మచారికి ఎర్రగళ్ళ కండువా దానము చేస్తే సంతానప్రాప్తి కలుగుతుందని ప్రతీతి సప్తమి::ఈ రోజు ఎర్రని వస్త్రములో గోధుమలు పోసి దానమివ్వటము వలన ఆయుషు వృద్ది అవుతుంది అష్టమి::ఈ గోపాష్టమి నాడు చేసే గోపూజ విశేష ఫలితాలనిస్తుంది నవమి::నేటినుంచి మూడు రోజుల పాటు విష్ణుత్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి దశమి::ఈ రోజు రాత్రి విష్ణు పూజ చేయాలి ఏకాదశి::ఈ ఏకాదశికే బోధనైకాదశి అని పేరు..ఈ రోజు విష్ణుపూజ చేసిన వారికి ఉత్తమగతులు కలుగుతాయి ద్వాదశి::ఈ క్షీరాబ్ధి ద్వాదశి రోజు సాయంకాలము ఉసిరిమొక్క..తులసి మొక్కలను పూజించి..దీపాలను వెలిగించటము సర్వపాపాలనూ నశింప చేస్తుంది త్రయోదశి::ఈ రోజు సాలగ్రామ దానము చేయటము వలన సర్వకష్టాలు దూరమవుతాయి చతుర్దశి::పాషాణ చతుర్దశి వ్రతము చేసుకునేందుకు నేడు మంచిది కార్తీక పూర్ణిమ::మహా పవిత్రమైన ఈ రోజు నదీస్నానము చేసి..శివాలయము వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవటము వల్ల సర్వపాపాలు ప్రక్షాళనమవుతాయి.. ఇంకా ఈ మాసములో చేసే ఈశ్వరార్చనా..అభిషేకం అపమృత్యు దోషాలను..గ్రహ బాధలను తొలిగిస్తాయి.. సర్వేజనాః సుఖినోభవస్తు..
అట్లతద్ది ఎలా జరుపుకోవాలి? .................................. ఈరోజు అట్లతద్ది. ఇది ఆధ్యాత్మికతనే కాదు వినోదాన్నీ అందించే పండుగ. ఆశ్వయుజ పౌర్ణమి వెళ్ళిన మూడవ రోజు అట్లతద్ది. సాధారణంగా సెప్టెంబరు ఆఖరులో లేదా అక్టోబరు మొదటి వారంలో వస్తుందీ పండుగ. ఆంధ్రదేశంలో పెళ్ళయిన స్త్రీలు అట్లతద్ది జరుపుకోవడం ఆనవాయితీ. ఈ పండుగ ఉద్దేశం ఏమిటో, ఎలా జరుపుకుంటారో ఒకసారి గుర్తుచేసుకుందాం.
అట్లతద్ది జరుపుకునే ఆడవాళ్ళు తెల్లవారుజామున స్నానం చేసి, అన్నం తిని ఇక రోజంతా అభోజనంగా ఉంటారు. సాయంత్రం గౌరీదేవికి పూజ చేసుకుని, చంద్రుని దర్శించుకుంటారు. ఆ తర్వాత అట్లు తిని, ఉపవాసం విరమిస్తారు. అప్పుడు 11 రకాల కూరలతో పసందైన భోజనం చేస్తారు.
గుమ్మాలకు తోరణాలు కడతారు. తెల్లవారుజామున నిద్ర లేచి, స్నానపానాదులు ముగించి పాలు పోసి వండిన పొట్లకాయ కూర, ముద్దపప్పు, గోంగూర పచ్చడి, పెరుగులతో అన్నం తింటారు. ఆ తర్వాత సాయంత్రం వరకూ ఏమీ తినరు. ఆఖరికి మంచినీళ్ళు కూడా తాగరు.
అట్లతద్దినాడు పిల్లలు, స్త్రీలు ఉయ్యాల ఊగుతారు. పరవశంగా ఊయల ఊగుతూ
అట్లతద్ది నోము నోచుకునే ఆడవాళ్ళు 11 మంది ముత్తయిదువలను ఆహ్వానిస్తారు.
అట్లతద్ది నోము నోచుకునే స్త్రీలతోబాటు వాయనం అందుకునే స్త్రీలు కూడా పగలు ఉపవాసం ఉంటారు.
పూజలో చేతులకు చేమంతి, తులసిదళం, తమలపాకు మొదలైన పుష్పాలు, పత్రాలతో 11 ముడులు వేసి కట్టిన తోరాలు కట్టుకుంటారు.
పూజలో కలశం పెడతారు. పసుపుతో గౌరీదేవిని, గణపతిని చేసి ఉంచుతారు.
ఒక పళ్ళెంలో బియ్యం పోసి, మధ్యమధ్యలో డిప్పలు మాదిరిగా చేసిన కుడుములు ఉంచి, అందులో పసుపు కుంకుమలు వేస్తారు. మధ్యలో పుష్పాలతో అలంకరిస్తారు. దాన్ని కైలాసంగా భావిస్తారు.
పూజలో లలితా సహస్రనామం, గౌరీ అష్టోత్తరం పూర్తయిన తర్వాత అట్లతద్ది కథ చదువుతారు.
ఒక్కొక్కరికీ 11 అట్లు చొప్పున పెట్టి, పైన గౌరీదేవివద్ద పెట్టిన కుడుముల్లోంచి ఒక్కొక్కరికి ఒక్కొకటి పెట్టి, తాంబూలంతో వాయనం ఇస్తారు.
అట్లతద్ది నోములో వాయనం అందుకున్న స్త్రీలు, ఆ అట్లను వాళ్ళు లేదా వారి కుటుంబీకులు మాత్రమే తినాలి. వాయనంలో జాకెటు బట్ట ఇస్తారు. శక్తి ఉన్నవారు చీరలు పెడతారు.
వాయనం ఇచ్చి పుచ్చుకునేటప్పుడు స్త్రీలు తమ కొంగును ముందుకు తెచ్చి, అందులో వాయనం ఉంచి ఇస్తారు. అందుకునే స్త్రీలు కూడా అంతే.
వాయనం ఇచ్చేటప్పుడు ఇలా సంభాషిస్తారు.
''ఇస్తినమ్మ వాయనం''
''పుచ్చుకుంటినమ్మ వాయనం''
''అందించానమ్మా వాయనం''
''అందుకున్నానమ్మా వాయనం''
''ముమ్మాటికీ ఇస్తినమ్మ వాయనం''
''ముమ్మాటికీ అందుకుంటినమ్మ వాయనం''
ఆంధ్ర దేశ విశిష్ట సాంప్రదాయాల్లో ''అట్లతద్ది'' జరుపుకోవడం ఒకటి. మనం జరుపుకునే అట్లతద్ది పండుగ ఉత్తర భారత దేశ స్త్రీలు చేసుకునే ''కార్వా చౌత్'' వేడుకతో సమానం. చిత్రమేమిటంటే రోమ్ లో కూడా ఇలాంటి ఆచారం ఉంది. జనవరి 21వ తేదీన వచ్చే ''సెయింట్ ఆగ్నెస్ ఈవ్'' మన అట్లతద్ది పండుగలాగే ఉంటుంది.
ఆడవాళ్ళు తమ భర్తలు ఆయురారోగ్యాలతో పదికాలాలపాటు సుఖంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అట్లతద్ది జరుపుకుంటారు. పశ్చిమ దేశాల ప్రభావంతో ''అట్లతద్ది'' లాంటి సంప్రదాయ పండుగలు జరుపుకునే ఆచారం సన్నగిల్లుతున్నప్పటికీ ఇంకా ఈ సంప్రదాయం మరుగున పడలేదు. ఇప్పటికీ చాలామంది పెళ్ళయిన స్త్రీలు ''అట్లతద్ది'' జరుపుకుంటున్నారు.
శరన్నవరాత్రులు - నైవేద్యాలు పరాశక్తిని నవరాత్రులు ఆరాధి౦చడ౦ అత్య౦త శుభప్రద౦. ఈనవరాత్రులూ జగద౦బను ఆరాధి౦చే వారికి సర్వమ౦గళములూ స౦ప్రాప్తిస్తాయి. వారి వారి విధానాలను అనుసరి౦చి జగద౦బను ఆరాధి౦చాలి. ఈ రోజులలో అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు కూడా పెట్టడ౦ జరుగుతో౦ది. మొదటి రోజు - పాడ్యమి - కట్టుపొంగలి రెండవ రోజు - విదియ పులిహోర మూడవ రోజు - తదియ - కొబ్బరి అన్నం నాలుగవ రోజు - చవితి - గారెలు ఐదవ రోజు - పంచమి - పెరుగు అన్నం ఆరవ రోజు - షష్టి - కేసరి బాత్ ఏడవ రోజు - సప్తమి - శాకాన్నము ఎనిమదవ రోజు - అష్టమి - చక్కెర పొంగలి తొమ్మిదవ రోజు - నవమి - పాయసం అ౦తేకాక దేవీభాగవత పఠన౦ మిక్కిలి ఫలదాయక౦. కుదరని వారు దేవీభాగవత౦లోని దేవీగీతలు అయినా చదివి అమ్మవారి కృపకు పాత్రులు అవుదాము.