
నిత్య స్మరణ ఫల శ్లోకాలు
దీన్ని త్రికరణ శుద్ధిగా పఠించిన వారికి దేవి అనుగ్రహం కలుగుతుంది. అన్ని భయాలనూ పోగొడుతుంది. ఆలుమగల మధ్య మనస్పర్ధలున్న వారు కూడా దీనిని చదివితే చాలామంచిది. తప్పకుండా ఫలితముంటుంది.
పెళ్ళయి చాలా రోజుల వరకూ సంతానం కలగనివారు ఈ కింది సంతాన గోపాల మంత్రిని పఠిస్తే ఫలితం ఉంటుంది.
''దేవకీ సుత గోవింద వాసుదేవ జగత్పతే
దేహిమే తనయం కృష్ణ త్వమహం శరణం గతః''.
************************************************************************************

అలాగే ఈ క్రింది శ్లోకం వల్ల కూడా సంతాన ఫ్రాప్తి ఉంటుంది.
''మూషిక వాహన మోదక హస్త
చామర కర్ణ విలంచిత సూత్ర
వామన రూప మహేశ్వర పుత్ర
విఘ్న వినాయకపాదా నమస్తే''.
************************************************************************************

రాత్రి పూట సరిగా నిద్ర పట్టనివారు, పీడకలలతో బాధపడేవారు పడుకునే ముందు ఈ కింది శ్లోకాన్ని జపించండి.
''అచ్యుతం కేశవం విష్ణుం హరిం సోమం జనార్ధనం
హంసం నారాయణం కృష్ణం జపేత్ దుస్వప్న శాంతయే''
అచ్యుతా, కేశవం, విష్ణు, హరి, సోమా, జనార్ధన, హంస, కృష్ణా అని ఎన్నో పేర్లు గల ఓ నారాయణా నన్ను కటాక్షించు, పీడ కలల నుండి నన్ను కాపాడు.
************************************************************************************

ఎంత ప్రయత్నించినా ఇంట్లో రకరకాల ఇబ్బందులతోనూ, సమస్యలతోనూ బాధపడేవారు త్రికరణ శుద్ధిగా ఈ క్రింది శ్లోకాన్ని ఎన్నిసార్లు వీలైతే అన్ని సార్లు జపించండి.
''ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం''
దీనివల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.
************************************************************************************

ఆస్తినీ, సంపదనూ పోగొట్టుకున్న వారు కార్త వీర్యార్జుడిని స్మరిస్తే పోగొట్టుకున్నది తిరిగి లభిస్తుంది.
కార్త వీర్యార్జునో నామరాజా బాహు సహస్రవాన్
తస్య స్మరణ మాత్రణ హృతం నష్టంచ లభ్యతే
సుదర్శన చక్ర అంశం అయిన కార్త వీర్యార్జునుడి ఈ శ్లోకం చాలా శక్తివంతమైంది. దీనిని చదవటం వల్ల ఋణ బాధలు కూడా తొలగుతాయి.
No comments:
Post a Comment