భూమాత విష్ణువును ప్రార్ధిస్తున్నది
శ్లోకం ::--
శరణ ముపగతాహం త్వం శరణ్యం జనానాం
నిఖిల భయ వియోగం యోగి చింత్యాం మనంతం
సుర రిపుగణ భారం దుస్సహం దుర్భరమ్మే
పరిహర పరమాత్మన్ భక్తి సిద్ధైక మూర్తే||
తాత్పర్యం::----
ఓ... దేవాదిదేవ శ్రీమన్నారాయణ, మీరు ఏకైక రక్షకుడై ఉన్నారు.
మీరు మా భయాలును దూరంగా వెదజల్లు.
యోగులు ఎల్లప్పుడూ మీమీద ధ్యానం చేస్తునేవున్నారు.
అనేక రాక్షసులు భూమిపై భరించలేని విధంగా దుష్టకర్మలు చేస్తున్నారు.
ఇలాంటి పనులు మేము భరించలేకపోతున్నాము...
నాకు వారి భారం నుండి ఉపశమనం కలిగించి నాకు మరియు ప్రపంచంను కాపాడండి.ఇదియే నా విన్నపం
శరణం భవ కరుణమయి కురు దీన దయాళో
కరుణా రస వరుణలయ ఖరిరాజ క్రుపాళొ ||
అధునా ఖలు విధిన మయి సుధియ సురభరితం
మధుసూదన మధుసూదన హర మామక దురితం ||
వరనూపుర ధర సుందర కరశోభిత వలయ
సురభూసుర భయవారక ధరణీ ధర క్రుపయా
త్వరయా హర భర మీశ్వర సురవర్య మదీయం
మధుసూదన మధుసూదన హర మామక దురితం ||
ఘ్రుణి మందల మణి కుందల ఫణి మందల శయన
అణి మాది సుగుణ భూషణ మణి మంటప సదన
వినతా సుత ఘన వాహన ముని మానస భవన
మధుసూదన మధుసూదన హర మామక దురితం ||
అరి భీకర హలి సొదర పరిపూర్ణ సుఖాబ్ధే
నరకంతక నరపాలక పరిపాలిత జలధే
హరిసేవక శివ నారా యణ తీర్థ పరాత్మన్
మధుసూదన మధుసూదన హర మామక దురితం ||
No comments:
Post a Comment